ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విప0చి.2 వ భాగం.26.3.25.
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విప0చి.2 వ భాగం.26.3.25.
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విప0చి.2 వ భాగం.26.3.25.
ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విప0చి.2 వ భాగం.26.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.3 వ భాగం.26.3.25.
శ్రీ ” వీరాజీయం”29 వ చివరి భాగం.26.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.17 వ భాగం.26.3.25.
ప్రొఫెసర్ సీహెచ్.సుశీలమ్మ గారి – విమర్శనా విపంచి.1 వ భాగం.25.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర.2 వ భాగం.25.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.16 వ భాగం.25.3.25.
శ్రీ ” వీరా జీ యం”.28 వభాగం.25.3.25.
https://youtu.be/n0MUkR1QH4w
https://youtu.be/lqSOI9IJB1s
సాహితీ’’ శిరి’’శ్రీ పోతి నాయుడు
శ్రీ శిరిపురపు పోతినాయుడు విజయనగరం తాలూకా గరివిడి మండలం అర్తమూరులో జన్మించి ప్రధానోపాధ్యాయులుగా పని చేసి గొప్ప గుర్తింపు పొంది రిటైరయ్యారు .మంచి సాహితీ ప్రియులు .కవి ,రచయిత.శ్రీ శ్యామలాంబ స్తుతి ,పోతినాయుడు నీతి శతకం,హితుడా ,పూలబాట నీతి శతకాలు ,దుర్యోధనుదె నిరుద్యోగి అయితే అనే రాజభాష రాని ఎం పి, ఆనే ఏక పాత్ర రచనలు చేశారు . ముత్యాలా సరాలలో గాంధీజీ జీవిత .సీస పద్యాలలో రామాయణం ,ఏక హృదయ హో భారత జనని ,గ్లోబల్ వార్నింగ్ ,నాటకాలు ,రాశారు కాని అముద్రితాలు .మంచి నాటక నటులైన నాయుడు గారు విశ్వామిత్ర దుర్యోధన ,రావణ బ్రహ్మ ,తాండ్ర పాపారాయుడు ,మాయల ఫకీరు ఏక పాత్రాభినయాలు చేసి ప్రశంసలు పొందారు .రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ,మద్రాస్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ అవార్డ్ ,తెలుగు కవి అవార్డ్ పొందిన ఘనులు .
1-శ్యామలాంబ స్తుతి -ఇందులో దండంకం స్థలపురాణం ,భజన పాటలు కాక అమ్మవారి పై స్తుతి శతక పద్యాలున్నాయి .భక్తీ జ్ఞాన ప్రదాయకాలు .దారా శుద్ధి ఉంది.
2-మేలిమి ముత్యాలు -ఇందులో నిత్యసత్యాలు ,ఆట వెలదిలో ఉన్నాయి .పదవతరగతి హిందీ ప్రాముఖ్యత ,ముత్యాల సరాలలో గాంధీ తాత ఉన్నాయి అన్నీ ఆణిముత్యాలే .
3-స్నేహితుడా -అనేద నీతి శతకం .పువ్వులు విరిసినట్లుగా నవ్వితే రోగాలు హుష్ కాకి .విదురనీతులు సకల జనులకు ఆదర్శం ,పుస్తకమే జ్ఞాన నేత్రం
4-పూల బాట -నీతి శతకం -వర్ణ జాతి వర్గ భేదాలు పతనహేతువు ,అగ్రగామి అయిన మనసును అదుపులో ఉంచుకోవాలి .అమ్మ పిలుపులో అమృతం ఉన్నది .మొదలైన అమృత సమానమైన సూక్తులు చెప్పారు -మకుటం -పోతి నాయ్డు మాట పూల బాట .
5-మహాత్ముని 150వ జయంతి సందర్భంగా నాయుడుగారు జాతిపితపై ముత్యాల సరాలలో శతకం రాశారు .యంత్రయుగం వచ్చి తంత్రం అధికం అయింది .ఆత్మ బలమున్న ఆర్యుడు గాంధి .చివర్లో ఆణిముత్యాలులాంటి పద్యాలున్నాయి .మంచి ముఖ చిత్రం లోపల గొప్ప ఫోటోలు ఉన్న పుస్తకం.
