జన వేమన -4 శైవ మతం

 జన వేమన -4
                                                                                   శైవ మతం 
హిందూ మతం లో ఉన్న లోపాల  పై స్పందించాడు వేమన .మరి ఆయన కు యే మతం ఇష్టం ?దేని పై అధిక ప్రేమ చూపాడు? క్రైస్తవ ,మహమ్మదీయ మతాల పై ఆయన అభి ప్రాయమేమిటి ?ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలే .వేమన పద్యా లను కొంచెం లోతు గా చదివి పరిశీలిస్తే ,ఆయనకు శివుడన్నా ,శైవ మతమన్నా మక్కువ ఎక్కువ అని పిస్తుంది .జన్మతహా అయన శైవుడే .అయితే దేన్నీ ఆయన మూధం గా ఆరాధించడు .అదీ వేమన్న ప్రత్యేకత .ముందుగా శైవం పై ఆయన భావాలేమిటో చూద్దాం .
”ప్రణవ మంత్ర మహిమ భావింప లింగంబు -మూడు మూర్తు లందు మొనసి యుండు -నతని నెరిగి ,కొలువ నన్యుల కశక్యము ”అని త్రిగునాత్మకుడు ,త్రిమూర్త్యాత్మకుడు ,త్రిగుణాతీతుడు గా పరమ శివుడిని భావించాడు .కంటి మంట లో కాముడిని దహించి ,కామ వంచాలో గౌరిని అర్దాన్గిని చేసుకొన్న శివుడిని చూస్తె అంటుకొన్న పూర్వ కర్మ ఫలం పోతుందని ధీమాగా చెప్పాడు .శివుడు ,గౌరీ తన శైవ గణం ,బంధువులు అనుకొన్నాడు .పంచాక్షరీ పూజలో అఖిలజ్నుడై వంచన లేకుండా తిరిగే వాడే శంభుడు అని తేల్చి చెప్పాడు .”శ్రీ మదుమాపతి యగునా –స్వామికి దాసున్దానంగా జగములు పోగడన్ -వేమన యని యేడు ధీరుడు ”అని తాను పరమ మాహేశ్వర భక్తుని గా చెప్పు కొన్నాడు .”హరి హరులకు ,రూప మవని లో శివ రూపే ”అని ఘంటా పధం గా చెప్పాడు .శివుని అనుభవాన్ని సృష్టి లో చూడక పోతే సంశయం తీరదు .దివ్వె లేకుండా చీకటి పోతుందా ?అని ప్రశ్నిస్తాడు .”శివ యను రెండక్షరములు -భువి లో నెవ డైన గాని ,పొలుపు దలిర్పన్ –శివ శివ యని శత వారము –ప్రవి మల మతి వల్లే వేయ ,బరుడౌ వేమా ?”అనే పద్యం లో శివ నామ మహాత్యాన్ని వర్ణించాడు .శివయోగి ,జ్ఞాన దీపం భువనా లన్నిటినీ వెలగజేస్తుందని నిస్సందేహం గా చెప్పాడు .శివుని పై ,శైవం పైనా ఇంత అభి మానం ఉన్నా ,అందులోని భావాన్ని గ్రహించ కుండా ,బాహ్యాడంబరం గా ప్రవర్తించే వారిని చూస్తె వేమన కు కోపమే .
”భూతి దేహమందు బూసిన నయ్యేనా –నిష్ఠ శివుని యందు నిల్వ వలయు -”అంటూ గాడిద బూడిద లో పోర్లాడితే దానికి పరమ పదం వస్తుందా అని ప్రశ్నించాడు .”భక్తీ లేని పూజ పత్రీ చేటు ”అన్నాడు .మెడ లో లింగాలు కట్టుకొని ,ఘంట వాయిస్తూ ,తిరిగే వారి కంటే ,దొంగలు నయం ”అని చెప్పాడు .ఆత్మా లింగాన్ని వదిలి ,ఎక్కడో వెదకటం మూధం అన్నాడు .జులపాల జడలు ,పులితోలు ,విభూతి ,రుద్రాక్ష మాలల తో వీర శైవులుగా తిరిగే వారంతా మోత గాళ్ళేకాని మోక్ష గాళ్ళు కాదు పొమ్మన్నాడు .లింగ ధారుల్లో గంజాయి తాగే వాళ్ళే ఎక్కువ దానికి వాళ్ళు పెట్టు కొన్న ముద్దు పేరు ”జ్ఞాన పత్రీ ”ఆది పీలుస్తూ ,ఇహ లోక స్పృహ కోల్పోయి ,ఊహా లోకం లో విహరిస్తూఉంటారు .ఏదో మాట్లాడతారు .పూనకం వచ్చి నట్లు ప్రవర్తిస్తారు .వీరు సాధించేదేమీ లేదంటాడు .దయ్యాలను వదిలిస్తామని ఇలాంటి వాళ్ళు జనాన్ని మోసం చేస్తారు .అట్లాంటి వారిని ”నిన్నే గాంచి భీతి నిలువక పారదా ? వీళ్ళను చూస్తె భయం పారి పోదా అని అని హేళన చేశాడు .యజ్న యాగాదులను నిరసించిన వీర శైవులు ”ఎద్దు నెక్కి ,దాన్ని తన్నుతూ ,కొడుతూ ప్రయాణం చేస్తూ ,మాంస భక్షణ చేస్తూ జీవ హింస చేయటం లేదా ?అని నిర్మోహ మాటం గా కడిగే శాడు . ..వీరిలో మింద జంగాలు ,బావిసేలు ,ఎక్కువై వ్యవస్థ భ్రష్ట మైందని బాధ పడ్డాడు .ఆచారం ,అనాచారం అయింది .బసివే కి ఎంత మంది జంగా లతో వ్యభి చరిస్తే ,అంత గొప్ప .ఆమెకు పుట్టిన వాడు జంగమ దేవ ర లలో గొప్ప వాడు .ఇలా భ్రష్టు పట్టి పోయిన శైవం ముస్లిముల చేతి లో ఒడి పోయిందని ”భ్రష్టస్య కావా గతిహ్ ”అన్న దాన్ని జ్ఞాపకం చేశాడు .
                                            వైష్ణవం 
కన్నడ దేశం లో బసవేశ్వర మతం ఆంద్ర దేశం లో వీర శైవం గా మారి విజ్రుమ్భించింది .పాల్కురికి సోమ నాధుడు వంటి కవులు ఆ మత వ్యాప్తికి కవిత్వావ లంబన తో బాసట గా నిలిచారు .ఇక వైష్ణవ మతం తమిళ దేశం నుండి ,ఉత్తర దేశం నుండి వచ్చి పాదుకోంది . .చైతన్య ప్రభువు ప్రభావం ఆంద్ర రాష్ట్రం మీద బాగానే పడింది .అన్నమయ్య పదాలు ,పోతన భాగవతం ,రామ దాసు కీర్తనలు ,క్షేత్రయ్య పదాలు ,తో ఆంద్ర దేశం వైష్ణవ భక్తికి ఆల వాల మైంది .తిరుపతి భద్రాచల క్షేత్రాలు ముక్తి దామా లైనాయి .భక్తీ ప్రపత్తు లకు నేలవైనాయి .గోదా దేవి పాశురాలు ,ధనుర్మాస ఉత్స వలతో సీతా రామ కల్యాణాలతో ,తిరుమల బ్రహ్మోత్స వాలతో వైష్ణవ భక్తీ ఏరులై ప్రవ హించింది .శివుడు అభి శేక ప్రియుడు అయితే ,విష్ణువు అలంకార ప్రియుడు .దైవం ఎలా ఉంటె ,భక్తులూ అదే వేష ధారణ చేయటం మామూలు అయింది .శైవం లో ఎలా వీర శైవం వచ్చి వీరంగం వేసిందో ,అలానే వైష్ణవం లోను వీర వైష్ణవం చేల రేగింది .నిలువు బోట్లు ,పంగనామాలు ,తులసి పేర్లు ,కస్తూరి పరిమళాలు ,చక్ర పొంగళ్ళు ,లడ్లు ,ధద్యోజనాలు ,తో భక్తులంతా విలాస పురుషు లైనారు .వేశ్యా సంపర్కం ఫాషన్అయిపోయింది . .హోదా కింద జమైంది .పూజలు ,సంకీర్తనలు భజనలు ,తిరునాళ్ళు పెరిగి పోయాయి .భక్తీ వరద లా పారింది .అడ్డు కట్ట వేసే వారే లేక పోయారు .విశృంఖలత పెరిగి నిస్సిగ్గు గా ప్రవర్తించటం సర్వ సాధారణం అయింది . ఇవన్నీ చూసి వేమన్న లాంటి వాడు చూస్తూ ఊరుకుంటాడా ?ఈయనకు స్వ ,పర భేదాలు లేవు .అందుకే ఎండ కట్టాడు
”ద్వాదశ పుండ్రాలు ,ద్రవిడ గ్రంధాలు ,అక్షయ పాత్రలతో ,వీధి లో భిక్షం ఎత్తు  తున్నారని అధిక్షేపించాడు .ప్రజల్ని పీడించి ,డబ్బు లావుగా సంపాదించి ,దీనుల్లా ,దరిద్రుల్లా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశాడు .”పట్టు బట్ట గట్టి ,,పట్టి నామము బెట్టి –వట్టి భ్రాంతి జెంది ,వైష్ణవుడయి -లొట్టి ద్రావ నతడు ,లోకుల జేరచురా ”అని గోల పెట్టాడు .మధువు ,మాంసం రుచి మరిగి ,”వావి వరస ద్రవ్వి వర్తించి ,చేడుడురు ”అని వారి రంగుని బయట పడేశాడు .”పల్లాండు ,పల్లాండు ”అని ద్రావిడ పాశురాలను పాడుతూ ,అర్ధం కాని భాష లో అరవ పాటలను పాడే వాళ్ళ ను చూస్తె ,వాళ్ళ మూదా చారాలను చూస్తె ,ఆంద్ర దేశానికేదో చెడు మూడిం దని వ్యధ చెందాడు .శంఖ చక్రాన్కితాలతో ,ఒళ్లంతా వాతలు పెట్టు కొంటున్నందుకు దుయ్య బట్టాడు .”తనువున దావాగ్ని దరి కొని కాలంగ –కాల్చుకోనగ ఏమి కర్మమునకు ?”అని అలా చేస్తే వాడేమైనా ఘనుడౌతాడా అని నిల దీశాడు .ఇవన్నీ వికృత ,వింత వెర్రి చేష్టలు గా తలచాడు .ఇంతకీ యే మతం అయినా బాహ్య ఆడంబరం కంటే ,అంతస్సౌన్దర్యం ,భావనా ,చింతనా ,ప్రవర్తనా ,పరమ సాధనా ,పర హితం ,కావాలని వేమన ద్రుధం గాభావించాడు .అందుకే ,ఎక్కడ విప రీత భావన ఉంటె ,అక్కడ ఇది పద్ధతి కాదు ,మార్చుకోమని హితవు చెప్పాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ — 21-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ -భారత స్వాతంత్ర దినోత్సవ వారం

           అమెరికా డైరీ -భారత స్వాతంత్ర దినోత్సవ వారం

ఆగస్ట్ పదమూడు  సోమ వారం నుంచి  పందొమ్మిది ఆది వారం వరకు విశేషాలు –
దాదాపు యాభై ఏళ్ళు గా సంగీత కారుడు బీథోవెన్ గురించి వింటూనే ఉన్నాను .కాని ఆయన యే దేశం వాడో ,ఆయన ప్రతిభ ఏమిటో నాకు ఇప్పటి దాకా తెలీదు .మూడు సార్లు అమెరికా వచ్చినా ఆయన మీద నా దృష్టి పడలేదు .ఈ నాలుగో సారి వచ్చిన దగ్గర్నుంచి ఎందుకో తెలుసు కోవాలనే ఆరాటం పెరిగింది .లైబ్రరీ లో కొన్ని పుస్తకాలు తెసుకొచ్చి చదివాను .కాని నాకు కావలసిన్దేమీ కనీ పించలేదు .అయితే ఆయనపూర్తీ పేరు” లుడ్విగ్ వాన్ బీథోవెన్”అనీ ,  జర్మనీ దేశస్తుడు అ ని, చిన్నప్పటి నుండే సంగీతం లో గొప్ప పేరు తెచ్చుకోన్నాడని మాత్రం తెలిసింది .అంతకు మించి ఆయన్ను పూర్తిగా ఆవిష్కరించే రచన దొరక లేదు .కిందటి వారం అలాంటి అరుదైన పుస్తకం దొరికి నా ఆరాటం తీరింది .దాన్ని పూర్తిగా చదివి నాకు కావలసిన నోట్స్ రాసుకోన్నాను .నా దాహం తీరింది .ఆయన ప్రతిభ తెలిసింది .క్రమంగా ఎప్పుడో ఆయన గురించి సమగ్రం గా రాస్తాను .ఆయన సామాన్యుడు కాదు మహా మాన్యుడు .మన వాళ్ళు అందుకనే ఆయన సంగీతాన్ని ,ఆయన సింఫనీ ని పదే  పదే పొగుడుతారు .”సిరి వెన్నెల ”సినిమా లో దర్శకుడు విశ్వనాద్  ఆ అవకాశాన్ని చక్క గా ఉపయోగించాడు .బీథోవెన్” మూన్ లైట్” సొనాటా ”లాగా వెన్నెల్లో బృందావనాన్ని చూపించాడుమురళి గానం తో  కళ్ళు లేని అమ్మాయికి .హరి ప్రసాద్ చౌరాసియా  తో పలికించాడు .మనకూ ఆ ఆనందాన్ని కల్గించాడు .మా విజయ వాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ ఆదిత్య ప్రసాద్ గారు బీతోవన్ చూపించిన ఈ అద్భుత దర్శనాన్ని ఎప్పుడు తమ ఉపన్యాసం లో వివ రిస్తూఉంటారు . .ఇన్నాళ్ళకు ,ఇన్నేళ్ళకు ఆ నాద బ్రహ్మ బీథోవెన్ సమగ్ర సంగీత దర్శనాన్ని పొందిన ధన్యుడిని అని పించుకోన్నాను .ఈ  వారమంతా బీథోవెన్ లో మునిగి తేలాను .

 చివరి మంగళ వారం -భోజనం 

శ్రావణ మాసం లో ఇది చివరి మంగళ వారం ”.ప్రక్కి” వారి అమ్మాయి శ్రీ మతి అరుణ చక్కగా నాలుగు వారాలు నోము నోచుకోని మొదటి వారం నాడు మా అమ్మాయిని ,వాళ్ళ అమ్మను భోజనానికి పిల్చింది .ఈ వారం వాళ్ళతో పాటు ”పోతు పేరంటానికి ”నన్నూ పిలిచింది .మా ప్రక్కనున్న రాఘవేంద్ర రావు గారు, భార్య కూడా వచ్చారు .చక్కగా పట్టు బట్ట తో శ్రద్ధ గా పూజ చేసుకొని మా వాళ్లకు వాయనం ఇచ్చి ,తర్వాత భోజనాలు పెట్టింది .పూర్నపు బూరెలు పులిహోర ,టమేటా పప్పు ,బెండకాయ కూర వంకాయ చెట్నీ ,సాంబారు అన్నం ,పెరుగు లతో సంతుష్టికర మైన భోజనం పెట్టి మా పోతు పేరంట గాళ్ళకు కూడా దక్షిణ, తాంబూలాలు ఇచ్చింది . .ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు అయింది .లైబ్రరీ కి వెళ్లి పుస్తకాలు ఇచ్చి కొత్తవి తెచ్చుకోన్నాము .ఆ అమ్మాయి మంచీ మర్యాదా బాగున్నాయి .

జనాన్ని చెవలాయిలను చేసి,ఆడించిన” జులాయి ”

బుధ వారం రాత్రి రెండో ఆటకు జులాయి  సినిమా కు వెళ్ళాం .మేము ఎడుగురం .మా తో పాటు ఇంకో ”తెలుగు బకరా” తో సహా హాలులో ఖచ్చితం గా ఎనిమిది మంది మాత్రమె .సినిమా ఎందుకు తీశారో ,ఎలా నడుస్తుందో తెలీదు .ఎప్పుడేవాడు వచ్చి కాలుస్తాడో ,ఎవడు చస్తాడో ఎవడు తప్పించుకొంటాడో తెలీదు .పాపం అల్లు అర్జున్ కు నిరాశే .ఇలియానా అందాల కంటే నీరసాలు బాగా ఒలక బాసింది .దేవిశ్రీ ప్రసాద్ ”సంఘీతం” ఘోషా ,మోతా తాషా మరబా తప్ప చెవి కింపైన దేమీ విని పించలేదు .త్రివిక్రమ్ దర్శ కత్వం పేరుకు తగ్గ త్రివిక్రమం గా ఉంటుందను కొంటె ,తిక మకాలుగా ఉంది .షార్ట్ డైలాగుల్లో అల్లు బాగానే చెప్పాడు .లాంగ్ డైలాగుల్లో ఏం చెప్తున్నాడో తెలీలేదు- దొర్లించాడు .పాపం రాజేంద్ర ప్రసాద్ అనే , పోలీసు ఆఫీసరు గారికి తుపాకి పేల్చటం రాదట .చెవిలో కాబేజీ లకు మించిన వేవో పెట్టాడు .”వరుడు” తీసి దానయ్య, చేతికి ఎముక లేదని పించుకొని డబ్బు పోగొట్టు కున్నాడు .పాపం ఇప్పుడైనా వెనకేసు కొంటా  డేమో నను కొన్నాను .ఆ ఆశ ఏమీ క నీ పించలేదు  .జనాన్ని చేవలాయలను చేసి ఆడించాడు ”జులాయి ”.

                       చివరి శుక్ర వారం -భజన 

ఇది చివరి శుక్ర వారం .ఇప్పటికి నాలుగు వారాల నుంచి మా అమ్మాయి వాళ్ళింట్లో భజనలు జరిగాయి .ఇది చివరి వారం భజన .అంటే దీనితో అయిదు వారాలు చేయాలి అనుకొన్న కోరిక తీరింది .ఇరవై మంది వచ్చారు .రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు భజన జరిగింది . ఆ తర్వాత విందు .బ్రెడ్ హల్వా ,వడ ,సొరకాయ కూర ,చెట్నీ ,సాంబారు ,అన్నం ,పెరుగు పుచ్చ కాయ ముక్కలు ,ఆపిల్ ముక్కలు తో విందు బాగానే జరిగింది .

అమెరికా లో  భారత స్వాతంత్ర దినోత్సవం

భారత దేశ 66 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడి ‘‘హిందూ సెంటర్ ”వారు గాంధీ భవన లో  ఘనం గా నిర్వ హించారు .మన దేశం లో లాగా ఇక్కడ యే రోజు పండగ అయితే ఆరోజు చేయరు .శనివారం లేక ఆది వారం నాడు జరుపు తారు .ఈ ఆదివారం అంటే నిన్న పందొమ్మిదో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల పాటు నిర్వ హించారు .మేమందరం వెళ్ళాం .ముందుగా భారత జాతీయ పతాకను, అమెరికా జాతీయ పతాకను వేదిక పై చెరొక వైపునా ఆవిష్కరించారు .వేదిక పై ఆరడుగుల గాంధీ మహాత్ముని కాంశ్య విగ్రహాన్ని ఉంచారు స్పూర్తి దాయకం గా . రెండు దేశాల జాతీయ గీతాలను చిన్నారులు భక్తిగా ఆలపించారు .ఆ తర్వాతా హిందూ సెంటర్ అధ్యక్షులుడాక్టర్ సురేంద్ర పాల్ ముఖ్య అతిధి గా విచ్చేసి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు .ముఖ్యం గా భారత దేశపు అభి వృద్ధికి స్వాతంత్ర పోరాటానికి సిక్కుల పాత్రను గుర్తు చేశారు .వారి త్యాగాలను చక్కగా గణాంకాల తో వివ రించారు .అమెరికా కాకు వచ్చిన మొదటి తరం భారత దేశీ యులలో సిక్కులు ఉన్నారని ఇక్కడి వ్యవసాయానికి వారే ఆద్యులని ,ఆ తర్వాత అనేక వ్యాపార వాణిజ్యాలలో వారి పాత్ర గణనీయం గా ఉందని హర్ష ధ్వానాల మధ్య తెలిపారు .ఆ స్పూర్తి ని అందరు పొందాలని, ఇక్కడి హిందూ సెంటర్ కు ఈ బాలాజీ దేవాలయానికి అందరు కృషి చేసి అభి వృద్ధి లోకి తెస్తున్నారని ,ఇంకా చెయ్యాల్సింది చాలా ఉందని అందరి సహకారం తోనే అభ్యుదయం  సాధ్యం అని చాలా ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. భారత దేశానికి మచ్చ లేని మన్మోహన్ సింగ్ ప్రధానిగా రెండు సార్లుగా ఉన్నారని కొని యాడారు .బెంగాలీ అయిన ప్రణబ్ ముఖర్జీ అన్ని తెలిసిన పూర్ణ జ్ఞాని ,అత్యంత అనుభవం,  అన్ని శాఖల్లో పని చేసిన నేర్పు ఉన్న మనీషి అని అలాంటి వారు భారత దేశాధ్యక్షు లవటం హర్ష దాయకం అనీ అభి నందించారు .
”  హేమంత్ అమిన్” సభా సంచాలనం చేశారు .”మేడ్ ఇన్ ఇండియా ”అనే సినిమా పాటకు పిల్లలు చక్కని డాన్సు చేశారు .తర్వాత మరో దేశ భక్తీ గీతం ”నన్హా మున్నా ,రాహి హూన్ ”అనే పాటకు మంచి నృత్యం చేశారు పిల్లలు .రాజస్తానీ గీతానికి నలుగురు పిల్లలు ఆ డ్రెస్ వేసుకొని గొప్ప గా నృత్యం చేశారు .భారత నాట్యం జతి స్వరాన్నిఅందంగా అద్భుతం గా నృత్యం చేసి చూపారు కొంచెం పెద్ద వయసు లోని అమ్మాయిలూ .ఇదే అన్నిటి కంటే హైలైట్ .ఆ తర్వాత”షహీద్ ”సినిమా లోని పాట పాడుతుండగా దేశ భక్తులంతా వరుస గా కదిలి నడవటం దానికి తగ్గట్టు అభి నయించటం అందర్ని ఆకర్షించింది .ఇందులో మా పెద్ద మనవడు చి. శ్రీ కేత్ అందరి కంటే తన నాట్య ప్రావీణ్యాన్ని చూపించి మన్ననలు పొందాడు .ఆ తరువాత ”యే మేరె వతన్ ”అనే లతా మంగేష్కర్ దేశ భక్తీ గీతాన్ని ఒకామె పాడింది .ఇలా రెండు గంటల పాటు జనానికి స్వాతంత్ర స్పూర్తి కలిగించారు .అందరు అభి నంద నీయులే .కార్య క్రమం లో పాల్గొన్న చిన్నారు లందరికి బహుమతులు అంద జేశారు నిర్వాహకులు .సుమారు యాభైకి పైగా చిన్నారులు పాల్గొనటం ,వారికి తలిదండ్రులు డ్రెస్ సమకూర్చటం, వీరందరికీ నేర్పి ప్రదర్శింప జేయటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు .కాని తలచుకొంటే ఏదైనా చెయ్యచ్చు అని నిరూపించారు ”హిందూ సెంటర్ ”వారు .వారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన వారందరికి అభి నందనాలు .సభలో సుమారు రెండు వంద లకు  పైనే ప్రేక్షకులు రావటం దేశ భక్తికి నిదర్శనం .అందరికీ సిక్కు అల్పాహారం ”పావూ భాజీ ‘‘నిప్రక్కనే ఉన్న  ”వివేకా నంద హాల్” లో ఏర్పాటు చేసి కడుపు నింపారు .బంగాళ దుంప కూరను బాగా మెత్త గా పప్పు లాగా ఉడి కించి దానితో పాటు రెండేసి గుండ్రని మెత్తటి రొట్టెల తో ఇచ్చేదాన్నే ”పావూ భాజీ ”అంటారని మొదటి సారిగా ఇక్కడే తెలిసింది .చాలా రుచి కరం గా ఉంది .ఇంటికి వచ్చే సరికి మధ్యాహ్నం మూడు అయింది .–జై హింద్ –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-8-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన -3 వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా

    జన వేమన -3
                                             వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా 
ఇప్పటి వరకు మనం వేమన భావాలను స్థూలం గా పరిశీలించి చూశాం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేసి ,ఆయన భావ దీపికా ప్రకాశాన్ని పొందుదాం .అజ్ఞాన తిమిరం లో ఉన్న మాన వాలికి ఆయన అందించిన జ్ఞాన తేజస్సు ను పరికిద్దాం .ముందుగా ఆయనకు మతం మీద ఉన్న అభి ప్రాయాలను తెలుసు కొందాం .ఇది తెలుసు కోవటానికి ముందు అసలు మతం అంటే ఏమిటో తెలియాలి కదా .”రెలిజియన్ ఈస్ రియలైజేషన్ ”అన్నారు .మతం అంటే మనం ఎవరో తెలుసుకొనే ;;ఎరుక. ”దాన్ని తత్వ శాస్త్ర అన్వయం అన్నారు .ఇంతకీ తత్త్వం అంటే /ఆధ్యాత్మికం గా మానవుని పెరుగుదలే తత్వ శాస్త్రం .ఎలా జీవించాలి ,ఎలా చని పోవాలో చెబుతుంది .ప్రకృతి ,మానవుల మధ్య సంబంధాన్ని తెలియ జేస్తుంది .జరిగి పోయిన దాన్ని గురించి కాక ,జరుగుతున్నదీ ,శాశ్వత మైన దాని గురించి చెబుతుంది .దీన్ని బట్టి చూస్తె మతం చాలా పవిత్ర మైనది గానే కనీ పిస్తుంది .అపూర్వ ,గౌరవ స్తానం కలిగి ఉంది .అలాంటి మతాన్ని ప్రవచించిన ప్రవక్తలు ,తాము సన్మార్గం లో నడిచి ,అనుయాయులకు చక్కని మార్గాన్ని చూపించారు .అయితే కాల క్రమం లో ప్రవక్తలు చూపిన మార్గాన్ని వదిలేసి ,తప్పు దొవలు పట్టి మతాలు కొంత చెడు చేశాయి .ఉత్కృష్ట జీవన విధానం సడలి పోయింది .ప్రలోభాలూ మూధా చారాలు అమలు లోకి వచ్చాయి .మత పెద్ద పెద్దరికం వదిలి హక్కు కోసం ,అణచి వేతకు పాల్పడ్డాడు .అప్పుడే మతం అంటే ఏవగింపు కలిగింది .ఇలాంటి సమయం లో సామాన్యులకు విలువ లేకుండా పోయింది .మాన్యులకే అన్నీ హక్కు భుక్తాలైనాయి .ప్రజల కష్ట సుఖాలను పట్టించుకోకుండా మతం సంఘం తయా రైనాయి .ఎవరు పూనుకొని దీన్ని మళ్ళీ గాడి లో పెట్టాలి ?అందుకే ఆ బాధ్యతను కవులూ ,కళా కారులూ తీసుకొన్నారు .నెమ్మదిగా చెప్పారు .కళాత్మకం గా చెప్పారు .హితం గా ,మితం గా చెప్పి  చూశారు .అయినా మార్పు వచ్చే సూచన కనీ పించ లేదు .మార్పు రాక పోతే సమాజం పతనా వస్థ కు చేరుతుంది .అదిగో అలాంటి సమయం లోనే వేమన లాంటి మహనీయుని అవసరం కలిగింది
.అవినీతి ,చెడు ,దుష్టా చారం మాంసాన్ని దాటి ,ఎముకలకు పట్టేసి  వదలని స్తితిలో ఉన్నాయి .కనుక చెప్పాల్సిన విషయాన్ని చాలా బలం గా ,తీవ్రం గా ,కఠినం గా చెప్పాల్సిన పరిస్తితి కల్గింది .ఆ పనే వేమన చేశాడు .యే కులాన్నీ ,యే మతాన్నీ వదిలి పెట్ట లేదు .అన్నిటిని ఝాడించి వదిలాడు .ఉతికేసి ,పిండేసి ఆరేశాడు .యే చెడ్డ విధానాన్ని వదిలి పెట్ట లేదు .చాలా ఆవేదన తో ,మనసు పై సుత్తి తో కొట్టి నంత బలం గా చెప్పాడు .మార్పు రావాలంటే ,ఆ మాత్రం ఆఘాతాలు తప్పవు అని భావించి చెప్పాడు వేమన్న .ఏదో ఎవరో అనుకుంటా రనే భయం ఆయనకు లేదు .బాధా లేదు .మార్పు రావాలి అంతే ఆయన ధ్యేయం .చీకటి లోంచి సమాజం వెలుగు లోకి రావాలి .అందరి సుఖమే అయన ధ్యేయం .అందుకే ఆయన మాట వేదం అయింది .వేదం లా శాసించింది .ఖచ్చితం గా అమలు చేయాల్సిన పరిస్తితి కలిగింది  .
       హిందూ మతం 
సనాతనం గా హిందూ మతం మన దేశం లో ఉంది .హిందూ మతం లేదు -అదొక జీవన విధానం అంటారు .అయినా కాల గతం గా ఎన్నో మార్పులు వచ్చాయి .విగ్రహారాధన ,యజ్న యాగాలు ,మంత్రాలు ,మాయలు ,మాయ స్వాములు ,తంత్రాలు ఎక్కువై ధార్మిక మార్గం పక్క దారి పట్టింది .ధర్మం కను మరుగైంది .సాటి మనిషికి విలువ నివ్వని సమాజం తయారైంది .గుడులు ,గోపురాలు ,దేవతలు ,పీథాది పతులు ,ప్రాచుర్యం పొందారు .మానవత్వం మృగ్య మైంది .మనిషిని మనిషి గా మార్చాల్సిన మతం కుహనా విధానాలకు నిలయ మైంది .అందుకే వేమన కు ఈ పద్ధతి నచ్చలేదు .గమ్యాన్ని మరచి ప్రవర్తించే వారి పై పద్యాల పిడి గుద్దులు ప్రహారం చేశాడు .”రాళ్ళన్నీ దేవుల్లయితే ,రాసులు మింగవా ?అని నిలేశాడు .”కూడు ,గుడ్డ ను కోరడు దేవుడు ”అని గట్టిగా చెప్పాడు .అంతా ”రాయి మయం ”అయితే ,దేవుడేవడో భక్తుదేవడో తెలుసు కోవటం ఎలా ?శిలకు మొక్కితే మనమూ ఆ శిలలు గా మారి పోతామేమో ఆలోచించ మన్నాడు .దేహమే దేవాలయం అన్న మాట ను వదిలి మంచిని ,సోదర భావాన్ని గాలికి వదిలేసి ,ప్రసాదాలు తీర్ధాలు మరిగి ,బొజ్జలు పెంచుకోవటం హేయం గా భావించాడు .”గుడి దేహ మాత్మ దేవుడు -చెడు రాళ్ళకు వట్టి పూజ సేయకు వేమా ”అని హెచ్చరించాడు .చీకటి గర్భాలయం లో ,దేవుడు అనే రాతిని ప్రతిష్ట చేసి ,మొక్కులు సమర్పిస్తూ ,కాలక్షేపం చేస్తారు కాని ,తమ లోని పర బ్రహ్మాన్ని గుర్తించరు మనుషులు అని ఆవేదన చెందాడు .”ఉల్ల మందు బ్రహ్మ ముందుట తెలియరు ”అన్నాడు అందుకే .ముక్తి కోసం చేసే ప్రార్ధనలు సత్ఫలితాలివ్వవు అంటాడు .
”యుక్తిగా నెరుకై తోచును -ముక్తికి నిలయమ్పు దారి మానుకొని వేమా ”.ఎరుక ఉంటేనే ,పరమ పదం సాధ్యం .మిగిలినవేవీ పనికి రావు .అసలు మర్మం తెలియ కుండా మతాలను సృష్టించారని ఈస డిస్తాడు .ఇలాంటి వారి భావాలన్నీ ”గాజుటింట కుక్క కళవళ పడి నట్లు ”ఉంటాయట .”పూజ కేమి వచ్చే ,బుద్ధి ప్రధానము ”అన్నాడు .పరమాత్మ విశ్వంభరుడై ,విశ్వం లో వెలుగుతూ ఉంటాడు.”అతన్ని చూడండి  అన్నాడు .”క్షేత్రంబున క్షేత్రజ్నుని ,-గాత్రంబును జూచి నియతి గల లక్ష్యంబున్ –రాత్రిం బవలును నొకటిగ -సూత్రించిన ముక్తి సులభము వేమా ”అని ముక్తికి సులభ మార్గాన్ని చెప్పాడు .రాతి ప్రతిమను రాజసం లో ఉంచి పూజించే వాడు బుద్ధి మాలిన వాడు.అలాంటి వాడు ”భావమందు పరము భావించ నేరడు ”అని వాడిఅవి వేకాన్ని జాలి పడతాడు ”శిలలు శిలలే కాని ,శివుడు కాదని -తనదు లోని శివుని దానేల తెలియడో ”అని నిట్టూరుస్తాడు .
హిందూ మతం లో ఉన్న యజ్న యాగాలు దారి తప్పి హింసకు పట్టం కట్టాయి .కాలజ్నులు వాటిని సహించ లేక పోయారు .ప్రత్యామ్నాయాలు చూపించారు .మార్పు వచ్చి పశు హింస తగ్గింది .తన కాలం లో ఇంకా అమలు లో ఉన్న పశు హింస పై’- విమర్శ వజ్రాయుధాన్ని ప్రయోగించాడువేమన యోగీంద్రుడు .”సోమయాజి –మేక పోతును బట్టి మేడలు విరవటం ”ఆయన్ను కలిచి వేసింది .”జీవ హింసకు చిక్కునా మోక్షంబు ”అని తీవ్రం గానే ప్రశ్నించాడు .ఇక్కడ యజ్ఞం చేస్తే స్వర్గం లో రంభాదుల పొందు విందు లభిస్తుందనే ఆశ మాత్రమె యజ్ఞానికి కారణం అన్నాడు .సోమయాజి, కామ యాజి అవటం సహించ లేక పోయాడు .పక్క వాడు ఆకలితో అలమటించి చస్తుంటే పట్టించుకోని జనం తల్లి దండ్రుల శ్రాద్ధా లకు వేలు ఖర్చు చేయటం బాధించింది .”పిండములను జేసి పితరుల దల పోసి –కాకు లకు బెట్టు గాడిద లారా –పియ్య తినెడి కాకి పితరు డేట్లాయేరా “‘అని మందలించాడు .ఇంతకీ పిండాలు కాకులకే ఎందుకు పెడతారు / అనే సందేహం వస్తుంది .ఉత్తర రామాయణం లో దీనికి ఒక కధ ఉంది. మరుత్తుడు అనే రాజు యజ్ఞం చేస్తుంటే ,రావణుడు రాక్షస సైన్యం తో వచ్చి ఇంద్రాది దేవతలను భయ పెట్టి పార దోల్తాడు .అప్పుడు వాళ్ళు అందరు పశు ,పక్షాది రూపాలు పొంది పారి పోతారు .పితృదేవత లకు ప్రభువైన యముడు కాకి రూపం దాల్చి అక్కడే ఉంటాడు .అప్పటి నుంచి పితృదేవతలకు వేసే పిండాలను కాకులకు పెట్టటం అలవాటు లో ఉంది .అప్పటి దాకా పక్షుల్లో చాలా హీనం గా చూడ బడిన కాకి అప్పట్నించి పవిత్రత సాధించింది .”కాకి పెండ్లి నెవరు కానరు భువిని –కాకికి అన్నముంచి కాళ్ళకు మొక్కరు ”అని ఆశ్చర్య పోయాడు వేమన్న .”సంజ్ఞా మది యందు బూనూట సాధు  వ్రుత్తి -మనసు మగ్నము నొందుట మనన వ్రుత్తి ”అంతే కాని ,యజ్న యాగాదుల వల్ల ప్రయోజనం లేదు అన్నాడు.
చేసిన పాపం చెడని పదార్ధం అని తత్వ గీతం .ఎన్నెన్నో పాపాలు చేసి వాటి పరిహారం కోసం తీర్ధ యాత్రలు చేసి పాపాన్ని పోగొట్టు కోవాలను కొంటాము .పిల్లిని చంపిన పాపం వేరు గుడి కట్టిన పుణ్యం వేరు అని తెలుసు కో లేం .హృదయాలను కడుక్కోవాలి శరీరాలను కాదు .శారీరక మాలిన్యం కంటే మానసిక మాలిన్యం చాలా ప్రమాదం .దాన్ని వదిలిన్చుకోక పోతే ఉత్తమ గతులుండవు .పశ్చాత్తాప దగ్ధం తోనో ,పరోప కారం తోనో సహనం తోనో ,సానుభూతి, సహవేదన ,దయా ,దాక్షిణ్యం ,కరుణ లతోమనో  మాలిన్యం పోతుంది .గంగాది నదుల్లో స్నానం వల్ల ఆత్మ సంస్కారం రాదు .సద్గురు కటాక్షం వల్లనె సాధించాలి .”తిరుపతికి బోవ తురక దాసరి కాడు–కాశి కేగ లంజ గరిత గాదు–కుక్క సింహమగునే గోదావరికి బోవ “”అని వితర్కిస్తాడు .కల్మషాలన్నీ ,కడుపు  లో పెట్టు కొని ,నదీ స్నానాలు ,భగవద్దర్శనాలు చేస్తే ప్రయోజనం లేదంటాడు .మానసిక మార్పు రావాలి .ఒక వేళ ఆ పవిత్ర స్తలాల వల్ల మార్పు వస్తే వేమన్న కంటే సంతోషించే వాడు లేడు .కొన్ని స్థలాలు పవిత్రాలు కొన్ని అపవిత్రాలు అని భావించటం తప్పు అనేదే వేమన్న చెప్పిన వేదం లాంటి విషయం .”పుణ్యమనగ నేమి ? చేసిన పుణ్యమే ”అని చక్కని సమాధానం చెబుతాడు .
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –20-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –2 బతుకు లో ఈదిన పద్యాలు

  జన వేమన –2 బతుకు లో ఈదిన పద్యాలు 

వేమన పద్యం లో మకుటాన్ని వది లేస్తే ,మిగిలిన మూడు పాదాల్లోనే చెప్పాల్సిన భావాన్ని మొత్తం చెప్పాడు .ఆయనది ప్రజల భాష .వాడుక లో ఉన్న మాటలనే ఉపయోగించాడు .మాన్దలీకాలకు పెద్ద పీట వేశాడు .సూటిగా ,సంక్షిప్తం గా ,చెప్పాడు .జీవితం లోంచే ఉపమానాలు ఎన్ను కొన్నాడు .మంచి గుణం ఉన్న భార్య ఉంటె ఇల్లే స్వర్గ సీమ అన్నాడు .భౌతిక సుఖం స్వర్గం కంటే ఎక్కువ అన్నాడు .”సుగుణ వంతు రాలు సుదతి యై యుండిన -స్వర్గ మేటి కయ్య సంసారి కింకను అని వ్యంగ్య వైభవాన్ని వవింగ డిం చాడు .ఇంటికి దీపం ఇల్లాలే నంటూ ”దేవి యున్న ఇల్లు ,దేవార్చన గృహంబు ”అని కీర్తించాడు .స్త్రీ కి విద్య చాలా అవసరం అన్నాడు .”స్త్రీ లకెల విద్య ,బాలురకే గాని -యనెడి మాట లోక మరసి కాదు –ఆలు ,మగని కెన్న ,నర్ధాంగి యౌ గాదే ”అని ఖచ్చితం గా చెప్పాడు .ఇలా మహిలాభ్య్దయాన్ని ఆ నాదే కోరిన మహనీయ మూర్తి వేమన .
డబ్బున్న వాడికి పిల్ల నిచ్చి ,పెళ్లి చేస్తే ,అమ్ము కొన్నట్లే అవు తుందని ,సమాన మైన వాళ్ళ తో నే వియ్యం మంచి దని హితవు చెప్పాడు .పేదలకు పిల్లనిస్తే బంధం పెరుగు తుందని ,వాళ్లకు కష్ట  సుఖాలు తెలుసు కనుక కాపురం స్వర్ణ గోపురం అవుతుందని భావించాడు .”కలిమి జూచి ,ఇవ్వ ,ఆశ్రయ మిచ్చి నట్లుండు ,–సమున కివ్వ ,మంచి ,సరస గుణము –పేద కివ్వ ,మనువు ,పెన వేసి నట్లుండు ”అని అన్నీ గమనించి చెప్పాడు .కానీ ,ఈ నాటికీ ఆయన మాటను వినే వాడే లేదు .హోదా ,డబ్బు ,ఉద్యోగం ఉన్న వారికే పిల్లను ఇస్తున్నాం .కుటుంబ వ్యవస్థ భద్రత కు చిహ్నం అన్నాడు వేమన .అబద్ధాలతో కొంపలు కూల్చే వాది కంటే ,కళ్ళు తాగే వాడే నయం అన్నాడు .పొదుపు గా మాట్లాడాలి .మాట వల్ల ఆయె గాయాన్ని మాంచటం చాలా కష్టం .”ఇనుము విరిగే నేని ఇనుమారు ,ముమ్మారు –కాచి ,యతుక వచ్చు కమ్మరీడు –మనసు విరిగే నేని మరి ,యంట  నేర్చునా ?”అని ప్రశ్నిస్తాడు .రంగు ,కులం ,బట్టి కాకుండా ,మనసు ను బట్టి విలువ నివ్వాలి అని చెప్పాడు .”మిరప గింజ చూడ మీద నల్లగ నుండు –కొరికి చూడ లోన చురుకు మనును –సజ్జను లను వారి ,సార మిట్టుల నుండు ”అని బాగా పోల్చాడు .తెలివి తేటలు ఎవరి దగ్గర ఉన్నా ,గౌరవించాలి .”పిన్న చేతి దివ్వె పెద్ద గా వెలగదా ?”అని పోలిక చెప్పాడు .శ్రమ లో నుంచే అన్నీ రావాలి .”శ్రమయేవ జయతే ”అన్న భావాన్ని ”భూమి లోన పుట్టు ,భూసార మెల్లను –తనువు లోన పుట్టు తత్వ మెల్ల -శ్రమము లోన పుట్టు సర్వము తానేను ”అని పద్యం లో వివరించాడు .
సులభం గా రాత్రికి రాత్రే ధన వంతు లవా లన్న దురాశ పనికి రాదు .అన్నీ ఉన్నా కరువు వస్తూనే ఉంటుంది .దీనికి పేరాశేముఖ్య కారణం .”ఉప్పు ,చింత పండు ,ఊరిలో నుండగా –కరువదేల వచ్చే కాపులార ?తారకంబెరుగరో ,తగరంబు నేరుగరో ”అని సుద్ది చెప్పాడు .తారకం అంటే ”ఆర్సెనిక్ సల్ఫైడ్”,తగరం అంటే ”టిన్”(తుత్తు నాగం ).ఈ రెండిటిని కలిపితే బంగారం వస్తుందని ”రస వాదులు ”భావించారు .వేమన గారూ ,ఈ మత్తులో పడి చెయ్యి కాల్చుకొన్నాడు పాపం .అదే ”ఆల్కెమీ ”.జ్ఞానోదయం అయిన తర్వాతే గా ఎవరైనా ఇతరులకు చెప్ప గలిగేది .మన వేమనా అంతే .తేనె టీగ మనకు ఆదర్శం కావాలి .తాను ఎంతో కష్ట పడి కూడా బెట్టినమధుర మైన  తేనె నుఇతరులకు పంచి ఇచ్చే ఔదార్యం దానికి ఉంది .ధనానికి మనం trusty గా ఉండాలి . గాంధి గారు కూడా తాతా ,బిర్లా లకు ఇదే సూచన చేశారు .”ధనం కూడా బెట్టి ధర్మంబు సేయక –తాను దినక ,లెస్స దాచు గాక –తేనె టీగ గూర్చి ,తెరువరి కియ్యదా ?”అని బోధించాడు .అప్పు చేసి ,పప్పు కూడు వద్దన్నాడు .తిండి లేక పోతే చదువు రాదు అని చెప్పాడు .”గ్రాస మింత లేక కడు కష్ట పడుచున్న –విద్య ఎలా నిలుచు ,వెడలు గాని ,–పచ్చి నీళ్ళ కుండనీళ్ళు పట్టిన నిల్చునా ?”అని సార్ధకం గా చెప్పాడు .మన ప్రభుత్వాలు మధ్యాహ్న భోజ నాలు, సంక్షేమ హాస్టల్లు అందుకే ప్రారంభించాయి .చిత్త శుద్ధి లేకుండా శివ పూజ వద్దని ,ఎదుటి వారి సొమ్ము ఎల్లరికి తీపి అని ,కూడూ ,గుడ్డా తాను కోరునా దేవుడు ?అని ఎన్నో చేదు నిజాలను వెలి బుచ్చాడు .ఇవన్నీ సుద్దులు ,బుద్ధులు .అనుభవ సారాన్ని కరతలా మలకం  చేసి అందించాడు వేమన్న .ఆయన భౌతికం గా 1725 లో మరణించినా ,జన హృదయాలలో నిలిచే ఉన్నాడు .
 చిరంజీవి వేమన 
వేమన శ్రీ రామ కృష్ణ పరమ హంస అవతారం అని కొందరు అంటే ,కారల్ మార్క్స్ ప్రతి రూపం అని కొందరు భావించారు .నాలుగు వందల ఏళ్ళు దాటినా వేమన ప్రభావం మన మీద ఉంది .ఆయన నిత్య కవి ,సత్య కవి ,చిరంజీవి అయాడు .ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాడు .చెరగని ముద్ర వేశాడు .ఆ మహా మహుని నిత్యం స్మరిస్తూనే ఉన్నారు .ఆంద్ర మహా జనం వేమన ”త్రిశత జయంతి ”వైభవం గా జరుపు కొన్నారు .1929నుంచి శ్రీ మొవ్వ శ్రీనివాస రెడ్డి వేమన జయంతిని ప్రతి ఏడాది జరుపు తున్నారు .తమిళ నాడు లోని ”హోసూరు ”పట్టణం లోని ”తెలుగు సాంస్కృతిక సమితి ”వేమన జయంతి ని భక్తీ శ్రద్ధలతో నిర్వహిస్తోంది .వేమన ఆశ్రమాన్ని స్థాపించింది .వేమన దేవాలయాలు వెలిశాయి .రాయల సీమ లో ”కటారు పల్లె ”లో వేమన సమాధి ,ఆలయం ఉన్నాయి .రెడ్డి ప్రభువే అయినా వేమా రెడ్డి అనే నిజ నామం ఉన్నా అఆత్మీయం గా అందరు ”వేమన్నా ”అనే ఒక అన్న గా పిల్చుకోవటం సంస్కారం .ఆయన కుల ,మతా లకు అతీతుడు .ఆత్మ దర్శనం పొందిన వాడు .జ్ఞానాగ్ని దగ్ధుడు .అహం బ్రహ్మాస్మి కి అసలైన రూపు ..అందుకే ఆయన ప్రతిభా విశేషాలను వివ రించే ఒక పద్యాన్ని ఒక కవి కై మోడ్పు గా సమర్పించాడు -”ఓ కవీ !నీదు పద్దియ మొక్క మారు –మనసు దీర ,జక్కగా వినిన నరుడు –మరల జన్మము లో ,దాని మరచి పోక –సమయ మొచ్చిన జదువును ”సామెత ”గ ను ”.
     చిట్టి కవులు 
ప్రజా కవి వేమన తర్వాత సుమారు 80సంవత్స రాల వరకు రెడ్డి కవులెవరూ  చరిత్ర పుటలకు ఎక్కి నట్లు కనీ పించదు .ఒక వేళ ఒకరిద్దరున్నా ,వారి గ్రంధాలు అముద్రితాలో అలభ్యాలో అయినాయి .వెతకగా ,వెతక గా శ్రీ బేడిరాఘవ రెడ్డి ఒంటరి గా కనీ పిస్తున్నాడ్రు .ఈయన కుంఫిణీయుగం నాటి వాడు .1800ప్రాంతం వాడని ఆరుద్ర తేల్చాడు .తెలంగాణాలో  ”దమ్మాల పేట ”కు చెందిన వాడు .ద్విపద కావ్యం గా ”పూర్వ రామాయణం ”రాశాడు . ఆ రచన దాదాపు శిధిలా వస్త లో ఉందట .
ఈ కాలం లోనే ”దేశ ముఖ ”గా ఉన్న తూము రామ చంద్రా రెడ్డి ”అల మేలు మంగా పరిణయం ”అనే నాలుగు ఆశ్వాసాల కావ్యం రాశాడు .ఈ కవి గారి గురువు ఉత్పల రంగా చార్లు గారు .ఇది పుక్కిటి పురాణం .వై కుమ్తంలో శ్రీ దేవికి ,శ్రీ మహా విష్ణువు కు వాగ్వాదం జరిగిందట .ఆయన అలిగి, తూము వారి సీమ లో ఒక కొండ గుహ లో దాక్కున్నాడట .కవి గారు ఆయన్ను చూడ టానికి వెళ్లాడు .స్వామి తన గోడు అంతా భక్త కవికి వెల్ల బోసుకొన్నాడు .ఇదంతా తన కావ్యం లో గర్వం గా రాసుకొన్నాడు కవి .ఈ కవే స్వామి వార్కి ఒక ఆలయాన్ని కట్టిస్తే ,దివాన్ గారు దానికి ధూప దీప నైవేద్యాలకోసం ఒక గ్రామాన్ని రాసి ఇచ్చాడట .కవి గారి కుమారుడు పరశు రామ రెడ్డి కూడా తండ్రికి తగ్గ కొడుకే .అలమేలు మంగా పరిణయం ‘కావ్యం రాశాడని ఆరుద్ర ఉవాచ .
పాక నాటి గణ పతి రెడ్డి దేశీ రచన లో ”కృష్ణ విలాసం ”అనే యక్ష గానాన్ని రాశాడు .దీనిలో శ్రీ కృష్ణ లీలల్ని మధురం గా వర్ణించాడుఅని డాక్టర్ ఎస్ వీ .జోగారావు తన ”యక్ష గాన ప్రక్రియా రూపాలు ”లో వివరం గా రాశారు .అరవీటి రాజుల కాలం లో ఉన్న కామినేని ఎల్లా రెడ్డి ”లింగ పురాణం ”రాశాడు .గుంటూరు జిల్లా ఫ్రెంచి వారి అధీనం లోకి వచ్చిన తరువాత రాయప్ప రెడ్డి వంశం లో ఓబుల రెడ్డి ,అనంత రెడ్డి అనే అన్న దమ్ములు భక్తా వాడ లో ఉండే వారట .విద్యా ప్రసంగాలు చేయించే వారు .కవులకు ఆశ్రయం కలిగించారు .పింగళి ఎల్లన్న అనే కవి తో ”జీవ నాద స్వామి ”కధ ను కృతిగా రచింప జేసి ,రాయప్ప రెడ్డి అంకితం పుచ్చు కొన్నాడు .రాయప్ప రెడ్డి, కవికి ”వాక్య గ్రంధి ”ఇచ్చాడట .దానితో కవి  ”తోభ్య చరిత్ర ”రాశాడు .ఇది క్రైస్తవ కావ్యం .’సర్వేశ్వర చరిత్ర ”గా ప్రసిద్ధ మైంది .అంటే రెడ్డి వారు తమ కవుల చే క్రైస్తవ గ్రంధ రచనకూ శ్రీ కారం చుట్టిన్చారని తెలుస్తోంది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన -1

 జన వేమన -1

”ఆట వెలది ”ని ఆయుధం గా చేసుకొని ,మూఢ విశ్వాసాలను త్రుంచిన” వేమా రెడ్డి” అనే వేమన 1640-1725 ప్రాంతం వాడు .ఆయన కవిత్వం విశ్వ జనీనం .ఆయనకు కులం ,మతం అంట గట్ట లేం .”విశ్వ కవి ”గా విఖ్యాతుడు .వేమన పద్యం నోటికి రాని తెలుగు వాడు ఉండడు .నా దృష్టి లో ”వేమన ”అంటే” వే” అంటే వెయ్యి విధాలా ”మన” అంటే మనవాడు అని అర్ధం .ఆయన చెప్పింది అంతా ”వేమన వేదమే ”ఒక రకంగా” వేదనే .” సహజ కవి గా వేమన ప్రసిద్ధుడు .ఆయన కవిత్వం ఆత్మాశ్రయం .తనే గురువు తానే శిష్యుడు .యోగి వేమన గా ఆరాధ్యుడు .ప్రజా కవి ,మహా కవి ,విశ్వకవి .తత్త్వం లాగా పాడి ,అందు బాటులోకి భాషను భావాన్ని కవిత్వాన్ని తెచ్చాడు .ప్రబోధం ,సంస్కారం ఆయన పద్య లక్షణం .ఆత్మోద్ధరణ ,సమాజోద్ధరణ వేమన్న ధ్యేయం .”మానవుడే మాధవుడు ”అన్న జ్ఞాన యోగి వేమన .సహజ ,సంప్రదాయ కవి .వేమన నుఅద్వైతిగా ,శైవునిగా ,జైనుడిగా ,చార్వాకుడి గా ఎవరి ఇష్టం వచ్చి నట్లు వారు పిల్చు కొని తమ వాణ్ని చేసుకొన్నారు .ప్రాతస్మరనీయుడు ,చిరస్మరణీయుడు వేమన .వేమన కు ముందు కొంత మంది కవులను ,వారి రచనలను గురించి చెప్పు కొన్నాం .ఒక రకం గా వారంతా ”విస్మృత కవుల ”జాబితాలో చేరడం మన దుర దృష్టం .సాహిత్యం పై మనకు ఉన్న అలసత్వానికి నిదర్శనం .కనీసం ఒక్క సారైనా ఆ మహాను భావులను స్మరించి ధన్యత చెందుదాం అని చేసిన ప్రయత్నమే ఆది .                                                     

  వేమన సూర్యోదయం 

దాదాపు పదహారవ శతాబ్దపు చివరి రోజుల వరకు రెడ్డి రాజులే కవులు .సంస్కృత గ్రందాలనే ఎక్కువ గా రాశారు .శాస్త్ర గ్రంధాలు ,అలంకార శాస్త్రాలు ,సంగీత శాస్త్ర గ్రంధాల పై దృష్టిని కేంద్రీక రించారు .కాకపోతే దైవాల  చరిత్ర ,దేవుళ్ళ పై శతకాలు రాశారు .తమ భక్తిని ప్రకటించుకొన్నారు .ఆ కవిత్వం అంతా రాజాస్థానా లకు,పండితు లకే పరిమిత మై పోయింది .సామాన్య జనుల జీవన స్తితి గతుల గురించి ఎవరికీ పట్ట లేదు . ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టి ,వారి చీకటి బతుకులలో జ్ఞాన సూర్యుడిని వెలి గించిన వారు లేక పోయారు .వారి మూఢ విశ్వాసాలను ,చాందస భావాలను మాన్పించే ప్రయత్నం చేసిన వారూ లేరు .కర్తవ్య బోధ చేసి ,కార్యోన్ముఖులను చేసిన వారే కరువయ్యారు .ప్రజల యొక్క ,ప్రజల చేత ప్రజల కొరకు కవిత్వం రాలేదు .సామాన్యుని ,మాన్యుని గా చేసే కవితా ప్రక్రియా రాలేదు .సంస్కృత ఛందస్సు వేదం అయింది కవులకు .అదిగో ,అలాంటి అవసర సందర్భం లోనే వేమన గారు ఒక ప్రచండ భానుడి లాగా అవతరించారు .ప్రజల కోసం కవిత్వం చెప్పాడు .ప్రజల భాష లో చెప్పాడు .ప్రజల పలుకుబడులను ఉప యోగించాడు .మార్మికత లేకుండా ,సూటిగా గుండెల్ని తాకే టట్లు కవిత్వాన్ని రాసి ”ప్రజా కవి ”అని పించుకొన్నాడు .
వేమన భావన లన్నీ విశ్వ వ్యాప్తం అవటం తో విశ్వ కవి అని పించుకొన్నాడు .అలవోక గా చెబుతూనే ,జీవిత రహస్యాలను ,ఆధ్యాత్మిక చింతన ను రగిల్చాడు .జ్ఞాన దృష్టి ప్రసాదించి ,జ్ఞాన యోగి అని పించుకొన్నాడు .యే ”ఆటవెలది ”కోసం తన జీవిత సర్వస్వాన్ని కోల్పోయాడో ,విరాగి అయాడో ఆ ”ఆటవెలది ”అనే అచ్చ తెనుగు ఛందస్సు ను ఆధారం గా చేసుకొని ”విశ్వదాభి రామ ,వినుర వేమ ” అనే మకుటం తో వేమన కవి తెలుగు సాహిత్యం  లో గొప్ప శతక కర్త అయాడు .ఆయన పద్యా లన్నీ ప్రజల నాలుక లపై నర్తించాయి .అవసరం ,సందర్భం వచ్చి నపుడు ఉపయోగించే ఉదాహరణలు అయాయి .తెలుగు కవిత్వం కొత్త వెలుగు లను సంత రించు కొంది .తెలుగు ప్రజలకు వేమన ఆశా జ్యోతి అయాడు .ఆత్మాశ్రయం గా ,తత్వాలుగా ,ఆయన చెప్పింది అంతా ”వేమన్న వేదం ”అయింది .తెలుగు వారి గుండెల్లో నిండి పోయాడు .ప్రాతస్మరణీయుడైనాడు .అలాంటి వేమన కవి జీవితాన్ని ,కవిత్వ తత్వాన్ని తెలుసు కోవటం తెలుగు వాడి కర్తవ్యమ్ .అదే మనమూ చేస్తున్నాం ఇప్పుడు .
  బ్రౌన్ కనుగొన్న వేమన

ఇంత ఘన చరిత్ర ఉన్న వేమన్న ను మన లాక్షణికులుగుర్తిన్చనే లేదు .లక్షణ గ్రందా లలో ,చివరికి కవుల చరిత్ర లోనూ వేమన కు స్థానం కల్పించ లేదు .ఆంగ్లాధి కారి అయినా ,తెలుగు దేశం పై అభిమానం ,తెలుగు సారస్వతం పై అభి రుచి ఉన్న ”చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ”వేమన పద్యా లను సేకరించి ,శుద్ధ పరచి ,తెలుగు వారికి ఆయన్ను ,ఆయన శతకాన్ని పరిచయం చేశాడు .బ్రౌన్ ఆ పుణ్యం కట్టు కొక పోతే ,వేమన్న ఎప్పటికీ తెలుగు చరిత్ర పుటలకు ఎక్కి ఉండే వాడు కాదేమో ?అందుకే బ్రౌన్ కూడా మనకు చిర స్మరణీయుడైనాడు .ఆ తర్వాత వేమన కవిత్వం పై శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు ,శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారు ,శ్రీ మరుపూరి కోదండ రామి రెడ్డి గారుశ్రీ ఆరుద్ర  మొదలైన వారు దృష్టి సారించి వేమన కవిత్వం లోని లోతు పాతు లను ప్రజలకు విస్తృతం గా అంద జేశారు .దానితో వేమన కీర్తి దశ దిశలా వ్యాపించింది .ఇంతటి మహా కవిని చరిత్ర చీకటి లో ఇంత కాలం ఉంచామా అని సిగ్గు పడింది ఆంద్ర జాతి .అప్పుడు అందరు వేమన్న ను భుజాలకు ఎత్తు కొన్నారు .నెత్తిన పెట్టు కొన్నారు .ఆయన భావాలను ,కవిత్వాన్ని తనివి తీరా గ్రోలారు .బ్రహ్మ రధం పట్టారు .నీరాజనాలు అందించారు .”మనిషే దేవుడని ,మానవతా వాదమే వేమన మతమని ”గుర్తించారు .
1640 a.d.ప్రాంతం లో రాయల సీమ లోని రెడ్డి కులం లో వేమన జన్మించాడు .రాజభోగం ఉన్న వంశం .ఆయన గురువు శివ యోగి .స్నేహితుడు అభి రామయ్య బంగారు నగలు చేసే వాడు .అభిరామయ్య ను మోసం చేసి, వేమన గురువు వద్ద ఉపదేశం పొంది ,బీజాక్షరాలు రాయించు కొన్నాడని కధ ఒకటి ప్రచారం లో ఉంది .దాని ఫలితాన్ని వేమన దక్కించుకొన్నాడు .అభిరాముడికి దక్కాల్సిన ఫలితాన్ని తాను దక్కిన్చుకోన్నానని లోలోపల మధన పడుతున్నాడు .అతని కీర్తి శాశ్వతం కావాలని భావించి ,”విశ్వ దా భి రామ వినుర వేమ ”అనే మకుటం లో ఆటవెలది పద్యాలు చెప్పాడు .దీని అర్ధం –విశ్వాన్ని (సమస్తాన్ని )ఇచ్చ్చే దేవుడికి ఇష్టమైనది .దీని లో స్నేహితుని స్మరణా దాగి ఉంది .ఇవన్నీ ఒక్క రోజులో చెప్పిన పద్యాలు కావు .అనేక ప్రదేశాలు తిరుగుతూ ,,తాను చూసిన విషయాలపై స్పందిస్తూ ,సంఘం లోని చెడును ,కుళ్ళు ను ,అవినీతిని ,చూసి ఆగ్రహిస్తూ ,బాధ పడుతూ ,మార్పు రావాలని కోరుకొంటూ ,చెప్పిన పద్యాలు .ముక్తకాలు .ఆ పద్యాలు ప్రజల నాలుక పై జీవించాయి .వేదం లా తరతరాలకు ప్రాప్తించాయి .”వానలో తడియని వారు ,వేమన పద్య మరంద ధార లో తని యని వారు ”లేరు .గ్రామీణ జీవితానికి అద్దం పట్టాడు .ఆయన పద్యాలలో ఆనాటి సమాజ పు పోకడలన్నీ  కనీ పిస్తాయి .ఒక విధం గా సమకాలీన చరిత్రను పద్యాలలో బంధించాడని పిస్తుంది .చివరకు సర్వం త్యజించి ”యోగి వేమన ”గా మారి పోయాడు .
వేమన ప్రతి దాన్నిహేతు వాదిలాప్రశ్నించటం నేర్పాడు .అస్పృశ్యత ను నిరశించాడు .అందరికి సంఘం లో సమాన గౌరవం ఉండాలని ,సంఘ సంస్కర్త లా చెప్పాడు .విరాట్ పోతులూరి వీర బ్రహ్మం గారు” కాల జ్ఞానం ”రాశారని మనందరికీ తెలుసు .ఆయనే ”వేమన్న మా అన్న ”అని గౌరవించారు,ఆత్మీయం గా పిలిచారు . .ప్రజలకు శాస్త్రీయ దృక్పధం కలిగించిన వాడు వేమన .ఆయన వేసిన ప్రతి అడుగు భావి తరాలకు బాట .ఆయన చెప్పిన ప్రతి మాట ”నీతి ముత్యాల మూట ””సాను జాత మయ్యే సకల కులము ”అన్నాడు వేమన .అంటే -ఒకే కులం లోంచి ,అన్ని కులాలు పుట్టాయి అని అర్ధం .కులం పోరు జాతి ఐక్యతకు చేటు అని భావం .ఈ స్ఫూర్తి తోనే పలనాటి బ్రహ్మ నాయుడు ”చాప కూడు ”పెట్టి సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేయించాడు .సిక్కుమత  నాయకుడు గురు నానక్ ”లంగరు ”అనే సహా పంక్తి భోజనం ఏర్పాటు చేశాడు .”ఉర్వి నొక్క కంచము బెట్టి -,పొత్తు గుడిపి, కులము పోలయ జేయి ”అన్న సంస్కర్త మన ,జన వేమన .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –18-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేమన కు ముందున్న రెడ్డి కవులు -రచనలు -3(చివరి భాగం )

  వేమన కు ముందున్న రెడ్డి కవులు -రచనలు -3(చివరి భాగం )
                           అన పోతా రెడ్డి -అన వేమా రెడ్డి 

