వింత ఆలయాలు -విచిత్త్ర విషయాలు -2

 వింత ఆలయాలు -విచిత్త్ర విషయాలు -2
                                               నెర  నిరూపణ   చేసే  శుచీంద్ర  శివుడు   
              తమిళ నాడు లో కన్యాకుమారి అగ్రానికి 12 కి.మీ.దూరం లో శుచీంద్రం వుంది .లింగ రూప మైన శుచీన్ద్రుడు త్రిముత్ర్యాత్మక  స్వరూపుడైన స్వయంభు .అడుగున బ్రహ్మ ,మధ్య విష్ణువు ,పైన శివుడు వుంటారు .ఇది దత్తాత్రేయ క్షేత్రం .ఆయనకు” కోన రాయుడు ”అని పేరు .శంకర భగవత్పాదులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పరమ శివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షం గా కన్ను లారా తిలకిన్చారట .శివుడు ఆది శంకరుల వారికి ”ప్రణవ మంత్రాన్ని ”ఉపదేశించిన పవిత్ర స్తలం ఇది .ఇంద్రుడు అహల్య విషయం లో పొందిన శాపాన్ని పోగొట్టు  కోవటానికి ఇక్కడి స్వామిని అర్చిన్చాదట .కాగుతున్న నేతి లో మునిగి ప్రక్షాళన చేసుకోన్నాదట .స్వామి దయ వల్ల ఒళ్లంతా వున్న కళ్ళు అన్నీ పోయి మళ్ళీ మామూలు రూపాన్ని పొందాడని కధనం .దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక శుచీంద్రం అని పిలువ బడు తోంది .నేరం చేసిన వారిని ఆలయానికి రప్పించి ,సభ పెట్టి ,కాగుతున్న నేతి లో చేతులుంచి ,బొబ్బలు రాక పొతే నిర్దోషి అని తేల్చటం ఈ మధ్య వరకు ఉందట .ముఖ మండపం లో ఒకే స్తంభం పై చెక్కిన పొడుగాటి వెదురు బొంగు ల వంటి రాతి కర్రల లో నుంచి సంగీతం లోని సప్త స్వరాలు ,వివిధ శ్రుతులతో వినిపించటం ఇక్కడి ప్రత్యేకత .ఒకే స్థంభం మీద ముందు పురుషాకృతి ,వెనుక స్త్రీ రూపం వుండటం మరో వింత .
                                  విభూతి తో అభిషేకం -తిరు చందూర్ 
               తమిళ నాడు లోని తిరునల్వేలికి 60 కి.మీ .దూరం లో సముద్రపు అంచున తిరు చందూర్ వుంది .ఇక్కడి సుబ్రహ్మన్యేశ్వర స్వామి  అత్యంత సంపన్నుడు .తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు శూర పద్ముడు పారి పొతే కుమార స్వామి వెంబడిస్తే ,వాడు మామిడి చెట్టు గా మారి పోయాడు .స్వామి ,బల్లెం తో చెట్టు నుంచి చీల్చి వాణ్ని చంపేశాడు .అప్పుడు ఆ చెట్టు లో ఒక భాగ్సం నెమలి గా ,రెండో భాగం కోడిగా మారాయి .ఆ రెండిటిని కుమార స్వామి వాహనాలుగా చేసుకొన్నాడు .ఆయన ఆయుధ మైన బల్లెం ,ఆయనకు చిహ్నం గా పూజ లందు కొంటుంది ఇక్కడ. .ఇక్కడి శరవణ భవుడైన కుమార స్వామికి ఉదయం పది గంటలకు ,సాయంత్రం ఆరు గంటలకు విభూతి తో అభిషేకం రెండు సార్లు జరగటం విశేషం .సముద్రపు ఒడ్డున ఒక బావి లో తియ్యని నీరు లభించటం మరో గొప్ప విచిత్రం .
   తంజావూరు బృహదీశ్వరుడు
భారతీయ శిల్ప కళా వైభవానికి గొప్ప ఉదాహరణ తంజా వూరు .ఇక్కడి అతి ప్రాచీన” సరస్వతి మహల్ ”అనే పెద్ద గ్రంధాలయం వుంది .ప్రపంచ భాషల పుస్తకాలన్నీ ఇక్కడ లభిస్తాయి .పురాతన గ్రంధాలన్నీ ఇక్కడే దొరుకు తాయి .పరిశోధకుల పాలిటి కల్ప వృక్షం ఈ గ్రంధాలయం .ఇక్కడి బృహ దీశ్వరాలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది .బృహత్ అంటే చాలా పెద్దది అని అర్ధం .బృహదీశ్వరలింగం నల్ల రాతి తో చేయబడి ,16 అడుగుల ఎత్తు ,21 అడుగుల కైవారం కలిగి  వుంటుంది .ఆరు అడుగుల ఎత్తు పునాది మీద నిర్మించిన ఆలయమిది .ఇక్కడి నంది పందోమ్మిదిన్నర ,ఎనిమిదిన్నర ,పన్నెండు అడుగుల కొలతలతో 25 టన్నుల బరువుంటుంది .లేపాక్షి తర్వాత పెద్ద నంది ఇదే .నంది వున్న చోటు నుంచి 50 గజాల దూరం లో ఆలయం వుండటం మరీ విశేషం .ఆలయం వంద గజాల పొడవు ,యాభై గజాల వెడల్పు వున్న పెద్ద ఆలయం .చాలా మండ పాలున్నాయి .విమానం ఎత్తు 216 అడుగులు తో 14 అంతస్తులతో వుండటం వింతల్లో వింత .చిట్ట చివరి శిఖరమే 20 అడుగుల ఎత్తు,100 అడుగుల చుట్టు కొలత వున్న ఏక శిల గా .ఉంటుందంటే ,యెంత పెద్ద ఆలయమో ఇది అని .ఆశ్చర్యమేస్తుంది .
అయి పోయింది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్–26 -03 -12 .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1

   వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1

                                                  ద్వాదశం రాసుల పై సూర్య కిరణ ప్రసారం -శృంగేరి
 కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి .ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం .శృంగ గిరే శృంగేరి గా మారింది .ఆది శంకరా  చార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు .శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం వుంది .శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు..105 సంవత్స రాలు పీఠాది పత్యం వహించిన పుణ్య పురుషులు .అందుకని శిష్యుడు కృతజ్ఞత గా ఈ ఆలయాన్ని కట్టించారు .ఇది 1338 లో నిర్మిత మైంది .
ముఖ మండపం లో 12 రాతి స్తంభాలున్నాయి .ఇవి 12 రాశుల పేర్లతో వుంటాయి .సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ,ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం .ఖగోళ ,జ్యోతిష ,గణిత ,వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం .స్తంభాల పై సింహం ఆకారం లో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం .వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు ,పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు ,అన్నీ ఒకే శిలతో నిర్మింప బడి ఉండటం ఆశ్చర్య కరం .ఆలయం బయట గోడలు కోణాలు ,కోణాలుగా చెక్క బడి వుండటం ఇంకో విచిత్రాను భూతి .పొడ వైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించి నట్లు గా అని పిస్తుంది .ఇక్కడి శిల్ప సంపద అసదృశం గా వుంటుంది .
                      శైవ జైన వైష్ణవ సామ రాస్యానికి ప్రతీక ధర్మ స్థల 
కర్ణాటక లో మంగుళూరు నుంచి ౪౦ కి.మీ.దూరం లో వున్న చిన్న గ్రామమే ధర్మ స్థలి .ఇక్కడి శివుడు మంజు నాధుడు .పూజారులు రాజా కుటుంబాలకు చెందిన వైష్ణవులు .ఆలయ నిర్వాహకులు జైనులు .ఇదీ ఇక్కడి విశేషం .మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ ధర్మ స్థలం .మంజు అంటే కన్నడం లో మంచు అని అర్ధం .శివుడు మంచు పర్వత మైన కైలాస గిరి పై ఉంటాడు కనుక ఆ పేరు .”వాడి రాజా తీర్ధులు ”అనే వైష్ణవ స్వామి స్వయం గా ఇక్కడ లింగ ప్రతిష్ట చేశారు .దేవ రాజ హేగ్గడే అనే జైన మతస్తుడు మొదటగా విగ్రహాన్ని ప్రతిష్టించి నట్లు తెలుస్తోంది .”కుడుము ”అనే పేరు వున్న ఈ గ్రామం క్రమం గా ధర్మ స్థలి  అనే పేరు గా మార్పు చెందింది .జైన దేవుని అతి పెద్ద విగ్రహం అత్యాకర్ష ణీయం గా  ఇక్కడికి దగ్గరలో శ్రావణ బెల్గోలా లో వుండటం మరో వింత .నిజాయితీ కి మారు పేరు ధర్మ స్థలి .దొంగతనం అనేది వుండదు .ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఎంత కాల మైనా వుంటాయి .అందుకే ఆపేరు వచ్చింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -03 -12 .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 2 Comments

వేలూరి వారి కధ -గన్నేరు

  వేలూరి వారి కధ -గన్నేరు
శివ రామ శాస్త్రి గారి కధల్లో ”గన్నేరు ”కు ప్రత్యేకత వుంది .బాల వితంతువులకు పునర్వివాహం నిషిద్ధం గా వున్న రోజులవి .సాంప్రదాయ కుటుంబాలలో ఆంక్షలు మరీ ఎక్కువ .ఆచారాలు శృతి మించేవి .ఎమాత్రేం బెసిగినా సహించే వారు కాదు .వితంతువులకు పసుపు ,కుంకుమ త్యాజ్య వస్తువులు .పూల సంగతి మాట్లాడే పనే లేదు .అతి బాల్యం లో భర్త చని పోతే ,ఆ పిల్ల మానసిక స్థితి ఏమిటి ?ఆ లేత గులాబి అలానే మోడి జీవిన్చాలా ?ఆమె కోరికలకు అర్ధం ,విలువా ఉండవా ?వాటిని మన్నించాల్సిన తలిదండ్రుల మూర్ఖత్వం కు ఆమె బలి అవాలా ?అలాంటి అభాగ్య రాలి కధే ”గన్నేరు ”ఇక్కడ ఆ పిల్ల పేరే వుండదు .”ఆ అమ్మాయి ”అని మాత్రమే అంటారు .అవును ,ఎపరైతే నేమి అలాంటి ఏ పిల్ల జీవిత మైనా అంతే కదా ?అందుకే ఆపిల్లకు పేరు పెట్ట లేదు శాస్త్రి గారు .
ఆ ఇంటి వాతావరణం తో కధ ప్రారంభిస్తారు .”అదుగో అడుగదుగో ,ఆ ఎదుట సందు మొదట ఇటుకలు బయట పడ్డ ఆ పాథ ఇల్లున్నదే !ఆ ఇంట్లోనే ఆ అమ్మాయి వుంది .”ఈ వాక్యం లోనే ఆ అమ్మాయి కడు  పేదరిక కుటుంబానికి చెందిందని ,ఇల్లు బాగు చేయించుకొనే స్తోమత కూడా తండ్రికి లేదని అర్ధమవుతుంది .తండ్రి నిష్టా పరుడు .నిత్య పూజారి .ఇంట్లో ”భోనేశ్వరం ”వుంది .శివ పూజా దురంధరుదన్న మాట .ఆది భిక్షువు వాడి నేది అడిగేది ?వాడు ఏది ఇచ్చేది రకం .ఆ పిల్ల తండ్రి కోసం రోజూ దొడ్లోని పూలు కొస్తుంది .”ఆమెది చంపకం లాంటి రంగు .ఒంటి మీది బట్ట పాల తెలుపు .బొట్టు పెట్టు కోదు .చెక్కిళ్ళు పాలు కారుతున్నాయి .తెల్ల నంది వర్ధనం లాంటి అమ్మాయి .పాలు కారే వయసులో పసుపు కుంకాలు నీరు కారి పోయాయి ”.విధి వంచిత ఆమె .
దొడ్లో పచ్చ గన్నీర్లు విరివిగా పూస్తున్నాయి .”చెట్ల కింద మోకాలి ఎత్తున భూదేవిని స్వయం గా పూజిస్తాయి  ”అని అవి అలా పూసి రాలి పోవాల్సిందే నని తెలియ జెప్పారు .అవి దేవుడికి పనికి రాని పూలు .ధూళి పాలైన పూలు పనికి రావని తండ్రి రోజూ జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు .ఎందుకు పనికి రావో ,ఆ పిల్లకు తెలియదు .ప్రశ్నించే సాహసమూ లేదు .
ఆ ప్రక్క ఇంట్లో ఈ మధ్యే ఒక కొత్త కుటుంబం వచ్చింది .వారికి ఇద్దరాడ పిల్లలు ఈ అమ్మాయి ఈడు వాళ్ళే .వాళ్ళిద్దరూ వీరింటికి పూలు యేరు కోవటానికి వచ్చారు .వాళ్ళింట్లో దేవ తార్చన లేదుగా ,పూలెందుకు /అని ఈ పిల్ల ప్రశ్నించింది .వాటిని న్రంగుల తొట్టె లో ఎండ బెట్టి ,ఆ రంగును బట్టలకు అడ్డు తామని వాళ్ళిద్దరి సమాధానం .ఈమె కూడా రాలిన పూలను ఏరి చెంగు లోకి ఎత్తు కొంది .తండ్రి చూసి కోప్పడ్డాడు .”నేనూ బట్టలకు రంగు అద్దిన్చుకొంటాను ”అంది అమాయకం గా .రంగు బట్టలు కట్టే అదృష్టం ఆమెకిక లేదని తెలీని అమాయకత్వం ఆమెది .’ఆ పిల్లల ఇల్లు పంచ రంగు ”తన ఒళ్లంతా తెలుపు ”వాళ్ళలో పచ్చదనం గుబాలిస్తుంటే ,ఈమెకు తెల్లదనమే ,అంతా విన్నదనమే .తండ్రి మాటలకు ఆ పిల్ల లిద్దరూ భయ పడి పారి పోయారు .వాళ్ళు పారిపోతుంటే గన్నేరు పూలన్నీ నేల పాలైనాయి .అంటే ,ఆ పిల్ల జీవితం నేల పాలౌతుందనే సూచన ఇక్కడ మనకు అనిపిస్తుంది .
పక్కింటి ఇద్దరు పిల్లలకు ఒక రోజూ రాత్రి ఒకే ముహూర్తం లో పెళ్ళిళ్ళు జరగ బోతున్నాయి .వాళ్ల తండ్రి అనువైన సంబంధాలను వెతికి కుదిర్చాడు .ఈ పిల్ల తల్లి ఆ పెళ్ళికి వెళ్ళింది పిలిస్తే .ఈ అమ్మాయి వెళ్ళ లేదు సుమంగళి కాదు కదా !’పెళ్ళికి ముత్తైదువులు వెళ్తారు కాని ,ఈ వెధవంమాయి రాక్షసో ,దాకినో కాదూ !పైగా అమంగళం ”అంటారు శతావధాని శాస్త్రి గారు .ఆ పిల్ల పై వీరి సానుభూతి అంత గొప్పది .ఆయన విశాల హృదయానికి జోహార్లు అర్పించాలని పిస్తుంది .కొత్త విధానాలు రావాలని శాస్త్రి గారి భావన మనకు అర్ధమవుతుంది .
పెళ్లి వారు దిగారు .రాజా కుమారుల్లా వున్నారు జంట పెళ్లి కొడుకులు .ఈ పిల్ల కిటికీ లోంచి తొంగి చూసింది .తన ఇంటికి దగ్గర లో వైభోగం .ఇక్కడ అంతా చీకటి ,కారు చీకటి .ఏదో తళుక్కున ఆమె మదిలో మెదిలింది .రాత్రి చాలా పొద్దు బోయింది .  పెళ్లి అయిపోయి తల్లి తిరిగి వచ్చింది పెళ్లి నుంచి .
”ప్రమిద లో ఆముదం తగ్గడం వల్ల దీపం నక నక లాడుతోంది .ఆ అమ్మాయి కింద పడి వుంది ”తల్లి ఆ అమ్మాయి ముఖం కేసి చూసింది .ఆమె గుడ్లు అలాగే నిలబడి పోయాయి .ఆమె చేతిలో గన్నేరు పప్పు వుంది .”అని కధను కంచికి చేర్చారు కధక చక్ర వర్తి శాస్త్రి గారు .
ఆముదం తగ్గటం కాదు .”ఆముదమూ”తగ్గి పోయింది .ఆశ మినుకు మినుకు మని ,నిరాశ” దీపం పెద్ద దైనది” .ఇలా ఆమె బతుకును గన్నేరు పప్పుతో అంతం చేసుకోంది .రంగు గన్నేరు పూలు పనికి రాలేదు కాని వాటి కాయలు మాత్రం జీవితం ముగించ టానికి తోడ్పడ్డాయి .శాస్త్రి గారు ఏమీ చెప్పరు .అంతా మన ఊహకే వదిలేస్తారు .తలిదండ్రులు ఆమె ఆశలకు రూప కల్పన చేయ లేక పోయారు .ఆమె తప్పూ ఏమీ లేక పోయినా సంఘ బహిష్కృత అయింది .మార్పు రావాలని ఉన్నా ,దరిద్రం ,కట్టు బాట్లు వారిని కట్టి పడేసిన కాలమ్ అది .ఎంతో మంది బాల వితంతువుల జీవితాలు ఇలా బుగ్గి అయాయి .ఎదిరించే సాహసం ఆనాడు లేదు .కుళ్ళి కృశించి ,నశించి పోవడమే .లేక పొతే చీకటి తప్పులు చేసి బలి అయి పోయే వారు .”వీరేశ లింగ మొకడు ”ఎదురు గా నిల్చి ,వారి జీవితాలలో వసంతాలు పూయించాడు .గురజాడ తన నాటకం ద్వారా మార్పు తెచ్చే ప్రయత్నం చేశాడు .ఈ సంధి కాలమ్ లో వచ్చిన కధ ఇది .నాటి పరిస్థితులకు అద్భుత దర్పణం ”గన్నేరు ”కధ. గన్నేరు పూలు యెంత ఉపయోగమో ,దాని పప్పు అంత విషం.ఆ రోజుల్లో అదే చావుకు మందు .శ్రీ శివ రామ శాస్త్రి గారి హృదయ వైశాద్యానికి  శత కోటి జోహార్లు .
సంపూర్ణం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -03 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

