ఆంధ్రసారస్వత సమితి 10వ ఉగాది పురస్కారాలు మచిలీపట్నం 08.05.2011

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

The man in Silk Dhoti and Pancha is Sri Kolakaluri Inaac, Story writer, novelist and former VC of Sri Venkateswara University

The short man in check shirt and pant with myself and my wife is Sri P Chandra Sekhar Azaad- Story writer- TV dialogue writer
The man in Khanduva and Pyzama is Sri Mangalagiri Adithya Prasad- Station director, AIR, Vijayawada
Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం | 1 Comment

అబ్బూరి వర ప్రసాద్ గాత్ర సంపద

శ్యాం గారు నమస్తే
                          అబ్బో ,అబ్బో అని అబ్బుర పరచే అబ్బూరి వారి గాన మాధుర్యాన్ని గ్రోలే అరుదైన అదృష్టాన్ని కల్గించారు .ధన్య వాదాలు .మీరు నెట్ లో పరిచయం అయిన తొలి రోజుల్లో నే మిమ్మల్ని మొట్ట మొదటిగా అడిగింది అబ్బూరి వారి రికార్డులు సంపాదించి నెట్ లో పెట్టమని .ఇన్ని నెలలకు యెంత తపన ,శ్రమా పడి సంపాదించి అందించి నందుకు విని తరించే భాగ్యం కల్గించారు .1950 -56  మధ్యలో మా వుయ్యురుకు అయిదు కిలోమీటర్ల దూరం లో వున్న తొట్లవల్లూరు లో అబ్బూరి కురుక్షేత్ర నాటకం చూశాను .రాత్రి పడి గంటలకు ప్రారంభమై తెల్ల వారు ఝామున మూడింటి దాకా సాగిన నాటకం .అబ్బూరి ని మొదటి సారి ,చివరి సారి చూసింది అప్పుడే .అప్పటి నుంచే ఒక రక మైన ఆరాధనా భావం ఏర్పడింది .అప్పటి నావయస్సు పదిహేను మాత్రమే .ఒన్స్ మోర్ అని అడిగితె మళ్ళీ అదే పద్యాన్ని రాగాన్ని అదే స్త్హయిలో పాడే అరుదైన గాయకుడు వర ప్రసాద్ నిజంగా తెలుగు పద్య నాటకానికి అబ్బూరి వర ప్రసాడుడే .చెడు అలవాట్లతో అతి చిన్న తనం లోనే పోయాడు .వుయ్యూరు కు దగ్గర పెనమ కూరు అతని జన్మ స్థలం అక్కడే భోజరాజీవం కావ్యం రాసిన అనంతా మాత్యుడు కూడా జన్మించాడు .అబ్బూరి  విజయవాడ లో మా దూరపు బంధువు చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు అనే గొప్ప వకీలు గారింటికి తరచూ వస్తు వుండే వాడని ఆయన నాతొ చెప్పారు వారింటికి చలం ,మునిమాణిక్యం ,విశ్వనాధ జొన్నలగడ్డ ,గూడూరి నమశ్శివాయ మొదలైన ప్రముఖులు వస్తుందే వారు .ఆయన కు సాహిత్యం మీద మంచి పట్టు వుండేది ఎన్నో సార్లు ఆబ్బురిని వ్యసనాలను వదిలిన్చుకోమని చిలక్కి చెప్పినట్లు చెప్పారట అలాగే అనే వాడట కాని మళ్ళీ మామూలేనట. గొప్ప గాయకుడు అలా చెడి పోయినందుకు బాధ గా ఉండేదని పట్టాభి రామయ్య గారు బాధ పడ్డారు .విధి లిఖితం అని సర్దుకు పోవాలేమో . నేను 1982 – 86  మధ్య కాలం లో పెనమ కూరు హై స్కూల్  లో physical సైన్సు టీచర్ గా పనిచేసినపుడు వర ప్రసాద్ అనే ఒక దళిత విద్యార్ధి ఎనిమిదో తరగతి చదువు తూందే వాడు అతను పద్యం పాడితే అపర అబ్బూరి లాగా పాడేవాడు .అందుకు నేను అతన్ని అనేక సందర్భాలలో ప్రోత్స్చాహించి పాదిన్చేవాడిని highdchool లోనే కాక వుయ్యూరు కాలేజీ లో కుడా పాడి అనేక బహుమతులు పొందాడు వాళ్ల నాన్న కూడా నా శిష్యుడే వుయ్యూరు స్కూల్ లో .అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ ఆన్న దానికి ఇది సాక్షం  .      .
               కొల్లూరి           వారి నిధి నుండి రాగ నిధిని అందరికి అందజేసి ”రాగ నిధి చాల సుఖము .అబ్బూరి రాగ సన్నిధి చాల సుఖము ”అనిపించారు ధన్యోస్ములం .తరగని స్వర రాగ నిధి ,కొల్లేటి  సరస్సంత వుందని పిస్తోంది భాస్కర రావు గారి దగ్గర .మీ జంటకు రాగ నమస్సులు                 మీ దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

కృష్ణా జిల్లా సర్వ్సం గ్రంధావిష్కరణ – విజయవవాడ

1. The gentleman in the course khadi dhoti and pancha is Justice Sri Jasti Chalameshwar native of Krishna District, Chief Justice of Kerala High Court

2. The old bald man pancha and Dhoti is Sri Ilapuram Venkayya, MLC
3. The man in shirt is Sri Venkateswara Rao is GM-KCP, Vuyyuru
4. The Tall man in white dress is Prof M K D Prasad, VC, Krishna University, Machilipatnam
5. The man in white pyjama and white shirt is Sri Mandali Budha Prasad, Ex- Minister-AP Govt
6.The black man in white pyjama and shirt is Sri Guttikonda Subbarao, President, Krishna Jilla, Rachayithala Sangham
7. The heavy man in pant and shirt is Sri I Ramkumar- Publisher
8. The red colored short man is Sri D Kannababu-Deputy Supernitndent Archaelogy Department
Posted in సభలు సమావేశాలు | Leave a comment

రవి కవి కి అక్షర అర్ఘ్యం

          రవి కవి కి అక్షర అర్ఘ్యం 
రవీంద్ర నాథ్ ఠాకూర్ అంతే ముందుగా గుర్తుకొచ్చేది ”జనగణ మన ”అనే మన జాతీయ గీతం తర్వాత ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందించిన ”గీతాంజలి ”గుర్తుకొస్తుంది .ఆయన ”కాబూలి వాలా ”కదా ,నౌకా భంగం నవల చండాలిక నాటిక గుర్తుకొస్తాయి .సంగీతం నృత్యం ,సాహిత్యం ,చిత్రకళా లను ప్రకృతి ఒడిలో నేర్పే ”శాంతి నికేతన్ ”జ్ఞాపకం వస్తుంది .ఆయన ఏర్చి కూర్చిన రవీంద్ర సంగీతం మనసులో మెదుల్తుంది .ఆయన బవిరి గడ్డము ,శాంతం తో కాంతి మయమైన నేత్రద్వయం కన్పిస్తాయి .సాహిత్యం మీద ఆయనకు వున్న పట్టు ,సాహిత్య శిల్పం పై ఆయన అభిప్రాయాలు గుర్తుకొస్తాయి .ప్రేమ చంద్
కు గురువు అని తెలుస్తుంది .గాంధీజీ కి మహాత్మా అని బిరుడునిచ్చాడని , మహాత్ముడే ఆయన్ను తన గురువు గా చెప్పుకున్నాడనీ గుర్తుకొస్తుంది ఇన్ని విశేషాలు కలిగి వున్న కవి మహాకవి విశ్వ కవి రవీంద్రుడు ఆయన 150  వ జయంతి నేడు ఆంటే 07 -05 -11  న .ఆ మహానుభావుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము
                    రావీన్ద్రులు ప్రముఖ వినిక విద్వాంసులు శ్రీ తూములూరి సంగమేస్వర శాస్త్రి గారి వీణా గానాన్ని గంటల కొద్దీ వినేవారట .ఆ నాటి pitha పురం ఆస్థాన విద్వాంసులు శ్రీ శాస్త్రి గారు .శాస్త్రి గారిని తమ గురువు గా చెప్పుకున్న సంస్కారి రవీంద్రుడు .”నా హృదయాన్ని కరిగించారు ”అని ఆయన వీణా నాదాన్ని ప్రశంసించిన సంగీత మర్మజ్ఞుడు రవీంద్రుడు అలాగే శాస్త్రి గారు కూడా రవీంద్రుని పాట విని ”అది సాక్షాత్తు దేవలోకం పాటీ ”అని మెచ్చుకున్నారు .ఇద్దరు మహా మహుల సంస్కారం అది .అది అందరికి ఆదర్శం కావాలి .
                  రవీంద్రు గొప్ప చిత్ర కలా నిపుణుడు ఆయన చిత్రాలు ”అదో చేతనలోనా లో ఆనగివున్న ఆదిమ స్వరూపాలు .ఆయన చిత్ర రచన కల్పనా వాదం నుంచి వాస్తవ వాదానికి సాగింది .ఆయన దృష్టిలో ప్రతి చిన్న వస్తువు గొప్ప కల్పనా సాగరమే  ” అన్నాడు ప్రఖ్యాత చిత్రకారుడు రాచయిత,విశ్లేషకుడు సంజీవ దేవ్ .రేఖల్లో నృత్యాన్ని రంగుల్లో సంగీతాన్ని దర్శించి తిరిగి ప్రదర్సించటం ద్వారా విశ్వ చిత్ర కలా రంగం లో రవీంద్రుడు ఒక ఆరని జ్వాలా తోరణాన్ని వెలిగించాడని రవీంద్రుని చిత్ర కలా సాధన విశ్వ సౌందర్య సాధనమే నని సంజీవ దేవ్ ధృఢ విశ్వాసం .
                      విశ్వ మానవుని హృదయాన్ని అతని  ఆరాటాన్ని అక్షర రమ్యం గా తీర్చి దిద్దే కవితా గానం చేయ బట్టే రవీంద్రుడు విశ్వ కవి అయాడు విశ్వ ప్రేమామృత సందేశాన్ని అందించిన కాలా తీటా మహాకవి అని ఆచార్య బొడ్డు పల్లి పురుషోత్తం శ్లాఘించారు .విశ్వమానవ సంస్కృతీ చరిత్రలో నూతన అధ్యయ నానికే నాందీ ప్రస్తావన గావించిన గురుదేవుని ఆత్మీయత అగాధమయిందని,సత్య శివ సుందర మైనదని ఆచార్యుల వారి అభిప్రాయం .రావీన్ద్రునిది సమ ద్రుష్టి అనీ అందుకే ”విశ్వ భారతి ”కి ఆదర్శం గా ”యత్ర విశ్వం భవతి ఏక నీడం ”అన్న సూత్రాన్ని గ్రహించాడు .ఆయనది ఎల్లలు లేని చూపు అని మనకూ అర్ధం అవుతుంది .
                       ఇప్పుడు రవీంద్ర సంగీతం గురించి కొంత తెలుసుకుందాం .స్వదేశీ ,విదేశీ సంగీత సాధనా మిస్రమమే రవీంద్ర సంగీతం .ఇందులోని పాట ,ఫణితి దేసీయమైనవే వాటికి జవం జీవం తెచ్చి నునుపు దేర్చి నుడికారం తో లలిత మైన దేసీ ఫనితులతో గేయాల్ని చెవులకు ఇంపు గొలిపే టట్లు చేసానని రావీన్ద్రుడే చెప్పాడు అదొక అద్భుత ప్రక్రియ గా వంగ భూమిలో వర్ధిల్లింది ఆయన రూపకాలను ఆడకుండా పాడినా ,పాడకుండా ఆడినా సరస్సు లోంచి లాగి గట్టున పడేసిన కమలం లాగా కందిపోతుంది అని శాంతి నికేతన్ విద్యార్ధి రవీంద్రుని ప్రత్యక్ష శిష్యుడు ఆచార్య రాయ ప్రోలు సుబ్బా రావు స్పష్టం చేసారున్ .
            రవి కవిని గురించి కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణా రావు ”రవీంద్రుడు విశ్వ మోహనుడు .ఆయన సౌందర్య జ్యోతిని దర్సిమ్చాలంటే పసి పిల్లల చూపు లాంటి చూపు కావాలి .అప్పుడే ఆయన దివ్య దర్సనం అవుతుంది .ఆయన లోని కవి ,కధకుడు వేదాంతి సౌందర్య మూర్తి మనకూ కనిపిస్తారు .అతని  రూపులో ,చూపులో ,పలుకు లో పాటలో అంతా సౌందర్యమే .అదొక రస విహారం .స్త్రీ మార్దవం ,మాధుర్యం మేలవిన్చుకున్న పురుష విగ్రహం అది .శాంతం ,గాంభీర్యం వర్చస్సు madhura మంజుల రూప సంపదా ఓజస్సు ,ఠీవి రమ్య లోకాలను చూపే చిరునవ్వు మన హృదయాలకు పండుగ చేస్తాయి ”అని అనిర్వచనీయ ఆనందం తో రవీంద్ర ప్రశంస చేసారు
         రవీంద్రుని ఆరాధనా దైవం నిఖిలరసామృత  మూర్తి .అయిన ”విశ్వ మానవుడు ”.,సకల కళ్యాణ గుణ సంపన్నుడైన విశ్వ మోహన మూర్తి .ఆ విస్వమోహనుని ప్రతి రూపమే రవీంద్రుడు అని పొంగిపోయారు ముట్నూరి మహాను భావుడు .
  ఇప్పుడు రవీంద్రుని దృష్తి లో సౌందర్య ఆంటే ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసు కుందాం ”లోకం ఆంటే భయంకర సంక్షోభాలను కల్గించే తుఫానులకు పుట్టినిల్లు .ఈ తుఫానుల తీవ్రతను నాశనం చేసి పరమ శాంతిని నెలకొల్పుతుంది ”విశ్వ సౌందర్యం ”అనే విశ్వ నాదం ”
            ప్రముఖ కవులు రవి కవి ప్రశంసను ఎలా చేసారో చూద్దాంo
             ”  వో  కవితా రసాల పుమ్స్కోకిలమా -వ్యాకులమౌ -మా జాతికి నీ గీతికా మధుమాస మహోదయమ్ము” నారాయణ రెడ్డి
              ”నీవు ప్రభుని చరణమ్ముల నివేదించు గీతాంజలి -నిత్యమూ బీటేత్తిన  గుండెల పండించు రసామ్జలి ”         ”””
                     ” ఈ లోకంమొక నాకమౌనటుల నీవే చేయగా జాలె  డీ
                        హాలాహాల మాయ ప్రపంచము సుధా వ్యాప్తంము గావింతు వీ
                        వ్యాళాభీల వనమ్ము నందన వణ ప్రాయంబు గావించి ,క్రోం
                       బూలన్ నిండిన పారి జాతములతో పోమ్గింతువో సత్కవీ ”                 దాశరధి
            ”దైవము నీకు మిత్రుని విధంముగాన్ ప్రియువోలె ప్రేయసీ
             భావమునన్ ,స్వసోదరుని భాతి ,కుమారుని వోలె నవ్య రా
           జీవము రీతి ,పాన్దుదాటు ,చిత్ర విచిత్రముగా వెలింగె రా
          నీవే సమస్త విశ్వమాయి నిల్చి తి వాతాడు నీకు ఊత గా ”                          దాశరధి
                                ”జయతి రవీన్ద్రో నూతన
                                కవి లోక శిఖామనీ (sikhamanee )
                                అధునాతన బహు కవి
                                రాత్కిరనోద్గమ భూమి మార్తాన్దః ”
           ”వ్యాఖార్ధైక నిబంధనా ఖలు త్రయీ శబ్దార్ధ తాత్పర్య భాన్మూర్తి ర్లౌకిక భారతీ ,పునరియం యాతా త్రయి వర్త్మని ఏశాధ్యాత్మిక భావనా కృతి మతి ర్వాజ్మాత్ర మూర్తి ,స్వయం స్పష్టాస్పస్త త ను స్థానోతి ,నితరాం మోదా మనచ్చేతసాం ”   ఇది కవితా విశ్వనాధుడు కవి సామ్రాట్ జ్ఞాన peetha  , పురస్కార  గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారు విశ్వ కవి రవీంద్రుని కవితా వైభవాన్ని అమర భాషలో
శ్లాఘించిన విధానం  జయంతితో సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః ”అని రవి కవి కి అక్షర అర్ఘ్యం సమర్పిస్తున్నాను
                                                                      గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                      07 – 05 -11  న రవీంద్రుని 150  వ జయంతి సందర్భం గా సమర్పించిన అక్షర అర్ఘ్యం
Posted in సమయం - సందర్భం | Leave a comment

వంద వందనాలు

అందరికి సరస భారతి హార్దిక అభినందనలు .మూడు నెలల క్రితం ప్రారంభమైన సరస భారతి ఇప్పటికి వంద ఎపిసోడులు పూర్తి అయిన సందర్భం గా వీక్షకులు తమ అమూల్య అభిప్రాయాల్ని ,ఆశీస్సులను అందజేయ వలసినది గా అర్ధిస్తున్నాము .మీ ప్రోత్సాహమే మాకు స్ఫూర్తి .అందరకు మాత్రు దినోత్స్చావమ్ తో పాటు ఆది శంకరా,జయంతి  ,నృసింహ జయంతి మరియు బుద్ధ జయంతి శుభా కాంక్షలు .అక్షయ తృతీయ అందరికి అక్షయానందాన్ని కల్గించాలని ఆశిస్తూ          మీ దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Leave a comment

అధ్యాత్మిక జ్యోతి శ్రీ ఆదిశంకరులు

Posted in సమయం - సందర్భం | 2 Comments

అమ్మకోరోజు

 అమ్మకోరోజు 

                         జీవితం లో వేగం అన్నిట్నీ దాటేస్తోంది
                         అస్తారు పదం గా అమ్మను చూసుకుంటూ
                         తరించాల్సిన వాళ్ళం అమ్మకు వో రోజు  కల్పించి
                         తలుచు కుంటూ తరించామని సంబర పడుతున్నాం
                         వేగం మరీ పెరిగితే రా బోయే కాలం లో సమయం చాలక
                         అమ్మ గంట అని పెట్టుకొని గంట వాయిస్తామేమో
                         అంత సమయమూ లేక పొతే
                         ఇక అమ్మ నిమిషం ,అమ్మ సెకండు
                         గా స్మరిస్తూ బిజీ బిజీ అయి పోతామేమో
                         అమ్మ ఆంటే ఆప్యాయత ,మూర్తీభవించిన రూపం
                        అమ్మ ఆంటే త్యాగాల గని ,,ప్రేమ సాగరం
                        అమ్మ అమృతమయి ,ఆనంద దాయి
                       అమ్మ మన ముందుండి నడిపించే ప్రత్యక్ష దైవం
—                    అమ్మ ఋణం తీరనిది ,,తీర్చలేనిది
                      తీర్చాలనుకుంటే అమ్మకు అమ్మవై పుట్టు
                      అమ్మ మన పెన్నిధి ,ఆమె సన్నిధి దివ్యత్వమే
                      అమ్మ రోజు న మాత్రమే అమ్మని స్మరించి
                     ఊరుకుంటే అది క్రుతఘ్నతే తప్ప కృతజ్ఞత కాదు
                     అమ్మ ఆనందానికి ఆశ్రమం లో చేర్చటం కాదు
                    అమ్మ కనుసంననలో మెలిగి కంటికి రెప్ప లాగా కాపాడు .
                    మాతృత్వం అరుదైన వరం
                    దాన్ని అనంతం గా కాపాడి జన్మ చరితార్ధం చేసుకోవాలి

                                                                          గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | 1 Comment

ఆలోచనా లోచనం ” ఒకరి కంటే ఒకరు ధన్యులు ”

ఆలోచనా లోచనం 

                                                   ” ఒకరి కంటే ఒకరు ధన్యులు ”
         ఏదో ఒక మంచిపని చేసి జీవితం ధన్యమయిందని అనుకుంటాడు మానవుడు .తనకంటే ధన్యమైన వాడు వుండదు అనే గర్వమూ కలుగుతుంది.దాని వల్ల అజ్ఞానం ఆవరిస్తుంది .అయితె మనకంటే గొప్ప పనులు చేసి ధన్యులైన వారి గురించి తెలిస్తే మన జన్మ ధన్య మవుతుంది ఇలాంటి విషయాలన్నీ శ్రీ హరివంశ పురాణం లో ”ధన్యోపాఖ్యానం ”లో వున్నాయి .అవి తెలుసుకొని ధన్యుల మవుదాం .