అన పోతా రెడ్డి 1336వరకు రాజ్య పాలన చేశాడు .అమరావతి లో తన మంత్రి ”అల్లయ వేమన ”తో అమరేశ్వర స్వామిని పునః ప్రతిష్ట చేయించాడు .అన వేమా రెడ్డి ధార్మికుడు .”ధర్మ వేమన ”అనే సార్ధక బిరుదాంకితుడు .’షట్కాల’ (ఆరువేళల )శివ పూజా దురంధరుడు .”సంతాన సాగరం ”వంటి తటాకాల నెన్నిటి నో త్రవ్వించాడు .ఇతని కాలం లోనే ”ఎల కూచి  బాల సరస్వతి ”కవి విద్యాది కారి గా ఉండే వాడు .1381వరకు వేమన ఉన్నాడు .1427-48కాలం లో వీర భద్రా రెడ్డి రాజ్యాన్ని పాలించాడు .ఈయనకే శ్రీ నాధుడు కాశీ ఖండం అంకిత మిచ్చాడు .వీర భద్రా రెడ్డి మంత్రి అన్నయ్య కు ”భీమ ఖండం ”రాసి అంకితం చేశాడు .
                                                     కాటయ వేమారెడ్డి 

అద్డంకిరాజ దానిగా తన బావ కొమరగిరి రెడ్డి ని రాజుగా చేసి ,కాటయవేముడు పాలించాడు .(1364-1386 ).తన బావ కుమార గిరి పేరుతో ,కాళిదాసు రాసిన మూడు నాటకాలకు ”కుమార గిరి రాజీయం ”అనే వ్యాఖ్యానం రాశాడు .కాటయ వేముడు శూరుడు ,విద్వద్గోష్టి ప్రియుడు గా ప్రసిద్ధుడు .ఇతని కాలం లోనే ”రాయని భాస్కరుడు ”మంత్రిగా ఉన్నట్లు ఒక చాటువు ప్రచారం లో ఉంది .”కలయ బసిండి గంటమున గాటయ వేమ సమక్ష మందు ,స –త్ఫలముగా ,”రాయన ప్రభుని బాచడు ”వ్రాసిన వ్రాల మ్రోతలున్ –గలు ,గలు ,గల్లు గల్లురన,గంటక మంత్రుల గుండె లన్నియున్ –జలు ,జలు,జల్లు జల్లురను,సత్కవి వర్యులు మేలు .మేలనన్”
ఈతని శాసనాలు పిఠాపురం ,పెద్దాపురం లలో ఉన్నట్లు తెలుస్తోంది .1416లో మరణించాడు .బావ గారిని గద్దె మీద కూర్చో బెట్టి రాజ్య పాలన సక్రమం గా నిర్వ హిస్తు ,కొమర గిరి కీర్తి ని శిఖా రాలకు చేర్చి ,సంగీత ,సాహిత్య ,నాట్య వైభవాలకు అగణుతకీర్తి సాధించి పెట్టాడు కాటయ వేమన .అధికారాన్ని దుర్విని యోగం చేయకుండా .రాజ ప్రతినిధి గా విదుక్త ధర్మాన్ని నేర వేర్చి న రాజు ,రచయిత వేమా రెడ్డి .ఈ నాటి రాజు గారి బామ్మర్డులకు పూర్తీ వ్యతి రేకం .
                                          కొమరగిరి రెడ్డి 
బావ మరది అండ దండ గా ,కొమర గిరి రెడ్డి హాయిగా ,చీకూ ,చింతా లేకుండా వైభవం గా రాజ్య పాలన చేశాడు .కవి పండితులను ,సంగీత నాట్య కోవిదులను పోషించాడు .”వసంత రాజీయం ”పేరుతో ,నాట్య శాస్త్ర గ్రంధాన్ని సంస్కృతం లో రచించాడు .శాకుంతల వ్యాఖ్య లో దీన్ని గురించి గొప్ప ప్రశంశ ఉంది .–”మునీనాం ,భారతాదీనాం ,భోజాదీనాం ,చ భూజనం –శాస్త్రాణి,సంయగాలోచ్య ,నాట్య వేదార్ధ వేదినాం –ప్రోక్తం ,”వసంత రాజేన ”కుమారగిరి భూభుజా –నామ్నా ,”వసంత రాజీయం ”నాట్య శాస్త్ర యదుత్తమం ”
కొమరగిరి ఆస్థానం లో ”లకుమ ”అనే నాట్య కళా కారిణి ఉండేదట .ఆమె ఆయనకు వేశ్య అని అంటారు .”ఒక్క భావానికి వెయ్యి రకాల అభినయం ”చేసి చూపించేదట .ఆ విషయం కూడా ఒక శ్లోకం లో వర్ణించ బడింది –”జయతి మహిమాలోక తీతః ,కుమర గిరి ప్రభో–స్సదసి”లకుమా దేవీ ”యస్య ప్రియ సదృశీ ప్రియా –నవ మభినయం ,నాట్యార్దానాం తనోతి ,”సహస్రధా ”–వితరతి ,బహు నర్దా నర్ది వ్రజాయ సహస్రయః ”
కుమార రెడ్డి కాలం లో ”వసంతోత్స వాలు” నభూతో ,న భవిష్యతి అన్నట్లు గా జరిగేవి .అందుకే కుమారగిరి ని ”వసంత రాయలు ”అని పిలుస్తారు .ఇతని తో రెడ్డి రాజ్య ప్రభ దాదాపు అంత రించి నట్లే .
              రెడ్డి రాజ్య పతనం  
పెద కోమటి వేమా రెడ్డి కొడుకు తండ్రి తరువాత రాజ్యానికి వచ్చి ,నాలుగేళ్ళు పాలించాడు .కర్కోటకుడు ,దుష్టుడు .”పురిటి మంచం మీద కూడా పన్ను” వేసిన ఘనుడు .ఇతని బాధలు భరించ లేక ”సవరం ఎల్లయ్య ”అనే బలిజ నాయకుడు పొడిచి చంపేశాడు .1424-48కాలం లో పాలించిన వీరభద్రా రెడ్డి రాజమండ్రి నిఏలిన రాజుల్లో చివరి వాడు .1424లో కొండవీటి రాజ్యం అంతరించింది .అప్పుడు విజయ నగరం లో మైలా రెడ్డి ప్రముఖుడు గా ఉన్నాడు .ఇతడే  శ్రీ నాద కవి సార్వ భౌముడిని ఆదరించి చేర దీశాడు .”దిన వెచ్చం ”ఇచ్చి పోషించాడు .కొండ వీడు ఆ తర్వాతా అందరిదీ అయింది .ఎవరెప్పుడు వచ్చి ,యేలి ,సోలి పోయారో తెలీదు .దీనినే శ్రీ నాధుడు ”పాములకుఎన్ని కన్నాలో ,పక్షులకు ఎన్ని ఆశ్రయ వ్రుక్షాలో ,ఏటికి ఎన్ని అలుగులో ,ఎలుగు బంటి కి ఎన్ని వెంట్రుకలో ,కొండ వీటి లో ఏలికలు (రాజులు )అందరు ”అని ఒక పద్యం లో చమత్కరించాడు .అంతే కాదు -రెడ్డి రాజుల కీర్తినీ అద్భుతం గా ప్రశంషించాడు .ఒకే ఒక పద్యం లో ఆ వైభవాన్ని అంతా కళ్ళ ముందు ప్రత్యక్షం చేశాడు .అందుకే” కవి సార్వ భౌముడు”అయాడు  .”మహా నీయమ్బుగ ,నాంధ్ర భూవలయముం బాలించు చుం ,బ్రాజ్నులై –బహు కావ్యంబులు  చెప్పుచున్ ,మరియు ,చేప్పంజేయు,చాముష్మిక –స్పృహలో ,ధర్మము  లాచ రించుచును ,జగజ్జేగీయ మానంబుగా –నహముల్ పుచ్చిన ,రెడ్డి రాజుల సముద్యత్కీర్తి గీర్తిన్చేదన్ ”-ఇలా ఒక ”స్వర్ణ యుగం ”దాటి వెళ్లి పోయింది .
                                         తెలంగాణా రెడ్డి  కవులు 
వీరి తర్వాత గుర్తుంచుకో దగిన కవిత్వం రాసిన వారు తెలంగాణా లోని రెడ్డి కవులు .అందు లో ఒకరు1550-1600 వరకు ఉన్న కామినేని ఎల్లా రెడ్డి .నిజాం రాష్ట్రం లో మెదక్ జిల్లా లో ”బిక్కన వోలు ”నివాసి .ఇతని సోదరుడు దోమ కొండ సంస్తానాది పతి మల్లా రెడ్డి ”లింగ పురాణం ”,వాశిష్టం ”రాసి నట్లు తెలుస్తోంది .ఇవి అలభ్యం .సోమనాధ కవి రాసిన ”బ్రహ్మోత్తరఖండ ”కావ్యాన్ని కూడా అంకితం పొందాడట .అదీ ఈతని  ప్రత్యేకత .కావ్య కర్తా ,భర్తా కూడా .’
ఇతని తర్వాత గుర్తుంచుకో దగిన వాడు తూము పరశు రామి రెడ్డి .మహబూబ్ నగర జిల్లా వాడు .మామిడి మడ గ్రామస్తుడు .”అలవేలు మంగా పరిణయం ”,అనే ప్రబంధాన్ని రచించి నట్లు ‘గోల్కొండ కవుల సంచిక ”లో ఉంది 16.శతాబ్ది మొదటి భాగం లో ఉన్న మల్లా రెడ్డి దేశాయి అనే కవి ”గంగా పుర మహాత్యం ”అనే ప్రబంధాన్ని రాశాడు .ఈ గ్రామం హైదరాబాద్ ప్రాంతం లోనిదే .ఈ గ్రామానికి 1500సంవత్సరాల చరిత్ర ఉందట .అసలు పేరు రామాయపురం అనీ ,పశ్చిమ చాళుక్యుల శాసనం లో ఆ పేరు కానీ పిస్తుందని ,ఆరోరుద్రుడు ”ఆరుద్ర ”అన్నారు .స్కాంద పురాణం లోని” తీర్ధ ఖండం ”లో ఈ మహాత్మ్యం ఉందని ఆరుద్ర  పరిశోధించి తెలియ జేశారు .ఈ కవిని ”రెడ్రేడ్డి”అని కూడా అంటారట .
హైదరాబాద్ రాష్ట్రం లోని ”దమ్మారావు పేట ”నివాసి ,చాడ రాఘవ రెడ్డి ”వెంకట రామణా” అనే మకుటం తో కంద పద్య శతకం రాశాడు .”విష్ణు సర్వోత్తమా ”అనే మరో మకుటం తో ఇంకో శతకమూ రాశాడు .”ద్విపద కావ్యం ”గా రామాయణాన్ని రాశాడు .కాచ రాజు కుమారుడు ”మల్లా రెడ్డి ”కవి ,గోల్కొండ నవాబు ‘మల్కిభరాం ”కాలం వాడు .బిక్కన వోలు రాజు కూడా .”షట్చక్ర వర్తుల చరిత్ర ”,,”పద్మ పురాణం ”,శివ ధరోత్తర ఖండం ”రాశాడు .వీటిలో మొదటిదానికి చాలా ప్రశస్తి లభించింది .ఎనిమిది ఆస్వాసాలు ,ఆరుగురు చక్ర వర్తుల కధ లక్షణం గా ,రస వత్తరం గా ఉండే కవిత్వం అని పండితాభి ప్రాయం .వీరి తర్వాతా యే రెడ్డి కవీ కావ్యం  రాసి నట్లు కన బడదు .
ఇలా కావ్యాలు ,భక్తీ శతకాలతో సాహిత్యం అంతా నిండి పోయింది .ప్రజల విషయము ,సాంఘిక సమస్యలు యే రెడ్డి కవికీ  పట్టలేదు .అంతా ఒక మూస విధానం గా సాగి పోతోంది .తెలంగాణా లో నైనా ,ఆంద్ర ప్రాంతం లో  నైనా .అప్పుడు సమాజానికి ఒక ఝలక్ నిచ్చాడు వేమన .ఆయన సాహిత్యానికి ,సమా జానికిఅత్యంత అవసర మైన వాడు అయాడు . .”’వేమన సూర్యోదయం” అయింది .చీకటి పోయి వెలుగులు వచ్చాయి .’  ” వేమా రెడ్డి” అనే” యోగి వేమన ”జీవితం సాహిత్యం గురించి ”జన వేమన ‘‘పేర ధారావాహికం గా తెలుసు కొందాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-8-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 2 Comments

వేమన ముందున్న రెడ్డి కవులు -రచనలు -2

  వేమన ముందున్న రెడ్డి కవులు -రచనలు -2
                                                                                                                రెడ్డి రాజ్య స్థాపన 
క్రీ.శ.1325 లో పెద కోమటి వేమా రెడ్డి రెడ్డి రాజ్య స్థాపన చేశాడు .కొమర గిరి రెడ్డి ,కాటయ వేమా రెడ్డి ,అనపోతా రెడ్డి ,అన వేమా రెడ్డి మొదలైన వారు రెడ్డి రాజుల్లో పేరు పొందిన వారు .సుమారు వంద సంవత్స రాలు రెడ్డి రాజులు ఆంద్ర దేశాన్ని  పాలించారు.వీరంతా సంస్కృతం లో గ్రంధాలు రచించారు .తెలుగును బాగా నే ఆదరించారు .లక్షణం తో సమన్వయము చేసే కావ్యాలు వీరి తోనే ప్రారంభ మైనాయి .పంటలను పండించే  రెడ్లు ,కవితా ఫలసాయమూ చేసి ,భేష్ అని పించుకొన్నారు .కావ్యకర్తలే కాకుండా ,కావ్య భర్తలూ అయారు .రాచ వేమా రెడ్డి తో రెడ్డి రాజ్యం అంతరించింది .పద్మ నాయక రాజులు తెలంగాణా ప్రాంతాన్ని పాలించే రోజుల్లో ,రెడ్డి రాజులు ఆంద్ర ప్రాంతాన్ని పాలించారు .అద్డంకి,కొండ వీడు ,రాజమండ్రి రాజ దానులుగా రెడ్లు పాలించారు .ఎర్రన ,శ్రీ నాధుడు ,రాయని బాచడుమొదలైన కవులకు ఆశ్రయం కల్పించి ,గ్రంధ రచనలు చేయించి ప్రోత్స హించారు .సంగీతానికి ,నాట్యానికి సమాన స్థాయిని సాహిత్యం తో పాటు కల్పించి చరితార్దు లైనారు రెడ్డి ప్రభువులు .ఎన్నో ధర్మ కార్యాలు చేశారు .వసంతోత్స వాలను నిర్వహించారు .ఆ రోజుల్లో సంగీత ,సాహిత్య ,నాట్య సరస్వతులు అవధుల్లేని ఆనందాన్ని అనుభ వించారు .కళలకు  కాణాచి గా రెడ్డి రాజులు పాలన చేశారు .ప్రజా రంజనే మొదటి కర్తవ్యమ్ గా పాలించిన రెడ్డి రాజులు బహుధా అభి నంద నీయులు .ఇప్పుడు వరుసగా వారి సాహితీ సేవ ను తెలుసు కొందాం .
                                      పెదకోమటి వేమా రెడ్డి 
”పల్లవ త్రినేత్రుడు ”,అనే బిరుదాన్ని అందుకొన్న పెద కోమటి వేమా రెడ్డి రెడ్డి రాజ్యాన్ని సర్వోన్నత స్థితి కి తెచ్చాడు .అద్డంకి ,కొండవీడు ,కొండ పల్లి ,ధాన్య వాటిక లలో దుర్గాలను పటిష్టం గా నిర్మించి ,రాజ్యాన్ని సుస్తిరం చేశాడు .వేగి ,వెలనాటి ,ద్రావిడ బ్రాహ్మణులకు36 అగ్రగారాలను దానం చేసిన మహా దాత .శ్రీ శైలానికి ,ఆహోబిలానికి సోపాన పంక్తులు నిర్మించాడు .ఇవన్నీ శాసనాలలో సాక్ష్యాలు గా కనీ పిస్తున్నాయి .ఈయన ప్రేరణ తోనే ఎర్రన ”హరివంశాన్ని ”రామ కధను రాశాడని తెలుస్తోంది . ఈయనకు ”సర్వజ్ఞ చక్ర వర్తి ”,”వీర నారాయణ ”బిరుదులున్నాయి . తమ్ముడు మాచా రెడ్డి ని కొండపల్లి రాజును చేశాడు .వేమా రెడ్డి కి సంగీతం లో గొప్ప ప్రవేశం ఉంది .”సాహిత్య చింతా మణి ”అనే ఉద్గ్రంధం రాశాడు .ఇది తిరువనంత పురం లైబ్రరీ లో లభిస్తోంది .రావి పాటి త్రిపురాంతక  కవి రాసిన ”ప్రేమాభి రామం ”అనే వీధి నాటకం నుంచి ఒక శ్లోకాన్ని గ్రహించి ”సాహిత్య చింతామణి ”ని వేమా రెడ్డి రాశాడట .ఇది అలంకార శాస్త్ర గ్రంధం .సంస్కృత రచన .”సంగీత చింతా మణి ”అనే గాంధర్వ విద్యా శాస్త్రమూ వేమా రెడ్డి రాశాడు .సంస్కృత ”గాధా సప్త శతి ”కి వివరణ గా ”సప్త శతీ సారాణిక ”రాశాడు .అమరుక శతకానికి ”శృంగార దీపిక ”వ్యాఖ్యనూ రచించాడు .ఈయన చంద వోలు కు రాజుగా ఉన్నప్పుడు శ్రీ నాధుడు వచ్చి నట్లు తెలుస్తోంది .”వేమా రెడ్డి కీర్తి లత శ్రీ శైలం లో స్థిర మూలమై ,కుమారాచలం లో వృద్ధి చెంది ,పంచారామాలలో ,సింహాచలం లలో పందిళ్ళు అల్లి ,శ్రీ కూర్మం ,పురుషోత్తమాలలో పుష్పించి ,కాశీ లో విశ్వ నాదునికి నిత్య నైవేద్యానికి ఫలించింది ”అని శ్రీ నాధ కవి సార్వ భౌముడు అన్న మాట ప్రత్యక్షరసత్యం ..ఈ శ్లోకం ఫిరంగి పురం శాసనం లో ఉంది .
.శ్రీ నాధుడు ”విద్యాధి కారి ”కనుక ,శాసన కర్త కూడా ఆయనే .శ్రీనాధుని ”విద్యాధి కారీ ,శ్రీ నాధో,వీర శ్రీ వేమ భూపతే ” అని చెప్పుకొనే వారు .”శ్రిత పోషణ ,రిపు శోషణ ,బుధ తోషణ ,సత్య భాషాది గుణాన్ ,దధతే దశరధ రామః -ప్రాగద్య కలౌతు ,కోమటి విభు వేమా ”అని వేమా రెడ్డి కీర్తింప బడ్డాడు .ఈ రాజు కాశీ ,రామేశ్వ రాలను సందర్శించి నట్లు సాక్ష్యాలున్నాయి .”సముద్ర రిపు వీర, రాజ వేశ్యా భుజంగ ,అతుల భీమ ,పెద కొమటన్నయ వేమా ”అని ప్రస్తుతింప బడ్డాడు .కొండ వీడు ”ముగ్గురు రాజులకును ,మోహంబు గలిగించు కొమర మించిన వీడు ”కీర్తి పొందింది .వేమారెడ్డి ఇరవై ఏళ్ళు పాలించాడు .క్రీ.శ.1400 లో రాజ్యానికి వచ్చి ,1420లో చని పోయాడు .చివరి కాలం లో గజపతులు ,విద్యా నగర రాజు ,రాజమండ్రి రెడ్డి రాజులూ ,వెలుగోటి వేమ రాజుల చుట్టు ముట్టారు .మాచర్ల వెలమ రాజు వెలుగోటి మాదయ లింగమనేడు వేమా రెడ్డి నిఓడించి ”సంది కంత పోత రాజు ”అనే వేమా రెడ్డి గారి కటారి ని తీసుకొని పోయాడట . వేమా రెడ్డి బొమ్మను లింగమ నేడు తన ఎడమ కాలిగండ పెండేరానికి కట్టు కొని అవమాన పరచాడు .అప్పుడు కవి సార్వ భౌముడు శ్రీ నాధుడు లింగమ నేడు ఆస్థానికి వెళ్లి ,తన కవితా ధారతో ప్రసన్నం చేసుకొని ,అతన్ని అర్ధించి వేమా రెడ్డి కటారిని అడిగి తీసుకొని వచ్చి దాన్ని వేమా రెడ్డి ప్రభువుకు అంద జేశాడట .ఇలా తన ప్రభువు ఋణం తీర్చుకొన్నాడు శ్రీ నాధుడు .1417లో పెద కోమటి వీరా రెడ్డి ఫిరోజ్ షా తో కలిసి రాజ మహేంద్రం పై దండ యాత్ర చేశాడు .దీనికి ప్రతీ కారం గా నే లింగమ నేడు వేమభూపతి కటారిని తీసుకు వెళ్ళాడని కధనం .
వేమా రెడ్డి తమ్ముడు మల్లా రెడ్డి ఎర్రాప్రగడ కవిని ఆదరించి ,అన్నగారైన వేమా రెడ్డి వద్దకు పంపినట్లు తెలుస్తోంది .వేమా రెడ్డి చదల వాడ కు వచ్చి తమ్ముడు కట్టించిన రామాలయాన్ని దర్శించి ,చంద్ర గ్రహణం నాడు ఒక అగ్రహారాన్ని ,గుండ్ల కమ్మ నదిలో ఇసుక తిన్నె పై కూర్చుని దానం చేసి నట్లు శాసనం ఉంది .ఆఊరే తర్వాత ”మల్లాపురం ”అయిందట  ప్రభువు ఎర్రన కవీశ్వరుని రామాయణాన్ని రాయమని కోరితే ,వ్రాశాడట .అయితే అదంతా శిధిలమై కేవలం 28పద్యాలు మాత్రమె లభించాయట  .రామాయణం వల్ల తనకు గొప్ప కేర్తి వచ్చిందని వేమా రెడ్డి చెప్పుకోన్నాడట .వేమా రెడ్డి ”ప్రబంధ పరమేశ్వరుడు” ,”శంభు దాసుడు ”అని బిరుదాంకితుడైన ఎర్రన మహా కవిని ”హరి వంశం ”వ్రాయ మని అర్ధించాడు .హరి వంశం తో కలిస్తేనే భారతం ”మహా భారతం ”అవుతుందనీ రాజే చెప్పాడట .అలానే ఎర్రన హరివంశం రాసి కీర్తి పొందాడు. భారతాంధ్రీ కరణాన్నిఆదికవి నన్నయ ఆపేసిన  అరణ్య పర్వ శేషం నుంచి పూరించి కవిత్రయం లో ఒకడైనాడు ఎర్రన .నేపాల్ దేశం లో న్యాయ స్థానాలలో ”హరి వంశం ”ను నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేస్తారట .వేమా రెడ్డి ”వీర నారాయణ చరిత్ర ”అనే ”భాణం” కూడా రాశాడు .వేమా రెడ్డి ప్రభువు కాలం లో శైవ ,వైష్ణ వాలు సమానం గా ఆదరింప బడినాయి .హరిహర నాధ సమన్వయమూ సాధించ బడింది .ముఖ్యం గా ఈ కాలం లో ద్విపద ఆదరాన్ని పొందటం విశేషం కూడా .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-8-12–కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

వేమన కు ముందున్న రెడ్డి కవులు -రచనలు -1

 వేమన కు ముందున్న రెడ్డి కవులు -రచనలు -1
                                                                        రెడ్డి పదం 
ఏడవ శతాబ్దం లోనే” రెడ్డి ”పదం ఉన్నట్లు శాసనాదారాలున్నాయి .క్రీ.పూ.632లోని మొదటి విష్ణు వర్ధనుడి ”చీపురు పల్లి శాసనం ”లో ”రాష్ట్ర కూట ప్రముఖులు ”గా వీరిని పేర్కొన్నారు .రాష్ట్ర కూటమే రెడ్డి గా మారిందని చెప్తారు .సేద్యం చేయటం వల్ల ”పంట్ల రెడ్లు ”గా ప్రసిద్ధి చెందారు .కాకతీయుల కాలం నాటికి” కాడి వీరులు” కత్తివీరులైనారు .తెనాలి రామ లింగడు రెడ్లను ”కాపులు ”అన్నాడు .కడప ,నెల్లూరు జిల్లాల లోని రెడ్లను ”కాపులు ”అనే పిలుస్తారు .16 వ శతాబ్దం నాటికి రెడ్లలో 14శాఖలున్నట్లు తెలుస్తోంది .రెడ్డి కులాన్ని ”పంటాన్వయం ”అనే వారు .ఈ శాఖ లో పంట రెడ్లు ప్రముఖులు .వీళ్ళను దేచట ,దేసటి,దేష్టిఅని కూడా అనే వారట .కాశీ ఖండం లో శ్రీ నాధ కవి ,వీర భద్రా రెడ్డి రాజును ”శ్రీ మద్దేశటి వంశ శిఖా మణీ ”అని సంబోధించాడు .ఉత్తరాంధ్ర లో ”రెడ్డిక ”వాళ్ళు ,వెనక బడిన రెడ్లుగా భావింప బడుతున్నారు .
అసలు రెడ్డి అంటే నే ”గ్రామ పాలకుడు ”అని అర్ధం .గ్రామ పాలకుడు రచ్చ మీద కూర్చునె చోటును ”రెడ్డిగం ”అంటారట .”పెనుగాము రెడ్డి గంబును మించి ”అని ఉద్భటా రాధ్య చరిత్ర లో తెనాలి రామ కృష్ణ కవి వాడాడు .”ఒక కాలు మడిచి ,దాని పై మడిచిన ఇంకో కాలి పాదం మోపి ,ఆ కాలిని ,వీపును ,అంగ వస్త్రం తో గట్టిగా బిగించి కట్టు కోవటమే రెడ్డిగం ”అని ముత్తేవి రవీంద్రనాద్ వివరించారు అదేదో సినిమాలో కృష్ణం రాజు రాచ్చమీద కూర్చుని తీర్పు చెప్పిన పోజు అన్న మాట ..రాజు లైన రెడ్లు తండ్రి పేరు తర్వాత తమ పేరు వచ్చేట్లు పెట్టు కొన్నారు .ఇంకా తమాషా ఏమిటంటే ,ఇంటి పేరు ,అసలు పేరు ,కులం పేరు మూడూ కలిపి ”రెడ్డి రెడ్డి రెడ్డి ”అని పించు కొనే వారూ ఉన్నారట .ఇందులో మొదటిది ఇంటి పేరు ,రెండోది పేరు లో మొదటిది ,చివరిది రెడ్డి కులానికి సంబంధించినది .కడప జిల్లా లో పేద కల్లు ప్రాంతం నుండి ,రెడ్లు ,రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు వ్యాపించి నట్లు తెలుస్తోంది .అందులో ఒక శాఖ ”పెద కంటి రెడ్లు ”.వీరి భార్యలు” తాళి బోట్లు” ధరించరట ..పెండ్లిళ్ళ లో వధువు, మెడ లో ”నూలు పోగు మాత్రమెధరిస్తుందట . 16రోజుల పండుగ తర్వాత దాని బదులు ”బంగారు నాన్తాడు ”వేసుకొంటారట .దీనికి పిచ్చుక గుంటలు వాళ్ళు చెప్పే ఒక కధ ఆధారం గా కనీ పిస్తుంది .సీతా దేవి వన వాసం లో ఉన్నప్పుడు ,శ్రీ రాముడు యాగం చేయటానికి తన ప్రక్కన కూర్చోవటానికి ”స్వర్ణ సీత ”ను తయారు చేయించ టానికి కోశా గారం లోని బంగారాన్ని అంతా వాడినా చాల లేదట .అప్పుడు ”పెద కంటి రెడ్లస్త్రీలు ”,తమ నగలతో బాటు ,తాళి బోట్లను కూడా సమర్పించారట .అప్పుడు త్రాసు మొగ్గు చూపిందట .అప్పటి నుండి ,ఆ రెడ్డి స్త్రీలు తాళి బోట్లు ధరించే అలవాటు కు స్వస్తి చెప్పారట .ఇలా రెడ్లు వ్యవసాయం ,రాజకీయం లో ప్రవేశించి ,కవితా వ్యవ సాయం లోను గొప్ప ఫలితాలను సాధించారు .ఈ వైనాన్ని తెలియ జేయటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం .
                                        గోన బుద్ధారెడ్డి 
రెడ్డి పేరు వ్యాప్తి లోకి వచ్చన సుమారు 600ఏళ్లవరకు  రెడ్ల లో ఉన్న కవులు ,రచయితల పెర్లేవీ అందు బాటులో లభించ లేదు .వారు రాసిన పద్యాలు కాని ,పదాలు కాని చరిత్ర లో స్థానం పొందక  పోవటం విచారకరం .కారణాలు తెలియదు .చరిత్ర లో మొదటి కవి ,రాజు గోన బుద్దా రెడ్డి .క్రీ.శ.1294 లో” వర్ధమాన పురం” లో రాజ్యం చేసి నట్లు తెలుస్తోంది .ఈయనకు ”కదన ప్రచండ ” ,”మీసర గండ ”,”ఉభయ బల గండ ”బిరుదులున్నాయట .తండ్రి” విథల రాజు” .బుద్దా రెడ్డి కాకతీయుల సామంత రాజు .ఇతను ”రంగ నాద రామాయణం ”ను ద్విపద కావ్యం గా రాశాడు .తండ్రి విథలుడే ,పాండు రంగ విథలుడని ,ఆయన పేరు మీదే కావ్యాన్ని రంగనాధ (విథల) రామాయణం గా పేరు వచ్చిందని చెబుతారు .తండ్రికి కూడా ”మీసర గండ ”బిరుదుఉండేదట .గోన రెడ్డి తన 75వ ఏట తన కొడుకు లైన కాచ భూపతి ,విథల రాజు లను రామాయణం లోని ఉత్తర కాండను వ్రాసి పూర్తీ చేయమని కోరాడట .ఇలా చేయమని దేవుడే కలలో కని పించి  చెప్పాడట .గోన బుద్దా రెడ్డికి ”సర్వజ్ఞ ”బిరుదు కూడా ఉంది .కవి సార్వ భౌమ అనే ఛందస్సును కవి వాగ్బంధం అనీ పిలుస్తారు .వాల్మీకి రామాయణం లో లేని ఎన్నో కధలను కల్పించి జనరంజకం గా రాశాడు బుద్దా రెడ్డి .”పదాలు ,అర్ధాలు ,భావాలు ,గతులు ,పద శయ్యలు ,అర్ధ సౌభాగ్యాలు ,యతులు ,రసాలు ,గుమ్భనాలు ,ప్రాస ,సంగతి లతో వర్ధిల్లిన కావ్యం రంగ నాద రామాయణం ”అని విమర్శకులు కితాబు నిచ్చారు . .ఇతని కుమారులు ”పురాణ మర్మజ్నులు ”,బహు కళాద్యుతులు ,కవి రాజ భోజులు ”గా ప్రసిద్ధి చెందారు .కనుకనే తండ్రి కోరిక పై ఉత్తర కాండనూ రాసి ”తొలి జంట కవులు ”గా ప్రసిద్ధి చెందారు .కాచ భూపతి ,విథల రాజుల తండ్రికి తగ్గ కుమారులని పించుకొన్నారు .మనకు ఆది కావ్యం వాల్మీకి రామాయణం .దానినే  రెడ్డి కవులూ తమ ఆది కావ్యం గా చేసి చరితార్దులయ్యారు .అక్కడి నుండి ,ఆ సాహితీ లహరి అవిచ్చిన్నం గా కోన సాగింది .పాడుకోవ టానికి వీలుగా ఉండే ద్విపద ఛందస్సు లో రాయటం వల్ల రంగ నాద రామాయణం బాగా ప్రాచుర్యం పొందింది .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15-8-12–కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 1 Comment

అరవై అయిదేళ్ళ స్వాతంత్ర ఫలం

 అరవై అయిదేళ్ళ స్వాతంత్ర ఫలం  
అందరికి భారత స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు .అధికారం తెచ్చుకొని అరవై అయిదేళ్ళు దాటింది .కాని స్వతంత్ర ఫలాలు అందరికి దక్కు తున్నాయా అని ఆలోచిస్తే సమాధానం మిశ్రమం గా ఉంటుంది .బాగా ముందుకు వెళ్లామా ?అని ప్రశ్నించుకొంటే లేదనే అందరు చెప్పే సమాధానమే .పాపం అబ్దుల్ కలాం గారు దీని మీద స్పందించి ధనాత్మక దృక్పధాన్ని అలవాటు చేసుకో మన్నారు.కడుపు కాలే వాడికి ఋణం తప్ప ధనం ఎక్కడిది ?సంపాదన అంతా తిండికే ఖర్చవు తుంటే అభి వృద్ధి ఎక్కడ?.అవినీతి ఎక్కడ లేదు ? అని ప్రశ్నించే వారికి ఆది టెంట కిల్స్లాలా  వ్యాపించి మూలాలను ధ్వంసం చేస్తోందని తెలిసే లోపల, జరగాల్సిన అనర్ధం జరిగి పోతూనే ఉంది .స్వతంత్ర దినో త్సవానికి ఒక రోజు ముందే మన  రాష్ట్ర మంత్రి రాజీ నామా చేయటానికి కారణం అందరికి తెలిసిందే .ఇంకో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు .సర్వ సమర్ధుడు అని పించుకొన్న వాడిని రాష్ట్ర పతి పదవి వరించింది అన్న సంతోషమే ఈ రోజు మనకు మిగిలింది .కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కాళ్ళ కింద గడ కర్రలు పెట్టుకొని ,ఎత్తుగా ఉన్నట్లు నటిస్తున్నాయి .ఈ ముఖ్య మంత్రి సమర్ధుడు అని అనిపించుకొంటే ,ఆయన మీద పాత కేసుల తిరుగ మోత .ఆదర్శం గా పాలిస్తున్న ముఖ్య మంత్రికి దేశం వత్తాసు పలకదు .ఎంత వెనకేస్తే అంత సమర్ధతే కోల మానం అయింది .అటవీ సంపద ను దోచే వాడొక దైతే ,సముద్రాన్ని మింగే వాడు ఇంకోడు .బందుజనాన్ని అందలం ఎక్కించే వాడొక డైతే ,పల్లకీలు మోసే వారు కొందరు .ఉన్న వ్యవస్థ తీరు తెన్నులను సరైన మార్గం లో మళ్లించే వారు కరువై పోతున్నారు .వారెవ రైనా ముందుకొస్తే ,వారిపై బురద చల్లుడు .ఇన్నేళ్ళ స్వాతంత్రం ఇచ్చిన విష ఫలాలు ఇవి .వీటినుంచి యువతను బయట పడెయ్యాలి .వారిని తీర్చి దిద్దక పోతే భవిష్యత్తు శూన్యమే .
గాంధీ ,నేతాజీలు చిత్ర పటాలుగా గోడలకు వ్రేలాడుతున్నారు .పాపం వారి స్పూర్తి ని కోన సాగించే వారు లేకపోవటం మన దుర దృష్టం .ఒక సారి విజయనగరం మహా రాజా ఆనంద గజ పతి గారు మద్రాస్ లో సైకిళ్ళు అమ్మే దుకాకానికి మారు వేషం లో, మామూలు దుస్తుల తో వెళ్లారు .అవేమిటో ఆయనకు తెలీదు .అక్కడి గుమాస్తాను అవేమిటి అని అడిగితే ”బైసికిల్”అని చెప్పాడట .”ఖరీదెంత ?”అని రాజా ప్రశ్నిస్తే ”నువ్వు కొనేది కాదులే ఫో ”అన్నాడు .”మీ దగ్గర ఎన్ని సైకిల్లున్నాయి “‘? రాజా ప్రశ్న .”రెండు వందలు ”అని జవాబు .మొత్తం బిల్లు చేసి మా సంస్థానం కు వెంటనే రవాణా చేసి పంపండి ”అన్నారు .వాడు బిత్తర పోయాడు .అక్కడున్న మేనేజర్ కు అప్పుడు అర్ధ మయింది .వచ్చింది విజయనగరం మహా రాజా వారు అని .వెంటనే సైకిళ్ళు విజయ నగరం చేరాయి .రాజా వారు పండుగ కానుక గా ఆస్థాన ఉద్యోగులకు వాటిని పంచి పెట్టారు .అయితే మన వాళ్ళూ ఇప్పుడు ఎన్నికల వాగ్దానాలలో టి.వి.లు ఫ్రిజ్ లు ఇస్తామని మొహమాట పెడుతున్నారు .దానికీ దీనికీ ఎంత తేడా నో గమనించండి .వాళ్ళు ధర్మ ప్రభువులు .వీళ్ళు ”మన ఖర్మ ప్రభువులు ”అదీ తేడా .
శ్రీ కృష్ణ దేవ రాయలు అష్ట దిగ్గజ కవులను పోషించి సాహిత్య సేవ చేశాడు .అమరా వతి ప్రభువు రాజా వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దసరాల్లో ఏనుగు అంబారీ మీద ”వేదాలు ,ఉపనిషత్తులు,దర్శనాలు  పురాణాలు ములుగు పాపయా రాధ్యుల వారు రచించిన దేవీ భాగవతాలను ”ఊరే గించే వారు .వాటికి అంత గౌరవం కల్పించారు .మన కు సాహిత్యానికి ,భాషకు మంత్రే లేడు.అకాడెమి లేదు .భాషా సంఘం లేదు .”అన్నిటిని ఊరేగించి మంగళం పాడేశాం ఎప్పుడో” .ముది గొండ వారన్నట్లు ”స్వాతంత్రానికి ముందు దేశం కోసం మరణించటం త్యాగం ,ఇవాళ్ళ దేశం కోసం జీవించటం త్యాగం ”త్యాగం ప్రజలది ,భోగం పాలకులది ఇదీ తేడా .మరి మనమేం చేయాలి ?తిట్టుకుంటూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు .మంచి ఎక్క డ ఉంటె టే దాన్ని స్వీకరించాలి .అమెరికా బాగుంది సంతోషం .సింగపూర్ శుచికీ శుభ్రతకు నంబర్ వన్ .మరీ గొప్ప.బాగుంది .కలాం గారు అన్నట్లు అక్కడ ఉన్న మంచి వాటిని అక్కడున్నప్పుడు ఆచరించటం కాదు .మన దేశం లో నూ ఆ మంచిని ప్రతి బిమ్బింప జేయాలి .అప్పుడే సార్ధకత .అప్పుడు దేన్నీ మనం తిట్టనక్కర లేదు దేన్నీ పొగడక్కర లేదు .ఆదర్శం ఆచరణం కావాలి అది ఇక్కడైనా ,ఎక్కడైనా .ఈ స్ఫూర్తి తో ఈ స్వాతంత్ర దినోత్స వాన్ని జరుపు కుందాం .చీకటిని పాతి పెట్టి, వెలుగు లోకి ప్రస్తావన సాగిద్దాం .మన కోసం త్యాగాలు చేసి మన చేతుల్లో  ఉంచిన స్వాతంత్ర ఫలానికి విషం ఎక్క కుండా ,పుచ్చి పురుగులు కారకుండా ,పరి శుభ్రం గా ఉంచి కాపాడి నాణ్యంగా, తాజాగాదాని పోషక విలు వలను సహజం గా పెంచి ,  తర్వాత తరాలకు అందిద్దాం .జై హింద్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-8-12–కాంప్–అమెరికా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా డైరీ శ్రీ కృష్ణాష్టమి వారం

   అమెరికా డైరీ 
                                                  శ్రీ కృష్ణాష్టమి వారం 

ఆగస్టు పది హేడు శుక్రవారం తో శ్రావణ మాసం పూర్తి .పద్దెనిమిది శని వారం నుండి అధిక భాద్ర పద మాసం మొదలై ,సెప్టెంబర్ పదహారు ఆది వారం  వరకు ఉంటుంది .సెప్టెంబర్ పది హేడు సోమ వారం నుండి నిజ భాద్ర పద మాసం ప్రారంభం .వినాయక చవితి సెప్టెంబర్ 19బుధవారం .
6-8-12 సోమ వారం నుండి 12-8-12,ఆది వారం వరకు విశేషాలు –
సోమ వారం నాగ మణి ,భర్త వచ్చి గృహ ప్రవేశానికి ముహూర్తం అడిగితే ముహూర్తాలు అయి పోయాయి కావాలంటే ఆది వారం దశమి బాగుంది చేసుకోండి అని చెప్పాను .బుధ వారం నాడు ఉదయం యేడు యాభై నిమిషాలకు  నేను పెట్టిన ఉహూర్తానికే విజ్జి స్నేహితురాలు దంపతులు వీళ్ళ ఇంటికి దగ్గర కొన్న ఇంటి గృహ ప్రవేశం చేశారు .విజ్జి వెళ్లి వచ్చింది .ఆ అమ్మాయి తల్లి దండ్రి కూడా ఉన్నారు .ఆదివారం సాయంత్రమే వాళ్ళ ఇండియా ప్రయాణం .అందరు ఇంటికి వచ్చి ప్రసాదం స్వీట్లు ఇచ్చి వెళ్లారు .గురు వారం శ్రీ కృష్ణాష్టమి .పెద్దగా హడావిడి ఏమీ లేదు .ఇంట్లో పూజ తప్ప .నెట్ లో ”పార్ధ సారధీ యం ”రాశాను .శుక్ర వారం కూడా అష్టమి మిగులు ఉంది .ఆనాడూ కృష్ణ పూజ చేశాను”భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ” నెట్ లో రాశాను . నారాయణ తీర్ధుల వారి .శ్రీ కృష్ణ లీలా తరంగిణి ని బాల మురళీ కృష్ణ గానం చేసిన సి.డి.వింటూ , ఆ రెండు రోజులు కాలక్షేపం చేశాం .బాగా పాడారు బాల మురళి .

This slideshow requires JavaScript.


 శుక్రవారం భజన 
నాల్గవ శుక్ర వారం ఇంట్లో భజన .రాత్రి ఎనిమిదింటికి ప్రారంభమై తొమ్మిదింటికి పూర్తి . రాహుల్ ,తబలా సత్య ,ఆతని భార్య సౌమ్య మాత్రమె బయటి వాళ్ళు .అందరు వూళ్ళకు వెల్ల టం తో ఎవరూ రాలేదు .భజన తర్వాతా భోజనం .అన్నం ,పాతోలి ,కొబ్బరి చట్ని ,సమోసాలు ,సేమ్యా పాయసం ,రసం ,పెరుగు,విందు .
 బాలాజీ అభిషేకం -విందు 
independence road  దగ్గర లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ ) కి రమేష్ మంజుల దంపతులు అభిషేకం చేయించి ,స్వాముల వారలకు నూతన వస్త్రాలను సమర్పించే కార్య క్రమానికి ఆహ్వానిస్తే ,శని వారం ఉదయం పదింటికి అందరం వెళ్ళాం .అక్కడి పూజార్లు అభిషేకం నిర్వహించి వీళ్ళు సమర్పించిన నూత్న వస్త్రాలను స్వాములకు కట్టారు .ఆ తర్వాతా పూజ నిర్వ హించారు .ప్రక్కనే ఉన్న హాల్ లో విందు ఏర్పాటు చేశారు .దాదాపు 80మంది హాజరయ్యారు .అయిదు రకాల స్వీట్లు ,మూడు రకాల పులిహోరలు ,కొబ్బరన్నం ,సాతాళించిన సెనగలు ,పెరుగన్నం తో పసందైన విందు .అన్నీ బాగా ఉన్నాయి .రమేష్ దంపతులు మేము వచ్చి నందుకు చాలా ఆనందించారు .కావాలని మాతో ఫోటోలు దిగారు .ఇంటికి వచ్చే సరికి మధ్యాహ్నం మూడు అయింది .ఇక్కడికి అరగంట పైనే కారు ప్రయాణం
                  కానుకల ”విరిజల్లు ”
కాలి ఫోర్నియా లో ఉన్న ”విరి జల్లు ”రేడియో  కిరణ్ ప్రభ అనే ఆయన ,విజయా ఆసూరి అనే ఆమె లతో మంచి రేడియో కార్య క్రమాలను నిర్వ హిస్తూఉంటారు .ఇద్దరు శ్రోతలను అద్భుతం గా తమ విశేషఅను భవాలతో రంజింప జేస్తారు .అది లైవ్ గా ప్రతి శుక్ర వారం రాత్రి, శని వారం ఉదయం నిర్వ హిస్తారు వారిద్దరూ .దానికి మంచి స్పందన శ్రోతల నుంచి ఉంటుంది .సుమారు నెల క్రిందట సినీ నటుడు ,నిర్మాత ,దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు పండగ ను ”విరి జల్లు ”లో నిర్వ  హించారు .వాళ్ళు అందులో ఒక ప్రశ్న అడిగారు .కృష్ణ నటించిన సిని మాలలో మీ కు నచ్చిన మూడు పాటలను ప్రాధాన్యత ను బట్టి చెప్పమని ఆడిగారు .మా అమ్మాయి సహాయం తో నేను ఫోన్ లో మాట్లాడి నాకు నచ్చిన మూడు పాటలను -మొదటి పాట గా అల్లూరి సీతా రామ రాజు సినిమా లో శ్రీ శ్రీ రాసిన ”తెలుగు వీర లేవరా ”పాటను ,రెండో దానిగా –”తేనె మనసులు ”అనే కృష్ణ మొట్టమొదటి సినిమా లోని ”దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమీ నీవై ”అన్న పాటను -మూడవ దానిగా ‘శ్రీ రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ”సినిమాలోని కృష్ణ శాస్త్రి గారు  రచించిన ”రాకోయి అనుకోని అతిధి ”పాటను చెప్పాను .నాదే ”ఆఖరి కాల్ ” నా సమాధానం అవగానే విజయా ఆసూరి .కిరణ్ ప్రభ గార్లిద్దరు కలిసి ”awsome ,awsome ”అని నన్ను అభి నందించి కార్య క్రమం లో చివర్లో నాకు గిఫ్ట్(కానుక )ప్రకటించారు .సాధారణం గా కానుక అంటే కాలిఫోర్నియా లో సినెమా హాళ్ళకు వెళ్ళటానికి సినెమా టికెట్లో ,లేక హోటల్ భోజనానికి కూపన్ లో ఇస్తూన్తారట .మేమున్నది నార్త్ కెరొలినా లో షార్లెట్లో .కనుక మాకు అవి ఎందుకు పనికి రావు .ఈ విషయం మా అమ్మాయి వాళ్లకు మెయిల్ రాస్తూ  ఇంకేదైనా ఉప యోగకర మైనది కానుక గాపంపమని తెలియ జేసింది .వాళ్ళిద్దరూ వెంటనే స్పందించి మీ నాన్న గారికి చాలా ఇష్టమైన కానుకలనే పంపుతున్నాం అని తెలియ జేశారు .
ఈ శని వారం సాయంత్రం పోస్ట్ లో నా పేర రెండు కానుకలు ”విరిజల్లు ”నుండి కురిశాయి .ఒకటి ”మహా మంత్రి తిమ్మరుసు ”సినిమా d.v.d.,రెండోదిఆచార్య  శ్రీ ముది గొండ శివ ప్రసాద్ రచించిన చారిత్రాత్మక నవల ”పట్టాభి ”.మొదటి దాని ఖరీదేంతో నాకు తెలీదు కాని, ఈ నవల ఖరీదు 500రూపాయలు .(50డాలర్లు )ఈ నవలకొక ప్రత్యేకత ఉంది .కృష్ణా ,గుంటూరు సీమలను పరి పాలించిన కమ్మ ప్రభువు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలన కాలం లోని సాంఘిక ఇతి వృత్తం తో కూడిన నవల .ఇంత వరకు కమ్మ ప్రభువుల కాలాన్ని ఇతి వృత్తం గా తీసుకొని నవల రాయలేదు .శివ ప్రసాద్ ఆ కీర్తిని దక్కించు కొన్నారు .ఆయన ఇప్పటికి 70 నవలలు రాశారు .చారిత్రాత్మక నవలలు రాయటం లో నోరి నరసింహ శాస్త్రి విశ్వనాధ ల తర్వాతి స్తానం వీరిదే .ఆయన్ను చాలా సందర్భాలలో చూశాను .మాట్లాడను .ఆయన భారతీయ సాహిత్యాన్ని ,సంస్కృతిని ఆపోశన పట్టిన మహాను భావుడు. వెంకటాద్రి నాయుడు మన కృష్ణ దేవ రాయలంతటి గొప్ప రాజు .అయన రాజధాని అమరావతి .రాజ భవనం పేరు చైత్ర రధం .దర్బారు పేరు సుధర్మ .ఆయన ఆస్థాన మంత్రి ములుగు పాపయారాధ్యుల వారుఎన్నో గ్రంధాలను రచించిన పండిత కవులు .అయితే రాజా గారికి దేన్నీ అన్కితమివ్వని అభిమాన ధనులు . ..వీరికి బాలా త్రిపుర సుందరి అమ్మ వారు పిలిస్తే పలికేది .రాజా వారు .108శివాలయాలు నిర్మించారు .మంగళ గిరి నరసింహస్వామి ఆలయానికి 875అడుగుల ఎత్తైన గాలి గోపురం కట్టించారు .తిరునాళ్ళ రోజుల్లో గోపురం ఎక్కి వెండి నాణాలను భక్తులపై చల్లే వారట .అవి ప్రజల తల పాగాలలో పడేవి .రాజా గారి ఏనుగులు ,గుర్రాల మీద తను కాని ఎవరైనా వెళ్తుంటే గురువు పాపయారాధ్యుల వారి ఇల్లే తమ కంటే ఎత్తు లో ఉండాలని వారి ఇంటి అరుగులను చాలా ఎత్తు గా కట్టించిన భక్తుదు నాయుడు. ఆయన సాహితీ ప్రియుడు .శత్రువుల పట్ల నిరంకుశుడు .ఎన్నో ప్రాచీన అముద్రితతాళ పత్ర  గ్రంధాలను సేకరించి  ,పరిష్కరింప జేసి మళ్ళీ రాయించాడు .అలాంటి మహనీయుని కాలానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను నవలలో పొందు పరచి రాశారు శివ ప్రసాద్ .
మహా మంత్రి తిమ్మరుసు మనకు తెలిసిన మహనీయుడు .రాయలకు తిమ్మరుసు ఎంతో ,నాయుడికి ములుగు వారు అంత .తిమ్మ రుసు సినిమా ఒక” క్లాసిక్ ”.పెండ్యాల వారి సంగీతం పింగళి రచన కమలా కర వారి దర్శకత్వం రామా రావు గుమ్మడి ల నటనా వైదుష్యం తో విజయ నగర చరిత్రను మన కళ్ళ ముందు ఉంచు తుంది .ఇలా రెండు చారిత్రాత్మక కానుక లను నేను చెప్పిన ”రెండు నిమిషాల”సమాధా నికి రావటం నాకు మహదానందం గా ఉంది .ఈ కానుకలు ”సరస భారతి ”పొందిన గౌరవం గా భావిస్తున్నాను .ఇంత మంచి కానుకలు పంపి నందుకు ”విరిజల్లు ”కు కృతజ్ఞతలు తెలుపుతూ మెయిల్ రాశాను .
2011జనవరి లో విజయ వాడ సిద్దార్ధ కాలేజి లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ,అమెరికా లోని ”తానా ”సంస్థ సంయుక్త ఆధ్వర్యం లో నిర్వ హించిన ”తెలుగు సంస్కృతి ”అనే రెండు రోజుల కార్య క్రమలో నేనూ పాల్గొన్నాను .దానికోసం తెస్తున్న ప్రత్యెక సంచిక కోసం నన్ను ”మారుతున్న విలువలు ”అనే అంశం పై ఆర్టికల్ రాయమని అడిగితే రాసి ఆ సమావేశం లో ప్రసంగించాను .అమెరికా నుండి విజయ ఆసూరి కూడా వచ్చి రెండు రోజుల సభలో పాల్గొన్నారు .ఆవిడ వస్తున్నట్లు మా అమ్మాయి నాకు చెప్పి పరి చయంచేసుకో మంటే  చేసుకొన్నాను .ఆవిడ మా అమ్మాయి విజయ లక్ష్మి ని ”ఝాన్సీ ”అని సరదా గా పిలుస్తుందట .ఆ పేరు తోనే నేను పరిచయం చేసుకొన్నాను ”ఝాన్సి నాన్న  గారిని ”అని. ఆమె ఎంతో సంతోషించి ,నాతో  ఫోటోలు తీసుకోంది .ఆ వ్యాసం ప్రత్యెక సంచిక లో ముద్రిత మైంది .ఇప్పుడు ఇవి జ్ఞాపకం వచ్చాయి .
  గృహ ప్రవేశ పౌరోహిత్యం 
ఇక్కడి మా అమ్మాయి స్నేహితురాలు నాగమణి వాళ్ళ కొత్త ఇంటి గృహ ప్రవేశం నేనే చేయించాలని కోరారు .ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నేను పెట్టిన ముహూర్తానికి నేనే పౌరోహిత్యం వహించి చేయించాను .దంపతులు సంతోషించారు .ఆవిడే ఇక్కడి ”టోరి” రేడియో ప్రోగ్రాం లో నన్ను ఇంటర్ వ్యూ చేసి ”ఊసుల్లో ఉయ్యూరు ”చెప్పించింది .ఇవీ ఈవారం కదా ,కమా మీషూనూ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-8-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మన కాల్డ్ వెల్ కన్ను మూసాడు – ఈనాడు లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మ్యూజిక్ మెజీషియన్- మొజార్ట్ -2

 మ్యూజిక్ మెజీషియన్- మొజార్ట్ -2
                                                      అన్వేషణ  

ఎందుకో తన పుట్టిన ఊరు సాల్జ్ బర్గ్ పై మోజు లేదు మొజార్ట్ కు .తండ్రి లాగే ఆ కొలువు లో ఉంటె ఏదుగు బొదుగు ఉండదని తలచాడు .తన సత్తా నిరూపించు కోవాలనే ధృఢ సంకల్పం కలిగింది కొన్ని నెలలలో డజను కు పైగా సిమ్ఫనీలు రాశాడు .ఇతర చోట్ల అదృష్టాన్ని పరీక్షించు కోవాలను కొన్నాడు .తండ్రి తో కలిసి మ్యూనిచ్ చేరాడు .అక్కడ ”the pretend gardener ”అనే ఒపేరా రాశాడు .ఆ తరువాత నాలుగు కాన్సర్తోలుపియానో కోసం , అయిదు వయోలిన్ కోసం రాశాడు .వాయిద్యాల తో సోలో నిర్వహించే దాన్ని కాన్సర్తో అంటారు .1777ముందే కొలువు చాలించాడు .ఆనాటి రోజుల్లో ఆర్చి బిషప్పులు ,ధనికులు ,సంపన్న వర్గాల వారు సంగీత కారుల్ని తమ దగ్గర ఉంచుకొని పోషించే వారు .యూరప్ వెళ్లాలని వోల్ఫాంగ్ అనుకొన్నాడు .తండ్రికి కూడా వెంట వెళ్లాలని ఉంది .పర్మిషన్ అడిగాడు ఇక కొలువు లోకి రానక్కర లేదనుకొంటే వెల్ల మన్నాడుఅర్చిబిషప్ .తల్లిని తీసుకొని యాత్ర కు బయల్దేరాడు .
తల్లి కొడుకు మ్యూనిచ్ చేరారు .అక్కడ తల్లిని ఒక ఇంట్లో ఉంచి ప్రయత్నాలు చేశాడు .ప్రేమ లోను పడ్డాడు .పారిస్ వెళ్లాడు .తల్లి కూడా వెంట ఉంది .ఆమె ఒంటరిగా కిటికీ లేని ఇంట్లో ఉండటం తో జబ్బు చేసి చని పోయింది .చేతిలో డబ్బు అయి పోతోంది .కొత్త అవకాశాలేవీ రావటం లేదు .అక్కడ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు .తిరిగి తండ్రిని చేరాడు .మళ్ళీ బిషప్ గారి కొలువు తప్ప లేదు .అయిష్టం గానే చేరాడు .దర్బారు ఆర్గానిస్ట్ గా చేరాడు .కాన్సేర్ట్ మాస్టర్ గా సంపాదించిన దానికంటే మూడు రెట్లు సంపాదన వస్తోంది .అక్కడ పని చేస్తూనే ,దృష్టిని ఇతరాల వైపు కు మరల్చాడు .సింఫనీ లకు రాయటం ప్రారంభించాడు .అక్కతో కలిసి ఆడాడు .మ్యూనిచ్ కార్నివాల్ కు” idomeneo ”రాశాడు .అది అతని మొదటి గొప్ప ఒపేరా అని అందరు మెచ్చారు .
బిషప్ కొలువు నరకం అని పించింది .వియన్నా రమ్మని బిషప్ ఆజ్న జారీ చేశాడు .అక్కడ జోసఫ్ గారి కోసం రాత్రి ,పగలు కష్టపడి కచేరీలు చేశాడు .చాకిరి ఎక్కువ, రాబడి తక్కువ .అతన్ని చాలా నీచం గా చూశాడు .సేవకుల తో పాటు కూర్చో పెట్టి తిండి పెట్టటం సహించ లేక పోయాడు .వండే వారి సరసన కాకుండా కొంచెం ఎక్కువ స్తాయి వారి తో కూచో బెట్టారని జోకు చేశాడు .ఆర్చి బిషప్ కొలరేడో ఇతన్ని” స్కౌంద్రేల్ అని రోగ్” అనీ తిట్టే వాడు .భరించ లేక ఉద్యోగం వదిలేశాడు .
అలోశియా అనే అమ్మాయిని ప్రేమించి ,ఆమెకిష్టం లేక పోతే చెల్లెలు కాం స్టాన్ జే ను పెళ్ళాడాడు .1782 లో వోల్ఫాంగ్ కామిక్ ఒపేరా ను జోసెఫ్ చూసి ”ఇందులో చాలా గమకాలున్నాయి ”అన్నాడు .కాని ప్రజలు మెచ్చారు .ఏదో అడపా దడపా కచేరీలే తప్ప స్తిర ఆదాయం లేకుండా పోయింది .తన కలలు సాకారం అయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు .అన్వేషణ అనంతం గా సాగుతోంది
                  విషాదం  తో విషాదాంతం
1791 లో 36వ ఏట భార్య తో కలిసి ప్రేగ్ వెళ్లాలని భావించాడు .అప్పటికే the marriage of figaro ,don giovani అనే రెండు అద్భుత ఒపెరాలు రాసి  ప్రదర్శించాడు .అవి అంత వరకు చరిత్ర లో ఎవరూ రాయనంత గొప్పవి అని విశ్లేషకులు మెచ్చారు .అయితే వాటి వల్ల డబ్బులు రాలలేదు .సరస్వతీ ప్రసన్నమే కాని, లక్ష్మీ ప్రసన్నం కాలేదు .చాలా నిరాశ పడ్డాడు పూట గడవని పరిస్తితి లో సంగీత శిఖరారోహకుడు ఉన్నాడు .విధి బలీయం .వియన్నా లో సంగీత క్లాసులు చెప్పుకుంటూ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవలసి వచ్చింది పాపం ఆ సంగీత సరస్వతికి .చివరికి నియన్నా దర్బారు లో చేంబర్ కంపోసర్ గా ఉద్యోగం లభించింది .అది చాలా  ఉన్నత మైన గౌరవ పదవే, కాని డబ్బు రాలేది కాదు .
1791లో కొత్తఅ వకాశాలు వచ్చాయి .”the magic flute ”అనే కామిక్ ఒపేరా కు రాశాడు అందులో మాట్లాడే మాటల తో పాటు పాటలు కూడా ఉండేట్లు రాశాడు .అది మోజానిక్ ఉత్స వాళ రహస్యాలను తెలియ జేసేది .అందులోని సిద్ధాంతం ప్రకారం చావు తో శిక్ష పడుతుంది .అందుకని మాజన్లు మొజార్టు కు విష ప్రయోగం చేశారని భావించారు .దీనితో ఆయన చాలా నెలలు జబ్బు పడ్డాడు .కాళ్ళు ఉబ్బాయి .వోల్ఫాంగు ను ఒక ”శవ యాత్ర ”(ఫనేరాల్ )లో చేసే మాస్ ప్రదర్శన కు,రాయమని అడిగారు . దానికి ఇచ్చే ప్రతిఫలం చాలా ఎక్కువ. అత్యధిక పారితోషికం  ఇస్తామని వాగ్దానం చేశారు .వియన్నా నోబుల్ అధికారి భార్య చని పోయింది .ఆమే కోసమే ఇది .దానికోసం ,ఇతర కార్యక్రమాల కోసం ఇరవై నాలుగు గంటలూ కష్టపడి సంగీతం సమకూర్చాడు .ప్రేగ్ లో రాజు గారి పట్టాభి షెకానికి వెళ్లి వచ్చిన తరువాత రాస్తాను అని . requiem రాయమని అడిగిన వారికి చెప్పాడు .సెప్టెంబర్ లోవియన్నా లో the magic flute ప్రీమియర్ షో వేశారు .  కొన్ని వారాల తర్వాతాతీవ్రం గా జబ్బు చేసింది .100 ప్రదర్శనలు పొంది వియన్నా లో రికార్డు సృష్టించింది .అయితే వందో ప్రదర్శన చూసే భాగ్యం మన సంగీత మహారాజుకు లభించ లేదు .” requiem ” ను అనుకొన్న సమయం లో పూర్తీ చేయటానికి శక్తి యుక్తులన్నీ ధార పోశాడు .”చని పోయిన వారి కోసం సంగీత విభావరి చేయటం మోజార్టు చావుకు వచ్చింది ”.
అందులోని ఎనిమిది భాగాలకు సంగీతాన్ని సమ కూర్చాడు .డిసెంబర్ నాలుగు న ఆయన చేతులు రెండు  వాచీ పోయి ,నీరు పట్టి కలం పట్టుకో లేక పొయాయి .తన శిష్యుడు ఫ్రాంజ్ సుష్మీర్ సాయంతో ఆ మహత్తర విషాదాంత సంగీత స్వర సమ్మేళనాన్ని పూర్తీ చేశాడు ఆ స్వర బ్రహ్మ .ఆ రాత్రి ఒంటి గంటకు ఆ సంగీత స్రష్ట ఊపిరి అనంత వాయువుల్లో కలిసి పోయింది .అప్పటికి మోజార్టు వయస్సు 35 ఏళ్ళు.మాత్రమె .అప్పటికే ఆయన సంగీత స్వరాలతో అలరించిన రచనలు 600  పైనే ఉన్నాయి .కాని సరైన  గౌరవ ప్రద మైన అంత్యక్రియలు చేయ టానికి ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేక పోవటం అత్యంత విషాదకరం .ఆ మహా సంగీత విద్వాంసుడి శరీరాన్ని సామాన్య జనాన్ని సమాధి చేసే చోటే భూస్తాపితం చేశారు .ఇది అత్యంత దుర ద్రుష్టకర మైన సంఘటన .
కొంత మంది కి బ్రతికి ఉన్నంత వరకు కీర్తి రాదు .చని పోయిన తరువాతే కీర్తి వచ్చి మీద పడుతుంది అదే జరిగింది ఈయనకు .ఆయన మరణ దినాన్ని ఈ నాడు ప్రపంచం అంతటా మిలియన్ల మంది భక్తీ తో శ్రద్ధ తో జరుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు .హాలీవుడ్ ,పాప్ సంగీత కారులు మోజార్టు ను విపరీతం గా గౌరవిస్తున్నారు .” amadeus ”..పేరా హాలీ వుడ్ లో సినిమా తీశారు .అందులో ఆయనకు ,సలేరీ కి ఉన్న సంగీత స్పర్ధను హైలైట్ చేశారు .అంతటి సంగీత ప్రతిభా వంతునికి భగ వంతుడు అన్యాయం చేశాడని వాపోతారు సంగీతాభి మానులు .ఆ సినీమాఉత్తమ చిత్రం గా  ఆస్కార్ అవార్డు పొందింది .sallieri యే మోజార్టు ను పాశవికం గా విష ప్రయోగం చేసి చంపించాడని అంటారు .2002 september 11న న్యూయార్కు నగరం మీద తీవ్ర వాదులు దాడి చేసి చేసి నపుడు ప్రపంచ ప్రజలంతా మ్యూజిక్ మజీషియన్ మోజార్టు ను జ్ఞప్తికి తెచ్చు కొన్నారు .వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఆర్కెస్ట్రా తో లక్షలాది మంది వింటూ చూస్తుండగా మోజార్ట్ట్ట్ స్వర పరచిన  ”rolling requiem ”ఒక రోజంతా ఆలపించి శ్రద్ధాంజలి ఘటించారు .
                    మొజార్ట్ ప్రతిభా సమాలోచనం
” మిరకిల్ చైల్డ్” అని ప్రశంసలు పొంది ,ఇవాల్టి” పాప్ స్టార్” లకు ఆదర్శమై ,వయోలిన్ లోని అన్ని టేక్నిక్కులను ప్రయోగించి ,స్వయం గా అన్నీ సాధించి, యే గురువు దగ్గరా శిష్యరికం చేయకుండా ,మేధావి ,జీనియస్ అని పించుకొన్న వాడు మొజార్ట్.ఆధునిక డిస్క్ జాకీ లా ,చిన్న తనం లోనే ఇతర విద్వాంసుల రచన లన్ని తన రచనలో మేళ వించాడు .పన్నెండు ఎల్లప్పుడే  స్వయం గా ఒపేరా రాశాడు .ఆ రోజుల్లో వాడుక లో ఉన్న సర్వ వాయిద్యాలను వాయించి అన్నిట్లోనూ ”మాస్టర్” అని పించుకొన్నాడు .హార్ప్సి కార్డ్ ,పియానో ,వయోలిన్ తో పాటు స్వంత స్వరం తో అద్భుత సంగీతాన్ని విని పించాడు .తన కంటే వయసు లో పెద్ద వారైన సంగీత కారుల కంటేవిద్వత్తు లో  ముందున్నాడు ,అంతా స్వయం గా సాధించిందే .డబ్బు ఎంత ఎక్కువ గా సంపాదించాడో అంత విచ్చల విడి గా ఖర్చు చేసి దెబ్బ తిన్నాడు .అతని ప్రాభవం అంతా ఆయనకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకే .ఆ తర్వాత ఆ సంగీత ధార కుంటు పడింది .ఆరేళ్ళ వయసు లోనే యూరప్ లో ఆరాధనీయ్డైనాడు .ఇరవై ఆరేళ్ళ వయసు లో దాన్ని నిలుపు కోలేక పోయాడు .అతని లోని సంగీత జ్వాల కొద్దికాలమే భగ భాగ మండి,క్రమంగా వెలుగు తగ్గింది .ఆ కాలమే ఆయనకు శిఖరారోహణ కాలం .ముప్ఫై అయిదేల్లకే తనువు చాలించిన దురదృష్ట వంతుడు .బాల్యం లో కీర్తి ,ప్రతిభ చూపిన ఆయన్ను ,వయసు లో ఎవరూ పట్టించు కోలేదు .”భగవంతునికి ప్రియమైన వాడు” –”Amadeus ”అని పిలిపించుకొన్న వోల్ఫాంగ్ మో జార్ట్ అమర సంగీతం- రసజ్న లోకాన్ని ప్రభావితం చేసింది . మహనీయ సంగీత విద్వాంసుడుఅని పించుకొన్నాడు . .జర్మని కి చెందిన  బీథోవెన్ అనే సింఫనీ కారునికి కు రెండు వారాలువియన్నా లో సంగీతం నేర్పి ,ఆ తర్వాత ”ఈ కుర్రాడు కొద్ది రోజుల్లో ఉజ్వలం గా ప్రకాశిస్తాడు చూస్తూండండి ”  అనిబీథోవెన్ ప్రతిభ ను అంచనా వేసి  తన శిష్యులకు తెలియ బరచిన సంగీత మర్మజ్నుడు మొజార్ట్ .రెండు మూడు రకాల మాధుర్యాలను మేళ వించి కొత్త అందమైన రుచి మంత మైన అధిక మాదుర్య  విలసిత మైన భావాలను”-అంటే ”-కౌంటర్ పాయింట్ ”ను  సృష్టించిన సంగీత స్రష్ట మొజార్ట్ అమర రహే .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged , | 2 Comments