6- బంధుమిత్రులు శిష్యులు ప్రేమతో ప్రచురించిన -పసిడి రేకులు -పద్య రచన .బడిని చదువుల గుడి అన్నారు.అంబేద్కర్ ,వివేకనందులపై స్పూర్తి దాయక పద్యాలు బాగా ఆకట్టుకొంటాయి .వర్షమే హర్షం ,పొదుపు మంచి పద్యాలు రాశారు .ముసలితనం పై రాసిన పద్యాలు బాగాఉన్నాయి .సామెతలు కూడా చెప్పారు చివర్లో అన్నీ అన్నే .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-25-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు సాధారణ ప్రజలకు ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు. వారితోపాటు పని చేసిన వారికి ఒక అనుభవజ్ఞుడైన, అపరిమితమైనటువంటి జ్ఞానంతో వందలాదిమంది తన సహచర ఉపాధ్యాయులకు గురువుగా, వేలాదిమంది శిష్య బృందాలకి మహా మహోపాధ్యాయుడిగా సుపరిచితం!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఉయ్యూరు ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఎందరో మహానుభావులకు, ఆలవాలంగా అలరారుతోంది. అటువంటి ఉయ్యూరు పట్టణంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గబ్బిట దుర్గాప్రసాద్ గారు తమ విశ్రాంత జీవనాన్ని అవిశ్రాంత సాహిత్య సేవకునిగా సాహితీ రచనలను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సాహితీ మిత్రులకు సాహితీ బంధువుగా తెలుగు సాహిత్యం పై, కథపై, సంస్కృతిపై, సాంప్రదాయాలపై, సాంకేతిక విద్యపై ఇలా అనేక రంగాలలో విశేషమైన కృషి చేస్తూ సమాజం కోసం సాహిత్య సేద్యాన్ని చేస్తూ విలువైన అనితర సాధ్యమైన ప్రాచీన సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం రూపు రేఖ విలాసాలు ఎలా మార్చుకుందో కథ, కవిత, వ్యాసం, ఉపన్యాసం, గేయం, గీతం, కథానిక చారిత్రక అంశాలు, శాస్త్రజ్ఞుల జీవన ప్రస్థానం మొదలుగా గల అనేక విషయాలలో కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో గల సాంకేతిక ప్రజ్ఞ కలిగిన ఎందరో మహానుభావుల సంక్షిప్త చరిత్రను తనదైన శైలిలో ఎన్నో పుస్తకాల రూపంలో సామాన్యుల నుంచి విశేష ప్రతిభావంతుల వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ చేరువలో ఉండేలా తన వంతు కృషిని కొనసాగిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు అనడం కంటే సాహితీ వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్నారు అని అనడం సబబుగా అనిపిస్తుంది!
ఇక శ్రీ దుర్గాప్రసాద్ గారి ప్రస్థానం గురించి ఒక్కసారి సింహావలోకనం చేస్తే, వారు ఎనిమిది పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతిరోజు తనదైన శైలిలో నేటి ఆధునిక మాధ్యమాలైనటువంటి ముఖ పుస్తకం, వాట్సప్, యూట్యూబ్ మొదలైన వాటి సహాయంతో తన యొక్క సాహితీ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఉగాది పురస్కారాల మహోత్సవం కార్యక్రమం ఈనాటిది కాదు… అనేక సంవత్సరాలుగా వారు ఇటువంటి సంఘ హితమైన, భావితరాలకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చే విధంగా ప్రఖ్యాతి పొందిన అద్భుతమైన సాహిత్య ప్రముఖులను, రచయితలను, రచయిత్రులను, సంఘ సేవకులను, ప్రపంచవ్యాప్తంగా గల ఆయా దేశాల జాతీయ స్థాయిలో స్ఫూర్తి ప్రదాతల జీవన విశేషాలను, వివిధ రకాల కళారూపాలలో ప్రావీణ్యత చూపిన ఎందరో పెద్దలను తమదైన శైలిలో ప్రతి ఉగాదికి సరస భారతి ఉగాది పురస్కారాలు పేరున సత్కరించడంతో వారిని గౌరవించడం మనందరికీ ఎంతో సంతోషదాయకం!
సరస భారతి, ఉయ్యూరు వారి శ్రీ విశ్వావసు ఉగాది పురస్కారాల మహోత్సవ కార్యక్రమంలో, వారణాశి సాహితీ వారధి తరఫున పాలుపంచుకోవడం, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అదేవిధంగా మేము నిర్వహించిన దీపావళి కథల పోటీల లో బహుమతి పొందిన కథల సంకలనం బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు మరియు శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం ఒక గొప్ప జ్ఞాపకంగా మా మదిలో కలకాలం నిలిచిపోతుంది.