వేలూరి వారి రెండు కధలు 1 సిపాయి

   వేలూరి వారి రెండు కధలు 

                                                           1      సిపాయి
శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారు వెద వేదంగా శాస్త్ర పారమార్ధిక ఖగోళ ,జ్యోతిష విజ్ఞా శాస్త్రాలలో అపారమైన పాండిత్యం వున్న వారు .కధకులుగా విశ్వ సాహిత్యం లో చోటున్న వారు .వారికి తెలియని త్రేలియ రాని విషయం లేదంటే అతిశయోక్తి లేదు .తక్కువ కధలే రాసినా వన్నె వాసి వున్న కంద గల కధలు .తన కాలమ్ కంటే ముందు ఆలోచన వున్న మహా రచయిత .సంఘం లో మార్పు రావాలి ,మహిళాభ్యుదయం జర గాలి అని నిర్ణయించిన సంస్కారి .బాల్య వివాహాలు కూడదనే అభిప్రాయం ,వితంతు వుల దయనీయ జీవితం పై అవగాహన కల వారు .వారి జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరించాలని మనసారా కోరుకొన్నారు .వారి కధల్లో సరదా గా రాసిన కధే ”సిపాయి ”
అప్పటికింకా safety రేజర్ రాలేదు .కధకుడికి ”తలంటి ”అంటే విరోధం .”ఉపమాలంకారం లో చెబితే విరక్తుడికి సంసార వాతు రూపకం లో చెబితే అభయాంజన యుద్ధం .అతిశయోక్తి లో చెబితే నరకం .తల మీద నూనె అన్టడం అంటే జుట్టు పీకేయతమే .వేన్నీళ్ళు పోయటం అంటే చర్మం ఒలిచేయటమే .”అని ఒక కుర్ర కారు మనోగతం .కాలేజి స్టూడెంట్ కనుక మెల్లగా గడ్డం ,మీసం మ్లుస్తున్నాయి .”బులుసు ముళ్ళు లాగా వున్నాయట”అవి .”రావి చెట్టు -పైకి యెంత ఉంటుందో లోపల అంత వుంటుంది .మీరు పర్వతం భూమిలోపల ౧౬ యోజనాలు ఉంటుందిట .కాని ఈ వెంట్రుకలు మాత్రం వాటి కంటే లోతు ”అని చమత్కరిస్తారు .వెంట్రుకలు పీక టానికి ప్రయత్నిస్తే గడ్డం వాచీ పోయింది .రేజర్ కొనాలని బయల్దేరాడు రచయిత .   

   ఒక షాపుకు కు వెళ్ళాడు .ఆ షాపు ”విశ్వ రూపాభ్యాం ”లాగా ఉందట .షాపులో ఆడ వాళ్ళున్నారు .ఒక అమ్మాయిని పిలిచి ”నాకో మంచి కత్తి కావాలి ”అన్నాడు .”నీవు మంగలి వా ?”అందొక వెంగలి .”ఈ తెన్గాలి ఏమిటి ,మంగాలి ఏమిటి ?”అనుకొన్నాడు లోపల .భయ పడి పారి పోబోయాడు .ఆ సేల్స్ గాళ్ ”ఓకొత్త మంగలీ ఇదిగో రేజ్క్యర్ ”అంది అతనికి ఏమి కావాలో తెలిసి .”వేల ఎంత సుమంగళీ ?”అన్నాడు ప్రాస తో విరుపు తో తానేమీ తక్కువ తిన లేదని తెలియ జెప్పటానికి .అయిదు రూపాయలు అంది .”చాలా ఎక్కువ ”అన్నాడు రచయిత .”నువ్వు కొత్త మంగలివి కా బట్టి గాటు పెట్టు కొంటె దీని ఖరీదు ఇంకా పెరుగు తుంది .నెత్తుటి బొట్టు ఒక్కొక్క టికి పావలా అవుతుంది .”అని నవ్వింది .కధకుడు ఆమె తో ”ఆరణాలు పెడితే స్వదేశీ కత్తి వస్తుంది కమ్మరి  దేవతా “‘అన్నాడు మర్యాదగా .ఇంక ఆగ లేక పరిగెత్తాడు .
               విదేశీ వ్యామోహం ,స్వదేశీ వస్తువుల వాడకంకోసం చెప్పిన సరదా కధ ఇది .వెంట్రుకల తో యుద్ధం చేయటం కనుక ”సిపాయి ‘అనితమాషా గా  మంచి పేరే పెట్టారు శాస్త్రి గారు .హాశ్యం మ్,వ్యంగ్యం కలగలుపు గా పండించారు .విదేశీ వ్యామోహంలో దేశీయ మైన తలంటి యెంత బాధా కర్కమ్ గా కన్పించిందో కళ్ళకు కట్టించారు ఇప్పుడు త్కలన్తె లేదు .అంతా శాంపు మహాత్యమే .మంగలి మర్దనాలు లేవు .వేడి తగ్గేది తలంటితే .కుంకుడు రసం కళ్ళలోకి వెళ్ళితే తాత్కాలికం గా కళ్ళు మండినా ,కళ్ళ లోని మాలిన్యం హరించి పోతుంది .ఇక నెలకోసారి మంగలి షాపుకు జుట్టు కట్టిరించుకోతానికే వెళ్ళేది రోజూ రేజర్ మనకు శ్రీ రామ రక్ష .దిన చర్యలో నిత్య క్షుర  కర్మ ఒక భాగ మైంది .అందరామ్ క్షురకులమే . .అంత మార్పు వచ్చింది .అది అవసరము ,కాలమ్ ఆదా కూడా .అందులో ఇంకో ప్రమాదం కూడా వుంది .మంగలి కత్తి తో వరసగా అందరికి గడ్డం గీకితే ఎయిడ్స్ వచ్చే ప్రమాదం కూడా వుందని అంటున్నారు .కనుక ఆ కాలానికి సంబంధించిన కధ గా దీన్ని మనం భావించాలి .అందుకే లైటర్వీన్ తో రాశారు .ఏమైనా విశ్వ కధకుల జాబితా లో చేరిన శివ రామ శాస్త్రి గారు ఇంత సరదా కధ రాయటం కూడా అబ్బురమే .శతావధాని కనుక శత కోటి ప్రక్రియలు వారికి కరతలా మల కాలే .
  రెండో కధ గురించి ఇంకో సారి ముచ్చ తిన్చుకొందాం .
                           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -03 -12 .
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరస భారతి – దర్శనీయ దేవాలయాలు – జన వేమన – కొత్త పుస్తకాలు