మ్యూజిక్ మజీషియన్ మొజార్ట్ –1

 మ్యూజిక్ మజీషియన్ మొజార్ట్  –1
జెర్మనీ దేశపు సంగీతానికి చిర యశస్సు ను సాధించి పెట్ట్టిన ఎందరో సంగీత కారులున్నారు .వారిని చిరస్మరణీయులు గా భావిస్తారు .క్లాసికల్ విదానాన్నుంచి రొమాంటిక్ సంగీతానికి బాటలు వేసి ప్రపంచ దేశాలన్నిటి లోను అభిమానాన్ని సంపాదించి ”త్రీ బి’అని పించుకొన్నారు ముగ్గురు మహనీయులు .వారే బాచ్ ,బ్రాహ్మస్,బీథోవెన్ లు .వీరిని సంగీత త్రయం అన వచ్చు . వీరిలో బీథోవెన్ అందరి కంటే సింఫనీ సంగీతానికి ఎన్నో మెరుగులు దిద్ది ,సంగీతం లో ఎన్నో అద్భుతాలను సాధించి ”మూన్ లైట్ సొనాటా ”తో హృదయాలను పులకరింప జేసినా వాడు బీథోవెన్ .అలాంటి బీథోవెన్ కే గురువు-జోహాన్నెస్ క్రిస్తోమోస్  వోల్ఫాం,గ్గొట్టిలీబ్  మొజార్ట్ .బాల మేధావి గా ఆయన సాధించిన కీర్తి అజరామర మై నిలి చింది .సంగీతాన్ని ఒక మాజిక్ లా,శ్రోతలను  మంత్ర ముగ్ధుల్నిచేసిన మొ జార్ట్ర్ట్ గురించి మనం తెలుసుకో బోతున్నాం  .ఆయన్ను వోల్ఫాంగ్ అనీ ,మొజార్ట్ అనీ పిలుస్తారు .
             బాల్య జీవితం
వోల్ఫాంగ్ మొజార్ట్ అమేయ మేధా సంపన్నుడు .తండ్రిలీ పోల్ద్  గౌరవం గా సంగీత పాథాలు చెప్పి జీవితం గడుపే వాడు .ఆయన వయోలిన్ టెక్నిక్కు ల మీద పుస్తకాన్ని కూడా రాశాడు .వీరి కుటుంబం ఈ నాటి ఆస్ట్రియా లో ని సాల్జ్ బర్గ్ లో ఉండేది .తండ్రికి పుట్ట్టిన ఏడుగురు సంతానం లో మోజార్టే చివరి వాడు .ఇతని జననం1756. ఇతని అక్క” మారియా అన్నా ”కు తండ్రి సంగీతాన్ని నేర్పాడు .ఆయన సాల్జ్ బుర్గ్ లోని ఆర్చి బిషప్ దగ్గర వయోలనిస్ట్ .తర్వాతా సహాయ సంగీత దర్శకు దైనాడు .మంచి పేరున్న వాడు .అక్క హార్ప్ కార్డ్ ప్లేయర్ .అదొక తమాషా వాయిద్యం .అందులో పియానో ,హార్ప్ ల కూర్పు ఉంటుంది .ఇతనికి ఎవరు సంగీతం నేర్ప లేదు .విని కిడి తో వచ్చింది . అక్క నేర్చు కొంటుంటే సంగీతం ఇతనికి వచ్చింది .అంతే ,ఆమె లాగా నె వాయించేవాడు .అందరికి ఆశ్చర్యమేసింది .దైవ దత్తుడు బాల మేధావి అని అందరు భావించారు .మూడేళ్ళ వయస్సు నాదే విన్నది అంతా వాయించి చూపే వాడు .అయిదేల్లకే పేపర్ మీద ఏదేదో రాసే వాడు .ఏమి రాస్తున్నా వాణి తండ్రి అడిగితే ”కీ బోర్ద్ కన్సార్తో ”అని తక్కున సమాధానం చెప్పాడు .తండ్రికి నమ్మకం కలుగక వచ్చి చూస్తె నిజం గానే ఆ పని చేస్తున్నాడని తెలిసింది .”అయి పోవచ్చింది చివర్లో ఉన్నానని ఆ బాల మేధావి సమాధానం ”విని తన కొడుకు అఘటన ఘటనా సమర్ధుడు అనుకొన్నారు తల్లీ దండ్రీ .నిజం గా చెప్పా లంటే అప్పటికి ఇంకా అతని పేరు కూడా రాసుకోవటం రాని వయసు .
            సంచార జీవితం
కొడుకు తెలివి తేటలకు మురిసిన తండ్రి అతని తో సంగీత కచేరీలు చేయించి డబ్బు సంపాదించ వచ్చు నని భావించాడు .ఆర్చి బిషప్ అను మతి తీసుకొని మ్యూనిచ్ ,వియన్నా లకు1703 లో  కుటుంబం తో  వెళ్లాడు .ఈ చిన్నారు లతో ఫ్రెంచి రాజు ,రాణి ల సమక్షం లో దర్బారు లో కచేరి చేయించాడు ట.తర్వాతా ఇంగ్లీష్ చానెల్ దాటి ,లండన్ చేరారు .ఫ్రాన్సులోని పారిస్ చేరి అన్ని చోట్లా ప్రదర్శన లిప్పించాడు కూతురు ,కొడుకు ల తో .దాదాపు మూడున్నర ఏళ్ళు ఇలా వివిధ దేశాలు సంచారం చేసి మళ్ళీ1766 కు స్వగ్రామం చేరింది కుటుంబం .వెళ్ళిన ప్రతి చోటా ఏదో ఒక బహుమతి పొందారు అక్కా ,తమ్ముడూ .బంగారు నాణాలు గడియారాలు ,వెండి పొడుం డబ్బాలు అనేకం కానుకలుగా వచ్చాయి .మంచి విలువైన దుస్తులను బాల మేధావి ఒళ్ఫాంగ్ కు లభించాయి చిన్న ఖడ్గం కూడా కానుక గా లభించింది .కోతులను ఆడించి నట్లు ఈ పిల్లల్లిద్దర్నీ ఆడించి తండ్రి సొమ్ము చేసుకొన్నాడు .లండన్ లో ఉండగా మొజార్ట్ కు” జోహాన్ క్రిస్టియన్ బాచ్” అనే గొప్ప సంగీత కారుని తో పరిచయం కలిగింది .ఆయన అప్పటికే లండన్ లో గొప్ప పొందిన సంగీత వేత్త .
                        యువ కిశోరం
తొమ్మిది నెలలు ఇంటి వద్ద గడిపి తండ్రి మళ్ళీ యాత్ర చేబట్టాడు .వియన్నా కు ఒక పెళ్ళికి వెళ్లగా అక్కడ మసూచికం బాగా ప్రబలి ఉండటం గమనించి ఇంటికి తిరిగి వచ్చారు .యువకుడైనప్పటి నుండి  ఒంటరి తనం తో బాధ పడే వాడు .కొమ్ములు తిరిగిన సంగీత కారుల తో సమానం గా వాయిద్యాలు వాయించే వాడు .ఇప్పుడు దృష్టి అంతా కపోసింగ్ మీద కు మరలింది .ఆ నాటి ప్రసిద్దు లైన సంగీత కారుల పోకడలను అనుకరించి సంగీతం కూర్చే వాడు .తరువాత తన స్వంత బాణీ ని ఏర్పరచుకొని ,విభిన్న కళా కారుడైనాడు .పన్నెండేళ్ళ  వయసు లో ద్రుష్టి ”ఒపేరా ”మీదకు వెళ్ళింది .ఒపేరా అంటే అందులోని పాత్రలన్నీ లేక కొన్ని తమ మాటలను పాటల రూపం లో సంగీతం గా విని పించే ఒక ప్రక్రియ .ఇదే నేటి మోడరన్ మ్యూజికల్స్ .అందులో భావావేశాలు నాటకీయత సమ్మిలిత మై అందర్నీ ఆకర్షిస్తాయి మోజార్టు కాలం లో అది ఉత్కృష్ట స్తితి లో ఉండేది .అతను చాలా ఒపేరా లను చూసి అందులోని లోతు పాతుల్ని అధ్యయనం చేశాడు .అతనికి ప్లస్ పాయింటు అతని  స్వరం .మంచి స్థాయి లో పాడే నైపుణ్యం ఆయనది .నోట్ ను వినాల్సిన అవసరం లేకుండా నె పాడగలిగే వాడు .
”  the pretend simple ton” అనే ఒపేరా ను 1768 లో వియన్నా లో ఉండగానే రాశాడు .అందరు విని ఆశ్చర్య పోయారు .అసూయ తో కొందరు దాని ప్రదర్శన ను ఒక ఏడాది వాయిదా వేయించారు .ఫ్రాంజ్ అంతాన్ అనే అతను తన కోసం ఒక ఒపేరా రాయించు కొన్నాడు .దాన్ని1768  అక్టోబర్ ఒకటి న మేస్మేర్ ధియేటర్ లో ప్రదర్శించారు .అప్పటికే ఒక హీరో స్తాయి అందుకొన్నాడు మొజార్ట్ .అతని ప్రతిభ కు Amadeus అనే బిరుదు వచ్చింది అంటే ”భగవంతునికిష్టమైన వాడు ”అని అర్ధం .నాల్గవ పోపు క్లిమేంట్ – knight of the golden spur ”అనే అరుదైన పురస్కారాన్ని ప్రదానం చేసి గౌర వించాడు .అంత చిన్న వయసు లో అంతటి గౌరవాన్ని పొందిన వారెవరూ లేరు .bologna అనే ఇటాలియన్ టౌన్ లో అతన్ని పరీక్ష కు పెట్టారు .ఒక గదిలో ఒంటరి గా ఉంచి అతి కష్ట మైన స్వర సమ్మేళనాన్ని చేయమని సవాలు విసిరారు .ఈ పరీక్ష ఇరవై ఏళ్ళు నిండిన వారికే పెట్టటం ఆచారం .కాని ఈ బాల మేధావి 14 ఏళ్లకే పరీక్షలో పాల్గొన్నాడు .ఒక గంట లో తనకిచ్చిన దాన్ని పూర్తీ చేసి ,సరదా గా బయటికి వచ్చేశాడు .అతను పరీక్ష పాస్ అయాడు .తండ్రి ,కొడుకుల ఉద్యోగాలు పోవటం తో మళ్ళీ స్వంత ఊరు చేరారు .ఏమైనా వియన్నా లో గౌరవం సాధించాలి అని మొజార్ట్ మనసు లో స్తిరం గా భావించాడు .
సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా రుషి -హెన్రీ డేవిడ్ థోరో

  అమెరికా రుషి -హెన్రీ డేవిడ్ థోరో 
ఆయన ప్రకృతి ప్రియుడు .ప్రకృతి లో అందాలను అనుక్షణం ఆస్వాదించే సత్యా న్వేషి .సకల మానవాభ్యుదయాన్ని కోరే వాడు .మనసు పరి పక్వత సాధించుకొన్న వాడు .బహుజన హితాయ ,బహుజన సుఖాయ అని నమ్మి సంఘ సేవ చేశాడు .అక్షరాన్ని పరమ పూజ నీయం గా భావించి ,అక్షరార్చన చేసిన వాడు .సాధారణ జీవితాన్ని గడిపి ,ఉదాత్త భావాలను వ్యాప్తి చేసిన వాడు .ఉన్నత విలువలకు కట్టు బడిన వాడు .జనం లో జనార్దనుడిని దర్శించిన వాడు .ఆనాటి మహార్స్షుల లాగా అరణ్య మధ్య భా గాన కుటీరం నిర్మించుకొని ఏకాంత వాసం గడిపిన వాడు .ఎందరికో ఆదర్శం ,ప్రేరణ .ఆయన గడ్డం ,ముఖ వర్చస్సు ,కళ్ళల్లో కాంతి రేఖలు గమనిస్తే ఆధునిక రుషి పుంగ వుడు అని . పిస్తాడు .ఆయనే the hermit of America అని పిలువ బడ్డ హెన్రీ డేవిడ్ థోరో.
అమెరికా లోని మాసా చూసేత్స్ రాష్ట్రం లో కాన్కార్డ్ లో జన్మించిన కారణ జన్ముడు .ఆ ప్రాంతం లోని ప్రతి పురుగు ,పుట్టా ,పిట్టా,గుట్టా  పండు ,పువ్వు ,కాయ ఆకు ,ఆలమ  అన్నీ క్షుణ్ణం గా తెలిసిన వాడు . ప్రజా హితం చేయని ప్రభుత్వాన్ని నిల దీసిన వాడు .తాను చేసి ,ప్రజల చేత ”సహాయ నిరాకరణం ”చేయించిన వాడు .ప్రభుత్వ న్యాయం కంటే పైన ఒక న్యాయం ఉందని ,అదే ఆత్మ ప్రబోధమని ,ఈ రెండిటికి వైరుధ్యం ఏర్పడినపుడు ,అంతరంగ ప్రబోదానికే కట్టు బడి ఉండాలని తెలియ జెప్పాడు .అహింసా మార్గమే ఆయన మార్గం .సత్యమే ఆయన ఆయుధం .మహాత్మా గాంధికి ,మార్టిన్ లూధర్ కింగు కు ,నాజీ లను ఎదిరించిన డేనిష్ ప్రజలకు ,వియత్నాంపై అమెరికా  యుద్ధాన్ని వ్యతి రేకించిన ప్రపంచ దేశాలకు,దక్షిణ ఆఫ్రికా లో వర్ణ వివక్ష పై పోరాటం సాగించటానికి ,చైనా లో తియమిన్ స్క్వేర్ లో విద్యార్ధుల శాంతి యుత ప్రదర్శనలకు థోరో గారి మార్గమే శరణ్య మైంది .
ఆయన  ,పొలాలను సర్వే  చేయటం నేర్చు కొన్నాడు .ప్రక్క వాళ్ల   సరిహద్దు లెక్కడో వాళ్ళకన్నా ఈయనకు బాగా తెలుసు .ఆయన సర్వే  చేయని చుట్ట పక్కల గ్రామం ,పట్టణం లేదు .సర్వేయర  ఇన్ ఛార్జ్ గాప్రభుత్వం     నియమించింది .ఆయన  రోడ్లను సర్వ్ చేయించారు .కోర్టులలో ఆయన డాక్యు మెంట్లకే విలువ ఎక్కువ .ఆయనకు నాచురల్ హిస్టరీ ,జీవిత చరిత్రలు ,సాహిత్యం అభి మాన విషయాలు .వాటిపై ఎంత సేపైనా మాట్లాడ గలదు .అయితే ఆయన సహచారి అయిన ఎమర్సన్ గారు మాట్లాడితే ఉపన్యాసానికి యాభై దాలర్లిస్తే ఈయన మాట్లాడినప్పుడు పడి డాలర్లు కూడా చేతి లో పెట్టె వారు కాదని రచనకే అంకిత మవ్వాలని నిర్ణ యించుకొన్నాడు . ఆయన చేతి లో ఎప్పుడూ ఒక నోటు పుస్తకం ఉండేది .తాను చూసిన వాణ్ణి అందులో రాసుకొని తర్వాతా వ్యాసాలుగా రాసే వాడు .దాదాపు ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళే వాడు .నడక అంటే మహా ఇష్టం .కాకార్డు నది లో స్వంతం గా నిర్మించుకొన్న బోటు లో విహరించే వాడు .చలి కాలం నది గడ్డ కట్టితే దానిపై స్కేటింగ్ చేసే వాడు గంటకు పద్నాలుగు మైళ్ళ వేగం తో స్కేట్ చేసే వాడట .వాల్డెన్ పాండ్ లో ఒంటరిగా రెండేళ్ళ రెండు నేలలున్నాడు రుషి జీవితం గడిపాడు . ఆతర్వాత మళ్ళీ స్వంత గ్రామం చేరాడు .ఎందుకు వచ్చేశారు అని అడిగితే ”i have several more lives to live ”అని ఇదే కాక తాను నిర్వహించాల్సిన సామాజిక ధర్మాలు చాలా ఉన్నాయి కనుక మళ్ళీ జన జీవితం లోకి ప్రవేశించాను అన్నాడు .
”  i have chosen letters as my profession ”అన్నాడు థోరో .అంటే రచన చేయటమే తనకు బాగా ఇష్టమని .’the week ”అనే తన యాత్రా దర్శిని ప్రచురించాడు .అది మిశ్రమ స్పందన కల్గించింది .దాని పై స్పందిస్తూ విమర్శకులు ”a rare work in American literature ”అనీ ”a remarkable volume and its author a remarkable man ”అని కితాబు ఇచ్చారు .అయితే ఆయన మరణించిన తర్వాతా ,ఆయన రచనల విలువ పెరిగింది .తమ మధ్య ఒక మహాను భావుడు ఉన్నాడు అని ఆనాటి కన్కార్డు సమాజం గమనించలేదు .ప్రకృతి అంటే పులకిస్తాదాయన . తన పళ్ళను తీసి, కృత్రిమ దంతాలను అమర్చి నప్పుడు గురువు ఎమర్సన్ తో ”art out doors nature ”అని అవీ బానే ఉన్నాయని మెచ్చాడు .
ఆయన చేతిలో ఒక పెద్ద గొడుగు ఉన్దేదేప్పుడూ .ఆయన ఇంట్లో పెద్ద శీల్ఫ్ లో తాను సేకరించిన బొటానికల్ స్పెసిమెన్ ప్లాను అరల్లో దాచే వాడు .1850-57 మధ్య ఆయన 800 plant specimen లను న్న్యూ ఇంగ్లండ్ ప్రాంతం నుండి సేకరించాడు వాటిని తరువాత harvard gray herbarium లో భద్ర పరిచారు .లిల్లీ పువ్వుల్లో ఎన్నో రకాలను సేకరించాడు .ఇండియన్ అమెరికన్ లతో సాక్ష్యాత తో ఉండే వాడు .వాళ్ళతో అడవులు నదులు తిరిగి వారి జీవిత విధానాలను అధ్యాయం చేశాడు .వాళ్ళు ఉపయోగించే పదాల అర్ధాలు తెలుసు కొనే వాడు .ఔషధ మొక్కల గురించి ఆరా తీసి వాటిని వారు వైద్యం ఎలా ఉప యోగించేది తెలుసు కొన్నాడు రాతి తో వాళ్ళు చేసే బాణాల ములుకులు ,బల్లాల చివరలు ,గొడ్డళ్లను ఆసక్తి గా చూసే వాడు .అడవి తల్లి ని నమ్ము కోవాలి అమ్ముకో రాదనే సిద్ధాంతం ఆయనది .అందుకే ఆనాడే వంయాలను వన్య మరుగ సంరక్షణ ను బోధించిన వాడిగా థోరో ను గుర్తిస్తున్నారు . 
” the succession of forest trees  ”అనే థోరో వ్యాసం ఆయనకున్న శాస్త్రీయ జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది .యే చెట్టు ,యే మొక్క ఎప్పుడు ఫలిస్తుందో , ,పుష్పిస్తుందో అన్నీ ఆయన వివ రించాడు .బీజ వ్యాప్తి ని అధ్యయనం    చేశాడు .వీటి పై ఆయన రాసిన అభిప్రాయాలు నేటికీ శిరోధార్యమే .ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఉన్నా ఏదో ఒక రోజు సైన్స్ జీవితం లోని రక్తాన్ని అంతను ఖాళీ చేస్తుందని అందాన్ని  కవిత్వాన్ని నాశనం చేస్తుందని భయ పడ్డాడు . the walking ,the wild అనేవి అట్లాంటిక్ మంత్లీ లో ప్రచురిత మయాయి .”in wilderness is the preservation of life ”అని ఆయన నిశ్చిత మైన అభి ప్రాయం .
ఆయన ఆధ్వర్యం లో బానిసలకు అంటే దక్షిణ రాష్ట్రాలలో పొలాల్లో పని చేసే వారికి తాటాకు టోపీలను ఆడ వారు తయారు చేసి రవాణా చేసే వారు .చవక గా వచ్చే నూలు బట్టలను తయారు చేయించి వారికి పంపే వారు .ఆ రోజుల్లో బానిసలు యజ మాని నుంచి తప్పించు కొని బయట పడితే వారికి ఆశ్రయం కల్పించిన వారికీ వెయ్యి డాలర్ల జరిమానా ఉండేది .ఆ నాటికి అది చాలా పెద్ద మొత్తమే .దీన్ని వ్యతి రేకైన్చాతానికి థోరో నె సరైన నాయకుడని అందరు భావించి ఆయన నాయ కత్వం లో పోరాటం చేశారు .తప్పించుకొన్న బానిసలకు వారికి ఆశ్రయం ఇచ్చి తిండి , బట్టలు డబ్బు కూడా ఇచ్చి పంపే వాడు థోరో .బానిసత్వాన్ని బాహాటం గా మొదటి నుంచి వ్యతి రేకిన్చినఆదర్శ వ్యక్తీ థోరో .”love without principle ”అంటే ఆయనకు ఇష్టం లేదు .”you must get your living by loving ”అనేది ఆయన సిద్ధాంతం .
ఆయన రాసిన ”వాల్డెన్ ”పుస్తకం పై డెబ్భై రివ్యూలు వచ్చాయి .అన్నీ బానే ఉన్నాయి .దాన్ని ”మాస్టర్ పీస్ ”అన్నారు .”one of the great american classics of non fiction ”అని కీర్తించారు .అక్షలది కాపీలు అమ్ముడ యాయి. దాదాపు అన్ని భాషల్లోకి తర్జుమా అయింది .దాన్ని” రుషి థోరో గారి స్వీయ చరిత్ర ”అని ప్రశంసించారు .వాల్డెన్ పాండ్ లో రెండెక రాలలో నాలుగు వందల;” పైన్ చెట్లను” నాటించి పెంచాడు .జాన్ బ్రౌన్ అనే ఆయన బానిసల రక్షణ ఉద్యమం లో పోలీసు కాల్పుల్లో మరని స్తే శ్రద్ధాంజలి ఘటిస్తూ ” ఈ మహోన్నత వ్యక్తీ ఉన్నతం గా ఎలా జీవించాలో ఉన్నతం గా ఎలా మరనిమ్చాలో   తెలియ జేసినవారు ”అని శ్లాఘించాడు .1812లో జన్మించి ఒక్క యాభై సంవత్స రాలు మాత్రమె జీవించి 1862లో పుణ్య లోకాలకు చేరిన” అమెరికన్ రుషి  హెన్రీ డేవిడ్ థోరో ”తర తరాలకు ఆదర్శ ప్రాయుడు .ఆయన మరణానికి చింతిస్తూ ఎమర్సన్ చెప్పిన వాక్యాలు చిరస్మర ణీయం ”the country knows not yet ,or in the last part how a great son  it has lost  .where ever there is knowledge ,where ever there is virtue ,where ever there is beauty Thoreau  will find a home ”,
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -08 -12 -కాంప్–మెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా ఊసులు -13

 అమెరికా ఊసులు -13
అమెరికా అధ్యక్షు లైన వారిలో చాలా మంది ప్రజాభి మానం పొంది ,ప్రజల కోసం ఎంతో చేసి మెప్పు పొందిన వారే .వాళ్లనే మళ్ళీ గెలి పించి ప్రజలు అభిమానాన్ని చాటు కొన్నారు ఆనాడు .ఆ తర్వాత ధన ప్రభావం తో అధ్యక్షులైన వారున్నారు .రెండో సారీ గద్దెనెక్కిన వారున్నారు .కాని తొలి తరం నాయకు లతో పోలిస్తే పాపం వీరి స్తాయి గ్రాఫు చాలా కిందకి వెళ్లి పోతుంది .అలా అని పాత తరం లో అందరు ప్రజాభి మానాన్ని పొందారని చెప్పలేము .కొందరు బెస్ట్ ప్రెసిడెంట్ అని ,కొందరు పీపుల్స్ ప్రెసిడెంట్ పేరు పొందారు .వారికి ప్రజబ్రహ్మ రధం పట్టింది .కాని ఒకే ఒకాయన అమెరికా ప్రెసిడెంటు లలో”one of  The worst president s”అని పించుకొన్నాడు .ఆయనే పదిహేనవ అమెరికా అధ్యక్షుడు జేమ్స్ బుచనాన్ .
బుచనాన్ పెన్సిల్వేనియా నుండి ఎన్ని కైన ఒకే ఒక ప్రెసిడెంట్ .ఆయన తండ్రి ఐర్లాండ్ నుంచి వలస వచ్చి ఇక్కడ కొత్తగా స్తిర పడ్డాడు .అందుకే బుచనాన్ ను”ఇమ్మిగ్రెంట్ ప్రెసిడెంట్ ”అన్నారు .ఆయనకు పెళ్లి కాలేదు .లాయర్ .అధ్యక్ష భవనం లో దేశ ప్రధమ మహిళా గా ఎవరో ఒకరున్డాలి .ఆయన సోదరి కుమార్తె ”హారియట్ ”ప్రధమ మహిళా బాధ్యతలన్నీ నిర్వ హించింది .ఇదొక విద్డూరం .”పెళ్లి కాని ప్రసాద్” లాగా పెళ్లి కాని ప్రెసిడెంట్ అన్న మాట బుచనాన్ .ఆయన దేనిలోనూ రాణించక పోయాడు పాపం. ఆయనే చెప్పుకొన్నాడు” I  acknowledge no master but in law ”అని చెప్పుకొన్నాడు .అంతే కాదు ఈయన గారికి ఒక గొప్ప క్రెడిట్ కూడా ఉంది .18శతాబ్దం లో పుట్టిన చివరి ప్రెసిడెంట్ బుచనాన్ .
1856  లో know nothing అని పిలువ బడ్డ millard Fimore అనే ఆయన అధ్యక్ష పదవికి ఈయనతో పాటు పోటీ చేశాడు .బుచనాన్ డెమొక్రాటిక్ పార్టి అభ్యర్ధి .. .జాన్  సి.ఫ్రీ మాంట్ అనే రిపబ్లికన్ అభ్యర్ధి ప్రధాన ప్రత్యర్ధి .ఈ ”త్రికోణపు ”పోటీలో అదృష్టం బుచనాన్ ను వరించి ప్రెసిడెంట్ గా ఎన్ని కైనాడు .బుచనాన్ అధ్యక్షా స్తానం లో కూర్చున్నాడు కాని ఏమీ చేయ లేక పోయాడు .సరైన మెజార్టి లేదు .రిపబ్లికన్లు ఏమీ సహక రించటం లేదు .యే నిర్ణయమూ తీసుకోలేక పోయాడు .దక్షిణ రాష్ట్రాలు విడి పోతామని బెది రిస్తున్నాయి .ఉత్తర రాష్ట్రాలు కలిసి ఉండాలని ఒత్తిడి చేస్తున్నాయి .పాపం ఆయన పని కుడితిలో పడ్డ ఎలుక గా ఉంది .నిర్వికారం గా ,అచేతనం గా  నాలుగేళ్ళు గడిపాడు .అందుకని అసమర్ధ ప్రెసిడెంట్ గా ముద్ర వేయించు కోవాల్సి వచ్చింది .బుచనాన్ తర్వాతా అమెరికా అధ్యక్షుడు గా అబ్రహాం లింకన్ పదహారవ దేశాధ్యక్షుడిగా ఎన్ని కైనాడు .ఈయనకూ అప్పటికి ప్రజా బలం తక్కువే .అయితేనేం సమయానికి తగిన నిర్ణయం చేసి మొనగాడు ప్రెసిడెంట్ అని పించాడు .అమెరికా ప్రజల హృదయాలలోనే కాదు యావత్ ప్రపంచ ప్రజల హృదయాలలో స్థానం పొందాడు .లింకన్ పేరు చెబితే ఉప్పొంగని హృదయం ఉండదు .తన పదివి నుండి తప్పుకొంటు ,లింకన్ కు బాధ్యతలను అప్ప గీస్తూ బుచనాన్ you are as happy in entering the white house ,as i shall feel on returning to wheat land .you are a happy man ” అన్నాడు .ఇదొక అసమర్ధుని జీవిత యాత్ర అనుకొందాం .
మహా మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ శాస్త్ర వేత్త గురించి కొన్ని సరదా కబుర్లు చెప్పు కొందాం -ఒక సారి న్యూయార్కు లోని జ్యూయిష్ టైలర్ ఇంకొక జ్యూయిష్ టైలర్ కు ఐయిం స్టీన్  గురించి చెప్పాడట .ఆ రెండో ఆయనకు అయిస్తీన్ ఎవరో తెలీదు .అప్పుడు మొదటి ఆయన ‘అయిన స్టీన్ అంటే ”రిలేటి విటి ” నికనీ పెట్టిన ఆయన ‘అన్నాడు .అదంటే ఏమిటి అని తెల్ల మొహం వేసి అడిగాడు రెండో టైలర్ .దానికి మొదటి టైలర్ సమాధానం గా ”ఒక ముసలి ఆవిడ సరదా గా ఒక నిమిషం సేపు  నీ తోడ మీద కూచుంది అనుకో,అప్పుడు ఆ నిమిషం నీకు ఒక యుగం అని పిస్తుంది .కాని ఒక అంద మైన అమ్మాయి నీ తోడ మీద కొన్ని గంటలు కూచుంది అనుకో అప్పుడు నీకు ఒక్క నిమిషమే నని పిస్తుంది .అదే సాపేక్ష సిద్ధాంతం- రిలేటి విటి ” అని వివరించాడట .”అబ్బో ఇంత  గొప్ప సిద్దాన్తమా–దీన్ని కనీ పెట్టా అయిన్  స్టీన్ జీవితం గడుపు తున్నాడు !”అని ఆశ్చర్య పోయాడట రెండో టైలర్ . ఈ జోకు ను 1946 లో ఆంత్రో పాల జిస్ట్ అయిన ”ఆష్లీ మాంటేగు ” మేధావి అయిన స్టీన్ కు స్వయం గా చెబితే ,ఆయన పగల బడి నవ్వాడట .అయితే ఈ జోక్ తన సాపేక్ష సిద్ధాంతాన్ని అతి సామాన్యుడికి చేరేట్లు చేసింది అని అయిన్ స్టీన్  ఒప్పు కొన్నాడట .
ఆ తర్వాత కొన్నేళ్ళకు బే స్  బాల్ ప్లేయర్లు అయిన మొ బెర్గ్ ,జాన్ కీర్నాన్ లను అయిన స్టీన్ తనకు బే స్  బాల్  ఆడే విధా నాన్ని తెలియ జేయ మన్నాడట .ఒక కాగితం ,కలం తెచ్చి దాని మీద ఆడే విధానాన్ని బెర్గ్ బొమ్మలతో రాసి చూపించాడట .అదేమీ ,ఈ మేధావికి ఎక్కక బుర్ర గోక్కున్తున్నాడు .కాసేపటి తర్వాతా వారిద్దరికి టీ ఇచ్చి ఐన్స్టీన్ తనకు అత్యంత ప్రియ మైన ”వయోలిన్ ”మధురం గా .వాయించి ఆనందం కల్గించాడు .బెర్గు తో ఒక ఒప్పందానికి వచ్చాడు మన శాస్త్ర వేత్త .తాను వాళ్లకు సాపేక్ష సిద్ధాంతాన్ని అర్ధమయ్యే టట్లు చెప్తానని వాళ్ళిద్దరూ తనకు బెస్  బాల్  ఆట నేర్పాలని ఒప్పందం .కొంచెం సేపయిన తర్వాత అయిస్ స్టీన్ ”మీరు సాపేక్ష సిద్ధాంతాన్ని నేను బెస్ బాల్ నేర్చుకొనే లోపే నేర్చుకో గలరు .నాకు అది రావటం గగనం ”అని ఒప్పందాన్ని సరదా గా రద్దు చే సుకోన్నాడట .
మహాత్మా గాంధీ గారికి మార్టిన్ లూధర్ కింగ్ కు ప్రేరణనిచ్చిన వారు  అమెరికా లోని అమెరికా లోని సామాజిక కార్య కర్త ,స్వయం అభి వృద్ధికి మార్గాలను చూపిన తత్వ వేత్త ,రచయిత మాసా చూ సెట్స్ రాష్ట్రం లోని కాన్కార్డ్ నివాసి హెన్రీ డేవిడ్ తోరో గారు .ఆయన జీవితం లోని కొన్ని విషయాలు అందరికిఅసహచర్యం కలిగిస్తాయి .ఆయన తండ్రి పెన్సిల్లు తయారు చేసి అమ్మే వ్యాపారి .ఈయన కూడా నాన్య మైన పెన్సిల్లు  తయారు చేసే వాడు .ఈయన మంచి కార్పెంటర్ కూడా .సర్వేయర్ గా గొప్ప పేరు ఉంది .ఇంట్లోకి కావలసిన కుర్చీలు బెంచీలు డ్రాయర్లు అన్నీ ఆయనే తయారుసుసుకొనే వాడు .నదిలో నడిపే బోట్లను ఆయనే తయారు చేసుకొన్నాడు .ఆయన గురువు సహచరుడు ప్రఖ్యాత రచయిత ,తత్వ వేత్త ఎమర్సన్ గారు .ఎమర్సన్ అంటే ప్రపంచ దేశాల ప్రజలందరికి భారత దేశం తో సహా ఆరాధనా భావం ఉంది .ఆయన్ను కోట్ చేయకుండా యే దీ రాయనంతటి ప్రభావం ఎమర్సన్ గారిది .తోరో గారికి లాంగ్ ఫెలో కవి గొప్ప స్నేహితుడు .అయితే తోరో కు ఉబ్బస వ్యాధి ఉండేది .దానితో చాలా బాధ పడే వాడు .అయినా రచనా వ్యాసంగం మాన లేదు .ఇళ్లకు ఫెన్సింగ్ ను చాలా బాగా చేసే వాడు .కొన్ని దశాబ్దాలు అవి చెక్కు చెదర కుండా ఉండేవట .ఒక స్కూల్ పెట్టి కొద్ది కాలం నడిపాడు .విద్యార్ధులను కొట్టటం అంటే ఇష్టం ఉండేది కాదు .గ్రాఫైటు కార్బన్ ను ఉపయోగించి నాన్య మైన పెన్సిల్లు తయారు చేశాడు .అమెరికా లో మొదటి నాన్య మైన పెన్సిల్ ను చేసింది తోరో గారే .ఆయన ప్రేమ లు పెటాకు లైనాయి .అందుకని పెళ్లి చేసుకో లేదు .కొయ్య ముక్క లో గుండ్రని రంధ్రాన్ని  చేసే సాధనాన్ని కనీ పెట్టాడు .
”  the laws of nature and human nature were the same ”అని మానవునికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలియ జెప్పాడు .ఎమర్సన్ గారు తోరో గారికి దైవ దత్త మైన తండ్రి .”there is no remedy for love ,but to love ‘more ”అని చక్క గా చెప్పాడు .ఆయన చిన్న తనం లో న్యూయార్కు నగరాన్ని చూశాడు .దాన్ని అధ్వాన్న నగరం అన్నాడు .it is worse .it is a thousand times meaner than i could have imagined .the pigs in the street are the most respectable part of the population .అని రాసుకొన్నాడు తన అనుభవాన్ని .అప్పుడే రైలు  సర్వీసు ప్రారంభ మైంది .ఒక గంట ప్రయాణానికి యాభై సెంట్లు చార్జి వసూలు చేసే వారు .ఆయన కు వారం లో ఒక రోజు పని చేసి ,ఆరు రోజులు విశ్రాంతిగా ఉండటం ఇష్టం .వాల్డెన్ పాండ్అనే ప్రదేశం లో  అనే ప్రకృతి అందాల మధ్య కుటీరాన్ని స్వయం గా నిర్మించుకొని కొంత కాలం జీవించాడు .గాంధీ గారు ఇక్కడికే వచ్చి చూసి ప్రభావితుడైనాడు .పన్ను ను నాలుగేళ్ళుగా  కట్ట లేదని ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో ఒక రోజు ఉంచారు ఆయన మేనత్త ఆయనకు తెలీకుండా కట్టేసింది .జైలు ఖాళీ చేసి వెల్ల మంటే వెల్ల లేదు .కావాలనే పన్ను కట్ట లేదు .ప్రజా సోకర్యాలను పట్టించు కొని ప్రభుత్వానికి పన్నులు కట్టక్కర లేదని ఆయన వాదం ..దానితో civil disobedience ను ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్క రించాటానికి  సాయం పడ్డాడు .ఇదే గాంధీజీ కి ప్రేరణ . సహాయ నిరాకరణం అంటే ఇదే .అసమర్ధత తో మొదలు పెట్టి,ప్రజా  సమర్ధత అంటే ఏమిటో తెలుసు కొన్నాం .ఇక చాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-8-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

భగవాన్ శ్రీ కృష్ణఉవాచ

  భగవాన్ శ్రీ కృష్ణఉవాచ 
ఇవాళ కూడా అస్టమి తిధి ఉంది -శ్రీ రిష్ణాష్టమి గానే భావిస్తారు .కనుక శ్రీ కృష్ణుడిని తలచుకొంటూ భగవద్గీత లో ఆయన చెప్పిన మాటలను ‘భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ ”ద్వారా తెలుసు కొందాం –
”యద్భావం తద్భవతి ”మనం ఎలా కోరుకొంటే ,అలా జరుగు తుంది .ఇదే positive attitude అంటే .దీన్ని అలవరచు కొని పనులను కౌశల్యం తో నైపుణ్యం గా శక్తి వంచన లేకుండా ఫలా పేక్ష రహితం గా చేయాలి .తాను అవతార  పురుషుడిని అని ధర్మానికి హాని కల్గి నప్పుడు అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ,ధర్మాన్ని ప్రతిష్టిస్తానని చెప్పాడు .ఈ పనిని నేను చేయటం లేదు .కర్మేంద్రియాలు సహజ సిద్ధం గా వాటి పని అవి చేసుకొని పోతున్నాయి .అందులో నా ప్రమేయం లేదు అను కోవటమే ”కర్మ సన్యాసం ”.కర్మ యోగం అనుస రించ కుండా ,కర్మ సన్యాస యోగం ఆచరింప లేరు .మరి కర్మను త్యజించటం అంటే ?ఎవడు ఎవరినీ ద్వేషించడో ,దేన్నీ కోరుకోడో అలాంటి కర్మ యోగి నిత్య సన్యాసి గానే భావింప బడుతాడు .సకల ప్రాణుల్లో ఆత్మ స్వరూప్లుగా భగ వంతుడే ఉన్నాడని భావించే వాడికి కర్మలు బంధనాలు కావు .సత్కర్మ లను నిష్కామ బుద్ధి తో చేస్తే లోక కల్యాణం జరుగుతుంది .వ్యక్తీ అభ్యున్నతి వల్ల సమాజం లో సచ్చీలురైన జనం తయారవు తారు .అప్పుడు సమాజం ధర్మ బద్ధం గా ఉంది ,లోక కళ్యాణ కారకమవుతుంది .వ్యక్తీ వికాసమే అభ్యుదయానికి మూలం .
కోర్కెలు గుర్రాల వంటివి .అవి యధేచ్చగా అటూ ,ఇటూ పరి గెత్తు తూ ఉంటాయి .వాటిని కళ్ళెం అనే మనసు తో బుద్ధి అనే ఆశ్వారూధుడు బంధించి జాగ్రత్త గా నడ పాళీ .బుద్ధి చేత మనసును నిగ్ర హించు కొని కోర్కెలను అదుపు లో ఉంచుకోవాలి .ధ్యానం వల్ల మనో నిగ్రహం లభిస్తుంది .దానిద్వారా ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది .అప్పుడు మనస్సు ప్రశాంతి పొంది  ,ఆత్మోన్నతి కలుగు తుంది . చేసే సాధన ఎప్పుడూ వృధా కాదు .దాని ఫలితం తప్పక లభిస్తుంది .ఈ జగత్తు అంతా దారం తో కూర్చ బడిన మణులు లాగా పరమాత్మ ధరించాడు .నీటి లోని రసం ,చంద్రుని లో ని కాంతి ,నాలుగు వేదాలలోని ఓంకారం ,ఆకాశం లోని శబ్దం ,పురుషులలో పురుషత్వం అన్నీ ఆయనే .భూమి లోని గంధం ( substance),జాలం లోని రసం (fluid ),అగ్ని లోని తేజస్సు (heat and light ),వాయువు లోని ప్రాణ వాయువు(oxygen ),ఆకాశం లోని శబ్దం (sound ),పురుషుని లోని పురుషత్వం (manliness ) ,తపోధనుల లోని తపశ్శక్తి అంత తానే నని చెప్పాడు .”ప్రయాణ కాలే ఆపి చ మం తె విడుర్యుక్త చేతసః ”-ఎవరు మరణ కాలం లో కూడా భాగ వంతుని ధ్యానిస్తారో వారు ఆయన సన్నీ దానానికే చేరుతారు .మరణకాలం లో పుట్టే భావాలే మరో జన్మ కు కారనభూతాలవుతాయి .జడ భరతుడు అనే ముని తపో నిష్ఠ లో ఉంది కూడా ,తాను ప్రేమించి ,పెంచిన జింక మీద మరణ  సమయం లో కూడా దానినే ఆలోచిస్తూ ప్రాణాలు విడి చాడు .మళ్ళీ జన్మ లో జింక గా పుట్టి ,జన్మ బంధం నుండి విముక్తి పొంది ,ఆ తర్వాత జన్మ లో ఉత్తమ గతి ని పొందుతాడని భారత భాగవతాలు చెప్పాయి .
భక్తులు నాలుగు రకాలు .ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్న వాడు .అర్దార్ది అంటే ధనం ,సుఖం వంటివి కోరుకొనే వాడు .జిజ్ఞాసి అనగా తత్వ రహస్యాలను తెలుసుకోవాలి అనుకునే వాడు .నాల్గవ వాడు -జ్ఞాని అంటే -పరమాత్మ తత్వాన్ని పూర్తిగా తెలుసు కొన్న వాడు .బ్రహ్మం అంటే వినాశ రహితమైనది .ఆధ్యాత్మం అంటే చేతనం కల జీవాత్మ .కర్మ అంటే త్యాగం తో చేసే పని .అది భూతం అంటే నశించే పదార్ధం .ఆది దైవం అంటే విరాట్పురుషుడు .అధి  యజ్ఞం అంటే -దేహం లోని పరమాత్మ .మరణ కాలం లో స్పృహ ఉంటుందో లేదో ,భాగ వంతున్ని స్మరించ గలమో లేదో -కనుక జీవించి నంత కాలం భగవంతున్ని స్మరిస్తూనే ఉండాలి .తన భక్తులేవరు దుర్గతి చెందరు అని శ్రీ కృష్ణుడు చెప్పాడు .చెడ్డ వారైనా ,మనసు పరి వార్తన తో తనను శ్రద్ధా  స క్తులతో సేవిస్తే తప్పక సద్గతిని పొందుతారని అభయమిచ్చాడు .
ఒక సారి గోపికల తో రాధ యమునా నదీ తీరాన కూర్చుని ఉంది .ఆమె మనసంతా శ్రీ కృష్ణ ధ్యాన మగ్నమై ఉంది .నారద మహర్షి అక్కడికి వచ్చాడు .ఆయన తన వీణ అయిన మహతి పై భగవన్నామం పలికిస్తున్నాడు .రాధను చూసి ”అమ్మా !కృష్ణుడు లేదని బాధ పడుతున్నావా ?”అని అడిగాడు .అప్పుడు రాధ ”కృష్ణుడు నా హృదయం లోనే ఉన్నాడు కదా ఆయన లేనిది ఎక్కడ ?ఆయన లేడని బాధ పడితే,నా హృదయం లోని దేవుడికి ఆ బాధ కలిగించి నట్లే కదా “”?అన్నది .నారదుడు రాధ లోని అనన్య భక్తికి పొంగి పోయాడు.రాధ తన హృదయ దేవాలయం లో శ్రీ కృష్ణ పరమాత్మ ను  ప్రతిష్టించి ,అను క్షణం ధ్యానిస్తూ తపో సిద్ధి పొందిన ధన్యు రాలు .అదీ నిరంతర ధ్యానం అంటే .కుచేలుడు శ్రీ కృష్ణుని స్నేహితుడు ,ఆయన దరిద్రం తో బాధ పడుతూ భార్య మాట మీద ద్వారక కు వెళ్లి పిడికెడు అటుకులు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు స్నేహితునికిచ్చిన మహాత్ముడు కృష్ణుడు .అంతే కాదు తన  అష్ట భార్య లతో కలిసి కుచేలునికి సపర్యలుచేసి , ,తాను పడుకొనే మంచం మీద ఆయన్ను పడుకో బెట్టి ,కాళ్ళను ఒత్తిన కారుణ్య మూర్తి .స్నేహానికి నిలు వెత్తుఅద్దం గా భాసించాడు . గురువు సాందీపుని పుత్రుడు మరణిస్తే వేది కి అతన్ని పునర్జీవితున్ని చేసి తీసుకొని గురువుకు అప్పగించి గురు దక్షిణ సమర్పించిన ఉత్తమ శిష్యుడు .తనను నమ్మిన గోప గోపికలకు సమస్తమూ తానే అయి కాచి కాపాడిన రక్షకుడు .చెలికాడు .అధర్మ పరుడైన మెన మామ కంసుడినిసంహరించి ధర్మాన్ని రక్షించిన వాడు .సంపూర్ణ విశ్వాసం తో ఆయనను  ధ్యానించిన వారి యోగ క్షేమాలను ఆయనే చూసుకొంటాడు .ఈ విశ్వం లో ఎక్కడెక్కడ గొప్పతనం ఉంటుందో అదంతా ఆయన విభూతియే .అర్జునుడికి తన విశ్వ రూపాన్ని చూపించి విభ్రాంతికి గురి చేశాడు .దాన్ని ఉప సంహరించి అతని భ్రాంతిని తొలగించాడు .చరాచర ప్రపంచం అంతా పరమేశ్వరుని లీలా వినోదమే నని గ్రహించాలి .
సత్యాన్వేషణ తో జీవించటమే ,ప్రేమ ,కలిగి ఉండటమే భక్తినే ప్రమిద చేసి ,ఆర్తి ని నేయ్యిగా మనస్సునేవత్తి గా ,అజ్ఞానం అనే చీకటిని పోగోత్తే ,పరా భక్తీ అనే ఉజ్వల దీపాన్ని వెలిగించి భగవంతునికి మన హృదయాన్ని సమర్పణ చేయాలి .ఇదీ భక్తీ లోని పరమార్ధం .జీవుడు పరమాత్మ అంశ ,పరమాణువు ,కాంతి పుంజం .”తత్వమసి ”అంటే నువ్వే నేను అనే బావం తో పరమాత్మను చేరాలి.ప్రకృతే తల్లి .పరమాత్మ తండ్రి .త్రిగునా లను దాటి పరమాత్మను చేర వచ్చు .సంసారం అనేతిరుగ బడిన  అశ్వత్థ వృక్షానికి మూలము పరమాత్మ .కొమ్మలు కోరికలు .చిగుళ్ళు మొదలైనవి ఫలితాలు .వివేకం ,వైరాగ్యం అనే ఖడ్గం తో సంసార బంధనాన్ని చేదించి ,కోర్కెల నుండి విముక్తి పొంది ఆత్మ తత్త్వం తో స్తిర పడాలి ఈ వైరాగ్యమే మోక్షం .మంచి గుణాలు కలిగి దైవ చింతన చేసే వారికే ఉన్నతి కలుగుతుంది .పూజ .పునస్కారాదులు భగవంతుని చేర్చలేవు .దయా ,సానుభూతి ,అహింస ,సత్యం ,అన్నిటిలో భగవంతుని చూసే చూపు ,సాత్విక గుణాల వల్లే భగవద్దర్శనం సాధ్యం .ఎవరూ చెప్పని గొప్ప సిద్ధాంతాన్ని కృష్ణుడు చెప్పాడు ”సర్వ ధర్మాన్ పరిత్యజ్వా ”అన్నాడు .అన్నిటిని వదిలేసి తనను శరణు వెడితే తానే అన్నిటినీ చూసుకొంటాను  అన్నాడు  .అదే భగవద్గీత పర మార్ధం .ఏక్కడ ధర్మార్ది అయిన అర్జునుడు ఉంటాడో ,అంటే ధర్మం చేయాలను కొనే వారు ఉంటారో అక్కడ సంపద , ,విజయం ఐశ్వర్యం స్తిర మైన నీతి ఉంటాయి .శ్రీ కృష్ణడుగొప్ప రాజ కీయ దురంధరుడు .గొప్ప డిప్లోమాట్ .అందరి కళ్ళకు ఆనందాన్ని ,జ్ఞానాన్ని కల్గించే వాడు .విధి విధి నిర్వహణ కోసమే నని చాటిన వాడు . ”The lord of Autumn moon ”శరశ్చంద్ర ప్రభువు శ్రీ కృష్ణ పరమాత్మకు ఈ కృష్ణాష్టమి సందర్భం గా నమస్కరిద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-8-12-కాంప్–అమెరికా

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ -ఓపెన్ హీమెర్

 ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ -ఓపెన్ హీమెర్ 
అవి రెండవ ప్రపంచ యుద్ధం భీకరం గా జరుగు తున్న రోజులు జెర్మనీ ని సమర్ధించే దేశాలోక వైపు ,అమెరికా బ్రిట న్లను సమర్ధించే దేశాలోక వైపు మోహ రించి భీషణ పోరాటం చేస్తున్నాయి .జర్మని నియంత అడాల్ఫ్ హిట్లర్ జాతి దురహంకారం తో పెచ్చు మీరి పోతున్నాడు .యూదు లందర్నీ ఊచ కొత్త కోయిస్తున్నాడు .జ్యూ శాస్త్ర వేత్తలను దేశం విడిచి  పంపిస్తున్నాడు .మహా మేధావి అయిన్ స్టీన్ శాస్త్ర వేత్త అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రిన్స్ టన్ యూని వేర్సిటి లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు .ఏమైనా సరే అమెరికా ను ఓడించి తన ఆది పత్యాన్ని నిలుపు కోవటానికి హిట్లర్ శతధా సహస్ర ధా ప్రయత్నిస్తున్నాడు .సర్వ వినాశం చేసే బాంబు ను కనీ పెట్టమని జర్మని శాస్త్ర వేత్త లను ఆదేశించాడు .వారంతా తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు .తాను  కనీ పెట్టిన ద్రవ్య రాశి శక్తికి సంబంధించిన సూత్రం మంచికి ,చేడుకూ కూడా పని చేయ వచ్చు అని ఆందోళన చెందు తున్నాడు ఐన్స్టీన్ .అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్వేల్టు కు ఉత్తరం రాస్తూ జెర్మని అణు బాంబు తయారు చేసే ఆలోచన లో ఉన్నట్లు తనకు సమాచారం అందినదని ,హిట్లర్ చేతి లో ఆ బాంబు ఉంటె సర్వ ప్రపంచ వినాశనం జరుగు తుందని వివరించాడు .అందువల్లయురేనియం ను జర్మనీ కి దక్క కుండా చేసే జాగ్రత్తలను తీసుకోమని హెచ్చరించాడు .కా ని హిట్లర్ దాన్ని సంపాదించి నిలావ చేసుకొని ఆటం బాంబు కోసం కలలు కంటున్నాడు .
అమెరికా లో ప్రెసిడెంట్ అయిన్ స్టీన్గారి ఉత్తరాన్ని చదివి వెంటనే కార్యా చరణలోకి దిగాడు .యుద్ధ అధికారు లతో   సమావేశమై అతి త్వర లో ఆటం బాంబు ను తయారు చేయమని ఆదేశించాడు .1942 లో కల్నల్ లెస్లీ గ్రోవేస్ దీనికి పూనుకొన్నాడు .కాని ఆయనకు న్యూక్లియర్ ఫిజిక్స్ పెద్దగా తెలియదు .కాని దాన్ని తయారు చేయాల్సిందే .అదీ అత్యంత రహస్యం గా .దానికోసం యుద్ధ నిపుణులు శాస్త్ర వేత్తలు ,అందరి సహకారం కావాలి .అప్పుడు ఆయన దృష్టి లోకి ప్రఖ్యాత శాస్త్ర వేత్త ఒపెన్ హీమేర్ పడ్డాడు .ఆయన్ను పిలి పించి మాట్లాడాడు .ఈయన కూడా  జ్యూ శాస్త్ర వేత్తయే .అందరి తో బాటు ఈయనకూ జెర్మని కంటే అమెరికా ముందే ఆటం బాంబు తయారు చేయాలి అనే అభి ప్రాయం వుంది .సరే నన్నాడు దానికి సరైన ప్రదేశం గా న్యూ మెక్సికో లోని” లాస్ ఆల్మోస్’ ను ఎన్ను కొన్నారు .ఒపెంహీమేర్ తనకు సలహా దారు మాత్రమె నని గ్రోవర్ ప్రకటించాడు .ఈ ఆటం బాంబు ప్రాజెక్ట్ ను 1942 లో ప్రారంభించి the Man hattan project గా పేరు పెట్టారు .అప్పటికే ఒపెంహీమేర్  ఫిలిప్స్ అనే మరో శాస్త్ర వేత్త తో కలిసి transmutation function of deutrons అనే పేపర్ ను మూడేళ్ళ క్రితమే ప్రకటించాడు .ఇది న్యూక్లియర్ ఫిజిక్స్ లో కొత్త ద్వారాలను తెరిచింది .దాంతో పాటు ఒపెంహీమేర్ ఒక్కడే on continued gravitational attraction అనే పేపర్ ను విడిగా సబ్మిట్ చేసి ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప పేపర్లలో ఒకటి గా ప్రసిద్ధి చెంది ఉన్నాడు .
ఈ అనుభవం ఒపెంహీమేర్ కు బాగా కలిసి వచ్చింది .లాస్ ఆల్మోనాస్ చాలా సుదూరం గా ఎవరికి అందు బాటు లేని స్తలం గా ఉంది కనుక రహస్య ప్రయోగాలకు అనువైన ప్రదేశం అని భావిచాడు .అతను ప్రయోగాత్మక శాస్త్ర వేత్త .కనుక ఆయనకు సహాయం గా వంద లాది ప్లంబర్లు శాస్త్ర వేత్తలు అవసరం .అందుకని యూరప్ లోను ,ఇతర దేశాలలోను అమెరికా లోను ఉన్న శాస్త్ర వేత్తలందరికి కబురు వెళ్ళింది .అందరు అంగీకరించి వచ్చారు .యుద్ధ నిపుణులు శాస్త్ర వేత్తలు ,ప్రయోగం నిర్వహించే వారు టెక్నీషియన్లు ,ఇజినీర్లు  అంతా కలిస్తే 3000 మంది అయారు .వీరినందర్నీ కలిపి ఉంచి అందరి మధ్య సహకారం పొంది బాంబు ను తయారు చేయాలి .మాన వ నాగరకత కోసం పని చేస్తున్నామనే అభి ప్రాయాన్ని వారందరి లో కలిగించాడు .రాబర్ట్ ఒపెంహీమేర్ ఆ సంస్థకు డైరెక్టర్ అయాడు .విషయాలనన్నిటిని తన బుర్రలోనే దాచుకొని పని చేయించాలి .ఎక్కడ లీకు అయినా ప్రమాదమే .ఎన్రికో ఫెర్మి  శాస్త్ర వేత్త కూడా వచ్చి చేరి సహకరించాడు ఇంత చేస్తున్నా రష్యా గూధ చారి సంస్థ కొంత ఇబ్బంది కలిగించింది .దాన్ని అదిగ మించారు .ఆయనకు సెక్యూరిటి కూడా ఇబ్బంది కరమే అయింది .
1944నీల్స్ బోర్ శాస్త్ర వేత్త ఈ ప్రాజెక్టు కు వచ్చి ,జరుగుతున్న పరిశోధనా వివ రాలను తెలుసుకొని సంతృప్తి చెందాడు .ఆయన ఫిజిక్స్ లో ”క్వాంటం”  విప్ల వాన్ని  తెచ్చిన  శాస్త్ర వేత్త .అయితే అనవసరం గా న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేస్తే అది మళ్ళీ యుద్ధానికి దారి తీస్తుంది అని భావిన్చాడాయన .అందుకని ప్రపంచ దేశాల శాస్త్ర వేత్తలందరూ కలిసి ఆలోచించాలి అని తన అభి ప్రాయం చెప్పాడు కూడా .ఈ భావాలకు ఒపెంహీమేర్ కొంత బాధ పడ్డాడు .రెండో దశ ప్రారంభ మైంది .జర్మని ఆటం బాంబు చేయటం లో విఫల మైందని తెలిసి పోయింది .అది లేక పోతే జర్మని గెలవదు అని అందరు నిశ్చ యానికివచ్చారు .బాంబు తయారు చేయటమా మానటమా అని సందేహం కల్గింది .కాని ఒపెంహీమేర్ పని ఆపటానికి వీలు లేదని ,కోన సాగించాలని చెప్పాడు .ఎట్లాగో జర్మని ఒడి పోతుంది కనుక బాంబు ను జెర్మని మీద ప్రయోగించరు అనే అభి ప్రాయానికి కొందరు .వచ్చారు .వీరితో ఈయన ఏకీభ  వించ లేదు .ఒపెంహీమేర్ .ఆటం బాంబు యొక్క విధ్వంసక శక్తిని ప్రపంచానికి తెలియ జేయాల్సిందే అన్నాడు .దీని కి  కొందరు అంగీకారం తెలుప లేదు.అప్పటికే యుద్ధం ముగిసి జెర్మని ఒడి పోయింది .
1945 june లో చికాగో వర్సిటి కి చెందినా కొందరు శాస్త్ర వేత్తలు అమెరికా బాంబు తయారు చేసినామొదటి సారి గా ఎవరి మీదా ప్రయోగించరాదు అని ఒక  దాన్ని యుద్ధం కోసం ఉపయోగిస్తే విశ్వ వినాశనమే జరుగుతుందని,ఇప్పటి దాకా అమెరికా కు ఉన్న ప్రజా బలం క్షీణిస్తుందని ,న్యూక్లియర్ ఆయుధాల పోటీ తీవ్ర మావు తుందని ,భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరిక గా ఒక మెమొరాండం సమర్పించారు .ఒపెంహీమేర్ కూడా ఆలోచన లో పడ్డాడు .అందుకని జెర్మని మీద కాకుండా జపాన్ నగరం మీద ఆటం బాంబు వేయాలి అని సైన్యానికి సలహా నిచ్చాడు .వారూ అంగీకరించారు .1945 july 16న మొదటి ఆటం బాంబు ను ప్రయోగాత్మకం గా న్యూ మెక్సికో లోని అలమో గార్దో దగ్గర ప్రయోగించారు .ఒపెంహీమేర్ స్వయం గా అక్కడే ఉండి ప్రత్యక్షం గా చూస్తూ పర్య వేక్షించాడు .అద్భుతం గా పని చేసి అనుకొన్న లక్శ్యం నేర వేరింది .అందరు ఆనందం లో మునిగి పోయారు .దీని ఫలితాన్ని చూసి ఒపెంహీమేర్ ”ఇక నుంచి ప్రపంచం ఇప్పటి లాగా ఉండదు .నాకు భగవద్గీత లో ”నేను ఇప్పుడు మృత్యువును .ప్రపంచాలను వినాశనం చేస్తాను .” అని చెప్ప బడిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి ”అన్నాడు .మిగిలిన వారంతా నిశ్శబ్దం గా విన్నారట .1945 august 6 న అమెరికన్ మిలిటరి మొదటి ఆటం బాంబు ను జపాన్ లోని హీరో షీమా పట్టణం పై ప్రయోగించింది .అక్కడే జపాను దేశపు డిఫెన్సు స్తావరం ఉంది . .కాని జపాను లొంగి పోలేదు .రెండో ఆటామిక్ బాంబు ను జపాను లోని నాగ సాకి పట్నం పై మూడు రోజుల తర్వాత అమెరికా వేసింది .ఇక్కడే జపానుకు చెందిన యుద్ధసన్నద్ధ స్థావరం ఉంది ..మొత్తం మీద రెండు బాంబుల వల్ల రెండు న్నర లక్షల మంది చని పోయారు .ఇంకో యాభై వేల మంది అణు దూలి కి బలి అయారు .సెప్టెంబర్ రెండు న జపాను లొంగి పోయింది .ఇలా జెర్మని ప్రపంచ వినాశనాన్ని కొని తెచ్చింది .
1945  అక్టోబర్ లో ఒపెంహీమేర్ 500 మంది శాస్త్ర వేత్త లను సమావేశ పరచి ఈ ప్రాజెక్ట్డైరెక్టర్ గా   తనకు అదే చివరి రోజు అని చెప్పాడు .శాస్త్ర వేత్త లందరూ అంకిత భావం తో కృషి చేసి సహకరించి నందుకు కృతజ్ఞతలను చెప్పు కొన్నాడు .వారి పని తీరుకు గర్వ పడుతున్నానని చెప్పాడు .కొంత కాలం తర్వాత లాస్ అల్మోనాస్ అ మరియు హీరోషీమాలను మానవ జాతి శపిస్తుందిఅన్నాడు .ఈ ప్రాజెక్ట్ పని అవగానే ,కాలి ఫోర్నియా కు వెళ్లి ,మళ్ళీ పాత జీవితం ప్రారంభించాడు ..1947 లో institute for advaanced study in priceton కు డైరెక్టర్ అయాడు .అక్కడే అయిన స్టీన్ శాస్త్ర వేత్త 14సంవత్స రాల నుండి ఉన్నాడు.ఒపెంహీమేర్ ఈ విశ్వ విద్యాలయాన్ని శాస్త్ర వేత్తలు ,సాంఘిక శాస్త్రజ్ఞులు   హూమనిష్టులు అందరు కలిసి పని చేసే కేంద్రం గా తయారు చేయాలని భావించాడు . 1946 లో అమెరికా atomic energy commission అనే పౌర సంస్థను  దానికి general advisory committee ను ఏర్పరచి ఒపెంహీమేర్ ను దానికి చైర్మన్ ను చేసి గౌరవించింది .ఒపెంహీమేర్ సృష్టించిన ఆటం బాంబు ”న్యూక్లియర్ ఫిషన్” ఆధారం గా నిర్మించ బడింది .ఆ తర్వాత ”సూపర్ ”అనే బాంబు తయారయింది .అదే హైడ్రోజెన్ బాంబు .దీనిలో” న్యూక్లియర్ ఫూజన్” సూత్రాన్ని ఉప యోగిచారు .దీని పై ఒపెంహీమేర్ స్పందిస్తూ హైడ్రోజెన్ బాంబు నిర్మించటం తగని పని అన్నాడు .ఇది మానవాళికి మహోపద్రవాన్ని తెస్తున్దన్నాడు .ఆ నాటి అమెరికన్ అధ్యక్షుడు హారీ ట్రూమన్ దీన్ని పట్టించు కోకుండా ఆటం బాంబు తో పాటు హైడ్రోజెన్ బాంబు నూA,E.C. తయారు చేయాల్సిందే  అని ఈ సంస్థకు విస్పష్టం గా తెలియజేశాడు .రష్యా తయారు చేస్తుందనే భయం  కూడా ఉంది .అప్పుడు ప్రపంచం అంతా ద్వి ధ్రువ దేశాల మధ్య చీలి పోయాయి .
హంగేరి శాస్ర వేత్త ఎడ్వార్డ్ టేల్లార్  సూపర్ అన బడే హైడ్రోజెన్ బాంబు   కు రూప కల్పన చేశాడు .దాన్ని ఉత్తర ఫసిఫిక్ సముద్రం లో1952 november 1 న ప్రయోగించారు .1952 లో అయిసన్ హోవర్ అమెరికా అధ్యక్షు డై నాడు .ఒపెంహీమేర్ మీద కమ్యూనిస్ట్ అభి మాని అని హైడ్రోజెన్ బాంబు అమెరికా తయారు చేయకుండా అడ్డగించాడని ఆరోపణలు వచ్చాయి అప్పుడు మేకార్దీఅనే రిపబ్లికన్ పార్టి సెనేటర్  కమ్యూనిస్టులపై విరుచుకు పడే వాడు .అతని విధానాలు క్రూరం గా ఉండేవి. వాటిని మేకార్దీ చర్యలని సభ్య సమాజం ఈస డించు కొంది  ఆ తర్వాతా ఒపెంహీమేర్ మీద అభియోగం రుజువు కాలేదు .చివరికి మేకార్దీని  సెనేట అభి శంసించింది .అయితే ఒపెంహీమేర్ ఇంకా యే ప్రభుత్వ పదవులు నిర్వహించ రాదనీ తీర్మానించింది ..1963 లో లిన్డన్ బి.జాన్సన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఒపెంహీమేర్ కు అటామిక్ ఎనర్జీ యొక్క అత్యున్నత పురస్కారాన్ని తన చేతుల మీదు గా అంద జేశాడు .జీవితపు చివరి రోజుల్లో ఒపెంహీమేర్ ప్రపంచ శాంతి కోసం కృషి చేశాడు .మళ్ళీ institute of advanced study  కి దాని పాలక వర్గం ఒపెంహీమేర్ ను డైరెక్టర్ చేసి గౌర వించింది .
రాబర్ట్ ఒపెంహీమేర్ 1904 april 22న ధన వంతులైన యూదు కుటుంబం లో జన్మించాడు .జెర్మని లో చదివాడు .హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో పై చదువులు పూర్తీ చేశాడు .బెర్కిలీ లో experimental physicist అయాడు .1938లో న్యూట్రాన్ స్టార్స్ మీద ప్రయోగాలు చేశాడు .న్యూట్రాన్ స్టార్ అంటే -చాలా సాంద్రత ఉన్న నక్షత్రం సూపర్ నోవాలో కూలి పోయేది .దీనికి కారణం gravitational collapse  .మిగిలిన విషయాలన్నీ పైన చెప్పుకోన్నవే .ఒపెంహీమేర్ ముఖ చిత్రం తో time mgazine 1948 november 8 సంచిక ను ప్రచురించి ఒపెంహీమేర్ కు అతున్నత స్థానాన్ని ,గౌరవాన్ని  కల్పించింది .అణు బాంబు పిత ”(ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ )అయిన ఒపెంహీమేర్ 1967  ఫిబ్రవరి పద్దెనిమిది న మరణించాడు .ఆయన ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేవాడు ”science is not answer for every thing . .But science very beautiful ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

విహంగ వెబ్ పత్రిక లో వచ్చిన వ్యాసం

విహంగ వెబ్ పత్రిక లో వచ్చిన వ్యాసం 

మధ్య యుగపు గ్రీకు మహిళ

గ్రీకు సమాజం

                     ముందు గా ఆ నాటి సమాజ స్థితి తెలుసు కొందాం .పోలిస్ అంటే సిటి స్టేట్ అని అర్ధం .దాని లోంచే పోలిటిక్స్ అనే పదం వచ్చింది ..ఏ రెండు పోలిస్ లు ఒకటి గా ఉండవు .అలాగే పాలిటిక్స్ కూడా అలానేఉంటున్న సంగతి మనకు తెలిసిందే .నాగరక పట్టణాల ముఖ్య కేంద్రాలనే పోలిస్ అంటారు .అందు లోని జనాన్ని ”పోలిటిసి ”అంటారు .అంటే పౌరులు అని భావం .గ్రీకులు మొదటగా మాసిడోనియన్లకు ,తర్వాత రోమ్ కు స్వాతంత్రాన్ని కోల్పోయారు .గ్రీకులు అంటే రాజకీయం గా స్వంతత్రం గా ఉండే సమాజం .(కమ్యూనిటి ).దీన్నే గ్రీకిజం అన్నారు .భాషా ,మత ,సాంఘికంగా గ్రీసును ”మాగ్నా గ్రేషియా ”అంటే గొప్ప గ్రీసు అనిఅంటారు .630-480 b.c.కాలాన్ని ”ఆర్కాయిక్ ”లేక ప్రాచీన కాలం అంటారు .600-700 b.c.కాలాన్ని ”టి రంట్ ”కాలం అన్నారు .అంటే ఎవరికి వారు తనను రాజుగా ప్రకటించు కొన్న కాలం .507 b.c.లో”క్లీస్తేనిస్ ” అనే రాజు జనాన్ని వర్గీకరించాడు .”డెమి”అంటే గ్రామాలుగా వర్గీక రించాడు .