                  శ్రీ కృష్ణుడు  సముద్రం మధ్యలో నిర్మించిన ద్వారకానగరం గురించి పాండవ ,కౌరవులు విన్నారు .ఆ నగర వైభవాన్ని చూడాలని వువ్విల్లురారు ..ధృతరాష్ట్రుడు ,కౌరవులు ,పాండవులు మొదలయిన వారు ,ఇతర దేశ రాజులు ,బంధువులు అంతా ద్వారకకు వచ్చారు .అతిధి మర్యాదలు తెలిసిన శ్రీ కృష్ణుడు యాదవ ప్రముఖు లందరితో కలిసి ద్వారకకు వెలుపల చేరాడు వారినందర్నీ ఆహ్వానించ టానికి .అందర్నీ ఉచిత ఆసనాలపై కూర్చో బెట్టాడు .అప్పుడు అనుకోకుండా పెద్ద గాలి మెరుపులు పిడుగులు వచ్చాయి .నారద మహర్షి కూడా సభలో వున్నాడు .శ్రీక్రిషుని తో సమానులేవారు లేరని ఆరాధ్య్దని ధన్యడనీ నారదుడు స్తుతించాడు .శ్రీ కృష్ణుడు నవ్వి ”దక్షిణ ల చేతనే నేను ఆశ్చర్యం కలిగించి ధన్య్దనయ్యాను ”అన్నాడునర్మ గర్భం గా .ఈ సంగతి నారదునికి తప్ప ఇమిగిలిన వారికి అర్ధం కాలేదు .అంతా శ్రీ కృష్ణుని మాటల లోని విషయం ఏమిటో తెలుసుకోవాలని వుబలాట పడ్డారు .అప్పుడు స్వామి అనుమతి తో నారదుడు అందులో వున్న ,తనకు తెలిసిన విషయాలను వారికి వివరించాడు .తాను శ్రీకృష్ణుని మహిమలను ఎలా తెలుసు కున్నది వివరించాడు .”ఒక సారి నేను గంగా నడి ఒడ్డున వుండి మూడు సార్లు స్నానం చేసే వ్రతం చేస్తున్నాను ,.ఒక నాడు ఉదయం రెండు తలలు ,నాలుగు కాళ్ళు ,రెండు క్రోసుల పొడవు క్రోసు వెడల్పు వున తాబేలుని చూసా .ఆశ్చర్య పడి ,దాని శరీరం ఆశ్చర్యంగా ఉందనీ ,ధన్యరాలవనీ చెప్పాను .అప్పుడా తాబేలు మానవ భాషలో నాలో ఆశ్చర్యం ఏముంది ధన్యుణ్ణి కావ తానికీ ,?నదీ రూపం లో వున్న గంగా నది ధన్యురాలు ఆశ్చర్య కరమైనది కూడాన్నది .ఆ నదిలో తనలాంటి లెక్క లేనన్ని జీవులు సంచరిస్తున్నాయి అంది నారదుడు  గంగను చేరి ఆమె గొప్ప తనాన్ని శ్లాఘిస్తూ ,ముని ఆశ్రమాలను కాపాడుతూ ప్రవహిస్తూ సముద్రం లో కలవటం వల్ల సముద్రం ఆశ్చర్యకరమైనదీ ధన్యమైనది అని అన్నది .దానిలో లక్షల కొలది నదులు కలుస్తున్నాయని చెప్పింది .నారదుడు అమితాస్చర్యం తో సముద్రం దగ్గరకు వెళ్ళాడు .నీటికి గనివి ,పవిత్రురాలవు ,నదీ భర్తవు  కనుక ధన్యత ఆశ్చర్యం నీలో వున్నాయి అన్నాడు .అప్పుడు సముద్రం మానవ  స్వరంతో తనకంటే భూమి ధన్యమైనదనీ ఆశ్చర్య పూరితమైనదనీ తాను కూడా భూమి మీదే ఉంటున్నాను కదా అన్నాడు .ఆ తర్వాత భూమిని అర్ధించి ఆమె చాలా వోర్పు కలదని
స్వర్గం లోని జనులకు కూడా భూమి వల్లనే పనులన్నీ పూర్తి అవుతున్నాయనీ కనుక భూమియే ధన్య ఆశ్చర్యమయి అన్నాడు .దీన్ని తేలిగ్గా తీసుకున్న భూమి ఆ/నాదేముంది ?పర్వతాలాడే ధన్యత అంది .పర్వతాన్ని పొగడి ధన్యుడవు అని చెబితే అదీ ఒప్పుకోలేదు .అన్ని కలిసి నారదునికి ధర్మ సూక్ష్మం తెలియ జేసాయి .”నారదా /మేమెవరమూ ధన్యులం కాము .మాలో ఆశ్చర్య పరచే లక్షణాలేవీ లేవు పోరాబాడ్డవు .ఒక్క ప్రజాపతి యైన బ్రహ్మ దేవుడు తప్ప ఎవ్వరూ ధన్యులు కాదు అని స్పష్టం గా చెప్పాయి .బ్రహ్మకు నమస్కరించిన నారదుని తో  ఆయన ”నాకు ఆధార మైనవి నాలుగు వేదాలు నేను వాటికి ఆధారం నా కంటే వేదాలు ,యజ్ఞాలు గొప్పవి ”అన్నాడు .చివరకు అవి కూడా విష్ణువు ఒక్కడే ఆశ్చర్యమయుడు ,ధన్యుడు ఆయనే మాకు ఆధారం ”అన్నాయి .అయోమయం లో పడిన నారదునికి అసలు రహస్యం తెలియ లేదు .వేదాల మాట విని భగవంతుని వెతుకుతూ భూలోకం చేరానని ఇక్కడ ఈ సభలో శ్రీ కృష్ణ పరమాత్మ దివ్య విభూతిని చూశాననీ అందుకే ఆయన్ను ఆశ్చర్య మయుడు ధన్యుడు అని అన్నాను ”అని సవిస్తరం గా తెలియ జేసి సభా సదుల సందేహాలు తీర్చాడు .కనుక మనకూకనిపించేవారి కంటే   టే కనిపించని విస్వమయుడైన పరమాత్మయే అత్యాశ్చర్యకర మయిన వాడు ధన్యుడు అని ఈ ”ధన్యో పాఖ్యానం ”తెలియ జేస్తోంది
గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                                ఆలోచనా లోచనం శీర్షిక న ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 02 – 05 -11 న ప్రసారమయింది .
Posted in రేడియో లో | Tagged | Leave a comment

సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యూరు – హనుమత్ జయంతి ఆహ్వానం

సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యూరు – హనుమత్ జయంతి ఆహ్వానం

మే 25,26,27

Posted in సభలు సమావేశాలు | 1 Comment

శ్రీ శ్రీ జయంతి కానుక

 శ్రీ శ్రీ జయంతి కానుక 
                                                 ( ఒక గీతం విశ్లేషణ )
                                                      ఆహ్ 
                       ”నిప్పులు చిమ్ముకుంటూ
                        నింగికి నేనెగిరి పొతే
                       నిబిడాశ్చర్యం తో వీరు
                       నెత్తురు కక్కు కుంటూ
                      నెలకు నే రాలి పొతే
                      నిర్దాక్షిణ్యం గా ”వీరే’.
ఇది శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్తానం లోని ఆరు చిన్న పాదాల చిన్న వచన పద్యం .శీర్షిక అతి క్లుప్తం గా ఏకాక్షారమే …అదీ ఆశ్చర్యాన్ని ప్రకటించే అక్షరం ”ఆహ్”.
                        ఇందులో కవి అనుభవించిన రెండు విభిన్న దశలున్నాయి .ఒకటి ఉత్థానం ఆంటే పైకి ఎదగటం .రెండోది పతనం ఆంటే కిందకు జారటం .ఆరు పాదాల మొదటి అక్షరాలూ ”న” తో ప్రారంభం అవటం విశేషం .
                      మొదటి మూడు పాదాలు మొదటి దశను సూచిస్తాయి .ఒక వ్యక్తీ అందరినీ ఎదిరించి బంధనాలు అన్నీ తెన్చ్కుని ,అన్ని సవాళ్ళనూ ,అడ్డంకుల్ని తొలగించుకొని చాలా ప్రచండ వేగం తో ముందుకు ,మునుముందుకు ఆంటే అభ్యుదయం వైపుకు దూసుకు పోతున్నాడు .ఎవరు ఎదగానంత స్థితికి ,దుర్నిరీక్షం గా అతి త్వరలో ఎదిగి పొతే మెచ్చు కోలేక పోయింది చుట్టూ వున్న సభ్య సమాజం .పైగా ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకుంది .ఆంటే తాను అదృష్ట వంతుడై ,మహా గౌరవం పొందినపుడు తన వాళ్ళే ఆంటే తన చుట్టూ వున్న వాళ్ళే ,సమాజమే ఆదరించక పోగా మహాస్చార్యాన్ని ప్రకటించింది .ఇదీ మానవ సమాజ స్థితి .దానికి అద్దం పట్టిన కవిత ఇది .లోకం బాధ తన బాధ గా చెప్పటం శ్రీ శ్రీ ప్రత్యేకత కదా /
                    చివరి మూడు పాదాలు రెండవ దశనుటే ఆంటే పతనాన్ని సూచిస్తోంది .అదృష్టం జారి పోయింది దురదృష్టం కాటు వేసింది .పరమ పద సోపానపదం లో పాము కాటు తిని కిందికి జారిన పరిస్థితి .యెంత ఎత్తుకు ఎదిగాడో అంతకంతకు దిగ జారాడు -దురదృష్ట సర్ప దస్టుడై .నింగినుంచి అధఃపాతాళానికి పది  పోయాడు .అంత త్వర లోనే నెల కూలాడు .తోక చుక్కలా ఒక వెలుగు వెలిగి ఆరిపోయాడు .ఇప్పుడు కూడా సానుభూతి చూపించాల్సినాక్అదే లోకం( ఆంటే అదే తన వారు) అతన్ని వెక్కిరించింది యీసదించింది ,హింసించింది .పైగా చాల నీచం గా చూసింది ఈ కవిత అంతా ధ్వని ప్రధానమైనది
                             ప్రత్యేకతలు 
       మొదటి మూడు పాదాలలో ని ”న”కారారంభం అతని ఎదుగు దల ,అందులోని తీవ్రత ను ధ్వనిమ్పజేస్తుంది .చివరి మూడు పాదాలలోని ”న”కారారంభం పై స్థితి నుంచి సమాన స్థితి లో పొందిన పతన దశను వ్యంగ్యం చేస్తుంది .ఇంతటి అర్ధాన్ని ,భావాన్ని ”వీరే”అనే పదం లోని” ఏ”అనే చిన్న పొల్లు తో సాధించాడని మహా కవి శ్రీ శ్రీ ని మెచ్చుకున్నారు విశ్లేషకులు .ఇది అతని కవితా మేధస్సుకు అద్దం మానవ సమాజ సహజ లక్షణాన్ని చాలా శక్తి వంతం గా చెప్పిన కవిత ఇది .అయితె వాచ్యం గా చెప్పకుండా సూచ్యం గా చెప్పి ఘనుడు అనిపించుకున్నాడు శ్రీ శ్రీ .”ప్రపంచం అంతటి ధ్వని ”ని చిన్న పొల్లు ”ఏ” తో సాధించిన గొప్ప  కవి గా విమర్శకులు మహా కవిని భావించారు .చెప్ప దలచు కున్న విషయాన్ని సూటిగా కాకుండా అనేక రెట్ల తీవ్రతతో చెప్ప గలిగాడు .
                  అలంకార భాషలో చెప్పాలంటే దీన్ని ”అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని  ”అన్నారు ఆలంకారికులు . ఆంటే ముఖ్యార్ధం పూర్తి  కాక పోయినా l
ముఖ్యార్ధం గానే భావించ బడటం దీని ప్రత్యేకత .అయితె విప్లవ కవి కవిత్వం లో ఇవి వెతకటం kaarl maarx కు జందెం వేయటం అవుతుందేమో .అయినా కవితా సామర్ధ్యంకొలవటానికి   ప్రమాణం కావాలి కదా ?చిన్న పద్యం లో అద్భుత భావాన్ని వ్యంజనం గా ధ్వనింప జేసిన మహా శబ్ద శిల్పీ ,శబ్ద స్రస్ష్ట మహా కవి శ్రీ శ్రీ ..brevity ఆంటే సంక్షిప్తతకు అద్దం పట్టిన నాటి చిన్ని కవిత నేటి మినీ కవితకు మార్గదర్సాక మయింది  హట్స్ ఆఫ్ శ్రీ శ్రీ  .
                                                     గబ్బిట దుర్గా ప్రసాద్
                             ఈ వ్యాసం పుట్టుక    15 – 10 -1995
Posted in సమయం - సందర్భం | Leave a comment

విశ్వనాధ విరాట్ స్వరూపం

శ్యాం గారికి

నా ఆరాధ్య కవి ,కవి సామ్రాట్ ,విశ్వనాధ వారి కల్ప వృక్ష రహస్యాలను ప్రసిద్ధులు ,విశ్వనాధ కవిత్వాన్ని తత్త్వాన్ని అవపోసన పట్టిన విద్వాంసులు ,పండితులు ,విశ్లేషకులు అయిన వారి
స్వంత స్వరాలలో విన్పించిన విశ్వనాధ కవితా వైభవాన్నీ ,విశ్వరూపాన్ని అద్భుతం గా ఆవిష్కరించి అందజేసిన మీకు ,పతంజలి గారికి అభినందన శతం .అరుదైన అలభ్యమైన కవితా సంపదను అందించారు భేష్ . ఇదిభద్రం  , గా దాచుకోవాల్సిన పెన్నిధి .1956 -1960 కాలంలో నేను బెజవాడ srr  కాలేజీ లో ఇంటర్ ,డిగ్రీ చదివిన రోజుల్లో విశ్వనాధ అక్కడ తెలుగు లెక్చరర్ గా పనిచేసారు .మా క్లాస్సేస్ కు కూడా వచ్చారు ఆయన్ను స్వయంగా దర్శించి ,ఆయన సిష్యుదానయిన అదృష్టం నాది .ఎన్నో సమావేశాల్లో దర్శించాను .కవి సమ్మేళనాల్లో చూసాను .మా నాన్న గారు వారిని వుయ్యూరు కు ఆహ్వానించి ఒక వారం రోజులు వారి తోనే కల్ప వృక్ష రహస్యాలను చెప్పించారు ..నేను కూడా ప్రముఖుల చేత వారి ఏకవీర ,వేయిపడగలు ,కల్పవృక్షం ల పై వుపన్యాసాలిప్పించి ధన్యుణ్ణి అయాను .ఆయన ఆంటే ఒక పులకరింత ఒక గౌరవం ఒక ఆరాధన నాకు .నా ఆనందానికి అవధులు లేనట్లుంది అవి వింటుంటే అది వింటూనే మెయిల్ రాస్తున్నాను ”.తెలుగు వారి గోల్డ్ నిబ్బు”,అని శ్రీ శ్రీ చేత ప్రసంసలు పొందారు .మరొక్క సారి ధన్య వాదాలు .