pdf త్వరలో — అందిస్తాము

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

క్షేత్రయ్య పద సమాఖ్య – ఉగాది పురస్కారాలు

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –7 చివరి భాగం

 అందరి నేస్తం డికెన్స్ –7

          లిటిల్ దొర్బిట్ నవల దాస్ కాపిటల్ ను మించిన తిరుగు బాటు నవల (seditious )   .అన్నాడు షా .సమాజం లోని దోపిడీ అణగ దోక్కటం ,జైలు ఈవితం ,స్తంభాన ,ఉక్కిరి బిక్కిరి  ,రాజకీయం అన్నీ కలబోశాడు .చదువు తుంటే ఉక్కిరి బిక్కిరై పాథకుడు  విశ్రాంతి కోసం కాసేపు పుస్తకాన్ని కింద బెట్టేస్తాడు .సివిల్ ఉద్యోగాస్తులంతా పని ఎలా ఎగా గొట్టాలో ఆలోచిస్తుంటారు .లక్ష్యం చేరని పధకాలు కాగితాలకే పరిమితం .కోర్రీలా గొరిల్లాలు .సాచి వెత ధోరణి .పాలనలో స్తబ్దత .నత్త నడకలో అభివృద్ధి పనులు .ఎక్కడ వేసిన గొంగళి అక్కడే .సాంఘిక మార్పు గగన కుసుమం .శాఖా చంక్రమణం చేసే ఫెయిల్ వ్యవస్థ లో కని పించేది వ్యర్ధ ప్రయాసే .ఎక్కడి పని అక్కడ ఆగి పోవటమే .mew street లో     మిస్టర్ tite bonaancle  ఉంటాడు .  mew అంటే ఒకదానికే కట్టు బడిన అని అర్ధం .  చని పోయిన వ్లేస్ గాలి చొరని ఇళ్ళలో పెరుగు తాయని అర్ధం .ఇందులో రెండు భాగాలు .దరిద్రం ,సంపద .ప్రేమను పాథ కాలమ్ నుంచి విముక్తి చెందటం చూపించాడు .circumlocution   ఆఫీస్ అంటే సమాజం లోని కాపత్యం .దివాలా కోరు విధానాలు ఎప్పుడు ఉంటూనే వుంటాయి .ముడుచుకున్న ప్రపంచం లోనవల ప్రారంభమై ,వికశించిన ప్రపంచం తో ముగుస్తుంది .రచన చేసే టప్పుడు మనం ఏ విశేషణం వాడాలో అవన్నీ డికెన్స్ వాడి దారి చూపించాడు .
dicken’s depth comes from his breadth ” అంటారు .అతని కేన్వాస్ విస్తృత మైంది .సమాజ చిత్రాన్ని అన్ని రంగుల్లో ,అన్ని కోణాల్లో చిత్రించిన చిత్రకారుడు .”నేను ఇక్కడ వున్నా ,అక్కడ వున్నా .అన్ని చోట్లా వున్నా ,ఎక్కడా లేను ”అని తనను గురించి చెప్పుకొంటాడు .రచనలను పబ్లిక్ లో చదివి సొమ్ము చేసుకోవటం డికెన్స్ తోనే ప్రారంభ మైంది .అప్పటికింకా రచయితలకు ప్రజా సంబంధాలుండేవి కావు .కొత్త పోకడలు పోయి ప్రేక్షకులకు అతి సన్నిహితుడై పోయాడు .దీనితో 45000 పౌండ్లు సంపాదించి క్రేజ్ పెంచుకొన్నాడు .అతని పుస్తకాలనీ అమ్మినా అంత డబ్బు రాలేదు .ఈ  సంపద తో అత్యంత ధన వంతుడైన రచయిత అని పించుకొన్నాడు .ఎవరికి రానంత కీర్తి ,ప్రతిష్ట ధనం సంపాదించుకొన్నాడు .
a tale of two cities అతని నవలా చరిత్ర లో సువర్ణాధ్యాయం .గొప్ప చారిత్రిక నేపధ్యం లో వచ్చిన నవల ఇది .ఇందులో సిడ్నీ కార్టన్ ఒక సెక్స్ హీరో .అలాంటి పాత్ర ను ఇంత వరకు డికెన్స్ శ్రుస్టించ లేదు .శైలికి ,ధైర్య సాహసాలకు దర్పణం .సంఘటన ప్రాధాన్యం బాగా ఉన్న నవల .మూడీ గా ,సంఘ వ్యతి రేకిగా ,ఆత్మా హనన దృక్పధం తో కార్టన్ కానీ పిస్తాడు .ఇతని జీవిత చార మానకం లో డికెన్స్ స్వహావాలే వున్నట్లు కానీ పిస్తుంది .ఇందులో అసలు కదా నాయకులు చీమల దండు లాంటి అట్టడుగు వర్గాలు అంటే మాస్ అన్న మాట .మూక లోని సైకాలజీ ని అద్భుతం గా వ్యక్తీకరించాడు డికెన్స్ .ఆ మూక భావం తో వ్యక్తీ గత ఇష్టం ,వ్యక్తిత్వాలు కలిసి పోయి తందానా తాన అనటం చూస్తాం .”మండర్లో అద్భుతాలు గుండెల్లో దాక్కున్నాయ్ .అవసర పరిస్తితులు వస్తే అవే నిద్ర లేస్తాయి ,పని చేస్తాయి ”అంటాడు డికెన్స్ .డికెన్స్ కు విప్లవం ఇష్టం లేదు .అదంటే భయం కూడా .అది సాంఘిక విధానాన్నిభయ పెడు తుందని అతని భావన .అస్తవ్యస్త పరిస్తితి ఏర్పడి ,వ్యక్తిత్వం దెబ్బతిన్తున్దంటాడు .విప్లవ కారులు అందర్నీ ద్వేషిస్తారు .అంతటినీ ద్వంశం చేస్తారు .మంచి ,ఐశ్వర్యం మాత్రమె కాక విద్య ,సౌందర్యం ,దయ ,న్యాయం కూడా దెబ్బతింటాయని అతని ఆలోచన .స్వీయ వ్యక్తిత్వం నాశన మై మూక భావం వ్యాప్తి చెందుతుంది .వాల్లెవరో యేంచేస్తారో తేలీ కుండా ,తెలుసు కో కుండా ,వాళ్ళు దేనికో చెందుతారని భావించి ఉరితీయటం రాక్షసం అంటాడు .నవల ప్రారంభ వాక్యాలు గొప్ప భావ స్పోరకాలు .అలానే చిట్టా చివరి వాక్యాలూ ఆలోచన లను గిల కొడతాయి .నవల లండన్ నుంచి పారిస్ కు కదుల్తుంది .బ్రిటన్ ఐక మత్యం నుంచి ,ఫ్రెంచ్ కలోలం వరకు ప్రాయనిస్తుంది .చావు నుంచి పునరుద్ధానం కు చేరుతుంది .రెండు భిన్న వ్యక్తిత్వాలున్న నాయకులు ఇందులో వున్నారు .నిజాయితీ ఉన్న చార్లెస్ దార్నీ సినిక్ అయిన సిడ్ని కార్టన్ .ఒకే వ్యక్తీ లో భిన్న పార్శ్వాలు .వ్యక్తిత్వాల మార్పు తోనవల  ముగింపు ..
కార్టన్ జీవితం చావుతో బతుకు .అతని ధైర్య మరణమే అతని జీవిత పరిష్కారం .దార్నే మూడు మరణ శిక్షల్ని తప్పించుకొన్నాడు .విప్లవ రుధిరం తో కొత్త ప్రజాస్వామ్యం పుట్టింది .ఫ్రెంచ్ మాబ్ దెబ్బను తట్టుకొనే దమ్ము లేక కొదరు ఆత్మా హత్య చేసుకొన్నారు .కార్టన్ డికెన్స్ యొక ఆల్టర్ ఈగో అంటే బహిప్రాణమే .నిరంకుశ కాలమ్ లో జీవించిన ఆదర్శ జీవి .అతని అసమర్ధత ,విషాద మరణం కార్టన్ నిజమైన వ్యక్తిత్వాన్ని సఫలం చేసింది .అతను కధా నాయకుడు కాదు .కాని అందులోంచి వచ్చిన వ్యక్తీ .అతని చివరి మాటలు పాథకుల కు కళ్ళ నీళ్ళు తెప్పిస్తాయి .ఇందులో మేడం దిఫార్జ్ పాత్ర తిరుగు బాటుకు మూర్తి మత్వమే .మాటలతో చెప్పలేని క్రూరత్వం, పగకు ప్రతీక .ఆ నెలలో 23 వ తారీకు న ఉరితీయ బడ్డ 23 వ మ్వాడుకార్టన్ . 
డికెన్స్ రాసిన గ్రేట్ expectations  చాల గొప్ప నిజాయితీ నవల గా గుర్తింపు పొందింది .ఉత్తమ పురుష లో రచన వుంది .ఒక యువకుని ఉత్తాన ,పతనాలు ,సాజం లోని అస్తిత్వ వికాసం కనిపిస్తాయి .ఇది డికెన్స్ పరి పక్వ రచన అంటారంతా .పిప అనే యువకుడి పై కలిగే జాలి డికెన్స్ కే చెందు తుంది .       1867 లో డికెన్స్ రెండవ సారి అమెరికా కు వెళ్ళాడుఇరవైయిదేల్ల తర్వాత .మూడు వెళ్ళ దూరం ప్రయాణం .డబ్బుకోసం ఆత్మ హత్యా సదృశ మైన ప్రయాణం అన్నారు .చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు సాగింది అంతా .౭౬ రీదింగ్స్ లో 2 28000 డాలర్లు మూట కట్టుకోచ్చాడు .రోజుకు యాభై వేల దాలర్లన్న మాట .బానిసత్వ చట్టం అమెరికా లో వచ్చి నల్ల వారు ,తెల్ల వారు కలిసి జీవిస్తునారు .కనుక ఆవిషయం పై మాట్లాడ లేదు .newyork యాభై వేల మంది హాజరు .అయిదు వేల మంది టికెట్ కోసం అర మైలు క్యు లో నిలబడ్డారు .కొంత మంది అయితే రాత్రికే అక్కడికి చేరి చల్ల గాలి భరిస్తూ నిల బడ్డారు .ఎదురు లేని ,ఊహించ లేని విజయం .అనవసర వ్యాఖ్యలు చేయలేదీ సారి .ఇంగ్లాండ్ తిరిగి వచ్చి our futual ఫ్రెండ్ పేర వ్యాసాలు రాశాడు
”రచయిత జీవితం లో అనేక మార్పులు రావటం సహజం ”అంది వర్జీనియా ఉల్ఫ్ .”మా నాన్న సృష్టించిన కొడుకులు అంటే మా నాన్న కు మా కంటే ఎక్కువ ఇష్టం ”అన్నాడు డికెన్స్ పుత్ర రత్నం జూనియర్ డికెన్స్ .డికెన్స్ కు డేవిడ్ కాపర్ ఫీల్డ్ అటే విపరీత మైన అభిమానం .గొప్ప వాళ్ల కొడ్కులు తండ్రి అంత గొప్ప వారు కాదు .”ఒక తరం లో ఇద్దరు డికెన్స్ లు లభించటం అసంభవం ”అన్నాడు ప్లోబ్ .డికెన్స్ కొడుకులకు దికేంసే తరగని ఆస్తి అని తీర్పు చెప్పాడాయన .
” the mystery of edvin drod ”అతి చినా నవల .దైన్యం అలసట ,దిగజారు తనం తో వుంటుంది .సాధారణం గా డికెన్స్ నవలలు 19 నెలలుసీరియల్ గా వస్తాయి .దీన్ని పన్నెందుకే ముగించాడు .గొప్ప రచయిత వీడ్కోలు చెబుతున్నట్లుగా సాగిన నవల ఇది .”ఇప్పటికే మూడొంతులు చని పోయిన వాడి భావన -అరిష్కారం లేనిమిస్త్రి ”అన్నాడు .అందులోని ఎడ్విన్ ద్రూడ్ పాత్రనుచంప కుండా వుండాల్సింది అని అతని ఒదిన అన్నది .దీనికి సమాధానం గా డికెన్స్ ”నా పుస్తకాన్ని మిస్త్రి అన్నాను కాని ఎడ్వి ద్రూడ్ హిస్టరీ అని నేను చెప్ప లేదే ,ఆ పేరు పెట్ట లేదే ”ఆనాడు .”ఒక డిటెక్టివ్ కధ రాశాను .అందులో రహశ్యాలు దాచ లేదు .దాన్ని ఈనాటి వరకు కాపాడు కుంటు వచ్చాడు డికెన్స్ ”అన్నాడు జి.కే.chestartan .
ఆధునిక ఇంగ్లీష్ నవల డికెన్స్ తోనే ప్రారంభ మైంది .ఆయన్ను స్వీయ చారిత్రాత్మక రచయిత అన్నారు .తనను మించి పోయేట్లు రాశాడు .”తన మీద కంటే ఇతరుల మీద ఆయనకు చాలా అభిరుచి .”ఆనాడు జోనాధన్  ఆర్డ్లీ .ఆయనలో ఎంత ఆధునికత వుందో ఆయన రచనలుతెలుస్తుంది .మానవ జీవన సంఘర్షణను అంతా రచనలో చూపించాడు .చాలా తీవ్రం గా ,బలం గా బతకటం వల్ల డికెన్స్ తక్కువ వయసు లోనే మరణించాడు .ఎడమ కాలు ఇంఫెచ్ట్ అయింది .గౌట్ -అంటే వాతం కమ్మింది .జూన్ లో రైల్ ప్రమాదం జరిగినా కంగారు పడ లేదు .వేగం గా వెళ్ళే రైళ్ళలో ప్రయానిన్చాతమంటే డికెన్స్ కు చాలా ఇష్టం .దీనితో షాక్ అయాడు .వేగం తగ్గాలని కోరుకొన్నాడు .ప్రమాదం జరిగిన అయిదేళ్లకు చనిపోయాడు .నరాల వ్యవస్థా బాగా డెబ తింది .డికెన్స్ చైన్ స్మోకర్ అని చాలా మందికి తెలీదు .సిగారట్లు ,చుట్టాలు బాగా తాగే వాడు .1869 లో .ఫరేవేల్ టూర్ పాన్ చేశాడు .1870 లో పిక్విక్ అనే పేరే ఉచ్చ రించా లేక పోయాడు .అంత మాటకారి ఉపన్యాసకుడు మాట్లాడ లేక పోవటం విధి విచిత్రం .రీడింగ్ చేస్తున్నా హాశ్యం పండించా లేక పోయే వాడు .అతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది .58 మవ ఏడు ప్రవేశించింది .కూతురు  కిట్టి కి వీడ్కోలు చెప్పాడు .తాను ఒక మంచి తండ్రిగా ,మంచివాడు గా బ్రతికాను అం చెబుతూ ”గాడ్ బ్లెస్ యు ”అన్నాడు .తనకేం పర్వాలేదు కంగారు పడక్కర లేదని ఆమెకు ధైర్యం చెప్పాడు .జూన్ ఎనిమిదిన కొంత దూరం నడిచాడు కూడా .కళ్ళల్లో కన్నీరు ధారా పాఠం గా వస్తోంది .కూతురు వచ్చి పడుకోమని చెప్పింది ”ఎస్ ఆన్ ది గ్రౌండ్”అన్నాడు నర్మ గర్భం గా .౧౮౭౦ జూన్ తొమ్మిదవ తేది ఉదయం ఆరు పది నిముషాలకు తుది శ్వాస వదిలాడు డికెన్స్ .”అసమాన మహా రచయిత అస్త మించాడు ‘.అంత్య క్రియలకు హడావిడి చేయవద్దని విల్లు లో రాశాడు కానీ   టైం మాగజైన్ వెస్ట్ మినిస్టర్ అబ్బే లో చేయాలని సూచించింది .అలానే చేసి గోరా వించారు .”

This slideshow requires JavaScript.

జీవించి నంత కాలమ్ విధ్యుక్త ధర్మా లుంటాయి .నాకు మాత్రం దాని ఆనందం ఎప్పుడో పోయింది ”అన్నాడు డికెన్స్ .డికెన్స్ పేర ఫెలోషిప్ ఏర్పాటు చేశారు .ప్రతి సంవత్సరం వెస్ట్ మినిస్టర్ ఆబే లో డికెన్స్ వర్ధంతిని అత్యంత ఘనం గా  చేస్తూనే వున్నారు .ఆయన ఋణం తీర్చుకొంటున్నారు ..