ఏగ్రామం లో ఏ తండ్రికి ఏ కొడుకో అనే విషయాన్ని రికార్డ్ చేయించాడు .అప్పటికి 39 దేమ్స్ఏర్పడ్డాయి .పది కొత్తఆటవిక జాతుల వారు ”సింగిల్ జీనో ”గా ఉన్నారు .జనం అంతా అనేక తెగలుగా విడి పోయారు .దీనినే ”నోబుల్ కింగ్ గ్రూప్”అన్నారు .అందుకనే క్లీస్తేన్స్ ను ”ఫాదర్ ఆఫ్ డేమోక్రసి ”అని పిలుచు కుంటారు .

అలెగ్జాండర్ మరణం తర్వాత రోమన్ దండ యాత్ర వరకు ఉన్న కాలాన్ని ”హెల్లెనిస్టిక్ పీరియడ్ ”అంటారు .అంటే గ్రీకు సంస్కృతి సజీవం గా ఉన్న కాలం అని అర్ధం .776 b.c.నుంచే గ్రీకు చరిత్ర లభ్యమవుతోంది.అదే ఒలిమ్పిల్ క్రీడలు ప్రారంభ మైన సంవత్సరం .ఏధెన్స్ నగర రికార్డు 683 b.c.లో దొరికింది .గ్రీకులు నెలలో28 వ రోజున ”ఎథీనా పోలియాస్ ”అనే దేవత ను పూజించే వారు .”కేక్రోప్” ఏధెన్స్ కు మొదటిరాజు .

సంవత్సర గణనం

ఏధెన్స్ వారికి సంవత్సరాది లేదు .దీనికి కారణం వారి పంచాంగం చాంద్రమానం మీద ఆధార పడి ఉండటమే .నెల వారీ పనులు ,అప్పులు తీర్చే నెల మాత్రం గుర్తుంచు కొనే వారు .సూర్య మానం ప్రకారం సంవత్సరానికి పద కొండు రోజులు తక్కువ వీరి ఏడాది .కనుక 19 ఏళ్లలో ఏడు నెలల కాలాన్ని కలుపు కొని సరి చేసుకొంటారు .అప్పుడే సూర్య సిద్ధాంతానికి సరి పోతుంది ”.Esoids works and days”ప్రకారం కంచుయుగం ముగిసి ,ఇనుప యుగం ప్రారంభం అవుతుంది .దీనితో జీవిత కాలం తగ్గి పోతుందనే భావన .మన కలికాలం లాగా అన్న మాట .పసి తనం ముసలి తనం తేడా ఉండదు .తండ్రికి కొడుక్కి పోలిక ఉండదు.స్నేహితుల మధ్య సయోధ్య ఉండదు .అన్న దమ్ముల మధ్య సఖ్యత లేదు .దేవుడంటే భయం ఉండదు .ఒకర్నొకరు తిట్టు కోవటం ,కొట్టు కోవటం ఎక్కువ అవుతుంది .పెద్ద వాళ్ళు అంటే కొద్దిగా కూడా గౌరవంఉండదు .నైతిక విలువలు ,వావి వరుసలు పాటించరు .zeus అనే దేవత మాన వాలిని అంతం చేస్తాడు .”అయ్యో నేను ఆ కాలం లో నూ లేను ,ఈ కాలం లోను లేను మధ్య ఇనుప యుగం లో ఉండి పోయానే ”అనిఒక కవి వాపోతాడు .మళ్ళీ స్వర్ణ యుగం వస్తుందని ఆశ గా ఎదురు చూస్తూ ఉంటారు జనం .అప్పటికి 139 స్థానిక జిల్లాలు అంటే demesఉన్నాయి .

గ్రీకు మహిళ

స్త్రీ ని అందం ,అఆకర్షణ ,తెలివి ,వంచన తో కూడిన దానిని గా గ్రీకులు భావించే వారు .ఆమె భర్త కు విశ్వాసం తో సేవ చేయాలి .తమ కంటే ఎక్కువ వయసు లో ఉన్న వారితోను ,ముసలి వారితోను చిన్న తనంలోనే ఆడ పిల్లలకు వివాహాలు చేసే వారు .ఆడపిల్లకు అయిదేళ్ళు వస్తే చాలు పెళ్లి చేసేసే వారు .అప్పటికి ఆమెకు కన్యత్వం వచ్చి నట్లే .మగాడికి ముప్ఫై ఏళ్లకు పెళ్లి వయసు .చట్టం లో పన్నెండేళ్ళు దాటినతరువాతే అని ఉన్నా అతి బాల్య వివాహాలే చేసే వారు . తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలే ఎక్కువ . రాత్రి పడక సుఖానికే ఆడది అనే భావం మరీ బలం గా ఉండేది .కన్య తలిదండ్రులనుప్ర లోభ పెట్టివివాహం చేసేవారు .పెళ్ళికి ముందు చర్చోప చర్చలు జరుగు తాయి .డబ్బు ,అధికారం మాత్రమె వరుడికి కావలసిన లక్షణాలు .ఆప్యాయతా ,ప్రేమ ,అనురాగాల వంటి మనో భావాలక్కర లేదు .పిల్లల్ని కనీ ,వంశంనిలబెట్టడమే ఆడ దాని పని .మన లాగ ”వర శుల్కం ”ఇచ్చి వరుడిని కొనుక్కోవటమే .లేక పోతే పెళ్లి జరగదు పైగా సంఘ బహిష్కరణ చేసే వారు .కట్నం ఎందుకు అంటే పెళ్ళానికి అన్నం పెట్ట టానికే నని ఘంటాపధం గా చెప్పే వారు .ఒక వేళఇద్దరికీ పడక విడాకులు ఇవ్వాల్సి వస్తే తీసు కొన్న కట్నం అంతా పిల్ల తండ్రికి తిరిగి ఇచ్చి వేయాల్సిందే .సకాలం లో చెల్లించ లేక పోతే వడ్డీ తో సహా చెల్లించాల్సిందే .పుట్టినింటినుంచి ఆమె తెచ్చుకొన్న సామగ్రిని అంతా పూచిక పుల్లతో సహా అల్లుడు తిరిగి ఇచ్చి వేయాల్సిందే .ఇది ఒక రకం గా విడాకుల తో బయట పడ్డ ఆడపిల్లలకు ఉపశమనం .

మగ పిల్లలు లేకుండా తండ్రి చని పోతే ఆ ఇంటి ఆస్తి epikloros అవుతుంది .అంటే ప్రభుత్వాధీనం అవుతుంది .పెళ్లి చేసుకొంటే ,ఆమె ఆస్తిని ప్రభుత్వం తిరిగి అప్ప గిస్తుంది .దగ్గర బంధువు ఆమె ను ,ఆమె ఆస్తి నితనది అని వాదించి(claim ) పొందే అవకాశం ఉంది .ఆస్తి పరులకు దక్కకుండా ,కుటుంబం లోనే ఉండి పోవటానికే ఈ ఏర్పాటు .అందుకనే ఎక్కువ వివాహాలు బంధుత్వం లోనే జరిగేవి .అందులోనూ డబ్బున్నవారితోనే పెళ్ళిళ్ళు .

పెళ్లి సంబరం

వివాహం అవగానే అత్తా వారిల్లూ ,సంసార బాధ్యతలు చేబట్టాల్సిందే .పిల్లల్ని కనీ పెంచటమే పని .శీతా కాలం లో నే పెళ్ళిళ్ళు ఎక్కువ గా జరుగు తాయి మంగళ స్నానాలు చేయిస్తారు .దీన్నే loutra sacred water అంటారు .తర్వాతా విందు జరుగుతుంది  .పెళ్లి కూతురు ప్రక్కన ముసలి ముత్తైదువు కూర్చోవాలి .ఆమెను nympheutria అంటారు .ఆమె ఆధ్వర్యం లోనే పెళ్లి .చిన్న చిన్న కేకులు నువ్వులతో కలిపిఅందరికి పంచి  పెడ తారు .ఇవి ఆమె ను సంతాన వతి ని చేస్తాయనే నమ్మకం .మన ”చిమ్మిరి” లాంటిది . దంపతులను బండిలో ఊరేగిస్తారు .మంత్రాలు చదువు తారు .

అత్తవారిల్లు

ఊరేగింపుతో అత్తవారింట్లో ప్రవేశిస్తుంది పెళ్లి అయిన అమ్మాయి .ఇంట్లో కాలు పెట్ట గానే వక్కలు ,ఎండిన పళ్ళు దంపతుల మీద చల్లుతారు .పడకటింటి  లోకి  కాలు పెట్టే  ముందు epithalamion అనేమంత్రంబిగ్గరగా . చదువు తారు –లోపల రతి కార్యం లో ఆమె చేసే ఆక్రందనలు బయటికి విని పించ కుండా .ఇవన్నీ ప్రైవేట్ పెళ్లిళ్ళే  -ప్రభుత్వానికేమీ సంబంధం లేదు.

మగ పిల్లాడినే కనాలి .మగ పిల్లాడి కోసం కుటుంబం ,సమాజం స్త్రీ పై ఎక్కువ గా ఒత్తిడి తెస్తారు .కనీసం అయిదుగురి నైనా కనాలి .రతి కార్యానికి విముఖ మైతే ఆరోగ్యం చెడి పోతుందనే ప్రచారం ఎక్కువ గాఉంటుంది .ఇంకా పూర్తిగా కన్యత్వం రాకుండానే స్త్రీలు పిల్లల్ని కనే వారు .ఆరోగ్యాలు పాడై పోయేవి .”ఈ ప్రసవం కంటే మూడు సార్లు యుద్ధానికి వెళ్లి పోట్లాడతాను ”అని మహిళ అనుకునేదని ఒక కవి రాశాడు .అంటేపాపం ఆమె అంత నరక యాతన పడేదని భావం .స్త్రీ గర్భం ధరించక పోతే ,ఆమె మీదనే అనుమానం తో బాటు అవమానం కూడా.ఆడ వాళ్ళ ను బహిరంగం గా పొగడటం నేరం కిందే లెక్క . వూలు వడకటం బట్టలు నేయటం ఆమె నిత్య కృత్యం .మగాళ్ళు వీధుల్లో గప్పాలు కొడుతూ బె ఫర్వాగా ,దసరా బుల్లోళ్ళలాగా తిరుగుతుండే వాళ్ళు .మహిళ అవసరం వచ్చి బయటకు వెళ్ళాలి అంటే బానిసలు వెంట రక్షణ గాఉండాల్సిందే .

పండుగలు -పబ్బాలు –పునర్వివాహాలు

      The Smophoria అనే పండుగకు మగ వాళ్లెవరు హాజరు కారు .అంత్య క్రియల్లో ఆడ వాళ్ళు పాల్గొంటారు .శవాన్ని పాతటానికి ఆడ వాళ్ళే గోతులు తవ్వుతారు .ఆడదానికి పొలం,ఇల్లూ అమ్మే హక్కులేదు .ఆస్తి సంక్రమించినా ,ఇంట్లో ఎవడో ఒక మగాడే పెత్తందారు .ఆమె కొడుకులకే అధికారాలు సంక్రమిస్తాయి .

ఇరవై ఏళ్ళ కే స్త్రీలు విధవలు గా మారి పోయే వారు .కారణం” ముసలి మొగుడు -పసి పెళ్ళాం ”.యువ విధవలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు .వయసు ముదిరిన వారు వారికి ఇష్టమైతే మళ్ళీ పెళ్లి చేసుకొనేఅవకాశం ఉంది .విధవలకు ,విడాకులు పొందిన మహిళలకు తండ్రి ఇంట్లో ఆర్ధిక సౌకర్యం ఉండేది. .

ఇతర దేశస్తులతో ,వేశ్య లతో ,కట్నం లేని విధవ లతో వివాహాలు జరుపుకో వచ్చు .దీన్నిpallaki అంటారు .ఆ భర్త అసలు భర్త లాంటి వాడే అవుతాడు .కాని విడాకులు పొందితే కట్నం తిరిగి రాదు .వీరిసంతానాన్ని పౌరులు గా భావించరు .ఇప్పటి వరకు మనం చెప్పు కున్నది అంతా ఉన్నత ,ధనిక కుటుంబాలకు చెందినా విషయాలు మాత్రమే .

పేద ఆడ పిల్లలు ,విధవలు రోడ్ల పాలే .వారినెవరూ పట్టించుకోరు .ఎవరికీ సంబంధం లేకుండా ఆడ పిల్ల పుడితే ఆమెకు వేశ్యా వృత్తే శరణ్యం .వేశ్యలపై పన్నులు వేస్తారు .ఆమె ను female companionఅంటారు .వీళ్ళు సభలకు వెళ్ళవచ్చు .వేదాంత విషయాలలో ఆమెను సంప్రదిస్తారు .ఆమె మాటకు విలువ ఎక్కువ .మగ వారి కంటే ,ఆడ వారి జీవిత కాలంతక్కువ.మహిళ చదువు కొనే వీలే లేదు .స్త్రీ ని”మైనర్”అనే భావిస్తారు .

ప్రసవం -మైల -పుట్ట్టిన రోజు పండుగ

ప్రసవ సమయం లో మగ డాక్టర్లు ఉంటారు .”maia”అనే మంత్ర సాని ఉంటుంది .ఆమెను దేవత గా భావిస్తారు .పురుడు వల్ల ఇల్లు మైల పడుతుందని (pollute )భావిస్తారు .మగ పిల్లాడు పుడితే ఆలివ్ కొమ్మ ను,ఆడ పిల్ల పుడితే వూల్ ముక్క ను ముందు గది తలుపు పై  పెడ తారు .గది గోడలను పిచ్ తో అలికి మైల తగల కుండా సమాజం లోకి ఆ మైల వ్యాపించ కుండా చేస్తారు .

అయిదవ రోజు ఇంట్లో అందరికి పిల్లాడి ని చూపించే వేడుక చేస్తారు .తండ్రి అగ్ని (hearth) చుట్టూ పిల్లాడిని బుజం మీద వేసుకొని ప్రదక్షిణ చేస్తాడు .దీని వల్ల దృష్టి దోష నివారణ జరుగుతుందని భావిస్తారు .పదవరోజున పేరు పెడతారు .తాత గారి పేరును పెద్ద కుర్రాడికి పెట్టటం సంప్రదాయం .

పిల్లలకు పాలు ఇచ్చే ఆయాలుంటారు .వీళ్ళు బానిస స్త్రీలే .పదహారు నెలలు పాలు ఇస్తారు .దానికోసం యజమాని డబ్బు అందజేస్తాడు .

గర్భస్రావానికి అనుమతి ఉంది అది కూడా ఆమె పరిస్తితి ఆందోళనకరంగా ఉంటే మాత్రమే అనుమతిస్తారు .ఆడవాళ్ళను -ముఖ్యం గా కుంటి ,గుడ్డి ,వాళ్ళ ను ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుందనే నెపం తోబయటకు తరిమేస్తారు .గ్రీకు దేశం లో ఈ నాటి కుటుంబ వ్యవస్థ కంటే,ఆనాడే కుటుంబ వ్యవస్థ పటిష్టం గా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు .

ముసలి వారు

ముసలి వారిని కాపాడే బాధ్యత సంతానానికి ఉంది .దీనినే gerobosika అంటారు .చూడక పోతే జైలు పాలు అవ్వాల్సిందే .సాధారణ గ్రీకులు ఆరోగ్యవంతులే.పెద్దలంటే గౌరవం,భక్తీ ఎక్కువే .పెద్దలు వీధుల్లోనడుస్తుంటే , గౌరవం గా పక్కకు తప్పుకునే మంచి సంప్రదాయం ఉంది .వాళ్ళు ఇంట్లోకి వస్తే లేచి నిలబడి ఆహ్వానిస్తారు .అయితే గ్రీకు డాక్టర్లకు ముసలి వ్యాధి గ్రస్తులపై శ్రద్ధ చాలా తక్కువ .పట్టించు కోరు .అందుకనిముసలి వారు పెయిన్ కిల్లర్లను వాడి ఆత్మ హత్యలు చేసుకోవటం దారుణం గా ఉంటుంది .ఇవన్నీ  చూస్తుంటే మనకూ వారికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది కదూ !

-గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

పార్ధ సారధీయం

   పార్ధ సారధీయం 
అందరికి   శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలు .పార్ధుడు అంటే అర్జునుడు .అతనికి సారధి శ్రీ కృష్ణుడు కనుక కృష్ణుడు పార్ధ సారధి అని పిలువ బడుతున్నాడు .కృష్ణుడు చెప్పింది” పార్ధ సారధీయం .” అదే భగవద్గీత .దాని సందేశాన్ని  మా అమ్మాయి ఇంటి ప్రక్కన ఉంటున్న మారెళ్ళ గాయత్రి గారి తండ్రి గారు స్వర్గీయ మారెళ్ళ పార్ధ సారధి రావు గారు ”గీతా సందేశం ”పేర పుస్తకం రాసి ప్రచురించారు .ఆవిడ ఆపుస్తకాన్ని ఈ మధ్యనే ఇచ్చింది .అందులోని విషయాలను సంక్షిప్తం గా ‘పార్ధ  సారధీయం ” అని ఆయన పేరు  కూడా వచ్చేటట్లు ”కృష్ణాష్టమి” సందర్భం గా అందిస్తున్నాను .
న్యూటన్ శాస్త్రజ్ఞుడు పదార్ధము ను సృస్తిన్చలేమని ,నశింప జేయ లేమని అన్నాడు .అది ఒక రూపం నుండి వేరొక రూపం లోకి మారుతుంది . అలాగే ఈ జన్మ పోయి ఇంకో జన్మ కూడా వస్తుంది అయిస్తీన్ సిద్ధాంతం ప్రకారం కూడా ,విశ్వ పదార్ధ మూల మైన పరమాణువులు విచ్చేదంచెంది ,నిరాకారమైన శక్తి తరంగాలుగా మారుతాయి .వీటిని ఊహించటం ,వర్ణించటం చేయ లేమని అన్నాడు దీనినే ఆయన undefinable unified theory అన్నాడు .బౌద్ధ గురువు లాబ్ సాంగ్ రామ్పా –గ్రుడ్డు రూపం లోనుంచి గొంగళి పురుగు గా మారి సీతా కొక చిలుక ఏర్పడుతుంది .దానికి తాను గొంగళి పురుగు నుండి వచ్చి నట్లు తెలియదు .అది ఒక దశ నుండి మరణం లాంటి స్తితినే పొంది ,మరొక దశను పొందింది .మనం అది పొందే రూప విక్రియలన్ని చూడ గాలుగుతున్నాం .దీన్ని బట్టి ఆలోచిస్తే మన పునర్జన్మ సిద్ధాతం కూడా అలాంటిదే నని పిస్తుంది అన్నారు ..అందుకే భగవద్గీతలో భగవానుడు ”శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయ గలవు .ఆత్మను మాత్రం ఏమీ చేయలేవు .శస్త్రాలు నిప్పు ,గాలి శరీరాన్ని నాశనం చేయ గలవు .కాని ఆత్మను నాశనం చేయలేవు .ఆత్మ నిత్యం .అంతటా వ్యాపించి ఉంటుంది .అది స్తిరం ,అచలం ,సనాతనం .బాహ్య భూత వికారాలేవీ దాన్నేమీ చేయలేవు .
ధర్మ పోరాటం లో జయాప జయాలు లాభ నష్టాలు బేరీజు వెయ రాదు .ధర్మమే లక్ష్యం గా కర్తవ్యాన్ని కోన సాగించాలి .క్షత్రియుడికి యుద్ధం చేయటం స్వధర్మం .కనుక మనకు నిర్దేశింప బడిన కార్యాలను తప్పక చేయాలి .కర్తవ్య దీక్షతో ,అంకిత భావం తో చేయాలి .శక్తి యుక్తులన్నీ ధార పోసి  చేయాలి అని కృష్ణుని బోధ .కర్మలు చేసే టప్పుడు ఫలితం ఆశించ కుండా చేయాలి .భగవంతుని అర్పించే భావం తో చేయాలి అప్పుడు ఆ కర్మలు మనల్ని బంధించవు .అలాగని చెడ్డ పనులు చేసి వాటినీ భగవంతునికి అర్పణం అంటే బెడిసి కొడతాయి .దీనినే” కానందుడు ”అంటే వివేకా నంద స్వామి ”Results will follow in course   of time .one can not get results just as one pleases .one can not cancel them .,escape from them ,or mitigate them .Anxious expectations of results will only lead to restlessness and worry ”అని స్పష్ట పరచాడు .
పరమాత్మ అంటే సచ్చిదా నంద స్వరూపుడు .సత్ అంటే -భూత ,భవిష్యత్ ,వార్త మానాలలో ఎప్పుడు నిలకడ గా నిలిచి ఉండేది .చిత్ అనగా -విజ్ఞాన సర్వస్వం( knoweldge ).ఆనందం అంటే -అపరి మిత మైన సంతోషం(bliss ) .వీటి సమ్మేళనమే భగవంతుడు .ఆయన సర్వ వ్యాపి ,సర్వజ్ఞుడు ,సర్వ శక్తి మంతుడు ,ఆనంద  మయుడు అని వీటి భావం .ఆయన ఒక శక్తి స్వరూపం .జీవుడు ఆ పరమాత్మ తత్వానికిప్రతి బింబం .ఆత్మ అనేది పరమాత్మ యొక్క వెలుగు .ఆత్మ తత్త్వం ,మళ్ళీ ఆ పరమాత్మ తత్వాన్ని పొందటమే .ప్రతి జీవి తన అంతరాంతరాల్లోతాను కోరుకొనేది -ఎల్లప్పుడు  ఉండాలని (సత్ ),తాను అన్నీ తెలుసు కోవాలని (చిత్ ),తాను ఎప్పుడూ సంతోషం గా ఉండాలని (ఆనందం )కోరుకొంటు నే ఉంటాడు .ఈ సచ్చిదానంద స్వరూపం కావాలని ,తిరిగి పరమాత్మ లో ఐక్యం అవాలని చేసే ప్రయత్నమే జీవిత గమ్యం .ఈ జీవిత యానం లో చేసే మంచి ,చెడు కార్యాలు వాసనలు (tendencies )ఏర్పడి ,ఆ పాప పుణ్యాల ను అనుభ వించ టానికి మరో శరీరాన్ని ధరిస్తున్నాడు .ఈ  బంధాలన్నీ విడి పోతే ,జన్మ రాహిత్యాన్ని పొంది ,మోక్షాన్ని పొందుతాడు .ఇక్కడే భారతీయ తత్వ వేత్తలు మూడు సిద్ధాంతాలను ప్రతి పాదించారు .ఆది శంకరులది -అద్వైత సిద్ధాంతం -పరమా త్మ యొక్క మాయయే ఈ జగత్తు .మానవులు అజ్ఞానం వల్ల పరమాత్మ తత్వాన్ని కోల్పోయి మానవుడు అని భ్రమ లో ఉంటాడు .ఆ అజ్ఞానం తొలగితే ,మానవుడే మాధవుడవు తాడని దీని భావం .రామానుజా చార్యుల వారిది విశిష్టాద్వైతం –పరమాత్మ తేజో మయుడు అయితే ,ఆయన వెలుగు మానవులు .ఆయన అగ్ని జ్వాల అయితే ,మానవులు అగ్ని కణాలు .వైరాగ్యం ద్వారా మానవుడు మళ్ళీ పరమాత్మను చేరుతున్నాడు .ఇదీ వీరి పద్ధతి .మూడోది మధ్వాచార్యుల వారి ద్వైత సిద్ధాంతం –భగవంతుడు వేరు ,ఆయనకు అత్యంత ప్రియ భక్తుడైన మానవుడు వేరు .మానవుడు భక్తీ ద్వారా ,భగ వంతుని సన్నిధానానికి చేరి ,పరమ శాంతిని పొందుతాడని ఈ సిద్ధాంతం ఈ మూడు వేరుగా కనీ పిస్తున్నా అది నిజం కాదు .ప్రాధమిక దశలో ద్వైతాన్ని అనుసరించి భక్తుడు అవుతాడు .తర్వాత విశిష్టాద్వైతం ద్వారా ధ్యాన పద్ధతి లోదగ్గరై, అద్వైత విధానం లో జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు .ఇలా భావిస్తే ఏమీ విరోధం లేదు .మహానుభావులు మనకోసం సోపాన పంక్తుల్ని నిర్మించారు .ఆ మెట్లు ఎక్కి మనం చేరాల్సిన చోటికి చేరాలి .
పరమాత్మ గంభీర సముద్రం వలె ప్రశాంతికి ప్రతీక .సముద్రం లో పుట్టే ,కెర టాల లాగా ఆత్మలు జీవితాన్ని ధరించి ,తిరిగి సముద్రం లో కలిసి పోతు ఉంటాయి.కెరటం పైకి లేస్తే జీవితం గా కనీ పిస్తుంది .అది సముద్రం లో కలిసి తన అస్తిత్వాన్ని కోల్పోయి లయం అవుతున్నప్పుడు మరణం గా భావించాలి .కెరటం అసలు స్వరూపం ప్రశాంత గంభీర సముద్రమే .అందుకే మహర్షులందరు తమ మేధస్సులో వేద వాక్యాలను విని రుక్కులు గా సాక్షాత్క రింప జేశారు .వారు చెప్పిందేమిటి ?”మీరు అమృత పుత్రులు .ఆనంద స్వరూపులు .అంధకారానికి అవతల ఉన్న భ్రాంతికి అతీతుడైన ,సనాతనుడైన ,భగవంతుని మేమందరం దర్శించాం . .ఆ భగ వంతుని తెలుసు కొంటేనే బాధలు, భ్రమలు అన్నీ తొలగి పోతాయి ” అని విస్పష్టం గా మార్గ దర్శనం చేశారు .
యోగ నిష్ఠ తో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి .కర్మలలో సంగాత్వాన్ని లేకుండా ఉండాలి (.నాన్ అటాచ్ మెంట్ ).ఫలితం లభించినా ,లభించక యినా సమ బుద్ధి కలిగి ఉండాలి (equanimity )కలిగి ఉండాలి .దీనినే మహేష్ యోగి ఇంకో రకం గా వివరించారు .సమస్యను పరిష్కరించ టానికి ఆ సమస్యకు దూరం గా ,అతీతం గా ఉండి ,ఆలోచించి తె పరిష్కారం తేలిగ్గా లభిస్తుంది .ఒక విల్లు తో బాణాన్ని సంధించి నప్పుడు ,వింటిని వెనక్కి లాగి బాణం వదులు తాము .అప్పుడది వేగం గా లక్శ్యం వైపుకు దూసుకు వెడుతుంది .ఈ వెనక్కు లాగటం అనేది సమస్యల వలయం నుండి దూరం గా వెళ్లటం లాంటిది (withdrawn from the field of activity .).యోగం అంటే కర్మలను ఆచరించే టప్పుడు చూపించే కౌశలం ,సంపూర్ణ జ్ఞానమే .అప్పుడే దక్షత (efficiency )వస్తుంది .జడస్తితి లో ఉన్న మనిషి కి ,యే ఆశయమూ లేని వ్యక్తికీ కోరికలు ఉండక పోవచ్చు .ఆత్మా నందం పొందిన వాడి లో కోరికలు ,దుఖాలు దగ్గరకు చేరవు .ఆ స్తితి లో తన విద్యుక్త ధర్మాన్ని అనాసక్తి తో నేర ర్చటమే స్తిత ప్రజ్నుని లక్షణం .అతడు ప్రపంచం లోని పాప కార్యాలను ప్రోత్స హించడు. వాటి వల్ల చలించడు .ఇదీ ”పార్ధ సారధీయం ”అనే గీతా సందేశం .
.                శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షల తో –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -08 -12 .కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –30 (చివరి భాగం ) ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య ప్రయోజనాలు –4

తిక్కన భారతం –30 (చివరి భాగం )
ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య ప్రయోజనాలు –4

మౌసల పర్వం లోని అర్జునుడు పూర్వపు అర్జునుడు కాదు .ఆ ఉత్సాహం ఇప్పుడు లేదు .ఆ పౌరుష గామ్భీర్యాలూ లేవు .అన్నీ నశించాయి .అతని లోని దశా భేదాన్ని అనుసరించి ,పాత్ర పోషణ చేశాడు తిక్కన కవీశ్వరుడు .చక్కని ఔచిత్యమూ పాటించాడు .సైంధవ వధ రోజున లోకాతీతం అద్భుతం దివ్య మైన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించాడు .మౌసలం లో కేవలం నరుడే అయాడు శాంతి ,స్థైర్యం ,ఉచితజ్నత ,బంధు ధర్మం ,ప్రజా రక్షణ ,పరిణత జ్ఞానం ఇప్పుడు అర్జునుడిని ఆవేశించాయి .ప్రాపంచిక విషయాల పై వైముఖ్యమేర్పడింది .విధి విలాసాన్ని తప్పించటం ఎవరి వల్లా కాదు అనే జ్ఞానం కలిగింది .దాని వల్ల నిరా సక్తత ఏర్పడింది .అందుచే విషాద ,కరుణ రసాలు ఈ పర్వం లో చోటు చేసుకొన్నాయి .ఉప నాయకుని గా అర్జునుడు , బావ ,త్రిలోక రక్షకుడు ,జగన్నాధుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ చివరి ఆదేశాన్ని శిరసా వహించి ,తన ధర్మాన్ని నిర్వర్తించాడు .
సంచిత కర్మ భారత ఇతి వృత్తం లో ప్రచ్చన్నం గా అనుస్యూతం గా ,నడుస్తుంది .విధి ప్రాబల్యం ప్రకాశితం అయింది .–”వినుము ,పురాతన జన్మం –బున జేసిన యట్టి కర్మముల ఫలములు ప్రా –జ్నుని నైన బొందు ,వానికి –నది శోకము  నావహించు ,నత్యంతంబున్ ” పూర్వ జన్మం లో చేసిన కర్మల్ని బట్టి ,ఫలాలు కలుగుతాయి .ఎంత జ్ఞానికైనా అవి తప్పవు .దానితో శోకమూ అతనికి తప్పదు అని సందేశం .ఇలా అవసర మైన అన్ని సన్నీ వేషాలలో తిక్కన విధి విలాసాన్ని విస్పష్టం గా చెప్పాడు .”నముచి కధ ”లో దేవేంద్రునితో దైవం కాల ప్రభావాన్ని స్పష్టం గా ఎరుక పరిచాడు .–”సకల భూతంబు లకు శాసకుడు కలడు –గాదే ,యొక్కరు డాతని కల్పనమున –ప్రాప్త మైనది నీళ్లులు పల్లమునకు -వచ్చు క్రియ దాన వచ్చు గీర్వాణ ముఖ్యా ”!దేవేంద్రా!  సకల భూతాలను శాసించే సృష్టికర్త సంకల్పం వల్ల మన కేది ప్రాప్తమో అది నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించి నట్లు మనకు సంక్రమిస్తుంది అని భగవంతుడే దేవతల రాజు అయిన మహేన్ద్రునికి చెప్పాడు .కనుక మానవ మాత్రులం మనం ఎక్కడ ? అలాగే వ్యాస భాగ వానుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు కూడా అర్జునునికి -”కాల మూలంబు సర్వంబు గాన ,దీని –కొండు తలంపులు దక్కి ,మీరుత్త మంపు ,–గతికి జనుడు  ,నిశ్చింత ,వికార తనులు –విడిచి ,యార్య జనంబులు వినుతి సేయ ”అన్నిటికి కాలమే మూలం .దీనికి వేరే ఏమీ లేదు .ఇతర ఆలోచన లన్నీ వదిలెయ్యండి .మంచి మార్గం లో నడిచి బుధుల ప్రస్తుతి పొందండి అని స్పష్టం గా చెప్పాడు .కనుక మార్గాలన్నీ మూసుకు పోయాయి .ఒక్కటే మిగిలింది .అదే ధర్మ తత్పరత తో జీవించటం .దీని తో పార్ధుని హృదయం ఆనంద పరవశమే అయింది వెంటనే హస్తినా పురానికి చేరి ,ధర్మ రాజాడులతో యాదవ వినాశాన్ని సవిస్తరం గా తెలియ జేశాడు ”మన సారధి ,మన సచివుడు ,మణ  బాంధవుడు గురుడు కృష్ణుడు  మనల విడిచి అరిగే నృపా ”.అని బావురు మన్నాడు .ఈ విషయాలను విన్న యుధిష్ఠిరుడు మహా ప్రస్తానం తామంతా చేయాలి అనే కోరిక వెలి బుచ్చాడు .యాదవ నాశనం ఆలంబనం గా ,అనుల్లంఘ్యం ,అప్రతి హతం అయిన విధి విలాస మహాత్మ్యాన్ని ,కాల ప్రభావాన్ని ,ప్రత్యక్ష మయ్యే విధం గా వివ రిస్తూ ,శ్రీ కృష్ణ జీవిత సత్యాన్ని  మహా తత్వాన్ని వ్యాఖ్యానించాడు వ్యాస మహర్షి .
అందుకే మౌసల పర్వం సమగ్ర స్వతంత్ర కావ్యం గా భాసిల్లింది .ఇతి వృత్తం పూర్తిగా పోషింప బడింది .రస స్పోరక సన్నీ వేషాలు చాలా చక్కగా విస్తా రింప బడ్డాయి .విస్తుత మైన ఇతి వృత్తాన్ని ,దైవికం అయిన ఒకే సంఘటన తో రాసొంముఖం చేశాడు మహాకవి తిక్కన .రాసోత్పత్తి ,రసానుభూతి కలిగిన తర్వాతా ఉద్వేగాన్ని తగ్గించి ,విషయాన్ని ఉప సంహరించాడు .ఈ ఉద్వేగం శాంతి గా మారి ,కావ్య ఫల సిద్ధి తో ,ముగిసి నిర్వహణకు తోడ్పడింది .ఉదాత్త వస్తు భావ సమన్వితమై ,మానవ కళ్యాణార్ధ ప్రతి పాదికమై ,నిత్యానంద దాయకమై ణ ఉత్తమ కావ్య లక్షణా లన్నీ ,ఇందులో  కన్పిస్తాయి .యాదవ వంశ చరిత్ర కధ కనుక ఉదాత్తం, ప్రఖ్యాతం అయింది .మహానుభావుడు శ్రీ కృష్ణుడు కదా నాయకుడు కనుక ఉత్తమ నాయకత్వమూ లభించింది .భారత వీరుడు అర్జునుడు దివ్యామ్ష సంభూతుడు కనుక ,ఉపనాయకుని గా రాణించాడు .నాయకుని సంకల్పాన్ని నేర వేర్చాడు .ఇందులో కరుణ ముఖ్య రసం .వీర రసం దానికి అంగ రసం .యాదవ నాశనం అర్జుని లో ఉత్కంథ .యాదవ స్త్రీల ఆక్రందన ఉద్వేగం .
అర్జునుడు ద్వారక చేరాడు .వార్త తెలిపాడు .వారంతా శోక తప్టు లైనారు .ద్వారక లోని ప్రజలను రక్షించే నిమిత్తం ,అంతపుర స్త్రీ లతో  బాల రామ కృష్ణుల నిర్యాణ వార్త నుచెపప్ప లేదు .సూర్యోదయానికి ముందే ,ద్వారక నుంచి అందర్ని తరలించాడు కిరీటి .వారిని రక్షించటం లో ఎంతో స్వార్ధ త్యాగాన్ని ప్రదర్శించాడు .వాళ్ళతో అర్జునుడు –”ఈ రేయి ,సెచ్చెర ప్రయాణమునకు గ్రుత్యములగు పను లెల్ల సమ కట్టి ,వేగంగ,గ్రక్కున ,వెడల వలయు –గాని ,వెడల కున్న ,భానూదయమ్బున –వనధి పురము ముంచి ,కొనిన ,గణన –సేయ రాని ,యట్టి సేగియు ,బ్రయ్యు బా–పంబు వగయు ,నెల్ల భంగి గలుగు ”అని అందర్నీ జాగ్రత్త చేసి ద్వారకను వీడి వెళ్లి పోఎట్లు చేశాడు వెంటనే వెళ్ళాక పోతే తెల్ల వారిన తర్వాతా ద్వారకా నగరాన్ని మొత్తం సముద్రం ముంచేస్తుంది .మన వల్ల ఏమీ కాదు అని హెచ్చరించి చెప్పాడు .యాదవ కుమారా పట్టాభి శేకాన్ని దగ్గరుండి జరిపించాడు .సత్యభామ మొదలైన వారందరూ తపోవనం చేరారు .ఈ విధం గా యాదవ వంశ వృత్తం శాంతాన్ని చేరింది .ఈ పర్వాన్ని దృశ్య ప్రబంధం గా తిక్కన మలిచాడు .
ఆలం కార శాస్త్ర రీత్యా పూర్వ నాటకాలలో నాయక వధ నిషిద్ధమే . కాని ,భగ వ వతార ప్రయోజన మైన ధర్మ సంస్థాపన సిద్ధించటం ,అవతార పురుషుడు కారణ శరీరం వదిలి ”అమ్రుతం,బజరం,బవ్యయ, మమలం,బవి తర్క్య, మచల  మాగమ ,గమ్యం ”అయిన నిజ పదాన్ని పొందటం  లోక కల్యాణానికి కారణాలే .కనుక తప్పు లేదు .నిషిద్ధమూ కాదు అన్నారు విశ్లేషకులు .ఈ విధం గా భారత రచన చేత మహర్షి వేద వ్యాసుడు నిర్వహించాలను కొన్న ప్రయోజనం ఈ పర్వం లో పూర్తిగా సిద్ధించింది .సత్య ,న్యాయ ,ధర్మ తత్వాల ,వివరణ ,సుఖ దుఃఖ విచారం ,సత్పురుషులకు అర్ధమయ్ ట్లు ,బోధించి ,సంస్కరించటం ,ఈ పరమ ప్రయోజనం లో ఒక భాగం .వేద ,వేదాన్తరహస్యాలు ,అందుబాటు లో లేని సూక్ష్మాలు ,భగవత్తత్వం ,,సృష్టి రహస్యాలు ,కర్మాది యోగా మార్గాలు శాస్త్ర జ్ఞానం లేని సామాన్యులకు అందించి ,ఇహం మీద వైముఖ్యం కల్గించి ,ఆధ్యాత్మిక సాధన కోసం మహత్తర మార్గాన్ని చూపించటం ,చిత్త శాంతిని ప్రసాదించటం ,దీనిలో ఉన్న మరో ప్రయోజనం .యాదవ నాశనం తో ఇహ బంధాలన్నీ తెగి ,పరీక్షిత్తు కు పట్టం కట్టి ,పాండవులంతా ద్రౌపదీ దేవి సహితం గా తపోవనం చేరి ,మహా ప్రస్తానం సాగించారు .ధర్మ రాజు అలౌకిక శీలము ,ప్రవర్తన ల వల్ల సశరీర స్వర్గ ప్రాప్తి పొందాడు .మిగతా వారు చని పోయి స్వర్గానికి చేరారు .ఈ రకం గా స్త్రీ పర్వం లో శోకోద్వేగం ,శాంతి ,అనుశాసనిక పర్వాలలో నిర్వేదం ,మౌసల పర్వం లో కరుణ ,ప్రదానాలు అయినా ,ధ్యేయం అయిన శాంతరసం మూదిన్ట్లోను అంతర్వాహిని గా ప్రవహించి ,చివరికి మొత్తం ఇతి వృత్తాన్ని తన లో లయం చేసుకొని ,ఒక జీవిత పరమార్ధాన్ని బోధించింది మహా భారతం .దాన్ని మహర్షి వ్యాసుడు అంత పకడ్బందీ గా పర్వ నిర్వహణ చేసి వేదోక్త ధర్మాన్ని ప్రతి పాదకం గా తీర్చి దిద్దాడు .ఇన్ని మహా గొప్ప విషయాలను సందర్భాను సారం చక్కని శాలీ విన్యాసంతో మనసులకు హత్తు కోనేట్లు చేసి తెలుగు భారతానికి పట్టం కట్టాడు తిక్కన మహాకవి .ఆంధ్రుల మక్కువ కావ్యం గా శోభింప జేశాడు .అందుకే తిక్కన మరో వ్యాసుదని పించుకొన్నాడు .ఈ సందర్భం గా కవిత్రయ కవులైన నన్నయ ,తిక్కన ఎర్రన లకు ఆంద్ర జనం సర్వదా కృతజ్ఞులు .
ఆడ పిల్లలకు తగిన సమయం లో వివాహం జరగటానికి తెలుగు దేశం లో భాగవతం లోని ”రుక్మిణీ కల్యాణాన్ని ”పారాయణం చేయిస్తారు .ముఖ్యం గా పోతన గారి పద్యాలను .కష్టాలు బాధలు తొలగటానికి పోతన గారి ”గజేంద్ర మోక్షం ”ను చదువు కొని బాధల నుండి విముక్తు లవుతారు .మరి భారతం సంగతేమిటి?–వర్షాలు సకాలం లో కురవ టానికి శివాలయాలో అభిషేకాలు చేయించటమే కాకుండా ”విరాట పర్వం ”పారాయణ చేస్తారు దీక్షగా .అదీ వేద వ్యాస సంస్కృత విరాట పర్వాన్నే ఎక్కువ గా పారాయణ చేస్తారు .దానికి చక్కని తెలుగు లో వ్యాఖ్యానం కూడా చెప్పిస్తారు . .మన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం, దేవా లయ ధర్మాదాయ సంస్థ ,తిరు మల తిరు పతి దేవస్తానం ,విజయవాడ కనక దుర్గమ్మ గుడి, శ్రీ శైల మల్లికార్జునాలయం మొదలైన వాటిల్లో వేసవి లో దీన్ని తప్పక చేసి వర్ష ప్రాప్తి ని పొందటం చూస్తూనే ఉన్నాం .
సర్వం సంపూర్ణం –
 మనవి —1994 ఏప్రిల్ నెలలో నాకు ఎక్కడో స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారు రాసిన ”భారతము -తిక్కన ”అనే పుస్తకం కానీ పించింది .దాన్ని ఆసాంతం మొదటి సారి చదివాను .ఎంతో ఆనందం కల్గింది .మళ్ళీ మళ్ళీ చదివాను .నన్ను బాగా పట్టేసింది .ఆ పుస్తకం అప్పటికే శిధి లా వస్తలో ఉంది .కాగితాలు పెళుసు గా మారి .రంగు కోల్పోయి పెళ పేలా విరిగి పోవ టానికి సిద్ధం గాఉన్నాయి . .దాని లోని సారాంశాన్ని నాకు నచ్చిన విషయాలను నేను నానోట్ బుక్ లో రాసుకోన్నాను. ఆ నోట్సు  భద్రం గా ఈ పద్దెనిమిదేళ్ళు నా దగ్గర ఉంది .అందులోని విశేషాల ను ఇదివరకేవ్వరు అంత లోతుగా,అంత ఆంతర్యం గా  తరచిన వారు లేరని పించింది .అది చదవటం నా పూర్వ జన్మ సుకృతం అని పించింది .ఇప్పుడు అదంతా మీకు ”తిక్కన భారతం ”పేర భక్తిగా అంద జేశాను .ఇందులో విశేషాలను వివరించటం లో నేను సరళ భాషనే వాడాను .అసలు రహస్యాలు, విశేషాలు అన్నీ లక్ష్మీ నారాయణ గారివే .ఏదైనా మనసుకు హత్తు కొంటె అదంతా ఆయన ఖ్యాతి యే.సరిగ్గా వివ రించలేక కప్ప దాట్లు  ఎక్కడైనవేస్తె అదంతా నా అజ్ఞానమే నని ,సవి నయం గా విన్న వించు కొంటున్నాను .
   అంకితం –-ఉయ్యూరు లో మా మే న మామ స్వర్గీయశ్రీ  గుండు గంగాధర శాస్త్రి (గంగయ్య గారు )ఉయ్యూరు విష్ణ్వాలయం  లో రామాయణ ,భాగవత ,భారతాలు ,భగవద్గీత లను రోజు సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు క్రమం తప్పకుండా పురాణ ప్రవచనం చేసే వారు .జనం వచ్చినా రాకపోయినా ఆయన సమయ పాలన  తో చేసే వారు. ప్రతి ఫలా పేక్ష లేకుండా చేయటం ఆయన ప్రత్యేకత .సంస్కృత గ్రందాలనే ఆధారం గా శ్లోకాలను చదువుతూ చాలా తేలిక భాషలో తెలుగు లో భావాలను, విశేషాలను వివరించే వారు ..నేనూ అప్పుడప్పుడు వెళ్ళే  వాణ్ని .మా అమ్మ గారు నిత్య శ్రోత .ఆయన ప్రభావం నా మీద పడింది .నేను కూడా సుమారు అయిదేళ్ళు అదే ఆలయం లో రోజూ సాయంత్రం ఆరు గంటల నుండి ,ఎనిమిది గంటల వరకు రామాయణం భాగవతం భారతం ఆముక్త మాల్యదమొదలైన వాటిని ధనుర్మాసం లో   అలానే ప్రవచనం చేశాను .సమయ పాలన తో చేసే వాడిని . విన్నవాళ్ళు చాలా మంది ”ఏమండీ అచ్చం మీ మేన మామ గంగయ్య గారి  లానే చెబుతున్నారు .ఎన్నో కొత్త విషయాలు తెలియ జేస్తున్నారు ”అని అభి నందించే వారు .అదంతా మామయ్యఅనుగ్రహంఅని భావిస్తాను .
 అందుకే ”’తిక్కన భారతం ”అనే ఈ ముప్ఫైధారావాహిక  భాగాలను మా మేన మామ స్వర్గీయ”’శ్రీ గుండు గంగా ధర శాస్త్రి గారి ”కి  సవినయం గా ,సభక్తి కం గా అంకితం ఇస్తూ కొంత ఋణం తీర్చు కొంటున్నాను .
సాహితీ బంధువు లందరికి రేపు   9-8-12  గురువారం శ్రీ కృష్ణ జయంతి సందర్భం గా శుభా కాంక్షలు
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –8-8-12–కాంప్–అమెరికా .

Posted in రచనలు | Tagged | Leave a comment

సామల సదాశివ- రుబాయి పద్యం – ‘సదా ‘స్మరామి!

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నిక్కమైన నిజాలు

  1.  నిక్కమైన నిజాలు

క్వా సార్లు అనేవి సుదూరం లో ఉన్న నక్షత్రాలు .వాటి కాంతి మన గెలాక్సీ కాంతికి వెయ్యి రెట్లు ఉంటుంది .అందులో కొన్ని క్వాసార్లు మనకు పన్నెండు బిలియన్ల కాంతి సంవత్స రాల దూరం లో ఉన్నాయి .ఇప్పుడు మనం వాటిని చూస్తున్నాము అంటే -12బిలియన్   సంవత్స రాల కింద ఉన్న వాటిని చూస్తున్నామని అర్ధం .ఒరియాన్ అనే నెబ్యులా ఇప్పుడు కనపడు తోందంటే అది రోమన సామ్రాజ్యం చివరి రోజుల్లోది అని భావం .మనకళ్ళ కు కనీ పించేఆన్ద్రో మీడా  గెలాక్సీ రెండు మిలియన్ ఏళ్ళ ముసలిది పాపం .అంటే మనకు తెలుస్తున్న అసలు విషయం ఏమిటంటే –మనం యిప్పుడు చూసేది ఏదీ ఇప్పటిది కాదు .మనం ఇప్పటి ప్రపంచ స్తితిని దేన్నీ చూడటం లేదన్న మాట .ఇంకొంచెం సరదాగా చెప్పా లంటే నేను నిన్ను ఇప్పుడు చూస్తున్నాను అంటే -ఒక  మైక్రో సెకండ్ లో వందో వంతు కాలం కిందట ఉన్న నిన్ను చూస్తున్నాను అని సైంటిఫిక్ అర్ధం .అదే నీ నుంచి కాంతి నన్ను చేర టానికి పట్టే కాలం అన్న మాట .మైక్రో సెకండ్ లో వందో వంతు అంటే -అటామిక్ స్కేల్ లో చాలా దూరం గా నే భావిస్తారు .అది మన మెదడు గుర్తించే టంత గా అని పించడు . ఈ అతి తక్కువ సమయం లో మానవులు అక్కడి నుండి అదృశ్యం కాలేరు .అందుకని నువ్వు అక్కడే ఉన్నట్లుగా భావిస్తానన్న మాట .సూర్యుడి విషయం లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది .కాంతి సూర్యుడి నుంచి భూమిని చేర టానికి ఎనిమిది నిముషాలు పడుతుందని మనందరికీ తెలిసిన విషయమే .మనకు కంటికి కనీ పించే నక్షత్రాలు ,మన గెలాక్సీ లో ఉన్న తారలు అన్నీ సాపేక్షం గా దగ్గర్లోనే ఉన్నాయి .కాని ఇంకా సుదూరాలలో ఉన్న నక్షత్రాలు అంటే అతి పెద్ద  శక్తి వంత మైన దూర దర్శినులతో మాత్రమె చూడ గలిగిన నక్షత్రాల సంగతి మాత్రం వేరే గా ఉంటుంది .పన్నెండు బిలియన్ల కాంతి సంవత్స రాల దూరం లో  కనీ పించే క్వాసార్లు ఇప్పుడు అన్నిబతికి  ఉన్నాయని చెప్పలేము .
ఒక నిర్ణీత హద్దును దాటితే కాంతి మనకు చేర లేదు .దాన్నే హోరైజన్ అంటారు .ఆ దిక్చక్రం లేక హోరైజన్అనేది – ఉష్ణోగ్రత 3000 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న కాలము నాటిది  అని గుర్తించాలి .ఖగోళ శాస్త్రాధ్యన పరుల లెక్కల ప్రకారం, బిగ్ బాంగ్ సిద్ధాంతం ప్రకారం కూడా ,అప్పుడు మన విశ్వం పుట్టి సుమారు మూడు లక్షల సంవత్స రాలు అయి ఉంటుందని భావిస్తున్నారు .ఇదంతా కన్ఫూజంగానే ఉంటుంది మరి .నిజాలు అలానే అని పిస్తాయి .అరిస్టాటిల్ మహాశయుడు ఒక విషయం చెప్పాడు -అనంత కాలం నాడు జనించిన కాంతి అనంతంగాఅప్పటి కాన్తికే మాత్రం తగ్గ కుండా  కాంతి వంతం గానే ఉండాలి .కాని అట్లా లేదు .ఈ విషయం పై ఖగోళ వేత్తలు బుర్రలు పగల గొట్టుకొని సమాధానం రాక జుట్లు పీక్కుంటున్నారు .మనకు తెలిసిన విషయం ప్రకారం ఆకాశం  చీకటిగా ఉంది అంటే నక్షత్ర సముదాయం అంతరించటమ్  వల్లఅను కొంటాము .పదిహేను బిలియన్ల సంవత్స రాలక్రితం  అంటే పెద్ద కాలం కాక పోవచ్చు కాని ,అప్పుడు విశ్వం అంతా ముఖ్యం గా నక్షత్రాల మధ్య ఉన్న ప్రదేశం కాంతి తో నిండి ఉంటుంది . అందుకే రాత్రి వేళ చీకటి గా ఉండ టా నికి కారణం విశ్వ ఆవిర్భావమే(evolution ) నని అనుకో వచ్చు .
బిగ్ బాంగ్ జరిగిన మొదటి పన్నెండు మైక్రో సెకన్ల కాలం లోనే విశ్వం అంతా క్వార్కులు ,గ్లుయాన్ల సముదాయం తో నిండి పోయింది .నలభైవ  మైక్రో సెకండ్ లోఉష్ణోగ్రత మిలియన్ మిలియన్ డిగ్రీలు కంటే తగ్గి చల్ల బడి  నపుడు క్వార్కుల సముదాయం కలిసి మొదటి న్యూక్లియాన్లుగా అంటే ప్రోటాన్లు ,న్యూట్రాన్లు గా ఏర్పడి నాయని అంచనా వేస్తున్నారు . విశ్వం లో కాల గణనం  లో మొదటి సెకండు అంటే -విశ్వ ఉష్ణోగ్రత పది బిలియన్ల సెంటిగ్రేడ్ డిగ్రీలున్న కాలం .మొదటి సెకండు కు ముందు ఉష్ణోగ్రత ఇంకా అధికం గా ఉండేదన్న మాట .
భూమి మీద నీరు ఇంకా ఉండ టానికి కారణం భూమి కక్ష సూర్యుని కక్షకు చాలా దూరం గా ఉండటమే .ఇంతకి భూమి మీద ద్రవ రూపం లో నీరు ఎలా వచ్చింది ?ఒక సారి అంత రిక్షం లో విహరిద్దాం .నక్షత్రాలు చని పోయి నపుడు నక్షత్ర దూలి ఏర్పడుతుంది .దీనినే స్టార్డ స్ట్ అంటారు -సినీ స్టార్ల మీద పుకార్లు షికార్లు చేస్తుంటాయి దాన్నీ స్టార్ డస్ట్అనే అంటారు .ఇక్కడ అదికాదు .ఈ నక్షత్ర దూలి మీద మంచు ,ఘనీ భావించిన కార్బన్ డ యాక్షైడు స్తావరం ఏర్పరచు కొంటాయి .ఆ కణాల సంఖ్యా ,పరిమాణం పెరిగితే ప్లానెట్స్ఏర్పడతాయి .అప్పుడు ఐసు తేలిక అయి గీసర్లు గా బయటకు చేరుతుంది .తోక చుక్కలు అంటే ఘనీభవించిన నీటి తో నిన్దినవే .అవి గ్రహాల పై పడి నీటిని వర్షిస్తాయి అలానే మన భూగోళం మీద ద్రవ రూపం లో నీరు ఏర్పడింది ..మరి ఆ నీటిని భూమి ఎలా  తనలో ఇంత వరకు నిలుపు కొంది ?అనే ప్రశ్న రావటం సహజం .భూమికి ఉన్న అత్యంత గురుత్వాకర్షణ శక్తి(గ్రావిటి ) వల్ల, భూమి కక్ష సూర్యునికి చాలా దూరం లో ఉండటం వల్లనే భూమి పై నీరు ద్రవ రూపం లో ఉండిపోతోంది .భూమి ఏర్పడిన తొలి రోజుల్లో భూమి ,యువ సూర్యుని అల్ట్రా వయొలెట్ కిరణాలభారీ  తాకిడికి లోనైంది .,భూమి నీటి దుప్పటి తో కప్ప బడి ఉండటం చేత ,భూ ఆవిర్భావపు తొలి వాతా వరణం లో ఉన్న కార్బన్ దయాక్సిడ్ నీటిలో కరిగి ,సముద్రపు నీటిలో కరిగి కార్బో నెట్ లు గా మారి పోయింది .అదే భూమికి పట్టిన గొప్ప అదృష్టం .అదే వీనస్ గ్రహం లో దాని ఆవిర్భావ సమయం లో నీరు లేక పోవటం వల్ల ,వాతావరణం లోని కార్బన్ డ యా క్సిడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నేర్పరచి దాని ఉపరితల ఉష్ణోగ్రతను అయిదు వందల సెంటి గ్రేడ్ డిగ్రీలను పెంచి ఎప్పుడూ ఉండేట్లు చేసింది .కనుక అక్కడ నీరు కనీ పించదు  .వాస యోగ్యమూ కాదు .
కార్బన్ పరమాణువు కు ఉండే ప్రత్యెక లక్షణాల వల్ల అనేక పదార్ధాలు ఏర్పడుతున్నాయి .దాని వేలన్సీ నాలుగు అని చదువు కొన్నాం .అంటే దానికి నాలుగు ఎలక్ట్రాన్ రంద్రాలున్నాయని భావం .అందువల్లే అనేక పదార్దాలనేర్పరచే శక్తి దానికి ఉంది .త్వరగా పదార్ధాలను ఏర్పరుస్తుంది ,అంత త్వరగా విచ్చేదనమూ చెందుతుంది .  .కార్బన్ లాగానే సిలికాన్ కూడా వాలేన్సి నాలుగే .కాని అది పొందే బంధాలు ద్రుధం  గా ఉంటాయి .త్వరగా విచ్చేదనం కావు .అది స్తిర ఆక్రుతుల్ని ఏర్పాటు చేస్తుంది . ఇసుక అలా ఏర్పడిందే .దానికి మెటా బాలిజం ధర్మం లేదు అందుకే ఎక్కువ పదార్ధాలను సిలికాన్ పరమాణువు ఎర్పరచలేక పోతోంది .మన గెలాక్సీ లోను  , మిగిలిన గెలాక్సీ లలోను  ,రేడియో టెలిస్కోపుల ద్వారా చూస్తె కార్బన్ పరమాణువులే కనీ పిస్తాయి కాని, సిలికాన్ పరమాణువులు కన్పించటం లేదు . దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ,భామి మీద లాగా ఇతర గ్రహాల్లో జీవ పదార్ధం ఉండాలి అంటే అక్కడ తప్పక కార్బన్ ఉండాలి అది కార్బన్ సమ్మేళనాలను కలిగి ఉండాలి. .మన భూమి పుట్టి సుమారునాలుగున్నర  బిలియన్ సంవత్స రాలు అయింది అని శాస్త్రజ్ఞుల అంచనా .
                     ఒక్క రోజులో భూమి
నాలుగున్నర బిలియన్ల సంవత్స రాల క్రితం మన భూమి ఆవిర్భవించిందని అనుకొందాం .అది అంతా ఒక్క రోజు లోనే జరిగిందని భావిద్దాం ‘.దానినే పాయింట్ జీరో అంటారు .తరువాత ఉదయం అయిదు గంట లకు ”జీవం ”అంటే ప్రాణం ఏర్పడింది .చాలా వేగ వంతం గా క్లిష్టం గా ఆరోజంతా పెరిగింది .రాత్రి ఎనిమిది గంటలకు మొదటి” మోల్లూక్సు” ఏర్పడ్డాయి .ఆ తర్వాతా రాత్రి పదకొండు గంటలకు డయోనోస్సార్ లు ఆవిర్భవించాయి . అయితే రాత్రి పద  కొండు నలభై నిముషాలకు డైనోసార్లు అంతరించి పోయాయి .దాని తర్వాతపాలు ఇచ్చే జంతువుల(క్షీరదాలు ) ఆవిర్భావ పరిణామం జరిగింది .బహుశా   ఈ పరిణామం అర్ధ రాత్రికి అయిదు నిమిషాల ముందు అంటే రాత్రి పద కొండు యాభై అయిదు కు జరిగి ఉండ వచ్చునని అంచనా వేస్తున్నారు . రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల నుండిఅర్ధ రాత్రి  పన్నెండు గంటల లోపు అంటే ఒకే ఒక్క నిమిషం లోమానవుని మెదడు శక్తి పెరిగింది .  .పారిశ్రామిక విప్లవం సెకను లో చివరి వందో భాగం లో జరిగింది .మొత్తం మీద భూమి మీద మనం స్తిర పడ్డాం కదా .ఇప్పటికి ఇంతటి తో ఆపేద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-8-12-కాంప్ –అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –29 ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్వర్గా రోహణ పర్వాలలో ఆంతర్య ప్రయోజనాలు -3-

            తిక్కన భారతం –29
ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్వర్గా రోహణ
 పర్వాలలో   ఆంతర్య ప్రయోజనాలు -3-

  1.                శ్రీ కృష్ణుడు అన్న బాల రాముడున్న చోటికి వచ్చాడు .బలరాముడు యోగబలం తో తనువు చాలించాడు .మహా భుజం గా మారి ఆకాశం లోకి చేరాడు .అనంతుడైన ఆది శేషుడు దాన్ని తన పరమ మూర్తి లో కలుపు కొన్నాడు .ఇదంతా కృష్ణుడు చూస్తుండ గానే జరిగింది .తాను భూమి మీదకు వచ్చిన అవతారం పని పూర్తీ అయిందని భావిం చాడు వాసు దేవుడు .ఇక తన విముక్తి మార్గం చూసు కొన్నాడు ..దూర్వాస మహర్షి ఒకప్పుడు తన శరీరంలోని అన్ని అవయవాలకు   పాయసం పూసి, అరికాలు కు పూయటం మర్చి పోయి వదిలేసిన విషయం జ్ఞాపకం చేసుకొన్నాడు .పాయసం పూసిన శరీర భాగాలను యే శస్త్రాస్త్రాలు బాధించవు .అదీ అందులోని అంత రార్ధం .విధి అనుల్లంఘనీయం పరమాత్మకైనా .కృష్ణుడికి అపాయం అరికాలి వల్లనే వస్తుందని మహర్షి హెచ్చరించిన విషయం గుర్తుకొచ్చింది .మనసును అధీనం చేసుకొన్నాడు .భూమి పై ఒక మహా సమాధి స్తితి ని పొందాడు .”జర” తనను మాయ చే ఆవహించిన ఒక బోయ వాడు ,శ్రీ కృష్ణుని కృష్ణ సారంగం గా (నల్ల జింక )గా భావించి భ్రాంతి తో బాణం విడిచాడు .అది సరాసరి వచ్చి హరి అరికాలి లో గుచ్చు కొన్నది .అంతే .ఆ నిమిత్త మాత్రం గా ,మానుష దేహాన్ని పరిత్య జించాడు శ్రీ కృష్ణ పరబ్రహ్మ .తన నిజ పదం అయిన వైకుమ్తానికి చేరు కొన్నాడు .దేవేంద్రుడు దేవతా గానం తో ఎదురొచ్చి ,భక్తీ తో నమస్కరించి ”శ్రీ హరీ !దయావిదేయ మైన ఆట భూమి మీద ఆడావు బంధువులైనా .కంసాదులను,కౌరవులను నిర్జించి ,నీ ధర్మాన్ని నేర వేర్చి మళ్ళీ నీ స్వ రూప సన్నిధానానికి చేరావు .లోక హితం కోసం నీవు  అవతారం దాల్చి ,ఆ పని పూర్తీ కాగానే మళ్ళీ ఇక్కడికి చేరావు ”అని ప్రస్తుతించాడు .

