- నిక్కమైన నిజాలు
క్వా సార్లు అనేవి సుదూరం లో ఉన్న నక్షత్రాలు .వాటి కాంతి మన గెలాక్సీ కాంతికి వెయ్యి రెట్లు ఉంటుంది .అందులో కొన్ని క్వాసార్లు మనకు పన్నెండు బిలియన్ల కాంతి సంవత్స రాల దూరం లో ఉన్నాయి .ఇప్పుడు మనం వాటిని చూస్తున్నాము అంటే -12బిలియన్ సంవత్స రాల కింద ఉన్న వాటిని చూస్తున్నామని అర్ధం .ఒరియాన్ అనే నెబ్యులా ఇప్పుడు కనపడు తోందంటే అది రోమన సామ్రాజ్యం చివరి రోజుల్లోది అని భావం .మనకళ్ళ కు కనీ పించేఆన్ద్రో మీడా గెలాక్సీ రెండు మిలియన్ ఏళ్ళ ముసలిది పాపం .అంటే మనకు తెలుస్తున్న అసలు విషయం ఏమిటంటే –మనం యిప్పుడు చూసేది ఏదీ ఇప్పటిది కాదు .మనం ఇప్పటి ప్రపంచ స్తితిని దేన్నీ చూడటం లేదన్న మాట .ఇంకొంచెం సరదాగా చెప్పా లంటే నేను నిన్ను ఇప్పుడు చూస్తున్నాను అంటే -ఒక మైక్రో సెకండ్ లో వందో వంతు కాలం కిందట ఉన్న నిన్ను చూస్తున్నాను అని సైంటిఫిక్ అర్ధం .అదే నీ నుంచి కాంతి నన్ను చేర టానికి పట్టే కాలం అన్న మాట .మైక్రో సెకండ్ లో వందో వంతు అంటే -అటామిక్ స్కేల్ లో చాలా దూరం గా నే భావిస్తారు .అది మన మెదడు గుర్తించే టంత గా అని పించడు . ఈ అతి తక్కువ సమయం లో మానవులు అక్కడి నుండి అదృశ్యం కాలేరు .అందుకని నువ్వు అక్కడే ఉన్నట్లుగా భావిస్తానన్న మాట .సూర్యుడి విషయం లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది .కాంతి సూర్యుడి నుంచి భూమిని చేర టానికి ఎనిమిది నిముషాలు పడుతుందని మనందరికీ తెలిసిన విషయమే .మనకు కంటికి కనీ పించే నక్షత్రాలు ,మన గెలాక్సీ లో ఉన్న తారలు అన్నీ సాపేక్షం గా దగ్గర్లోనే ఉన్నాయి .కాని ఇంకా సుదూరాలలో ఉన్న నక్షత్రాలు అంటే అతి పెద్ద శక్తి వంత మైన దూర దర్శినులతో మాత్రమె చూడ గలిగిన నక్షత్రాల సంగతి మాత్రం వేరే గా ఉంటుంది .పన్నెండు బిలియన్ల కాంతి సంవత్స రాల దూరం లో కనీ పించే క్వాసార్లు ఇప్పుడు అన్నిబతికి ఉన్నాయని చెప్పలేము .
ఒక నిర్ణీత హద్దును దాటితే కాంతి మనకు చేర లేదు .దాన్నే హోరైజన్ అంటారు .ఆ దిక్చక్రం లేక హోరైజన్అనేది – ఉష్ణోగ్రత 3000 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న కాలము నాటిది అని గుర్తించాలి .ఖగోళ శాస్త్రాధ్యన పరుల లెక్కల ప్రకారం, బిగ్ బాంగ్ సిద్ధాంతం ప్రకారం కూడా ,అప్పుడు మన విశ్వం పుట్టి సుమారు మూడు లక్షల సంవత్స రాలు అయి ఉంటుందని భావిస్తున్నారు .ఇదంతా కన్ఫూజంగానే ఉంటుంది మరి .నిజాలు అలానే అని పిస్తాయి .అరిస్టాటిల్ మహాశయుడు ఒక విషయం చెప్పాడు -అనంత కాలం నాడు జనించిన కాంతి అనంతంగాఅప్పటి కాన్తికే మాత్రం తగ్గ కుండా కాంతి వంతం గానే ఉండాలి .కాని అట్లా లేదు .ఈ విషయం పై ఖగోళ వేత్తలు బుర్రలు పగల గొట్టుకొని సమాధానం రాక జుట్లు పీక్కుంటున్నారు .మనకు తెలిసిన విషయం ప్రకారం ఆకాశం చీకటిగా ఉంది అంటే నక్షత్ర సముదాయం అంతరించటమ్ వల్లఅను కొంటాము .పదిహేను బిలియన్ల సంవత్స రాలక్రితం అంటే పెద్ద కాలం కాక పోవచ్చు కాని ,అప్పుడు విశ్వం అంతా ముఖ్యం గా నక్షత్రాల మధ్య ఉన్న ప్రదేశం కాంతి తో నిండి ఉంటుంది . అందుకే రాత్రి వేళ చీకటి గా ఉండ టా నికి కారణం విశ్వ ఆవిర్భావమే(evolution ) నని అనుకో వచ్చు .