  సమాప్తం            ఆధారం –friendly dickens  –రచయిత norrie epistein
డికెన్స్ పై ఈ వ్యాస పరంపరను ఇంగ్లీష్ లో అమోఘ పాండిత్యం ,ఆంగ్ల సాహిత్యం లో లోతైన పరిశీలన చేసి అమ్రుతోప మాన  మైన ఆంగ్ల ప్రసంగాన్ని  చేస్తూ ,నిర్దుష్ట మైన భాషను మాట్లాడుతూ ,ఆ సాహిత్యాన్ని మదించి ,సాటి వారిలో ఎవరు తనకు సాటి లేరని అందరు చెప్పుకొనే రీతిలో వుండే మా అన్న గారు స్వర్గీయ జి.ఎల్ శర్మ(1912 -1958 )  గారికి అత్యంత భక్తీ శ్రద్ధలతో అంకితమిచ్చి నా భ్రాత్రు ఋణం తీర్చుకుంటున్నాను .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25  -03 -1

Posted in రచనలు | Tagged | Leave a comment

సరదా కవిత –ఏ.ఏం.ఏం.కుమార్

  సరదా కవిత –ఏ.ఏం.ఏం.కుమార్ 

          
     అత్త వారింటికి వెళ్ళే టప్పుడు అంబికా దర్బార్ బత్తి 
 వెంట ఉంచుకొంటే అమ్మ తోడుగా ఉన్నట్లే 
  పిల్లల మెదడు రెండు రెట్లు ఎక్కువగా పని చేయాలంటే
            అమేజింగ్ బ్రెయిన్ ఫుడ్ పెట్టండి 
 పిల్లలు తల్లులైనా యవ్వనం గా కనపడాలా ?
యవ్వనాను భూతి పొందాలంటే
      హాని అండ్ ఆప్రికాట్  సంతూర్ వాడండి
క్రికెట్ హుషారుగా ఆడాలంటే
అసలైన ఘాటు ఖారం ప్రియా కారాన్నే వాడండి
కలెక్టర్ తల్లి కావాలనుండా
అమ్మాయికి అన్న పూర్నా అయోడైజేడ్ ఉప్పీ వాడండి
ఆడ టికెట్ ఎక్షామినర్ ను మీ వశం చేసుకోవాలను కొంటె
కాల్గేట్ మాక్స్ ఫ్రెష్  మౌత్ జెల్ వాడండి
లోతైన శుభ్రత కావాలా ?
కాల్గేట్ జిగ్ జాగ్ బ్రష్ వాడండి 

—        ప్రియురాలికి యెంత దగ్గ రైతే అంత మేలుకదా
క్లోజప్ టూత్ పేస్తే వాడండి
మీ ఒళ్ళు నునుపు గా ఉండాలా ?
మీ భర్త ఒళ్లంతా నిమురుతూ పొగడాలా ?
కొత్త రెక్సోనా సబ్బు వాడండి
మంచి జరిగితే మరక మంచిదే కదా
బట్ట లన్ని శుభ్రంగా మురికి చేసేసుకోండి
సర్ఫ్ ఎక్సెల్ వాడి పోగొట్టు కొంది
అధిక బరువు తో బాధ పడుతున్నారా ?
డాక్టర్ టీ తాగితే పోలా ?
సన్న బడండి  స్లిం గా ఉండండి .
చెప్పాల్సింది చాలా వుంది
చూడాల్సింది మిగిలే వుంది
అయినా బ్రేక్ ఐ న్యూస్
ఏ.ఏం .ఏం.కుమార్ 

Posted in కవితలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –6

 అందరి నేస్తం డికెన్స్ –6

           బ్లీక్ హౌస్ నవల భయానక గమ్భేర్క నవల .౧౯ శతాబ్దపు ఆంగ్ల సాహిత్య మకుటం లో కలికి తురాయి .ఇందులో యదార్ధం తో బాటు బోలెడంత ఆశ్చర్యము వుంది .నగర్ర్కరణ నేపధ్యం గా రాసినది .లండన్ నగర వాస్తవ స్తితి కనిపిస్తుంది .దీనితో పాటు ఇటాలి లోని గోతిక్ రోమాన్స్ ను గుర్తుకు తెస్తుంది .అర్ధమయినట్లు అనిపిస్తుంది కాని పూర్తిగా ఎవరికి అర్ధం కాదు .దే ఆంగ్ల సాహిత్యం లో మొదటి డిటెక్టివ్ నవల .ఇప్పటి దాకా రాసిన దానికి పూర్తి భిన్నం గా దీన్ని రాశాడు డికెన్స్ .పొగ గొట్టం లోంచి వచ్చే నల్లని పొగ సూర్యాస్తమయం ముందు మంచు చూస్తె ”సూర్యుని మరణం ”జ్ఞాపకమోస్తుంది .అక్కడి చెత్తా చెదారం లండన్ ఎంత్రోపి లో కి తిరిగి వెళ్తున్నట్లున్తుంది . అది పూర్తిగా సీతా కాలమ్ .దీన్నే సీజన్ ఆఫ్ డెత్ అంటారు మధ్యాహ్నానికల్లా చీకటి పడురుంది .దీనితో ఎవరికివారికి దారి టేను తోచని సంకట స్థితి .ఇక్కడి ఫాగ్ మామూలు మంచు కాదు .లండన్ లోని న్యాయం ,నీతి పై కప్పిన పొర .నల్లని పొగ కృశించి పోతున్న మాన వ సంబంధాలు ,మసక బారుతున్న జీవితాలు .విడిపోయిన కుటుంబ చరిత్ర .ఆధునిక కాలమ్ లోని కుటుంబాలు యుద్ధ సన్నాహం చేయవు .లిటిగేషన్లు చేస్తాయి .ఈ చీకటి సామ్రాజ్యం లో లాయర్లు ,జడ్జీలు ,రాజాది రాజులే .జబ్బుతో వున్న మానవ సమాజానికి వారంతా క్రూర నియంతలే .jarndyce అనే పాత్ర .jaaundice లాగా అని పిస్తుంది .జబ్బు లఖ్యం తో రాసిన నవల ఇది ఇక్కడ జాండిస్ అంటే పక్ష పాతంఅసూయ కల్పించటం లేక కోపం తెప్పించటం .ఆ మాట ఈ మూదితికి ప్రతి బింబమే .ఈ నవల చదివితే ఇంగ్లాండ్ ఇంత పతన మిందా ని పిస్తుంది .ఇలియట్ రాసిన వెస్ట్ లాండ్ కనిపిస్తుంది .ఆ కూపం లోనే పుట్టుక పెరుగుదల  జబ్బు ,చావు .ఆ సూది గుండం దాత లేని నిస్సహాయ స్థితి .సెటిల్ మెంట్ చేస్తానని రెండు ఆర్తెల దగ్గర డబ్బు నొక్కేసి ఆశల గుర్రాన్ని చూపించి ,ఆ డబ్బు తోనే తాను నిజమైన గుర్రాన్ని కొనుక్కొని ,దౌడు తెస్సిన పాత్ర .బాల్జాక్ చిత్రించిన పారిస్ ,దాస్తోవిస్కి చూపించిన సెయింట్ పీటర్స్ బర్గ్ లాగానే డికెన్స్ దర్శింప జేసిన లండను అందరి న్ద్రుష్టినీ ఆకర్షించింది .గాలి ,నీరు ,ఆకాశం కలుషితమై కలరా ,టైఫాయిడ్ న,మసూచి విజ్రుమ్భించిన దయనీయ పరిస్తితి .గాలికి పుట్టిన వాటిని ”తూర్పు గాలి ”అంటాడు డికెన్స్గర్భం గా .జీవిత చరమాంకం లో అలసి సొలసి వున్నా అదే అధికారం ,అదే నిబద్ధత .అదే క్రమశిక్షణ .తన శక్తి న్సామర్ధ్యాలను అత్యంత క్రమ శిక్షణ తో పూర్తిగా విని యోగించాడు డికెన్స్ .అందుకే అతన్ని సృజనాత్మక దారతో పొంగి పొరలే తరంగం ‘అనారు .
                                          కుటుంబ బాధలు 
                        1853 లో డికెన్స్ నాభి వ ఏట భార్య కాధరిన్ ను వదిలేశాడు .10 మ్మ్కన్ది పిల్లల్ని కని ,పెంచి ,22 ఏళ్ళు కాపురం చేసిన భార్యను వదిలేశాదంతెందరూ ఆశ్చర్య పోయారు .లండన్ లోని ౫౧,౮౫౮ మ్కన్ది పాతకులకు వివరాలన్నీ రాశాడు .అది చదివిన వారందరూ సైకిక్ అయ్యాదేమో నని అనుమానించారు .కుటుంబం లో హార్మోని అంటే ఐక్యత లేదని గ్రహించారు .అప్పటికే న౫౦ ఏళ్ళ వాడుగా కనిపించేవాడు డికెన్స్ .ఏ పనైనా అతి వేగం గా చేసే వాడు .అందుకనే వేగం గానే పండి పోయాడు .వయసుకు మించి పని చేశాడు .”హ్హార్డ్ టైమ్స్ ”నవల లో పారిశ్రామిక నగరం లో జీవచ్చ వాలుగా వున్న వారి గరించి రాశాడు ఇందులో కోక టౌన్ అంటే యెర్ర ఇటుకల నగరం .అది భయానక నరక కోపం .అందులో జీవించే వారి ముఖాలలో ఆనందం ,ఆశ మృగ్యం .ఒకప్పుడు సతత హరితం గా వుండే నగరం .ఇప్పుడు పొగ దుమ్ము ధూళి తో మసక బారింది మనుషులూ నల్లబడి పోయారు .ఒకరినొకరు గుర్తించ లేని వింత స్తితి .వాళ్ళను ”చేతులు ‘అన్నాడు డికెన్స్ .ఓఏడూణ్ణే పనికి వెళ్ళటం ,సాయంత్రానికి తిరిగి రావటం తప్ప జీవితాల్లో వెలుగే  ఎరుగరు .
మనసు శరీరం బుద్ధి పూర్తిగా ఉపయోగించి గానుగెద్దు జీవితం అనుభ విస్తున్నారు .ఎఫ్ ఆర్ లూయిస్ ఈ నవలను ‘మాస్టర్ పీస్ ”అన్నాడు .పూర్తిగా గంభీర మైన అలాక్రుతి అనీ ఆయనే అన్నాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -03 -12
Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ -5