గుజరాత్ లోని ద్వారకా పట్టణాన్ని చూసి ఆనాటి శ్రీ కృష్ణ వైభవాన్ని అనుభూతి గా పొంద వచ్చు . .సముద్రం లో స్టీమర్ లో వెళ్లి చూడాలి .అక్కడి శ్రీ కృష్ణ మదేవాలయం పరమ వైభవం గా అందులోని శ్రీ కృష్ణ విగ్రహం పరమ మనోహరం గా దర్శన మిస్తాయి .ఆ తర్వాత సోమనాద్ వెళ్లి అక్కడి సోమనాధ దేవాయాన్ని దర్శించాలి. అది జ్యోతిర్లింగం .మహమ్మ దీయ దండయాత్రలలో పడి హేను సార్లు విధ్వంసానికి గురైంది .అరేబియా సముద్రం వొడ్డుననే దేవాలయం ఉంది .దాన్ని దర్శిస్తుంటే కైలాసం లో ఉన్నట్లై పిస్తుంది .ఆలయానికి దగ్గర గా కొద్ది దూరం లో నడిచి వెడితే శ్రీ కృష్ణుడు బోయ వాని దెబ్బకు నిర్యాణం చెందిన ప్రదేశం కూడా కనీ పిస్తుంది .ఆ ప్రాంతాలకు వెళ్ళిన వారందరూ వీటిని సందర్శించి గత వైభవాన్ని గుర్తుకు తెచ్చు కొంటారు .2002  మా రెండో అబ్బాయి శర్మ అహమ్మదా బాద్ లో పని చేస్తుండగా, మేము వెళ్లి అందరం కలిసి అన్నీ చూసి, అనుభూతిని పొందాము . దసరాపండగల్లో వెళ్ళాం .అప్పుడు రాత్రిళ్ళు గుజరాతీలు వాళ్ళ ప్రత్యెక మైన నృత్యాన్ని అందరు కలిసి సామూహికం గా చేస్తారు .అందరు రాదా కృష్ణులుగా గోపికల్లా అలంకరించుకొని కోలాటం ఆడుతూ చేస్తారు కనుల పండువు గా ఉంటుంది .అక్కడ ఆరు బయలు సినెమా ఉంటుంది .యెట్టిన చోట స్క్రీన్ పెట్టి సినిమా వేస్తారు .హాయిగా మన కారులో కూర్చుని సినిమా చూడచ్చు .తింది తింటూ ఇంట్లో చూసి అంట్లు చూడచ్చు .గాంధీ నగరం దగ్గర స్వామి నారాయణ దేవాలయం శబర్మతి ఆశ్రమం కూడా చూదాల్సినవే .అవకాశం ఉన్న వారందరూ వెళ్లి చూసి ఆనందం పొందాల్సిన దివ్య క్షేత్రాలు ద్వారకా ,సోమనాద్ లు .
వసుదేవుడికి చాలా బాధ కలిగింది .శ్రీ కృష్ణుని ఉపేక్ష వల్లే ,యాదవ నాశనం అయిందని అనుకొన్నాడు.శ్రీ కృష్ణుడు తలచు కొంటె ఎంత పని అయినా అవలీల గా చేయ గలడు  .పరీక్షితుని బ్రతికించాడు అశ్వత్థామ బాణం నుంచి .మరి ఎందుకింత ఉపేక్ష ?అని బాధ పడ్డాడు –”వలసిన యట్టి కార్యమును ,వావిరి నేట్టుగ నైన జేయగా — వలతి .మృతుం బరీక్షితుని ,వత్చల తన్ బ్రతికించే శౌరి ,మొ–గ్గలమున ,యాదవుల్ పెనగాగా ,గని ,మాన్పడుపెక్ష సేసె, నీ –పొలియుటవశ్య భావ్యమని  బుద్ధి దలంచుట గాన నయ్యెడున్ ”అని కృష్ణుడు కావాలనే ఇదంతా ఇలా జరగాలనే భావించి చేశాడని గ్రహించాడు .తనపుత్రుడైన శ్రీ కృష్ణ నిర్యాణానికి దుఃఖించాడు .ఆయన్ను ఓదారుస్తూ వేద వ్యాస మహర్షి ”హరి ఎరుంగు మున్న యా సంక్షయం ”అని స్పష్టం గా అన్నీ శ్రీ హరి యైన కృష్ణునికి తెలిసే జరిగాయని స్పష్టం చేశాడు .అర్జునుడు ఇంకా అమాయకం గా ”మూడు లోకాలకు అన్యదాత్వాన్నిచ్చే పరంత్మ  ముని శాపాన్ని బాప లేడా?”అని ప్రశ్నించాడు .అప్పుడు మహర్షి అర్జునునికి శ్రీ కృష్ణ జనం రహస్యాన్ని బోధించి జ్ఞానం కల్గించాడు .-”-ధరణి భారంబు వాప ,నవతారము నొందిన విష్ణు డత్తేరం –గరుడుగా ,నిర్వ హించి ,యజరామర  ,నిష్కల ,నిర్వికార  భా –స్వర ,నిజ సత్సదనంబు నుప శాంతి పరుం డయి ,పొందే ,దానికిన్ –గురుకుల వర్య ,శోకమున గుందుదురే  ,మిము బోటి బోధనుల్ ”భూ భారాన్ని తీర్చటానికి అవతరించాడు కృష్ణుడు .ఆ పని సక్రమంగా నిర్వహించి ,వచ్చియా పని అయి పోగానే స్వస్థలానికి వెళ్లి పోయాడు .జ్ఞాన ధనులైన నీ వంటి వారు దీనికి దుఃఖించటం భావ్యం కాదన్నాడు .
”అవనీ భారము వాపి ,తా హరికి దోడై ,భీమ సాహాయ్య గౌ –రవ ,దుర్దాంత పరాక్రమంబున ,గ్రుతార్ధత్వంబునం జేసే,  య-స్త్ర వితానంబును నిన్ను బాసి చనియెన్ దైవ ప్రకారాజ్న ,నీ–దు వరిష్టా చరణంబున న్ సురలు సంతోషించి రప్పోరులన్ ”- కృష్ణుడు నీసహాయం భీముని సాయం తో కౌరవ వినాశన చేయించి ,మిగిలిన ధర్మ కార్యాలు మీతో చేయించటానికి మిమ్మల్ని ఉంచి వెళ్లి పోయాడు .మీరు చేసిన యుద్ధాలను దేవతలంతా మెచ్చారు .అని చెప్పాడు –”బలమును ,బుద్ధియు ,జేవయు ,-నలఘు మతియు ,నుల్ల శిల్లు నగు కాలము నన్ –బోలియుం ,గాల విపర్యయ –కలనంబున  బుధులకుబ్బు గలకయు గలవే ”–”నర నారాయణులైన పురాణ మునులు లోక కళ్యాణార్ధం ,పార్ధ ,పార్ధ సారధు లుగా జన్మించి  ధర్మ సంస్తాపనం చేశారు ” అని గుర్తు చేశాడు .–”నరుడు ,నారాయణుండు ననంబరాగు –నిత్య పురుషులు నీవును ,నేను జుమ్ము ,–భువన హిత మాచరిమ్పగా ,బూని వేడ్క ,–వచ్చి ,ఇమ్మహి ,బుట్టిన వార మనఘ ”అని జ్ఞాపకాల దొంతర పెర్చాడు .శ్రీ కృష్ణుడు కూడా పార్దునికి –”నానా రూపంబులని -నిట్లేను బ్రవర్తింతు జగము లన్నింటను ,నీ –శానుడు ,నభవుడు నమృతుడు –నైన శివుని నీవు గొలువు మర్జున యెపుడున్ ”అని అర్జునుడు నిమిత్త మాత్రమె నని ,తానే మహా భారత యుద్ధాన్ని అంతటినీ నిర్వహిస్తా నని ,బావ మరది అర్జునిడికి ఇది వరకేప్పుదోనే బావ కృష్ణుడు బోధించాడు .మరపు మానవ సహజం కనుక మళ్ళీ గుత్రు చేయాల్సి వచ్చింది అంతే .–”ఏను రక్షింప ,జయము నీ కేసక,మేసగ–సమరమున ,శూల పాణి యై ,శత్రు కోటి నీదు ,మునుమున వధి యించు నిరుప మాన –తేజు రుద్రుగా ,నేరుగుము ధీర చిత్త ”బావా కిరీఎటీ !  .నేను రక్షకుడిగా ఉండి నీకు యుద్ధం లో జయం చేకూరుస్తాను .నువ్వు బాణాలు వేసే నిమిత్తమే యుద్ధం లో నీ పని .సర్వ సంహారకుడు అయిన త్రిశూల పాణి శివుడే అసలు సంహారకుడు నువ్వు  బాణం వేస్తె ,ఆయన ప్రాణాలు తీస్తాడు అంతే .అని ఎప్పుడో విస్పష్టం గా చెప్పే షాడు అసలు రహస్యాన్ని .ఈ విషయాలనే ఇప్పుడు వ్యాస మహర్షి మళ్ళీ చెప్పి గుర్తు చేశాడు .శ్రీ కృష్ణుని దివ్యత్వం తెలిసిన భక్తుడు అర్జునుడు .అతడు చేసిన ప్రతి పని వెనక శ్రీ కృష్ణ ప్రోత్సాహం ఉంది .శ్రీ కృష్ణ సంకల్పాన్ని నిర్వ హించే భౌతిక శక్తి మాత్రమె అర్జునుడు .వీరిది మనో దేహ సంబంధం .ఇంతకీ బాదరాయణుడైన వ్యాసుడేమి చెప్పాడు –”నీవని సేయ ,నీ వలని ,నేయ్యమునం ,గృప నన్య సైన్యమున్ –దా వధియించుశూల ధరతాస్ఫురణం బెసగంగ , ,ముందర ,ర–ద్దేవు డు ,దాని గాంచు ,భవదీయ  సమంచిత ద్రుష్టియున్ –నినున్ –గావడ,యా ,మురాన్తకుడు గాల విపర్యయమావహిల్లు ట న్ ”అని కృష్ణుడు అర్జునికి ఇది వరకు చెప్పిందే మళ్ళీ గుర్తు చేశాడు నీ మీద స్నేహం బాంధవ్యం ధర్మం తో శూల పాణి యైన శివుని ప్రేరేపించి నీవు నిమిత్తమాత్రుని గా యుద్ధం చేసి విజయాన్ని నీకు అందించి నిన్ను ”విజయుడు ”అని పించాడు అని అంటే యుద్ధాన్ని గేలి పించాడు .ఎంత చిన్న మాటలో ఎంత అర్ధ వంత మైనవో ?చదివితే , అర్ధమైతే ఎంత లోతైన భావనలో తెలుస్తుంది వ్యాసుని వారసుని గా తిక్కన మరో వ్యాస రూపం గా మన ముందు సాక్షాత్కరిస్తాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –7-8-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ ” సినీ సంగీత మణి ” శర్మ వారం

  అమెరికా డైరీ
                                  ” సినీ సంగీత మణి ” శర్మ వారం 

జులై ముప్ఫైసోమవారం  నుంచి ఆగస్ట్ అయిదు ఆదివారం   వరకు విశేషాలు .వారం లో మొదటి అయిదు రోజులు సాదా సీదా గానే గడిచి పోయాయి .మా అమ్మాయి పంటి డాక్టర్ వద్ద ఆరు పళ్ళను తీయించు కొంది బుధవారం .చాలా సునాయాసం గా అరగంట లో తీశేశాడు .ఆరోజు కొంచెం నెప్పితో బాధ పడింది కాని మర్నాడు నుంచి పిల్లల్ని సమ్మర్ కాంప్ లకు తీసుకొని వెళ్లటం తీసుకొని రావటం తప్ప లేదు .డ్రైవింగ్ చేయక తప్పని పరిస్తితి .గురువారం లైబ్రరీకి వెళ్లి తొమ్మిది పుస్తకాలిచ్చి కొత్తవి ఆరు తెచ్చు కున్నాను .ఈ వారం లో చదివినవి అన్ని  మంచి ఉపయోగమైన పుస్తకాలే .శుక్ర వారం సాయంత్రం మా వాళ్ళ ఇంట్లో రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది వరకు భజన .ముప్ఫై మంది వచ్చారు .ఇది మూడవ శుక్ర వారం భజన .ఆ తర్వాత విందు .మా అమ్మాయి నిమిగిలిన స్నేహితురాళ్ళు ఏమీ ఇంట్లో తయారు చేయద్దని చెప్పినా పులిహోర ,అన్నం ,సాంబారు కాకర కాయ కారం సెనగ పిండి కూరిన కూర, పెరుగు తయారు చేసింది .మిగిలిన వాళ్ళు సేమ్యా పాయసం ,గారెలు ,ఉప్మా ,చానా మసాలా బీన్సు కూర ,దొండ కాయ  కూర వండి తెచ్చారు .అందరం సరదాగా కలిసి భోజనం చేశాం .అందరు వెళ్ళే సరికి రాత్రి పది అయింది .
శనివారం మా వాళ్ళ ఇంటికి ఎదురు గా మాకు పది గజాల దూరం లో నిర్మించ బడ్డ స్విమ్మింగ్ పూల్ పూర్తీ అయి ఉదయం పది గంటలకు ప్రారంభించారు .పిల్లలు ,పెద్దలు అందరు సరదా గా స్విమ్మింగ్ చేశారు .సాయంత్రం విజ్జి స్నేహితురాలు ,భర్త వచ్చారు .వాళ్ళు ఈ కాలనీ లోనే కొత్త  ఇల్లు కొన్నారట .గృహ ప్రవేశం ఎప్పుడు చేయాలని అడిగారు .వాళ్ళు సెప్టెంబర్ లో చేరాలని అనుకొంటున్నట్లు చెప్పారు .అది అధిక భాద్ర పదం పనికి రాదనీ చెప్పాను .మంచిది చూడమంటే ఆగస్టు ఎనిమిదో తేది బుధవారంఉదయం యేడు యాభై కి  ముహూర్తం పెట్టాను .సంతోషించారు .
                ”  స్వరమణి”శర్మ సంగీత విభావరి
శార్లేట్ లోని ”తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శార్లేట్ ఏరియా ”అనే సంస్థ-” ఆటా”కు అను బంధం గా పని చేస్తోంది .వాళ్ళ ఆధ్వర్యం లో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభా వరి అయిదవ తేది ఆదివారం సాయంత్రం జరిగింది .మా ఇంటికి నలభై అయిదు నిమిషాల ప్రయాణ దూరం లో, పాతిక మైళ్ళ పైనదూరం  ఉన్న కాన్కార్డ్ పార్కు వే లో ఉన్న రిచింగ్ టన్ హై స్కూల్ ఆడిటోరియం లో జరిగింది .మా అల్లుడు సెప్టెంబర్ నుంచి పిల్లల కోసం ”వీక్లి రీడింగ్ ”క్లాసులు ఇంటి దగ్గర నిర్వ హించాలని అనుకొని ప్రోగ్రాం కు స్పాన్సర్  షిప్ మూడు వందల డాలర్లు కట్టాడు .అందులో వంద డాలర్లు మా అందరి టికేట్లకే సరి పోయింది .మిగిలిన రెండొందలు స్టాల్ పెట్ట టానికి .దీనితో మాకు ముందు వరుస లో కూర్చునే అవకాశం వచ్చింది .షో రాత్రి ఆరున్నరకు ప్రారంభమైంది .తెలుగు సంస్థ కు చెందినజ్యోతి మంచి వాక్యాలను సమ కూర్చుకొని స్వాగతం చెప్పింది .అయితేఎందుకో  మాటలు తడ బడ్డాయి .ఆడిటోరియం బాగా ఉంది .సుమారు నాలుగు వందల మంది జనం వచ్చారు .టికెట్టు ఖరీదు పాతిక డాలర్లు .ఆడవాళ్ళందరూ సాంప్రదాయ దుస్తుల్లో చీర కట్టుకొని రావటం ముచ్చట గా ఉంది .ఇంత మంది తెలుగు వాళ్ళను ఒక్క వేదిక వద్ద చూడటం చాలా ఆనందం గా ఉంది .
ఈ సంగీత విభావరిని వీళ్ళు మ్యూజిక్ ధమాకా అన్నారు .మణి శర్మ ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం ఇది .కుర్ర వాళ్లైన లబ్ధ ప్రతిష్టులు ఎన్నో సంగీత పోటీలలో విజేతలు సుస్వరం తో అందర్ని అలరించిన హేమ చంద్ర ,కారుణ్య లు అసలైన నాయకు లని పించుకొన్నారు .ఎన్నో పోటీలలో ,గెలుపు సాధించిన ఆడ పిల్లలు గీతా మాధురి ,శ్రావణ భార్గవి ,మాళవిక లు తమ సత్తా ను చాటారు .మణి శర్మ అంటే బీట్ కు ప్రాధాన్యం అని అందరికి తెలిసిన విషయమే .మాధుర్యం కంటే హోరెత్తిన సంగీతం తో జనం కిక్కు కు లో నైనారు .అయితే పాడిన వాటన్నిటి లో నాకు స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి కలకత్తా నగరం పైన రాసిన ”యమహా  నగరి కలకత్తా పురి ”పాట చాలా నచ్చింది .అందులోని సంగీతస్వరానికి కాక పోయినా పాటలో కలకత్తా గొప్ప తనాన్ని వంగ దేశం లోని మహా మహులను జ్ఞప్తికి తెచ్చిన సంగతి నాకు ఎంతో స్పూర్తి దాయకం గా ఉందని పించింది .ఒక రకం గా చెప్పా లంటే కళ్ళు చెమర్చాయి .గుండె ఆనందం లో నిండి పోయింది .మిగిలినవన్నీ” ఆర్టు  బీట్ ” కంటే ”హార్ట్ బీట్ ”ను పెంచాయనే చెప్పా వచ్చు .ఆ ఘోష భరించలేక చెవులకు రుమాలు అడ్డం పెట్టు కొన్నాను .గంటన్నర తరువాత విరామం .ఆర్టిస్టు లందరూ స్టేజి వెనుక ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లి కలిశాం .మణి గారితో ఫోటోలు దిగాము .మిగిలిన ఆర్టిస్టు లతో కూడా కలిసి ఫోటోలు తీసుకొన్నాము .వాళ్ళందరూ చాలా సహకరించి ఎంతో ఓపిక తో ఫోటో లకు సిద్ధ పడ్డారు .స్టేజి మీద ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ,ఆడి పాడి అభినయించి  న వాళ్ళల్లో ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంది .మణి శర్మ తో ”మీరు స్వర మణి శర్మ ” గా కనిపిస్తున్నారు ”అన్నాను ”థాంక్ యు సార్”అని షేక్ హాండ్ ఇచ్చాడు . ” వరుడు”సినిమా లో మేమందరం ఉన్నామని సంగీతం బాగుందని అందులోని ఒక పాట పాడ మని  కోరాను .సరే నని అన్నాడు . విరామ సమయం లో తెలుగు సంస్థ వాళ్ళు స్పాన్సర్ల కు జ్ఞాపికలు అంద జేశారు .అక్కడి స్టాల్ లో ఉన్న” రెండు గారెలు సాంబారు ” పాకెట్ ను మూడు డాలర్లు పెట్టి అందరం తలో పాకెట్ తిన్నాం .

This slideshow requires JavaScript.


మళ్ళీ విరామం తర్వాత సంగీత కార్య క్రమం ప్రారంభ మయింది . గంటన్నర జరిగింది .వరుడు సిని మా పాట తో మొదలైంది .ఈ పాటకు కారుణ్య కు ఫిల్ము ఫేరు అవార్డు వచ్చిందని చెప్పి చక్క గా పాడాడు .చివరి వరుస లోని జనం బాల కృష్ణ పాటలు పాడమని గోలా, అరుపులు ,కేకలు .కొంత ఇబ్బంది కల్గించాయి .ఆయనకు కొంచెం కోపం కూడా తెప్పించాయి .తాను సంగీత దర్శకత్వం చేసిన సిని మాల లోని పాటలే పాడించాడు .జాన పద శైలి లో మధు ప్రియ ,హేమ చంద్ర పాడిన పాట చాలా హై లైట్ గా ఉంది .ఇక్కడొక విషయం చెప్పాలి మా టి.వి .ప్రోగ్రాం లో ”మధు ప్రియ” అనే అమ్మాయి జాన పదగీతాలను బాగా పాడి అందర్ని ఆకట్టుకొన్న విషయం అందరికి తెలిసిందే .ఈ స్టేజి మీద ఆ అమ్మాయి అమ్మ మీద ,నాన్న మీద ,పల్లె టూరి మీద పాడిన పాటలు అసలైన పాటలని పించి గుండెల్ని తట్టి ఆలోచింప జేశాయి .ఈ మొత్తం కార్య క్రమం లో వీటికే ఎక్కువ విలువ నిచ్చారు శ్రోతలు చప్పట్లు మారు మో గించి అభి నందనలు తెలిపారు .మిగిలిన పాటలకు పూర్తీ సపోర్టు మాత్రం ఖచ్చితం గా రాలేదని చెప్ప వచ్చు .పాపం గాయనీ గాయకులూ అడిగి చప్పట్లు కొట్టించు కోవాల్సి వచ్చిందంటే ప్రోగ్రాం ఎందుకో అందర్నీ అలరించ లేదేమో నని పించింది .గుండెల్ని పిండే  పాటో , దేశ భక్తీ ,దైవ భక్తీ ఉన్న పాట లో వుంటే, మనసును కరిగించే స్వరాలుంటే ఇంకా గుండెలు కరిగే వేమో అని పించింది .అయితే బీటు వాడికానందం .
అయితే కారుణ్య ,హేమ చంద్ర లె ఈ విభావరికి నిజ మైన విజేతలు .వారి లో ఉన్న ఎనర్జీ లన్ని టిని ఒడ్చేశారు .కాదు మణిశర్మ పిండేశాడు .ఆ బాణీలు అలాంటివి ఫాస్ట్ బీట్ ఉన్నవి .వారిద్దరూ పాడుతూ ,నటిస్తూ ఎక్కడా సభ్యతకు ఏమాత్రం లోటు రానీయ కుండా చేసిన ప్రయత్నానికి ”హాట్స్ ఆఫ్ ”.ఆడ పిల్లలు గీతా మాధురి ,శ్రావణ భార్గవి ,మాళవిక లు శక్తి యుక్తుల్నిధార పోసి పాడారు .అడ పిల్లలు కదా షో చివర వాళ్ళను చూస్తె లేత తమల పాకుల్లా వాడి పోయి నట్లు కనీ పించారు పాపం .లాలిత్యాన్ని మాళవిక పోషిస్తే ,గీతా మాధురి లాలిత్యం బీటు లను సమం చేసి పాడితే ,భార్గవి ఉషా ఊతప్ లాకొంచెం మగ గొంతుక తో  పాడి  ఆకట్టుకొంది .అందరు తమ లోని ఎనెర్జీ లెవెల్స్ ను ఖాళీ చేసుకొనే దాకా పాడి అందరికి అంటే ఆ బీటు ను ఆనందించే వారికి వినోదం కలిగించారు .
రాత్రి పదిన్నరకు   షో ను అకస్మాత్తుగా ముగించారని పించింది .వెనక నుండి కేకలు, వాళ్ళు కావాలన్న పాటలు పాడక పోవటం ఇబ్బంది కలిగించి అలా చేశాడేమో  మణి శర్మఅనుకొన్నారు .జనగణమన తో పూర్తి .మళ్ళీ మేమందరం మణి శర్మ ,హేమ చంద్ర ,కారుణ్య, గీతా ,శ్రావణ భార్గవి ,మాళవిక ,మధు ప్రియ లతో ఫోటోలు తీసుకొన్నాము .అలసి పోయినా ఆ భావం కాన పడ కుండా వారంతా పోజు లిచ్చి నవ్వు మొహాలతో అందరి తో ఫోటోలు దిగారు .మేము స్పాన్సర్ కోటా లో వాళ్ళం కనుక మమ్మల్నేవరు అడ్డగించలేదు .నేను మణి శర్మ తో ”మీ కుర్రాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా గొప్పవి .అంతా ఖర్చు పెట్టించారు మీరు .వారందరూ ”మణులు ,మీరు శర్మ ”అన్నాను నవ్వి సంతోషం తెలియ జేశాడు .ఖేమ చంద్ర స్టేజి రిహార్సల్సు దగ్గర్నుంచి అన్నీ చూశాడు .అతని కాంట్రిబ్యూషన్ విలువ కట్ట లేనిది .అతనికి మూడు నాలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనుభవమూ ఉంది . ఈ క్రెడిట్ అంతా గాయకులకే ఎక్కువ గా చెందుతుంది .శర్మ దర్శకు డైన,కష్టం ,శ్రమా  అంతా హేమ చంద్ర ,కారుణ్యలదే .సందేహం లేదు .అందుకే వారిద్దరికి షేక్ హాండ్ ఇచ్చి నా ఆనందాన్ని వ్యక్తం చేసి మనసు లో మాట ను చెప్పాను .వారిద్దరి ముఖాలు కృతజ్ఞతా భావం తో వెలిగి పోయాయి .
కార్య క్రమం పూర్తీ అవటానికి ముందు ”చేతక్ ”అనే చిన్న కుర్రాడు చాలా జోష్ గా మణి శర్మ స్వర పరచిన రెండు గీతాలను పాడి అందరి అభి నందనాలు పొందాడు .ఆ చిరంజీవికి మంచి భవిష్యత్తు ఉందని పించింది .విభావరి లో డ్రమ్ములు వాయించిన పొట్టి కుర్రాడు మహా విశ్రుం ఖలం గా చెవులు చిల్లులు పడేట్లు, గుండెలదిరే ట్లు  గా క్షణం తీరిక లేకుండా వాయించి శర్మ అనుకొన్న ది సాధించటానికి కారకుడయ్యాడు .మిగిలిన వారు కూడా తగిన సహకారం ఇచ్చి విజయానికి కారకు లైనారు .
సరిగమలు –మణి శర్మ ఎంత సేపు ప్రేక్షకులకు వీపు చూపిస్తూనే దర్శకత్వం వహించాడని సన్నాయి నొక్కులు నొక్కు కొన్నారు -ఆయన స్వచ్చమైన మల్లె పువ్వు లాంటి తెల్ల బట్టలే వేసుకొన్నాడు కాని ఆ చొక్కాపై ఆ శిలువ గుర్తుల్లాంటి వేమిటి?అని బుగ్గలు కొరుక్కున్నారు కొందరు .అది బాపు తీసిన ఏదో సినిమాలో నూతన ప్రసాద్ ”కొత్త దేవుడండీ ”అనే పాటను పాడుతూ వేసుకొన్న డ్రెస్ లా ఉందని, సినిమాలు బాగా చూసి ,కాచి వడ పోసిన ఒక పెద్దాయన నవ్వుతూనే అన్నాడు .ఎవరి డ్రెస్ వారిష్టం .ఇందులో మనకేమిటి ఇబ్బంది ?అన్నాను
పదనిసలు –బాల కృష్ణ పాటలే పాడాలని ఇబ్బంది పెట్టటమేమిటి అని కొందరు సణుక్కున్నారు .బాలికలు ముగ్గురు పాడిన పాటలు మణి శర్మ సినిమాలలో  వారు పాడినవి కావు .అందుకే పాడ టానికి ఇబ్బంది పడ్డారు .పాడాల్సి నంత గొప్పగా ఆడ వాళ్ళు పాడలేక పోయారని ఒక సంగీతాభిమాని, మణి శర్మ గారి సంగీతాన్ని అధ్యయనం చేసిన ఆయనా అన్నాడు .తెలుగు సంస్థ నిర్వ హించిన కార్యక్రమం  కదా !పాడిన పాటల్లో ఎక్కడా తెలుగు పదాలు కనీ పించలేదే -సంగీతం అంతా పాశ్చాత్య పోకడ లో ఉంది .శ్రావ్యత ఎక్కడ ?మాధుర్యం ఏదీ ?తెలుగుదనం ఏదీ ?అని తెలుగును అభి మానించే ఒక అమెరికన్ తెలుగు పెద్దాయన గోడు వెల్ల బోసుకొన్నాడు .ఇది కాల వైపరీత్యం అన్నాడు ఇంకోఆయన .అందరికి ఒకే అభిప్రాయం ఉండాలని లేదు కదా .అయినా ఇంతమంది తెలుగు వాళ్ళను ఒక చోట చేర్చి నందుకు మనం అభి నందించాలిఅని  మరో పెద్ద మనిషి  పెద్ద మనసు తో సంతోషించాడు .ఇదీ–” మణిశర్మాయణం ”–.ధమాకా- ధమ ధమ ధమ ధమాకా ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 6-8-12- కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –28 ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణపర్వాల ఆంతర్య ప్రయోజనాలు –2

  తిక్కన భారతం –28 
                ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణపర్వాల ఆంతర్య ప్రయోజనాలు –2 
మౌసల పర్వం అంటే రోకలికధ .అదే యాదవ వినాశనానికి కారణమైంది .అందుకే ఎక్కడైనా తగాదాలు బంధు జనం మధ్య వస్తే ”ముసలం ప్రారంభ మైంది ”అనే మాట లోక సహజ మై పోయింది .బల రామ ,శ్రీ  కృష్ణుల నీడలో యాదవులందరు ద్వారకా నగరం లో సకల సుఖాలు అనుభవిస్తున్నారు .మత్తు లో జోగుతూ ,మదం బలిసి విశృంఖలం గా ప్రవర్తిస్తున్నారు .అవినీతి, బంధువులతో తగాదాలతో ధర్మ నాశనం చేస్తున్నారు .యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు .పెద్దల మీద గౌరవం, భక్తీ పూర్తిగా పోయాయి .యాదవ కుల నాశనం అయితే తప్ప ,శ్రీ కృష్ణావతార ప్రయోజం పూర్తీ కాదు .అప్పటికే గాంధారి తన వంశం లాగానే యాదవ వంశమూ  నిర్వంశం కావలి అని కృష్ణుని శపించింది .అది ఒక నెపం మాత్రమె .అప్పటికే చరిత్ర రాసి ఉంచాడు పరమాత్మ .ఆ శాపం ఫలించే సమయానికి యాదవ వంశ ప్రవర్తన నీతి బాహ్యం గా మారి పోయింది .”–గురుల కవమానమోనరించు దిరుగు, లజ్జ –విడిచి ,యభి లాషముల వెంట ,విభుల పంపు –సేయ కున్మార్గుల ,దమ చిత్తములకు –వచ్చి నట్లు వర్తింతురు వనిత లధిప ”.–ఆడ వాళ్ళు కూడా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు .ధర్మ చ్యుతి తట్టుకోవటం కష్టమైంది కన్నయ్యకు .సంఘం ఇలా నీతి బాహ్యమై అధోగతి పాలై పోయింది .”వినాశ కాలే విపరీత బుద్ధిహ్ ”ఆ వినాశనాన్ని సూచిస్తూ ,ప్రకృతి విరుద్దాలైన విశేషాలు కలగటం సహజం .
”అరుణములు ఘూర్ణి తంబు లై న,లోచ–నములు మెరయ ,మహోగ్ర దండము ధరిం చి –తిరుగు నొక్కొక్క చోట ,,నడ్రుశ్యుడగుచు ,–నన్తకున్డిదే ,యదె ,తోచే ననగ నదిప ”అంతకుడు అంటే యముడు ఎక్కడ పడితే అక్కడ కానీ పిస్తూ కానీ పించాకుండా ఎర్రటి కళ్ళ తో కనీ పిస్తున్నాడట .–”విను గూడు గూర పాకము -గాను గొని ,ప్రొయి వాపిడింప గా   ,నప్పుడ ,సం –జనితము లై ,ప్రువ్వులు గల –గోన ,మిల మిల ,మొదలు నందు గురుకుల ముఖ్యా !”విప రీతాలన్నీ జరిగి పోతున్నాయి .యాదవులు కణ్వాది మహర్షులను అవమానించారు .శ్రీ కృష్ణునికి అవకాశం చిక్కింది .ఆ నెపం తో పాపం ప్రదర్శితం అఎట్లు చేశాడు .పాప ఫలాన్ని వారితో అనుభ విన్చేట్లు చేశాడు .దాని ద్వ రా ధర్మ స్తాపన చేయాలని సంకల్పం .అందుకే వారికి అంతటి శిక్ష తప్పని సరి .మహర్షులకు జరిగిన అవమానం విన్న కృష్ణుడు నిశ్చలం గా ఉన్నాడు .”విదాత్రు కరణీయం ”అన్నాడు .అంటే బ్రహ్మ రాత తప్పించు కో లేనిది .యాదవ నాశనాన్ని ,ఎక్క దైనా మంచి తీర్ధ భూమి లో చేస్తే బాగుంటుందని సంకల్పించాడు .ఉత్సవం పేరు తో మొత్తం యాదవు లందర్నీ తరలించేశాడు .
”తన రధము లేమి ,నొండొక –ఘన రధమును ,దారకుండు గైకొని యెలమిం -గొని రా ,వెడ వెడ గైసే–సిన ,కృష్ణుడు ,నిర్వికార చిత్తత వెడలెన్ ”–కృష్ణుడికి రధం లేదు సారధి వేరే రధం తెస్తే చాలా వేగం గా యే రకమైన చిత్త వికారం లేకుండా ,వెళ్లాడు యాదవులున్న చోటికి .–”బొడవు చీర పూత లొంటి యట్టులు గాగ –నేమి వాహనంబు నెక్క కించు –కేని ,వికృతి లేని ,హృదయంబు మిత్ర సం –భాషణంబు గలిగి ,బలుడు వెడలె ”బాల రాముడు రోజూ వేసుకొనే విలువైన చీని చీనాంబరాలు కాకుండా చాలా సాధారణ వస్త్ర ధారణం చేసి ,రధాన్ని ఎక్క కుండా ,బంధువు లతో మాట్లాడు కొంటూ యే వికారం లేని శుద్ధ అంత రంగం తో బయల్దేరాడు .ఇలా ,నిర్వికారం గా అన్నదమ్ములు బాల రామ కృష్ణులు బయల్దేరటం తో కాలపురుషుని శాంత ,గామ్భీర్యాలను  సూచించాడు .సాత్యకి తో సహా ,అంతా విపరీతం గా మద్యం సేవించి ,ఊగి పోతున్నారు .సాత్యకి కృత వర్మ ను అనవసరం గా నిందించాడు .ఆయనా నానా మాటలు అన్నాడు .ఇలా నెమ్మదిగా కలహం ప్రారంభ మైంది .కృత వర్మ భూరిశ్రవనుడి చావుకు కారణం సాత్యకే నని దెప్పి పొడిచాడు .శమంతక మణి కోసం ,సత్రా జిత్తు ను చంపినా విధానాన్ని జ్ఞాపకం చేశాడు సాత్యకి .ఇదంతా విని సత్యభామ కన్నీరు కార్చింది .కృష్ణుడికి కృత వర్మాదుల కోపం వచ్చింది .అతి క్రూరం గా చూశాడు .అసహ్యాన్ని ప్రదర్శించాడు .ఈ విధం గా సాత్యకిని ప్రోత్సహించి నట్లే కృష్ణుడు .సాత్యకి మదిరావేశం తో కృత వర్మను నరికేశాడు .భోజ ,అంధక వీరులందరూ సాత్యకి పై విరుచుకు పడ్డారు .తమ్ముడు సాత్యకిని కాపాడే ప్రయత్నం ఏమీ చేయ లేదు కృష్ణుడు .ముని శాపం వల్ల పుట్టిన ముసలం అంటే రోకలి వల్ల జన్మించిన తుంగ మొక్కలతో బాదు కొన్నారు అందరు చచ్చి పోయారు బహుసా దీని వెనక ఉన్న కధ అందరికి తెలిసిందే .ఒక యాదవుడు కడుపు తో ఉన్నట్లు నటించి మునిని అవమానించాడు ”నీ కడుపు లో ఏముంది “‘అని ముని అడిగితే ,వాడు పెడసరం గా ”ముసలం అంటే రోకలి ”అన్నాడు .దానికి కోపించి ముని అదే నీకు పుట్టి మీ యాదవ వినాశానికి కారణ మవుతుందని శపించాడు .అలాగే రోకలి పుట్టింది .పాపం ఏమి చేయాలో తెలీక దాన్ని అరగ దీసి సముద్రం లో కలిపారు .అదే తుంగ మొక్కలుగా పుట్టింది .దానితో బాదుకొనే యాదవు లందరూ చచ్చారు .తుంగ మొక్క చాలా సున్నితం గా మెత్త గా ఉంటుంది .అదే వినాశానికి ఆయుధమై పోయింది అదీ విచిత్రం .
”తండ్రి ,పుత్రుడన్నదమ్ముడు నాకయ –య్యిరుదేరంగు వారు ,నేపు రేగి –మడియ ,మొదగాలి బడు మ్రాకుగాముల తె–రంగు దోచే ,నేమనంగ గలదు  ..”అన్నాలేదు తమ్ముడూ లేదు తండ్రీ లేదు  బంధువులు అనే విచక్షణ జ్ఞానం లేకుండా ఒకరి నొకరు చచ్చేదాకా కొట్టుకు చచ్చారు .ఇదే ”యాదవ కులం లో ముసలం ”అంటే .అనిరుద్ధ ,ప్రద్యుమ్నాదు లైన కృష్ణుని కొడుకులూ చని పోయారు .మిగిలిన వారెవ్వ రైనా ఉంటె అవతార మూర్తి కృష్ణుడు తానే  తుంగ బుర్ర లతో  మోది చంపేశాడు .యాదవ కులాన్ని సమూలం గా నాశనం చేశాడు .గాంధారి వాక్యానికి సార్ధకత్వం చేకూర్చాడు .ఆడవారిని ,ఏనుగులు మొదలైన వాటిని ద్వారక కు తర లింప జేశాడు .తాను తపోవనానికి వెళ్తున్నట్లు తలి దండ్రులకు తెలియ జేశాడు .ఇని గంభీర విషయాలను తిక్కన అతి చిన్న పదాలతో అలంకార రహితం గా చెప్పి మనసుల్ని ఆకర్షిస్తాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –6-8-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –27 ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య,ప్రయోజనాలు -1

తిక్కన భారతం –27
    ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య,ప్రయోజనాలు -1
సద్గురుని ఉప దేశం తో విశిష్ట జ్ఞానం పొంది న ధర్మ రాజు ,ధర్మ సింహాసనం అధిష్టించి ,రాజ్య పరి పాలన చేసిన విధానం అంతా ఆశ్రమ వాస పర్వ పూర్వ భాగం లో వర్ణింప బడింది .రాజు లందర్నీ ధర్మ బద్ధులను గా మార్చి ,ప్రజా రంజకం గా 35ఏళ్ళు మాత్రమె రాజ్య పాలన చేశాడు .ఆయన పాలన లో సత్య న్యాయ ధర్మాలు బాగా పోషింప బడ్డాయి .గాంధారి ద్రుత రాష్ట్రుల జీవిత విధానం ,వారి యెడ పాండవుల ప్రవర్తన ఇందులోనే వర్ణించ బడ్డాయి .ఉత్తర భాగం లో ద్రుత రాష్ట్రాదులు ఆశ్రమ వాసం చేయటం ,నిర్యాణం పొందటం తో నాయకు డైన ధర్మ రాజు ఇతి వృత్తం చివరి దశకు చేరు తుంది .ధర్మ రాజాదులకు ఇది వరకే ఇహ లోక కాంక్ష నశించింది .యుద్ధం వల్ల శోక ,నిర్వేదాలు హృదయం లో ఇంకా అంత ర్వాహిని గా ప్రవహిస్తూనే ఉన్నాయి .అవి ,తరువాతి జీవితం లో మాటి మాటికి ప్రత్యక్ష మావు తూనే ఉన్నాయి .ఆశ్రమ వాస కధ దీనికే ప్రాధాన్య మైంది .
వ్యాస భగ వానుని తో పాండవు లందరూ కలిసి ద్రుత రాష్ట్రుని ఆశ్రమానికి వచ్చారు .అక్కడే ఉండి పోవాలనే నిశ్చయానికి వచ్చి ,ఇంటికి వెల్ల టానికి విముఖత చూపించారు .కాని ,ధర్మాన్ని ఆచరించాల్సిన బాధ్యత వారి పైనే ఉందని ఆ వృద్ధ మూర్తులు చెప్పారు .–”ఇట్లు మీరు నన్ను నెంతయు దరిమిన –విపిన భూమి మిమ్ము విడిచి పోవ –నియ్య కొనదు నాదుహృదయంబు మును వోలె –కలుగదిపుడు రాజ్య కాంక్ష నాకు ”అని ఇలాంటి స్తితి లో ముసలి వారందర్నీ అరణ్యాల పాలు చేసి, తాను మళ్ళీ సింహాసనం ఎక్కి రాజ్యం చేయటానికి మనసు ఒప్పటం లేదన్నాడు .–మళ్ళీ ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లాడు –”విను పాంచాలురు మాత్చ్యులు ,–వనితా జన శేషు లైరి వారలు లేమిన్ –జననీ శూన్యం బై తో –చిన యది ,రాజ్యంబు నాడు చిత్తంబు నకున్ ”మత్చ ,పాంచాల రాజు లంతా యుద్ధం లో చని పోయి ఆడవారికి శోకం మిగిల్చి పోయారు .ఇప్పుడు రాజ్యం నాకు తల్లి లేనిది గా కనీ పిస్తోంది  అని వాపోయాడు –”సమరము దీరిన కోలేను -శమ నిరతా ,నామనంబు సార తపమునన్ -రమి యింప గోరు యుష్మ-త్చమధిక తపమునకు నేను సందడి సేయన్ ”అని తల్లి కుంతీ దేవితో చెప్పుకొన్నాడు .యుద్ధం పూర్తీ అయిన దగ్గర నుండి తన మనస్సంతా తపస్సు చేయాలనే సంకల్పం తోనే నిండి పోయిందని వివ రించాడు .సహదేవుడూ అవే మాటలు పల్కాడు .ఇలా ,అందరి చిత్త వ్రుత్తి, ఆముష్మికానికి పరుగులు తీస్తోంది .వ్యాసుడు- చని పోయిన బంధువు లందర్నీ యోగ శక్తి తో చూపించాడు .ముసలి రాజు భార్య గాంధారి అగ్ని దగ్దులైనారు .ఇవన్నీ చూసి పానడవు లందరికి ఐహిక కాంక్ష పూర్తిగా నశించి పోయింది .ఈ పర్వం లో కుంతి మనస్తత్వం బాగా విశ్లేషింప బడింది .యుద్ధానికి ప్రోత్స హించింది ఒక రకం గా ఆమే .అయితే మానసికం గా మార్పు వచ్చేసింది .గాంధారి, ద్రుత రాష్ట్రుల తో పాటు తానూ అరణ్య వాసానికి వెళ్ళింది .వాళ్ళ తోనే మరణించింది .కర్ణుడి వృత్తాంతం ఆమెను క్షోభింప జేసింది .దాని వల్ల ఆమె కు హృదయ వేదనా ,అశాంతి,  నిర్వేదం ముప్పిరి గోన్నాయి .తట్టు కో లేక పోయింది .–”కనీ ,ఏటిలో నిడితి, గల –గని ,నట్లయి యుండె ,దత్ప్రకారంబిది ,మీ–కనిన యది ,దివ్య బోధం –బున ,నత్తేరగంతరంగమున ,గోలు కాలున్ ”అని తన అశాంతిని చిత్త క్షోభను ,ఆస మర్ధతను చాపల్యాన్ని ఉపెక్షను వెల్లడించు కొంది.ఈ విధం గా కధ లోని ముఖ్య పాత్ర లన్నిటికి ఇహ లోకం పైన విరక్తి కల్గి ,దృష్టి అంతర్ముఖ మైంది .యాదవ నాశనం కూడా పాండవుల్లో నిరాశను పెంపొందించింది .
మౌసల పర్వం లో కరుణ రసం ఉత్కృష్ట స్తితికి చేరింది .యుద్ధ పర్వం లో అక్కడక్కడ కరుణ రసం సూచించ బడింది .స్త్రీ ,అనుశాసన పర్వాలలో కరుణ రస పోషణ జరిగింది .మౌసల పర్వం లో కరుణ రసం పరి పక్వం చెందింది .విరాటపర్వం వీర రస ప్రధానం, మోదాంతం .అంటే ఆనందం తో ముగిసింది .యుద్ధం తర్వాత మౌసలం కరుణ రస విషాదాంతం .దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది .శ్రీ కృష్ణుని జీవిత పరమార్దానికి ఈ పర్వం ప్రత్యక్ష వ్యాఖ్యానం .లోకం లో అన్యాయం పెరిగి ,పాపం విజ్రుమ్భిస్తే ,సత్య ధర్మాలకు హాని కలిగితే ,భగవంతుడు అవతరిస్తాడు .దశావతారాలన్ని ఈ ప్రయోజనం కోసమే .శ్రీ కృష్ణావతార ఫలితం కూడా ఇంతే .అధర్మ పరి ణామ  ఫలితమే కురు క్షేత్ర యుద్ధం .శ్రీ కృష్ణుడు సూత్ర దారి .అర్జునుని చేత యుద్ధం చేయించాడు .అధర్మ పరిణామ ఫలితాన్ని లోకానికి ప్రత్యక్షాను భవం చేశాడు .వారికి ధర్మ ప్రవర్తన లో ఆసక్తి ని కల్గించాడు సత్య ధర్మాలను స్తాపించాడు .ఇదే ఆయన అవతార ప్రయోజనం .ఆయన రాజనీతి -దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ ..ఈ కార్య క్రమాలలో అవలంబించిన విధానాలు పై ప్రయోజనాలకు మూలమైనవి .పాపాన్ని ప్రతిఘటించే నైతిక ధైర్యం లేని వారి ,ప్రత్యక్షం గా ఘోరాలు జరుగుతున్నా ,ఉపేక్షించి ,పాపులకు బాసట గా చేరి ,.యుద్ధం చేసి ,అధర్మానికి దోహదం చేసిన భీష్మ ,ద్రోణుల విషయానికి ,శ్రీ కృష్ణుడు అవలంబించిన విధానానికి ఈ మహా ప్రయోజనమే కారణం .ఉదాహరణకు -కర్ణుడు శక్తి బాణ ప్రయోగం చేసి ఘటోత్కచుని చంపాడు .అప్పుడు కృష్ణుడు ”ప్రమోదనంబు నొంది ,సింహ నాదంబు సేసి ,శంఖంబు పారించి పగ్గంబుల నొగల ముడిచి ,మంద మారుతాన్దోలిత మందారంబు చందంబుదోప ,నర్తిన్చుచు ,నరదంబు నడిమి కరిగి ,కిరీటిం గౌగలించుకొని వీపప్పళించి ,వెండియు నార్చి ”కృష్ణుడు ఘటోత్కచుడు చావటాన్ని అంత ఆనందం గా అనుభవించాడు .పెద్ద సీనే సృష్టించాడు యుద్ధం మధ్య భాగం లో .అర్జునుని వీపు చరిచాడటఉత్సాహం గా . .అన్నభీముడి  కొడుకు చస్తే ,తమ్ముడి వీపు చరచటం ఏమిటి / అని మనకు సందేహం కలుగు తుంది .కృష్ణుని సంతోషాతిశయానికి కారణం ఏమిటో ఈ దుఃఖ సమయం లో ఈ చిందు లాటలేమితో అర్ధం కాలేదు .ఆ విషయమే అమాయకం గా బావను అడిగాడు .”ఇంద్రదత్తమైన అమోఘ శక్తి సంపన్నమైన శక్తి అస్త్రం వల్ల నీకు ఇంక భయం పోయింది .అంతే కాదు ఘటోత్కచుడు  కిమ్మీరుడు ,హిడింబి లతో కలిసి ఉన్నాదు .ధర్మ ద్వేషం ,రోషం లతో వారు ముగ్గురు ఎంత కైనా తెగించ గలరు . .ఆ రాక్షసులిద్దరి లాగా ఘటోత్కచుడు కూడా చని పోవటం నాకు చాలా ఇష్టం .వీడు రావణాసురుడు  అంతటి వాడు . కర్న్డు వాడి మీద శక్తిని ప్రయోగించాడు ఇప్పటిదాకా దాచుకొని  లేక పోతే నీ మీద ప్రయోగించే వాడు .ఇప్పుడు ఆ ప్రమాదం తప్పి పోయింది .ఇక విజం విజయునిదే  .వాడిని కర్ణుడు చంపక పోతే నేనే స్వయం గా మన వాడైనా, చంప వలసి వచ్చేది .కనుక నాకిప్పుడు మహా సంతోషమే కాని దుఖం యే మాత్రమూ లేదు ”అని తన మనస్సు లో మాట చెప్పేశాడు .ధర్మ రక్షణ కోసం తన వారు ,పరాయి వారు అనే భేదం ఉండదుపరమాత్మకు  అని తెలియ జేశాడు .ధర్మ ద్వేషులు ,ధర్మ విముఖులు ధర్మ యెడ ఉపేక్షా పరులు అందరు నశిన్చాల్సిందే .అందులో మొహమాటం లేదు .అప్పుడే ఆయన అవతారానికి ప్రయోజన సిద్ధి కలుగుతుంది .అందుకోసమే కురుక్షేత్ర సంగ్రామం లో అర్జునుని విషాదం పోగొట్టి ధర్మోపదేశం చేసి  వ్యామోహం నుండి దూరం చేసి కర్తవ్య పాలన తో యుద్ధం చేయించాడు .అభి మన్యుడు ,ఉప పాండవులు ,విరాట ద్రుపదులు, నారాయణ సైన్యం అందరు నశించారు .ఇరా వంతుని చావుకు బాధ పడే అర్జునుడికి సృష్టి తత్వాన్ని తెలియ జెప్పాడు .పాండవులను రాజ్యాధి కారులను చేసి ,అశ్వమేధ యాగం చేయించి ,భారత యుద్ధం లో పాల్గొనని రాజుల్ని చంపించటమో ,లొంగ దీసు కోవటమో చేయించాడు .దానితో లోక ధర్మాన్ని ప్రతిష్టించాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –5-8-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా జాతి పిత -జార్జి వాషింగ్ టన్

  అమెరికా జాతి పిత -జార్జి వాషింగ్ టన్ 
అమెరికా జాతి పిత గా ప్రజల చేత మన్ననలు పొందిన వాడు ,అమెరికా మొదటి అధ్యక్షుడు ప్రధమ పౌరుడే కాక అన్నితాక్ ప్రధముడు గా” first in war .first in peace and first in the hearts of  his country men” అని విశ్లేషకుల చేత కీర్తింప బడ్డ వాడు ,అమెరికా కు మొదటి సర్వ సైన్యాధ్యక్షుడై ,బ్రిటీష ప్రభుత్వం తరఫున ఫ్రెంచ్, ఇండియన్ అమెరికన్ల తో యుద్ధం చేసి ,ఆ తర్వాత అమెరికా పై బ్రిటీష పెత్తనాన్ని నిరసించి ,పౌర సేన్యాన్ని ఏర్పాటు చేసి దాని నాయ కత్వాన్నిస్వీకరించి  బ్రిటీష ప్రభుత్వానికి సింహ స్వప్నం గా నిలిచి బ్రిటీష యెర్ర సైన్యంతో యుద్ధం చేసి అమెరికా స్వాతంత్రాన్ని ప్రకటించిన ఫౌండర్ ఫాదర్స్ లో అగ్రగామి ,అమెరికా రాజ్యాంగాన్ని తయారు చేయటం లో ప్రముఖ పాత్ర వహించిన వాడు ,మొత్తం ఎలక్టోరల్ కాలేజి వోట్లు అన్నిటిని అంటే నూటికి నూరు శాతం పొందిన వాడు ,వీటికి మించి సభ్యులందరి చేతఏకగ్రీవం గా ఎన్ను కో బడ్డ వాడు,అమెరికా కు ”నియంత ”గా ఉండమనిప్రజలు, సైన్యమూ  బల వంతం చేసినా ప్రజా స్వామ్యానికే కట్టు బడి  ఆ ఆలోచనకే తీవ్ర వ్యతి రేకం తెలిపి న వాడు,అమెరికా కేంద్ర ప్రభుత్వం బలం గా ఉండాలని భావించి వాటి కోసం సర్వ శక్తులను ధార పోసిన వాడు  జార్జి వాషింగ్ టన్  .  
ఆయనకు నక్కల వేట ,కోడి పందాలు అంటే ఇష్టం .పేకాట రాయుడు కూడా .అదీ సరదాకే .తనను ఒక రాజు గా నో చక్ర వర్తి గానో ప్రజలు ,అధికారులు గౌరవిస్తుంటే ,రాజరికానికి కాలం చెల్లిందని” mr.president ”అని పిలిస్తే చాలని తెలియ జేసిన వాడు .1789 లో అమెరికా ప్రధమ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన జీతాన్ని25,000  డాలర్లు గా నిర్ణయిస్తే ,తాను సంపన్నుడనని తనకు అంత జీతం అక్కర్లేదని మర్యాద గా తిరస్కరించిన మహనీయుడు .అయితే అమెరికన్ కాంగ్రెస్ ఆయన తో ఏకీభవించక అదొక చెడ్డ సాంప్రదాయం అవుతున్దని నచ్చ చెప్పి అంగీకరింప జేసింది .హుందా గా ఒప్పు కొన్నాడు .రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి లో రాణించి మూడవ సారి మళ్ళీ అధ్యక్షుడు గా ఉండమని అందరు బలవంతం చేసినా  తిరస్కరించి అధ్యక్ష స్తానాన్ని రెండు సార్లకే పరిమితం ఆయె సంప్రదాయాన్ని తన తో ప్రారంభించిన వాడు వాషింగ్టన్ .స్వంత పిల్లలు అంటూ ఎవరు లేరు .చని పోతు తీవ్ర బాధ అనుభవించాడు .”i die hard but i am not afraid to go ”అని ఒక సైన్యాది కారి లాగా  ధైర్యం గా చెప్పాడు .
తన తర్వాత అధ్యక్షుడైన జాన్ ఆడమ్సుతో ఆనాటి రాజకీయ పరిస్తితి ని  చర్చిస్తూ ఫ్రెంచ్ వారితో జరిగే పోరాటాలకు కలత చెంది  అవసర మైతే తాను మళ్ళీ సైన్యానికి నాయకత్వాన్ని వహించి అమెరికన్లకు విజయం చే కూ రుస్తానని చెప్పిన దేశ భక్తీ ఆయనది .దానికి ఆడంసు స్పందించి వాషింగ్ టన్ ను ”మిలిటరి కి లెఫ్టి నేంట్ జెనెరల్ అండ్ కమాండెంట్ గా” గా గౌరవ స్తానాన్ని కల్పించాడు .అమెరికన్ లాండ్ స్కేపుల చిత్రాలంటే ఆయనకు ప్రాణం .వాటిని సేకరించి తన వర్జీనియా రాష్ట్రం లోని వెర్నాన్ లోని స్వగృహం లో భద్ర పరచాడు .
ఆయన దగ్గర సుమారు వంద మంది బానిసలుండే వారు వారు వ్యవ సాయం లో సాయం చేసే వారు .వారి తో సేవలు చేయించుకోవటం ఇష్టం లేక పోయినా తప్పని పరిస్తితి అన్నాడు ” .the unfortunate condition of the persons ,whose labour in part i employed ,has been the only unavoidable subject of regret ”అని బాధ పడ్డాడు .అయితే బానిసత్వ నిర్మూలనకు తన శక్తి ని, అధికారాన్ని ఉపయోగించలేదు అని అంటారు చరిత్ర కారులు .1797 లో అధ్యక్ష పదవి ని వదిలేసిన తరువాత ,పెన్సిల్వేనియా రాష్ట్రం లో ఉన్న చట్టం ప్రకారం తన వద్ద ఉన్న కొందరు బానిసలకు విముక్తి కల్గించాడు .అక్కడ చట్టం ప్రకారం యజమాని రాష్ట్ర నివాసి గా ఆరు నేలలుంటే అతని వద్ద ఉన్న బానిసలకు విముక్తి కలుగు తుంది .వాషింగ్ టన్ ఆ తరువాత రెండేళ్ళ కు తన” విల్లు ”లో రాసిన దాని ప్ర రకారం తన వద్ద ఉన్న బానిస లందరికి విముక్తి కల్గించాడు .
విస్కీ మీద వేసిన పన్నును ప్రజలు ఎదిరించారు .వారికి నచ్చ చెప్పాడు ”the tax was law.popular or not ,it would be collected ”అని చెప్పటం తో తిరుగు బాటు తగ్గింది .అలాగే మిలీషియా కు జీతాలు చాలటం లేదని గడువు ముగిసిన వారికి మళ్ళీ కొత్త గా తీసుకోవాలని ,లేకుంటే వారు ఇంటికి వేళ్ళు తాము అంటే  పంపించాలనే తిరుగు బాటు కూడా వస్తే దాన్ని సమర్ధ వంతం గా తిప్పికొట్టి వారి ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ ను ఒప్పించి జీతాలు పెంచే ఏర్పాటు చేశాడు .ఆయన పంటి వ్యాధి   తో బాధ పడే వాడు .ఆ నాడున్న వైద్య విధానం లో కొయ్య దంతాలను ,ఖడ్గ మృగం కొమ్ము తో చేసిన దంతాలను అమర్చే వారు .పాపం ఆయనకు అవి సరిపోక చాలా ఇబ్బంది పడే వాడు .
అధ్యక్షుడికి సైన్యం పై పెత్తనం ఉండాలని వాదించి అమలు ఆయె టట్లు చేశాడు .ఆయన వర్జీనియా రాష్ట్రానికి చెందినవాడు .అది తేయాకు పంటకు అగ్ర స్తానం .వర్జీనియా తేయాకు ప్రపంచం లోనే నాణ్యతకు ప్రసిద్ధి .అందుకే నేమో అక్కడ పుట్టిన వాషింగ్ట న్ ఆ నాణ్యత ను తన ప్రవర్తన లో ప్రదర్శించాడు అంతటి ఉన్నత స్తానాన్ని పొందాడు .ఆయన స్వభావ శీలాదులకు అది పరోక్ష ప్రేరణ గా  ఉందని పిస్తోంది .అలాగే వర్జీనియా పొగాకు కు ఘాటు ఎక్కువ .ఆ స్వభావం ఆయన ధైర్య  శౌర్యాలలో ప్రతి బిమ్బించిదేమో నని పిస్తోంది .ఆయన గొప్ప ప్లాన్ టేషనర్ కూడా .
సైన్యం లో కొందరు తమ జీవితాలకు తగిన ప్రతి ఫలం లభించటం లేదని తిరుగు బాటు చేశారు .వారితో సంప్ర దించటానికి వెళ్లాడు .వాళ్ళ సమస్య లను తీరుస్తానని చెప్పాడు .తన జేబు లో చెయ్యి పెట్టి కాళ్ళ జోడు బయటకు తీసి పెట్టుకొన్నాడు వారితో మాట్లాడుతూ”gentle men! you must pardon me .I have grown gray in your service and  find my self growing blind ”  అనే సరికి వాళ్ళ కళ్ళు అశ్రుపాతం తో జల జలా శ్ర వించాయి .కొందరు ముఖం ప్రక్కకు తిప్పుకొని బాధను వెలి బుచ్చుకొన్నారు .అందరి హృదయాలు ద్రవించి పోయాయి .తమ కోసం ఇంతటి త్యాగం తో,  దేశ భక్తీ, తో ,అంకిత  భావంతో సర్వ సమర్ధం గా ఈ ముసలి తనం లో పని చేసే ఆయనంటే, విపరీత మైన ఆరాధనా భావం బయట పడి వారి తిరుగు బాటు మిలిటరి డిక్టేటర్ బావన ఒక్క సారి ఇగిరి పోయాయి .ఇంతకి వారేమి కోరారు ?.దేశం లో మిలిటరి పాలన రావాలని , అమెరికా ప్రభుత్వాన్ని మిలిటరి నడపాలని .బ్రిటీష వారి తో పోరాడింది మళ్ళీ రాజరికం కోసమో ,లేక డిక్టేటర్ షిప్ కోసమో కాదని నచ్చ చెప్పిన జాతీయ ప్రజాస్వామికాభి మాని ఆయన .కారన్ వాలీసు బ్రిటీష సైన్యాధి కారి .అంతటి వాడిని యుద్ధం లో ఓడించి అతనితో  ”తెల్ల జెండా ”ను ఎగరే యించిన వాడు జార్జి వాషింగ్ టన్. కొన్ని చోట్ల ఓడినా అంతిమ విజయం తన దేశానికి సాధించిన మహా యోధుడు .ఇంతకి ఆయన సర్వేయర్ గాజీవితాన్ని ప్రారంభించి జిల్లా సర్వే యర్  ఉద్యోగం చేశాడు .వ్యవ సాయం కోసం ఆయన ఒక కొత్త నాగలిని తయారు చేసుకొన్నాడు .
  ఇద్దరు పిల్ల లున్న మార్తా కుస్తిస్ అనే ఆమె ను వివాహం చేసుకొన్నాడు .ఆమె అప్పటి వర్జీనియా లో అత్యంత సంపన్ను రాలైన మహిళ .ఆమె సంపద 23,632 పౌండ్లు ఈ నాటి అమెరికా డాలర్ల లో దాని విలువ ఒక మిలియన్ డాలర్లు .జార్జి తండ్రి చని పోయిన తర్వాతా వచ్చిన ఆస్తి260 ఎకరాలు .సర్వే చేయని 1600ఎకరాలు . ఈయన తండ్రి పేరు ఆగస్తాన్ .అందరు ”గస్ ”అని సరదా గా పిలిచే వారు .జార్జి వాషింగ్ ట న్ 22-2-1732లో జన్మించాడు ఆయన మరణించినది 14-12-1799-అరవై ఏడేళ్ళ వయసు లో .నిండుగా జీవించి అందరి మనస్సులో నిలిచి అందరికి ఆదర్శ ప్రాయం గా ,రోల్ మోడల్గా ఉన్న వాడు .అందుకే ఆయన్ను గురించి the principles of integrity and honesty to make him self richest and most powerful person in America .He re affirmed his commitment to democracy in the strongest possible terms .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –4-8-12-కాంప్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged , , , , | Leave a comment