బిగ్ బాంగ్ జరిగిన మొదటి పన్నెండు మైక్రో సెకన్ల కాలం లోనే విశ్వం అంతా క్వార్కులు ,గ్లుయాన్ల సముదాయం తో నిండి పోయింది .నలభైవ మైక్రో సెకండ్ లోఉష్ణోగ్రత మిలియన్ మిలియన్ డిగ్రీలు కంటే తగ్గి చల్ల బడి నపుడు క్వార్కుల సముదాయం కలిసి మొదటి న్యూక్లియాన్లుగా అంటే ప్రోటాన్లు ,న్యూట్రాన్లు గా ఏర్పడి నాయని అంచనా వేస్తున్నారు . విశ్వం లో కాల గణనం లో మొదటి సెకండు అంటే -విశ్వ ఉష్ణోగ్రత పది బిలియన్ల సెంటిగ్రేడ్ డిగ్రీలున్న కాలం .మొదటి సెకండు కు ముందు ఉష్ణోగ్రత ఇంకా అధికం గా ఉండేదన్న మాట .
భూమి మీద నీరు ఇంకా ఉండ టానికి కారణం భూమి కక్ష సూర్యుని కక్షకు చాలా దూరం గా ఉండటమే .ఇంతకి భూమి మీద ద్రవ రూపం లో నీరు ఎలా వచ్చింది ?ఒక సారి అంత రిక్షం లో విహరిద్దాం .నక్షత్రాలు చని పోయి నపుడు నక్షత్ర దూలి ఏర్పడుతుంది .దీనినే స్టార్డ స్ట్ అంటారు -సినీ స్టార్ల మీద పుకార్లు షికార్లు చేస్తుంటాయి దాన్నీ స్టార్ డస్ట్అనే అంటారు .ఇక్కడ అదికాదు .ఈ నక్షత్ర దూలి మీద మంచు ,ఘనీ భావించిన కార్బన్ డ యాక్షైడు స్తావరం ఏర్పరచు కొంటాయి .ఆ కణాల సంఖ్యా ,పరిమాణం పెరిగితే ప్లానెట్స్ఏర్పడతాయి .అప్పుడు ఐసు తేలిక అయి గీసర్లు గా బయటకు చేరుతుంది .తోక చుక్కలు అంటే ఘనీభవించిన నీటి తో నిన్దినవే .అవి గ్రహాల పై పడి నీటిని వర్షిస్తాయి అలానే మన భూగోళం మీద ద్రవ రూపం లో నీరు ఏర్పడింది ..మరి ఆ నీటిని భూమి ఎలా తనలో ఇంత వరకు నిలుపు కొంది ?అనే ప్రశ్న రావటం సహజం .భూమికి ఉన్న అత్యంత గురుత్వాకర్షణ శక్తి(గ్రావిటి ) వల్ల, భూమి కక్ష సూర్యునికి చాలా దూరం లో ఉండటం వల్లనే భూమి పై నీరు ద్రవ రూపం లో ఉండిపోతోంది .భూమి ఏర్పడిన తొలి రోజుల్లో భూమి ,యువ సూర్యుని అల్ట్రా వయొలెట్ కిరణాలభారీ తాకిడికి లోనైంది .,భూమి నీటి దుప్పటి తో కప్ప బడి ఉండటం చేత ,భూ ఆవిర్భావపు తొలి వాతా వరణం లో ఉన్న కార్బన్ దయాక్సిడ్ నీటిలో కరిగి ,సముద్రపు నీటిలో కరిగి కార్బో నెట్ లు గా మారి పోయింది .అదే భూమికి పట్టిన గొప్ప అదృష్టం .అదే వీనస్ గ్రహం లో దాని ఆవిర్భావ సమయం లో నీరు లేక పోవటం వల్ల ,వాతావరణం లోని కార్బన్ డ యా క్సిడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నేర్పరచి దాని ఉపరితల ఉష్ణోగ్రతను అయిదు వందల సెంటి గ్రేడ్ డిగ్రీలను పెంచి ఎప్పుడూ ఉండేట్లు చేసింది .కనుక అక్కడ నీరు కనీ పించదు .వాస యోగ్యమూ కాదు .