 అందరి నేస్తం డికెన్స్ -5

           డికెన్స్ అద్భుత కామిక్ రచయిత .ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతాడు .అతి నిజాలను జర్న లిస్టు దృక్పధం లో ఆవిష్కరిస్తాడు .లండన్ మహానగర మహా రచయిత .లండన్ ను పవిత్ర నాగరక దృక్పధం గల సిటీ గా మార్చాడు .చాలా ప్రామాదకర పరిస్తితితులకుఅన్వేషణకు  కామెడీని చక్కగా వాడుకొన్నాడు .
డికెన్స్ రాసిన క్రిస్మస్ కరోల్ లో చావు నుంచి పునర్జన్మ వరకు ఉన్న యాత్రను గొప్పగా ఆవిష్కరించాడు .హృదయాన్ని పట్టి లాగేసే సంజ్ఞానాత్మక నవల .నేరం వ్యాధి దుఖం సమాంతరం గా నడిపాడు .అందులో అమాయకత్వం తప్పక మేలవిస్తాడని మనకు తెలుసు .దీన్ని దాన ధర్మాల కోసం కొందరికి ,దానా పేక్ష తో కొందరికి చదివి వినిపించాడు .క్రిస్మస్ లోని మిస్టరి డికెన్స్ లోని మిస్టరి ని పోలి వుంటుంది .
”దామ్బే   అండ్ సన్” నవల చిన్నతనం దాటి చాలా ప్రాముఖ్యత సంత రించుకొన్న సిఖరాయ మాన మైన నవల .తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న బాంధవ్యాన్ని గొప్పగా ఆవిష్కరించాడు .తండ్రిని పొందాలన్న ఆరాటం తో సాగే యువతి కదా ఇది .దీన్నే ‘ఫాదర్ హంగర్ ”అన్నారు .కొడుకుల కన్నా కూతుళ్ళను అభిమానించాడు డికెన్స్ .”ఎన్నిక చసి పార్లమెంట్ కు పంపబడిన బ్రిటన్ రాజ నీతిజ్నుల కంటే ,పేద ప్రజల జీవితాల ఉన్నతికి దికేంసే చాలా ఎక్కువ సేవ చేశాడని ”వెబ్స్టర్ అన్నాడు .”ఆయన స్వేచ్చ గల దికేంసీనియాన్ ,వేదాంతి కాని అతి వాది (UN PHILOSOPHICAL RADICAL )అన్నాడు బెర్నార్డ్ షా.విక్టోరియా రాణి పాలన వివాహ విజయం గా నిలిచింది .ఆమె జీవితాన్నే మార్చేసిన బంధం .వివాహం పై అనవసర కంగారు ,నెమ్మది మనస్తత్వం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది .అందులో ఇల్లు గొప్ప పాత్ర ను పోషించింది .సతీ -ఔన్నత్య సారం గా నిలిచింది .
                డికెన్స్ మరో నవల డేవిడ్ కాపర్ ఫీల్డ్ .యువక పాత్ర తో తీర్చి దిద్దాడు .నైతిక సామర్ధ్యం తో ,షీలా నిర్మాణానికి వీలు కల్పించాడు .ఆ బాధ్యతా మీద పడ్డాక చురుగ్గా కదిలే యువకుడు సంక్లిష్ట  సమయాల్లో  అంతరంగం   మాట  వినే మనస్తత్వం .ఇదే ఫ్రాయిడ్ సిద్ధాంతం .  ఈ నవల చదివితే ఫ్రాయిడ్ ను చదివి నట్లే అని తీర్మానించారు విశ్లేషకులు .”స్వీయ జ్ఞానానికి జ్ఞాపక శక్తి కీలకం ”అని ఫ్రాయిడ్ చెప్పింది నిజం జరిగిన సంఘటన లను విశ్లేషించుకొని న,భావ పరిపక్వత పొంద వచ్చు .అది ఒక స్వీయ చరిత్ర .జరిగిన నష్టానికి ,ఆందోళనకు స్వస్తి చెప్పే స్వీయ విశ్లేషణ వాళ్ళ విజయం సాధించ వచ్చు .కపటం లేని వాడు ,సులభం గా ఇతరుల చేత వంచింప బడే వాడు పరిస్తితుల ప్రభావం వాళ్ళ బలమైన శక్తి యుక్తులున్న యువకుడు గా మారటం ఇందులో చూస్తాం .తను చెప్పిన దంతా అత్యంత నిగ్రహం గా డికెన్స్ చెప్పాడు .శుక్ర వారం పుట్టిన వాడు దురదృష్ట వంతుడు అనే నమ్మకం ఆ రోజుల్లో బాగా వుండేది .ఇందులోని హెలెన్ ,క్లారా లు రెండు విభిన్న పాత్రలే అయినా ఒకే స్త్రీ యొక్క రెండు పార్శ్వాలుగా మనకు కనిపిస్తాయి .తల్లి పాత్ర తో కలిపి త్రయాన్గులర్ ఈడిపస్ కాంప్లెక్స్ నడిపించాడు .డేవిడ్ మనసు లోని భావాలను చెప్పే అవకాశం వాళ్ళిద్దరూ ఇవ్వనే ఇవ్వరు .ఆటను ఏ తండ్రి కొడుకూ కూడా కాదు .ఎవరికీ సోదరుడు కాదు .ఏ ఒక్కడికీ స్నేహితుడు కూడా కాదు .గారాల పట్టి గా ఉన్న వాడు తిట్లు తినే మారుతి కోడుకై ,బడి పిల్లాడి ,బాల కార్మికుడి ,అనాధ అయాడు .అతని స్తితి చివరికి ఎలా అయిందంటే ,తను ఎవరో తనకే తెలీని వింత స్తితి .స్నేహితులు దరికి రాణి జీవి .అంటా ఉత్తమ పురుష లో రాయటం తో విపరీతం గా అందర్నీ ఆ కట్టు కొన్నాడు .చివరికి ఉనికిని ,వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని సాధించాడు .ఇదిడికెన్స్ ఆల్టర్ ఈగో అని అంటారు .ఇందులోని పాత్రల గురించి చెబుతూ యి.ఏం.ఫార్స్తర్ అవి ఫ్లాట్ గా రౌండ్ గా రెండు రకాలుగా వున్నాయని చెప్పాడు .ఫ్లాట్ కారెక్టర్ మధ్య యుగం లోని మిసేరి ప్లే లలో నిరాశా ,నిష్ప్రుహా వుండే వారుగా వుంటారు .ఈ పాత్రలు యాంత్రికం గా బొమ్మల్లాగా కనిపించినపుదల్లా అదే భావాలను స్ప్రింగ్ కదలికల్లో బొమ్మల్లా గా ప్రవర్తిస్తారు .”డికెన్స్ మనుషులు జీవిస్తారు .దర్జీ కుట్టిన బట్టలతో,లేక దేనికో చిహ్నాలు గానో వుండరు ”అన్నాడు నేభారోవ్ అనే విమర్శకుడు .
 డికెన్స్ నిఘంటువులు వచ్చాయి .ప్రతి పాత్ర ను విశ్లేషిస్తూ EVERY ONE IN DICKENS వచ్చాయి .ఆటను సృష్టించిన పాత్రలు 13 ,143  
గా లెక్క వేశారు .14 నవలలు రాశాడు .కొన్ని చిన్న కధలు రాశాడు .పాత్రల పేర్లు పెట్టటం లో డికెన్స్ దిట్ట .ఆయన తర్వాతే ఇంకెవరైనా .ఆ పాత్రల స్వభావాలను బట్టి పేర్లు పెట్టాడు .ఆ పేర్లు మార్చ టానికి ఇక కుదరదు అంతే .పేరే ఆ పాత్ర అన్నట్లు తీర్చి దిద్దాడు .రచనాసృష్టి లో స్వభావానికి తగిన పాత్ర పేరు పెట్టటం డికెన్స్ కే సాధ్యమైంది .ఉదాహరణకు MAGWITCH –MAAGAS+WITCH .ఆటను ఒక మంత్ర గాడు గా కనిపిస్తాడు .కుమ్మరి కొలిమి లో సహాయకుడు గా ఉన్న వాణ్ని పక్కా జన్టిల్మాన్ గా మార్చాడు డికెన్స్ అతని స్వభావం ఏమిటో ఆ పేరే మనకు తెలియ జేస్తుంది .అంతటి లోకజ్నత తో డికెన్స్ రాశాడు కనుకే ఆ నవల అంత అద్భుతం గా జనాన్ని ఆకర్షించింది .ప్రతి యువకుడు అది తన జీవిత చరిత్రే అన్న అభిప్రాయం  కలుగు తుంది .దటీస్ డికెన్స్ .

 సశేషం 
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -03 -12 .
Posted in రచనలు | Tagged | Leave a comment

మనం మరచిన మహా వీరుడు – అన్నప్రగ్గడ

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

ఉగాది సందడి

ఉగాది సందడి
ఆదరా బాదరా గా బ్రహ్మం పరిగెత్తు కొచ్చాడు .ఒగరుస్తున్నాడు .కూర్చోరా అంటే మాట విన కుండా నుంచొనే వున్నాడు .ఏమిట్రా హడా విడి ?అని అడిగా .నీకీం నువ్వు తమాషా చూసే వాడివే కాని తల దూర్చే వాడివి కాదుగా బావా ?అని దెబ్బ కొట్టాడు .దేన్నీ గురించి వాడు బాధ పడుతున్నాడో తెలీలేదు .అసలు విషయం లోకి రాకుండా ఈ డొంక తిరుగుడు నాకు నచ్చాడు .అదే చెప్పా .అప్పుడు లైన్ లోకి వచ్చాడు .అదికాదు బావా మోనా మధ్య పంచ పతాకా అంతు యదు రాష్ట్రాల ఎన్నికలు ,నినా ఉగాది ముందు ఏడు సీట్ల ఎన్నికలు గురించి నీకేమీ పట్ట నట్టు కూచున్నావెం ?అన్నాడు .చట్టం తన పని తాను చూసుకున్నట్లే ఎలక్షన్లు సమయం ప్రకారం జరిగి పోతూంటాయి .అందులో మన ప్రమేయం ఏముంది అన్నా..ఓపిక వుంటే ఒతేస్స్తాం లేక పొతే ముడుచుకొని ఇంట్లో కూచుంటాం .దానికి ఇంత హైరానా ఎందుకన్నాను .వాడికి అరికాలు మంట నెత్తికి ఎక్కింది ..ప్రజా పక్షంఅనేది ఉందా ?అని అడిగాడు .వుంటుంది .దానికి దీనికి ఏం సంబంధం ?అన్నా .
పదేళ్ళు కష్టపడి పార్టీ నడిపి గెలిచినా ప్రతి సారీ రాజీ నామా చేస్తూ  ,మళ్ళీ గెలుస్తూ వున్న వాళ్లకు చెంప దెబ్బ కొట్టారు కదా బావా ?అన్నాడు .అవున్రా .ప్రజల మనోభీష్టం తో ఆట లాడుకుంటే అంటే చేస్తారు .ఎలక్షన్లు మన ఇష్టం వచ్చినట్లు జరిపే ప్రక్రియ పోవాలనే కొంత సంకేతం ఇచ్చారు ఓటర్లు అన్నా .తెలంగాణా సెంటిమెంట్ పండింది బావా బాగా అన్నాడు .నీ తెలివి తెల్లా రినట్లే వుంది .అన్నా .సెంటి మెంట్ వుంటే ఆ పార్టీ కి కనీసం పోలయిన ఓట్లలో తొంభై శాతానికి పైగా రావాలి కదా ఎక్కడైనా వచ్చాయా ?అని అడిగా /.అదిగో అందుకే ఆకు కాల్తుంది ..గెలిచారా లేదా ?అన్నాడు .గెలిచారు లేవయ్యా మహా గొప్పగా .జనం పూర్తిగావాళ్ళను నమ్మితే మిగతా వారికి ఒత్లేందుకు వేశారు ?ఏక పక్షం గా ఫలితాలున్డాలి కదా అన్నాను .ఏమో బాబు నాకేమీ తెలీదు .అందరి ఓట్లు చీలాయి .అందుకే మెజారిటి తగ్గింది .అన్నాడు .అంటే ప్రజలు అందరి మాటకు విలువ నిస్తున్నారని భావం కాదా ?అని ప్రశ్నించాను .అవుననుకో అన్నాడు .ఆ ప్రాంతం మా జాగీరు కాలు పెడిత నరికేస్తాం అన్న డి పోయింది .కాళ్ళు VIRQAKKUNDAANE నెత్తురు కార కుండానే ప్రచారం జరిగిందని గుర్తుంచుకో .ప్రజలు చాలా విచక్షణ ప్రదర్శించారు అని అర్ధం చేసుకో అన్నాను ..నీ  రీడింగ్ నీది .నేను వాదించలేను మహా ప్రభో అన్నాడు .ఉగాదికి ఈ ఫలితాలకు లంకె ఏమైనా ఉందా /అన్నాడు .పెట్టు కోవాలె కాని లంకెల కేం కొదవ న్నాను మోదం ఖేదం విషాదం ఆశ్చర్యం వినోదం విపరీతం అనేఎ కలిపి అందించారు ఎవరి కర్మను బట్టి వారికి ఇవే ఉగాది పచ్చడి లోని రుచులనుకో .ఎవ్వరు పోఫ్=దిచేసిన్దేమీ లేదని నిరూపించారు .
బావా యు.పీ.ఎన్నికల సంగ్స్తేమిటి మరీ చేదుగా వుంది ?అని అడిగాడు .అవున్న్రా చేసుకొన్నా వారికి చేసుకోన్నంతా .అధికారం అణకువ ను ఇవ్వాలి కాని గర్వాన్ని కాదు .వున్న నాలుగు రోజులు సేవ లో తరించాలి ఆని సేవించుకొనే పరిస్తితి లో వుంటే ఇలానే ఉల్టా పల్టా అవుతుంది విగ్రహాలు ఏనుగు బలంతో తొక్కేశాయి .ప్రజాబలం ముఖ్యం .విగ్రహాలు లేక పొతే గాంధీ గారికే మైనా లోపం వస్తుందా .నువ్వు చేసిన ప్రజా హితమే. రక్ష ..నీకు నువ్వు సుప్రీం అనుకొంటే పాతాలానికే నీ దారి .గుర్తుంచుకో .ఏమిటి బావోయ్ ఎవరి మీదో పెట్టి నన్ను వాయిన్చేస్తున్నావుఅన్నాడు .లోక రీతి చెప్పాను అన్నాను .సరే కాని ఎనిమిదేళ్ళు గా యువ రాజు మందీ మార్బలం తో ఇల్లుల్లు తిరిగి ప్రచారం చేస్తే కన్నెత్తి చూడను కూడా లేదేం బావా ?అని అడిగాడు .యువ రాజు అనే మాటే అక్కడ వెగటు పుట్టించింది .అందుకే ఇంట్లో మహా రాజు గా వుండు చాలు అని చెప్పి పంపారు జనం మరి సింగ్ గారి సంగతో అన్నాడు .చేసిన తప్పులు చెంపలేసుకొని ఇల్లు ముందు చక పెట్టు కొన్నాడు .అనారోగ్యం ఆయనకు వారమే అయింది .బుద్ధ్హి మంతుడైన కొడుకు చేతికి అంది వచ్చాడు .జనం యువ కిరణాలు కావాలను కొన్నారు అందుకే యువ పట్టాభిషేకం అభిలాష నీయం గా చేశారు .జనం మనసు తెలిసి వృద్ధ సింహము గుహలో కి చేరింది .క్యన్నాను .
యువ కిరాణా లంటే గుర్తుకొచ్చింది బావా >ఇక్కడా యువకిరనాలనే ధంకా బజాయిస్తున్నారుగా .మరి ఫలితం తారు మారైన్దేమిటి ?అని అడిగాడు .నాయనా .ఇక్కడ నాయకులు పైనించి పైరవీ చేసి దిగుమతి అవుతారు .మూటలను కుదువ బెట్టి అధికారం సంపాదిస్తారు .వాళ్లకు ప్రజా బలం యందు కుంటుంది ?అన్నాను .
బడ్జెట్ విషయం ఏమిటి ఆవా మరీ గందర గోళం గా వుంది ?అని ప్రశ్న .ఒకే ఒక్కడు దేశం మొత్తం మీద పూర్తి అవగాహన ఉన్న నాయకుడు అతడే ప్రణబ్ .అతన్ని మించి ఏ నాయకుడు ఎదగ లేదు ఎదగ లేదు కూడా .ఆ మహాను భావుడికి అన్నీ తెలుసు .దేశం లోని అత్యున్నత పదవి అందుకొనే అర్హత ఆయనకు మాత్రమే వుంది .కాని ఆయన్ను సమశ్యలను పరిష్కరించాతానికే తప్ప ఆయన సామర్ధ్యాన్ని ఉపయొగిన్చుఒఎక పోతున్నారు .మన జేబులో చెయ్యి గారి మాటేమిటి బావా ?అన్నాడు .పాపం ఆయన పెద్ద మనిషే .అయితె రాంగ్ టైం లో అధికారం లో వుండటం ఆయన దురదృష్టం .అవతలి వాడి తప్పులన్నితికి ప్రేక్షక పాత్ర వహిస్తున్డటం తో ఆయన అతి  బలహీన వాడిగా నిరూపించుకొన్నాడు .యువ రాజు పస టెలి పోయింది .అందుకని ఆయన్ను సాగనంపే ధైర్యం ఎవరికి లేదు ..ఆయన అంత కన్నా ఏమీ చేయను లేదు .తాతల కాలమ్ లో నేతులు తాగిన సామెత ఆయనది .జాలేస్తుంది ఆయన్ను చూస్తె .
బావా ఈ సారి పంచాంగం యేమని చెబుతోంది ?మళ్ళీ ప్రశ్న .అయిదుగు స్థానాలలో శుక్రుడు వున్నాడు .పాప గ్రహాల చూపు తక్కువ .అందుకని నందన పేరు సార్ధకమాయి ఆనందాన్నిచ్చే సూచనలున్నాయి అన్నాను .సరే బావా వెళ్ళొస్తా .ఇంట్లో ఏవైనా కయ్య స్వీట్లు చేస్తే తిని వెళ్తా అన్నాడు .అంత శీను లేదు మీ అక్కయ్య గుండిగేడు ఉగాది పచ్చడి మాత్రమే చేసి ,కాలనీ వాళ్ళందరికీ శర ఫరా చేస్తోంది గుది లోకి కూడా మాకు ఎట్లాగో గుది లో ప్రసాదాలుంటాయి .కనుక ఇంట్లో స్పెశాల్సేమీ వండడు .నువ్వు వెళ్లి రావటం మంచిది అన్నాను .పాపం ఆముదం ముఖం వేసుకొని వెళ్ళాడు బామ్మర్ది బ్రహ్మం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —23 -03 -12
శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి శుక్ర వారం -అందరికి ఉగాది శుభా కాంక్షలు