తిక్కన భారతం – 26 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -4

                తిక్కన భారతం -26
                     శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -4
వేదాలు కర్మ చేయమని ఒక సారి ,కర్మను పరిత్య జించమని ఇంకో సారి చెబుతాయి .దీన్ని ఎలా అర్ధం చేసు కోవాలి అన్న ధర్మ రాజు ప్రశ్నకు భీష్మునిసమాధానం –”కొందరు కర్మాచరణ మభి -నందిం తురు  ,వారలకు జనన మరణములం –బొందక ,పోరాదు ,మహా –నందము  బొందుదురు నిత్య నైష్కర్మ్య పరుల్ ”–”చిత్త శుద్ధి మాత్ర జేసే నేనియు, నవి –ద్యాత్మకం చూవె , యరయ,గర్మ -మది ,దోరంగు తమ్చితాత్మ విద్యాత్మక –ధర్మ మది య మోక్షదంబు సుమ్ము ”అని కర్మాలను చేయటం లో ఉన్న ధర్మ సూక్ష్మాలను చెప్పాడు .”ఫలములు గోరక ,కర్మం-బులు నడపుచు ,వాని విమల బోధాగ్ని హతిం –బొలియించుచు ,నిర్ద్వందత –నెల కొనునే కాంతి జనులు నిను గండ్రు హరీ ” అని ఆచరణ సాధ్య మైన కర్మ సిద్ధాంతాన్నే చెప్పాడు .ఫలా పేక్ష లేకుండా చేసే సత్కర్మ లన్ని మోక్ష కారకాలే అవుతాయి .ఎవ రైనా ఎలా ప్రవర్తించాలో ,చాలా స్పష్టం గా వివ రించి చెప్పాడు .సూక్ష్మ ధర్మా లనన్నిటిని రాశి గా పోశాడు .ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఈ పర్వాలు చక్కని సోపాన మార్గాలు .జీవ బ్రహ్మ ల ఐకమత్య తకు విశుద్ధ మార్గాలు .కర్మ చేసే వారికి జనన మరనాలుంటాయి .అయితే నిష్కామ కర్మ చేసే వారు మహానందాన్ని పొందుతారు .
” జనులకు గీడు రోయక, యజస్రము ధర్మ రతిం జరించి ,స -జ్జన ,గురు పూజనంబులు సత్య హితోక్తులు దీన పోషణం –బున ,నాటిది ప్రియత్వమును ,భూరిత దయార్ద్ర తయుం గలట్టి వా–రనిమిష లోకములని యాత్మ నేరుగుము మేనకాత్మజా ”ఎంత సూక్ష్మం గా స్వర్గానికి చేర గలమో చెప్పాడు -ఏమీ లేదు -ప్రజలకు కీడు చేయ కుండా ఉండటం ,ఎప్పుడు నీ కు విధించిన మార్గం లో నడవటం ,మంచి వాళ్ళను గురువులను పూజించటం ,సత్యాలు మంచి మాటలు వారి నుండి గ్రహించటం ,ఆపదలో దీన స్తితి లో ఉన్న వారిని ఆదరించటం ,అందరి తో ప్రియం గా ప్రవర్తించటం ,సర్వ భూతాల మీద దయ కలిగి ఉండటం స్వర్గానికి మార్గాలు .
”పరుసని పల్కు ,బొంకులగు పలుకులు ,నన్య ధనాభి లాష ముం –బర వనితావిలోలతయు ,బాంధవ సజ్జన విప్రియమ్బు  ,దు –శ్చరితులతో డి మైత్రి యును ,సంతత ధర్మ రతాభ్యసూయయుం –గలి,ని భయాన ఘోర నరకంబున కేగేడి వారి చిహ్నంల్ ”అంటే –పరుష మైన మాటలు ,అబద్ధాలు ఇతరుల ధనం పై ఆశ ,ఇతర స్త్రీ ల మీద వ్యామోహం ,బంధువులకు మంచి వారికి కీడు చేయాలనే తలంపు ,చెడ్డ వారితో స్నేహం ,ఎప్పుడూ ధర్మానికి విరుద్ధం గా ఆలోచించటం ధర్మ వ్యతి రేక పనులు చేయటం కలి కాలం లో ఘోర నరకం పొందటానికి కారణాలు అవుతాయి .ఇంత క్రిస్టల్ క్లియర్   గా మంచి చెడు ల జ్ఞానాన్ని విడమర్చి చెప్పాడు .ముక్కు మూసుకొని తపస్సు చేయ్యనక్కర లేదు .అరణ్యాలకు వెళ్లి గడ్డాలు మీసాలు పెంచి జపతపాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టక్కర లేదు .సంసార జీవితం లో ఉంటూనే సర్కార్మా చరణ  ,నిష్కామ జీవితం లోనే స్వర్గ ప్రాప్తి కలుగు తుంది . .జప తాపాలు చేసి కష్టపడ క్కర లేదు .మంచి పనులు చేస్తే మోక్షం, చెడ్డ పనులు చేస్తే నరకం వస్తాయి .ఈ విధం గా వివిధ ధర్మ శాస్త్రాలలో చర్చించ బడిన విశిష్టార్దాలన్నిటిని సర్వజనులకు అర్ధమయ్యే టట్లు ,సిద్దాంత రూపం గా ,ఆంద్ర మహా భారతం లో ప్రతి పాదించ బడ్డాయి .దీని విశిష్టత ను బట్టే ఆంద్ర భారతం విజ్ఞాన వ్యాప్తికి ఉత్కృష్ట సాధనం గా నిలిచింది .
దీని తో ధర్మ సూక్ష్మ విచారణ పూర్తీ అయింది .దీని తర్వాత చివరి పర్వాలలోని ఆంతర్యాన్ని ,పరమ ప్రయోజనాన్ని తెలుసు కొందాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –4-8-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం –25 శాంతి అనుశాసన అశ్వ మేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ –3

  తిక్కన భారతం –25
 శాంతి అనుశాసన అశ్వ మేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ –3
తిక్కన మహాకవి కవితా సరస్వతీ స్రవంతి శాంతి ,అనుశాసన పర్వాలలో సాత్వికం గా ప్రత్యక్ష మైతే ,అశ్వ మేధం లో అంతర్వాహిని గా ,నిగూధం గా ప్రవహించింది .”ఇంద్రియములు దామ ఇచ్చ నట్టు నిట్టు ,–దిరిగె నేనియు ,దుఖముల్ దెచ్చు నవియ –కట్టు వడి ,సుఖ  యాత్మ –గావలయు నింద్రియ చోర గణము వలన ”–ఇది తికన శైలికీ వర్తిస్తుంది.ఇంద్రియాలను అణచి వేస్తె ,ఆత్మా చక్కగా ప్రకాశి స్తుంది .అలాగే అలంకారాలను తగ్గిస్తే ,శాస్త్రాల అర్ధం చాలా సులభ గ్రాహ్యం అవుతుంది .–”విను ,కేవలుడగు జీవుడు ,-దను బరముం గాగ ,జూతి ,తల్లీనత్వం –బున ,వెలుగు నది ,నిరామయ –మనంత మగు పదము సూవే యతుల వివేకా ”అని అర్ధ గౌరవానికి ప్రాదాన్యమిచ్చాడు .శబ్దార్ధ చమత్కారాడు లను వదిలేసి శుద్ధ సాత్విక రూప రచనను చేశాడు .దీన్నే నిసర్గ రమణీయం అన్నారు .ఈ విధానం లోను చదు వరులను అత్యంతంగా మెప్పించాడు ..గాలి లేని చోట దేపం నిశ్చలం గా ఉంటుంది .సుఖ నిద్ర వల్ల ప్రశాంతత ,మేఘాడంబరం లేని ఆకాశం లో నిర్మ లత్వం ,తరంగాలు లేని మహా సముద్రం లో ప్రసాద స్తితి అంటే ప్రశాంతత ,అలాగే అంతర్ముఖుడై,ఆత్మా సాక్షాత్కారం తో జనిచిన బ్రహ్మానందం లో లీన మైన యోగి స్తితి కూడా అలానే ఉంటుందని చక్కని ఉపమానాలతో విస్పష్టం గా తెలియ జేశాడు .
”అవ్రుష్టి సంరంభ మివామ్బు వాహం –అపా మీవా ధారా మనుత్త రంగం –అంతశ్చరాణాం మరుతాం నిరోధా –న్నివాత ,నిష్కంప మివ ప్రదీపః ”అన్నిమహా కవి కాళిదాసుగారి  రచన తిక్కన రచన కు సమాన ఉజ్జీ లా ఉంది .తిక్కన రచన నిశ్చలత ,ప్రశాంత స్వచ్చ్తా ,లక్షణా లతో ”వేద వాజ్మయం ”లాగా మహా తేజో మయం గా ప్రకాశించింది .ధర్మ రాజు తాను తపోవనానికి వెళ్లి హాయిగా జీవితాన్ని గడ పాలని అను కొంట న్నట్లు తమ్ములకుతెలిపాడు .వారందరూ ఏమంటున్నారో చూడండి –”కేవల నిష్కర్మత ,మో-క్షావహ మగు నేని గిరులు ,నవనీజములున్–భూవర ,ముక్తిం బడయం –గా వలదే ,యడవి నునికి ,కైవల్యదమే ?”శక్తి ధైర్యం ఉన్న వారు శత్రు ప్రయతనాన్ని వ్యర్ధం చేసి ,కార్య సిద్ధి పొంది ,,రాజ్యానుభావాన్ని వద్దనటం ,అవి వేకం అన్నారు .యే కార్యక్రమం లేకుండా అంటే నిష్క్రియత్వం తో మోక్షం వస్తుందని భావిస్తే -యే పని లేని కొండలు, చెట్లు, అడవులు మోక్షాన్ని పొందాలి కదా !అలా పొందు తున్నాయా ఆలోచించు అని చాలా చిన్న మాటలతో అనంత సత్యాన్ని వివరించారు అన్నకు -కాదు వివ రించి చెప్పించాడు తిక్కన .అదీ కవితా రహస్యం .చాలా అర్ధ వంత మైన దృష్టాంతాలను చెప్పి ,ఒప్పించారు అన్నయ్యను .హింస లేకుండా జీవించటం ఎవరి తరమూ కాదన్నారు .దీనికో పద్యాన్ని తిక్కన సమయోచితం గా చెప్పాడు –”కాయల ,బండ్ల ,నీళులు గల్గవె ,సూక్ష్మ జంతువుల్ మునుల్ –సేయరే హింస ,వాని ,నుప జీవిత ద్రవ్వరె ,కంద మూలముల్ –నీ యెడ జూడు ప్రాణములు నిలవగా నేర వహింస నేరికిన్ –వేయును నెల ,భక్ష్యముగ ,వేధ విధింప బడే ప్రాణి ప్రానికిన్ ”అని లోక సహజ మైన హింసను వివ రించారు .నీళ్ళల్లో గాలిలో ,కాయల్లో కూరల్లో పాళ్ళలో స్ ఉన్న సూక్ష్మ జీవులు మునులు తీసుకొంటుంటే హింస చేసినట్లా ?కందమూలాలు తవ్వుతుంటే ఎన్నో జీవులు నశిస్తాయి ఇది హింసే అయితే జీవిత విధానం సాగాడు .ఒక ప్రాణి చావు ఇంకో దాని చేతి లో ఉండటం లోక సహజం .ఈ భక్షణ అనేది వేధ అంటే చంపటం హింసించటం అని పించు కోదు .ఇలా వేదాంత రహస్యాలను సులభం గా ,సరళం గా చెప్పాడు తిక్కన .తేట తెలుగు మాటలే ఉప యోగించాడు .శాంతి ఆనుశాసనిక పర్వయే ఆర్య సాహిత్యం లో మహా భారతానికి విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టాయి .మహా భారత రచనా ప్రకొజనమ్ కూడా దీని తోనే సిద్ధి పొందింది .వ్యాసుని హృదయం దివ్య జ్ఞానం అర్ధం చేసుకొని సులభ గ్రాహ్యం గా తిక్కన మహా కవి తెలుగు చేశాడు .”తెలుగింటి వ్యాసుడు ”అని పించుకొన్నాడు తిక్కన సోమయాజి .
ధర్మ సంకటం చాలా క్లిష్టం గా ఉంటుంది .తేల్చి చెప్పటం మహా కష్టం .శాస్త్ర జ్ఞానం లేని వారికి ఇలాంటి పరి స్తితే యేడు రైతే ఎలా నడుచు కోవాలో అద్భుతం గా చెప్పాడు మహా భారతం లో .–”ధర్మమధర్మము భంగిన -ధర్మము  ధర్మంబు మాడ్కి, దనయా, తోచున్ –నిర్మల మతి నరయ వలయు –ధార్మికతన కోరు వాడు దానకేర్పడగన్ ”–బ్రహ్మ చర్య ,గృహస్త ,వాన ప్రస్తా ,సన్యాస ఆశ్రమాలను అవలంబించిన వారు అనుసరించే ధర్మాలు యే విధం గా స్తూల దృష్టికి పరస్పర విరుద్ధం గా కన్పించినా ,సూక్ష్మ పరి శీలన లో ఉత్తమ ధర్మాలుగా వర్తిస్తాయి .శాంతి తో జీవ యాత్ర చేసే వారికి –”వినుము బ్రతి గ్రహంబును ,–యాజనంబును ,నద్యాపనమును ధరామరులకు –ప్రజ రక్ష,నృపులకు బసు పాలనము గృషి ,వాణిజ్యము నివి వణిజులకు ”అని వర్ణాశ్రమ ధర్మాలను తెలిపాడు .అయితే అన్ని వర్ణాల వారు ఆచరించ వలసిన ఉత్తమ ధర్మాలను కూడా వివ రించాడు .–”సత్య శౌచంబులును  ,నహింసయు ,ననసూయయు ,శ్రాద్ధంబు ,నాటిది పూజ నమును  నాత్మ దార పరతయు సర్వ సాధారణంబు లనఘ వీనను ,నిజ వృత్తులను సమస్త –జాతులును నిహా పర సౌఖ్య సంపదలకు –నాస్పదములగు నింద్యంబు లన్య విధులు ”అని స్పష్టం చేశాడు .వివిధ ధర్మాలను అవలంబించటం లో తమ ధర్మం పట్ల దురభి మానం ,అన్య ధర్మాల పట్ల నీరసం కలగా కుండా సర్వ ధర్మ సమానత్వాన్ని ప్రతి పాదించి చెప్పాడు .–”వినుమనేక విధంబుల విస్తరిల్లు –ధర్మముల యన్దోకండును దలప ,నిష్ప్హ–లంబు లేదాత్మ మొక్షావ లంబీ యైన –ధర్మ ముత్తమమండ్రుతత్వజ్ఞు లధిపా ”అని సర్వోత్తమ మైన ధర్మ స్వరూపాన్ని విడమరచి చెప్పాడు . .అనేక ధర్మాలున్నాయి అందులో ఏదీ పనికి మాలినది కాదు .కాని మోక్షం కోరు కొనే వారు మాత్రం తగిన ధర్మాన్ని ఎన్ను కొని ఆ మార్గం లో మోక్షాన్ని సాధించాలి .
కొన్ని ధర్మాలు పాపం గ కన్పిస్తాయి .కాని సూక్ష్మ విచారణ లో అవి సత్క్రియలు గా తెలియ బడతాయి .ఎలాగో చూడండి –”దూరమున గైదువు గొని తను –బోరి గోన నేతెంచు నట్టిపు రుషుని –వేదాంత రహస్య వేది  నయినను –బోరి గొనినను ,గిల్బిషంబు వొందదువత్సా ”దూరం గా ఉండి ఏదో అనుకొని దగ్గరకు వచ్చి చూస్తె అసలు రహస్యం తెలుస్తుంది .అలాగే వేదాంత రహస్యం కూడా ఆచరణ లో దాని విలువ కనీ పిస్తుంది .ప్రాణి హితం కోసం మాట్లాడినవన్ని సత్యాలే .భూత హితం పరమ ధర్మం .అన్ని మతాలకు ఇదే మూలం అనితెలియ జేశాడు .–”సత్యంబు పల్కుట సర్వ ధర్మములకు –మిక్కిలి ,యనృతంబు మేటి పాత –కము ,తద్విశేషంబు గలదు చెప్పేద నోరు –నరదంబు  ,ప్రాణంబు నపహరింప –జూచు పాతకులతో సూనృతంబాడుట –పాపంబు ,బొంకులు వలికి యట్టి –వారి హింసించుటవర ధర్మ మిది యొక్క –డేల భూతములకు హితము సేయు –బొంకు లెల్లను ధర్మముల్ భూత బాధ –కంబు లగు నిక్కములు ,పాతకులు వినుము –భూతముల దుష్ట శిష్టత్వములు వివేక –సూక్ష్మతా వేద్యములు ,వాని జూడ వలయు ”నిజం మాట్లాడటం అబద్ధం చెప్పక పోవటం అందరు తప్పక చేయాల్సిన పనులే .ప్రాణాన్ని డబ్బును సంపదను దోచుకొనే పరమ పాపు లతో నిజం చెప్పటం మంచిది కాదు అక్కడ తప్పించుకోవ టానికి అబద్ధం తప్పదు .అసలేప్పుడూ  అబద్ధాలు చెప్పే వారిని దండిన్చాల్సిందే .సర్వ భూతాలకు మేలు చేసే టప్పుడు అబద్ధమాడినా అది సత్యం తో సమానమే .కనుక ప్రాణుల దుష్టత్వం శిష్టత్వం చాలా ధర్మ సూక్ష్మా లతో పరిశీలించి నిర్ణయించాలి .పిడుక్కీ బియ్యానికీ ఒకే మందు పనికి రాదు .ఇదే ధర్మ సూక్ష్మం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-12–కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

మధుర పానక పాణి —ఈనాడు లో

  సంగీత  పాణి నీయం 
సంగీతం పాడటం ఒక ఎత్తు .అందులోని మెళకువలు గ్రహించటం మరో ఎత్తు .ఆ సంగీత రసజ్ఞత ను శ్రోతలకే కాక, కాక కాకలు దీరిని సంగీత  విద్వాంసులకు కర దీపిక గా మార్చి వెలుగు దారి చూపించటం మరో ఎత్తు .దీనినే ఆయన సాధించి గురువులకు గురువు గుగ్గురువు అని పించు కొన్నారు .శాస్త్ర బద్ధత కు కొల మానం గా నిలిచారు .వ్రుత్తి వైద్యమే అయినా ప్రవ్రుత్తి సంగీతమై దాని వ్యాధులకు చికిత్చ చేసి ఆరోగ్యాన్నిచ్చారు .ఆ నాటి వ్యాకరణానికి పాణిని ఎంతటి లబ్ధ ప్రతిష్టుడో ఈ నాటి కర్ణాటక సంగీతానికి పినాక పాణి అంతటి తేజో విరాన్మూర్తి .సంగీతానికి ఆధునిక పాణిని పినాక పాణి .ఆయన పదవీ విరమణ  తరువాత జీవితాన్ని అనుక్షణం సంగీతానికే ధార పోసిన మహాను భావుడు .ఎనిమిదేళ్ళు గా మంచం లోనే ఉంటున్నా వారి సంగీత విశ్లేషణా గమనం ఆగి పోలేదు .నోటిలోనే మననం చేసుకొంటూ శిష్యుల చేత వ్రాయిస్తూ గ్రంధస్తం చేస్తున్న కారణ జన్ములు .దిగ్దంతు లైన సంగీత విద్వాంసులకు ఆచార్యత్వం వహించిన ఘనత వారిది .సంగీత రస గుళికలను ఆంద్ర సంగీత ఆభిమానులకు కరతలా మలకం చేసిన సంగీత శంకర భగవత్పాదులు .ఖగోళ రహస్యాలను కుర్చీలోనే కూర్చుని శరీరం సహకరించక పోయినా విశ్వ నిర్మాణ రాహస్యాలను అవగాహన చేసి కోని ,అందరికి అర్ధ మయ్యే భాష లో అతి గహన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించిన స్టీఫెన్ హాక్ శాస్త్రజ్ఞుడు ఆయన లో కని పిస్తాడు .”సంగీతం ధ్వని నాట్యం .దాన్ని పరిగెత్తుతూ నువ్వు ఎలా నృత్యం చేస్తావు ”?అని ప్రశ్నించిన సంగీత శ్రీ పాదులు పినాక పాణి గారు .వారి విద్వత్తును పద్మ భూషణ తో సరి పెట్టిన మన అల్పజ్నత కు తల వంచు కోవాలి .ఏ.వి.కే.రంగారావు గారు అన్నట్లు ఆయన మనకు ”సంగీత స్వర నిఘంటువు ”.సంగీతానికి సరికొత్త పాత దారిని వెలుగుల తో నింపి చూపిన మార్గ దర్శి .
బహుశా ముప్ఫై ఏళ్ళు పైగా  అయి ఉంటుంది -శ్రీ పాద వారిని విజయవాడ లబ్బీ పేట లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో కంచి జగద్గురువుల సన్నిధి లో కచేరి చేస్తుండగా చూశాను .పట్టు పంచె కట్ట్టు కోని పట్టు పై పంచె వేసుకొని నుదుట వీభూతి రేఖల తో ” అపర సంగీత ‘పినాక పాణి ”(శివుడు )గా దర్శన మిచ్చారు ..అద్భుత మైన గానం తో శ్రోతలను అలరించారు .జగద్గురు ల కు పరమ ప్రీతిని కల్గించి వారి చేత సత్కారం అందుకొన్నారు .నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారు కంచి పీఠం లో ఆస్థాన విద్వాంశులు అను కొంటాను .అరుదైన గౌరవం పొందారు .ఆ సంగీత సరస్వతికి శత వసంతాల ఈ శుభ సమయం లో వారికి ద్వి శతాధికా యుర్దాయం, ఆరోగ్యం కలిగించాలని భగ వంతుని ప్రార్ధిస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -08 -12 .–కాంప్ –అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –24 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2

 తిక్కన భారతం –24
శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2

”మనుజులు సేయ నెవ్వరు సమస్తము నీశ్వరు నాజ్ఞ జెల్లెడు- న్వినుము  ,కుఠార పాణి ధరణీ రుహముల్ నరకంగ,బాప మొం-దునొకొ,కుఠారమున్ జనులు దోసము బొందరు  కర్త ,ఈశ్వరుం –డని యేడు నిశ్చయంబు ద్రుధమది నిల్చిన జాలు భూవరా ”,అని ధర్మజుని కి వ్యాస మహర్షి జ్ఞానోప దేశం చేశాడు .అహంకార మమకారాలు ,రాగ మొహాలు ,వీడి పోగా మనస్సు కుదుట పడింది .ఆత్మా జిజ్ఞాస ఏర్పడింది .అందుకే యోగాభ్యాసం లో ఉన్న శ్రీ కృష్ణుని సందర్శించి ,మార్గం బోధించా మని కోరాడు .దీని వల్ల అతనికి యోగా నిష్ఠ లో ఆసక్తి ,పర తత్త్వం ఐ కోరికా బలపడ్డాయని తెలుస్తోంది .శాంతి ,అనుశాసనికపర్వాలలో ఆధ్యాత్మిక తత్త్వం  ప్రకృతి రహస్యం అంతా అతన్ని కర్మ యోగి గా మార్చాయి .
కదా నాయకు లైన పాండవుల జీవిత చరమాంకం ప్రశాంతత పొందటమే .నాయకుడూ ,ఫలాది కారి అయిన ధర్మ రాజు స్వర్గం చేరా లాంటీ ,చిత్తశాంతి పొందాలి .అతని విషయం లో ఒక వేదాంత అర్ధం కూడా ఉంది .పూర్వ జన్మ సంస్కారం కారణం గా సత్య నిష్ఠ ,ధర్మ పర తత్త్వం దైవ భక్తీ మొదలైనవి కలిగాయి .ఇంద్రియాలను వశ పరచు కొన్నాడు .రాగ ద్వేషాదులను జయించి ,స్వధర్మ నిర్వహణ చేశాడు .క్షత్రియులకు ఉచిత మైన యుద్ధమూ చేశాడు .రాజసం అవలంబించి ,విజ్రుమ్భించినా ,యుద్ధం తర్వాతసహజ సిద్ధ మైన ప్రశాంతత పొందటం అతని ప్రకృతికి చాలా సమంజస మైనది .కల్పాంతం లో తీవ్ర మైన గాలితో ఉప్పొంగి ,సమస్తాన్ని ఆక్రమించి ముంచేసే మహా సముద్రం ,మళ్ళీ శాంతి పొంది ,మేర అంటే చెలియలి కట్ట దాటకుండా ఉండే విధం గా స్వభావం తో సౌమ్య మైన బ్రహ్మ జ్యోతి కారనాన్తరంగం గా ,రాజసం మొదలైన వికారం పొందినా ,మళ్ళీ సహజ స్వభావం అయిన సౌమ్యాన్ని పొందు తుంది .ఈ విషయాన్నే  –”నిసర్గ సౌమ్య మేవ బ్రహ్మం జ్యొథిహ్ కుతోపి కారణా –త్ప్రాప్త ,వికార మాపి ,పునః ,స్వభావమే వావ తిష్టతే–కల్పాంత వాత సంక్షోభ లంఘితా శేష భూభ్రుతః –స్థైర్య ప్రసాద ,మర్యా దాస్తా ఎవహి మహొదధెహ్ ”అన్న దాని లో వివ రించారు .
మొహం తో ద్యూతం లో పాల్గొన్నా ,అరణ్య వాస తపోనియమాడులతో పూరమ సంస్కార స్మృతిని ధర్మ రాజు పొందాడు .ఇంద్రియాలను జయించి ,శ్రీ కృష్ణుని ఆలంబనం గా భీమార్జునుల సహాయ సాధన సంపత్తి తో దుర్యోధనాది శత్రు వర్గాన్ని జయించి ,భీష్మ గురూప దేశం చేత జ్ఞాని యై ,ఆత్మా సాక్షాత్కారాన్ని పొంది ,చివరికి స శరీర స్వర్గ ప్రాప్తి అనే జీవన్ముక్తి ని పొందటం అంతా పైన చెప్పిన వేదాన్తార్ధం లో సమన్వయం అవుతుంది .ఆధ్యాత్మికత్వాన్ని ప్రతి పాదించటం లో వ్యాస విధానం చాలా విశిష్ట మైనది .దివ్యామ్ష సంభూతుడు ,జితేంద్రియుడు ,మనో వాక్కాయ కర్మ ల చేత” సంయమి ”అని పించు కొన్న వాడు ,జ్ఞానిగా జీవించి ,వీరోచిత యుద్ధాన్ని ప్రతి ఫలా పేక్ష లేకుండా నిర్వహించి ,చివరకు ప్రశాన్తుడై ,అంపశయ్య మీద తన మరణం నిమిత్తం  ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ,పరమ నిష్ఠ లో ఉన్న భీష్మ పితామహుడు ధర్మజునికి తగిన ”ఉప దేష్ట ”.అంటే ఆచార్యుడు ,,ఉపదేశించదగిన శ్రేష్టుడు .ఎంత ఔచిత్య వంతం గా ఉందొ ఆలోచిస్తే మన మనసులకు మనకే ఎంతో ఆనందం గా ఉంది .ప్రాపంచిక కష్ట సుఖాలను అనుభవించాడు .ధర్మ పరుడు ,ఆత్మా విమర్శ తో పశ్చాత్తాపం తో శుద్ధుడు ,రాగ ద్వేశాడులను తొలగించు కొన్న వాడు ,జిజ్ఞాసువు అయిన ధర్మజుడు” శ్రోత ”.పరమ గురువుకు పరమోత్క్రుష్ట శిష్యుడు .శాంతి ప్రదాయక మైన ఆధ్యాత్మికం ఇంతటి విశిష్ట పరిస్థితి కి అనుగుణం గా తిక్కన రచన కూడా ప్రశాంత గంభీరం గా ఉంటుంది .భావోద్వేగం వదిలి తిక్కన సోమయాజి చక్కని సంయమనం తో రచన చేశాడు .విపుల ప్రపంచానుభావం ,విశిష్ట లౌకికాలౌకిక జ్ఞానం కల్గి జితేంద్రియత్వం యోగా నిష్ఠ మొదలైన వాటి వల్ల ఆత్మా సాక్షాత్కారం పొంది ,బ్రహ్మానందాన్ని అనుభవించిన గురువు భీష్ముల వారు . ఇహ లోక విరక్తుడు ,పరిణత మనస్కుడు  భక్తుడు  ముముక్షువు అయిన  ఉత్తమ శిష్యుడు అయిన ధర్మ రాజుకు ఉత్తమోత్తమం గా ఉపదేశించిన విషయాలన్నీ ఈ పర్వం లో అపూర్వం గా చెప్పా బడ్డాయి .అర్ధానికి మాత్రమె ప్రాధాన్యత నిచ్చి ,కతిన పదాలు ఆడంబరాలు లేకుండా ,సమాసాల జోలికి వెల్ల కుండా ,తిక్కన చాలా సరళ మైన రచన చేశాడు రాజ నీతి మొదలైన వాటిని బోధించే తప్పుడు తగిన ఉపమానాలు ,ఉదాహరణలను ఎన్నుకొని మనస్సు కు హత్తు కోనేట్లు చెప్పాడు .కావ్యము ,ప్రబంధమూ అనే విధానాలు కాకుండా” పౌరాణిక మార్గం” లో రచన చేశాడు .అర్ధం కాని వేదాంత ,అధ్యాత్మిక విషయాలను  చాలా సులభ మైన శైలి లో ,లోక సహజ దృష్టంతా లతో వివరించాడు .సమతలం లో ప్రవహించే గంభీర గంగా ప్రవాహం లాంటి శైలిని తిక్కన మహా కవి అవలంబించి ప్రతిభా విశేశాడు లతో నిర్వహించి ఔనని పించుకొన్నాడు .అదీ మహా కవుల లోకోత్తర విధానం .
యుద్ద  విషయాలన్నీ వర్నించా ల్సి వచ్చినా ,చాలా క్లుప్తం గా వ్యంగ్యం గా వివ రించి ఔచిత్యాన్ని పాటించాడు .నకులుడికి భీష్ముడు ఖడ్గ ప్రభావాన్ని తెలుపుతూ ,శివుని రౌద్రాన్ని వర్ణించే ఘట్టం లో –”హరుండు బెట్టుగా నవ్వి ,పెల్లార్చుటయును ,విని సముద్ధత రయమున ,దనుజ కోటి -మునుగ బర తెంచి తాకిన మును కొని ,వ –దించి ,ఇల ఎల్ల నెత్తుట ముంచే నతడు .”నాలుగు పొడి మాటలతో తేల్చి పారేశాడు .అలాగే కార్త వీర్యుడు హైహయులను చంపటం కూడా ఒకే ఒక పద్యం లో చెప్పాడు .ప్రశాంత చిత్తం తో చని పోవాలని ఎదురు చూసే భీష్ముని చేత శాంతి రస ప్రధాన మైన విషయాన్ని చెప్పించటం లో ఎంతో సంయమనం పాటించాడు తిక్కన .అశ్వ మేధ పర్వం లోని యుద్ధ వర్ణన లో కూడా ఇంతటి ఔచి త్యాన్నే నెల కోల్పాడు .–”నవ్వుచు నానా శరముల -నవ్వీరుల బొలియ జేయ నంతయు విని ,తా –నేవ్వగతో ,దుస్స ల ,యా –కవ్వడి బౌత్రాన్వితముగా, గానగ వచ్చెన్ ”–అని సింధు దేశాదీషులు అర్జునుని పైకి యుద్ధానికి వచ్చి నప్పుడు అతడు ప్రవర్తించిన విధానాన్ని వివరించాడు –”రాజుల జంపకు మని మా –రాజానతి ,ఇచ్చే ,నుద్దురత ,నేననిన –య్యోజ విడిచి ,నట్లైన -బరాజితుగా ,నన్నద్ధరారా పతి దలచున్ ”అవసర మైన యజ్న కర్మ నిర్విఘ్నం గా జరగతమే ధర్మ రాజు ,అర్జునుల ఆశయం .అందుకని యుద్ధం లో రాజసం కంటే ,సాత్వికం ప్రధానం గా పోషించ బడింది .విజజ్రుమ్భణ అర్జునుని యుద్ధం లోను లేదు ,తిక్కన శై లి లోను కనీ పించక పోవటమే ఇక్కడ గొప్ప విషయం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-8-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

రక్షా బంధనం

  •   రక్షా బంధనం

భారత దేశం లో అనాదిగా వస్తున్న సంప్రదాయం శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే  రక్షా బంధనోత్సవం .ఆ రోజు దేశానికి అంకిత మై పని చేస్తానని శపథం చేసే వారు .శివాజీ మహా రాజు కాలం లో దీన్ని బాగా జరిపే వారని తెలుస్తోంది .అదే సంప్రదాయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనే ఆర్.ఎస్.ఎస్.తన శాఖలలో దేశమంతా ఈ పండుగను నిర్వ హిస్తుంది .ఆ రోజున స్వయం సేవకు లందరూ ఉదయమో ,సాయంకాలమో సంఘ శాఖాలకు వెళ్లి భారత మాత స్తుతి సి చేసి కాషాయ జెండా ను ఎగుర వేసి ,దానికి అందరు ప్రణామం చేస్తారు .ఈ జెండా తర తరాల నుండి అవిచ్చిన్నంగా వస్తున్న సంస్కృతీ పతాకమే .దాన్నే ”భగవా ధ్వజం ”అని గౌరవంగా భక్తితో పిలుస్తారు .ఆ పతాకం దేశానికి చిహ్నం గా భావిస్తారు .దానికి గౌరవం ఇవ్వటం అంటే దేశానికి ,భగవంతునికి ఇచ్చి నట్లే .ఆ ద్వాజాన్ని  స్వయం సేవకు లందరూ  పరమ పవిత్రం గా భావించి పూజిస్తారు .పూలు కుంకుమ తో ఒక్కొక్కరు వెళ్లి పూజ చేస్తారు .దానికి కాషాయ రంగు లో ఉన్న పూలతో అలంకరింప బడిన రక్షా బంధాన్ని కడతారు .మళ్ళీ ప్రణామం చేసి వచ్చి తమ స్తానాల్లో కూర్చుంటారు .ఆ తర్వాతా ఒకళ్ళ చేతికి ఒకరు రక్షా బంధాన్ని కట్టు కొంటారు .దేశాన్ని రక్షించటానికి సర్వదా సిద్ధం గా ఉంటామని ,ఆత్మ బలిదానానికి సిద్ధమౌతామని దేశ స్వాతంత్రాన్ని సంరక్షిన్చుకోవటానికి,  భగవాధ్వజాన్ని కాపాడు కోవటానికి, భారతీయ సంస్కృతి ధర్మాల పరి రక్షణకు సంసిద్దులం గా ఉంటామని సామూహికం గా ప్రతిజ్ఞ చేస్తారు .ఆ తర్వాత అందరికి తలా ఒక ఖాళీ కవరు అంద జేస్తారు .అందులో చిన్న కాగితం ఉంటుంది .ఆ కాగితం మీద తమ పేరు రాసి తాము సమర్పించే డబ్బు ను అందులో ఉంచి కవరు మూసి మళ్ళీ ఒక్కొక్కరు భగావాద్వజానికి నమస్కరించి ,దాని పాదం వద్ద సమర్పించి వస్తారు .ఇలా స్వయం సేవకుల వద్ద ఒక్క రక్షా బంధనం రోజునే డబ్బు వసూలు చేస్తారు .అదీ ఐచ్చికం గా ఇవ్వటమే .ఈ డబ్బంతా కేంద్ర కార్యా లయానికి చేరుతుంది .అక్కడ లెక్కిస్తారు .మా చిన్నప్పుడు ఉయ్యూరు శివాలయం లో ఆర్.ఎస్.ఎస్ .శాఖలలో పాల్గొనటం వల్ల నాకు ఇవన్నీ తెలిశాయి .ఎందుకో ఇవాళ ఇవన్నీ జ్ఞాపకం వచ్చి మీ ముందు ఉంచుతున్నాను .అంకిత భావం తో చేయటం అంటే అదే నని పిస్తుంది .చాలా ఆదర్శ ప్రాయ మన విధానం .
  రాఖీ 
ఉత్త రాది నుండి వచ్చిన సంప్రదాయం రాఖీ .సోదరి తన అన్నకో ,తమ్ముడికో రాఖీ కడు తుంది .అన్న ఆమెకు ఏదో కానుక ఇస్తాడు .సోదరి అన్నదమ్ములకు తీపి పదార్ధం పెడుతుంది .రాఖీలు అనేక డిజైన్లతో రంగు రంగులతో ఉంటాయి .సోదరిని కంటికి రెప్ప లాగా కాపాడతానని అన్న శపథం చేస్తాడు .ఆమె కోరిక ఏదైనా ఉంటె తీరుస్తాడు .ఇది సోదర ,సోదరీల మధ్య ఉన్న గాఢ అనురాగానికి ,ప్రేమ, వాత్సల్యాలకు ప్రతీక .కుటుంబ బంధానికి ఒక చిహ్నం .పంజాబ్ రాజస్తాన్ ,ఉత్తర ప్రదేశ్ ,మహారాష్ట్రమొదలైన ప్రదేశాలలో రాఖీని అత్యంత ఉత్సాహం గా జరుపుతారు .ఆంద్ర ప్రదేశ్ లో తెలంగాణా లో జోష్ గా చేస్తారు .ఇప్పుడు రాష్ట్రం అంతటా జరుపు కొంటున్నారు .రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులకు రాఖీ లు కట్టే విధానం వచ్చింది .ఏమైనా సోదర భావం తోఅందరు   మెలగాలనే గొప్ప సంప్రదాయం .సంఘం లో ఒకరికొకరు అండగా ఉండాలన్న భావన దీని వెనుక ఉన్న పరమార్ధం .
 రాఖీ వల్ల ప్రాణ రక్షణ పొందిన అలెగ్జాండర్
అది క్రీ పూ .326.నేడు డు పంజాబు రాష్ట్రం అని పిలువబడుతున్నఈ  ప్రాంత రాజ్యాన్ని  ఆరోజులలో ‘పురుషోత్తముడు ”అనే గొప్ప రాజు పరి పాలిస్తున్నాడు .ఇది జీలం చీనాబు నదుల మధ్య ఉంది .గ్రీకు వీరుడు అలెగ్జాండరు ప్రపంచ విజేత కావాలనే ఉద్దేశం తో గ్రీకు లోని మాసిడోనియా నుండి బయల్దేరి ,యూరపు అంతటా జయించి ఆసియా ను స్వాధీన పరచుకొని భారత దేశం వరకు వచ్చాడు .సై న్యాన్ని జీలం నది ఒడ్డున విడిది చేయించి పురుషోత్తముని తో, యు ద్దానికి సన్నద్ధు డవు తున్నాడు .అతన్ని ప్రేమించిన ”రుక్సానా ”అనే స్త్రే అలెగ్జాండర్ కు తెలీకుండా అతని ని  కంటే ముందు వచ్చి చేరింది .మారు వేషం లో ఉందామె .ఆ రోజు రాఖీ పండుగ .ప్రజలందరూ రాజైన పురుషోత్తముడికి రక్షా  కడుతున్నారు .ఆయన వారికి కానుక లిచ్చి పంపిస్తున్నాడు రుక్సానా కూడా వచ్చి రక్ష కట్టింది .ఆయనకు ఆమె కొత్త స్త్రీ అని పించింది .రక్షా కట్ట్టిన తర్వాత”అమ్మా ! నువ్వెవరివి గ్రీకు స్త్రీ లా ఉన్నావు .నీఎకు వచ్చిన ఇబ్బంది ఏమిటి .రక్ష కట్టిన స్త్రీ నాకు సోదరి తో సమానం .ఈ అన్న దగ్గర దాయకుండా మనసు లోని కోరిక తెలియ జేయి .తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను ”అన్నాడు .దానికి ఆమె సంకోచపడ కుండా ”అన్నా !నేను ప్రపంచ విజేత అలెగ్జాండర్ ను ప్రేమించి వచ్చిన స్త్రీని .నా ప్రియుని ప్రాణ భిక్ష నాకు కావాలి .అదే ఈ చెల్లెలి కోరిక ”అన్నది .”నీ కోరిక తప్పక తీరుస్తానమ్మా !”అని వాగ్దానం చేశాడు .సంతోషం తో నిండిన కృతజ్ఞత తో సంతృప్తి తో  నమస్కారం చేసి అలెగ్జాండర్ ప్రియురాలు రుక్సానా వెళ్లి పోయింది .
అసలు విషయం ఏమి టంటే-అలెగ్జాండర్ సైన్యం దాదాపు పదేళ్లు గా యుద్ధాలు  చేయటం వల్ల అలసట ,ఇంటి మీద దిగులు తో ఉంది .ఉత్సాహం గా యుద్ధం చేయటం లేదు .అందులో ”పోరస్ ”అని పిలువ బడే పురుషోత్తముని గజ సైన్యం చూస్తేనే  వారికి వొణుకు పుడుతోంది .భీతి తో బతుకు ఈడుస్తున్నారు .ఇంతవరకు ఎక్కడా అపజయం లేకుండా విజయాలు సాధిస్తున్న అలెగ్జాండరు పురుషోత్తముడి సైన్యాన్ని ,ప్రజల తోడ్పాటుని ప్రజల అనన్య దేశ భక్తిని చూసి చలించి పోతున్నాడు .ప్రజలందరూ విజయం పురుషో త్తముడిదే అను కొని మహా పరాక్రమ విక్రమాలతో సిద్ధమైనారు .  .తన ప్రియుడు ఇక తనకు దక్కడని పురుషోత్తముని యేది రించి నిలిచి పోరాడి విజయం సాధించే లక్షణాలు అలెగ్జాండరుకు లేవని గ్రహించింది రుక్సానా .తను ప్రాణాధికం గా ప్రేమించిన ప్రియుడు అలెగ్జాండర్ ను కాపాడు కోవాలని బతికి ఉంటె బలుసాకు తిన వచ్చు నని భావించి పురుశోత్తముడికి రాఖీ కట్టింది .
యుద్ధం మహా భీకరం గా సాగుతోంది .మహా గజం ఎక్కి పురుషోత్తమ మహా రాజు యుద్ధం చేస్తున్నాడు .అలెగ్జాండర్ యవనాశ్వం ఎక్కి యుద్ధానికి దిగి ఎదురు పడ్డాడు .ఇద్దరు భీకరం గా పోరాడు తున్నారు .అలెగ్జాండర్ పురు షోత్తముని సమీ పానికి వచ్చాడు .వీర కరవాలం చేత ధరించిన పురుషోత్తముడు ఒక్క సారి ఖడ్గాన్ని అలెగ్జాండర్ మెడ మీద కు తెచ్చాడు .అప్పుడే అతని చేతికి కట్టిన రాఖీ కాంతులతో ప్రకాశించింది .అంతే రుక్సానా కిచ్చిన వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకొని చంప కుండా వదిలేశాడు . .ఇదే అదును గా యవన సైన్యం పురుషోత్తముని బందీ గా పట్టు కొది .మర్నాడు అలెగ్జాండర్ సముఖానికి తీసుకొని వెళ్లటం ఆయన, ఈయన సాహస ధైర్యాలకు మెచ్చి ”మిమ్మల్ని ఎలా గౌరవించాలి ”?అని అడగటం  ఈ యన ”ఒక మహా రాజు ఇంకొక మహా రాజు ను గౌరవించి నట్లు ”అని తోణక కుండా సమాధానం చెప్పటంఅందరికి  తెలిసిన విషయాలే .ఇలా ”రాఖీ ”అలెగ్జాండర్ ప్రాణాలను కాపాడినా ,మహా వీరుడైన పురుశోత్తముడిని బందీ కూడా చేసింది .అలెగ్జాండర్ చేసిన చివరి యుద్ధం కూడా ఇదే నని మనకు తెలుసు .నిజం గా యుద్ధం లో గెలిచింది పురుషోత్తముడే అంటే భారత దేశమే .చరిత్రను వక్ర గతి లో రాసి అసలు చరిత్రకు మసి పట్టించారు పాశ్చాత్య చరిత్ర కారులు అని భారతీయ చరిత్ర కారులంటున్నారు .
ఈ  కధను మేము1954 లో తొమ్మిదో తరగతి చదువు తుండగా మాకు ”పురుషోత్తముడు ”అనే ఉప వాచకం అంటే  నాన్ డిటైల్డ్ పుస్తకం  లో మేము చదు వుకున్నది . అప్పటి నుంచి పురుషోత్తముడు అంటే ఆరాధనా భావం ఉంది .అంటే 58సంవత్స రాల క్రితం చదువు కొన్న కధ .ఇవాళ ఎందుకో జ్ఞాపకం వచ్చి ఈ” రక్షా బంధన మహోత్సవం ”నాడు మీ దృష్టికి తెచ్చాను అంతే .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –2-8-12-కాంప్–అమెరికా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తిక్కన భారతం –23 శాంతి ,అనుశాసనిక ,అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -1


 
తిక్కన భారతం –23            శాంతి ,అనుశాసనిక ,అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -1

కౌరవ ,పాండవ స్త్రీ ల ఆక్రందనం ఆధారం గాపోషించ బడిన ”నిర్వేదం ”ఆ తరు వాత ”శాంతి” గా మారింది .  శాంత రసానికి నిర్వేదమే స్తాయీ భావం అని ఆలంకారికుల భావన .అందుకనే ,శోక భరిత మైన స్త్రీ పర్వం తర్వాత ఈ పర్వాల ను రచించటం సర్వోత్తమం గా ఉంది, ఉచితం గానూ ఉంది .భారత ఇతి వృత్తాన్ని బట్టి ,ధర్మ రాజు జీవిత పరిణామాన్ని అనుస రించి కూడా స్త్రీ పర్వం తర్వాత శాంతిని ప్రతిష్టించటం సముచితమే .యుద్ధ పరిణామ ఫలాన్ని ప్రత్యక్షం గా అనుభవించటం వల్ల ,దుఖం తో ప్రజా పరి పాలనకు విముఖు డైనాడు ధర్మ రాజు .శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించటం తో భీష్మ పితామహుని చేరి ఉపదేశం పొందాడు .తన లోని చీకటి ని పోగొట్టు కొని ,స్వధర్మాన్ని అనుసరించటం ఇందులో ప్రధాన వృత్తాంతం .
సంఘం లో ధర్మం నశించటం ,కౌరవుల పాప ప్రవర్తన ,దాని ఫలితం గా 18 అక్షౌహిణుల సైన్యం లోని వీరాధి వీరులు నశించి పోయారు .ఇప్పుడు న్యాయం ,ధర్మం కొంత జ్ఞాపకానికి వచ్చాయి .ఆ స్తితి లో ధర్మ పరుడు ,నీతి కోవిదుడు ,శిష్టాచార సంపన్నుడు ,అనుభవజ్ఞుడు ,నిరాసక్తుడు అయిన కర్మ యోగి  ,లోక కళ్యాణం కోసం రాజ్య పాలనకు పూను కొంటే నే ,ధర్మం లోకం లో మళ్ళీ ప్రతిష్టాపించ బడుతుంది .ఆ స్తితిని కలిగించాలనే కృష్ణుని ఆశయం ,సిద్ధిస్తుంది .కాని ,యుద్ద్ధం వల్ల వికల మనస్కుడైన ధర్మజుడు ,నిర్వేదం తో సంసార విముఖుడయి నాడు .–”ద్రుత రాష్ట్రుండు ,దనూజు కీడు సమబుద్ధిం జూడ కన్నేచు ,డే –గతి జన్నం జన ,నిచ్చే గాని ,మగుడం గా దివ్వడయ్యేన్ ,నిరా –కృత శీలుండగు నా సుయోధనుండు ,సంక్షీణంబు సేసెం ,గులం –బతని జంపంగ ,గోప మారే ,మది శోకా క్రాన్తంమయ్యెం  దుదిన్”   –అని బాధ పడ్డాడు .”ఆ దుర్జనుడైన దుర్యోధనుడు దుష్టం గా ప్రవర్తిస్తే ,సరి పుచ్చు కోలేక పోయాను ..రాజ్యం కావాలని నాలో కోర్కె ఉండటం వల్లే ఇంత పాపం చేశాను . పరిగ్రహ దోషం పరిత్యాగం వల్ల కాని పోదు .పరిగ్రహ త్యాగం చేస్తే ,మనిషి జన్మా ,మరణం ,దుఃఖాలను పొందడు అని వేదం చెబుతోంది .కనుక అపరిగ్రహం ఒక్కటే నన్ను శుద్దున్ని చేస్తుంది .”అని విశుద్ధ మనస్కుడై వివరించాడు .అంతటి మానసిక క్షోభను అనుభవించాడు .మాటలతో చెప్ప రాని వేదన అది .దుర్యోధనుడు అపకారం చేశాడు కనుక అతని వధీంచటం తో తన కోపం తీరి పోయింది .,కాని ఇప్పుడు శోకం తో మనస్సు నిండి పోయి ఉక్కిరి బిక్కిరి అయి పోతున్నాడు .మనసులో వితర్కించు కొంటున్నాడు .హింసకు ప్రతి హింస జవాబు కాదు .ప్రతి హింస తో మనకు మనశ్శాంతి చేకూరదు .పైగా ,దానికి వ్యతి రేక మైన ఫలాన్ని అనుభ విన్చాల్సి వస్తుంది .ఇది ప్రకృతి సత్యం .”vengence recoils itself on the perpetrator ”.
దుర్యోధన వధ తో కోపం తగ్గి తాత్కాలిక తృప్తి కలిగింది .కాని ,సకల బంధు నాశనం తో శోకం ఇంకా పెరిగి పోయింది .మనసు వికలమై ,రాజ్య విముఖత ఏర్పడింది .కర్తవ్య పరాన్ముఖుడైనాడు .పశ్చాత్తాపంతో సల సలా కాగి పోయాడు .ధర్మ రాజు మనో వైకల్యం పోయి ప్రశాంతత పొందాలి అంటే సద్గురువు  ఉప దేశమే శరణ్యం .అతడు విశిష్ట జ్ఞానం తో కర్మ యోగిగా మారాలి. భారతీయుల అభి ప్రాయం ప్రకారం ఆ నాటి మిధిలా నగర చక్ర వర్తి జనక మహా రాజు లాంటి జీవన్ముక్తులే రాజ్యార్హులు .కనుక ధర్మ రాజుకు ప్రజా పరిపాలన కోసం సంపూర్ణ మైన ఐహిక ,ఆముష్మిక జ్ఞానం పుష్కలం గా లభించాలి .జ్ఞానోప దేశం పొంది ,స్వ ధర్మాన్ని అనుస రిస్తూ ,రాజ్య భారం మోస్తూ ,వ్యాస మహర్షి అను సరణ తో ,లోక హితం కోసం అశ్వమేధ యాగాన్ని వేదోక్తం గా నిర్వ హించి ,దేశం లోని రాజు లందర్నీ ఒకే ధర్మ శాసన బద్ధులను చేశాడు .నిరాసక్తం గా, వేదోక్త ధర్మాలను ఆచరించాడు .స్వధర్మాన్ని అత్యంత శ్రద్ధా స క్తులతో నిర్వ హిం చాడు. .స్వధర్మాన్ని శ్రద్ధ తో నిర్వహించటం వల్ల ,గృహస్తుడు కూడా భవ బంధాలను చేదించు కొని మోక్షం పొంద గలడు అని,అశ్వ మేధ పర్వం ద్వారా  నిరూపించాడు .ఇందులో ”నక్తు ప్రస్తుడు ”అనే వాని కధ స్వధర్మ నిర్వహణ ను బోధిస్తుంది .
ఈ పర్వం లోనే ధర్మ రాజు తన మనస్సు ,చేసిన అకార్యాలను తలచు కొని వికల మై నట్లు చెప్ప బడింది .సజ్జనుల మనస్సు వజ్ర సన్నిభం .అయినా స్వాభావికం గా కుసుమ కోమలం .ద్రోణ ,అభిమన్యుల అధర్మ వధలకు,తానే కారణం అను కొన్నాడు .తన వంటి అధర్మ ప్రవర్త కుడు రాజ్యం లో ధర్మాన్ని ఎలా నెల కోల్ప గలను ? అని బాధ పడ్డాడు .సంకోచించాడు .మనశ్శాంతికి ముందు ఇలాంటి మానశిక క్షోభ చాలా అవసరం .రాజ్య పరి పాలన విషయం లో వ్యాస ముని అభిప్రాయం కూడా ఉదాత్తం గా నే ఉంది .శ్రీ కృష్ణ ,వ్యాస మహర్షుల ఉపదేశం కారణం గా ధర్మ రాజు లోని చీకటి తొలగింది .చిత్తం ఈశ్వరాయత్తం అయింది . భారతీయ భావన ఇంత ఉదాత్తం గా ఉంటుంది కనుకనే మన పురాణాలు ,ఇతి హాసాలు సార్వ కాలీనాలు అని గౌరవాన్ని పొందాయి .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-8-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