                         ఇంకో మాట   జువ్వాది గౌతమ రావు గారు అని కరీం నగర్ వాసి వున్నారు విశ్వనాధకు అంతే వాసి అచ్చం గా విశ్వనాధ పద్యం యెంత గొప్పగా ,అర్ధ స్ఫూర్తితో పాడే వారో జువ్వాది వారు అచ్చంగా అలాగే ,అదే గొంతుకతో పాడేవారు వారు ప్రతి సంవత్చరం కరీం నగర్ లో తన స్వంత ఇంట్లో పుట్టిన రోజు నాడు అందర్నీ ఆహ్వానించి కల్ప వృక్షం పద్యాలు పాడి వినిపించేవారు .ఒక సారి విజయవాడ లో వారు ఆ పద్యాల్ని గానం చేస్తుండగా వినే అదృష్టం కలిగింది బహుసా రామ మోహన లైబ్రరీ లో అనుకుంటా .పావని శాస్త్రి ,,విశాలాంధ్ర రాఘవా చారి కోటగిరి వంటి ప్రముఖులు వున్నారు ఆ సమావేశం లో .రాఘవా చారి గారు అద్భుతమైన అనానందాను భూతిని వ్యక్తం చేసారు అప్పుడు నేను ఏమండీ మీరు కమ్యునిస్టులు కదా కల్ప వృక్షమ్ మీద ఇంత అభిమానం ఎలా వచ్చింది? అని రాఘవా చారి గారిని ప్రశ్నించాను .వారు మనసుల్ని దోచే ఏ కవిత్వమైనా ఆరాధనీయమే ,విస్వనాధలో కాలాతీతమైన మార్గ దర్శక మైన కవిత్వం వుంది .ఇది పార్టీ సిద్ధాంతానికి అవరోధం కాదు అన్నారు ఇవే మాటలు కాక పోవచ్చు కాని భావం అదే .అలా అందర్నీ ఆకర్షించిన మహా కవి విశ్వ నాద ఇంతకీ ఇదంతా ఎందుకంటె జువ్వాడి వారి గొంతుకతో పాడిన విశ్వ నాద పద్యాలు casettes దొరుకు తాఎమోప్రయత్నించి  సంపాదించి అందించండి పావని శాస్త్రి పాడినవి కాసేట్టేస్ గా వచ్చాయి .నేను కొన్నాను ఒక భాగమే వచ్చినట్లు జ్ఞాపకం .ఈయనా అచ్చం గా తండ్రి గారి లాగానే పద్యాలు పాడి తండ్రి ఋణం తీర్చుకున్నారు .  భారతీయ ప్రాణ శక్తినీ ,జీవదారను వేద శాస్త్ర పరంపరను అవిచ్చిన్నం గా ప్రవహించాలని భావించి తన కవిత్వం రచనల ద్వారా వాటి వ్యాప్తికి కృషి చేసిన మహాను భావుడు విశ్వనాధ .శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .గొప్ప అను భూతిని  కల్గించిన పతంజలి గారికీ మీకు నమస్సులతో
సెలవు మీ దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

జన శ్రీ శ్రీ

       జన శ్రీ శ్రీ 
     అతని జీవితం ”అనంతం ”
    అతని ద్రుష్టి అభ్యుదయం
    కవితకు అద్భుత నిర్వచనం
    ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చిన కవి సోమ యాజీ
    సిప్రాలి అయినా సిరి సిరి మువ్వ అయినా
    ఖడ్గ సృష్టి అయినా పదబంధ ప్రహేళిక అయినా
   అతని మార్కు కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది
   శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించిన మాన వీయ మూర్తి
   అతని మాటల్లో కోటి జల పాతాలు ,శతకోటి సముద్ర తరంగాలు వున్నాయి
   అతని కవిత హిమాలయం అంత ఉన్నతం ,సముద్రమంత గంభీరం
   అతని మాట ,పాట ప్రణవం ,ప్రళయం
  జన హృదయం లో తిష్ట వేసిన  ప్రజా కవి
  అతడే మహా ప్రస్తాన కవి
  మరో ప్రపంచ కవి  సామాన్య జనకవి శ్రీ శ్రీ .
                                                               గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in కవితలు | Leave a comment

స్వర్ణ యుగం

                                               స్వర్ణ యుగం 
    తులం బంగారమైనా  కొనాలట అక్షయ తృతీయ నాడు .
    కొంటె కొంగు బంగారం ఇల్లు సింగారం ట
   అక్షయం గా జీవితం ఉంటుందట
   అన్నారు ఆ నాడు మరి నేడో
   చిన్నం కొనాలంటే కన్నం వెయ్యాల్సిన పరిస్థితి
   డబ్బు దాచి బంగారం కొనేవారు ఆ నాడు
   డబ్బు దోచి తేనే బంగారం కొనగాలగటం నేడు
   నీ ఇల్లు  బంగారం కానూ అనేవారు ఆ నాడు
   ఇప్పుడు ఆ మాట అనటానికి ఎన్ని గుండె లుండాలి ?
   బంగారం లేక కాదు అది మూలుగుతోంది ,బాబాల మందిరాలలో
   దాదా ల హవేలీలలో ,టెర్రరిస్టుల ,హంతకుల మారు మూల గదుల్లో
   బంగారక్కతో పోటీ పడింది  వెండి చెల్లెలు
  మించి ముంచినా ఆశ్చర్యం లేదు
  బంగారం కంటే  ప్లాటినం ,ఇరిడియం విలు వైనవి ఒక నాడు
  మరిప్పుడు బంగారం ,వెండి ముందు వెల వెల బోతున్నాయి అవి పాపం
  వస్తువుల ధరలతో పాటు అన్నీ పైపైకే
 ఒక్క మానవ జీవితం విలువ మటుక్కు అధోగతే
 అయితేనేమి మనల్ని అందర్నీ ”బంగారూ ”
 అని స్వర్ణ మయం చేసారు సత్యసాయి బాబా
 ఆ ప్రేమ సత్యం ధర్మం ముందు బంగారం దిగ దుడుపని
 నడత నడవడి మంచితనం మానవతే అసలైన బంగారమని
 తెలిసి మెలగితే మనజీవితాలు స్వర్గమయం స్వర్ణ మయం
 అప్పుడే మనది అవుతుంది స్వర్ణ యుగం
                                                                                          గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in కవితలు | 2 Comments

” ఆలోచనా లోచనం ” ” వినదగు నెవ్వరు చెప్పిన i”

      ”  ఆలోచనా లోచనం ”
                                                     ”  వినదగు నెవ్వరు చెప్పిన i” 
                                                     ఆలోచనా లోచనం శీర్షిక లో ఇది ఆకాశ వాణి విజయ వాడకేంద్రం నుండి 26 – 04 – 11 న ప్రసారమైంది

               రాచ కార్యాలలో తలమునకలైన రాజు కొన్ని సందర్భాలలో స్వార్ధం కోసం కొన్ని నిర్ణయాలు చేస్తాడు .అవి అతనికి మంచి గానే కన్పిస్తాయి .ఆ నిర్ణయం వల్ల రాజుకు ,రాజ్యానికి ప్రమాదకరం అయితె మంత్రి పురోహితుడు తప్పకుండా రాజుకు హితబోధ చేసి ఆ చెడు మార్గం నుంచి మల్లించాలి .రాజుకు భయపడి చెప్పక పొతే రాజ్య ద్రోహమే అవుతుంది .ఒక్కొక్క సారి రాజు దగ్గర పని చేసే కింకరులు కూడా తమ వంతు ధర్మం గా ధర్మ బోధ చేసి ఆ పాప కార్యం నుంచి రాజు మనసు మల్లించాలి వీరినేవరినీ లెక్క చేయకుండా ఆ రాజు ప్రవర్తిస్తే రామాయణం లోని రావణునికి పట్టిన గతే పడుతుంది .సీతాపహరణ సమయం లో మారీచునికి ,రావణునికి జరిగిన సంవాదం అందరు తెలుసుకో దగినదే .
                  రావణుడు సీతాదేవిని చేరబట్టతానికి మారీచుని సాయం కోరి వచ్చాడు .తన సోదరి శూర్పణఖ ముక్కు ,చెవులు రామ లక్ష్మణులు కోసారనీ ,రాముడికి తనపై సత్రత్వం లేకపోయినా యుద్ధానికి వచ్చాడని ,తన సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రామ సతి సీతను జనస్థానం నుంచి అపహరించటానికి సహాయం చేయమనీ కోరాడు .బంగారు జింక వేషం వేసుకొని వారిని ఆకర్షించాలని ఉపాయము చెప్పాడు .సీతను అపహరిస్తే రాముని బాల పరాక్రమాలు తగ్గి విరహం తో క్రుసిస్తాడని ,అప్పుడు అతన్ని వోదించటం తనకు తేలిక అవుతుందనీ ముందే సిద్ధం చేసుకుని వచ్చిన ప్రణాళిక లోని ఆలోచనలను బయట పెట్టాడు .రావణ దుష్టపన్నాగం తెలిసిన మారీచుడు రావణుడు తనను పావుగా వాడు కుంటున్నాడని గ్రహించాడు .ప్రభు సేవ ముఖ్యమే అయినా దారి తప్పుతుంటే వుపెక్షించటం మంచిది కాదని ధైర్యం తో సూటిగా ,నిష్కర్ష గా ”రాజా/రాజుకు హితము చెప్పే వారి కంటే అప్రియాలు చెప్పే వారే ఎక్కువగా వుంటారు .మంచిమాటలు మొదట అహితం గా వున్నా ,దాని వల్ల మేలే జరుగు తుంది .రాజు గా నీ కర్తవ్యమ్ సరిగా లేదు .సరైన గూద చారులు నీకు లేరు .చపల బుద్ధి తో తప్పుడు నిర్ణయాలు చేయ వద్దు .”అన్నాడు .రావణుడు అతని మాటలను పెడ చెవిన పెట్టాడు .మారీచుడు తన స్వీయ అనుభవాన్ని వివరించి చెప్పాడు .రాముడు పన్నెండు సంవత్చరాల వయసు లోనే విశ్వామిత్ర మహర్షి యజ్న సంరక్షననం చేసాడని బాలుడే కదా అన్న గర్వం తో తాను యాగ ధ్వంసం చేయటానికి i ప్రయత్నించాననీ రామ బాణం తో తాను వంద యోజనాల దూరం లో వున్న సముద్రం లో పడిపోయానని చివరికి లంక చేరు కున్నాననీ ,వివరించాడు .పాము తో స్నేహం చేసే చేపలు కూడా గరుత్మంతునికి ఆహారం అయినట్లే పుణ్యాత్ములు కూడా పాపులవల్ల నసిస్తారని మనవి చేసాడు .రాక్షస కులం సర్వ నాశనం అవుతుందని హెచ్చరించాడు .తన రెండవ అనుభవం చెబితే నైనా రావణుడు మారు తాదేమో నని అదీ చెప్పాడు .దండకారణ్యం లో రాముడు వణ వాసం చేస్తుండగా తాను జింక రూపం ధరించి రాక్షస సాయం తో మునులను బాధించాననీ ,ఒక సారి తాను మృగ రూపం లో శ్రీరాముని పై ఒక్క సారిగా దాడి చేశాననీ ,రాముడు కోపం తో మూడు బాణాలు సంధించి మెరుపుల్లా వదిలాదనీ శ్రీరామ తత్త్వం తనకు ముందే తెలుసు కనుక పారి పోయానని మిగిలిన రాక్షసులు రామ బానాగ్నిలో మాది మసి అయ్యారని తెలియ జేశాడు .అప్పటి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ ఆశ్రమం లో తపస్సు ,యోగ సాధనా చేస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్నాననీ ,చెప్పాడు .స్వప్నం లో కుడా ర అనే అక్షరం వినిపిస్తే రాముడే కనిపిస్తున్నాదనీ అన్నాడు .సుర్పానఖ విషయం లో రాముని తప్పు లేదనీ ఆత్మ రక్షణ చర్య గా దాన్ని భావించాలని సూచించాడు .
                        ఇవేవీ వినిపించుకోకుండా రావణ ప్రభువు ”నేను ప్రభువును .నాకు ఇష్టం లేని మాటలు చెప్పావు .సేవకుడు అలా చెప్పరాదు .నేను అడిగితేనే చెప్పాలి .రాజుకు ఇష్టం లేనిదైనా సుతిమెత్తగా ,మంచి మాటలతో చెప్పాలి .నువ్వు చాలా కర్కాసం గా చెప్పావు .రాజ ధర్మం తెలియని పామరుడివి .నీ దగ్గరకు వచ్చానని రాజు నైనా గౌరవించకుండా దుర్భాష లాదావు .నేను చెప్పినట్లు చేయటమే నీ కర్తవ్యమ్ .ఇది రాజాజ్న ”అని తీవ్రం గా మారీచుడిని భయ పెట్టాడురావణుడు రాజ దర్పంతో .చెప్పిన పని చేయక పొతే చంపేస్తానని బెదిరించాడు కుడా .మారీచుడు భయ పద లేదు .భ్రుత్యునిగా చివరి ప్రయత్నం గా ”లోక రీతికి విరుద్ధం గా ప్రవర్తిస్తున్నావు రాజా /నిన్ను నివారించలేని మంత్రులు వృధా .వారంతా మనస్పూర్తిగా నీ మనస్సు మార్చే ప్రయత్నం చేసినట్లు లేదు .రాజు సద్బుద్ధి తో ప్రవర్తిస్తే ఆ కీర్తి మంత్రులకు దక్కు తుంది .రాజు చెడ్డ వాడైతే మంత్రులకు అందులో భాగం వుంటుంది .ప్రజావ్యతిరేకి ,ఇంద్రియ జయం లేని రాజు పాలనార్హుడు కాదు .నా నాశనం దైవికం .నువ్వు బుద్ధిపూర్వకంగగా రాక్షస సర్వ నాశనం చేయబోతున్నావు .చావు దగ్గర పడితే మనుష్యులు శవాలు అవుతారు .అందుకే ఆ సమయం లో చెప్పిన మంచి మాటలు వినిపించు కోరు .నువ్వు చెప్పినట్లు చెయ్యక పొతే నీ చేతిలో నాకు చావు తప్పదు .చేస్తే శ్రీరాముని చేతిలో చస్తాను .మోక్షం పొందుతాను .”అని చివరి మాటగా చెప్పాడు .ఆయువు తీరే సమయం లో దీప గంధాన్ని వాసనచూడలేరనీ  మిత్ర వాక్యం వినరనీ  .,అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరనీ పెద్దలు అంటారు .అదే రావణుని విషయం లో జరిగి తన రాక్షస వంశ సర్వ  నాశనానికీ  కారణ భూతుడైనాడు .
                                                                                                  గబ్బిట దుర్గాప్రసాద్
Posted in రేడియో లో | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా సర్వస్వం గ్రంధం ఆవిష్కరణ మే 7 న విజయవాడ

నమస్తే

లో జరిగే ”కృష్ణా జిల్లా సర్వస్వం ”అనే బృహత్ గ్రంధం ఆవిష్కరణ జరుగు తుంది .ఆ పుస్తకం లో  నేను ”కృష్ణ జిల్లా సంస్థానాలు ,సాహిత్య సేవ ”అనే విషయం మీద పరిశోధనాత్మక బృహత్ వ్యాసం రాసాను .8va  తేదిన బందరులో ఆంద్ర సారస్వత సమితి వారి పురస్కారం నాకు అందజేస్తున్నారు .మీరంత నా వాళ్ళు కనుక మీకు   teliya jestunnaanu  మీ durga
prasad

Posted in సమయం - సందర్భం | 1 Comment

పెదముత్తేవి కృష్ణా జిల్లా ఓరియంటల్ స్కూల్ వార్షికోత్సవ సభ

Posted in సభలు సమావేశాలు | Leave a comment

కొల్లేరు -అవినీతి వ్యాసాలు

రవీంద్ర నాథ్ గారు నమస్తే పంపిన అవినీతి పై ఆర్టికల్ ,ఇవాల్టి జ్యోతి లోని కొల్లేరు వ్యాసం రెండు చదివాను .దొంగ ఎక్కడో వుండదు .మనమధ్యే   వుంటాడు .వాడు మనలాగే దొంగ అని కేకలు పెట్టి తప్పించుకుంటాడు న.వ్యవస్థ భ్రస్టు పట్టింది కొత్త కాలు,కీలు పెట్టాల్సిందే overhaul చేసే పరిస్థితి రావాలి హజారే తో ఎవరో ఒకరిద్దరు అవినీతి పరులు కలిసి నంత మాత్రాన వారి మీదే మీడియా ద్రుష్టి పెట్టి అసలు సమస్యను ఆయన వ్యక్తిత్వాని మరిచింది .ఆ మాత కొస్తే గాంధి గారి స్వతంత్ర పోరాటం లో ఆయనా వెంట వున్న వాళ్ళందరూ సచ్చీలురేన ?బడా పారిశ్రామిక వేత్తలు లేరా ?అంతమాత్రాన ఉద్యమం నీళ్ళు కారిండా .లేని పోనీ వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం ,గంపల కొద్ది న్యూస్ కుమ్మరించటం మానియా అయింది ఇందు లోంచి బయట పడాలి కొనే ,అమ్మే ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి రావాల్సిన tax  అక్కడి కక్కడే వసూలు అవ్వాలి ఇది నాకు తెలిసినంత వరకు నేను మూడు సార్లు అమెరికా వెళ్లి చూసినా మేరకు అక్కడ తక్ష్ సూటిగా ప్రభుత్వానికి చేరుతుంది బిల్లు లేకుండా వస్తు విక్రయం జరగదు అందుకే తక్ష్ రూపం లో వాళ్ళు చాల లాభ పడుతున్నారు .మనకున్న చట్టాలన్నీ లోసుగులే చెయ్యి తడిపితే అంతా హుష్ కాకి .ప్రభుత్వానికి బొక్క అధికార్ల కు పక్క పండగ .దీనిపై స్పష్టమైన విధానం వుండాలి .ఎవరి డబ్బో దోచి వేరెవరికో పెట్టి సంఘ సేవ పేరు చెప్పి ,బడా బాబుళను ఆడుకొని ఎంగిలి మెతుకులు మిగిలిన వారికి విదిల్చి పోజు కొత్తటటం గత ఆరేడు ఏళ్ళుగా విచ్చల విడి అయింది .అదేమని ప్రస్నిన్చినవాడు ప్రగతి నిరోధకు దయ్యాడు ఆ భ్రమ ఇంకా వదల లేదు పార్టీలు అన్ని కుర్చుని చక్కని చర్చ చేసి దేశానికి ఏది హితం ,ఏది అహితం అని నిబంధనలు చేసుకొని ,స్వయం నియంత్రణ చేసుకోవాలి అరవైయేళ్ళు దాటి స్వాతంత్రం పొందినా మన విధానం ,జన విధానం అంటూ లేదు అమెరికా ను నెత్తికెత్తుకున్న వాళ్ళు,చైనా ,రష్యా లను మోస్తున్న వారు గానే మిగిలి పోయారు కాని మన కు ఏమి కావాలో ఆలోచి నిర్ణయాలు చేయ లేని అసమర్దుల మయాం  స్వార్ధం నారా నరాల జీర్నించింది ముద్రలు వేయటం ఫాషిన్ అయింది