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఆనంద నందనుడు ఉగాది కవిత

 ఆనంద నందనుడు


            నిరుడు ఖర ను ఆహ్వానిస్తే 
ఈడ్చి ఎడా పెడా తన్ని ఒదిలాడు
కోలుకోలేని దైన్యాన్ని నింపి
అవమానాన్ని అధిక తరం చేశాడు
చీకటి కుంభ కణాలను చీల్చే ప్రయత్నం
లేశం గా మాత్రమే ఫలించింది .
ఇంకా పెద్ద తిమింగిలాలు ఉచ్చులో
పడ కుండా తప్పుకుంటున్నాయి
ఉప ఫలితాలు ఉగాదికి ముందే వచ్చి
షడ్రుచులను చూపింది
మీసం మేలేసిన వాళ్లకు మిరపదెబ్బ
గో.పీ.(గోడమీది పిల్లి )లకు చెంపదెబ్బ గా చేదు
మేమే ఇచ్చేది అన్న వారి పోగరుకు వగరు
మేమొస్తే ఇస్తామన్న వారికి కిన్చిదాశాగా పులుపు
పదేళ్ళ కష్టానికి ఊరటగా కొంత తీపి
ఒంటెత్తు పోకడకు మొట్టి కాయ లా
నషాళం అంటే ఘాటూ అంటించింది
అసలు దేశం లో ప్రభుత్వాలున్నాయా
అనే అనుమానం  పెనుభూతమై కూచుంది
ప్రభుత్వాలు నడవటం లేదు కుంటుతూ దేకుతున్నాయి .
ఇది నా ప్రభుత్వం అని ఆమ్ ఆద్మీ
మీసం మెలేసి చెప్ప లేకున్నాడు
లోకూ లేదు పాలూ లేదు అంతా చీప్ లిక్కరే
ఉత్తర  దేశం ఒక పెద్ద హెచ్చరికే జారీ చేసింది
మేలుకోకుంటే గర్వం ఖర్వం చేస్తాడు ఓటరు ఘనుడు
ఏదో ఒక కార్డు తో లబ్ది పొందాలంటే సాగే రోజులు పోయాయ్
నీతికి ,సచ్చీలతకు విలువ లు హెచ్చాయ్
యువ రాజు ఖంగుతిన్నాడు -యువ కిశోరం చక్రం తిప్పాడు
అయినా ఇప్పుడు వచ్చ్చేది ”ఖరుడి నందనుడు ”(గాడిద కొడుకు )
తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకోకుండా
హిరణ్యకశిపుని నందనుడైన ప్రహ్లాదునిలా
ఆనంద నందనుడై ,అమృత రస చందురుడై

         నిత్య వసంతనందనోత్స వాన్ని 
         అందించాలని మనసారా ఆహ్వానిస్తున్నాను .
                     ఉగాది శుభా కాంక్షలతో 
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23 -03 -12
శ్రీ నందన వత్సర చైత్ర శుద్ధ పాడ్యమి -శుక్ర వారం .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్-4

          ఇతర నవలలు 


                                               
చార్లెస్ డికెన్స్ రాసిన ”ఆలివర్ ట్విస్ట్ ”నవల నెర చరిత్రకు సంబంధించింది . .లండన్ లోని అండర్ వరల్డ్ అంతటినీ కళ్ళకు కట్టించిన చిత్రం గా కని పిస్తుంది .సాంఘిక అధిక్షేపణ నవల .చైల్డ్ ను హీరో గా పెట్టి రాసినామోదటి నవల .చిన్న వాడి దృష్టి లో నుంచి సాగిన కధా గమనం .ఆలివర్ జీవిత యాత్ర అసహాయ స్థితి నుంచి  పరిస్థితి ని గుప్పిట్లో పెట్టు కొనే దాకా సాగుతుంది .ఉనికి లేని స్థితి నుంచి అస్తిత్వాన్ని నిల బెట్టు కొనే ఒంటరి పోరాటం అది ఏమీ చేయలేక అసహాయం గా చాయా సీన్లలో ఆలివర్ ఏడుస్తాడు .మాట్లాడాడు .అన్ని సమయాల్లోనూ తెల్ల మొహమే పెడతాడు .అతని ప్రతి వాడు తనకు కావలసి నట్లు మలుచు కొంటాడు ..ఆ కధే స్టోరి వో .(జీరో )తల్లికి బిడ్డకు వున్న ప్రాధమిక సంబంధం సదల రాదు తెగిపోకూడదు .ఇదే అస్తిత్వ చిహ్నం
ఉత్సుకత ను కలిగించే దుఃఖ భాజనుడి కధ .విపత్కర పరిస్థితి లలో కూడాచెడు పై మంచి సాధించిన విజయం ..చార్లీ చాప్లిన్ కు బాగా ఇష్టమైన నవల ఇది .దీనిపై ఎనిమిది సినిమాలు తీశారు .”చట్టం గాడిద లాంటిది ”అని డికెన్స్ తరచుగా అంటాడు .
‘నికొలాస్ నికల్బి ”నవల చాలా సరదా గా కష్టపడ కుండా రాశాడు .ది డైలీ న్యూస్ అనే పత్రిక కొంత కాలమ్ నడిపాడు .తండ్రికి పనేమీ లేక పోవటం తో ఆజరు పట్టీ లో పేరు రాసి జీతం ఇచ్చే వాడు .చాలా గిల్డ్ లకు ,చారిటీస్ కు సహాయం చేశాడు డికెన్స్ .అడిగిన వాడికి లేడన కుండా ధన సాయం చేసిన మానవీయతా మూర్తి .అమెరికా కు రెండు సార్లు రీడింగ్ టూర్ వెళ్ళాడు .డబ్బు బాగా వచ్చింది ”మన సంస్కృతీ అధ్యయనం డికెన్స్ ద్వారా సాధ్యం ”’అన్నారు ఇంగ్లాండ్ విశ్లేషకులు .
ప్రముఖ నేరస్తుడి ఉరితీత విక్టోరియన్ ఇంగ్లాండ్ లో పెద్ద డ్రామా గా జరిగేది .ఇది చూసిన డికెన్స్ కు జీవితానికి చావుకు మధ్య వున్న వాకిలి ని చూసి చలించి పోయేవాడు .దీన్ని బట్టి చూస్తె మనిషి కి చావు ఎప్పుడో అతనికి తెలిసి పోతుంది అనుకొన్నాడు .ఆ హింసకు విచాలితుదయ్యే వాడు .నాలుగు ఉరితీతలకు స్వయం గా హాజరై రిపోర్ట్ లు  రాశాడు .అమెరికా ప్రజల్ని ‘బోరింగ్ పీపుల్ ”అన్నాడు .అక్కడి బానిసత్వాన్ని నిరషించాడు .పొగడ్తలంటే ఇష్టమని ,తమల్ని చూసి తాము నవ్వు కోలేని ప్రజలని అమెరికన్ల పై డికెన్స్ అభిప్రాయం .అయితె ముఖ్య అతిధిని చూసి నవీ సంస్కారం వున్న వారు ఐ చురక అంటించాడు .అతను మాట్లాడిన దంతా బాగానే పేపర్లలో రాసినా ,అమెరికా నాయకులు తలలో పేలు వంటి వారని ,అమెరికా ప్రతి దాన్ని భ్రస్టు పట్టిస్తోందని ,ప్రజా వాణి కి విలువ్క అక్కడ లేదని నిర్భయం గా చెప్పాడు ..
రచయితల రక్షణ కోసం డికెన్స్ ఒక సంస్థ ను స్థాపించాడు .వారి హక్కులను కాపాడ టానికి న్యాయ నిపునిది గా వ్యవహరించాడు .లాంగ్ ఫెలో కవి దీన్ని సమర్ధించాడు .1891 లో చట్టం వచ్చింది .ప్రపంచ వ్యాప్తం గా కల్పనా సాహిత్యాన్ని అత్యుత్తమ వ్రుత్తి గా మార్చిన ఘనా ఘనుడు దికేంసే .అతని సాహిత్యం ,ప్రజా సంబంధాలు  ,ఆత్రుత్వం వల్ల సాహితీ వ్రుత్తి గౌరవ స్థానం పొందింది .రచనల వల్లనే సంపన్నుడైన ఘనత డికెన్స్ ఒక్కడికే దక్కింది .
1844 లో మార్టిన్ చుజిల్ విత్ పుస్తకాన్ని ఉల్ల్లస భరితం గా తేలిగ్గా సృజనాత్మకం గా రాశాడు .అందులో నఎడీ పండలేదన్నారు విమర్శకులు .అయితె అందులో డికెన్స్ పరిపక్వత కని పిస్తున్దన్నారు .అతని జీవితాన్నే మార్చేసిన నవల అది .అమెరికా నుంచి వచ్చిన నిరుత్సాహ పరిస్తితి లో రాసింది .కొత్త దారి తొక్కాడు .మిస్టరి తో నింపాడు .తమాషా పేర్లు పెట్టాడు .ప్రతి పాత్రకు రెండు పేర్లుంటాయి .పిక్విక్ పేపర్ నవల అన్నింటా నంబర్ వాన్ అని పిస్తే ఇది అన్నిటా లాస్ట్ అని పించుకోవటం విచిత్రం .అయినా బెస్ట్ సెల్లార్ గా నిలిచింది .ఇందులో మార్టిన్ చుజిల్ విత్ కు అమెరికా దేశం పిచ్చి ఆసుపత్రి గా అనిపిస్తుంది .మనం రోడ్డు మీద వున్నాం అన్నాడు చేస్తార్తాన్ .”డికెన్స్ మేధో మధన సారం  ఈ నవల ”అన్నాడు గీజింగ్ అనే విమర్శకుడు ..ఇందులోని మిసెస్ గామ్ప్ డికెన్స్ కు ఉన్న వింత వికారమే .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -03 -12
శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి -శుక్ర వారం -ఉగాది శుభా కాంక్షలు

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి నందన నామ ఉగాది కవి సమ్మేళనం – పురస్కార దృశ్య మాలిక

This slideshow requires JavaScript.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నందన ఉగాది సరస భారతి విశేషాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –3

అందరి నేస్తం డికెన్స్ –3

         డికెన్స్ కు పన్నెండు మంది పిల్లలు .౨౨ ఏళ్ళ తర్వాత భార్య కాతేరిన్ తన్ను అసలే ప్రేమించలేదని ,ఆమె లో ప్రేమ మృగ్యం అని సంచలనాత్మక ప్రకటన చేశాడు .ఆరోజుల్లో ఇంగ్లీష్ మధ్య తరగతి కుతుమాల వారు పుస్తకాలను కోని చదివే వారు కాదు .అప్పుడు పుస్తకాల ఖరీదు పదిన్నర శిల్లిన్గుల అర గినియా .ఇవాల్టి వంద డాలర్లకు సమానం .అయితె డికెన్స్ రాసిన వన్నీ సీరియల్ రచనలే .పిక్విక్ పేపర్లలో తన మేధస్సును ,స్వభావాన్ని రంగ రించి కొత్త రూపాన్ని సృష్టించాడు .శక్తి నంతా కూడ గట్టి ,అధిక శ్రమ తో రెండు వారాలు దృష్టి నంతా నిలిపి సీరియల్ పూర్తి చేసే వాడు .అవగానే విశ్రాంతి పొంది ఇంకోటి మొదలు పెట్టె వాడు .ఇలా ఏక ధాటిగా ౪౦ ఏళ్ళు సుదీర్ఘ రచనా వ్యాసంగం చేశాడు .ధాకరే కు నలభై ఏళ్ళకే జుట్టు నేరిస్తే ,డికెన్స్ చాలా చలాకీ గా పెద్ద మనిషి గానే వున్నాడు .