మహిళోద్యమ నాయకురాలు -సుసాన్ ఆంథోని

 మహిళోద్యమ నాయకురాలు -సుసాన్ ఆంథోని 
 జననం విద్యాభ్యాసం
సుసాన్ బ్రౌనేల్ ఆంథోని 15-2-1820 ళో మసాచూసెట్స్ రాష్ట్రం ళో ఆడమ్స్ టౌన్ ళో జన్మించింది .తండ్రి డేనియల్ ఆంథోని .తల్లి లూసి .  తండ్రికి క్వేకర్ ఉద్యమంతో మంచి సంబంధాలుండేవి .ఈ ఉద్యమం 1600ళో ఇంగ్లాండ్ ళో పుట్టి అయా తరువాత అమెరికా కు చేరింది .కేకర్ సభ్యులు చాలా నిదానస్తులు మర్యాద కల వాళ్ళు .ప్రార్ధనలలో గట్టిగా పాడరు నిశ్శబ్దానికే ప్రాధాన్యత .రంగు దుస్తులు ధరించారు .తెల్లవే .భగవంతునికి భక్తుడికి మధ్య ప్రీస్ట్ అనవసరం అనే తత్త్వం వారిది .ప్రతి వారికి లోపల వేఉగు ఉంటుందని ,అదే దివ్య సత్యాన్ని వెలువ రిస్తుందని నమ్ముతారు .మనుష్యులలో ఆడ ,మగా తేడాలుండ రాదనీ మొట్ట మొదట వ్యాప్తి చేసింది క్వేకర్లె .యుద్ధానికి ,బానిసత్వానికి వీరు వ్యతి రేకులు .తండ్రికి పత్తి మిల్లుండేది .ఆర్ధిక మాంద్యం వచ్చి దివాలా తీసాడు .సుసాన్ క్వేకర్ స్కూల్ లోచేరి చదివి ,ఉపాధ్యాయ వ్రుత్తి లో చేరింది .సరైన జీతాలు లేక మానేసింది .పెళ్లి చేసుకొనే ఆలోచన రాలేదు .
1848 లో స్తాన్తాన్ ,మాట్ అనే స్త్రీ లతో పరిచయమైంది .వీరు బానిసత్వ వ్యతి రేక ఉద్యమం లో ఉన్నారు .మాట్ ఇంగ్లాండ్ వెళ్లి ప్రపంచ బానిసత్వ వ్యతి ఏక సభలో పాల్గొనటానికి లండన్ వెళ్తే ఆమెను ష్టాన్తన్ లను అనుమతించలేదు .మగ వారికి తప్ప స్త్రీలకూ ప్రాతినిధ్యం లేదు పొమ్మన్నారు .దేనితో వారికి మహిలోద్యమం మీద దృష్టి పడి seneca falls women’s rights convention .అనే సంస్థను 19-7-1848లో ప్రారంభించారు .స్త్రీలకూ సామాజిక పౌర ,మత హక్కుల కోసం పోరాడ టానికి ఏర్పడిన సంస్థ ఇది .మగ వారు అనుభ వీస్తున్న అన్ని హక్కులు ఆడ వారికి లభించాలని కోరారు .declaration of anti senti ments అనే పత్రాన్ని విడుదల చేశారు .అమహి ళలకు మగ వారితో పాటు ఆస్తి హక్కు ఉండాలని ,స్త్రీలు సంపాదించుకొనే జీతం వాళ్ళకే దక్కాలని ,బహిరంగ ప్రదేశాలలో మాట్లాడే స్వేచ్చ కావాలని ,ఇల్లల్ను తమ వద్దే ఉంచుకొనే హక్కు ఉండాలని  ,మగ వారితో సమానం గా వోటు హక్కు కావాలని ప్రతిపాదించి ,ప్రపంచానికి తెలియ జేశారు phila delphia public ledger and daily transcript పత్రిక వారి డిమాండ్లను గురించి రాసింది .”a woman is no body .a wife is every thing .a pretty girl is equal to ten thousand men .a mother is next to god all powerful .the women of philadelphia are resolved to maintain their rights as wives belles ,virgins and mothers and not as women”అని వారి మాటలుగా రాసింది .
ఉద్యమ భాగ స్వామ్యం 
కనజోహారి లో ఆంథోని daughters of temperence అనే ఉద్యమ కారు లతో చేరింది .వీరంతా తాగుబోతుల వల్ల కుటుంబాలు దెబ్బ తింటున్నాయని ,కనుక లిక్కర్ మీద కతిన చట్టాలు చేసి అమలు జరపాలని కోరుకొనే వాళ్ళు .1849లో ఆంథోని మొట్ట మొదటి ఉపన్యాసాన్ని ఈ వేదిక మీద నుంచి చేసి అందర్ని ఆకర్షించింది .అందర్లో ఆలోచన రేకెత్తించి కర్తవ్య పాలనకు సిద్ధం చేసింది .క్రమంగా బానిసత్వ వ్యతిరేక సభల్లో ,సారా వ్యతిరేక సభల్లో పాల్గొని గొంతు వినిపించింది అందరి దృష్టి లో పడింది .ఈమె మాటలు, వాగ్ధాటి ,నిబ్బరం ,ధైర్యం చూసి అందరు ఆంథోని ని ”లేడీ నెపోలియన్ ”అన్నారు .సాంఘిక సంస్కరణల మీద ఈమె దృష్టిని ప్రసరింప జేసింది .వివాహిత మహిళల ఆస్తి హక్కు చట్టం ను ప్రభుత్వం తెచ్చింది .దాని ప్రకారం పెళ్లి అయిన స్త్రీ లకు డబ్బు హక్కుగా వస్తుంది .అయితే దురదృష్టం ఏమిటి అంటే ,ఆ డబ్బు ,ఆస్తి ఆమె చేతికి రాదు .భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తే  ఆ రోజు జీతాన్ని భర్త చేతుల్లో పోసి కృష్ణార్పణం అను కోవాల్సిందే .ఇలాంటి సమస్యలెన్నో ఉన్నాయి .వీటికన్నిటికి సంస్కరణ రూపం లో హక్కులు సాధించాలని తీవ్రం గా భావించింది .అప్పటికే abolitionism అనేది ఒకటి ఉంది .వీరు బానిసత్వాన్ని రూపు మాపాలి అని కోరే వారు .యజమానుల నుండి దొంగ తనం గా పారి పోయే బానిసలకు వీరు అండగా నిల బడ త్హారు .ఆ రోజుల్లో ఫ్రెడరిక్ దగ్లాస్  వీరిలో ప్రముఖ నాయకుడు .ఇలాంటి వారంతా ఆంథోని తండ్రి ఇంట్లో సమావేశం ఆయె వారు .వీరితో ఆమెకు పరిచయం కలిగింది .
1849 లో సుసాన్ the lily అనే పత్రికా సంపాదకురాలు అమీలియ బ్లూమార్ తో పరిచయం పొందింది .అదే అమెరికా లో మొదటి మహిళా పత్రిక .ఆ పత్రిక మహిళాభ్యుదయానికి చాలా కృషి చేస్తోంది .స్టాన్ స్టన్  తోకలిసి  ప్రపంచాన్ని మార్చాలనే అభిప్రాయానికి వచ్చింది .ఒక సారి సారా వ్యతి రేక సభలో మాట్లాడ బోతే మగ వారు మాట్లాడ నివ్వ లేదు .ఆమెకు కోపం వచ్చి బయటికి వచ్చేసింది   women’s state temperence society అనే మహిళా సంస్థను ప్రారంభించి మహిళలే నడిపెట్లు చేసింది .స్టాన్ టన్ ను మొదటి ప్రెసిడెంట్ ను చేసింది .బ్లూమార్ ఆడ వాళ్ళ డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చింది .ఎలా ఉందంటే ”turkish trousers to the ankle with a skirt reaching four inches below the knee ”ఇది ఆకర్షణీయం గా ఉండటం తో స్త్రీలు ధరించటం ప్రారంభించారు దీనికి the bloomer అనే పేరొచ్చింది .అయితే ఆంథోని కొద్ది రోజులు వేసుకొని ,తర్వాత ఇబ్బంది గా ఉండటం తో మానేసింది .ఇలా మహిళలు కొత్త వస్త్ర ధారణ తో కొంత మార్పు తెచ్చారు .
1852 లో కొత్తగా ఏర్పడిన సంస్థ రాష్ట్ర మహా సభ న్యూయార్క్ లోని రోచెస్టర్ లో నిర్వ హించారు .అందులో తాగు బోతూ తండ్రి సమాజానికి అనర్ధం అని స్త్రీలు భర్త దయా దాక్షిన్యాలపై మాత్రమె చదువు కొనే స్తితి పోయి ,అవగాహన తో చదువు కోవాలని ఆంథోని గంభీరోపన్యాసం చేసింది .1852లో మొదటి మహిళా హక్కుల సమావేశానికి వెళ్లి కాలేజీలలో స్త్రీలకూ ప్రవేశం కల్పించాలని ,మగ వారి తో సమానం గా స్త్రీలను గౌరవించని చర్చి లకు వెల్ల రాదని ,చెబుతూwe do not stand up here to be seen ,but to be heard ” అని తీవ్ర స్వరం తో మహిళా భేరి మ్రోగించింది .1853 లో newyork state teacher’s convention లో పాల్గొని తన అభి ప్రాయాలను నిర్భయం గా చెప్పింది .”you chose this teacher’s profession that you have no more brains thaan a woman ” అని తీవ్ర స్వరం తో తనను అడ్డు కొన్న వారిని అదలించింది .
తన పత్రిక లో మహిళా సంపాదన ఆమెదే .దానినేవారు ఆశించరాదని ఘాటుగా రాసింది .1854 february 14-15తేదీలలో న్యూయార్క్ లోని ఆల్బని లో రాష్ట్రీయ మహిళా హక్కుల సమా వేశం జరిగింది .న్యూయార్క్ అసెంబ్లీ లో స్టాన్ తాన్మొదటి సారిగా ఉపన్య సిమ్చింది .ఆమె ఉపన్యాసాన్ని యాభై వేల కాపీలు తీయించి ఆంథోని రాష్ట్ర మంతటా పంచింది .ఆ తర్వాతా న్యూయార్క్ పర్య టించి ఉపాన్యాసాలు చేసింది .జనం తాడోప తండాలుగా వచ్చి విన్నారు . .1856లో ఆంథోని ని న్యూయార్క్ స్టేట్ బానిసత్వ వ్యతి రేక సంఘానికి ప్రతిన్ధిని చేశారు .చలికాలం లో దేశం లో చాలా ప్రాంతాలు పర్య టించి మహిళా వోటు హక్కు కోసం ప్రచారం చేసింది స్వంత డబ్బు ఖర్చు చేసుకొని తిరిగింది .
1857 లో తెల్ల వారి పిల్లల తో బాటు నల్ల వారి పిల్లలను ప్రక్క ప్రక్క కూర్చో బెట్టి చది వించాలని కోరింది వర్ణ వివక్ష కూడదని చెప్పింది .mixed race education అవసరాన్ని ప్రచారం చేసింది .కాలేజి లలో సహవిద్య ఉండాలని డిమాండ్ చేసింది .క్రమంగా ఆమె మాటల ప్రభావం వల్ల నల్లజాతి వారి పట్ల ద్వేషం తగ్గింది యూని వేర్సితి లలో ,కాలేజీ లలో స్త్రీ లకు ప్రవేశం కల్పించారు .1860లో married women’s prperty act అనేక ఉద్యమాల ఫలితం గా వచ్చింది .judiciary committee లో స్టాన్ తాన్మాట్లాడే అవకాశం వచ్చింది .ఆమె అమోఘ వాక్కులకు ఫలితం లభించింది కొత్త చట్టం వచ్చింది దాని ప్రకారం స్త్రీ తన జీతాన్ని తానే అనుభ వించ వచ్చు .వ్యాపార లావా దేవీలలో పాల్గొన వచ్చు .కోర్తులుకు వెల్ల వచ్చు .పిల్లలను తమ దగ్గర ఉంచుకో వచ్చు .ఈ చట్టం మహిళలకు గొప్ప వారమే .మహిలోద్యమ ఫలితాలే ఇవన్నీ .
1862 లో ప్రెసిడెంట్ లింకన్ దేశాన్ని యూనియన్ని రక్షించటానికి  బానిసత్వ నిర్మూలన తప్పదని భావించాడు .బానిసత్వ నిర్మూలన కు తీవ్రం గా ఆలోచిస్తున్నాడు .ముప్ఫై ఏళ్ళ లో బానిసత్వాన్ని క్రమ క్రమంగా నిర్మూలిస్తానని తెలిపాడు .ఆంథోని కి లింకన్ మాటల మీద నమ్మకం కలుగ లేదు .వ్యతి రేకించింది .ఒక సభలో మాట్లాడుతూ ఆమె” మన దేశం లో అన్ని దేశాల వారికి చదువు కొనే హక్కుంది .కాని నల్ల వారికి ఆ అవకాశం లేక పోవటం సిగ్గు చేటు .వారికి ఉచిత విద్య కల్పించాలి .వారికి సమాన హక్కులు కల్పించాలి”అని తీవ్ర స్వరం తో గర్జిచింది . .1862 జులై పదమూడునప్రెసిడెంట్ లింకన్ emanicipation prclamation ను జారీ చేసి బానిసత్వ నిర్మూలనకు ధైర్యం గా మొదటి అడుగు వేశాడు .
1863లో women’s national league లో బానిసత్వాన్ని చట్ట రేకమని తెలియ జేసే పిటీషన్ వేయటానికి అంథోని స్టాన్ తాన్ ను పంపింది .సంపూర్ణ బానిసత్వ విమోచన జరగా లన్నదే అంథోని ధ్యేయం .నాలుగు లక్షల సంత కాలతో పిటీషన్ తయారు చేసి చరిత్ర సృష్టించింది ఆంథోని .వీటి అన్నిటి ఫలితం గా1865 december 6 న పదమూడవ రాజ్యాంగ సవరణ తో సంపోర్ణ బానిసత్వ నిర్మూలన జరిగింది .బానిసలు స్వాత్నత్రాన్ని నిజంగా నే పొందారు విముక్తులైనారు .ఆ  తర్వాత ఆఫ్రో అమెరికన్లకు వోటు హక్కు లభించింది దీనినే చరిత్ర కారులు ”నీగ్రో అవర్ అన్నారు .కాని నిజం గా అది” నీగ్రో మాన్ అవర్” ”మాత్రమె నని తరు వాత తెలుసు కొని మహిళోద్యమ నాయకులు మండి పడ్డారు .
మహిళలు మళ్ళీ సంఘటిత మై american equal rights association  ను ఏర్పరచి ఉద్య మించారు .అప్పటికే ఆంథోని కి డెబ్భై ఏళ్ళు వచ్చాయి .ఇంత వరకు పెళ్లి చేసుకో లేదు .స్వంత ఇల్లు ఏర్పరచు కోలేదు .సోదరి ళ ఇళ్లల్లోనే ఉంటోంది ..తండ్రి చని పోయిన తర్వాతా ఆయన ఇంట్లో నివ శించింది .అంతటి అంకిత భావం తో పని చేసిన మహిళా మాణిక్యం ఆంథోని .త ర్వాత  working women’s అసోసియేషన్ ఏర్పరచి వారిని ఆదుకుంది .పదిహేనవ రాజ్యాంగ సవరణ ళో కూడా మహిళా వోటు హక్కు గురించి ఏమీ లేక పోవటం స్త్రీ లకు ఆగ్రహం కల్గింది ..1869ళో national women’s suffrage asociaaaaation ఏర్పరచి లింగ ,జాతి వివక్ష లేకుండా అందరికి వోటు హక్కు కలిపించాలని తీర్మానించింది .క్రమంగా ఉద్యమాలతో ,పర్యటన లతో ఆమె జీవితం అంతా గడచి పోయింది .అలసి పోయింది .యువ తరానికి బాధ్యతలు అప్ప గించి వెనుక నుండి సూచనలు చేస్తూ ఉద్యమానికి ఊపిరులు ఊడు తూనే ఉంది .1872 ళో ఆమె తన సోదరి లతో కార్య కర్తల తో కలిసి హక్కు లేక పోయినా ప్రెసిడెంట్ ఎన్నిక ళో వోటు వేసింది .దీనికి ఆమెను అరెస్ట్ చేసింది అయిదు వందల జరిమానా విధించారు .కట్టాను పొమ్మంది .కోపం వచ్చి దాన్ని వెయ్యికి పెంచారు ససేమిరా అంది .ఆమె అటార్నీ ఆడబ్బు కట్టి బెయిల్ ఇప్పించాడు .తన కేసు స్ప్రీం కోర్టు కు వెల్ల కుండా అటార్నీ చేశాడని మంది పడింది అప్పుడతను సౌమ్యం గా ”i could not see a lady i respected put in jail ”అని చెప్పి ఆమె యెడల ఉన్న గౌరవాన్ని తెలిపాడు .ఆమె  జీవిత చరిత్రనుida husted haarpar  రాసిం1902 ళోమహిళా వోటు హక్కు కోసం  సెనేట్ సెలెక్ట్ కమిటీ .ళో చివరి సారిగా మాట్లాడింది అవిశ్రాంతం గా మహిళా హక్కుల సాధన కోసం పోరాడి అలసిన ఆ మహోన్నత మహిళసుసాన్ ఆంథోని 13-3-1906  న ఎనభై ఆరవ ఏట తుది శ్వాస విడిచింది .ఆమె గృహాన్ని జాతీయ స్మారక చిహ్నం గా ప్రభుత్వం చేసింది .ఆమె శిలా విగ్రహాన్ని వాషింగ్ తాన్ ళో నెలకొల్పి గౌరవం కలిపించారు .
సుసాన్ బి.ఆంథోని శత సంవత్సరం నాడుఅంటే 1920 august 18 పందొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి అమెరికా ప్రభుత్వం స్త్రీలందరికి కి వోటు హక్కు ను కల్పించింది . దాన్ని” సుసాన్ బి.ఆంథోని అమెండ్ మెంట్ ”గా ప్రభుత్వం పేర్కొని ఆమె సేవలకు నీరాజనాలిచ్చింది .యాభై రెండేళ్ళ పోరాట ఫలితం ఇది .1920నవంబర్ లో26 మిలియన్ల అమెరికన్ మహిళలు వోటు హక్కును విని యోగించు కొన్నారు . ధన్య జీవి సుసాన్ బ్రౌనేల్ ఆంథోని .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తిక్కన భారతం –22 స్త్రీ పర్వ నిర్వహణ -2-

 తిక్కన భారతం –22
   స్త్రీ పర్వ నిర్వహణ -2-
కౌరవ స్త్రీ లతో కలిసి ద్రుత రాష్ట్రుడు అపర కర్మలకు బయల్దేరే తీరు ను వర్ణిస్తాడు తిక్కన .దుర్భర హృదయ వేదన ,శోకా వేశం వెల్లి విరుస్తాయి .”చేలులైన జూడ బయ్యెద -దోలగుటకు సిగ్గు పడు వధూ జనసతి ,య –ట్టల నెదుర నేక వస్త్రం -బులతో నంగములు వికృతి బొందగ గడచెన్ ”–”మున్నెన్నడు నెవ్వరికిం -గన్ను లేదుర బడని యట్టి కాంతలు ,జన లె –ల్లన్ని లిచి ,చూడ వేద లిరి -కన్నులు గమరన్ ,సుహ్రున్నికాయంబులకున్ ”–రాజాన్తః పుర సహజ లావణ్యాన్ని ,సౌందర్య గామ్భీరాలను ఉదాత్త రమణీయం గా చిత్రించాడు .సాధారణ దైన్యానికి చోటు ఇవ్వ లేదు .ధర్మ రాజు ఎదు రైతే ,ఈ స్త్రీలంతా ,సహజ స్వభావం తో ,అఆభి జాత్యం తో ,చేతు లెత్తి ఏడుస్తూ తిట్టే శారు .సంయమనాన్ని కోల్పో లేదు .గంభీరం గానే ప్రవర్తించారు .”ఇందర జంపితి నని ,యుబ్బమ్ –దీరద,ద్రుపద తనయ పట్టుల నాభి మన్యుం -దెగటార్చితి ,మరదుల –నందర మ్రింగితి విభూతి యన నీ కెద్దీ ! ”అని నిల దీశారు .ఇందులో వాళ్ళ దీనా వస్త వల్ల ,ధర్మ రాజు లో నిర్వేదం పెరగ టానికి కారణం ఏర్పడింది .
భీమాదులు పేద తండ్రిని ఊర డించ టానికి వచ్చారు .భీమున్ని కౌగిట్లో బంధించిన్ చంపా లన్న పెద్ద రాజుడురాలోచన గమనించి ,మాయలాడు క్రిష్నయ్య ఇనుప బొమ్మను దగ్గరకు చేర్చాడు .దాన్ని నొక్కి బిగియార కౌగలించి మసి చేశాడు ద్రుత రాష్ట్రుడు .–”కోపంబుత్కటమై ,యా–రూపము నిరుగేల బట్టి ,రూఢత ఘోరా –తోపంబెసగానా –భూపతి వెస గౌగలించి పొలుపర విరిచేన్ ”’నిజమైన భీముడే అనుకొని ఈ దెబ్బతో వాడి పని థాఅనుకొంటూ కౌగిట్లో బిగించి చంపాలని ప్రయత్నించాడు .తన ఆత్మకు శాంతి కలిగింది భీముడు చచ్చాడు అను కొన్నాడు పాపం గుడ్డి రాజు .కాని లోపలి భావం బయటకు రానీ కుండా ,భీముడు తన చేతిలో చని పోయి నందుకు  వట్తోట్టి ఎడ్పులేడ్చాడు .దాన్ని చూసి చిరు నవ్వు తో కన్నయ్య మందలించాడు .ఇదంతా దృశ్య కావ్యం లా వర్ణించాడు తిక్కన్న .–”తనయ శోకా తురున్డవై ధర్మ మెడలి –యనిల సుతు దేగాటా ర్చేదనని తలంచి –తట్టి పని ,నీదు చే నేల యగు ,విధా .త్రు –లీల బరికింప ,నేరక బేల వైతి ”అని మెత్తగా నవ్వుతూనే నాలుగు చివాట్లు పెట్టాడు .మత్సర గ్రస్తు డైన పెద్ద రాజు ప్రకృతి తెలిసి కృష్ణుడు చేసిన కపటోపాయం .ఆయన వ్యాఖ్యానం కూడా .స్వోత్కర్ష తో పాపం గా ప్రవర్తించిన రాజు స్వభావం ఇంత వికృతం గా ఉంది అని అందరికీ తెలియ బరచే చక్కని సన్ని వేశం.అందరూ చచ్చినా ఇంకా బుద్ధి రాలేదాయనకు .పాండవుల మీద పగ నర నరాన జీర్ణించుకొని పోయింది .ఇదే చివరి అదును అని చంప బోయాడు భీమున్ని .అందుకే అలాంటి కౌగిలిని ”ద్రుత రాష్ట్ర కౌగిలి ”అని పిలుస్తారు .విధిని గుర్తించకుండా ప్రవర్తిన్చటమే సర్వ అనర్ధా లకు కారణం అని ఇంకా ఆ ముసలి నక్క కు తెలిసి రాలేదు పాపం .
గాంధారీ దేవి లో పుత్ర శోకం మూర్తీభావించింది .ధర్మ రాజునూ శపించ టానికి సిద్ధ పడింది .మంచి చెడ్డలను విచారించే జ్ఞానం ఉందామెకు .అయినా భీముడు తన కుమారుడు దుర్యోధనుడిని నాభి కింద కొట్టాడని బాధ గా ఉంది .దుస్శాసనుడిని భీకరం గా చంపటం కూడా ఆమె గుండె గాయాలను తీవ్రం చేశాయి .భీముని ప్రవర్తన అధర్మమని ,రాక్షసం గా ఉందని కఠినం గానే తెల్పింది .భీముడు తగిన సమాధానం చెప్పి ”నీవును ,సువిచార వింతయు విచారింపుము  ”అన్నాడు .ఆమె అందులోని సత్యాన్ని గ్రహించింది .తన బాధను ఇలా వ్యక్తం చేసింది –”అందులకు నూత కోలగా  నకట యొకని –నైన నిలుపక నూర్వుర నదయ వ్రుత్తి -మ్రింగి తందేవ్వ డేనియు మీకు నెగ్గు -లాచరిమ్పని వాడులేడయ్యె నయ్య ”-అంటూ –ఒక్కరిని  నీవు సంపక -తక్కిన నంతటనె ప్రతిన దప్పునే విభవం –బెక్కడ మీ యన్న నతం –డెక్కటి రాజ్యంబు సేయ నీడేకుమారా ”!అని అతి దీనం గా ఏడ్చింది ”.గుడ్డి వాళ్లకు చేతి కర్ర లాగా ఉండాల్సిన కొడుకుల్లో ఒక్కణ్ణి కూడా మిగల్చకుండా చంపెశావే అందులో ఒక్కడైనా నీకు అపకారం చేయని వాడు లేడా” ?అంది .”మ్రిగటం ” ”ఊత కోల”పదాలను చాల మెలకువ తో ప్రయోగించాడు తిక్కన .
ద్రౌపది పుత్రా శోకం తో ఉంది .అయినా తన దుఖాన్ని పక్కకు నెట్టి ,కౌరవ స్త్రీ ళ మీద సానుభూతిని చూపించింది ప్రశంశ నీయం గా .ఆమె గాంధారిని సమీ పించి పాదాలకు మొక్కింది .కుంతీ దేవి కూడా దుఖాన్ని దిగ మింగుకొని ద్రోవ దిని ఊరడించింది .”నీ ,నా ,తెరగు టో క్క రూప యగుట చేత మనం ఒకర్నొకరు ఓదార్చు కోవాలి ”అన్నది .ధర్మ రాజు ద్యూత వ్రుత్తి ,ద్రుత రాష్ట్రుని ఉపేక్ష వల్లనే ఇంతటి అనర్ధం అందరికి   వాటిల్లింది  .యుద్ధం యొక్క అనర్ధం ప్తత్యక్షం గా యుద్ధం లో పాల్గొన్న వారికే కాక ,బాల ,వృద్ధ ,స్త్రీ జనం అందరు అనుభ విన్చాల్సి రావటం లోక సహజం .గాంధారి పాంచాలితో —
”పుత్రి !ఇట్లగు నమ్మ శోకము బొంది ,కుందుచు నున్న నీ –గాత్ర మందొక కీడు పాటిలి కందు ,బాండు తనూభవుల్ –పుత్ర వర్గము గన్నచో నెద భూరి తాపము బొందుడున్ –బౌత్ర హీనత బడ్డ గొంతికి ,బాయ నేర్చునే నెవ్వగల్”–”నిను నే నోదార్చెద ,–నను నీవూరార్ప వలదే ,నా ,నీ ,తెరగుల్ విను నొక్క రూప మన,కే–మన గలడు విధాత క్రూరుడై పరు పంగన్ ”గాంధారీ దేవి తన దుఖాన్నే కాదు ,కౌరవ ,పాండవ వనితా హృదం లోని దుఖాన్ని కూడా తానే వెలి బుచ్చి పెద్ద రాణి అని పించు కొందికురు వంశం లో ప్రతి వ్యక్తీ దుఖం ఆమెదే అన్నట్లుగా హుందాగా, బాధ్యతగా ప్రవర్తించింది . .
యుద్ధ రంగం లో తమ ఆత్మీయుల కళేబరాలను చూసి ,విచలిత అయి హృదయ విదారకం గా విలపించే కౌరవ కాంత లను ఒక్కొక్కర్ని కృష్ణుడికి చూపిస్తూ గాంధారి తన హృదయ క్షోభ ను వెళ్ళ గక్కింది ..–”ప్రేవులు గండలు పెరికి ,వేటాడి యం -గద గొని ,మొదళులగల్చి ,కొనుచు —-రాగిలి రక్తంబు ద్రావుచు ,లోచన -గుళికల నొలిచి ,మ్రింగుచును ,గుండె –కాయ లాదట మెయి ,గబళించుచును గ్రొవ్వు –దేమలించి ,నమలుచును ,నెముక యూట–చవి గొని ,యానుచును ,జావక యున్న రూ-పులు నచ్చుటకు గాక బెలుచ దన్ని –కొనిన వెర బాయ బారుచు జెనకి తొడరి –కాటు లాడుచు నున్న సృగాలములును –గాకములు ,రాపులుగులును ,గ్రద్దలును వృ–కంబులును ,మానసము వికలంబు సేయ ”అని భీభత్సం గా హృదయ విదారకం గా ఉన్న యుద్ధ రంగాన్ని వర్నిన్చించాడు తిక్కన .ఈ శీను చూస్తె బాబోయ్ యుద్ధం వద్దు అని పిస్తుంది .గాంధారి తో పాటు ధర్మ రాజాదులు కూడా హృదయ వైక్లబ్యం పొందారు .ఒక్కరోక్కర్నే తలచు కొంటూ ఎడుస్తున్నారందరూ .యుద్ధ ఫలం నిర్దోశుల్ని కూడా ఎలా బలి తీసుకోన్నదో గాంధారి వర్ణించింది .–చంద్ర నార్ద్ర కుట్టిమముల చరణ తలము–లొందుటకు నెవ గించు నయ్యువిద లిపుడు –నెత్తురు తేవ( theva )మెక్కిన నెల బొరలు –చున్న వారేమి చెప్పుడు నుడులకు పేర్మి ”–”బాలలు ,దరుణులు ,బ్రౌదులు ,–దూలేదు వికలామ్బకము లతో దేన్దముల్ –వాలిన ,విరహానన ము ల -పాలై ,వందురెద నొక్క భంగిన ,యకటా !”–లలిత కోమలం గా ఉంటూ సకల సౌభాగ్యాలతో తుల తూగే కురు స్త్రీలు ఎంతటి దైన్యాన్ని పొందారో వివ రించే ఘట్టం .కళ్ళకు కట్టి నట్లు వర్ణించటం అంటే ఇదే .తన కుమార్తె దుస్సల స్తితి ని చూసి గాంధారి దుఖం కట్టలు తెంచు కొని ప్రవహించింది .
”హృదయమున వగా లేని యట్టిట్టు నట్టు -దిరుగు చున్నది దుస్సల వరుని శిరము గానకీ కూతు నేమ్మాయి గనుట కంటే –దలప నెక్కుడు దుఃఖంబు గలదే కృష్ణ ”భర్త తలకాయ కన పడక ఏడుస్తూ తిరుగు తోంది దుస్సల ..కూతురు దుఖం చూసి తల్లి తల్లడిల్లి పోయింది .అవధి దాటిన దుఖం .అభిమన్యుని కళేబరం పైన పడి ఉత్తర దీనం గా రోదిస్తోంది .ఆమెను చూసిన గాంధారి దుఖాన్ని ఆపు కోలేక పోయింది .ఆమెకు తెలిసినంతగా శోక భారం ఇంకెవరికీ తెలియదు .–”పాడి మాలి ,తనను పలువురు పొదివిన –బోరి తద్ద డప్పి గూరి నిదుర –పోయే నాకో ,సుభద్ర పుత్రుండు మృతుడైన –జెలువ మింత గలుగ నేర్చు ”ఎలచని పోయినా అభి ముఖం లో ఇంకా పోరాట పటిమ తగ్గలేదు జీవ కల పోలేదు .ఉత్తర ఏడ్పు కు అంతం లేదు .మాటి మాటికీ కృష్ణున్ని చూస్తోంది .ఆమె ముగ్ధ స్వరూపాన్ని చాలా స్వాభావికం గా వర్ణిస్తాడు తిక్కన కవి .లలిత శృంగారం గా ,కరుణ రస స్పోరకం గా వర్ణించాడు .ఆమె భగ్న జీవి .దానికి తాగి నట్లు గా చిన్న చిన్న మాటలతో సుకుమారం గా చెప్తాడు .ధర్మం యెడ వివక్ష చూపిస్తే ,అందరికీ అదే గతి అని సర్వులకు గుణ పాథంచెబుతుంది ఈ పర్వం .
కోపం తట్టు కోలేక గాంధారి కృష్ణుడిని శపించింది .ఇంత జరిగినా ఆమె లో పూర్తీ వివేకం కలగ లేదు .తన పుత్ర వ్యామోహం ,ద్రౌపది పరాభవం లో తన ఉపేక్ష ఇంతటి అనర్దానికి కారణం అని ఇంకా గ్రహించ లేదు .తాను స్వయం గా అడ్డు పడి ద్రౌపదిని రక్షించు కొక పోవటం ,ధర్మ లోపం .,నైతిక దౌర్బల్యం అని తెలుసుకో లేక పోయింది .దాని ఫలితాన్ని అనుభ విన్చాల్సి వచ్చి నప్పుడు మాత్రం దేవుణ్ణి నిందించింది .అన్నదమ్ముల యుద్ధం లో శ్రీ కృష్ణుడు ఉపెక్షించాడని శపించింది .తన తప్పు తెలుసు కో కుండా నల్లనయ్య పై నింద మోపింది .ఆమె ”వ్యామోహానికి నిలు వెత్తు దర్పణం ”అని పిస్తుంది .వ్యామోహం తో కళ్ళు మూసుకొని పోయిన వారి స్వభావం లోకం లో ఇలానే ఉంటుంది .ఈ విధం గా యుద్ధం వల్ల జరిగిన లోక అనర్ధాన్ని ప్రత్యక్షం గా ,శోక భూయిష్టం గా ,కరుణ రసోత్పాదకం గా స్త్రీ పర్వం లో వర్ణించాడు మాన్య కవి తిక్కన సోమయాజి .
దీని తర్వాత శాంతి పర్వ విశేషాలను తెలుసు కొందాం ,
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –1-8-1కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 2 Comments

పరమాణు విశ్వ రూపం –2 క్వార్కులు

 పరమాణు విశ్వ రూపం –2
క్వార్కులు 

యువాల్ నీమన్ అనే శాస్త్రజ్ఞుడు సబ్ అటామిక్ పార్తికల్సు ను సౌష్టవ గ్రూపులు గా వాటి విద్యుత్ చార్జి ల నాధారం గా పేర్చాడు.ఇందులో ఒక పార్టికల్ మిస్ అయిందని గ్రహించాడు . అది తప్పక ఈ శ్రేణి లో ఉండి ఉండాలని .కాని కానీ పించటం లేదని తెలుసు కొన్నాడు .దాని లక్షణాలను గుణించి తెలుసు కొన్నాడు .1964 లో ఇది చిక్కింది .దీనికి ” ఒమీగా మైనస్ ”అనే పేరు పెట్టారు .ముర్రే జేల్మాన్ అనే శాస్త్ర వేత్త కణాలకు ఉన్న కొత్త క్వాంటం ధర్మాన్నివివరించాడు .అదేstrangeness  . 1964లో జీవిగ్ కొత్త పార్టికల్స్ అన్ని నిజమైన ఫన్దమేన్తల్ పార్టికలసు కాదు అ న్నాడు .ఇవి వేరే మూలద్రవ్యాల  చేర్పులు లేక బ్లాక్స్ గా ఉన్నాయన్నాడు .వాటినే’క్వార్కులు అని పిలిచాడు .వీటినే జీవిగ్ ”ఎసేస్”అన్నాడు .క్వార్కు అనే మాటనే అందరు అంగీక రించారు .
గిల్మాన్ మూడు రకాలైన క్వార్కులను గుర్తించాడు .ప్రతి క్వార్కుకు యాంటి క్వార్కు ఉంటుంది .వీటికి స్పిన్ ,మరియు రొటేషన్ ధర్మాలున్నాయి .క్వార్కులకు చార్జి ఉంటుంది .ఆ చార్జి పూర్తీ సంఖ్యా లోఅంటే +1 or -1  గా ఉండవు .  అవి భిన్నాలుగా ఉంటాయి +1/3,-1/3.+2/3.-2/3రూపం లో ఉంటాయి .ఆయన చెప్పినదాని ప్రకారం ఒక ప్రోటాన్ మూడు క్వార్కుల తో ఉంటుంది .అందులో రెండు ”అప్ ”ఒకటి డౌన్ ”గా ఉంటాయి .వాటి భిన్న ఆవేశాలు కలిస్తే +1అంటే ప్రోటాన్ చార్జి అవుతుంది .న్యూట్రాన్ కు మూడు క్వార్కులుంటాయి .ఇందులో ఒకటి ”అప్ ” రెండు” డౌన్ ”లో ఉండి ,వాటి చార్జి సున్నా అయి పోతుంది .ఇంత వరకు ఎవరు క్వార్కులను చూడ లేదు .1967లో కొన్ని ఎలేక్త్రాన్లు ప్రోటాన్ల నుండి వెనక్కి తరిగి బౌన్స్ అయాయని భావించారు .ప్రోటాన్ లలో మూడు ”లంప్స్ ”ఉన్నాయని ఊహించారు .1974లో క్వార్క్ కు నాలుగో భావం ఉందని దానినే ”ఫ్లవర్ ”అనీ అన్నారు .దానికే ”చారం క్వార్క్ ”అని పేరు పెట్టారు .1977లోఅయిదవ ఫ్లేవర్ ను కనీ పెట్టారు .దీన్ని ”బాటం క్వార్క్ ”అన్నారు .దీనికీ ఒక జత ఉంది ఉండాలని భావించి 1995లో ”అప్”క్వార్కు ను కనిపెట్టారు .వీటి మొత్తం ఆవిష్కారాన్ని 450మంది భౌతిక శాస్త్ర వేత్తలు కృషి చేశారు .మొత్తం మీద క్వార్కులకు ఆరు ఫ్లేవర్స్ ఉంటాయని తేల్చారు .అవి మూడు సెట్లు గా ఉంటాయి .అప్/డౌన్ ,స్త్రెంజ్ /చారం ,టాప్ /బాటం టాప్ మా రియు బాటం క్వార్కులను ట్రూత్ మరియు బ్యూటీ అని కూడా పిలుస్తారు .క్వార్కులకు భిన్న రూపం లో చార్జి ఉంటుందని ముందే తెలుసు కొన్నాం .అప్ ,చారం ,టాప్ క్వార్కులకు చార్జి+2/3 ఉంటుంది .డౌన్ ,స్త్రెంజ్ ,బాటం క్వార్కుల చార్జి -1/3ఉంటుంది .క్వార్కు లన్నిటికి -1/2స్పిన్ ఉంటుంది .వాటికి కలర్ కూడా ఉండటం విశేషం .
క్వార్కులు ఎప్పుడు ఒంటరి గా కనీ పించవు .సమూహాలు గానే కానీ పిస్తాయి .అందుకే అవి సమ్మెళన కణాలుగా ఉంటాయి .వీటినే ”హాడ్రాన్స్ ”అంటారు .రెండు రకాలైన హైద్రాన్లు ఉన్నాయి .వాటినే ”బెరియాన్స్ ”మరియు మేసాన్స్ ”అంటారు .బెరియాన్స్ మూడు క్వార్కుల సమ్మేళనం .ప్రోటాన్లలో అనేవి రెండు అప్ క్వార్కులు ,ఒక డౌన్ క్వార్కులతో ఏర్పడిన ప్రోటానే .న్యూట్రా న్లె బెరియాన్లు .వీటిలో ఒక అప్ క్వార్కు ,రెండు డౌన్ క్వార్కులుంటాయి బెరియాన్స్ లో చార్జి పూర్ణ సంఖ్యా రూపం గా ఉంటుంది .మేసాన్లు అంటే రెండో రకమైన హాడ్రాన్లె .ఇవి ఒక ప్లస్ క్వార్కు మరియు యాంటి క్వార్కు వల్ల ఏర్పడినవే .మేసాన్లకు ఉదాహరణ పియాను మరియు psiలు .మేసాన్లు క్వార్కులు ,యాంటి క్వార్కుల వల్ల ఏర్పడినవి .అవి అస్తిర మైనవి .వెంటనేశిధిలమై పోతాయి .  .
లేప్తాన్లు ,ఒంటరి గా ఉంటాయి .అవే ఎలేక్త్రాన్లు .రుణ చార్జి కలిగి ఉంటాయి .చార్జి కలిగిన రెండు లేప్తాన్లు మ్యుయాన్ మరియు,tau లు .ఈ రెంటికి  ఎలేక్త్రాన్ కంటే ఎక్కువ ద్రవ్య రాశి ఉంటుంది .ఇవి త్వరలోనే విచ్చేడం చెంది మామూలు పదార్ధం లో కనీ పించవు .మిగిలిన లేప్తాన్లు అతి తేలికైన న్యూత్రియోను లె చార్జి ఉన్న లేప్తాన్లకు ఒక న్యూట్రినో ఉంటుంది .అంటే ఎలేక్త్రాన్ న్యూట్రినో ఉంది .దానినే మ్యుయాన్ న్యూట్రినో అంటారు .ఇవి తప్పించుకు పోతాయి ..అవి చాలా సూక్ష్మం గా చర్యా రహితం గా ఉంటాయి .న్యూత్రినోలు మన శరీరం గుండామనకు తెలీకుండా  దూసుకు పోతూనే ఉంటాయి ..
పౌ లీ నియమం ప్రకారం ,యే రెండు సమాన ధర్మాలు గల కణాలు ఒకే క్వాంటం స్తితి లో ఉండవు .ఇది రెండు అప్ క్వార్కులు ఒక డౌన్ క్వార్కు తో ఉంటాయి .క్వార్కులను గుర్తించటానికి ”కలర్ ”స్వభావం చెప్పారు .అవి నిజ మైన రంగులు కావు .వాటి క్వాంటం స్తితి ని తెలియ జేసేవి మాత్రమె .ప్రోటాన్ కు రెండు అప్ క్వార్కులున్నా ,వాటికి వివిధ కలర్స్ ఉంటాయి .ఇది పోలీ చెప్పినexclusive principle  కు లోబడే ఉంది .కనుక లేప్తాన్లు ,క్వార్కులు లు కలిసి బిల్డింగ్ బ్లాక్స్ అంటారు .వీటి తోనే పదార్ధ నిర్మాణం జరుగు తుంది .నాలుగు మూల శక్తుల తో ఇవి ఉంటాయి .ఎలేక్త్రోమాగ్నేటి క్ ,స్ట్రాంగ్ ,వీక్ ,గ్రావిటిఅనేవి .ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలేక్త్రాన్లను న్యూక్లియస్ తో బంధిస్తాయి .అందుకే పరమాణువు కు    యే ఆవేశము ఉండదు .ఇవే ఆటంస్ ను మాలిక్యూల్స్ గా బంధిస్తాయి .  ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫోర్స్ కు కారియర్ పార్టికల్ గా ఉండేది ఫోటాన్ .వీక్ ఫోర్సెస్ కు కారియర్స్w,z బోసాన్లు .స్ట్రాంగ్ ఫోర్సెస్ కు కారియర్ గా ఉండేవాటిని ”గ్లుయాన్స్ ”అంటారు .బోసాన్లకు ఫోతాన్లు ,గ్లుయాన్స్ లాగా కాకుండా ద్రవ్య రాశి ని కలిగి ఉంటాయి .w boson ప్రోటాన్ కంటే 80 రెట్ల ద్రవ్య రాశి ఉంటుంది .గ్రావితి కి ఫోర్స్ కారియర్ ను ఇంకా కానీ పెట్ట లేదు .మొత్తం మీద తెలిన్దేమిటి అంటే -ఆరు క్వార్కులు ,ఆరు లేప్తాన్లు నాలుగు ఫోర్స్ కారియర్లు ల తో పదార్ధ నిర్మాణానికి బిల్డింగ్ బ్లాక్స్ తయారవుతాయి .,అయితే ఇంతటి తో అయి పోయిందా?కాదు ఇంకా ఏమేమి కణాలు వస్తాయో చెప్పా లేము .
2003లో అయిదు క్వార్కుల తో కూడిన కొత్త కణం దర్శన మిచ్చింది దీన్ని ”పెంటా క్వార్క్ ”అన్నారు .దీనిలో రెండు అప్ క్వార్కులు ,ఎందు డౌన్ క్వార్కులు మరియు ఒక యాంటి స్త్రెంజి క్వార్క్ ఉన్నాయి ఇది శిధిల మై మేసాన్ గా న్యూట్రాన్ గా ten to the power of minas  twenty సెకన్ల కాలం లో మారి పోతుంది .ఇంకా ఒక్క కణం జారి పోయిందని తెలుసుకొన్నారు .దాన్ని హిగ్స్ గుర్తించాడు దానికి ”హిగ్స్ పార్టికల్ అని లేక” హిగ్గ్స్ బోసాన్ ”అని పేరు పెట్టారు .ఇదీ ఇప్పటికి ఉన్న పరమాణు విశ్వ రూపం .ఇంకా ఎన్ని వచ్చి ఆ రూపం లో చేరి అక్రుతులనేర్పరుస్తాయో వేచి చూడాలి .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

పరమాణు విశ్వ రూపం –1

  1. పరమాణు విశ్వ రూపం –1

పదార్ధం లో చివరి కణం పరమాణువు అని అవికలిస్తే అణువు లేర్పడతాయని అణువుల కలయిక వల్ల పదార్ధమేర్పడుతుందని మనకు తెలుసు .పరమాణువు మధ్య భాగాన్ని కేంద్రకం అంటారని అందులో  ఉన్న ధన ఆవేశ కణాలను ప్రోటాన్లు అని, ప్రోటాన్ల సంఖ్య తో సమానం గా ఉండి రుణ విద్యుత్తు కలిగి కేంద్రకం చుట్టూ నియమిత కక్ష్యల లో తిరిగే కణాలను ఎలేక్త్రానులు అంటా రని  తెలిసిన విషయమే .కేంద్రకం లో యే విద్యుత్తు లేని కణాలకు న్యూట్రాన్లని పేరు .ఇప్పుడు మనం ఇంత కంటే పరమాణువులో  ఇంకా ఏమేమి కణాలు ఉన్నాయో తెలుసుకోవటం ఇప్పుడు మన పని .హైడ్రోజెన్ పరమాణువుల్లో న్యూట్రాన్లుండవు .కాని వాటి ఐసోటోపులు మాత్రం ఉంటాయి .కొన్ని హైడ్రోజెన్ ఆటం లలో ఒక న్యూట్రాను ఉంటుంది వాటిని డ్యుటీరియం అంటారు .రెండు న్యూట్రాన్లున్న హైడ్రోజెన్ ప రమానుణువును  త్రిటీరియంఅంటారు .ఒక మూలకం యొక్క ఐసోటోపులకు ఒకే అటామిక్ నంబర్ ఉంటుంది .కాని అటామిక్ భారాలు మాత్రం  తేడా గా ఉంటాయి .ఇంతకీ అటామిక్ వైట్ అంటే -కేంద్రకం లో ఉన్న ప్రోటాన్లు న్యూట్రాన్ల మొత్తం సంఖ్య.మరి ఐసోటోపులంటే ?ఒకే మూలకానికి చెందిన వివిధ ఆకారాలు అని భావం ..అసలు ఐసోటోపు కు అర్ధం -”అదే స్థానం లో ఉన్నది ”అని .అందుకనే ఒక మూలానికి చెందిన ఐసోటో పలను పీరియాడిక్ టేబుల్ లో ఒకే చోట ఉంచుతారు .ఇవి రేడియో ఆక్టివ్ మూలకాల నుండి బహిర్గత మైనవే.
ప్రోటాన్ల ప్రవాహాన్ని ఎక్కువ వేగ వంతం చేయ టానికి ఎక్కువ వోల్టేజి ఎలెక్ట్రానిక్ చార్జి చేస్తే లిథియం న్యూక్లియస్ ఒక క్లౌడ్ చేంబర్ ను  ఏర్పర చింది . .అవి అటామిక్ న్యూక్లియస్ ను విడి గా చేసింది .   అప్పుడు ధన ఆవేశం గల ఒక కణం ఏర్పడింది .దానినే పాజిట్రాన్ అన్నారు . ఆ తర్వాత ప్రోటాన్  ఎలేక్త్రాన్ ల ద్రవ్య రాశికి మధ్య ద్రవ్య రాశి గల కణం కని  పించింది .   దీన్ని ”మేసోట్రాన్  ”అన్నారు .  గ్రీకు భాష లో ”మేసో అంటే మధ్య” అని అర్ధం .దీన్నే తరు వాత” మ్యూయాన్” అన్నారు . ఆ తర్వాత ఇంకో కొత్త కణం ”కాయాన్ ”ను కనుగొన్నారు .ఇది మ్యుయాన్ కంటే కొంచెం ఎక్కువ ద్రవ్య రాశి కలిగి ఉంది .దీనినే జపాన్ శాస్త్ర వేత్త యుకావా ”పియాన్ ”అన్నాడు .విద్యుత్ చార్జి ఉన్న పియాన్లు భూ కక్ష లో  విడి పోయి,మ్యుయాన్లు గా మారాయని భావిస్తున్నారు .భూ వాతా వరణం లో మ్యుయాన్లు సజీవం గా ఉన్నాయి. భూమి లోకి లోతుగా చేరాయి .i .మిగిలినవి ఎలేక్త్రాన్లు ,గా వినాశనం చెంది ,న్యూట్రినో అనే కణాలుగా మారి తప్పించుకొని భూమి లోకి ప్రవేశించి స్తిర
పడ్డాయి అని అనుకొంటున్నారు . న్యూట్రినో లు అంటే -సూక్ష్మ రూపం లో ఉన్న ఆవేశ రహిత కణాలు వీటిని ”సబ్ అటామిక్ పార్టికల్స్ ”అన్నారు .వీటికి  ద్రవ్య రాసి దాదాపు శూన్యం .సూర్యుడు నక్షత్రాలు వీటిని అపారం గా సృష్టిస్తాయి .రేడియో ధార్మిక మూలకం  విచ్చేదం  చెంది ,బీటా కణం అనే ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది .అయితే శక్తి నశించదు కనుక చాలా స్వల్ప ద్రవ్య రాశి గల యే ఆవేశం లేని కణాలు ఏర్పడ్డాయని చెప్పి ,అవే న్యూట్రినో లన్నాడు పౌలీ .పరమాణు విశ్వ
 యాంటి  పార్టికల్స్
కాలి  ఫోర్నియా శాస్త్ర వేత్తలు ప్రోటాన్ ఆక్సిల రేటర్ ప్రయోగం లో అంటి ప్రోటాన్ అనే కణాన్ని కనిపెట్టారు .దీనికి ముందు పాజిటివ్ ఎలేక్త్రాన్ అంటే పాజిట్రా న్ ను కనుగొన్నారు . అంటి ప్రోటాన్ అంటే  ప్రోటాన్ కు కావాలా .దీని ద్రవ్య రాశి ప్రోటాన్ ద్రవ్య రాశి తో సమానం కాని ,నెగటివ్ చార్జి కలిగి ఉంటుంది .ఇలా వ్యతి రేక కణాల ఆవిర్భావం విపరీతం గా జరిగింది.1960నాటికి వంద కు పైగా సబ్ అటామిక్ పార్టికల్స్ ను కని పెట్టారు .శాస్త్ర వేత్తలు వీటి సమూహాన్ని ”పార్టికల్ జూ ”అని ముద్దు గా పిలుచు కొన్నారు .దీన్ని బట్టి మనకు తెలిసిన్దేమిటి అంటే ,పదార్ధం లోని ప్రతి కణానికి వ్యతి రేక కణం ఒకటిఉంటుందని .వీటికి ఆ కణాలకున్న చార్జి కి వ్యతి రేక చార్జి ఉంటుంది .వీటిని మనం పార్టికల్ అంటి పార్టికల్ జంట అన వచ్చు .ఈ రెండు కలిస్తే వాటి చార్జి నశించి వట్టి శక్తి ఏర్పడుతుంది .పదార్ధం  ఎంత నిజమో వ్యతిరేక పదార్ధం అంటి మాటర్ కూడా అంతే నిజం .శాస్త్ర వేత్తలు మోజు పడి యాంటి ఎలేక్త్రాన్ అనే పాజిత్రాన్ ను యాంటి ప్రోటాన్ తో కలిపి యాంటిహైడ్రోజెన్ అనే యాంటి  ఆటం ను తయారు చేశారు . ఇప్పటకే” మన బుర్ర యాంటి  బుర్ర ”అయి పోయిందా! ప్రస్తుతం ఇక్కడికి ఆపి ,ఆ తర్వాత మరిన్నివిశేషాలను తెలుసు కొందాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-12.–కాంప్ –అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –12 జన ప్రియ ప్రెసిడెంట్ -జాక్సన్

 అమెరికా ఊసులు –12
                                  జన ప్రియ ప్రెసిడెంట్ -జాక్సన్ 

అమెరికా ఏడవ ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ ప్రజల మనిషి గా పేరు పొందాడు .ప్రజల కోసమే తన ప్రభుత్వం అని చెప్పి ,అలాగే నిర్వ హించిన వాడు .ప్రజా హితమే ధ్యేయం గా పాలించిన వాడు .వారి కోసం అడ్డు వచ్చిన వారిని తొక్కి పట్టాడు .సైన్యానికి అది నాయకుడైనా ప్రజా సంబంధాలను కోన సాగించాడు .అమెరికా ప్రెసిడెంట్ లలో అంతకు ముందువారు చేయని పనులను చేసి మంచికి ఆద్యుడని పించుకొన్నాడు .సరిహద్దు రాష్ట్రాలనుండి ఎన్ని కైన మొదటి అధ్యక్షుడు జాక్సన్ .ప్ర భుత్వం ప్రజల కోసమే నని ప్రకటించిన మొదటి అధ్యక్షుడాయన .ప్రజలను పాలించేది ,కాంగ్రేస్ కాదు ప్రెసిడెంట్ మాత్రమె నని తేల్చి చెప్పిన మొదటి ప్రెసిడెంట్ .అధ్యక్షుల్లో మొదటి సారి అభి శంశనను ఎదుర్కొన్న వాడు కూడా ఆయనే .అంతకు ముందు పని చేసిన ప్రెసిడెంట్లు అందరు కలిసి చేసిన వీటో ల కంటే ఎక్కువ సార్లు వీటో హక్కును ఉపయోగించిన వాడు .జాతీయ అప్పును రద్దు చేసిన మొదటి ప్రెసిడెంట్ .ప్రభుత్వాన్ని సంస్కరించి ,ప్రజోప యోగమైన పనులకు వీలు కల్పించిన మొదటి వాడూ ఆయనే .అమెరికా ప్రజాస్వామ్యాన్ని సమూలం గా మార్పు చేసిన మొదటి అధ్యక్షుడు .”ప్రజలే అంతిమ అది కారులు ”అని చెప్పి ఆ మాటకే కట్టు బడ్డ వాడు వీరుడు ,ధీరుడు ప్రజా ధ్యక్షుడు జాక్సన్ .అయితే46,000మంది నేటివ్ అమెరికన్లను వారి స్థావరాల  నుండి ఖాళీ చేయించి మిసిసిపి నదీ తీరానికి వారి అసహనానికిగురి అయిన వాడూ ఆయనే . ”ప్రజల సేవకుడు ప్రెసిడెంట్ ”అని డిక్లేర్ చేసిన వాడు .ప్రజలు అంటే ,కూలీ లు ,వ్యవసాయ దారులు ,సామాన్య ప్రజలే కాని ,వ్యాపారస్తులు వాణిజ్య వేత్తలు కాదని స్పష్టం చేసిన వాడు .ఇన్ని విధాల ఆయన అగ్ర గామి గా ఉన్నాడు .రెండు సార్లు అమెరికా అధ్యక్షుడై అత్యధిక మెజార్టీ ని సాధించిన వాడు .తన తర్వాతా అధ్యక్షుని గా ఎన్ని కైన జేమేస్ పొలాక్ టేన్నిసి  రాష్ట్రం నుండి ఎననిక అయినవాడు .ఆయన్ను ”i thank my god that the republic is safe ”అని మనసారా అభి నందించిన వాడు జాక్సన్ .తన ఒళ్లంతా నీరు పట్టి నంజు వ్యాధి తో బాధ పడుతూ తన స్తితిని ”నేను నీటి బుడగ గా ఉన్నాను ”అని జోకేసుకొన్న వాడు .చని పోతు తన పిల్లలకు ”do not cry -be good -we will meet in heaven ”అని ధైర్యం చెప్పిన వాడు .జాక్సన్ తోనే అమెరికా ప్రెసిడెంట్ల ఫోటోలు మొదలైనాయి .అంతకు ముందు వారివారి ఫోటోలు లేవు .ఇందులోనూ ఆయన ముందే ఉన్నాడు 
ప్రెసిడెంట్ పదవి లోంచి దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరున్న డబ్బు కేవలం 90  డాలర్లు మాత్రమె .అమెరికన్ కాన్సల్ అధికారులను మెక్సికన్ ప్రభుత్వం బాధిస్తుంటే ”మా యే ఒక్క పౌ రుడి నెత్తి మీద వెంట్రుక జోలికి వచ్చినా మిమ్మల్ని సర్వ నాశనం చేస్తాం ”అని హెచ్చరించిన ధైర్య శాలి . అతన్నిold  hickery  అని ముద్దుగా పిలుచుకొనే వాళ్ళు జనం .అంటే అంత గట్టి గా     గా ఉంటాడని, వ్యవహరిస్తాడని భావం .ఆయన అధ్యక్షుడు గా వైట్ హౌస్ లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే వేలాది మంది అధ్యక్ష భవనానికి చేరి ,కళ్ళారా చూశారు .అందుకనే jaansan created mobocracy  not democracy ”అన్నారు గిట్టని వాళ్ళు .అయితే భార్య కొద్ది కాలం ముందే చని పోయింది .ఆ దుఖం తోనే నల్ల బట్టలతో ప్రమాణ స్వీకారం చేశాడు .అసలు జాక్సన్ కు స్వంత పిల్లలు లేరు .పెంచుకొన్నాడు .వారిని అపార ప్రేమాభి మానా లతో పెంచాడు .ఆయన పై పెట్టిన అభి శంషన  ను రికార్డు నుంచి తొలగించాలని డెమోక్రాట్లు పట్టు బట్టారు .కాని టోరీలు అలానే ఉంచాలన్నారు .చివరికి ఓటింగ్ జరిపితే ,ఇరవై నాలుగు మంది తీసేయాలని పందొమ్మిది మంది ఉంచాలని వోటేసి రికార్డుల నుంచి తొలగించేశారు .
          ఆనాడు ప్రభుత్వాధి కారులంతా లంచ గొండులై ప్రజా ధనాన్ని దుర్విని యోగం చేస్తే వారిని అదుపు చేయటానికి పాలనా సంబంధ మైన సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు చేసిన మొదటి ప్రెసిడెంట్ .చిల్లర నాణాలు ప్రజలకు అందు బాటు లో లేక పోతే మింట్ లకు ఆజ్న జారీ చేసి బంగారు వెండి నాణాలను ముద్రింప జేసి ప్రజలకు అందు బాటులో తెచ్చాడు .వీటిని ”జాక్సన్ నాణాలు ”అన్నారు .ద్వంద్వ యుద్ధాలంటే జాక్సన్ కు ఇష్టం .రెండు సార్లు అలా పాల్గొన్నాడు .రెండో సారి పిస్టల్ తో ప్రత్యర్ధి తో పోటీ చేశాడు .తను కాల్చిన గుళ్ళు రెండు చేతి లో దిగి చివరి దాకా అక్కడే ఉన్నాయి .చివర్లో కత్తి  పెట్టి కోసి తానే తీసేసు కొన్నాడు .బాంక్ ఆఫ్ యు నైటేడ్ స్టేట్స్ అవి నీతికి ఆలా వాల మై ప్రభుత్వ ధ నాన్నిస్వీకరించక పోతే దాని ప్రెసిడెంట్ అధికారాలను పీకేసి దారికి తెచ్చాడు . the bank is trying to kill me but i will kill it ”అని చెప్పి అన్నంత పనీ చేశాడు .ఆయన కేబి నేత ను కిచెన్ కాబినెట్  అని పార్లల్ కాబినెట్ అని విమర్శించే వారు .దగ్గిర వారు చేప్పే  మాటలే వినే వాడనిఅందుకే కిచెన్ కాబినెట్ ,ఏర్పరచిన అధికారుల మాట వినక పోవటం వల్ల పారలల్ కాబి నేట్ అని అనే వారు .,preserve your people and nation అని నేటివ్ అమెరికన్ల కు నచ్చ చెప్పాడు .వాళ్ళు కూడా god bless you my great father అని ఆశీర్వ దించారు .అమెరికా ప్రజాస్వామ్యం ,సంయుక్త రాష్ట్రాల ఐక్యతా వర్ధిల్లాలని మనసారా చెప్పే వాడు ,దానికోసమే కృషి చేశాడు .అమెరికా అధ్యక్షుని గా ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రజలకు వంగిఅభివాదం తెలియ జేశాడు .దానితో జనం చప్పట్లు చరచి అభి నందించారు .ఆయన  టేన్నీసి రాష్ట్రం నుండి ఎన్ని కైన ప్రెసిడెంట్ .అందుకే ఫ్రాంటియర్ ప్రెసిడెంట్ అని పించుకొన్నాడు .
ఫ్లారిడా ను ఫ్రెంచ్ వారి నుండి విముక్తం చేశాడు .టేన్నిసి యూ నియన్ లో చేరి నపుడు దాని కన్వెన్షన్ కమితిసభ్యుడై తెల్ల మగ వారందరికి వోట హక్కు కలిపించి అందరి అభిమానం సంపాదించాడు .జాక్సన్ march 15 ,1767 లో జన్మించాడు .సౌత్ కే రోలినా లోని వాక్సా లో పెరిగాడు .ఆ ఊరు మేముంటున్న శార్లేట్ కు రెండే రెండు కిలో మీటర్ల దూరం లో ఉంది .తర్వాత్ గ్ర్రెన్ బరో కు చేరాడు .కెంటకీ లో తన రాజ కీయ జీవితాన్ని ప్రారంభించాడు .1845జూన్ ఎనిమిదిన అరవై ఎనిమిదేళ్ళ వయసు లో మరణించాడు ప్రజా ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్  .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-12.–కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –21

తిక్కన భారతం –21 

                                                                                       స్త్రీ పర్వ నిర్వహణ –1
వీర రౌద్రాలకు ,రస వత్తర సన్నీ వేషాలకు నిలయ మైన యుద్ధం ముగిసింది .యుద్ధ సమయం లో ఉన్న ఉత్సాహమంతా అయి పోయింది .శోకం ,నిర్వేదం ప్రాధాన్యత పొందాయి .సౌప్తికం లో ద్రౌపది పుత్ర శోకం తారా స్తాయి కి చేరింది .స్త్రీ పర్వం లో ఆ శోకం ఇంకా ప్రాధాన్యత చెందింది .గాంధారి ,మిగతా కురు స్త్రీల ఆక్రందన లతో నిండి పోయింది .కరుణ రసం రస సిద్ధి పొందింది .బంధు జన మరణాలతో ,ధర్మ రాజు మనస్సు వికలమయింది .విలపించే స్త్రీ లను చూసి నిర్వేదం పొందాడు .యుద్ధ పరిణామ ఫలిత మేమిటో తెలిసి వచ్చింది .దీని కంతటికీ కారణం తన ద్యూత వ్యసనమే ననిపించింది .ప్రజా పాలనం మీద విముఖత్వ మేర్పడింది .వన వాసానికి వెళ్లాలని సిద్ధ పడ్డాడు .తన వల్ల లోక హాని జరిగింది .కనుక సత్పురుషుని లాగా వ్యధ చెందాడు .పరితాపం తో శుద్ధ మనస్కుడై ,ప్రశాంతి పొందితే తప్ప ,ముందుకు సాగ లేదు .శాంతి తర్వాత గురూప దేశం తో జ్ఞానోదయం కావాలి . దాని వల్ల ధర్మ నిష్ఠ కల్గుతుంది .అందుకే యుద్ధం తర్వాతా శోకాదిష్టిత మైన స్త్రీ పర్వాన్ని రచించాడు వ్యాస మహర్షి .పాప పరిణామా న్ని అందరు అనుభ వించాలి .పాపులే కాక ,పుణ్య వంతుల హృదయాలు కూడా ఆర్ద్రత చెందాలి .అప్పుడే లోకం లో న్యాయం ,ధర్మం ,గురించి స్మృతి  కల్గుతుంది .ఒకడు చేసిన పాపాలకు సంఘం లో అనేకులు నశిస్తారనే ప్రకృతి సత్యం హృదయాలలో నాటు కొంటె తప్ప ,పాప భీతి కలుగదు .పాపభీతి ,అసత్య ,అధర్మాల యెడ విముఖత్వమేర్పడి ,ధర్మ సంస్తాపనకు అవకాశం లభిస్తుంది .ఈ ఉద్దేశం తో ,స్త్రీ పర్వ మంతా శోకానికి నిలయ మై పోయింది .ధర్మ రాజు హృదయం భరించ లేని నిర్వేదనానికి లోనైపశ్చాత్తాపం చెందింది .
ద్రుత రాష్ట్రుని ఏడ్పు తోనే స్త్రీ పర్వం ప్రారంభమైంది .”కొమ్మలు దున్మ మ్రోడ్పడు భూరుహం వలె ”ఆయన ఉన్నాడు .కొమ్మల్ని విరిగిన చెట్టు లాగా ఉన్నాడు అంటే అందర్ని కోల్పోయి జీవచ్చవమైనాడు .”నా కతంబున బోలిసిరి  నందనులు”అని తెలుసు కొన్నాడు .”వీరే కాదు ,చెలులు ,చుట్టంబులు ,సహాయులు ”కూడా నశించారు .దీనికి కారణం తానే .అని పూర్తిగా నమ్మాడు .”ధైర్యం ఎలా వస్తుంది ?అపర కర్మలు ఎలా నిర్వహించాలి ?.ప్రాణం తో ఎలా నిలువ గలను ?”అని వా పోయాడు . సంజయుడు ,విదురుడు దుఖోప శమనం చేసే మాటలు చెప్పి ఊర డించారు .సంజయుడు మాత్రం దుర్యోధనాదుల పాప ప్రవర్తనం ,పెద్ద రాజు లోభప్ర వ్రుత్తి లను తీవ్రం గా విమర్శించాడు .స్వయం క్రుతాపరాధం అన్నాడు రాజుతో .ఇప్పుదేడ్చి లాభం లేదు -హాస్యాస్పదం అనీ అన్నాడు .”సుహృజ్జనంబు లుపదేశించిన మాటలు విన లేదని నువ్వే అంటావు .-ఏడ్చి ప్రయోజనమేమిటి ?నీకు ,నీకొడుక్కి ,దుశ్శాసన ,కర్ణ ,శకుని ల మాటలే రుచి కరం గా ఉంటాయి అని ఈస డించాడు .”ముందుకు దూకు తాడే కాని ,కార్య తంత్రానికి పూను కోడు .దాన్ని నువ్వు మాన్ప లేవు .వాడి బలం మగటిమ నచ్చి ,లోభం తో ప్రవర్తించావు .తృష్ణ తో అతి సాహసానికి పూనితే ఫలితం ఇలాగే విపరీతం గా ఉంటుంది ”అని లోక న్యాయం తో సంజయుడు ఛీ వాట్లు పెట్టాడు .”అందు కోవటానికి వీలు లేకుండా ,ఆపదలకు నిలయ మైన కొండ చరియ లో ఉన్న తేనె కోసం ప్రలోభ పడి  ,కిందా మీదా తెలీకుండా తెగ పరి గెత్తె తిండి పోతు కు పట్టే గతే నీకూ పట్టింది .అలభ్య మైన పాండవుల సంపద యెడ అతి లోభం తో ,,యుక్తాయుక్తాలను వదిలి ,శ్రీ కృష్ణ ,విదురాదుల హిత వచనాలను విన కుండా తృష్ణ తో అతి సాహసం గా ప్రవర్తిన్చావు ”అని దెప్పి పొడిచాడు .–”తాన చుట్టు  దగిల్చి యున్న యుదగ్రతం దరి కొన్న ,దా — పానుభూతికి నోర్వ జాలక ,యప్రయోజన వాక్య ,సం –తాన శోషిత వక్త్రుడై ,యతి దైన్య మొందెడు వాని ,య-ట్లైన నీదు విలాప మన్యుల కాట పట్టగు భూవరా !”అని అతనిఅవి వేక  ప్రవర్తనకు ,దాని ఫలితానికి స్వయమ్క్రుతాప రాధమే కారణమన్నాడు .ఇప్పుదేద్వాతం అవివేకమే నన్నాడు .ఈ సమయం లో అలా అనటం న్యాయమా అని మనకు అని పిస్తుంది .కాని ద్రుత రాష్ట్రుడికి ఇది అవసరమే .ఉచితం కూడా .విదురుడు మాత్రం వైరాగ్యాన్ని బోధించాడు .”యవ్వనం ,రూపం ,ద్రవ్యం అనిత్యం .ఇవి పోతే ఏడవటం అవి వేకం ”అన్నాడు .ఉదాహరణ గా ఒక విషయం చెప్పాడు ”.మట్టి కుండ రూపం పొంది,ఎండి ,కాలి  ,చివరకు పగలటం ఎంత సహజమో ,జన్మించిన వానికి ,మృత్యువు అట్లా సహజం ”అన్నాడు .భవ బందాలపై ,విరక్తి కల్గించి ,వైరాగ్యం అవలంబిప జేయటం విదురుని కర్తవ్యమ్ .ఇలాంటి భావాల్ని చెప్పటానికి అనుకూల మైన శైలి ,రీతిని ఎన్ను కుంటాడు తిక్కన సూటిగా ,సంక్షిప్తం గా అర్ధ వంతం గా చెప్తాడు .యుద్ధం వరకు మహా భారతం ఐహిక సంబంధ మైంది .తరువాత అంతా ఆముష్మిక సంబంధం ..ఈ ఆరంభం విదురుని తోనే చేయిస్తాడు –”వెడలు నెడ ,గాఢ పీడం –బడి ,సుడువడి ,యోని నోత్తు వడి ,యొక భంగిన్ –వేడలగా ,గ్రహ భూతముల –ప్పుడు ,దొడగి ,యనేక దురితములు గల్పించున్ ”–భూమిని పీదిస్తే గ్రహాలన్నీ అనేక అనర్ధాలను తెస్తాయి అని సారాంశం .ఇలా చిన్న చిన్న మాటలతో ,సూటిగా , భావ గర్భితం గా వేదాంత విన్యాసం చేయిస్తాడు తిక్కన యోగి .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