          ఇక కొల్లేరు విషయానికి వస్తే అక్కడి కొంగలకు  కాళ్ళు ,రెక్కలు వున్నాయో లేదో కాని ,అక్కడి భూములకు రెక్కలు వచ్చి యెగిరి పోతున్నాయి అక్కడ రాజ కీయమే .పర్యావరణ స్పృహ నశించింది ప్రకృతి తో మానవుడు సహ గమనం చేయాలి దాని భద్రతా తనదిగా భావించాలి లేక పొతే అదే మనల్ని కబలిస్తుందన్న సత్యాన్ని అందరు గ్రహించాలి ఇది మనకు సంబంధించింది కాదు అని మనమెవరమూ తప్పించుకోరాడు విషయాలు ప్రజలకు తెలియ జెప్పాలి వాళ్ళ కు అర్ధ మాయే రీతిలో అప్పుడు కొంత అయిన చలనం వస్తుంది ప్రభుత్వాని నడిపే వారి లో చిట్టా సుద్ధి లోపించటం,చెంచ గాళ్ళ ప్రయోజనాలు కాపాడటం తో సమసి ఇంత కాలం పెరిగి పెద్దదయింది స్పృహ వస్తున్నా సమయం లో ఏదో సంక్షోభం ,అలజడి .సమస్యను పక్క దారి పట్టిస్తున్నాయి నిజాయితీ లేని నాయకుల వల్ల జరుగు తున్న అనర్ధం ఇది
 .            అందర్నీ ఆలోచిమ్పజేస్తూ స్పృహ కలిగిస్తూ ,వివరాలు అందిస్తూ ,విశ్లేషిస్తూ మీరు రాస్తున్న aartcles సమాజ హితమైనవి .నిరంతరం రాయండి జన చైతన్యం తెండి
                                                             గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

pun పసంద్

pun  పసంద్౧–

01 –   హైదరాబాద్ సాగరం లో ”యధా తధాగతుడు ”
02 -జన్మ భూమి లోనే” రాముని ఖైదు ”
03 -ఆది కవిత్వావిర్భావం ”వల్మీకం ”తోనే
04 – వేద”వ్యాసం ”లోనే వేదాంత’న్యాసం ‘
05 వోట్ల (ఔట్ల) బా (బాంబ్ )బులతోనే కట్ట కడప ఫలితం
06 – రాజ కీయ పులివిం (వెం) దుల ప్రహసనం లో జనార  ణ్యం  –
07 – క్రికెట్ లో కుడా మన వీరుల” షా –ర్జా””
08 -సిని స్టార్లకు అభీ డిల్లి దూర్ నహీ
09 -” చే ”నేతలతో చేనేత వెతలు
10 – naxalaitla క్రీడా ”వరం’ గల్లు మార్గం
11 – ధర” వరులపై ” మన్మోహనాస్త్రం .
12 -పులులకు” ప్రేమ దాసు ” ని పై భక్తీ
13 -హాస్యం వెర్రిలో   ”జంధ్యాలు ” తెమ్పుకుంటున్న సినిమా లోకం
14 -మానవత లోనే రాణిస్తుంది నవత
15 -” వే” గుంట కవిత్వం లో” మో”’మెల్లా చిందులే
 16 -వేయి పడగల క్రీడా వినోది ”విశ్వనాధుడే ” ”
17 – ”సం ”పన్నుల నేఁ చేస్తాయి పన్నులు ?అవి అనాధ ఆపన్నుల పాటి ”పిన్నులు ‘
18 -maarx జుట్టుకు ,అరవిందుని గడ్డానికి ముడి వేసే ”శేషేంద్ర ”జాలం
19 – సినీ వాలీ కి రోజు పెరుగుతున్న”  రౌడీ ”భయం
20 -ఉగ్ర వాదుల బంధం లో రుమేనియా రాయ బారి ”రాడూ”
                                                                                                   గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                                  04 – 11 – 1991 న అప్పటి రాజకీయ సామాజిక సాహిత్య అంశాలపై స్పందించి రాసిన ,చేసిన సరదా ఫీట్లు
Posted in సమయం - సందర్భం | 1 Comment

తిక్కన పద్య సౌరభం

 తిక్కన పద్య సౌరభం
               ”శ్రీ యన గౌరి నా బరగు చెల్వకు జిత్తము పల్లవింప ,భ
                ద్రాయిత మూర్తి యై ,హరిహరంబగు రూపము దాల్చి ,విష్ణు రూ
                పాయ నమ్హస్సివాయయని పల్కెడు భక్త జనంబు ,వైదిక
                ధ్యాయితకిచ్చ   మచ్చు పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్  ”
ఇది కవి బ్రహ్మ తిక్కన గారి పద్యం మహా భారతం లోది .భారతం పూర్తి చేయటానికి సంకల్పించాడు తిక్కయజ్వ .అందుకే సకల బ్రహ్మ ప్రార్ధన చేసాడు .హరి ,హర మైన రూపము ,సగుణ బ్రహ్మం దానినే సకల బ్రహ్మం అంటారు .ఆంటే కలా సహిత బ్రహ్మం .కల ఆంటే మూల ప్రకృతి .,మాయ అని అర్ధం .ఆమెతో కూడిన బ్రహ్మం సకల బ్రహ్మం .ఆమెకు శ్రీ అని ,గౌరి అనీ పేర్లున్నాయి .ఆమె చిత్తం పల్లవించే టట్లు పరతత్వం హరి హర మైన రూపం దాల్చింది .ఆ రూపం భద్రాయిత మూర్తి .ఆంటే కళ్యాణ మూర్తి .,శృంగార మూర్తి అన్న మాట .సృష్టికి మూల మయిన ప్రకృతి పురుషుల దాంపత్యశృంగారం ఈ పద్యం లో కన్పించటం విశేషం .
            నిర్గుణ బ్రహ్మ మనకు అందరానిది .మన కోర్కెలు తీర్చేది కూడా కాదు .అందుకే కోర్కెలు తీర్చే సగుణ బ్రహ్మను కవి భావించాడు .శ్రీ తో వున్న గౌరి హరి ,హర సకల బ్రహ్మను అందుకే ఆరాధించాడు .హరిగా భావిస్తే హరి యేనమః అని హరునిగా భావిస్తే హరాయనమః అని లోకం లో ధ్యానించటం సంప్రదాయం గా వున్నది .”విష్ణు రూపాయ నమ్హ శివాయ ”అని తాత్వికు లైన సాత్విక భక్తులు ధ్యానిస్తారు .ఇలా చేయటం” వైదిక ధ్యాయిత ”అంటారు .దీనివల్ల కోర్కెలు తీరతాయి .
                 తిక్కన ముఖ్యం గా శివ భక్తుడు .అందుకే విష్ణు రూపాయ నమ్హ శివాయ అన్న దానిలో చమత్కారం చూపించాడు .నమః శబ్దం మధ్యలో వుండటం వల్ల విష్ణురుపాయనమః ,అనీ ,నమ్హ శివాయ అనీ అన్వయం వస్తుంది .నమశ్శివాయ అన్నది శివ పంచాక్షరి మంత్రం ..విష్ణు రుపాయనమ్హ అనేది అస్తాక్షరీ మంత్రం కాదు ఇదీ కవి చమత్కారం .అసలు పర తత్త్వం శివుడే విష్ణు తత్త్వం ఆయన గుణం .అని చెప్పకుండా చెప్పాడు ఉభయ కవిమిత్రుడైన తిక్కన .ఆయన ”చిత్త నిత్యస్థిత శివుడు ”.అందుకే  ఆయన నిత్యం జపించే పంచాక్షరి అలా అద్భుతం గా మార్పు చెందింది అని విశ్లేషించారు డాక్టర్ పాటి బండ్ల మాధవ రామ శర్మ .
                                      శివ కేశవుల భేదం జగత్తుకు ప్రమాదం .అందుకే జగత్కల్యానానికి హరి హర రూపం అవసర మైంది .సర్వ దేవతలు సమానమే సర్వ ధర్మాలు సమానమే .అని ఆంద్ర జాతికి బోధించ టానికి ,సుస్థిర శాంతిని స్థాపించా టానికి ఆ హరి హరున్ని కళ్యాణ మూర్తి గా భావించి పంచమ వేదమయిన మహా భారతాన్ని తెలుగు చేయటానికి ప్రారంభం చేసాడు మహాక్ కవి ,సోమయాజి,కవి బ్రహ్మ,ఉభయ కవి మిత్రుడు అయిన తిక్కనామాత్యుడు .ప్రారంభం లోనే కవితా శిల్పం అత్యద్భుతం గా చూపి తన ప్రతిభా పాండిత్యాన్ని,వేదోపనిషత్తుల మర్మాన్ని ప్రదర్శించి మలచిన తొలి పద్య రాజం ఇది .అజరామరమై ఆంధ్రదేశ జనం నాలుకల మీద నిత్యం నాట్యం చేసి పరవశుల్ని చేస్తూ  ,మూల   రహస్యాన్ని తెలియ జేస్తోంది
                 తిక్కన మహా కవి తనను ””అమలోదాత్త మనీష మైననుభయ కావ్య ప్రౌధి పాటించు శిల్పమునన్ బారగుడాన్ కళావిదుడ” అని చెప్పు కున్నాడు .మనీష ఆంటే కవి రచనా శక్తి యొక్క గొప్పదనం అని పండితుల భావన . ప్రౌది(proudhi )  ఆంటే రసమయం సిద్ధింప జేసే నైపుణ్యం అని విబుధులు విశ్లేషించారు .ఈ రెండు కలిస్తే కావ్య శిల్పం అది తిక్కన లో పుష్కలం అందుకే ఆయనకు సలాం
                                                            గబ్బిట దుర్గా ప్రసాద్
                    ఇలా తెలుగు లో ఎన్నో పద్యాలు హృద్యం గా ,రసస్ఫోరకం గా వున్నాయి తవ్విన కొద్దీ టన్నుల కొద్దీ బంగారం లభిస్తుంది ఆ శేముషీ దురంధరులకు నమో వాకాలు .ఎందేరందరో విశ్లేషకులు అద్భుతమైన విశ్లేషణ చేసిఆవిష్కరణ చేసి  మరుగున పడిన బంగారాన్నివెలికి తీసి అందించారు దాన్ని మన స్వంతం చేసు కునే ప్రయత్నం లో ఇదో భాగం .
Posted in సమయం - సందర్భం | 1 Comment

పద్య విత్తనంలో దాగివున్న భావ వృక్షం

           పద్య  విత్తనంలో దాగివున్న భావ వృక్షం
             ”తన జనకుడగు స్థాణువు
              జనని అపర్నాఖ్య ,డా ,విసాఖున్దనగా
             దనరియు ,నభిమత ఫలముల
             జనులకు ,దయ నొసగు చుండు షణ్ముఖు గొలుతున్ ”
                          విత్తనంబున మర్రి వ్రుక్షమ్ము దాగదా  అన్నాడు జన కవి వేమన .అలాగే చిన్న కంద పద్యంఇది   నన్నే చోడ మహారాజ కవి రచించిన కుమార సంభవం కావ్యం లోని పద్యం ఇది .ఆయన కన్నడ దేశ సరిహద్దులో వున్న ఒరయురుకు అధిపతి అయిన రాజు .1160 ప్రాంతపు వాడు .ఆయనకు తెన్కనాదిత్యుడు ,వివేక బ్రహ్మ బిరుదులున్నాయి . సుర్యవంస రాజు .గురువు జంగమ మల్లికార్జునుడు .ఈ కావ్యాన్ని గురువుకే అంకితం చేసాడు .ఇష్ట దేవతాస్తుతి ,కుకవి నిందా ,shashtyantaalu ఆశ్వాసం చివర పద్యాలు ,గద్యాలు మొట్ట మొదటగా ప్రవేశ పెట్టిన కవి .వరేన్యుడు ప్రబంధ రచనకు ఇవి మార్గం చూపటం వల్ల ప్రబంధ రచనకు మార్గ దర్శిఅయాడు   .ఆయన్ను ట్రెండ్ సెట్టర్ అనవచ్చు .నవ రసాలు ,దశ కావ్య గుణాలు ,ashtaadasa  వర్ణనలు ఈ కావ్యం లో వున్నాయి కాళిదాస మహాకవి రాసిన కుమార సంభవం కావ్యం ,వుద్భాటుని కుమార సంభవం ఆధారంగా రాసిన కావ్యమే నన్నే చోడుని కుమార సంభవం ఇష్టదేవతా స్తుతిలో మన్మధుడిని స్తుతి చేసిన మొదటి కవి తర్వాత కేతన దశకుమార చరిత్రలో చేసాడు .చిత్రబంధ కవిత్వం ,మొదటి సారిగా ప్రవేశ పెట్టిన వాడు .గజ ,ధను ,సంగీత ,చిత్రకళల్లో గొప్ప జ్ఞాని .తెలుగులో నన్నే చోడుని కుమార సంభవమే మొదటి ప్రబంధం ఒకరకంగా ప్రబంధ పరమేశ్వరుడు..జాను తెనుగు కవిత్వానికి  ఆద్యుడు .మార్గ దేశి కవిత్వాలలో సవ్య సాచి .తిక్కన కవి పై నన్నే చోడుని ప్రభావం చాలా ఎక్కువ .పాల్కురికి సోమనాధుడు నాన్నే చోడుని అనుసరించాడు .చోదకవి రాజు కన్నడ ,తమిళ సాంప్రదాయాలను తెలుగు కవిత్వం లో ప్రవేశ పెట్టిన ఘనుడు .అన్నిటికి  ఆద్యుడు నన్నే కవి
                     ఇప్పుడు అసలు పద్యం లో ప్రవేశించి స్వారస్యాన్ని జుర్రుకున్దాము ..ఇది కుమార స్వామిని వర్ణించే పద్యం .ఆయన్ను స్కందుడు అనీ  అంటారు స్కంద కు వికృతి కంద .అందుకే కంద పద్యం లో స్కందున్ని వర్ణించి ఔచిత్య ప్రదర్సన చేసాడు .తండ్రి శివుడు స్థాణువు .ఆంటే మోడు వారిన చెట్టు అని కుడా అర్ధం .తల్లి పార్వతి అపర్ణ ఆంటే ఆకులు లేనిది .అయితె  కుమార స్వామి మాత్రం విశాఖుడు .
ఆంటే కొమ్మలు లేనివాడు .అయినా ఫలాలను ఇస్తాడట కుమార స్వామి .మ్రోడై ఆకులు ,శాఖలు లేని చెట్టు ఫలాలను ఇవ్వటం ఏమిటి ?అని మనకు అనుమానం కదా అదే కవి చమత్కారం .శబ్ద శ్లేష తో శివ పార్వతులకు ,కుమార స్వామికి వున్న సహజ మైన పేర్లతో చమత్కరించాడు .
               కొంచెం లోతుగా పరిశీలిద్దాం .స్థాణువు ఆంటే ప్రళయ కాలం లో కూడా చలించ కుండా నిలిచి వుండే వాడు ఆంటే కాలాతీతుడు,కాలమే తాను అయిన మహా శివుడు అని అర్ధం .అపర్ణ ఆంటే ఆకులు కుడా తినకుండా శివుని కోసం ఘోర తపస్సు చేసిన పార్వతి దేవి .విశాఖుడు ఆంటే విశాఖా నక్షత్రం లో పుట్టిన వాడు శన్ముఖుడైన కుమార స్వామి ..విశాఖ ఆంటే నెమలి వాహనం గల వాడు అనీ అర్ధం అనేక చేతులు ఆంటే పన్నెండు చేతులున్న వాడు అనీ ఇంకో అర్ధం ఇంకా లోతుగా విచారిస్తే వేద శాఖలు తెలిసిన వాడుఅని  విశేషార్ధం .ఇన్ని విశిష్ట లక్షణాలు వున్న కుమార స్వామినే స్ఖంధుడు అంటారు .పద్యాన్ని i కందం  లో చెప్పటం అందం గా వుంది ,అర్ధవంతం గాను ఔచిత్యం గాను వుంది .కవి కోరిక తీరింది అభీప్సిత ఫలము లభించింది అందుకే నన్నే చోడ కవి రాజుని ”కవిరాజ శిఖామణి ”అనారు నిజాం గా తగిన పేరు .స్కంధం క్యనేది ప్రాకృత కవిత్వపు ఛందస్సు లో వుంది దాని లోంచి వచ్చిందే తెలుగు కంద పద్యం .చెప్పే విషయము ,దాని చెప్పా తకనికి ఎంచు కున్న పద్యము ఒకటే అయితె ”ముద్ర”అలంకారం అంటారు .దీన్నీ మొదట ప్రవేశ పెట్టిన వాడు కుడా నన్నే చోడ కవి రాజే నంటే అమితాస్చర్యం గా వుంటుంది .ఈ కావ్యం ఇంకో గొప్ప తనం వుంది కుమారస్వామి పుట్టకకు ముందు ,ఆయన అన్నా గారైన వినాయక జననము రాసి అగ్రజునికి అగ్రతామ్బులం  ఇవ్వటం విశేషం సంస్కృతం లో కాళిదాసు కానీ ఉద్భటుడు కాని ఆ జోలికి పోలేదు . .చిన్న పద్యం లో ఎన్ని మనోహర భావాలు నిఖిప్తం చేసాడో మహాకవి అందుకే దీన్ని పద్య విత్తనం లో దాగిన భావ వృక్షం అన్నాను .ఇలాంటి హృద్య మైన పద్యాల్ని అప్పుడప్పుడు ఆస్వాదిద్దాం ఆ మహా కవులను స్మరించి ఋణం తీర్చుకుందాం
                                             గబ్బిట దుర్గా ప్రసాద్
                              ఎందరో మహాను భావులు చెప్పిన భావావిష్కరణమే దీనికి ఆధారం .
Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆలోచనా లోచనం ” పూజను బట్టి పురుషార్ధం ”