పిక్విక్ పేపర్స్ అరుదైన ,ఏ వర్గీ కరణకు అందని అడ్డు కోలేని నవల .అది నిజం గా నవల అనలేం .అదొక గొప్ప పుస్తకం అన్నాడు జార్జి ఆర్వెల్ .దాన్ని ఒక పుస్తకం గానే బేరీజు వేయాలి .అందర్నీ పూర్తి సంతృప్తి పరచిన పుస్తకం .అద్భుత యత్న కృత నవల .అందులోని హాష్య సన్ని వేషాలను రాసే టప్పుడు డికెన్స్ బిగ్గరగా నవ్వే వాడట .అది ”పిక్వేరియాన్ ఫ్రేం ఆఫ్ మైండ్ ”ను తెలుపుతున్దంటారు .చెడుపై మంచి మాత్రమే చివరికి విజయం సాధిస్తుందని సందేశం .ఆనందాన్ని పంచటమే ధ్యేయం .గొప్ప కామెడి గా ప్రశిద్ధి చెందింది .ఫ్రెంచ్ వాళ్ల ఫార్స్ లాంటిది అని విశ్లేషకుల భావన .నవ్వు పుట్టించే పుస్తకం మాత్రమే కాదు .1827 మే 12 న ప్రారంభమైంది .భాషా స్కలితాలు ,విడ్డూర మైన విషయాలు ,మాటల గారడీ ,ప్రభావితం చేసే పేర్లు అందులో వున్నాయి .సంఘటనల పరంపర ,టాగ్ ఫ్రేజులు ,సరదా పాత్రలు ,బాజ్ మాటలు (గుస గుసలు )పుష్కలం గా వున్నాయి .80 కి పైగా పాత్రలున్నాయి .ఇందులో ode of an expiring frog” అనేది  సరదా  జారదా .1836 -38 కాలాన్ని పిక్విక్ యియర్స్ అన్నారు .1938 వచ్చే సరికి  ఇంగ్లాండ్ లో అత్యంత ప్రముఖులలో డికెన్స్ ఒకడైనాడు .  .దీన్నే పిక్వీకియాన్ వరల్డ్ అన్నారు .అవి పారిశ్రామిక విప్ల వాణికి ముందు రోజులు .కోచ్ లు బాగా వున్న కాలమ్ .అప్పటికి లండన్ ఇంకా ఒక పెద్ద గ్రామమే .ఈ నవల వల్ల నవలా శైలి లో ,నవల రాసే విధానం లో విప్ల వాత్మక మైన మార్పులు వచ్చాయి .మార్కెటింగ్ లో గొప్ప ప్రగతి సాధించింది .ముసలి రాజు పోయి యువరాణి ఇంగ్లాండ్ కు రాజైన కాలమ్ అది .అప్పటికే యువ నవలా రచయిత గా డికెన్స్ గుర్తింపు పొందాడు .ప్రేశాకులకు ఏమి కావాలో అతనికి బాగా తెలుసు .వాళ్ళు దేనికి భయ పడుతున్నారో ,వాళ్ల కలలేమితో ,తెలిసి రాసాడని జాన్ ఇర్వింగ్ అన్నాడు .
1822 లో ప్రఖ్యాత నవలా రచయిత సర్ వాల్టర్ స్కాట్ మరణించాడు .అతనితో నవల చని పోయిందని అందరు భావించారు .విక్టోరియన్ నవల ఇంకో ఏడేళ్లకు కాని బయటకు రాలేదు .ఈ ఖాళీ ని డికెన్స్ పూరించాడు తన శృంఖల నవలలల తో .సాంఘిక ,రాజా కీయ ,వ్యంగ్య రచనలు సంగీతా శాలల మూగ భాష ,మేలో డ్రామా ,వీధి మనుషుల భాష ,పట్టాన చరిత్ర లతో దయా పూరిత రచనలు చేశాడు డికెన్స్ .ఇందులో విక్టోరియన్ రుచి పెరిగి ఫిక్షన్ ఎదిగింది .పిచ్చి ఆమిక్ సీరియళ్ళను ఉల్లాస భరిత నవల గా మార్చిన ఘంట డికెన్స్ దే .చీకటి వెలుగులను మిశ్రమం చేసి ,కొత్త పోకడ పోయాడు .అసంగత విషయాలను స్వచ్చత తో నింపాడు .అంతవరకూ ఏ నవలా చేయని పని పిక్విక్ చేసింది .లింగ ,వయస్సు ,అంతస్తులను అదిగా మించి ఆడ మగ పిల్లలను చదువు కున్న వారిని చదువు లేని వారిని అందర్నీ ఆకట్టు కొంది .అన్ని తరగతుల వారు ఆదరించారు .యువకులకు ”బొజ్ ”ఆదర్శ పురుషుదయాడు (కల్ట్ ఫిగర్ )పెద్దలకు 18 వశతాబ్దపు గొప్పనవలను   గుర్తుకు తెచ్చింది .న్యాయాధి కారులు బెంచి మీద కేసుల విరామ సమయం లో దీన్ని చాదివే వారు .వ్యాపారస్తులు తమ వస్తువులను వీటి అత్తలలో వుంచి అమ్మే వారు .ప్రతి వాడు డికెన్స్ తమ కోసమే రాస్తున్నాడు అనే హావం కలిగించాడుఅని పించుకొన్న మేధావి డికెన్స్ .అదే సౌందర్య దర్శనం గా సాధించిన విజయం .పిక్విక్ పిచ్చి (మేనియా )ఎక్కించాడు డికెన్స్ ఆ కాలానికి అదంతా కొత్త దానమే .సమాజ పద్ధతులు ,వాణిజ్యం ,సాంకేతికత ,పారిశ్రామికత లోని కుట్ర ,కుతంత్రం ఈ కొత్త రచనకు దారి తీసింది .మేనియా గా చదువరులను పట్టుకుంది .నవల ఒక వినిమయ వస్తువు గా చలామణి లోకి వచ్చింది దీని వల్లనే .(commadity )వేలాది మంది కోని చదవటం దీని ప్రత్యేకత .ముద్రణ అయిన వెంటనే ఎగబడి ,కోని చదివే స్తితికి సమాజాన్ని తెచ్చాడు డికెన్స్ ,.అమెరికా ఇండియా ,కెనడా లలోను ఇదే పరిస్థితి .అంత క్రేజ్ ను సృష్టించాడు .పిక్విక్ పేపర్ల కధే జనసంమాట మైన సంస్కృతీ ,ఆధునిక మార్కెటింగ్ కధ .మాస్ -అంటే సామాన్య జనం  చదివిన మొదటి నవల అదే .ఆ సంస్కృతిని నిలు వెళ్ళా వ్యాపింప జేశింది .చాలా చౌకగా కాగితం అట్ట పై పేపర్ పాక్ ఎడిషన్ గా వచ్చిన తొలి నవల అది .కల్పనా సాహిత్య చరిత్రలో వచ్చిన మొదటి నవల .అందరికి అందుబాటు ధర .జన సామాన్య సంస్కృతిని ప్రభావితం చేయటమే కాదు అదే జన సామాన్య సంస్కృతీ అయింది .లిటరేచర్ గా పిలవబడి నప్పటికీ పూర్తి హాశ్యమే వ్యంగ్యమే .పాథకులు ఎదురు చూసే స్థాయికి సాహిత్యాన్ని తీసుకు వచ్చిన ఘనత డికెన్స్ దే .అంటే కాదు సీరియల్ గా రాయాలన్న ఆలోచనా ఆయనదే .మొదటి పుస్తకం విడుదల అయిన రోజున లండన్ కు దూరం గా ఉండాల్సి వచ్చింది .అదే సక్సెస్ అయింది .అంటే ఇంకా ఏపుస్తకం విడుదల అయినా లండన్ లో వుండే వాడు కాదు అంత సెంటి మెంట్ ఏర్పడింది .పిక్విక్ పేపర్స్ లో 35 బ్రేక్ ఫాస్ట్ లు ,32 దినార్లు ,10 టీలు ,10 లంచులు ,ఎనిమిది సప్పర్లు ,59  ఇన్నులు (ఇన్స్ )వున్నాయని లెక్క వేశారు .865 మంది మనుషులున్నారు .దీన్ని స్టేజి మీద ఆడారు .ప్రతి పేజి లో ఒక కొత్త కారెక్టర్ ,.కధ ౧౬౮ ప్రదేశాలలో జరుగు తుంది .బైబిల్ తర్వాత ప్రపంచం మొత్తం మీద అధికం గా అమ్ముడైన పుస్తకం .అదే ఆల్ టీం     రికార్డ్ .చదవ  గల   వారి  సంఖ్యను  ,కోని   చదివే  వారి   సంఖ్య  తో  భాగిస్తే  ఎనభై  ఒక్క  శాతం  తో  ఈ  నవల  అన్నిటికంటే ముందుంది .గాన విత్ ది విండ్ నవలకు ఈ నిష్పత్తి నలభై మాత్రమే .బెస్ట్ సెల్లార్ పుస్తకం అంటే అదీ కొల మానం .ఈ నవల ఇంగ్లీష్ వకాబ్యులరి ని సుసంపన్నం చేసింది .ఇంగ్లీష్ డిక్షనరీ లో డికెన్స్ వాడిన మాటలన్నీ చేరి శోభను చేకూర్చాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -03 -12 .

Posted in రచనలు | Tagged | Leave a comment

సాహితి మండలి ఉయ్యూరు – నందన ఉగాది పురస్కార – ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి ఉగాది పురస్కారాలు

ఆడియో – 1

ఆడియ – 2

This slideshow requires JavaScript.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మంచికి పెద్ద మనిషి -దేవినేని మధుసూదన రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –2

అందరి నేస్తం డికెన్స్ –2

                                     రచనా వ్యాసంగం 
 1831 లో అంటే డికెన్స్ 19  వ ఏటనే ఫ్రీ లాన్స్ కోర్ట్  రిపోర్టర్ అయాడు .షార్ట్ హాండ్ అతి వేగం గా రాస్తూ దేశం లోనే ఫాస్తేస్ట్ షార్ట్ హాండ్ రిపోర్టర్ అని పించుకొన్నాడు .ఇతని నవలలు ఆతర్వాత షార్ట్ హాండ్ లోకి అనువాదం పొందటం గొప్ప విశేషం .నటించాతమూ అతనికి బాగా తెలుసు .ఒక కంపెని మేనేజర్ అతన్ని ఆడిషన్ టెస్ట్ కు పిలిపించాడు .తలనొప్పి రాంప వల్ల వెళ్ళ లేక పోయాడు .లేక పొతే రచయిత డికెన్స్ బదులు కమెడియన్ డికెన్స్ మిగిలే వాడేమో ?ట్రూసన్ పేపర్ కు రిపోర్టర్ అయాడు .రిటన పార్లమెంట్ విశేషాలు రిపోర్ట్ చేసే వాడు .రెండు నాల్కల లాయర్లు ,రంగులు మార్చే ఊసరవెల్లి రాజా కీయ నాయకులు ,బద్ధ కస్తులు ,లంచగొండి బ్యూరో క్రాట్ లను చూసి ,వారు ఆడే మానవ నాటకాలను చూసి ఆశ్చర్య పోయే వాడు .వాళ్ళందరి జీవితాలను చదివి అర్ధం చేసుకొన్నాడు .”న్యాయం అనే తండ్రి పిల్లల్ని దూరం చేసుకొన్నాడు ”అని డికెన్స్ భావించాడు .వీళ్ళందరి జీవితాలను చదివే సరికి జీవితం అంత సరిపడా రచనా సామగ్రి దొరికింది .మంత్లీ మాగా జైన లలో ”విగ్నేట్స్ అఫ్ సిటీ లైఫ్ ‘(‘నగర  జీవిత పుష్ప చిత్రం )అని రాస్తుండే వాడు .ఈ అనుభవమే ”పిక్విక్ పేపర్స్ ”రచనకు దారి తీసింది .ఎలెక్షన్ వార్తల కోసం ఇంగ్లాండ్ ,స్కాట్లాండ్ దేశాలన్నీ తిరిగాడు .మానవ ప్రవర్తన యెంత కృత్రిమం గా,బుద్బుద ప్రాయం గా  వుంటుందోతెలుసు కొన్నాడు .ఒక గంటకు 15 మైళ్ళు తిరిగాడు . లండన్ లో ప్రతి అంగుళం అతనికి తెలుసు .సాన్నిహిత్యం ఏర్పరచు కొన్నాడు .21 ఏళ్ళ వయసులో మంచి పేరు ,ప్రఖ్యాతి వచ్చాయి .లండన్ గెజెట్ కు స్కెచెస్ రాశాడు .ఇద్దరంమాయిల ప్రేమలో నలిగి పోయాడు .అందులో ఒకరైన మేరియా బీడ్న్స్ అనే అమ్మాయినే ”డేవిడ్ కాఫర్ ఫీల్డ్ ”నవలలో ”డోరా ”పాత్రగా చిత్రించాడు .ఇతనికి ఆమె పై ప్రేమ వున్నా ,ఆమె ఆకర్షితు రాలు కాలేదు .ఇది వాన్ సైడ్ ప్రేమ ట్రాక్ గా మిగిలి పోయింది పాపం .అతన్ని ”బాయ్ ”అని అవమానించేది .మానసిక క్షోభ అనుభ వించాడు .మేరియ వాళ్ళ మిజేరి పెరిగింది .ఆమె నుంచి దూరం అవుతూ తానూ అంట వరకు ఎవరిని ప్రేమించ లేదని బ్రతికి ఉండగా మేరియా ను తప్ప ఇంకేవారిని ప్రేమించానని బీరాలు పోతూ రాశాడు .ఆ తర్వాతా ఆమె కు రాసిన ఉత్త రాలన్ని తగల బెట్టె శాడు .ఇదంతా నవలలో డోరా -డేవిడ్ ల ప్రేమ గా రాశాడు
 సీరియల్ రచన
కేథరిన హోగార్డ్ తో వివాహమైంది .గోల్డ్స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలలో మోసెస్ అనే చిన్న పిల్లాడు తానా పేరు చెప్పా మంటే ముక్కు మాటలతో ”బోజేస్ ”అనే వాడట .అదే” బోజ్”గా మార్చుకొని పేపర్లకు రాశాడు .చిన్న తమ్ముడికి ఆ పేరే పెట్టాడు కూడా .వాడంటే వాళ్ళ మాలిన అభిమానం డికెన్స్ కు .అసలు పేరు ”ఆగస్ట్ ”(ఘన మైన ).చివరికి వాడే అందరి ముందు డికెన్స్ ను ఆవ మానించి 1866   లో చని పోయాడు .తానూ రాసే స్కెచెస్ లో నగర జీవితం ,అణగారిన సామాన్యుల జీవితాలను చిత్రించే వాడు .పాత బట్టలు అమ్మే వాళ్ళు ,కిల్లీడుకానం వాళ్ళు ,టీ తోటల్లో పని చేసే వాళ్ళు కిల్లి దుకాణం వాళ్ళు బాధితులైన భార్యలు ,శిక్ష పడ్డ ఖైదీలు ,అందరు పాత్రధారులే .గుమాస్తాల మీదా ,ఆడంబరాల మీద ,ద్రాక్ష సారాయి మీద ,వంచన మీద ,మోస కారుల పై మిలిటరీ బాచి లర్ల పై ,ఇచ్చకాలు ఆడే వారి మీద అధిక్షేప రచనలు చేసి ”బోజ్ ”ప్రఖ్యాత రచయిత  గా గుర్తింపు పొందాడు .”వేల మంది గొంతుక తానె అయాడు(a MAN OF THOUSAND VOICES) .దీన్నే ”డికెన్స్ TERRITORY   ”అన్నారు విశ్లేషకులు .ఆ రచనలు ఆవేదనకు ,దుఖానికి ఆలంబనం .నగర సంస్కృతీ వీధి భాగోతం ,కింది తరగతి జనాల పలుకు బదులు ,వాళ్ళ నివాసాలు ,జీవన విధానం అన్ని తానా స్కెచెస్ లో ప్రతి బిమ్బింప జేశాడు .లండన్ నగర పాత్రను ఎవరు చిత్రించా నంత గొప్ప గా కళ్ళకు కట్టించి చూపించాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-17 -03 -1
Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్-01