కృతజ్ఞతలతో, నమస్కారములతో బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి సభక్తి పూర్వకంగా సమర్పణం! 🌸🙏🌸
— వెంకట కృష్ణమూర్తి వారణాశి, శ్రీనివాసు వారణాశి, ఫణి వారణాశి
(వారణాశి సాహితీ వారధి, హైదరాబాదు)
సరసభారతి జరిపిన శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలలో పాల్గొని తమ కవితా గానంతో వారం ముందేఉయ్యూరుకు ఉగాది శోభ తెచ్చిన కవి మిత్రులకు ,నిర్వాహకులకు , అతిధులకు ,పురస్కార గ్రహీతలకు ,పురస్కారాలు అందజేసిన వారికి సరసభారతి కార్యా వర్గానికి ,మహా సంబరం గా కార్యక్రమం లొ పాల్గొన్న సాహిత్య సంగీత అభిమానులకు,కుటుంబ సభ్యులకు ఉగాది శుభా కాంక్షలతో ధన్యవాదాలు .గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -24-3-25-ఉయ్యూరు
వారణాశి సోదరుల గగన గంగా సాహితీ లహరి
వారణాశి సాహితీ వారధి గా వారణాశి సోదరులు గలగల అనుక్షణం పారే గంగ గా,శ్రీనివాసు, యమున గ శ్రీ వెంకట కృష్ణమూర్తి , ,కనిపించీ కనిపించకుండా ,నవ్వీ నవ్వకుండా ఉండే అంతర్వాహిని సరస్వతి గా శ్రీ ఫణి అంటే సోదరత్రయం త్రివేణీ సంగమంగా మహా కుంభ మేళ అనంతరం వెలువరించి ,నిన్న ఉయ్యూరులో సరసభారతి శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలలో తమకు సహకారంఅంద జేసిన శ్రీ ప్రయాగ రామ కృష్ణ చేత ఆవిష్కరింప జేశారు .తమ తలిదండ్రులకు అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నారు .గ్లేజింగ్ కలర్ పేపర్ పై జిగేల్ అక్షరాలతో మహా సుందరంగా ఉంది సంకలనం .
ఇంతకీ ఇందులో ఏముంది ?2022,23 ,24 సంవత్సరాలలో దీపావళికి సింగిల్ పేజీ కదల పోటీ పెట్టి ప్రధమ ,ద్వితీయ, తృతీయ బహుమతి పొందిన కధలున్నాయి . ,ఇందులో శ్రీ చలపాక రాసిన కధ సంకలనానికివన్నె తెచ్చింది .అత్తామామల్ని సుఖ పెట్టాలనుకొనే కోడలు రేపటి వెలుగు .దూడ కోసం తల్ల డిల్లె ఆవు ,అమ్మకోసం తల్లడిల్లే కూతురు సాద్రుశ్యంగా అమ్మా ఆవు బాగుంది .మతాలకు అతీతమైన ఆత్మీయత కంటిలో నీరు తెప్పిస్తుంది పవిత్ర హృదయాలకు .చేతికర్ర కన్నా కొడుకు చేతిఊతం ఆవాలి ముదుసలులకు ఆని చెప్పినదే చేతికర్ర .అక్క గుండె చాటు ప్రేమ కు ఫిదా అయిన తమ్ముడు .బక్క పానాలను ఆదుకోవాలి సెల్ సోదిలో పడి ఆడుకోరాదు .అదొక్కటే లేదు అన్న దురాశ దుఖానికి కారణం .ఉపాధ్యాయ దినోత్సవానికి సార్ధకత చెప్పే కత. కధ కారాదు అనే తండ్రి ఆత్మహత్య .ప్రేమకు బానిస అయిన మహిళ మానవత్వ పరిమళ శోభిత ఆని చలపాక ప్రకాష్ చెప్పారు .
కధలలో వైవిధ్యం ఉంది సామాజిక స్పృహ ఉంది బరువు బాధ్యత గుర్తింపు ఉంది .జీవన విధానం లొ ఆచరణాత్మక విధానమూ ఉన్నది .సుత్తి లేకుండా సూటిగా చెప్పిన విధానమూ ఉండి నచ్చింది .అన్నీ కదా మణి దీపాలే .వారణాసి సోదర త్రయానికి అభినందనలు .మూడేళ్ళ తర్వాత అయినా ,సుఖ ప్రసవమే జరిగింది .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-25-


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది బోట్ల సుబ్బరామయ్య గారి కథలు.8 వ చివరి భాగం.22.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు జీవిత చరిత్ర.1 వ భాగం.22.3.25.
చిత్ర కళా సిద్ధ హస్తుడు శ్రీ దామెర్ల రామారావు జీవిత చరిత్ర.1 వ భాగం.22.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి,- వాల్మీకి రామాయణం లో శాపాలు, వరాలు.15 వ భాగం.22.3.25.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది బోట్ల సుబ్బరామయ్య గారి కథలు.7 వ భాగం.21.3.25.
శ్రీ వి ఏకే రంగారావు గారి మరో ఆలాపన.7 వ చివరి భాగం.21.3.25.
శ్రీ ” వీరా జీ యం”.26 వ భాగం.21.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.14 వ భాగం.21.3.25.
నెల్లూరు జిల్లా విద్యావ్యాప్తికి కృషి చేసిన స్వాతంత్ర్య సమర యోధులు,శాసన సభ్యులు , -శ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య
శ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య 1882 సెప్టెంబర్ లొనెల్లూరు జిల్లా కావలి లొ జన్మించారు .తండ్రి లక్ష్మీ నారాయణప్ప .బి.ఏ .బి.ఎల్ .చదివి 1905నుంచి కావలి లొ న్యాయవాద వృత్తీ ప్రారంభించి 1921వరకు కొనసాగించారు . బాల్యం నుంచి దేశాభిమానం ఎక్కువ .విద్యార్ధిగా ఉండగానే 1900 లొ విదేశీ వస్త్రాలు వదిలేసి ,చేనేత వస్త్రాలు ధరిస్తూ ,గాంధీ మహాత్ముని ప్రబోధంతో ఖాదీ వస్త్రాలు ధరి౦చారు .
స్వాతంత్ర్యం రావటానికి తొలి మెట్టుగా దేశం లొ విద్యా వ్యాప్తి జరగాలని భావించి ,1910లొ కావలి లొ బాలికా పాఠశాల నెలకొల్పి,వయోజనులకోసం ఒక రాత్రి పాఠశాల స్థాపించి అవి సక్రమంగా పని చేయటానికి తగిన వసతులన్నీ కల్పించారు .1911లొ నెల్లూరులో వివేకానంద విద్యాలయం ఏర్పాటు చేశారు .1917లొ నెల్లూరులో హోమ్ రూల్ లీగ్ స్థాపించి ,హోమ్ రూల్ ఉద్యమాన్ని నెల్లూరు జిల్లా అంతా విస్తృతంగా ప్రచారం చేశారు .1921లొ నెల్లూరులోనే ‘’తిలక్ జాతీయ విద్యాలయం ‘’నెలకొల్పి నెల్లూరు జిల్లాలో విద్యావ్యాప్తి గొప్పగా చేశారు .
సహాయ నిరాకరణ ఉద్యమం లొ పాల్గొని 1921-22ప౦ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష,.ఉప్పు సత్యాగ్రహం లొ పాల్గొన్నందుకు నాలుగు నెలలు నెల్లూరు రాయవెల్లూరు బళ్ళారి జైళ్ళలో శిక్ష అనుభవించారు . 1937లొ మద్రాస్ శాసన సభకు శాసన సభ్యులుగాకాంగ్రెస్ పక్షాన ఎన్నికై ,1939వరకు సేవలందించారు .
రెండవ ప్రపంచ యుద్ధం కాలం లొ వ్యక్తి సత్యాగ్రహం లొ పాల్గొన్నందుకు 6-2-1941న అరెస్ట్ అయి ఎనిమిది నెలలు జైలు శిక్ష రాయవెల్లూరు ఆలీపూర్ ,జైళ్ళలో అనుభవించి ,క్విట్ ఇండియా ఉద్యమం లొ పాల్గొన్నందుకు 10-8-1942 న అరెస్ట్ అయి డిటిన్యు గ నెల్లూరు జైల్ లొ ఉన్నారు .వీరి కుమారుడు ఆకస్మికంగా చనిపోయినందుకు ప్రభుత్వం వీరిని 16-12-1942 న విడుదల చేసింది .తాను నమ్మిన వాటి నన్నిటిని త్రికరణ శుద్ధిగా ఆచరించిన దేశ భక్తులు శ్రీ వెంకట సుబ్బయ్య గారు .
1921లొ యువజనులను చేరదీసి నెల్లూరు జిల్లా అంతటా మద్య నిషేధ ప్రచారం చేయించి చాలా వరకు కృత కృత్యులయ్యారు .అన్ని రంగాలలో సంఘ సంస్కరణలో అగ్రగామిగా నిలిచారు .చాందసుల కులనిషేదానికీ గురయ్యారు .దేనికీ వెరవక తన ఉద్యమం సాగించి విజయం సాధించారు .వీరిని ఆదర్శంగా తీసుకొని వీరి కుటుంబ సభ్యులంతా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు .1946-47 కాలం లొ పల్లెపాడులోని ‘’పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ‘’ ఆది పత్యాన్ని పొంది ,దాని సువ్యవ స్థితం చేశారు .ఆశ్రమం లొ ఆయుర్వేద వైద్యశాలను స్థాపించారు .94వ ఏట నిండు వార్ధక్యం లొ 1-4-1976 న నెల్లూరు జిల్లా విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేసి , స్వాతంత్రోద్యమలో అనేక సార్లు జైలుపాలైన మహా దేశ భక్తులుశ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారు పరమ పదించారు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-3-25-ఉయ్యూరు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్దిభోట్ల సుబ్బరామయ్య గారి కథలు.6 వ భాగం.20.3.25. https://youtu.be/T1l_jR9ut-Ic
శ్రీ వి ఏకే రంగారావు గారి – మరో ఆలాపన.6 వ భాగం.20.3.25.
శ్రీ ” వీరాజీయం”.25 వ భాగం.20.3.25.
డా. ముట్నూరి సంగమేశం గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.13 వ భాగం.20.3.25./
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది బోట్ల సుబ్బరామయ్య గారి కథలు.5 వ భాగం.19.3.25.
శ్రీ వి ఏకే రంగారావు గారి – మరో ఆలాపన.5 వ భాగం.19.3.25.
శ్రీ ” వీరాజీ యం”.24. వభాగం.19.3.25.
శ్రీ ముట్నూరి సంగమేశ0 గారి వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.19.3.25.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది భోట్ల సుబ్బరామయ్య గారి కథలు.4 వ భాగం.18.3.25.
శ్రీ వి ఏకే రంగారావు గారి – మరో ఆలాపన.3 వ భాగం.17.3.25.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్దిభొట్ల సుబ్బ రామయ్య గారి – కథలు.3 వ భాగం.13.3.25.
శ్రీ వి ఏకే రంగారావు గారి – మరో ఆలాపన.1 వ భాగం.13.3.25.
శ్రీ వి ఏకే రంగారావు గారి – మరో ఆలాపన.1 వ భాగం.13.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.10 వభాగం.13.3.25.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది భోట్ల సుబ్బరామయ్య గారి కథలు.2 వ భాగం.12.3.25.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్ది భోట్ల సుబ్బరామయ్య గారి కథలు.2 వ భాగం.12.3.25.
శ్రీ వి ఏకే. రంగారావు గారి – ఆలాపన – 17 వ చివరి భాగం.12.3.25.
శ్రీ” వీరాజీయం”. 21 వ భాగం.12.3.25.
డా. ముట్నూరి సంగ మే శ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు, వరాలు.9 వ భాగం.12.3.25.
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్దిబోట్ల సుబ్బరామయ్య గారి కథలు.1 వ భాగం.11.3.25.
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్దిబోట్ల సుబ్బరామయ్య గారి కథలు.1 వ భాగం.11.3.25.
శ్రీ వి ఏకే. రంగారావు గారి – ఆలాపన.16 వ భాగం.11.3.25.
శ్రీ ” వీరా జీ యం”.20 వ భాగం.11.3.25.
డా. ముట్నూరి సంగమేశం గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.8 వ భాగం.11.3.25.
శ్రీరమణ పేరడీలు.7 వ చివరి భాగం.10.3.25.
శ్రీ వి. ఎ. కె. రంగారావు గారి – ఆలాపన.15 వ భాగం.10.3.25.
డా. ముట్నూరి సంగమేశ 0 గారి – వాల్మీకి రామాయణం లో శాపాలు,వరాలు.7 వ భాగం.10.3.25.
శ్రీ ” వీరాజీయం”.19 వ భాగం.10.3.25.