ఆలోచనా లోచనం లో ఈ రోజు ఆంటే 19 -04 -11  న ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది

                                                      ఆలోచనా లోచనం
                                                      ”   పూజను బట్టి పురుషార్ధం ”
   మనం చేసే పూజను బట్టి ఫలితం ఉంటుందని ధర్మ శాస్త్రాలు వుద్గో  ఘోషిస్తున్నాయి .ఎంపిక చేసుకున్న.ఆ దైవం ఏ రూపం లో పూజిస్తే ,పుర్నానుగ్రహం తో మన కోర్కెలను నెరవేరుస్తాడో ముందే గ్రహించాలి . దైవం పట్ల నిష్ఠ వుండాలి .ఆ విధి విధానాన్ని ఆచరించి మనోభీస్తాన్ని నెరవేర్చు కోవాలి ఇది తెలిసి అర్జునుడు శ్రీ కృష్ణుడు శివుణ్ణి అర్చించి విశేష ఫలితం పొందితే అది తెలియక వేరొక విధానం లో పరమేస్వరున్ని పూజించి ఫలితం పొందలేక పోయాడు అశ్వథామ .ఈ వివరాలు మహాభారతం లో ద్రోణ పర్వం లోని చిన్న కధ వివరం గా తెలిపింది
          మహా భారతయుద్ధం భీభత్చం గా జరుగుతోంది .ద్రోనసుతుడు ,మహా శస్త్రాస్త్ర నిపుణుడు  అస్వస్తామ  ,కృష్ణార్జునుల్ని తీవ్ర శరాఘాతం తో చీల్చి చెందాడు తున్నాడు .శరీరాలు గాయాలై రక్తం వరదగా పారుతోందికృష్ణార్జునులకు .అర్జునుడు ఇవేమీ లెక్క చేయకుండా అస్వస్తామ ను తీవ్ర బాణాలతో బాధిస్తూనే వున్నాడు .వీరిద్దరిని ఇంక ఏమి చేయ లేనని తేర్మ్కానిన్చు కున్నాడు .కోపం ,పరాభవం తో చెలరేగి పోయాడు .పరిస్థితి చెయ్యి దాటి పోతోందన్న ఆవేశము తోడైంది .చివరి ప్రయత్నం గా నారాయనాస్త్రాన్ని ప్రయోగించాడు మంత్ర పూతం గా .ఈ దెబ్బ తో వారిద్దరి పని సరి అనుకోని ఆనందించాడు .మహా మహిమాన్వితమైన ఆ నారాయణాస్త్రం కృష్ణార్జునులను ఏమీ చేయలేక పోయింది .చిరునవ్వు వీరిడైతే చిరాకు అతనిదయింది .ఎందుకు తన అస్త్రం విఫలమయిందో తెలియటం లేదు ద్రోణ సుతుడికి .తీవ్రం గా విచారించాడు .ఆవిశాయమేదో చేల్చుకోవాలని వ్యాసమహర్శిని ధ్యానించాడు .ఆయన ప్రత్యక్షమైనాడు .నమస్కరించి ”ఇది ఏమి మాయో తెలియటం లేదు స్వామీ దేవ గంధర్వాది జాతులను కూడా బాదిన్చాగాలిగిన దివ్యాస్త్రమైన నారాయణాస్త్రం కేవలం మనుష్యులైన కృష్ణార్జునులను దహించ లేదు కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం గా వుంది తెలియ జేయండి ”అన్నాడు అస్వస్తామ .అప్పుడు వ్యాసమహర్షి నవ్వి ”ఎవరు చేసుకున్న పుజాఫలితం వారికి లభిస్తుంది .నువ్వు పరమేస్వరున్ని ప్రతిమా రూపం లో అర్చిన్చావు .వాళ్ళిద్దరూ లింగరూపం లో వున్న శివుడిని ఆరాధించారు .పూర్వజన్మలో మీరు చేసుకున్న పూజాఫలితమే ఇప్పుడు ఆ రూపం లో ఫలితం గా కన్పిస్తుంది .లింగార్చన చేసిన వారిని శివుడు మెచ్చి రక్షిస్తాడు .అందుకే కృష్ణార్జునులను నీ నారాయణాస్త్రం ఏమీ చేయలేక పోయింది .”అని సవివరం గా తెలియ జేశాడు మహర్షి వ్యాసుడు .అసలు రహస్యం అప్పుడు తెలిసింది అతనికి .శివుణ్ణి లింగ రూపం లో ,అభిషేకం చేసి పూజ చేస్తేనే ఆయన సంతోషించి అభీస్త సిద్ధినిస్తాడని .కనుక శివ ప్రతిమను పూజించటం కంటే ,శివలింగాన్ని పూజిస్తే అధిక ఫలితం ఈ విషయాన్ని ఆనుసాసనిక పర్వం లో కూడా శ్రీ కృష్ణుని చేత ధర్మరాజు కు చెప్పించాడు వ్యాస మహర్షి శివలింగ సన్నిధానం లో చేసే ప్రతి పని ఆయురారోగ్య ఇస్వర్యాలనిస్తుందని తెలియ జేసారు .
                 ఇంతకీ లింగం ఆంటే ఏమిటి ?సమ్యక్ జ్ఞానమే లింగం .అని శైవ ఆగమాలు బోధిస్తున్నాయి .శివ లింగమే పరబ్రహ్మమని చెప్పాయి .ఓంకారమే లింగం .శివపురాణం లో లింగమే తన రూపు అని శివుడే చెప్పాడు . లింగాన్నే అర్చించమని కుడా చెప్పాడు .శివలింగం ఆంటే శివుని యొక్క లింగం అని మాత్రమే కాదు శివుడే లింగం అని శైవ ప్రకాశిక లో వుంది .పద్మపురాణం కూడా లింగానికే శివార్చన చేయాలని బోధించింది .త్రికాల శివలింగార్చనశ్రేస్తామని ఉపనిషత్తు వుద్ఘోషించింది .కనుక సాధకుడు ఇందులోని రహస్యం గ్రహించి ,తన కోర్కెలను తీర్చుకోవటానికి తన ఇష్టదైవం ఏ రూపం లో అర్చించితే ,ధ్యానిస్తే భక్త సులభుడై వరదానం చేస్తాడో ,ఆపదల నుంచి రక్షిస్తాడో ,తెలుసుకొని పూజించి అభీష్ట సిద్ధిని పొందాలి .ఇదే ఈ కధలోని ధర్మ సూక్ష్మం .ఆ ధర్మ సూక్ష్మం తెలిసి శ్రీకృషుడు ,అర్జునుడు శివలింగార్చనచేసారు అందుకే అస్వత్తామ   ప్రయోగించిన నారాయణాస్త్రం శివుని అనుగ్రహం వల్ల వారిని ఏమీ చేయ లేక పోయింది .ఇది తెలియక అస్వత్తామ శివప్రతిమనే పూజించి ,నారాయాన్నాస్త్ర ప్రయోగ ఫలితాన్ని పొందలేక పోయాడు .కనుక పూజను బట్టే పురుషార్ధం లభిస్తుందని తెలుసుకోవాలి   .
                                                                                                                  గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రేడియో లో | Tagged | 1 Comment

కేసిర్ మంచి బుద్ధి కోసం – ఉయ్యూరు సంకల్ప హోమం

వార్తా పత్రికల కధనంఉయ్యూరు లో జరిగిన కెసిర్  మంచి బుద్ధి కోసం – ఉయ్యూరు సంకల్ప హోమం

Posted in సమయం - సందర్భం | 3 Comments

నవ్వుల పువ్వులు

నవ్వుల పువ్వులు


               ”నవ్వవు జంతువుల్ ,నరుడు నవ్వును నవ్వులు చిత్తవ్రుత్తికిన్
               దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు ,కొన్ని విష ప్రయుక్తముల్
              పువ్వులు వోలె ప్రేమ రసముల్ వెలిగ్రక్కు ,విశుద్ధ మైన ,లే
             నవ్వులు ,సర్వ సుఖ దమనంబులు,వ్యాధులకున్ మహౌశాధముల్

 అని జాషువా గారు నవ్వు కు నిర్వచనం చెప్పారు .నవ్వును గురించి ,నవ్వు ఉద్యమాన్ని గురించి కొన్ని విశేషాలు .హుమార్ అనే హాస్య త్రైమాసిక పత్రిక ఇరవైఎల్లకు పైబడిగా అమెరికా నుంచి వెలువడు తోంది .humor ఆంటే ఆర్ద్రత ,తడి ,తేమ ,ద్రవం అని అర్ధలున్నా న్నయిటహాస్యకారుని ఖ్యాతి వినే వారి చెవుల్లో వుంటుంది కాని చెప్పే వారి నోట్లో ఉండదని తేల్చేసాడు shakespeare    .”స్వేచ్చ హాస్యాన్ని ఉత్పత్తి చేస్తే ,హాష్యం స్వేచ్చను ఉత్పత్తి చేస్తుంది ”అంటాడు జీన్ పాఉల్ సాత్రే .ప్రతి జంటకు వివాహం చేసే మారు వేషం లో వున్న పురోహితుడే హాష్యం అన్నాదిన్కోడు   .హాస్య భావన లేని ఏ మనస్సు చక్కగా సంఘటితం కాదు అన్నాడు colridge మహాశయుడు దేశం నాగరికతకు అత్యుత్తమ పరీక్ష హాశ్యాం  .చావటం తేలిక హాస్యమాడటం కష్టం అని తేల్చాడు ఇంకో ఆయన. చిరు నవ్వే విజయ సాధనం అన్నాడు ఒక మహానుభావుడు .మనిషికి దైవం ప్రసాదించిన వరం హాష్యం  చివరిగా ”విస్వశ్రేయః హాష్యం .”
             ఇప్పుడు కొన్ని హాస్య గుళికలు మింగుదాం .”నువ్విచ్చిన చెక్ బౌన్సు అయింది”అన్నాడు డాక్టర్ పేషెంట్ తో .”నా జ్వరం మళ్ళీ వచ్చింది .దేనికేమంటారు? ”పేషెంట్ గడుసు సమాధానం .
    ఒక నౌకరు యజమానికి తన భార్య రాసిన వుత్తరం చదివి పెట్టమన్నాడు .చదవటం మొదలెట్టేసాడుయజమాని వెంటనే యజమాని చెవులు ముసేసాడు నౌకరు ఎందుకురా ఆంటే ”మొగుడు పెళ్ళాల విషయం కదా మీరు వినకూడదని అన్నాడు వాడు .
           ఒక గోరి మీద ఇలా రాసి ఉందట ”ఇతను అతి బద్ధకిష్టు ఒకరోజు గాలి కుడా పీల్చటం మానేసాడు ”.”నన్ను మొట్టమొదట ‘అచ్చేసి ‘దేశం మీదకు వదిలింది పురిపండా గారు అన్నాడు శ్లేషతో శ్రీ శ్రీ
    ”మనం ముసలి వాల్ల  మయామని  ఎప్పుదనిపిస్తుంది ఒక ముసలి ఇంకో ముసలితో ”బర్త్ డే కేకు ఖర్చు కన్నాcandles  ఖర్చు ఎక్కువైనపుడు అన్నా డురెండో ముసలి

”బాపు ! భూమ్మీద నడుస్తుంట్ ఎన్నో జీవులు చని పోతున్నయి అని వాపోయాడు ఒకడు గాంధీ దగ్గర .అక్కడే వున్న పటేల్ అంత వర్రీ వద్దు నాయనా బుర్రకింద   పెట్టి కాళ్ళు పైకెత్తి నడు ”అని వాయిన్చాదట
      ”నేను తెలివి తక్కువ వాన్నని నీకు అనుమానమా ”అన్నాడు మునిమాణిక్యం ”చా నాకా అనుమానం లేసమైన లేదు ”అంది భార్య కాంతం .
   దువ్వురి వెంకట రమణ శాస్త్రి గారు గొప్ప వ్యాకరణ పండితుడు ఆయన అంత్య దశలో చూడటానికి వచ్చిన ఆయన ఎలావుంది అని అడిగాడు ”ఏముందీ అచ్చుకో  ప్రయత్నం ,హల్లు కో ప్రయత్నం లా వుంది ”అన్నాడు వ్యాకరణ భాషలో
”పనైందా పిన్ని గారు ? అని అడిగింది పక్కింటి ఇల్లాలు ”లేదమ్మా ఇంకా ఆయన ఇంటికి రాలేదుగా వస్తే కాని పూర్తీ చేయలేరు కదా? అంది అమాయకం గా పిన్ని
  ”ఎప్పుడు డబ్బు ,డబ్బు ,అంటావు బుద్ధి జ్ఞానం కావాలి”అన్నాడు భర్త ”అవి ఎట్లాగు మీ దగ్గర లేవు గా అందుకే డబ్బు కావాలి ”గడుసు పెళ్ళాం చమత్కారం
    నవ్వుల్లో రకాలు చెప్పారు  భమిడిపాటి కామేశ్వర రావు గారు అందులో మచ్చుకు కొన్ని తుపాకీ నవ్వు ,కోతి నవ్వు ,దగ్గు నవ్వు ,విషపు నవ్వు కొనాఊ పిరి నవ్వు
చివరగా ”హాసం జనజీవన  విలాసం -హాసం మానవ హృదయ లాస్యం -హాష్యం ,లాస్యం లేని ఆస్యం (మొగం )విషాదానికి దాస్యం -కావాలి హాష్యం అందరకు వుపాస్యం ”                            ఇదంతా నా స్వంతం కాదు సేకరణ     గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in అనువాదాలు | 2 Comments