నాట్య కళా భూషణ -వెంపటి చిన సత్యం

 నాట్య కళా భూషణ -వెంపటి చిన సత్యం 
ఆయన లో కళాభి లాష కూచి పూడి నుండి నెల్లూరు జిల్లా గూడూరు వరకు నాలుగు వందల కిలో మీటర్ల దూరం నడిపించింది .అక్క గారి దగ్గర రెండు రూపాయలు మాత్రమె అడిగి తీసుకొని ఇంటి నుండి బయల్దేరాడు .ఆయన ధ్యేయం కళలకు నెల వైన మద్రాస్ చేరి తన ప్రతిభను నిరూపించి ,తను జన్మించి ,నేర్చిన కూచి పూడి నాట్య కళ కు ప్రపంచ రంగస్థలం మీద వేదిక నిర్మించాలని .నడిచి ,నడిచి అలసి పోయి రైల్వే ప్లాట్ ఫాం మీద ఒళ్ళు తెలియ కుండా నిద్ర పోయాడు ..టికెట్ ఇన్స్పెక్టర్ అతన్ని చూసి ,ఆ కుర్రాడి తపన తెలుసు కొని ,ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం పెట్టి డబ్బు ఇచ్చి మద్రాస్ పంపించాడు .ఆ మహానుభావుని ఆదరణ తో మద్రాస్ చేరి, తాను అనుకున్నది సాధించి కళా విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు .ఆ చిన వాడే వెంపటి చిన సత్యం .1929అక్టోబర్ ఇరవై అయిదవ తేదీన జన్మించాడు .వెంపటి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి వద్ద కూచి పూడి నాట్య శాస్త్రం నేర్చాడు .తాడే పల్లి పేరయ్య శాస్త్రి గారి వద్ద మెళకువలు గ్రహించాడు .అన్న గారు వెంపటి పేద సత్యం గారి వద్ద శిక్షణ పొందాడు .ఆ తర్వాత ఆయనే ఒక ఆచార్యుడై కూచి పూడి నృత్య కళా విభూషణు డైనాడు . అందరి చేత ”మాస్టారు ”అని పించుకొని ధన్య జీవి అయారు .
ఆయన్ను వరించని బిరుదులూ ,పురస్కారాలు లేవు .భారత ప్రభుత్వం ”పద్మ భూషణ ”పురస్కారాన్నిచ్చి గౌర వించింది .తిరుపతి తిరుమల దేవస్థానం” ఆస్థాన నాట్యా చార్య” నిచ్చి సత్క రించింది .నాట్య కళాసాగర బిరుదు నందించారు .రాజ్య లక్ష్మీ ఫౌండేషణ్ వారి జీవన సాఫల్య పురస్కారం అందుకొన్నారు .ఆంద్ర విశ్వ విద్యాలయం ”కళా ప్రపూర్ణ ”నిచ్చి సత్కరించింది .నాట్య కళా భూషణ ,భారత కళా భూషణ బిరుదులూ పొందిన నాట్య గురువు .అమెరికా లో పిట్స్ బర్గు లో  ని బాలాజీ దేవాలయం ”ఆస్థాన ఆచార్య ”బిరుద ప్రదానం చేసింది .కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకొన్న పుణ్య మూర్తి .మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ”కాళిసన్మాన్ ”తో ఆయన కీర్తి కిరీటం లో మరో కలికి తురాయి ని చేర్చింది .తమిళ నాడు ప్రభుత్వం ”కలైమణి ”తో పూజించింది .ఇవన్నీ ఆయన ప్రతిభ కు లభించిన పురస్కారాలు గౌరవవిశేషాలు .నాట్యానికి ఆయన చేసిన సేవకు చిరు సత్కారాలు .
వెంపటి చిన సత్యం గారు తన కల ను నిజం చేయ టానికి మద్రాస్ లో 1963 లో ”కూచి పూడి ఆర్ట్ అకాడెమి ‘ని స్తాపించారు .అందులో ఈ నాడు లబ్ధ ప్రతిష్టులైన కళా కారు లేంద రెందరో  శిక్షణ పొంది గురువుకు తగిన గౌరవాన్ని కల్గించారు .వారిలో మంజు భార్గవి, హేమా మాలిని, శోభా నాయుడు ,వైజయన్తీ మాల ,రేఖ ,వింజమూరి రత్న పాప వంటి వారు ఆయన వద్ద ప్రత్యక్ష శిక్షణ పొంది పేరు తెచ్చు కొన్నారు .అందులో రత్న పాప అమెరికా లో టెక్సాస్ రాష్ట్రం లో హూస్టన్ నగరం లో పాతికేళ్ళ క్రిందట ”అంజలి నాట్య అకాడెమి ”స్తాపించి నాట్య సేవ చేస్తున్నారు .మాస్టారు గారి గొప్పతనం ప్రతి ఒక్కరి పై ప్రత్యెక శిక్షణ .ఆయన అభి నయించి చూపిస్తుంటే ”సాక్షాత్తు ఆ పరమ శివుడే వచ్చి నేర్పు తున్నట్లుండేది ”అని ఈ మధ్య నే రత్న పాప తెలియ జేశారు .ఆ మూర్తి లో అంతటి గాంభీర్యం ,అంతటి కళా తృష్ణ ,అంతటి సంపూర్ణత్వం ఉండేవి .అందుకే ఆయన వద్ద శిక్షణ అంటే కళా ద్వారాలు తెరుచు కున్తాయనివిశ్వాసం,ఆనందం . .
సత్యం గారు 180 సోలో ప్రదర్శనలు ,15డాన్సు డ్రామాలను తయారు చేశారు .నాట్య శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .దానిలో పరి పూర్ణత నిచ్చే ప్రతి విషయాన్ని తీసుకొని కూచి పూడి లో ఇమిడ్చి పరి పుష్టి చేశారు .కూచి పూడి మగాళ్ళకు మాత్రమె కాదని స్త్రీలు కూడా అభ్యశించి దానిలో నిష్ణాతులు కావచ్చు నని రుజువు చేశారు .అట్లా నేతర్ఫీదు నిచ్చి తయారు చేశారు .పైన పేర్కొన్న వారంతా అలా కళామణిభూషణాలైన వారే . వారు తయారు చేసిన సంగీత నాటకాల లో పద్మా వతీ శ్రీనివాసం ,విప్ర నారాయణ ,మేనకా విశ్వా మిత్ర ,కళ్యాణ శాకుంతలం ,భామా కలాపం ,రవీంద్ర నాధ టాగూర్ గారి చండాలిక ,రుక్మిణీ కళ్యాణం ,హర విలాసం ,శివ ధనుర్భంగం ,అర్ధ నారీశ్వరం -లు న భూతో న భవిష్యతి గా తీర్చి దిద్దారు .వారి నట్టు వామ్గం వన్నె తెచ్చేవి .పెర్ఫెక్షన్ కు మారు పేరు మాస్టారి నాటకాలు .ఒక్క క్షణం చూడక పోతే ఎంతో కోల్పోయామని పించేట్లున్డటం ఆయన ప్రత్యేకత .చిన సత్యం గారు, సంగీత రావు గారు, భుజంగ రాయ శర్మ గార్లు ఒక త్రయీ భావం తో వీటిని రూప కల్పన చేశారు ,మాస్టారికి సంగీత కల్పనలో సంగీత రావు గారు పాటలు ,మాటల రచనలో భుజంగ రాయ శర్మ గారు ఇచ్చిన తోడ్పాటు చిర స్మర ణీయం .రస గుళికలను ఆంద్ర దేశానికి అందించిన కారణ జన్ములు ఈ ముగ్గురు. .
కూచి పూడి నాట్యం పురా వైభవాన్ని కోల్పోతున్న సంధి కాలం లో సత్యం గారు దాన్ని సర్వాంగ సుందరం గా .ఆధునిక తకు దగ్గరగా మూల నిర్మాణం కోల్పో కుండా తీర్చి దిద్దారు .అందుకే వారి సంగీత రూప కాలకు అంతటి ఆకర్షణ .కొత్త విషయాలను చేర్చి ప్రచారం చేయటం సత్యం గారికి ఇష్టం .”చారి ”(పాద విన్యాసం )అనే దాన్ని నాట్య శాస్త్ర సంప్రదాయానికి అనుగుణం గా  పరమ లలితం గా చేశారని పెద్దలు అంటారు .ఆయన ”క్షీర సాగర మధనం ”లో శివుని పాత్ర ధరిస్తూ నట్టు వాంగం నిర్వ హిస్తు రంగ స్థలాన్ని విశ్వ రంగ స్థలం గా (కాస్మిక్ )మార్చేసే వారు .ఆ ప్రతిభా మూర్తికి జోహార్లు .ఖండాంత రాలలో అనేక వందల ప్రదర్శన లిస్తూ  ఆ కళామ తల్లికి నీరాజనాలందించిన మహా నాట్యా రాధకులు మహోన్నత మూర్తి .స్పురద్రూపం పచ్చని రంగు ,కోటేరు లాంటి ముక్కు ,విశాల వదనం ,తెల్లటి వస్త్రాలు చిరు నవ్వు ఆయన ఆభరణాలు .
పేరొచ్చింది, ప్రతిష్ట పెరిగింది ,డబ్బు వచ్చింది .కొడుకు లిద్దరూ కోడలు కూడా తన సంప్రదాయం లో ముందుకు దూసుకొని వెళ్తున్నారు .హాయిగా మద్రాస్ లో కాలి  మీద కాలు వేసుకొని కూర్చో వచ్చు .అలా చేస్తే ఆయన వెంపటి చిన సత్యం ఎందు కవుతారు? తను పుట్టిన కూచి పూడి లో ”సిదేంద్ర యోగి ఆరాధన ఉత్స వాలు ”ను దగ్గరుండి జరిపిస్తూ ఆ వారం పది రోజులు కూచి పూడి లోనే ఉంటూ ,అ భారతీయ నృత్య రీతులలలో నిష్ణాతు లైన కళా కారులన్దర్నీ ఆహ్వానించి వారితో ఉదాహరోపన్యాసాలను ఆ కాయా కళ పై ఉదయం పూట ఇప్పిస్తూ, సెమినార్లు నిర్వ హిస్తు, సాయంత్రం ఆ కళా కారుల చేత నాట్య ప్రదర్శన నేర్పరస్తూ ,కూచి పూడి లో విశ్వ నృత్య కళా వేదిక ను నిర్మించిన ఘనత పొందారు .ప్రతి దానికి దగ్గరుండి పర్య వెక్షిస్తూ సూచన లిస్టు వసతి సౌకర్యాలు కల్పిస్తూ విందు లాంటి భోజనాలందిస్తూ స్వంత ధనాన్ని ఖర్చు చేసి తన కూచి పూడి కి ,ఆ కళ కు కొత్త జవ జీవాలన్దిస్తున్నారు .ప్రతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వారిచేత ప్రదర్శన లిప్పి స్తూ సత్యం గారు చేసిన కృషి చిరస్తాయి గా నిలిచి పోతుంది .చాలా సంవత్స రాలుగా వీటిని నిర్వ హిస్తు ,ఏడాది కేదాది కొత్త ను ప్రోత్స హి స్తూ సంగీతానికి కూడా ప్రోత్సాహం ఇస్తూ నిర్వ హిస్తున్నారు .ప్రభుత్వం చేయాల్సిన పని నితానే అందరి సహకారం తో నిర్వ హిస్తున్నారు జన్మ భూమి రుణం తీర్చు కొన్నారు .వారికి, వారి కుమారులు, కోడళ్ళు అద్భుత సహకారాన్ని అందిస్తూ తండ్రికి తగ్గ కుమారులని పించు కొంటున్నారు .స్థానికం గా ఉన్న పద్మశ్రీ వేదాంతం సత్య నారాయణ శర్మ గారి సహకారం తీసుకొంటూ  పసు మార్తి కేశవ శర్మ గారిని ముందుంచి నడిపిస్తూ కళ కు ప్రతి ఏడు పట్టాభి షేకం చేస్తున్నారు .అలాంటి సత్యం గారు రెండేళ్ళ క్రితం పక్షవాతానికి గురై వీల్ చైర్ కే పరిమితమై ,మాట స్పష్టం గా రాక పోతున్నా తన కళా రాదనను విడిచి పెట్ట లేదు .ఆయన అక్కడ ఉంటె చాలు అన్నీ వాటం తటికవే  జరిగి పోతాయి .ఇక్కడ కూడా మాస్టారి క్రమశిక్షణ ,సమయ పాలన స్పష్టం గా కనీ పించేవి. చాలా ఏళ్ళు నేను వెళ్లి ప్రత్యక్షం గా పాల్గొని ఆ ఆనందాన్ని అనుభ వించాను. సత్యం గారిని మద్రాస్, లో హైదరాబాద్ లో సంగీత రూపకాలు నిర్వహిస్తుండగా చూశాను .ఆ కళా మూర్తి నిన్న అంటే జూలై ఇరవైతొమ్మిది ఆది వారం 84 ఏళ్ళ వయసు లో    పరామ పదిన్చారని తెలిసి  బాధ తో, వారి పై ఆరాధనా భావం తో రాస్తున్న నాకు తెలిసిన విషయాలు ఇవి .సుమారు రెండేళ్ళ క్రితం ఆంద్ర నాట్యాన్ని పునసృష్టి చేసిన  నట రాజ రామ కృష్ణ గారు మరణించారు ఇప్పుడు ఈ కూచిపూడి  నాట్య కళా పుంభావ సరస్వతి అస్తమయం .కళా కారులకు తీరని మనో వ్యధ కల్గించాయి .వెంపటి చిన సత్యం గారు కూచి పూడి నృత్య కళ కు పెద్ద దిక్కు అన్నది నిజం గా పెద్ద సత్యమే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-7-12-కాంప్–అమెరికా

http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ శ్రీ వరలక్ష్మీ వ్రత వారం

  అమెరికా డైరీ 
 శ్రీ వరలక్ష్మీ వ్రత వారం 
జూలై ఇరవై మూడు సోమ వారం నుండి ,ఇరవయ్  తొమ్మిది  ఆది వారం వరకు విశేషాలు —
కోసూరు  ఆదినారాయణ ,అంగలూరు రాజేంద్ర ప్రసాద్ గార్లుసోమ వారం  ఫోన్ చేసి మాట్లాడారు .వాళ్ళ కోరిక పై సరస భారతి సమాచారాలు పంపుతున్నాను .వారిద్దరిని” సాహితీ బంధు గ్రూప్” లో చేర్చాము . .అప్పటి నుండి మన కార్యక్రమ విశేషాలు ఫోటోలు ,వ్యాసాలూ అన్నీ వారికి చేరుతాయి .మేనల్లుడు శాస్త్రి తో చాట్ చేశాను .వర్డ్ ప్రెస్  లో సరస భారతి కి స్పేస్ కోసం స్పాన్సర్ చేస్తానని ఇది వరకే అన్నాడు .ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది .దాన్ని గుర్తు చేశాను .వెంటనే 99 డాలర్లు వర్డ్ ప్రెస్  కు ఆన్ లైన్ లో చెల్లించి ,స్పేస్ ను ఇప్పించాడు .వెంటనే అభి నందనలు తెలిపాను .
 శ్రావణ మంగళ వారం 
ఈ రోజు మొదటి మంగళ వారం .ఇంట్లో పూజ చేసుకొన్నారు తల్లీ కూతుళ్ళు .ఉయ్యూరు దగ్గర కనక వల్లి లోని వెంపటి సోమయాజులు గారి కూతురు కుమారుడు ఇక్కడే ఉంటున్నారు .అతని భార్య విజ్జికి బాగా పరిచయం .వాళ్ళ ఇంటి పేరు ప్రక్కి .ఆయనది బందరు .ఆ అమ్మాయి మన వాళ్ళిద్దర్నీ మంగళ వారం వాయనానికి భోజ నానికి పిలిచింది .వెళ్లి వచ్చారు  .అతను కోసూరు ఆదినారాయణ బావ మరది, అల్లుడు టెక్సాస్ లోని ఆస్టిన్ లో ఉంటున్న  ప్రసాద్ కు స్నేహితుడు .
  పితృ స్మరణ
మా అమ్మాయి వాళ్ళ ఇంటి ప్రక్కన ఉన్న పసుపుల రవి గారి భార్య గాయత్రి ”అంకుల్ అంటి ”అంటూ బాగా పలకరించి మాట్లాడు తుంది .ఆమె మంగళ వారం మధ్యాహ్నం వచ్చి ఆమె తండ్రి గారు మారెళ్ళ పార్ధ సారధి గారు చని పోయి పది ఎల్లయిందని ,ఆయన చనిపోయిన రోజు ఈ రోజే నని చెప్పి ,ఆయన్ను తలుచు కుంటూ నాకు తాంబూలం ఇవ్వాలను కొంతున్నానని చెప్పి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది .సరే నని ఆమెతో వాళ్ళింటికి వెళ్లాను .పరవాన్నం పెట్టింది .కుర్చీ లో కూర్చో పెట్టి నాకు ఒక లుంగీ తువ్వాలు పెట్టి ,తాంబూలం ఇచ్చింది .అందులో వంద డాలర్ల నోట్ఉంది .ఇదేమిటి తాంబూలం అంటే వచ్చాను ఈ డబ్బు వద్దు అన్నాను .ఆమె అప్పుడు ”అంకుల్ ! మా నాన్న గారు మంచి సాహిత్యాభి లాషి .ఎప్పుడూ ఏదో రాస్తూ పుస్తకాలు ప్రచురిస్తూందే వారు .చని పోయి పదేళ్లు అయింది .ఆయన జ్ఞాప కర్ధం గా ఇస్తున్నాను .ఈ డబ్బు ను సరస భారతి కోసం ఉప యోగించండి ప్లీజ్ ” అని బ్రతి మాలింది .సరే సరసభారాతికి ఇంతటి ప్రోత్సాహం లభిస్తుంటే కాదన లేక తీసుకొన్నాను .వాళ్ళ నాన్న గారు రాసిన ”గీతా సందేశం  ”పుస్తకాన్ని కూడా ఇచ్చింది .సరస భారతి తరఫున ఆమె కు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చాను .గీతా సారం చదివాను .ఆయన మహా జ్ఞాని అని ఎన్నో విషయాలు ఆయనకు బాగా తెలుసు నని అర్ధమయింది .  మంచి పనికి సహక రించి నందుకు ఆమె ను అభి నందించాను .ఉదయం హిందూ సెంటర్ లో మా మనవళ్ళు సమ్మర్ క్లాస్ కు వాళ్ళను తీసుకొని వెళ్లి అక్కడి బాలాజీ దేవాలయం లో శివునికి జరిగే అభిషేకం లో నేనూ పాల్గొన్నాను .ఇక్కడ ఇంకో విషయం -కిందటి నెలలో నేను అలబామా వెళ్లి హన్త్స్ విల్ లో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారింటికి వెళ్లి నప్పుడు వారు ఎంతో ఆదరం చూపించి నాకు అన్నీ చూపించి ,అక్కడి ఆయన స్నేహితులత్కు పరిచయం చేశారని లోగడే రాశాను .నేను వారివద్ద సెలవు తీసుకొని వస్తూండగాబస ఎక్క బోయే ముందు రహస్యం గా  ఆయన నా జేబు లో ఒక కాగితం పెట్టారు .ఏమిటో నని తీసి చూస్తె అది అయిదు వందల డాలర్ల చెక్కు .ఇదేమి  పని?అన్నాను .దానికి ఆయన ”ఇది మన సరస భారతికి నేనిచ్చే కానుక .దీన్ని మీ ఇష్టం వచ్చి నట్లు ఉప యోగించండి ఆంజనేయ స్వామి కి వాడినా సరస భారతికి వాడినా ,పుస్తక ముద్రణకు వాడినా మీ ఇష్టం ”అని నన్ను మాట్లాడ నివ్వ లేదు .అయితే”దీన్ని ఎవరికి చెప్పి ప్రచారం చెయ్యద్దు” అన్నారు . అది నాకు వదిలే యండి అన్నాను .అంతటి ఉదారులాయన .అందుకని ఈ సందర్భం లో గుర్తు చేశాను .
  శ్రీ వర లక్ష్మీ వ్రతం –పౌరోహిత్యం 
ఈ రోజు రెండవ శ్రావణ శుక్ర వారం .శ్రీ వర లక్ష్మీ వ్రతం పొద్దున్నే లేచి విజ్జి నాదస్వరం పెట్టింది .ఆ తర్వాత తల్లీ కూతుళ్ళు ఇద్దరు ,పిల్లలను సమ్మర్ కాంప్ కు పంపిన తర్వాత వంట చేశారు .తర్వాతఅమ్మ వారిని కలశం లో పెట్టి మంచి అలంకరణ చేసి పూజ కు కూర్చున్నారు .నేనే పూజ చేయించాను విధి విధానం గా .ఆ తర్వాతా ఒకళ్ళ కొకల్లు వాయనాలిచ్చుకొన్నారు .తల్లికి కూతురు చీర జాకెట్టు పెట్టింది .భోజనాల లోకి పూర్నబ్బూరెలు ,ఉండ్రాళ్ళు ,పాయసం ,గోంగూర పప్పు ,వంకాయ కూర ,కొత్తిమీర ఖారం చేశారు .అన్నీ కమ్మగా ఉన్నాయి .
సాయంత్రం విజ్జి స్నేహితు రాలు సౌమ్య అనే అమ్మాయి వచ్చింది ఇక్కడ ప్పోజ చేసు కోవా టానికి .ఆమె ఉద్యోగం చేస్తున్నందున పొద్దున్న పూజ చేసుకో లేక పోయిందట .మా వాళ్ళు పేరంటానికి వెళ్లారు .నాగమణి కూతురు కూడా వచ్చారు వాయ నానికి .సౌమ్య పుస్తకం అడిగింది ఇచ్చాను .ఏదో పూజ చేస్తోంది .తీరా చూస్తె మంగళ వార పూజ చేస్తోంది .అదికాదని ”నేను పూజ చేయిన్చనా అమ్మా ”?అని అడిగాను .చాలా సంతోషించింది .అప్పుడు విఘ్నేశ్వర పూజ ,,తులసి , వర లక్ష్మి ,లలితా త్రిపుర సుందరి పూజలు,తోర పూజ ,తోరాన్ని కట్టే మంత్రం చదివి కట్టించాను .ఆమె చాలా ఆనందించింది .తాంబూలం తీసుకో మని అందులో పది డాలర్లు పెట్టింది .దాన్నీ సరస భారతికే వినియోగిద్దామని అనుకొన్నాను .
                                    భజన 
రాత్రి ఎనిమిది గంటలకు భజన కార్య క్రమం .యాభై మంది వచ్చారు ఆడా  మగా ,పిల్లలు అందరు కలిసి .గంట సేపు . భజన జరిగింది .ఆమ్మ వారి మీద గీతాలతో అందరు పాడి భజన చేశారు .మహిళలందరూ శ్రావణ లక్ష్మీ స్వరూపులు గా పట్టు చీరలు కట్టు కొని నగలు అలంకరించు కొని వచ్చారు .మా ఇంటికి ఇంత మంది లక్ష్మీ దేవులు వచ్చారని సంబర పడ్డాను . ఆడ పిల్లలు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి అమెరికా లో భారత దేశాన్ని చూపించారు .తొమ్మిది గంటలకు విందు .పూర్నపు బూరెలు ,ఉండ్రాళ్ళు ,పాయసం ,పులిహోర ,అన్నం ,వంకాయ కూర ,కొత్తిమిర చట్ని ,సాంబారు ,అన్నం పెరుగు ,పుచ్చముక్కలు ,పనస తొనలు తో విందు పసందు గా ఉంది .కొందరు పాయసం చేసుకొని వచ్చారు కొందరు వడ ,ఆవడ తెచ్చారు ఇంకో ఆమె రవ్వ కేసరి తెచ్చింది .ఇల్లంతా లక్ష్మీ కళ తో కళ కళ  లాడింది .అన్ని వయసుల వాళ్ళు వచ్చారు .ఆడవాళ్ళు తమతో తెచ్చుకొన్న వాయనాలను ఒకరికొకరు ఇచ్చు కొన్నారు .మొత్తం మీద సందడి సందడి గా శుక్ర వారం గడిచింది .రాంకీ ఉషా  మామ గారు అత్త గారు ,పవన్ కుటుంబం ,రవి కుటుంబం నాగమణి ఫామిలి ,కనక వల్లి అమ్మాయి భర్త ,జగదీశ్ కుటుంబం ,యోగిని, భర్తశని వావారం గృహ ప్రవేశం చేసుకొనే మా ఇంటి దగ్గరున్న గుజరాతీ కుటుంబం వగైరాలందరూ వచ్చి నిండు దానం తెచ్చారు .అందరు వెళ్ళే సరికి పావు తక్కువ పడ కొండు .
  భజనతో విందు .
శని వారం రాంకీ ఉషా వాళ్ళ ఇంట్లో రాత్రి భజనకు ఆహ్వానిస్తే వెళ్ళాం .ఇక్కడికి అరగంట డ్రైవ్ .సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఏడున్నర వరకు భజన .సుమారు ముప్ఫై అయిదు మంది వచ్చారు . ఏడున్నరకు విందు .పూర్ణాలు ,పులిహోర ,ఉప్మా పూరీ చెనా మసాలా ,అన్నం సాంబారు గుత్తి  వంకాయకూర,పుచ్చ ముక్కలు బొప్పాయి ముక్కలు ,మామిడి జ్యూసు ,పాయసం తో గట్టి విందే ఇచ్చారు రాంకీ దంపతులు . వాళ్ళింటికి విందుకు వెళ్లటం ఇది రెండో సారి నేను మా అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చి ప్రక్కనే గృహ ప్రవేశం చేసుకొన్నా గుజరాతీ కుటుంబం ఆహ్వానం మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాం .పది రకాల పదార్ధాలు చేశారు కాని ఒక్కే ఒక బజ్జి తిన్నాను .భోజనం దాదాపు రాంకీ వాళ్ళింట్లోనే లాగించేశాం .ఇది ఊరికే కంపెని సేక్ .వాళ్లకు ఒక సంప్ర దాయం ఉందట .గృహ ప్రవేశం అయిన రాత్రి ఇంట్లో వాళ్ళ గుజరాతీ సంప్రదాయనృత్యం ”గాగ్రా డాన్సు ”చేయాలట తప్పని సరిగా .నేను వచ్చేశాను మా అమ్మాయి అల్లుడు ఉండి చూసి వచ్చారు .
  పొరిగింట నిద్ర (స్లీప్ ఓవర్ )
ఇక్కడ అమెరికా లో ఒక అలవాటు ఉంది .చిన్న పిల్లలు తమ క్లాస్ మెట్లు లేక తెలిసిన కుటుంబాలలో ఒక రోజు రాత్రి గడిపి వారితో కలిసి మెలసి ఉంటారు దీన్ని” స్లీప్ ఓవర్” అంటారు . మా మనుమళ్ళు శ్రీ కెత్ ,ఆశుతోష్ ,పీయూష్ లు రాంకీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల తో స్లీప్ ఓవర్ చేయటానికి శని వారం రాత్రి వాళ్ళింట్లో ఉంది పోయారు .భజన కు వెళ్ళే తప్పుదే ఉండ టానికి కావలసిన బట్టలు తీసుకొని వెళ్లారు .మేము ఇంటికి వచ్చేశామని ముందే చెప్పానుగా .
 అమెరికా లో చలి వేంద్రం (లేమనాడ్ స్టాండ్ )
ఇండియా లో వేసవి కాలం చలి వేంద్రం పెట్టి  చల్లని మంచి నీళ్ళు మజ్జిగ ఇవ్వటం మన కందరికీ తెలుసు .ముఖ్యం గా ఆంద్ర ప్రదేశ్ లో వీటిని బాగా నిర్వహిస్తారు కదా .అట్లాగే మా మన వాళ్ళు రాంకీ కూతురు కొడుకు శని వారం మధ్యాహ్నం రాంకీ వాళ్ళ ఇంటి ఎదురుగా నిమ్మ కాయ జ్యూస్ ను ఒక గాజు పాత్రలో పోసి ఐసు గడ్డలు కలిపి చల్లగా చేసి దాన్ని స్టాండ్ళ  మీద ఉంచి  వచ్చే పోయే వారికి  గ్లాసుల్లో పోసి ఇచ్చారట .కొందరు దీనికి గాను గ్లాసుకు యాభై సెంట్లు ఇచ్చి పిల్లలను ఉత్సాహ పరచారట .మంచి పనికి ప్రేరణ నిచ్చిన రాంకీ ని అభి నందించా .అతనే పిల్లలకు కధలు లెక్కలు చెప్పి ఆటలాదించి బాగా కాలక్షేపం కల్గించాడు .
  పదేళ్ళ తర్వాత ఈత మోత 
చిన్నప్పుడు మా ఉయ్యూరు లో పుల్లేరు లో స్నానం చేసి ఈదులాడే వాళ్ళం .నేను సునాయాసం గా మునిగి తేలుతూ ఈది అవతల ఒడ్డుకు వెళ్లి తిరిగి ఈదుకొంటు వచ్చే వాడిని .నా దగ్గర ట్యూషన్ చదివే పిల్లలను ఉదయమే స్నానాలకు తీసుకొని వెళ్లి చేయించే వాడిని .కాలవ అంతా దుర్గంధం గా మారి పోవటం వల్ల దాదాపు యాభై ఏళ్ళు అయింది పుల్లెట్లో స్నానం చేసి .మొదటి సారి అమెరికాకు పదేళ్ళ క్రితం టెక్సాస్ లోని హూస్టన్ కు వచ్చాం .మా అమ్మాయి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది .అక్కడ అయిదారు సార్లు స్నానం చేసి ఈత కొట్టాను .మళ్ళీ ఈ పదేళ్ళ లో ఎక్కడా చేయలేదు .ఇవాళ ఆది వారం రాంకీ ఇంటి నుంచి పిల్లలను తీసుకొని వద్దామని నేను మా అమ్మాయి వెళ్ళాం .అక్కడ స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు స్నానం చేయటానికి హుషారుగా ఉన్నారని నన్ను కూడా చేయమని బట్టలు సర్దింది .సరే నని వెళ్ళాం .అందరం అంటే నేను మా అమ్మాయి ముగ్గురు మన వళ్ళు రాంకీ అతని భార్య ఉషా  వాళ్ళ అమ్మాయి అబ్బాయి స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళాం .చాలా దగ్గరే వాళ్ళ ఇంటికి .అందరం పూల్ లో దిగి ఒక గంట సేపు స్నానం చేశాం .రాంకీ నేను గంట తరువాత ఇంటికి తిరిగి వచ్చాం .మా వాళ్ళు ఇంకో గంట ఉండి వచ్చారు .ఇంటికి చేరే సరికి రాత్రి ఏడున్నర .అలా పదేళ్ళ తర్వాత ఈత మోత మోగించాను .బాగానే ఈదానని రాంకీ నన్ను మెచ్చాడు .అతను సాధారణం గా వెళ్ళడట .నా ఉత్సాహం చూసి వచ్చాడు . మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎదురు గా స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు దాదాపు అయి పోయింది ఆగస్టు రెండో వారం లో ప్రారంభోత్సవం .అతని మామ గారు అత్తగారు కిందటి వారమే హైదరాబాద్ నుండి వచ్చారు .ఆయన ఒరిస్సా లోని జైపూర్ లో గవర్న మెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయాడు .అక్క డె పుట్టి అక్కడే చదివి ఆ స్కూల్ లోనే ఉపాధ్యాయుడై హెడ్ గా అయా స్కూల్ లోనే పని చేసి పదవీ విరమణ చేశాడు .మా రెండో కోడలు ఇందిర ది ఆ ఊరే .వాళ్ళ నాన్న బల్లార్ పూర్ పేపర్ మిల్స్ లో పని చేశి రిటైర్ అయాడు .మా మనవడు హర్ష బారసాలకు జైపూర్ వెళ్ళాం .కాని మా వాళ్ళెవరూ ఆయనకు తెలియ దన్నాడు .ఒకప్పుడు జైపూర్ ఆంద్ర దేశం లో ఉండేది .జైపూర్ రాజు విక్రమ దేవ వర్మ గొప్ప సాహిత్య పోషకుడు .

మరి కొన్ని ఫొటోస్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 29-7-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –20 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8

  తిక్కన భారతం –20
 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8
భీష్ముడు తనను అర్ధ రధుని కింద జమ కట్టి నందుకు కోపించిన కర్ణుడు అస్త్ర సన్యాసం చేశాడు .కాని పిఠా  మహుడు శర తల్పం మీద పడి పోగానే ,సందర్శించి భక్తీ వినయాలతో ,పాదాలకు ప్రణామం చేశాడు . వినమ్రం గా విన్న వించు కొంటున్నాడు చూడండి –”అలుక దక్కి ,నన్ను ,అధిక వాత్సల్య శీలము గాగ జూచి ,తగిన మాట లాడవే మహాత్మా !”అంటూ రుద్ధ కంఠం  తో ప్రార్ధిస్తాడు .పశ్చాత్తాపం  తో కర్ణుడు తడిసి ముద్ద అయ్యాడు .దారి మారిన కొడుకు పుత్రవాత్సల్యంకోసం తండ్రి ని చేరి ,పరి తపించి నట్లుంది అతని పరిస్తితి . ”ప్రాడిగల్ సన్ ”అయి పోయాడు .పితా మహుడు కూడా ”–నీ  దెస గోపిన్తూనే  ,అది శిక్ష కాని ,రోషంబు గాదు ,కాని ,నీవు ,పాండు తనయుండ వగుటం ,నీయెడ వాత్సల్యంబ,కాని ,మాత్సర్యంబు  లేదు ”అని అనునయించాడు భీష్ముడు కురు పితా మహుని హోదాలో .ఆమాటలు కర్ణుని కర్నాలకు అమృతపు పలుకు లైనాయి . కౌరవులకు జయం లభించ దని ,కుంతీ పుత్రుడు కనుక ,పాండవులను చేరటం శ్రేయస్కరం అనీఉపదేశించి  చెప్పాడు .కానీ కర్ణుడు నిశ్చయ బుద్ధి తో –”దైవ ధీనము సర్వమున్ ,మన మతిం దప్పింప గా వచ్చునే ”అని విధి విలాసానికి తలోగ్గు తాడు .”నీ వింకన్ నను నొండు వల్కక ,పరానీకంబు పై బంపు ,మత్సేవా ధర్మము  నిర్వ హించెద ”అని సర్వ సైన్యాధి పత్య  స్వీకరణకు అనుమతి కోరాడు .మర్నాడు మళ్ళీ యుద్ధ సన్నద్ధు దై వచ్చి ,వీర శయన మహా నీయుడైన మహాను భావున్ని  భీష్ముణ్ణిదర్శించి ,ఆయన పాదాల పై పడి ,కన్నీరు కారుస్తూ ,చేయెత్తి ,వినయం తో ,ఒంగి నమస్కరిస్తూ –”వచ్చితి రాధేయుడ గను — విచ్చి ,ననుం జూడు భరత వీరాగ్రణీ నీ–సచ్చరితము ఫలమే,యి –ట్లిచ్చట ,నీ యునికి ,దాత నేమన నేర్తు న్ –పావనంబైన పలుకులు నా చెవు –లార నెమ్మి నన్ను నాదరింపు –మయ్య ,ధర్మ నిత్య యంచిత సత్య శం –తన కుమార గాఢ ధైర్య సార ”అని ,నిస్సహాయుడైన చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు కర్ణుడు .ఇలాంటి మాటలు ఆతని నోటి లోనుంచి రావటం మనకు ఆశ్చర్యమేస్తుంది .తన బాహు బలాన్ని నమ్ము కున్న వాడు దుర్యోధనునికి అమ్ము కొన్న వాడూ ఈ కర్ణుడే నా అని పిస్తాడు తిక్కన .విధి నిఎవరు ఏది  రించ లేరనే సత్యాన్ని గ్రహించే వివేకం అతనికి కలిగింది .ఇదొక గొప్ప మార్పు .భీష్ముడి పై పూజ్య భావం ,విధి చేతిలో అలాంటి అసహాయ శూ రుడూ  ఒక బొమ్మ అయాడని అభి ప్రాయం .అతని లోను పితామహుడి లోను ఉన్న పవిత్రత ,హృదయ మార్దవము వ్యక్తమయాయి . అతని లో సద్వంశం లో జన్మించిన వాడికి ఉండే భక్తీ ,ప్రేమ ,ఔదార్యం మూర్తీభ వించి నట్లు గోచరిస్తాయి .అర్ధ రధుడు అని కౌరవ సభలో కర్ణుడిని భీష్ముడు అనగానే ”నువ్వే అర్ధ రదుడివి ” అని నిండు సభలో బీరం గా పల్కిన కర్ణుని లో ఎంతటి  పరి వర్తన వచ్చిందో గమనించండి .
భీష్మ పితా మహుని శౌర్య పరాక్రమాలను వర్ణిస్తూ కర్ణుడు కన్నీరు కారుస్తుంటే ,కర్ణుడిని చూసి రాజులు అందరు ఆర్త రవాలు చేసి ,కన్నీరు మున్నీరు గా విల పించారు .రాదేయుడు భీష్ముని –”దమమును ,సత్యముం దపము ,దానము ,శీలము ,నస్త్ర వీర్య శౌ –ర్యములును ,భీష్ము నంద కలవట్టి మహాత్ముడు పోర నీల్గె ,నిం –క ,మనకు నేటి బాహు బల గర్వము లెక్కడి సేన లక్కటా –సమసేనే ,కౌర వేశ్వరుని ,సంపద యంచు విషన్న మూర్తి యై ”.అంతే కాదు చాలా సహజ సౌజన్యం తో భీష్ముడి పట్ల తన కున్న ,గౌరవ భావాన్ని ఆవిష్కరించాడు .అది మనసు లో ఉంది .ఇప్పుడు బయట పడింది .తన ప్రత్యర్ధి అయిన అర్జునుని పరాక్రమ విక్రమాన్ని కూడా జంకు లేకుండా ప్రశంసించాడు కుంతీ పుత్రుడు .వివిధ సంఘటన లలో మానవ హృదయం లో కలిగే పరి వర్తనం ,దానికి కారణం అయిన ప్రవర్తన ,స్వభావ సిద్ధ మైన శీలాదులు తిక్కన చిక్కగా చక్కగా ,పోషించాడు .కర్ణుని మాటలు వినండి –”భరితాశాన్తర ,పాం– చ జన్య రవ దృప్యద్దేవదత్తధ్వని ,–స్ఫురణన్ ,వీనులు వ్రయ్య ,గేతన కపి స్ఫూర్జత్ప్రభన్ ,జూడ్కులా –తురతంబొందంగ , చండ గాండీవ సముద్భూతాస్త్ర జాలంబు ,లె –వ్వరు సైరింతురు నీవు దక్క ,భుజ గర్వ స్ఫూర్తి ,నిర్వాహకా !”అని అర్జునుని గాన్దీవాన్ని ఎదుర్కోవా లన్నా ,పాన్చానన్య ధ్వని విని తట్టు కోవాలన్నా ,భీష్ముడు తప్ప వేరేవారు లేరని నిస్సందేహం గా తెలియ జేశాడు .తన వల్ల కాదు కిరీటి ని తట్టు కోవటం అని నర్మ గర్భం గా తె లియ జేసి నట్లే .
ఈ రకం గా ,మహా కవి తిక్కన భీషణ యుద్ధ సమయం లోను ,మానసిక స్వభావాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ,యుద్ధాన్ని కూడా మానవ జీవితానికి అతి సన్నిహితం చేస్తాడు .పౌరుష శౌర్య ధైర్య సాహస విజ్జ్రుమ్భణే కాదు మానవ ప్రకృతుల ఆవిష్కరణ ను కూడా అంతే ఉదాత్తం గా వెలువరింప జేస్తాడు తిక్కన .పౌరాణిక మార్గం లో కాక ,ఒక రూప కర్త లాగా ,తాను పాత్రల వెనుక ఒదిగిఉండి ,నాటక రంగం లా యుద్ధ రంగాన్ని నిర్మించాడు .అవసరాన్ని బట్టి మనోహర ప్రకృతి సౌందర్యాలను ,మరో చోట విశిష్ట శబ్ద ప్రయోగ చాతుర్యాన్ని చూపిస్తాడు .అర్ధ గౌరవం ,రసధ్వనుల స్ఫూర్తి ,సందర్భోచిత మైన సంభాషణా ,రసవత్తర నాటకీయ సంవాదం ,సన్నీ వేశాన్ని బట్టి ,మానవ స్వభావ వ్యక్తీకరణం ,పరిస్తితిని బట్టి మారే ,మానసిక ప్రవృత్తీ ,మనో రంజకం గా వ చిత్రించే మహా కవి తిక్కన సోమయాజి .ఉభయ కవి మిత్రుడి ఉదాత్త ప్రౌఢ కవితా రచన కు ఆదర్శం ,మానవ ప్రకృతికి అద్దం (ఆదర్శం -అంటే -అద్దంఅనే అర్ధం ఉంది )ఈ యుద్ధ పంచకం .
దీని తరు వాత ”స్త్రీ పర్వం ”లోని విశేషాలు తెలుసు కొందాం
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్.–29-7-12.–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –19 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7

 తిక్కన భారతం –19
                          యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7
ఆశ్వత్థామ    నారాయనా స్త్రాన్ని ప్రయోగించాడు .అర్జునుడు మొదలైన వారంతా రధాలు దిగి విల్లు బాణాలు మొదలైన ఆయుదా లన్ని వది లేసి దానికి నమస్కరించారు .కానీ భీముడు మాత్రం సైనికులతో –”దిగకుడు వాహనంబులు ,గడింది మగంటిమి గోలు పోవ ,మీ –రు గడక దక్కవేట్టకుడు,రూపర నాయుధముల్ ,మహాస్త్ర –శక్తి గెలుతు ,గోత్ర భిత్కులి శ,థీ వర శరంబుల వైభవంబు ,భూ –రి గదా విహార భంగియు ,నరి ప్రకరంబులు పిచ్చ లింప గన్ ”  ఎవరు భయ పడద్దని రధాలు వగైరా లు దిగాక్కర లేదని ఆయుధాలు విసర్జిన్చాక్కర లేదని తాను దాన్ని ఎదుర్కొని అందర్ని రక్షించ గలనని ఉత్సాహ పరిచాడు .శంఖ నాదం తో ,తొడలు కొట్టు కొంటూ సింహ నాదం తో ఆశ్వతామ ను ఎదుర్కో బోతున్నాడు భీముడు .నారాయణాస్త్రం కార్చిచ్చు లాగా భీమ సేనున్ని చుట్టు ముట్టేసింది కృష్ణార్జునులు ఉత్త చేతుల తో భీమున్ని నిరాయుదుడిని చేసి ,రధం నుంచి కిందికి తోసేసి కాపాడారు .ఈ విధం గా భీముని సహజ మైన ఔద్ధత్యం ,సాహసాలను తిక్కన ఇక్కడ ప్రదర్శింప జేశాడు ..
సాత్యకి పరాక్ర మానికి దుర్యోధనాదులు పారి పోయారు .ఈ విషయాన్ని సంజయుది ద్వారా విన్న ద్రుత రాష్ట్రుడు –”పులికి బసులు వారిన క్రియ ,–సల్పు జలము సిగ్గు విడిచి ,యట్లొక్కని కో –ల్తల కోర్వకవిరిగిన –పుత్రుల నేమని విందు, నేను రోయక ఇంకన్ ” అని సంజయుని తో తన బాధ వెల్ల గక్కు కున్నాడు .కౌరవుల అశక్తత ను గుర్తించాడు .సాత్యకి చేతి లోనే చావు దెబ్బ తింటే ,ఇంకా ముందు జరిగే యుద్ధం లో తన కొడుకు గతేమిటో అని విచారించాడు .మనసు స్వాధీనం తప్పింది .ద్రోణా చార్యుడు మొదలైన వారిని తప్పించుకొని ,భీముడు వ్యూహం లోకి ప్రవేశించాడని విన గానే ”ఇట్లు సింహ నాదమిచ్చిన భీముని –మార్కొనంగ ,మగడు ,మన బలమున –గలిగినే ,మదాత్మ జుల గాల్ప బుట్టిన –చిచ్చు వాడు ,వాని జనయుం టరిది”భీముడు సింహనాదం చేస్తూ వ్యూహం లో ప్రవేశిస్తే ,తమ బలం లో అతడిని ఎదిరించే మాగాడే లేకుండా పోవటం ముసలి రాజు కు తీవ్ర నిరాశ కల్గించింది .తట్టు కో లేక పోయాడు .ఘటోత్కచుని పై కర్ణుడు శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగించి ,చంపాడు అన్న మాట విన్న పెద్ద రాజు ఎంత ఉక్రోషం తో ,తన మనస్సు లోని మాటను బయట పేడు తున్నాడు చూడండి — ”ఒకనిని జంపి ,ఇట్లు సమ నుజ్వల ,శక్తి నెరింగి ,కర్ణుడే — టికి ,నరు మీద దాని నిగిడింపక ఇన్ని దినంబు లప్రయో –జకము జేసే ,గయ్యము భుజా బాల శాలి ,నరుండు ,వద్ద  బో–రికి ,మరి యుత్స హింప గలరే ,పేర వారలు సూత నందనా ” -కర్ణుడు ఎవరు యుద్ధానికి రమ్మన్నా ,వ్రతమని ,నియమమని ,అంటూ ఎందుకు ఇప్పటి దాకా కాల క్షేపం చేశాడు ?అని బాధ పడ్డాడు .అంటే అంతకు ముందే ఈ పని చేసి ఉంటె తన కొడుక్కి ధైర్యం వచ్చేది కదా .అని లోపలి భావం .ఇక్కడ అతని పుత్రా మొహం తీవ్రత స్పష్టం .దేవుని పై విశ్వాసం ,విధి విలాసం అనుల్లంఘ నీయం అనే జ్ఞానం కూడా లేని వాడు అని మనకు స్పష్టం గా తెలుస్తోంది .అందుకే గతం అను కూలించ లేదే అని విచారిస్తున్నాడు .దీన్నినే ద్రుత రాష్ట్రుని ”ఆశక్త దుర్జ నత్వం ”అన్నారు పెద్దలు .–
రెండో రోజు యుద్ధం లో పాండవుల్లో ఒక్కడు కూడా చావా లేదని తన సేన ఆడ వాళ్ళ మధ్య లో ఉన్న మగ వాళ్ళ లాగా ప్రవర్తిస్తోందని ఆవేదన చెందాడు .శల్యుడు ,దుర్యోధనాదుల చావు విన్న తర్వాతమనసు లోని దుఖాన్ని బాధను ,ఆవేదన ను బయటికి వదులుతూ –”చావరు ,నొవ్వరు ,పాండవు –లేవురు నని ,నీవు చప్ప ,,నిప్పలుకులు ,దుహ్–ఖా వేష కరములై ,చే–తో వ్రుత్తి దహింప జొచ్చె ,దుర్భర భంగిన్ ”అని వాపోయాడు .ఆయన మనసు ఎంత విష పూరితమో ,దుష్టుల స్వభావం ఎలా ఉంటుందో ,స్పష్ట పరిచాడు తిక్కన .బహుశా వేద వ్యాసుడు కూడా ఇలా ముసలాయన అంతర్యాన్ని బహిర్గతం చేసి ఉండదు .తన కొడుకుల తో పాటు ,పాండవుల్లో ఒక్కడు చచ్చినా ముసలి రాజు ఆనందించే వాడు .కాని ఎవ్వరూ చావా లేదు .తన వాళ్ళంతా అగ్ని లో పడ్డ మిడుతల్లాగా భస్మ మై పోయారు .మరి మండదా?ఇదే దుస్శహవ్యధ అంటే .ఈర్ష్య గాంధారీ వల్లభుడిని పూర్తీ గా ఆక్ర మిన్చేసింది .దుర్జన స్వభావం తేట తెల్ల మయింది .పుత్రా శోకం ముంచి వేయగా ,విధి అప్పుడు జ్ఞాపకం వచ్చి ఎంతో ఏడుస్తాడు .”కొడుక! తమ్ములు తోడ్పడ గడగి శత్రు –వరుల గెలిచెద నంటి ,ఒక్కరుడుండక ,–కుండా నీ తమ్ము గుర్రల ,నూచ ముట్టు–గొనియెనె ,విధి ,యే గతి జనుదు జెపుమ ”తమ్ముల్లున్నారనే నమ్మకం తో కయ్యానికి కాలు దువ్వావు .నీ తమ్ముల నందర్నీ ఊచ కొత్త కేసేశారు పాండవులు .విధి బలీయం నాకిన్కేమిటి గతి అని ఆక్రోశం వేలిగక్కాడు .–”గదిసిన పవనుజుడుబెట్టుగ-  గదవ్రేసి , -తొడలు విరిగి ,కయ్యపు నేలన్ –మద మరి పడి నప్పుడు నీ –మది నేమని తలచితో ,కుమార ఎరుంగన్ ”భీముడు గద తో ప్రతిజ్ఞా పాలనం చేస్తూ తొడలు విరగ్గొట్టి నప్పుడు  నేలకు ఒరిగి యేమని విలపించాడో పెద్ద కొడుకు అని ఆవేదన ఈయనకు .మంచి వాడైనా ,చెడ్డ వాడైనా మానవుడికి రాగ మొహాదులు ,వాత్సల్యాదులు ,సమానం గా నే ఉంటాయి .ఇది ప్రకృతి సహజం .వీటిని ఇంత గొప్ప గా బహిర్గతం చేయటమే తిక్కన చేసిన గొప్ప పని .
కర్ణ వధ విన్నాడు ముసలి రాజు .అతనికి ఉదాత్త గౌరవాలనిచ్చి మాట్లాడాడు .మంచి విశేషణాలతో అతన్ని స్తుతించాడు .అతను తన కుటుంబానికి చేసిన సేవ మరచి పోలేనిది .కర్ణుని పై తన కొడుకులు ఎంతో ఆధార పడ్డారు .ఆతని వధ తో కౌరవ సేన నిస్తేజం నిర్వీర్యం అయిందని చెప్పుకున్నాడు సంజయుడికి .–”ఆలా లోని ఆబోతు ను బోలె నొప్పు –గురు బలంబులలో ,నున్మద ద్విరద మూర్తి -సింహ సంహనుండు ,నిస్సీమ విక్ర –మాభి రాముండు,వోయెనే ?యక్క టక్కట”ఇలా ద్రుత రాష్ట్రుని చిత్త వృత్తులను ఆయా సందర్భాలలో జరిగిన సంఘటన ల ను ఆధారం గ  ఆకర్ష ణీయం గా వెలి బుచ్చాడు తిక్కన .
దుర్యోధనుడు మడుగు లో దాక్కున్నాడు .అతని అనుజులు అందరు అప్పటికే హతమై పోయారు .ఆ ఆనందం లో ధర్మ రాజు కర్ణుని తన సోదరు లతో ఎవరి తో నైనా గదా యుద్ధం చేయటానికి ఎన్ను కో మంటాడుఇందులో ఆతని తొందర పాటు ఉంది .అతని హృదయ వైశాల్యమూ కన్పిస్తుంది .దాక్షిణ్యం ,ధర్మ బుద్ధీ కనీ పిస్తాయి .శ్రీ కృష్ణుడు ధర్మ రాజు ను విమర్శిస్తాడు .”జూదం లో చేసి నట్లే మళ్ళీ చేస్తావా ?”అని ప్రశ్నించాడు .అమితోత్సాహం తో ,ముందు వెనుకలు చూడ కుండా పందాలు కాయటం ,శపధాలు చెయ్యటం ఎంత చేటు తెచ్చిందో తెలియ జెప్పాడు .ధర్మ రాజుకున్న ద్యూతాసక్తి యే మహా భారత యుద్ధానికి కారణం అయింది .అందుకే ఉపాయం గా ”ఈ రాజు కు భీముని తో పోరితేనే సమంగా ఉంటుంది ”అని సన్నాయి నొక్కులు నొక్కాడు .వెంటనే భీమ ప రాక్రమాన్ని ,,దుశ్శాసన  వదను చెప్పి ,ఉత్సాహాన్ని ప్రశంశించాడు .దుర్యోధనుని పగ ను ఎగ దోస్తాడు .చివరికి రోగీ పధ్యమే కోరాడు, వైద్యుడూ అదే చెప్పాడు అన్న సామెత లాగా దుర్యోధనుడు భీముడి తోనే యుద్ధం చేస్తానన్నాడు .ఏమైనా సరి జోదుతో చేస్తేనే మజా కదా .ధర్మ రాజు సంస్కృతి కల మాన వ శ్రేష్టుడు .కాని ,మానవ స్వభావాతీత దివ్య పురుషుడు కాదు అంటారు విశ్లేషకులు .అందుకే మనకు దగ్గరవుతాడు .వ్యాస మహర్షి ఈ విధం గా ధర్మ రాజాదులను ఇంద్రియ వ్యాపారాలతో కూడిన మానవులు గా చిత్రించి  భారత పాత్ర లను లోక జీవితం లో అను సందించాడని  మనం గ్రహించాలి .దానికి తెనుగు దనం తో మూర్తి కట్టించాడు తిక్క యజ్వ .
సశేషం –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-7-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

విశ్వావిర్భావం

  విశ్వావిర్భావం 
స్పేస్ టైం లో వ్రేలాడ దీయ బడిన స్పైరల్ గెలాక్సీ పై అంటించిన పోస్టర్ లో ”మీరు ఇక్కడ ఉన్నారు ”అని వ్రాసి ఉందట .విశ్వావిర్భావానికి బిగ్ బాంగ్ సిద్ధాంతం ఆధారం గా భావిస్తారు .దాన్ని పూర్తిగా నమ్మక పోయినా దానిని మించిన సిద్ధాంతం వచ్చినా దాన్ని వదలలేక పోతున్నారు .నక్షత్రాలకు ముందే మూలకాలు ఏర్పడి ఉండవచ్చు .అప్పుడు న్యూట్రాన్ గాస్ వేడిగా వ్రేలాడుతున్నట్లున్దేడిత .కొన్ని న్యూట్రాన్లు ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు గా మారాయటఅప్పుడు హైడ్రోజెన్ బ్లాక్స్ ఎర్పడ్డాయత .ఒక మూలక పదార్ధం yelm. ఉండేది .ఇది గ్రీకు పదం -దీని అరధం -ప్రాచీన పదార్ధం .
సుమారు పది హేను బిలియన్ల సంవత్స రాల క్రిందట పదార్ధము ,శక్తీ అంతా కూడా కొద్ది ప్రదేశం లో కీన్ద్రీక రించి ఉండేది ఆ ప్రదేశం క్రమం గా వేగం గా విస్తా రించటం ప్రారంభించింది ..ఉష్ణోగ్రత వంద మిలియన్లరెట్లు పది పోయింది .ప్రాధమిక కణం క్వార్కులు శక్తి సముద్రం లో స్వేచ్చగా సంచ రించేవి ..మళ్ళీ వెయ్యి మిలియన్ల రెట్లు పెరిగిన తర్వాతా కొలువ దాగిన పరిమాణం లో పదార్ధం సోలార్ సిస్టం ఏర్పడింది .అప్పుడు క్వాకర్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు గా స్తిర పడ్డాయి .మళ్ళీ వెయ్యి రెట్లు విశ్వం పెరిగిన తర్వాతా ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసి అనువు లోని న్యూక్లియస్ లు గా మారాయి .వీఎతి లోనే ఇవాల్టి ఈలియం ,ద్యుతీరిం ఉన్నాయి .ఇదంతా వ్యాకోచం చెందినా మొదటి నిమిషం లో నే జరిగింది .అయినా అప్పటికి ఉష్ణోగ్రతలు ఇంకా విప రీతం గానే ఉన్నాయి .తటస్థ అణువులు అత్యధికం గాఏర్పడ్డాయి .ఇలా విశ్వం వ్యాపిస్తూ మూడు లక్షల సంవత్సరాలు గది పిండి .అప్పుడు మన విశ్వం ఇప్పుడున్న దానికంటే వెయ్యి రెట్లు చిన్నది గా ఉండేది .న్యూట్రాన్ అణువులు కలిసి వాయు మేఘాలుగా ,ఏర్పడి ,ఆ తర్వాతా నక్షత్రాలుగా మారాయి .అప్పటికి మన విశ్వం ఇప్పుడున్న స్తితి కి ఐదో వంతు మాత్రమె వ్యాపించింది .అప్పుడు నక్షత్రాలు కలిసి సమూహాలై యువ గెలాక్సీ లు గా తయారైనాయి .
ఇప్పుడున దానిలో విశ్వం సగమే ఉన్న కాలం లో నక్షత్రాలలో న్యూక్లియర్ రియాక్షన్లు ప్రారంభ మైనాయి .అతి భారమైన మూలకాలు ఏర్పడివాటితి గ్రహాలూ ఏర్పడ్డాయి .మన సోర్య మండలం చాలా తక్కువ వయసు కలిగి ఉంది .ఇది ఏర్పడి సుమారు అయిదు బిలియన్ల సంవత్స రాలు అయి ఉంటుంది .అప్పుడు విశ్వం ఆకారం ఇప్పుడున్న దానిలో రెండు వంతులు మాత్రమె ఉంది .కాలం గడిచిన కొద్దీ గెలాక్సీ లలోని వాయువులను నక్షత్రాలు పూర్తిగా స్వాహా చేసే శాయి .దానితో నక్షత్రాల వృద్ధి క్రమంగా తగ్గి పోయింది ..ఇంకో పది హేను బిలియన్ ఏళ్లకు నక్షత్రం అని పిలువా బడే మన సూర్య గోళం లాంటివి కూడా అరుదు ఆయె ఆవ కాశం ఉంది .అప్పుడు మన విశ్వం నివాస యోగ్యం కాకుండా పోతుంది .నందో రాజా భవిష్యతి .మన వరకు మనకేమీ భయం లేదు .
విస్తరించాక ముందు వ్శ్వం ఎలా ఉండేది ?చివరి నక్షత్రం అందులోని న్యూక్లియర్ ఇంధనం అయి పోయిఅదృశ్యమైతే  ఏమి జరుగు తుందో ఎవరూ చెప్పలేరు .ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన రిలేటి విటి ణి వివరిస్తూ ద్రవ్య రాశి శక్తి స్పేస్ మరియు కాలానికి ఉన్న సంబంధాన్ని వివ రించాడు .అంతరిక్షం లో పదార్ధం అంతా ఒకే తీరుగా వ్యాపించి ఉంటుందని చెప్పాడు .ఆయన విశ్వం ఎప్పుడూ నిలకడ గానే ఉంటుందని ,మార్పు చెందదని , గట్టిగా చెప్పాడు .హబుల్ శాస్త్ర వేత్త మన నుంచి గెలాక్సీ కదలిక ,దాని దూరం మీద ఆధార పది ఉంటుందన్నాడు .విశ్వం వ్యాప్తి చెంది నపుడు పదార్ధ సాంద్రత తగ్గుతుంది .ఆయన కానీ పించే గెలాక్సీల సంఖ్యను లెక్క పెట్టాడు .గెలాక్సీ మన నుంచి దూరం అయి నప్పుడువాటి లోనుంచి వచ్చే ఉద్గార శక్తి వల్ల తరంగ దైర్ఘ్యాలు పెరుగుతాయి .అప్పుడు రేసేషాన్  వేలాసిటి పెరిగి యెర్ర పడ తాయి .దీన్ని ”రెడ్ షిఫ్ట్ ”అంటారు .
ఇన్ఫ్లేషన్ సిద్ధాంతం ప్రకారం విశ్వం మండే అగ్ని గోళం గా ఉంది ,అందులోంచి అగ్ని కణాలు వెలువడి నట్లు అన్నీ ఏర్పడ్డాయి .ఎలిమెంటరి పార్టికల్ అనే సిద్ధాంతం ప్రకారం ఒకే ధ్రువం గల ఆయస్కాన్తాళ లాంటి చాలా భారం ఉన్న పార్టికల్స్ ఉండేవి .వీటిని మోనో పోల్స్ అంటారు .వీటి భారం ప్రోటాన్ భారానికి  1.016 రెట్లు .బిగ్ బాంగ్ ప్రకారం ఇవి విశ్వావిర్భావకాలం లో మొదట ఏర్పడ్డాయి .క్వాంటం మెకానిక్స్ వచ్చి అన్ని లెక్కలను మార్చింది .ఆ సిద్ధాంతం ప్రకారం ఖాళీ ప్రదేశం అంటే ఏమీ లేకుండా ఉన్న ప్రదేశం కాదు .ఆ శూన్యం లో అతి కొద్ది క్వాంటం మార్పులు ఉంటాయి .వాటిని తరంగాలు అన వచ్చు .విశ్వం వంపు తిరిగి ఉంది .
ఆ ఒంపు ధనాత్మకం అయితే రేఖా గణితం గోలా కారం గా ఉంటుంది .అదే రుణాత్మకం అయితే జామెట్రీ పరవాలయం అంటే హైపర్ బొల గా ఉంటుంది .చిన్న చిన్న దోరాలకు యూక్లిడ్ ప్లేన్ జామెట్రీ పని చేస్తుంది కాని వీటికి పనికి రాదు .గోలా కార విశ్వం లో అంటే భూమి మీద లాగా ఉంటె-సమాంతర రేఖలు కలుసు కొంటాయి .త్రిభుజం లోని మూడు కొనాల మొత్తం540  డిగ్రీలు ఉంటుంది అంటే మూడు రెట్లు .వృత్తం చుట్టూ కొలత  2 pai r  కంటే తక్కువ గా ఉంటుంది .కారణం స్పేస్ లోని వంపు మళ్ళీ తిరిగి వచ్చి కలుస్తుంది కనుక .దానితో గోలా కార విశ్వం స్తిరం గా ఉంటుంది .పర వలయ విశ్వం లో సమాంతర రేఖలు విడి పోతాయి .త్రిభుజం లోని మూడు కొనాల మొత్తం 180డిగ్రీల కంటే తక్కువ గా ఉంటుంది .వృత్త పరిధి 2 pai r కంటే ఎక్కువ ఉంటుంది .అలాన్తివిశ్వం అనంతం గా ఉంటుంది .ఇదంతా కంగారు గ ఉంది కదూ.అందుకే జార్జి ఆర్వెల్ అనే మేధావి to see what is in front of one’s nose requires a constant trouble ” అని తమాషా గా అన్నాడు .అది తమాషా కే అన్నా నిజమే .ఇవాళ ఉన్న సిద్ధాంతం రేపు నిజం కావటం లేదు .బూరలు బద్దలు కొట్టు కొంటున్న శాస్త్ర వేత్తలకు ఇది వివ రించాలంటే శాస్త్ర పర్జ్ఞానం చాలదని ఉద్ది తో కాక మనస్సు తో ఆలోచిస్తే సమాధానం లభిస్తుందని ఊరట చెందుతున్నారు .అయినా మనకొచ్చిన భయం లేదు .ఎన్నో బిలియన్ ఏళ్లకు కదా మార్పు !
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –28-7-12-. కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు -శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు .సరసభారతి wordpress  లో స్పేస్ నుఈరోజే  కొనుగోలు చేసింది .దీనిని స్పాన్సర్ చేసి ,ఆర్ధిక సాయానికి ముందుకు వచ్చి  ,వెంటనే డబ్బు కట్టి,ఎప్పుడో చేసిన వాగ్డానాన్ని   ఈ రోజూ అడగ గానే నిర్వర్తించి సరస భారతి సాహితీ ,సాంస్కృతిక కార్య క్రమాలకు ప్రోత్స హించిన మా మేనల్లుడు -కాలిఫోర్నియా నివాసి   jay veluri అని పిలువ బడే ఛి.. వేలూరి మృత్యుంజయ శాస్త్రి ,శ్రీ మతి విజయ లక్ష్మి దంపతులకుశుభాశీస్సులు , అభి నందనాలు .సరసభారతి కార్యక్రమాలను వాళ్ళు చదువుతూ ,వాళ్ల కుటుంబం అందరి చేత చదివిస్తూ మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు .

ఇప్పుడు సరసభారతి https://sarasabharati-vuyyuru.com/ లో కూడా చదువవచ్చు

ఈ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని ,సరసభారతి విలువల తో కూడిన సాహిత్య సాంస్కృతిక విషయాలను ఇక ముందు కూడా అందిస్తుందని మనవి చేస్తూ సెలవ్ –గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment