ఛి. కృత్తి వెంటి శ్రీని వాస రావు కు అభి నందనలు

 ఛి. కృత్తి వెంటి శ్రీని వాస రావు కు అభి నందనలు 
 
 
                 సాహితీ బంధువులకు –కేంద్ర సాహిత్య అకాడెమి కి కార్య దర్శి అయిన, కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం పేద ప్రోలు నివాసి  ఛి . కృత్తి వెంటి శ్రీని వా స రావు సుమారు యాభై ఏళ్ళ క్రిందట నేను మోపి దేవి హైస్కూల్ లో సైన్సు మాస్టర్ గా పని చేసినప్పుడు చిన్న పిల్లాడు .మేము పేద ప్రోలు లో కాపురం ఉండే వాళ్ళం .మా ఇంటికిప్రక్కనే వాళ్ళ ఇల్లు .అతని తలిదండ్రులు సోదరులు అందరు బాగా పరిచయం .తండ్రి గారిని చిట్టి కరణం గారు అనే వారు .లేమి లో కూడా ఎంతో గౌరవం గా జీవించిన కుటుంబం శ్రీను సోదరుడు మాధవ రావు ను మాధవ్ అనే వాళ్ళం .అతను మా ఇంటి దగ్గరే దాదాపు రోజంతా ఉండే వాడు .మోపిదేవి స్కూల్లో చదువు ,నా దగ్గర ప్రైవేటు .అతని తో బాటు అడివి శ్రీ రామ మూర్తి కూడా పేద ప్రోలు వాడే .శ్రీ రామ మూర్తి మండలం లో మేష్టర్ గా   పని చేసి హెడ్ మాస్టర్ అయి రిటైర్ అయి కేప్తాను పాలెం లో ఉంటున్నాడు .అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు .వీరిద్దరూ నాకు మొదటి శిష్యులు .ఇంట్లో మనుషులు గా మెలిగే వారు .అప్పుడు శ్రీను కూడా మా ఇంటికి తరచు వచ్చే వాడు . చాలా చిన్న పిల్లాడు .మాధవ్ బొంబాయి చేరి స్తిర పడి కుటుంబాన్ని ఆదుకొని అందర్ని పైకి తెచ్చాడు .మాధవ్ ,శ్రీ రామ మూర్తి ఇద్దరు నాకు నమ్మిన బంట్లు గా ఉండే వారు .మా శ్రీ మతిని అక్కయ్య గారు అని పిలిచే వారు .పదేళ్ళ క్రితం శ్రీ రామ మూర్తి మాధవ్ ను వెంట బెట్టుకొని ఉయ్యూరు వచ్చి కొన్ని గంటలు గడిపి వెళ్లారు .ఆ తర్వాతా కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన మొదటి ప్రపంచ తెలుగు సభలకు మాధవ్ తన తమ్ముడు శ్రీని వాస రావు ను ,శ్రీరామ మూర్తి ని తీసుకొని వచ్చి నాకు శ్రీని వాస రావు ను పరిచయం చేసి అతను కేంద్ర సాహిత్య అకాడెమి లో పని చేస్తున్నట్లు చెప్పాడు .ఏంతో సంతోషించాను .ఇవాళ అతను సెక్రెటరి గా పదోన్నతి పొందటం మహదానందం గా ఉంది .కృష్ణా జిల్లాకు ఆ ఘనతను ,గౌరవాన్ని సాధించి పెట్టిన శ్రీని వాస రావు కు హృదయ పూర్వక అభినందనలు .,ఇంత బాగా పరిచయం ఉన్న వ్యక్తీ ఆ పదవి లో ఉండటం మా అందరికి గర్వ కారణం .కృష్ణా జిల్లాకు ముఖ్యం గా దివి సీమకు మరీ గర్వ కారణం .నిజం గా అతను” దివి ఆణి ముత్యమే”. దీనికి మాధవ్ ను ప్రత్యేకం గా అభి నందిస్తున్నాను .అన్నట్లు మా పెళ్లి ని మాధవ్ ,శ్రీరామ మూర్తులే దగ్గరుండి జరిపించారు .                                 దీపావళి సమయం లో ఇంత తీపి కబురు అందుకున్నందుకు ఆనందం గా ఉంది .దీపావళి శుభా కాంక్షల తో —
               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-11-12-ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.