ఆనంద రమణాయణం ”కోతి కోమ్మచ్చి

ముళ్ళపూడి వెంకట రమణ

”మొదటి భాగం చదివి రాసిన ఆనంద రమనాయణం మీ అందరి కోసం ….దుర్గా ప్రసాద్

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

తెలుగు నాటక దినోత్సవం సందర్బం గా

.ఇవాళ తెలుగు నాటక రంగ దినోత్షవం .ఆ కదా ,కమా మీషు న తెలియ జేస్తున్నాను .ఆధునిక నాటకం కన్యాశుల్కం 1882august ప్రదర్శనతో ప్రారంభం .అది పుస్తకం గా వచ్చింది 1897lone .ఒకసారి విహంగ వీక్షణం గా తెలుగు నాటకాలను నటులను ,రచయితలను జ్ఞాపకం చేసుకొని అంజలి ఘటించటం మన కనీస కర్తవ్యమ్ .1860 లోkoraaada raama మ చంద్ర శాస్త్రి ”మంజరీ మధు కరీయం ”నాటకం రాసారు .ధార్వాడ నాటక సమాజం ప్రేరణతో 1860 లో వీరేశలింగం గారు ”వ్యవహార ధర్మ బోధిని ”రాసారు .
అందులో న్యాయవాదుల లంచగొండి తనాన్ని ఎండకట్టారు .విద్యార్ధులతో ప్రదర్శించారు .1880  లో రాజమండ్రికి చెందిన వావిలాల వాసుదేవ శాస్త్రి ”నందక రాజ్యం ”రాసారు .ఇందులో నియోగి, వైదీకి తగాదాలను చూపారు .ఇదే మొదటి స్వతంత్ర తెలుగు సాంఘిక నాటకం ..కొండుభోట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి 31  సాంఘిక నాటకాలు రాసారు. గుంటూరు లో ”హిందూ నాటక సమాజం ”స్థాపించి ఆంధ్రదేశం అంత ప్రదర్సనలు ఇచ్చి నాటక వ్యాప్తికి విశేష కృషి చేసారు .ఇవి పౌరాణిక నాటకాలు అవటం విశేషం .వేణీ సంహారం నాటకాన్ని వడ్డాది సుబ్బరాయ కవి రాసి ప్రదర్సనలు ఇచ్చారు .”హిందూ నాటకోజ్జీవ సమాజం ”స్థాపించి నాటక సేవ చేసారు .బందర్లో నాదెళ్ళ పురుషోత్తమ కవి నేషనల్ theotrical  సొసైటీ పెట్టి తెలుగు హిందీ లలో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు .1887 లో ధర్మవరం రామ క్రిషమా చార్యులు బళ్ళారి లో ”సరసవినోదిని”నాటక సమాజాన్ని పెట్టి నాటక ఉద్యమం నడిపారు .విషాద నాటకాలకుఆద్యుడు  వీటిలో పాటలు కుడా వుండటం ప్రత్యేకత .ఆంధ్రదేశం అంతా నాటక వ్యాప్తి చేసారు ధర్మవరం వారు .దీనితో వచన నాటకాలు తగ్గాయి .సంగీత నాటకాల జోరు పెరిగింది .చిలకమర్తి ”గయోపాఖ్యానం ”తిరుపతి వెంకట కవుల ”ఉద్యోగ విజయాలు”ప్రదర్సింపని వూరు వుండేది కాదు .తెలుగు నాటకం అంత ప్రాచుర్యం పొందింది .పద్య నాటకానికి పట్టాభిషేకం జరిగింది .
క్రమం గా వ్యాపార పధ్ధతి ప్రవేశించింది .చాలా నాటక సమాజాలు ఏర్పడ్డాయి .పోటీలు పెరిగాయి .పాత్రోచిత భాష ప్రాధాన్యత పెరిగింది .ఈ నేపధ్యం లో వేదం వెంకట రాయ శాస్త్రి గారి ”ప్రతాప రుద్రీయం ”నాటకం వచ్చి పాత్రోచిత  భాషకు విలువ పెరిగింది .స్వతంత్ర ఉద్యమం లో చ్చారిత్రక నాటకాలకు ప్రాచుర్యం కలిగింది .ఉద్యమ స్ఫూర్తికి చాల దోహదం చేసాయి ch.నాటక నిర్వహణలో ప్రయో galu చేసారు .వైవిధ్యం కోసం పరితపించారు .డబ్బు విపరేతం గా ఖర్చు పెట్టి మోయలేని బరువుతో దివాలా తీసాయి కూడా .హార్మోనియానికి ప్రాధాన్యత పెరిగింది .సంగేత దర్శకులకు గిరాకి పెరిగింది .పద్యం,పాట ,హార్మోనియం కలిసి చెవి తుప్పు వదిలించాయి కొండవీటి చాంతాడు లాంటి రాగాలు జిలేబి చుట్టల లాంటి రాగ విన్యాసాలు పుట్టుకొచ్చి భయం కూడా కల్గించాయి .
బందర్లో”ఆంద్ర నాటక ప్రోత్సాహక సంఘం ”ఏర్పడి ధర్మవరం వారి ”చిత్ర నలీయం  ”నాటకానికి పోటీలు నిర్వహించింది .తర్వాత చిలకమర్తి వారి ”ప్రసన్న యాదవం ”శ్రీపాద వారి ”బొబ్బిలి యుద్ధం ”నాటకాలకు పోటీలు నిర్వహించారు .ఉత్తమ నటులకు ,ఉత్తమ ప్రదర్శనకు బహుమతులిచ్చారు .దీనితో నాటక విమర్శ కూడా మొదలయిందని చెప్పవచ్చు .మల్లాది రామ కృష్ణ శాస్తి అరిగారి  మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు ఆనాటి ప్రఖ్యాత నాటక విమర్శకులు గా గుర్తింపు పొందారు .
నాటక రంగం లో ప్రసిద్ధి చెందిన ఆనాటి నటుల్లో ముందుగ పేర్కొన తగిన వారు తాడిపత్రి రాఘవాచార్యులు ఆయనే బళ్ళారి రాఘవ ధర్మ వారం వారి మేనల్లుడు .ధర్మవరం వారిని”ఆంధ్ర నాటక పితామహుడు ”అని గౌరవం గా పిలుస్తారు .రాఘవ తెలుగు ఇంగ్లీష్ ,కన్నడ ,నాటకాలలోచిర స్మరనీయ నటన ప్రదర్శించి జేజేలు అందుకున్న మహోత్తమ నటుడు .సంస్కారి .ఆధునికతనను ప్రవేశ పెట్టిన వాడు .పాశ్చాత్య దేశాల నటులందరి తో ఆయనకు పరిచయాలున్దేవి vi .ఆ ప్రభావాన్ని తెలుగు నాటకం మీద తెచ్చాడు .స్థానం నరసింహారావు స్త్రే పాత్రలు ధరించి మంత్ర ముగ్ధుల్ని చేసారు సత్యభామ పాత్ర నభూతో గా నటించారు .గోవింద రాజు సుబ్బారావు ,వేమూరి గగ్గయ్య ,పీసపాటి అద్దంకి శ్రీరామ మూర్తి ,అద్దేపల్లి అఘురామయ్య ,సూరిబాబు తిలకం కన్నాంబ వరలక్ష్మి ది.వి ,సుబ్బారావు  అబ్బూరి .బందా కనక లింగేశ్వర రావు

gabbita durga prasad
16-4-11 తెలుగు నాటక రంగ దినోత్షవం sandarbham గా pratyeka rachana

Posted in సమయం - సందర్భం | Leave a comment

గొల్లపూడి మారుతీరావు జన్మదిన సందర్భం గా ఒక కధ

గొల్లపూడి మారుతీరావు గార్కి  జన్మదిన శుభాకాంక్షలు

                                       “నేను” 

         పెద్దమేడ ముందు వీళ్ళ కుటుంబం . మేడ  మీది కుటుంబం వీళ్ళకు ఆశ్రయం . నిజo చెప్పాలంటే వీళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించే ఆ మేడ  మీద కుటుంబం వుంది .”ఆశ్రయం కంటే ఆత్మీయత ఎక్కువ .” ఆంటే  బాగుంటుంది .తరతరాల స్నేహం అది .తరగని గని వంటిది .మేడ  వారింట్లో ప్రతి పండక్కీ వీళ్ళకూ పండగే .వీళ్ళ ఆనందమే  మేడ కుటంబం ఆనందం .ఏ పండగ వచ్చినా వాళ్ళు వీళ్ళు కలిసి మెలిసి వుంటారు .ఆనందిస్తారు .అన్ని తరాల్లోను రెండు కుటుంబాలు పాటించాయి .ఆ ఇంట్లో పెళ్లి ముచ్చట్లు ,బదిలీలు ,చదువు  సంధ్యల వివరాలన్నీ వీళ్ళ ఎదుట మాట్లాడాల్సిందే .అంత చల్లని మనసున్నవాళ్ళు . మేడ ఇంటి వారి పెద్దబ్బాయి పెళ్లి జరిగింది .కుందనపు బొమ్మ లాంటి కోడలు కాపరానికి వచ్చింది .వాళ్ళ అమ్మ అన్నీచూడమని అంటుంది. .ఏదీ చెప్పదు . తెలుసుకోవటమే తమ పని అంటుంది . అడిగితె అన్నిటికి ముభావమే . ఇవ్వడమే కాని పుచ్చుకోవటం తెలీని కుటుంబం వీళ్ళది .తల్లి ఔన్నత్యమే ఈ పిల్లల్ని అంత వాళ్ళను చేసింది .

                         వేసవి లో సందడే సందడి రెండు ఇళ్ళకు  హడావిడే హడావిడి . మేడ కుటుంబం  పిల్లలు , ఈ పిల్లల పై ఒక  కన్నేసి ఉంటారు.  ఎప్పుడు వీళ్ళు చిరునవ్వు తో ఆహ్వానిస్తారు .ఇంటిల్లి పాదికి తియ్యటి మామిడి పళ్ళు ఇస్తుంది వీళ్ళ అమ్మ .అప్పుడు ఆమె ముఖం లో ఎంతో గర్వం  తొంగి చూస్తుంది .ఈ ఉగాది మేడ కుటుంబం పిల్లలంతా  ఇంటివారయ్యారు .వీళ్ళ అమ్మకు ఆనంద పారవశ్యం కల్గింది .ఆప్యాయత సానుభూతి ఎక్కడివా అని ఈమె ఆశ్చర్య పోయింది .మేడ  పెద్దదయింది .ఈమె కూడా పెద్దదయింది .ఆ ఇంట్లోకి వెళ్ళాలని వుబలాటం .వాళ్ళు పిలిస్తేనే లోపలి వెళ్ళాలని నియమం .ఆ ఇంటి అమ్మ గారు ఆప్యాయంగా ఈ పిల్లను లోపలి తీసుకు వెళ్లి అలంకరించింది .ఆ ఇంట్లో ఈమె కూడా ఒకటి అయింది .ఆ ఇంట్లోని వైభోగం కళ్ళారా చూసింది పిల్ల .సాయంకాలానికి సోమ్మసిలింది .ఎండకి వడలి పోయింది .అమ్మ వెన్ను తట్టింది .తమకు అక్కడ స్థానం కల్పించిన వారికి అలా చేయటం తమ కుటుంబ బాధ్యత అంది తల్లి .ఇవ్వగలగటమే తమ పని అదే తమ శక్తి అని తమకు బాధ్యతలే ఉంటాయని అన్నది .ఇవ్వడం లో వున్న హాయి చాల గొప్పది అంది .ఆ మాటలకు పిల్ల పులకించింది .ఆ మాత్రుత్వపు పరిపూర్ణతకు ఉద్వేగం తో చలించి పోయింది పిల్ల .తాను చేసిన మంచి పనికి తృప్తి పొందింది. పిల్లముఖం లో వెలుగు చూసింది తల్లి .అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోయింది.మేలుకొనే ద్రుష్టి, కోరికా దానికి లేవు .

                      ఇంతకీ ఈమె ఎవరు?”మామిడికొమ్మ” పరోపకారమే ఊపిరిగా పెంచిన ఆ పెద్దముత్తయిదువు, ఆ పూచిన మామిడి చెట్టే ఆ అమ్మ .ఆమె శరీరం లో అంతర్భాగమే ,ఆమె ఒడిలో అందంగా పేరిగినా మామిడి కొమ్మ అదే ”నేను ”. ఇదంతా మామిడి కొమ్మ స్వగతం . ఇంత గొప్పగా ,అందం గా చిత్రించారు గొల్ల పూడి మారుతీ రావు . దాని ఆన్తర్యాన్ని, మాత్రుత్వపు మహిమను దాత్రుత్వపు గొప్పను ప్రతి ఫలాపేక్ష లేక పోవటము  అద్భుతంగా చిత్రించారు .ఆయన ఏది రాసిన జీవం పోసుకుంటుంది.  మనసును తట్టి లేపుతుంది.  ఆలోచింప జేస్తుంది . కర్తవ్య బోధ వుంటుంది.  వాక్యం రసాత్మకం అంటె మారుతీ రావు మంచి ఉదాహరణ . సుమారు అర్ధ శతాబ్దం క్రితం  ఆయన కధలను   ”రోమన్ హాలిడే ” పేర సంకలనం గా తెచ్చారు అందు లోని చివరి అతి చిన్న కధకు సంక్షిప్త రూపం ఇది.  ఆయన 73 వ పుట్టిన రోజు కానుకగా మీకు నేను అందించాను.  ”మారుతి ” లాగ  ఆయనా ఆయన కధలు చిరంజీవి గా వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.

                                                                                                                                                         దుర్గా ప్రసాద్ 
Posted in సమయం - సందర్భం | Leave a comment

ఆలోచనా లోచనం తల్లికి పిల్లలపై సమాన ప్రేమ వుండాలి

ఆలోచనా లోచనం

తల్లికి పిల్లలపై సమాన ప్రేమ వుండాలి
తల్లి ప్రేమను మించింది లోకం లో లేదు .ఆమెకు ఎంతమంది సంతాన మయినా అందరి పైన ఒకే రకంగా ,సమనం గా ఆప్యాయతను ,ప్రేమను కురిపిస్తుంది .అందరు సమానం గా అభివృద్ధి చెందాలని ఆ కాంక్షిస్తుంది .ఇది లోక సహజం .ఇలా కాక దీనికి విపర్యం గా ప్రవర్తించిన వారు ,కొందరి పై అధిక ప్రేమ చూపించిన వారు చరిత్ర లో నిందార్హు లైన వారెందరో వున్నారు .ఇది మనుష్యుల విషయం లోనే కాదు పశు పక్ష్యాదుల విషయం లోను అంతే. వేదం లో సురభి అనే ఆవు తన కున్న సంతానం పై ఒకే రక మయిన ప్రేమ వుందని తెలియ జేసే కధ ఒకటి వుంది విందాం రండి .
గో జాతికి తల్లి సురభి అనే గో మాత ఆమె ఒక సారి కన్నీరు కారుస్తూ దేవేంద్రుని సరను జోచ్చింది .ఆయన వచ్చిన కారణ మేమిటో తెలియ జేయ మన్నాడు .సురభి గద్గడ స్వరం తో ”దేవరాజ 1nee రక్షణలో త్రిభువనాలు సుఖసంతోషాలతో   వున్నాయి .ఒక్క నా గో సంతానానికి మాత్రమే ఎక్కడ లేని కస్తాలువచ్చాయి ”అంది .కారణం ఏమిటని సురెంద్రుడు అడిగాడు .సురభి ”లోకం లో బలమైన పశువుల తో బాటు బలహీన మయిన పశువులను కట్టి మనుష్యులు నాగలి దున్నుతున్నారు .ఆ పని భారం తట్టు కో లేక బక్క చిక్కిన పశువులు నెమ్మదిగా అడగులు వేస్తుంటే ములు కర్ర తో కొట్టి పొడిచి హింసిస్తున్నారు .అది చూడ లేకుండవున్నాను .”అని వెక్కి వెక్కి ఏడ్చింది .దేవేంద్రుడు ఓదారుస్తూ ”నీకు అధిక సంతానం కదా అన్నిటికి ఈ బాధ లేదు కదా ?కొన్ని పశువులకే గా ఈ కష్టం ఇది లోకం తీరే కదా ?”అన్నాడు .అప్పుడు సురభి ”నిజమే .తల్లికి పిల్లలంతా సమానమే .కొందరి మీద ఇష్టం ,మరి కొందరి మీద అయిష్టం ఏ తల్లికి వుండదు .బిడ్డలు ఎందరున్నా తల్లి అందరు సమానం గానే సుఖం గానే వుండాలని కోరుకుంటుంది .గాయ పాడిన వారిని ,బాధ పదే వారిని ,తల్లి ఎంతో ప్రేమతో చూస్తుందని నీకు తెలుసు .కనుక పనిచేయలేని ,బలహీనం గా వున్న నా సంతానాన్ని కనికరించి రక్షించు ”అని ప్రాధేయ పడింది సురభిగోమాత .ఇంద్రుడు ఆమె పిచ్చి ప్రేమకు సంతోసించి పరమానంద భరితుడై ,నాడు .సురభి పై విపరీతంగా జాలి కలిగింది .వెంటనే సంకల్ప బలం తో ఆ ప్రాంతమంతా పెద్ద వర్షం కురిపించాడు .భూము లన్ని గుల్ల బారి గడ్డి ,తృణధాన్యాలు బాగా పండాయి .పశుగ్రాసం పుష్కలంగా లభించటం తో పశువులు ఇష్టం గా మేసి బలం పుంజుకున్నాయి .పసువులలోనే ఇంత ఆపేక్ష వుంటే మనుష్యులలో వుండటం ఆశ్చర్యం కాదు .
వేదం  లోని ఈ కధను ద్రుత రాస్త్రునికి వ్యాస మహర్షి హిత  బోధ గా చెప్పాడు .దుర్యోధనుని పై వున్న అధిక పుత్రా ప్రేమను వదిలించు కోలేక తన మనసు లోని మాటను వ్యాసునికి చెప్పాడు .కర్తవ్యమ్ బోధించ మన్నాడు .అప్పుడు మహర్షి పుత్ర మొహం లోకం లో సామాన్యమైనది  మైనది కాదని కౌరవులని ప్రేమించి నట్లే పాండవులను ప్రేమించమని కురు పాండవులిరువురు ఆయనకు రెండు కళ్ళు గా భావించాలని ,ఏ కంటికి నెప్పి వచ్చినా బాధ గానే ఉంటుందని ఈ విషయం లో సురభి అనే గోమాతను ఆదర్శం గా తీసుకో మని ధర్మ బోధ చేసాడు .సరి అయిన సమయం లో చెడు మార్గాన నడుస్తున్న కొడుకు దుర్యోధనుడిని మందలించి సన్మార్గం వైపు త్రిప్పక పొతే విపరీత పరిణామం సంభవిస్తుందని హెచ్చరించాడు .అప్పుడు ఆ కొడుకు అలవి కాని వాడై ,విసృంఖలం గా ప్రవర్తించి వంశానికి ,కులానికి రాజ్యానికి చేటు తెస్తాడు .సంఘం దుర్నీతి మయం అయి ,ప్రజలు కష్టాల పాలు అవుతారు .అందుకే అందరు సురభి లాగ సమ బుద్ధిని కలిగి ప్రవర్తించాలి .గుడ్డి ప్రేమే కురుక్షేత్ర సంగ్రామానికి కారణమై కురు వంశ నాశనానికి హేతు వైందని అందరు గుర్తించాలి
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనంశీర్షికలో  సే ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 12 -04 -11 నా prasaramayi
— 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మా ఊళ్ళో (ఉయ్యూరు) మా గుళ్ళో (సువర్చల సహిత ఆంజనేయస్వామి ) జరిగిన సీతారామ కళ్యాణం

This slideshow requires JavaScript.