కార్బన్ పరమాణువు కు ఉండే ప్రత్యెక లక్షణాల వల్ల అనేక పదార్ధాలు ఏర్పడుతున్నాయి .దాని వేలన్సీ నాలుగు అని చదువు కొన్నాం .అంటే దానికి నాలుగు ఎలక్ట్రాన్ రంద్రాలున్నాయని భావం .అందువల్లే అనేక పదార్దాలనేర్పరచే శక్తి దానికి ఉంది .త్వరగా పదార్ధాలను ఏర్పరుస్తుంది ,అంత త్వరగా విచ్చేదనమూ చెందుతుంది . .కార్బన్ లాగానే సిలికాన్ కూడా వాలేన్సి నాలుగే .కాని అది పొందే బంధాలు ద్రుధం గా ఉంటాయి .త్వరగా విచ్చేదనం కావు .అది స్తిర ఆక్రుతుల్ని ఏర్పాటు చేస్తుంది . ఇసుక అలా ఏర్పడిందే .దానికి మెటా బాలిజం ధర్మం లేదు అందుకే ఎక్కువ పదార్ధాలను సిలికాన్ పరమాణువు ఎర్పరచలేక పోతోంది .మన గెలాక్సీ లోను , మిగిలిన గెలాక్సీ లలోను ,రేడియో టెలిస్కోపుల ద్వారా చూస్తె కార్బన్ పరమాణువులే కనీ పిస్తాయి కాని, సిలికాన్ పరమాణువులు కన్పించటం లేదు . దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ,భామి మీద లాగా ఇతర గ్రహాల్లో జీవ పదార్ధం ఉండాలి అంటే అక్కడ తప్పక కార్బన్ ఉండాలి అది కార్బన్ సమ్మేళనాలను కలిగి ఉండాలి. .మన భూమి పుట్టి సుమారునాలుగున్నర బిలియన్ సంవత్స రాలు అయింది అని శాస్త్రజ్ఞుల అంచనా .
ఒక్క రోజులో భూమి
నాలుగున్నర బిలియన్ల సంవత్స రాల క్రితం మన భూమి ఆవిర్భవించిందని అనుకొందాం .అది అంతా ఒక్క రోజు లోనే జరిగిందని భావిద్దాం ‘.దానినే పాయింట్ జీరో అంటారు .తరువాత ఉదయం అయిదు గంట లకు ”జీవం ”అంటే ప్రాణం ఏర్పడింది .చాలా వేగ వంతం గా క్లిష్టం గా ఆరోజంతా పెరిగింది .రాత్రి ఎనిమిది గంటలకు మొదటి” మోల్లూక్సు” ఏర్పడ్డాయి .ఆ తర్వాతా రాత్రి పదకొండు గంటలకు డయోనోస్సార్ లు ఆవిర్భవించాయి . అయితే రాత్రి పద కొండు నలభై నిముషాలకు డైనోసార్లు అంతరించి పోయాయి .దాని తర్వాతపాలు ఇచ్చే జంతువుల(క్షీరదాలు ) ఆవిర్భావ పరిణామం జరిగింది .బహుశా ఈ పరిణామం అర్ధ రాత్రికి అయిదు నిమిషాల ముందు అంటే రాత్రి పద కొండు యాభై అయిదు కు జరిగి ఉండ వచ్చునని అంచనా వేస్తున్నారు . రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల నుండిఅర్ధ రాత్రి పన్నెండు గంటల లోపు అంటే ఒకే ఒక్క నిమిషం లోమానవుని మెదడు శక్తి పెరిగింది . .పారిశ్రామిక విప్లవం సెకను లో చివరి వందో భాగం లో జరిగింది .మొత్తం మీద భూమి మీద మనం స్తిర పడ్డాం కదా .ఇప్పటికి ఇంతటి తో ఆపేద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-8-12-కాంప్ –అమెరికా