మా ఊళ్ళో (ఉయ్యూరు)

మా గుళ్ళో (సువర్చల సహిత ఆంజనేయస్వామి ) జరిగిన సీతారామ కళ్యాణం

మీ కోసం

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఒక్కటై కదిలిన ఉయ్యూరు సాక్షి వార్త 12.04.2011

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆంధ్ర సారస్వత సమితి ఉగాది పురస్కారాలు మచిలీపట్నం 08-05-2011 ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

గాంధీ స్మృతి శాంతి యాత్ర ఉయ్యూరు విశేషాలు

ఇవాళ గాంధీ స్మృతి శాంతి యాత్ర బాగా జరిగింది .వందలాది విద్యార్ధులు స్వచ్చంద సంస్థలు అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వారు ,వర్గాల వారు పాల్గొన్నారు రాజేంద్ర ప్రసాద్ నాయ కత్వం లో బాగా జరిగింది .వీరమ్మ గుడినుంచి యాత్ర బయల్దేరి లక్ష్మి talkies దగ్గర గాంధీ బొమ్మను చేరి ఆయనకు పూలమాలలు వేసి ,బంగాళా లో మీటింగ్ జరిపాము .నేను మాట్లాడాను గాంధీ 1921
లో మహాత్ముడు కస్తుర్బా తో పట్టాభి తో విజయ వాడ నుంచి బందరు వెళ్తూ ఏప్రిల్ఐదవ తేది న వుయ్యూరు వచ్చారు వెయ్యి మంది పురజనులుబంగాళా  ల దగ్గర ఆయనకు స్వాగతం పలికారు .ఆయన ఆగి పది నిముషాలు మాట్లాడారు ప్రతి ఇంట రాట్నం వుండాలని ,స్వదేశి ఉద్యమాన్ని బాల పరచమని ప్రజల్ని కోరారు .అప్పటికి  అప్పుడు ఒక వంద రూపాయలు స్వచ్చందం గా వసూలు చేసారు గాంది గారు అప్పుడు లోక మాన్య బాల గంగాధర తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మహక్కు నినాదానికి ధన సహాయం కోసం దేశం లో తిరిగారు ఈ వంద రూపాయల నిధిని స్వరాజ్య నిధికి జమ చేసారు ఇక్కడినుంచి పామర్రు మీదుగా బందరు వెళ్లారు .అక్కడ పుర సన్మానం జరిగింది

రెండవ సారి గాంధీ ఖద్దరు నిధి కోసం ఆంధ్ర వచ్చారు 1929  ఏప్రిల్ లో .హైదరాబాద్ లో బయల్దేరి జగ్గయ్య పేట,నందిగామ నూజివీడు మీదుగా విజయవాడ 11 వ తేదిన వచ్చి అక్కడినుండి రాత్రి ఎనిమిది గంటలకు వుయ్యూరు రహదారి బంగాళా చేరారు .ఆ రోజు రాత్రి బంగాళా లోనే బస ,నిద్ర ఆయనతో వచ్చిన వారందరికి మా ఇంటికి ఎదురుగా వుండే సూరి శోభనాచలపతి గారు వాళ్ళ దొడ్డిలో వంట చేయించి తరతమ భేదం లేకుండా ఒకే పంక్తి లో భోజనాలు పెట్టి అందరికి ఆశ్చర్యం కలిగించారని మా అమ్మ గారు చెప్పారు .గాంధీ గారు ఆయన విశాల దృక్పధాన్ని మెచ్చారట మర్నాడు ఆంటే ఏప్రిల్ 1 2 వ తేది ఉదయం ఆరు గంటలకే కుమ్మమూరు వెళ్లారట .అక్కడ మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి గారు మిగిలిన పెద్దలు అపూర్వ స్వాగతం చెప్పి ఖద్దరు నిధికి గాంధీ గారికి 400 రూపాయలు సమర్పించారట .కొందరు నగలు కూడా సమర్పించారట అక్కడ బయల్దేరి వుయ్యురుకు ఉదయం ఏడున్నరకు వచ్చారు గాంధీ వెంట పట్టాభి సీతా రామయ్య గారు అయ్యదేవర కాలేస్వర రావు గారు వున్నారు వుయ్యూరు cbm  స్కూల్ లో గాంధీ గారి సభా జరిగింది వుయ్యుర్ పంచాయితీ బోర్డుఇతర  మిత్ర పుర్సాప్రముఖులు ఘనం హనం గా సత్కరించారు మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు సన్మాన పత్రం రాసి చదివి సమర్పించారు అప్పుడు ఆయన  సిబియం స్కూల్ లో తెలుగు పండితులు గాయత్రి అనంత రామయ్య గారు మొదలయిన పుర ప్రముఖులు పాల్గొన్నారు .ఖద్దరు నిధికి 667 రూపాయలు ఒక\\\బంగారు ఉంగరం కొన్ని నిజాం నాణాలు గాంధీజీకి సమర్పించారు గాంధీనివిశ్వశాంతి  v nti ప్రదాతగా సుహృద్భావ సంపన్నుని గా వర్ణించారు సన్మాన పత్రం లో అంతే కాదు గాంధీ అహింస సిద్ధాంతం వల్ల ప్రపంచం లో భారత దేశం అత్యన్నత స్థితికి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు మహాత్ముడు చాల సంతోషించి గొప్ప సందేశం ఇచ్చారు .అందరు ఖద్దరు  ధరించాలి అన్నారు .బాల్యవివాహాలు చేయరాదని జాతీయ పునర్నిర్మాణానికి సంఘ సంస్కరణ అవసరం అని ఉద్బోధించారు .పంజాబు రాష్ట్రం తప్ప మిగిలిన రాష్ట్రాలలో ఆంధ్ర దేశం ఖద్దరు ఉత్పత్తిలో ముందు వుంది అని శ్లాఘించారు మహాత్ముడి ni పాద ధూళితో పునీతమై ఆయన బస తో ధన్యమైన ఈ రహదారి బంగాలను ఇక నుంచి ”మహాత్మా గాంధీ రహ దారి బంగాళా ”అని పిలవాలని దానికి తగ్గట్టు పంచాయితీ ,మండల పరిషత్ ,mlc  లు స్పందించి వెంటనే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని చెప్పాను వేలాది ప్రజలు నా  ప్రతిపాదనకు మిన్ను ముట్టే హర్ష ధ్వానాలు చేసారు . ఆనందం తో తన్మయున్నయాను వెంటనే వుయ్యురుసర్పంచ్ శ్రీ అంగడాల వెంకటేశ్వర రావు ,మండలాధ్యక్షురాలు శ్రీమతి సోర్నల సంతోష కుమారి రేపే తీర్మానాలు రాసి ఆమోదిమ్పజేసి ప్రభుత్వానికి పంపుతమన్నారు రాజేంద్ర ప్రసాద్ తన వంతు కృషి చేసి ప్రభుత్వం నుంచి అనుమతి తెప్పిస్తానని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు చివరిగా నేను గాంధీ గారి సందర్శనం చూపిన ప్రభావాన్ని గురించి చెప్పాను కుమ్మమూరు లో మైనేని గోపాల కృష్ణ గారి అక్క గారు అన్న పూర్ణమ్మ గారు గాంధీ రాక తో పులకించి ఆయన సందేశానికి ఆమోదం గా ఆరోజు నుంచి ఖద్దరు వస్త్రాలు కట్టటం ప్రారంభించారని ఇప్పటికి 85  ఏళ్ళ వయసు దాటినా ఖద్దరు కట్టుతున్నారని అనగానే జనం చాప్పట్లతోన్ ఆమెను అభినందించారు .అంతే కాదు గాంధీ గారి ఇంకో ఆదర్శం కులాంతర వివాహాన్ని ఆమె ఆచరించి మార్గదర్శి గా వున్నారని చెప్పాను ఆమె కమ్మ వారికులంలో పుట్టారు ఆమెతో పాటు గుంటూరు మెడికల్ కాలేజీ లో చదువుతున్న బ్రాహ్మల కులానికి చెందిన రాచకొండ నరసింహ శర్మ గారిని ప్రేమించి ,పెద్దల అంగీకారం తో వివాహం చేసుకొని చరితార్దు లయారు .ఆదర్శం మాటల్లో కాదు చేతల్లో చూపిన విదుషీమణి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు ఇప్పటికి ఆ వృద్ధ దంపతులు విశాఖ పట్నం లో ఎంతో అన్యోన్యం గా పిల్ల పాపలతో మనుమలు ,మనుమా రాళ్ళతో హాయిగా వున్నారని చెప్పాను .మళ్ళీ ఆనంద తరంగాలు వెలువడినాయి .తర్వాత రాజేంద్రుని కృషి దీక్ష ఈ కార్య క్రమన్న్ని విజయ వంతం చేసాయని స్లాఘించాను అందరి సహకారం తోడ్పాటు వుంటే ఏదైనా దిగ్విజయం అవుతుందని చెప్పాను  ”ఆంధ్ర ప్రదేశ్ లో గాంధీజీ ”అనే పుస్తకాన్ని స్వతంత్రసమర యోధుడు ,విద్వాంసుడు విశ్వనాధ సత్య నారాయణ గారి తో జంట కవిత్వం చెప్పిన కృష్ణా జిల్లా కొడాలి వాస్తవ్యులు కొడాలి ఆంజనేయులు ఇగారు రాసారని అందరు చదివి తెలుసుకో దగినవి అందులో చాల వున్నాయని తెలియ జేశాను చివరిగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ”భారత భాగ్య విధాత ”అన్న పేరుతొ రాసిన రెండు పద్యాలూ చదివి మహాత్మునికి నివాళు లర్పించాను  ఈ చారిత్రాత్మక ఘట్టం లో పాలు పంచుకున్నందుకు ఆనందం గా గర్వం గా వుంది . . .

‘యుగ పురుషుమ్దవంచు ,పురుషోత్తమ మూర్తి వటంచు,ముర్తిమ

జ్జగాదనరాగ  శాంతిమయ సాత్విక శక్తి వటంచు ,వేనవేల్
మొగముల ప్రస్తుతించెను ,ప్రమోదముతో ,జగమెల్ల నిన్ను ,ఏ
మగుదురు నీకు తొల్లి మహమ్మదు ,క్రీస్తును ,బుద్ధ దేవుడున్ ”
”నిండు మనస్వి ,విశ్రుత వినీత పునీత యశస్వి
సాత్వికాఖండ తపస్వి  —-సత్య సహకారము చిటారు కొమ్మ పై పండిన పండు ,
బ్రహ్మ రుషి భారత భాగ్య విధాత గాంధీజీ ”

 

Posted in సమయం - సందర్భం | 1 Comment

చిలుకూరి వెంకటేశ్వర్లు – శ్రీమద్రామాయణ రచన

Posted in అనువాదాలు | Leave a comment

శ్లేష క్రీడలు

శ్లేష క్రీడలు
——————————
”వేయిపదగల విశ్వనాధుడు  వరలక్ష్మికి భర్తా ?
ఆరుద్రునికీ శ్రీరంగం శ్రీనివాసునికి వైరమా”త్వమేవాహం ”కాదా          /
పోజీవుడా ఆంటే రాజీవుడా అంటున్దేమిటి పెంజీకటి లోకం ?
అది వాని కర్మ ఫలమే రామ జన్మ భూమిలో పుట్టిన ఆద్వానికి
అయస్  ‘కాంతం’  తో ఆకర్షింప బడ్డ ముని మాణిక్యం
శ్రీ శ్రీ లు ఎన్ని పెట్టుకున్నా శ్రీ శ్రీ సాటి ఎవ్వరు గువ్వల చెన్నా ?
జ్ఞాన పీఠం మీద కూర్చున్నా రోజుకో గేయమైన
రాయ టానికి సినారాయన రెడీ
ఫామేదా ”పామెలా బోర్డు  ”పై
అన్నీ సెక్సు రాతలే కూతలె   .
సెక్షులిరిజమ్ మోతాదు మించి నందుకే
ప్రజా స్వామ్యం లో రేపులు ,మాపులు మందిరాలలో ,మసీదుల్లో
”అమృతం కురిసిన రాత్రి (ధాత్రి )కి శోభా ”తిలకం ”
విశ్వ కుటుంబ భవనం పై ఎగరేసిన మానవీయ కేతనం
”చివరికి మిగిలిందేమిటి ”బుచ్చిబాబు
”కోమలి”న మైనా పంకజ మైన సర్డుకున్తవుగా  ప్రేమ పిచ్చి బాబు
”అసమర్ధుని జీవన యాత్రా ”కంటక మార్గం పై చాందినీ పరచిన గోపీ
”చీకటిగదులలో ”రాస్తున్నాడు ”పరమేశ్వరుని వీలు నామా ”
”  కుశా ”గ్రబుద్ధి కృష్ణ శాస్త్రి విరహ వేదనాగ్ని లో
బాష్ప సమిధలు వ్రేల్చి -యజ్న ఫలం ”పొందు ”ఊర్వసి ప్రేయసి .
‘దా”శరధి ‘మధనం లో జనించింది” అగ్ని ధార ”’

—                                               నిజాం నిరంకుశ వైఖరిఅపై నినదించిన” రుద్ర వీణ ”

వ్యవ హారిక భాష పై   ఆడు ”గిడుగు”  రామ మూర్తి
గ్రాంధిక తప్త అహల్యా శాప విమోచన కారుణ్య మూర్తి
దేవునితో వైరమా ?రామ సామీ ?
సూత పురాణ త్రిపుర నేమీ (నేనీ )
గబ్బిట దుర్గా ప్రసాద్
18 -02 – 1991  న ” జనత ”పత్రిక లో ప్రచురితం

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

మరో జయ ప్రకాష్ నారాయణ – అన్నాహజారే

మరో జయ ప్రకాష్ (లోక్ నాయక్)
అవినీతి హజం తో మత్తెక్కిన అధికార మత్త గజానికి

అంకుశం అయారు అన్నా హజారే
మెడలు వంచి ప్రజా బలం ఏమిటో
ప్రభుతకు నేర్పిన తరుణం
ఆశావహ వాతావరణం ఆవిష్కరింప బడిన
ఈ రోజు చరిత్ర లో మహత్తరం –
హజారాల వత్చారాలు జీవించాలి అన్నా హజారే
అతడు మన ముందున్న మరో జయ ప్రకాష్ నారాయణ

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | 1 Comment

మహాత్ముని స్మృతి పధం -శాంతి ర్యాలి ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

సత్యం శివం సుందరం

Satyam,sivam,sundaram
Men,women ,women and men everywhere
People of all walks of life here and there
The cream of intelligence
Drenched in the ocean of sorrow and suffering
lost faith in life with faces tears rolling
Seeking solace ,compassion and blessing
Empty hearts minds and souls
Poor creatures in the abode of God
Oh what a bleaming light around
What a sparkling lotus eyes
What a fragrance of serinityand sanctity
What an illumination from full moon
Oh,oh What a holy spirit before
An incarnation of God
An angel on earth
And an avatar of Bhagavan
With a touch ,smile ,and word
With a spoon of holy water And a few particles of vibhuti
With a small amount of holy offering Souls cleansed ,sorrows removed
New vistas of Horizon comes down
New thoughts full of devotion and dedication
New life in every poor soul
New birth for every one stood before
He is the guide ,philosopher ,and the master of your destiny
He is the doctor to cure your earthly disease
He is an actor to show the role of Almighty
He is a pleader to argue your case before Him
He is the leader to lead unto Him
He is not a man but a super man
He is not a saint but a Holy spirit
He is not Satya Sai
But an embodiment of Truth
Really ,really He is Satyam Sivam Sundaram
The three significant f actors of life
That lead ,guide and elevate you
To the altars of immortal happiness
Trust ,believe and follow
If that much you do
Rest assured all that he would do .
Gabbita Durga Prasad
Written on 5-12-1976

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

భార జలం

భార జలం
శతాబ్దాలుగా వెనుక పాడిన సీమ

నాడు రత్నాలు పండినా -నేడు రాళ్ళమయం
—    దశాబ్దాలుగా పంటకు వంటకే కాదు
అనంత శక్తిని పండించే మానవ అణు రియాక్టర్ క
భార జలం లాంటి ప్రాణ జలానికి నోచు కోక

శాప గ్రస్తులైన ప్రజల దాహార్తిని తీర్చే యత్నం
ప్రజల ప్రభుత్వాల చేత కాని తనం తో
దాహార్తులు అనుక్షణం  నింగి కేసి ఆశగా చూస్తుంటే
మానవ సేవా తత్పరతతో కాదన్నది ఔననిపించి
అసాధ్యమన్నది సుసాధ్యం చేసి గడువుకు ముందే
అనంత poor  ను అత్యంత pure  జలంతో అభిషేకించి
సుజల ,సుఫల వరదానం చేసిన bhaabhaa  బాబా
సత్య శివ సుందర విలసితం
ప్రేమ ,త్యాగ సేవా త్రివేణి సంగమం
అపర భగీరదులు ,అనంత కరుణా సంపన్నులు
మతత్రయానికి భాష్య కారులు
అఖిల ప్రపంచాన్ని సనాతన ధర్మ భూమి వైపుకు
ఆకర్షించిన సమదర్శి ,సనాతన సారధి
దైవమె అయిన మానవ ప్రయత్నం శక్తి తో
కృషి చేయాల్సిందే నని తెలియ జెప్పిన అవతార మూర్తి
శ్రీ సత్య సాయి బాబా మానవత్వం మూర్తీభ వించిన కారుణ్య మూర్తి
గబ్బిట దుర్గా ప్రసాద్
24 -11 -1995 న సాందీపని మాసపత్రికకు రాసిన కవిత
Posted in సమయం - సందర్భం | Leave a comment

చిన్న చిత్ర సంబరం విజయవాడ

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఉయ్యూరు ఉగాది 2011 విశేషాలు వార్తాపత్రికలలో

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఉగాది పురస్కారాలు ఆంధ్ర సారస్వత సమితి మచిలీ పట్నం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆలోచనా లోచనం మాలిన శరీరానికి తపస్సే సంస్కారం

ఆలోచనా లోచనం

మాలిన శరీరానికి తపస్సే సంస్కారం
—————————————–
ధర్మ్సాధనకు వుద్దేసిమ్పబడింది మానవ శరీరం .ఆ విషయాన్నీ మరచి పోయి దాన్ని మన చేష్టలతో ,ఆలోచనలతో మలినం చేస్తుంటాం .మంచి శరీరానికి మంచి మనసు అవసరం .ఈ రెండు దారి తప్పితే వ్యధా భరిత జీవితం అనుభవించాల్సిందే .తన దుశ్చర్య వల్ల దురాలోచన వల్ల జరిగిన అనర్ధాన్ని చిట్టచివరకు కానీ తెలుసుకో లేక పోయాడు ద్రుత రాస్త్రుడు .కన్నులే కాదు ,మనసు హృదయం కూడా గుడ్డివే అయాయి ఆయనకు .అప్పటిదాకా గుర్తుకు రాని పరలోక ధ్యాస ఇప్పుడు కలిగింది అందుకే తపస్సు తో తన శరీర మాలిన్యాని దగ్ధం చేసుకోవాలని అనుకున్నాడు .దీన్ని వివరించే మహా భారత కధను తెలుసు కుందాం.  .
ఒక రోజు రాజు అయిన  ధర్మ రాజు ను బంధువుల్ని తన సమక్షం లోకి పిలుచుకున్నాడు ద్రుత రాస్త్రుడు ..చాల కాలం ప్రాపంచిక విషయాలతోమలినమయిన p తన శరీరాన్ని ,మనసును
తపస్సు తో సంస్కరించుకోవాలని అనుకుంటున్నానని తెలియ జేసి అనుమతి కోరాడు .విదుర ,సంజయ ,గాంధారి కుంతిలతో కలిసి ఆయన హస్తిన వదలి కురుక్షేత్రం చేరాడు .అక్కడ ఆశ్రమం లో తీవ్ర తపస్సు చేసాడు .ఇక్కడ ధర్మ రాజడులు వారి వివరాలేమీ తెలియక బాధ పడ్డారు .ఎట్టకేలకు ధర్మ రాజు అనుజులతో ,,బంధు గణం తో బయల్దేరి ద్రుత రాష్ట్ర మహర్షి ఆశ్రమం చేరారు .తల్లికి ,గాంధారి ,ద్రుత రాస్త్రునికి నమస్కరించారు వారంతా .అయితె వారికి అక్కడ ధర్మస్వరూపుడు నీతి విశారదు అయిన విదురుడు కనిపించ లేదు .చాలదిగులు ల చెందారు ధర్మ రాజాదులు .ఆ విషయమై ప్రశ్నించారు పెడతంద్రిని .దానికి ఆయన ”విదురుడు మహా జ్ఞాని అధికారం లో వుండగా అతను చెప్పిన నీతి బోధలు న్నా తలకు ఎక్కలేదు .పెడచెవిని పెట్టి కురువంశ నాసనాన్ని  నా చేతుల మీదుగా తెచ్చుకున్నాను ..ఇప్పుడు నా మనసు నా వశం లో వుంది .స్థిర చిత్తం తో తపస్సు చేసు  చేసుకుంటున్నాను .శరీరాన్ని ,మనసును పరిశుద్ధం చేసుకున్నాను .కాని విదురుడు నా నీడ కూడా తనపై పడకూడదని ఏమో ఎక్కడో దూరం గా పోయి తపస్సు చేసు కుంటున్నట్లు తెలిసింది ఒంటరి గానే వున్నాడు .సర్వాన్ని త్యజించాడు విదురుడు .కొన్ని రోజులు నీరు ,గాలి మాత్రమే ఆహరం గా స్వీకరించి తపస్సు చేసాడట.ఆ తర్వాత అదీ మానేశాడట అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుంటాడు ”అని చెప్పాడు
ధర్మ రాజడులు విదురుని కోసం వెదికారు .దూరం గా ఎక్కడో విదురుడు కన్పించాడు ,తాను ధర్మ రాజు నని ఆయన దర్సనం కోసమే వచ్చానని ,యుదిస్టిరుడు బిగ్గరగా అరుస్తూ చెప్పాడు ,యివేమీ పట్టించు కోకుండా నీతి కోవిదుడు ,మహా తపస్సంపంనుడు ,జితేంద్రియుడు అయిన విదురుడు పొదల చాటుకు వెళ్లి పోయాడు .ధర్మ రాజు అతికష్టం మీద ఆయన వున్న పొద దగ్గరికి చేరాడు .అర్ధనిమీలిత నేత్రాలతో మౌనం గా నిలిచి పోయాడు విదురుడు .విదురుని తల అంతా జడలు కట్టింది .శరీరానికి ఆచ్చాదన లేదు .ధూళి దు దుసర గ్రస్త మయింది .ఎవరిని గుర్తు పట్టే స్థితిలో లేదు .తాను ధర్మరజునని తెలియ చెప్పినా ,ఆయనకేమీ పట్డులేదు  .పరమహంస స్థితి పొందాడు .చివరికి కనురెప్పలు ఎత్తి చూసాడు .వెంటనే యోగమార్గం లో శరీరం త్యజించాడు .ఆయన దివ్య తేజస్సు ధర్మరాజు శరీరం లోకి చేరింది .దీనితో ధర్మరాజుకు నూతన శక్తి తేజం కలిగాయి .బుద్ధి బలము హెచ్చింది .విదురుని శరీరం చెట్టుకు చేరబడి నిద్రపోతున్నట్లుగా కన్పించింది .ఆయన మృతదేహానికి అగ్నికార్యం చేయాలనీ సంకల్పించాడు ఇంతలో అశరీర వాణి విదురుడు యతిఆ  యాడని ,అగ్ని సంస్కారం చేయ కూడదని హితవు చెప్పింది .యోగాగ్నితో పునీతుడై పరమ హంసయై ,యతి అయి న మహా పురుషుడు ,పుణ్యముర్తి విడురదేవుడు .ధ్రుతరాస్త్ర ,దుర్యోధనుల రాజ్యం లో తాను చెప్పిన నీతి బోధలు వారి చెవికి యెక్క లేదు .తాను ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితి లో వుండి పోవాల్సి వచ్చింది .అదే ఆయన్ను బాధించి తీవ్ర తపస్సమాదికి ప్రోత్చాహించింది .మాలిన్య రహితుడై పునీతుడయాడు .తపస్సుకు యోగానికి అంతటి శక్తి వుందని ఈ కధ మనకు అందించిన సందేశం.
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనం శీర్షికతో ధారా వాహికంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 05 -04 -2011  న ప్రసారమయిన రచన .
Posted in రేడియో లో | Tagged | Leave a comment

శ్రీ ఖర ఉగాది కవిత ——–అభినవ రాముడెవరో రావాలి

04 – 04 -20011 న మొవ్వలో ”శ్రీ క్షేత్రయ్య పదకవితా సమాఖ్య ” నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత

శ్రీ ఖర  ఉగాది కవిత ——–అభినవ రాముడెవరో రావాలి

కాలకేయాది దానవులతో పాటు
సహోదరి సుర్పనఖ భర్తనూ చంపి
ఆమె అఘోరిస్తే యుద్ధం లో బందుత్వాలుండవు
ఆని రావణ నీతి బోధించాడు లంకాధిపతి
ఆమె నిస్టురాలకు చలించి
సోదర తుల్యుడైన ఖరుణ్ణి
దండకారన్యాది పతిని చేసి
పద్నాలుగు వేల రాక్షస సైన్యానికి
సోదరుదూ డుషనుడిని  సైన్యాధి పతిని చేసి
ఆమెకు తోడుగా జన స్థానానికి పంపాడు
ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా
\                  సాగవచ్చునని అభయ ప్రదానమూ చేసాడు
పెచ్చురేగిన ఆ మూక ఆకృత్యాలకు ఆంటే లేదు
అడ్డు ఆపు అసలే లేదు
సాధారణ జన జీవితం ,మునిగణ జీవితం
ప్రమాదపు అంచున పడింది
మునిజనుల కోర్కెపై వారికి అభయ ప్రదానం చేసి
ఆ ఖరాది దానవ సంహారం చేసి వీర విహారం సృష్టించాడు శ్రీ రాముడు
మళ్లి ఆ ఖరుడే ఈ ఏడు రాజ్యం యేలు తాడట
ఏ  బీభాత్చాలు సృస్తిస్తాడో వున్న వాటికీ తోడూ
అసలే మనమున్నది కారుణ్యం ,దయ ,సానుభూతి లేని జన దండకారణ్యం
అడుగడుగునా , గాంధారి కొడుకులు  ప్రబలు తున్న విపత్కర స్థితి
హింస ,దౌర్జన్యం ,అవినీతి ముప్పేటగా వురి బిగిస్తోంది
సెజ్ లు నాన్ వెజ్ లుగా పీక్కు తింటున్న రాబందులు
కుంభ కోణాలు spectrum  గా వింత రంగులీనుతున్న సమయం
విచ్చలవిడి తనం పెచ్చరిల్లు తున్న దినాలు
అందుకే జనస్థాన వృత్తాంతం పునరావ్రుత్తమవాలి
అభినవ శ్రిరాముడెవరో  రావాలి
ఖరాది దానవ సంహారం చేయాలి
అప్పుడే శ్రీ ఖర శ్రీకరమై శుభ కరమై ,సౌభాగ్య, సంతోష సంపత్కరమవుతుంది
ఆ తర్వాత వచ్చే” నందన ”కు ఆనందాన్ని అందించే పునాది అవుతుంది .
దుర్గా ప్రసాద్
04 – 04 -20011 న మొవ్వలో ”శ్రీ క్షేత్రయ్య పదకవితా సమాఖ్య ” నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత
Posted in సమయం - సందర్భం | Leave a comment

ఉగాది కానుక

ఉగాది కానుక

రెండు రోజుల ముందే వచ్చింది ఉగాది యావత్ భారతదేశానికి
అమావాస్యనాడు విజయం వెన్నెల పంచేసింది
అంబరాలు దాటే సంబరాన్ని ముంగిట్లోకి తెచ్చేసింది
ఊరించి ఊరించి ఉగాది కానుక నిచ్చేసింది
యవత్ప్రపంచం ఉత్కంత తో ఎదురు చూసిన వేళ
క్రికెట్ క్రెడిట్ దక్కించుకుంది సాహసం తో పోరాడి సాధించింది
ఆట ”గంభీరమై ”యువరాజ విరాజిత ”మైన వేళ
”సింహ”సద్రుసమైన పోరుతో ధనా ”ధోనీ ”(ధ్వని) యంగా
మహేంద్రుడు విజ్రుమ్భించిన వేళ
మాస్టర్ బ్లాస్టర్ చెయ్యక పోయినా

సేహ్వాగు పరుగుల వాగు పారించక  పోయినా

ప్రపంచ జగజ్జెట్టి లంకను వుఫ్ఫ్ మని లంకకు నెట్టేసి
ప్రపంచపు పై కప్పు గా కప్పును సాధించిన వేళ
వాంఖేడే వాళ్ళకు ఖేదం మనకు మోదం అయినవేళ
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదించింది
నాడు ”కపిలుడు ”దేవుడైతే  నేడు ”మహేంద్రుడు ”మహిమాన్వితుడు అయాడు
ఈ విజయం సచిన్ సచ్చీలనికి నిరంతర శ్రమకు సేవకు
కానుక గా చేయటం ధోని సేన వినమ్రతకు నిదర్శనం
చారిత్రాత్మక ఔచిత్యం గర్వకారణం
మేరా భారత్ మహాన్ జయహో జయహో .
గబ్బిట దుర్గా ప్రసాద్
03 – 04 -2011
Posted in సమయం - సందర్భం | Leave a comment

నిత్య నూతన నట వర ప్రసాద్ – శ్రద్ధాంజలి

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఊయల సేవ ప్రాముఖ్యత

ఊయల సేవ
—      ఆలయ వుత్శవ సంప్రదాయం లో ప్రభాతసేవ అర్చన కళ్యాణం కైంకర్యం నీరాజనం ఊరేగింపు   ఊయల సేవ ముఖ్య మైనవి ఇవన్ని ఈ నెల రోజులు జరుపు కున్నం చివరిదైన ఊయల సేవలో ధన్య మవుదంనిత్యం మనల్ని కంటికి రెప్ప ల కాపాడుతున్న ఆ దేవ దేవునికి కొంచెం విశ్రాంతి నివ్వాలనే తలంపు మానవునికి కల్గి ఇలా సేవలో ధన్యత చెందుతున్నాడు .

”ఎటులైన భక్తీ వచ్చుటకే ప్రయత్నమూ సేయవే మానస ”అనేది త్యాగరాజ సూక్తి .అందుకే ఆయన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క గుడి ఆ గుడిలో కావ్య గన సరస్వతి కనిపిస్తుంది .ఆధ్యాత్మిక భావం తో సంగీతం ,కవిత్వం, త్యగరాజ కీర్తనలలో ధాన్యం చెందాయి .వేదాంత సారం తో బ్రహ్మానంద రసానందాన్ని పొందిన మహాను భవుడు .భక్తియే జీవన్ముక్తి సదనం గ భావించి తరించాడు .దర్శనాలు అనేకం అయిన దైవం ఒకడే నని భావించి గణ వేదం తో శ్రీరామా పరబ్రహ్మాన్ని అర్చించి స్మరించి గానం చేసి ధన్యుదయాడు .మనము కూడా ఇక్కడ ఈ సువర్చలన్జనేయ స్వామి వారి సన్నిధి లోవరిలోనే సర్వ దేవత దర్సనం చేసి ఆ సంగీత సరస్వతిని అర్చించి నీరాజనలిద్దాం  .
”ANY KIND OF  SOUND  IS ENERGY ” అన్నారు .మనసు నిర్మలం చేసుకొని భక్తితోఈస్వరార్పణం చేసే సంగీతమే రాణిస్తుంది .”ఎవరని నిన్ను కీర్తించా వలనయ్యసివుదివో మాధవుదివో కమలభావుడవో పరబ్రహ్మవో ”అని అందర్నీ ఒక్కరి లోనే చూస్తాడు త్యాగయ్య .”సీత,గౌరీ ,వా వగేస్వరియును స్త్రీ రూపము లంద ,లోక కోటు లంద ”అని అడుగుతాడు  .నాదం పరబ్రహ్మ స్వరూపం .దాన్ని ఉపాసించి TARINCHARAYANA .నాదం అనేది యోగాభాషలో ”అనాహతం ”అక్కడే స్వాతీ నక్షత్రం వుంటుంది .వాయు సంబంది .మన దేవుడు వాయు పుత్రుడిగా .సప్త స్వరాలు ఇక్కడే పుడతాయి స్వాతీ నక్షత్రం లోనే మకర సంక్రమణం అయింది ఈ ఏడు .అపూర్వ మైన పుణ్య సమయం .అద్భుత భక్తీ భావం తో స్వామిని సేవించి తరిద్దాం .”అందుకే స్వాదు ఫల ప్రద సప్తస్వర రాగ నిచయ సహిత హరిహరాత్మక భు,సుర శరజన్మ గానేసాదులు ”వుపసించి తరించారట .”సరగున పదములకు స్వాంతమను సరోజమును సమర్పించిన వా అరెందరో మహాను భావులు”  ”హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచు పులక శరీరులై యానంద పయోధి నిమగ్నులయి ముదంబున యశము గల వారెందరో మహాను భావులు ”అని పొగిడారు త్యాగరాజు .
”బాల కనక మయ చేల సుజన పరిపాల శ్రీ రమాలోల విద్రుత శరజాల సుభద కరుణాలవాల ఘన నీల నవమల్లికాభారణ ఏలా దయ రాదు?”  పరాకు చేసేవేల సమయము కాదు ”అని ప్రాధేయ పడ్డాడు ఆ భక్త కవి ”పదము త్యాగరాజ నుతుని పై గానిది పడితే నేమి ఎడ్చితే నేమి ”అని భక్తిని ప్రదర్సిస్తాడు .”సకల భూతము లందు నీవై యుండగా మది లేక బోయిన చిరుత ప్రాయము నాడే భజనామృత రస హీన కుతర్కుడైన పరధనముల కొరకు నొరుల మది కరగబల్కి కడుపు నిండ తిరిగినట్టిదుడుకుగల నిన్నే   ద్దుకుదొరకొడుకు బ్రోచురా  అని తన తప్పు లన్ని విన్న విన్చుకున్నాడు నీవే తప్ప వేరే దిక్కు లేరని మొర పెట్టు కున్నాడు భక్త త్యాగయ్య ?”

”మరుగేలరా ఓ రాఘవ చరాచర రూప పరాత్పర ,సూర్య సుధారాకర లోచన అన్ని నీవనుచు అంతరంగమున ,తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య నిన్నే గని మది నెన్న జాల నొరుల ,నన్ను బ్రోవ వయ్య త్యాగరాజ వినుత ”అని అన్నీ E ఆయనే అంటాడు ..నాదోపాసన ఒక్కటే తరించే మార్గం అందుకే ”శోభిల్లు సప్తస్వర సుందరుల భాజిన్చవే మనసా”అన్నాడు ”తలచితే మేనెల్ల పులకరించేని రామకనుగొన్న   ననడమ I కన్నీరు నిన్దేదిని ఆలసించు వేల జగమంతా తరుణ మయ్యేని -చెంతనుండ నాడు చింతలు తొలగేని ”అని విశ్వాసం ప్రకటించాడు .
సద్భాక్తిలో జనులున్డటం చూసి యముడు చిన్తిస్తున్నాడట ”సతతము సుజను లెల్ల సద్భజన చేయుట చూచి చిన్తిన్చుచున్నాడు యముడు ”అని భక్తీ గొప్ప తనం చాటాడు .భక్తునికి భగవంతునికి భేదం లేదు .”నీవే నేనైనా నీవాడు గాక త్యాగరాజు వేరా //”అని ధైర్యం తో జ్ఞానం తో చెప్పాడు .”నీదు పలుకు పలుకురా నీదు కులుకే కులుకురా ,నీదు తళుకే తళుకురా ”అని మధుర ప్రేమతో ఆ రాధించాడు .          త్యాగరాజ పంచరత్న కీర్తనలు జగత్ప్రసిద్ధం .అందులో మొదటిది ”జగదానంద కరక ”రెండోది ;”దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ”మూడవది సాధించెనే మనసా ”నాల్గవది ”కాన కాన రుచిరా ” అయిదవది ఎందరో మహాను భావులు ”వరుసగా అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ విజ్ఞానమయ ,ఆనందమయ కొసలకు ప్రతీకలు గ పండితాభిప్రాయం .అంటే అయిదు మెట్లుగా బ్రహ్మానందాన్ని పొందే ప్రయత్నం అన్న మాట ఇంతకీ ఆంజనేయుడికి సంగీతానికి ఏమిటి సంబంధం ?సంగీతం రెండు రకాలు ఉత్తరాది సంగీతం దక్షిణాది సంగీతం మొదటి దాన్ని హిందూ స్తాని అంటారు దీనికి ఆద్యుడు హనుమంతుడు అందుకే దాన్ని హనుమద్గానం అని కూడా అంటారు రెండవదాన్ని కర్ణాటక సంగీతం అంటారు దీనికి నారదుడు మూల పురుషుడు కనుక నారద గానం అంటారు
తుంబుర నారద హానుమలు గొప్పసంగీత వేత్తలు ,విద్వాంసులు  .అందుకే హనుమ సన్నిధి లో ఈ సంగీత రస లహరి .
గబ్బిట దుర్గా ప్రసాద్
15 -01 -1996   నశ్రీ SUVARCHALANJANEYA స్వామి ఆలయం లో ధనుర్మాసం సందర్భం గ జరిగిన పవళింపు సేవ లో మాట్లాడిన మాటలివి.
Posted in సమయం - సందర్భం | Leave a comment