 అందరి నేస్తం డికెన్స్-01


     ఇంగ్లాండ్ కు చెందిన ప్రఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్ అందరి వాడు .అందుకే అతన్ని రచయిత గా భావించారు .రచన చదవ గానే అతడు మన నేస్తం అనిపిస్తుంది .అన్నాడు జార్జి ఆర్వెల్ . ఆయనలో అన్నీ వుండటం వల్ల అందరికి స్నేహితుదయాడు అంటాడు జూల్స్ వేర్న్స్ . ”న్యాయానికి స్వర్గం -చెడుకు -నరకం .డికెన్స్ విషయం లో ను ,ఆయన దేశస్తుల విషయం లోను ఇదే సత్యం అన్నాడు ఆండ్రీ గైడ్ .ఆలోచించే హృదయాన్ని ,వేదన చెందే మెడను తప్ప కల లోని అన్ని ప్రతి బంధనాలను డికెన్స్ అదిగా మించాడు .ముస్సోలినీ కేమాల్ పాషా ,హిట్లర్ లు డికెన్స్ రాసిన ”లిటిల్ డోరియాట్ ”చదివి వుంటే నియంత్రుత్వాది కారాన్ని చేలా ఇంచే వారు కాదు అంటాడు బెర్నార్డ్ షా .డికెన్స్ శైలి బాగా లేదు అన్న వారు ఉండ వచ్చు కాని,అతని ఆకర్షణ ను కాదన్న వారు లేరు .అతని క్రిస్మస్ కరోల్ అద్వితీయ రచన .అదో ప్రపంచమే అన్నారు మహా పండితుడు ఫూటే .ఆయన నవల ఒక చిన్న కుటుంబం గురించి ఆక ,సమాజ చిత్రణమే కనిపిస్తుంది .పాత్రల  కంటే కారికేచర్ గా పాత్రలను మలిచాడు డికెన్స్.
 బాల్యం 


డికెన్స్ తండ్రి చార్లెస్ జాన్ డికెన్స్ .ఇంట్లో అందరు ఆయన్ను లేజీ ఫెలో అనే వార్రు .దరిద్రానికి ,పెద్ద మనిషి తరహాకు మధ్య వున్న దిగువ మధ్య తరగతి కుటుంబం .తండ్రి 18 ఏళ్ళ లో 20 సార్లు పైగా ఇళ్ళు మారాడు పెంచిన అద్దె చెల్లించే స్తోమత లేక ..తల్లిది ,తండ్రిది చిన్న పిల్లల మనస్తత్వం .అందుకని కుటుంబ బాధ్యత చిన్నప్పటి నుంచి డికెన్స్ మీదే పడింది .ఒక రకం గా తండ్రి జాన్ కు కొడుకు డికెన్స్ తండ్రి లాగా వ్యవహరించాడు డికెన్స్ జీవిత మంతా చిన్నతనం మీద తలిదండ్రుల మీద ప్రతి చర్యయే .-(reaction ) .తల్లిదండ్రులు చేసే తప్పులకు కొడుకే సాక్షి .కాని అన్నీ తట్టు కోని నెట్టుకు రావటం అలవాటై పోయింది .వాళ్ల దుబార ఖర్చు చూసి ,పనికి విలువ నిచ్చే వాడు .పెళుసు తనం అబ్బింది .విసర్జించ బడ్డ సొత్తు అంతా తాను గా భావించాడు .బాధ్యతా రాహిత్యపు తల్లులు  ,అవివేకపు అమ్మలు అంతా ఎలిజబెతేన్  కారి కేచర్లె అంటే పరిహాస చిత్రాలే .అతను చిత్రించిన దుబారా తండ్రు లంతా తండ్రి జాన్ క్లోనులే అన్నారు విమర్శకులు .
పెద్ద కొడుకు డికేంసే కనుక తలిదండ్రులుబాగా వాడుకొన్నారు ,ఆడుకొన్నారు .పీల్చి పిప్పి చేశారు .1812 ఫిబ్రవరి ఏడున లండన్ దగ్గర  potrs math లో జన్మించాడు డికెన్స్ . 12 ఏళ్ళకే చాలా చదివాడు .వేర్ హౌస్ లో ఉద్యోగం  లో చేర్పించాడు తండ్రి .ఆ వేర్ హౌస్ వైపు ఎప్పుడు వెళ్ళినా ఏడు పు వచ్చేది .ఆ ఉద్యోగానుభావాలు ,కష్టాలు బాధలు అతన్ని రచయిత డికెన్స్ గా మార్చాయి .అది తన జీవితం లో ఒక విద్యాలయమే అయింది .అందులో గడిపిన కాలమ్ నుండే అతని వ్యక్తిత్వం ఆవిష్కరింప బడింది .తన చిన్నతనం , ,తలిదండ్రుల బాధ్యతా రాహిత్యం అతన్ని అన్ని అది కారాలను సవాలు చేసే స్తితికి తెచ్చాయి .అధికారుల ,పెత్తందార్ల దాష్టీకం ,బాధ పడే వాణ్ని చూసి జాలి పద కుండా నిర్లిప్తం గా ఉన్న వారిపై కసి పెరిగింది .ఎదిరించే ధైర్యము వచ్చింది .
విక్టోరియా రాణి పాలనలో హింసించే హెడ్ మాస్టర్లు ,మతి మాలిన టీచర్లు ,బాధ్యతా రాహిత్య పాలనా సర్వత్రా దర్శనం ఇచ్చింది .బెత్తం లేకుండా టీచర్ వుండే వాడు కాదు ఆనాడు .డికెన్స్ ఒక రకం గా అదృష్ట వంతుడే -అలాంటి స్చూల్స్ లో చదవక పోవటమే ఆ అదృష్టం .అక్కడ చదివి వుంటే ఇంత పెద్ద మనిషి ఆయె వాడు కాదు .విద్య మనిషిని శుద్ధి చేస్తుంది .-మళ్ళీ అలాంటి నీచపు పనులు చేయక్కర లేదు అని పించింది .డబ్బు దాచి పెన్నీ వీక్లీలు కొని చది వె వాడు .సాహిత్యం లో ఏ గొప్ప రచయితా లాగా డికెన్స్ చదువు సాగ లేదు .ఏదో సాధారణ విద్యే అబ్బింది .15 ఏళ్ళకే డ్రాపవుట్ గా మిగిలి పోయాడు .తర్వాత ఎల్లిస్ అండ్ బ్లాకు మోర్ అనే లా ఫరం లో చేరాడు .వారానికి 18 షిల్లింగుల జీతం .గంటల తరబడి లండన్ వీధులన్నీ తిరిగే వాడు .అదో జగత్ సహోదరులు వుండే వీధులన్నీ కాలికి బలపం కట్టు కొని తిరిగాడు .వాళ్ళ స్థితి గతులు ,వేష భాషలు అర్ధం చేసు కొనే వాడు .ఇక్కడ జన సమ్మర్దం తక్కువ .అన్ని రకాల మనుషులు కన్పించే వారు .బ్రిటిష్ మ్యూజియం కు వెళ్లి చదివే వాడు .చదవటం అనేది డికెన్స్ జీవితం లో ఒక భాగమే అయింది .అక్కడే న్యూటన్ ,మార్క్స్లను చదివి జీర్ణించుకొన్నాడు .


సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -03 -12 .


—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –3

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –3

                                     సాహిత్య పోషణ 
అంకినీడు ప్రభువు కాలమ్ లోనే వేమూరి సుబ్బావధాని ,యడవల్లి అప్పా వధాని మద్దూరి క్రిష్ణావధాని ,కోతమర్తి రామావధాని ప్రభావ ఆది నారాయనావధాని మొదలైన వెద పండితులు వుండే వారు .రాజా గారు చల్ల పల్లి లో సంస్కృత కళా శాల స్థాపించి కావ్యం ,నాటకం ,అలంకార వ్యాకరణాలను ,వేదాన్ని బోధించే ఏర్పాటు చేశారు . అంకినీడు భాషాభి మాని .సంస్కృతాంధ్రాలలో దిట్ట .పండితులతో ఆయన సంభాషణ సమర్ధ వంతం గా వుండేది .
1876 -1921 ప్రాంత పాలకుడు మల్లికార్జున ప్రసాద్ నాయుడు సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడు .ఉర్దూ ,ఇంగ్లీష్ భాషల్లో ప్రవేశమే కాదు పాండిత్యము వుంది .పెదప్రోలు నివాసి వేమూరి నరసింహ శాస్త్రి ”సాహిత్య చక్ర వర్తి ”బిరుదాంకితులు .వీరి సోదరుడు శివ రామ శాస్త్రి ”సంగీతా సాహిత్య సార్వ భౌములు ”గా వాటిలో అభినివేశం వుంది .స్వయం గా వీణా వాయించే వారట .ఆయుర్వేద విద్య ను పెంచి పోషించారు .చల్ల పల్లి లో ఆయుర్వేద విద్యాలయం ఏర్పాటు చేశారు .వ్యాయామ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి పోటీలు నిర్వ హించే వారట .వీరి కుమారుడు అంకినీడు ప్రసాద్ ఆంగ్ల విద్య లో పట్ట భద్రులు .1909 లో తన రెండవ వివాహ సందర్భం గా కవి పండిత సభ నిర్వహించి అనేక మందిని సత్కరించారు .”సుశీల ”అనే నాటకానికి కృతి భర్త అయారు .కృష్ణా పత్రిక లో నిరంతరం వ్యాసాలు రాసే వారు .1912 లో మద్రాస్ లో జరిగిన భాషా చర్చకు అధ్యక్షులు గా వుంది ,శాస్త్ర చర్చ ను సమన్వయ పరచి ,ఆ సభలో పాల్గొన్న వేదం వెంకట రాయ శాస్త్రి ,దివాకర్ల తిరుపతి శాస్త్రి ,చెన్నాప్రగడ భాను మూర్తి వంటి దిగ్దంతులను మెప్పించారు .1927 లోఆంద్ర విశ్వ కళా పరిషత్ కు 25 వేల రూపాయలను విరాళా మిచ్చిన విద్యాభి మాని .  మచిలీ పట్నం లోని ”ఆంద్ర భారతి ”సాహిత్య పత్రిక ను పోషించారు .కాకినాడ ఆంద్ర ప్రచారిణీ గ్రంధమాలకు సహాయం చేశారు .బలిజే పల్లి లక్ష్మీ కంఠం గారు రాజా వారి సాయం తో గుంటూరు లో ”చంద్రికా ముద్రణాలయం ”స్థాపించారు .తర్క శాస్త్ర పారంగాతులైన అద్దె పల్లి సోమ నాద శాస్త్రి వీరి ఆస్థాన విద్వాంశులు .వేటూరి ప్రభాకర శాస్త్రి పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్యులు గారు వీరి శిష్యులే .తిరుపతి కవులు తరచుగా ఈ సంస్థానాన్ని సందర్శించి సత్కారాలన్డుకొనే వారు .
దేవర కోట ఆస్థాన పండితుడైన దేవినేని సూర్య ”భగవదను మతం ”హనుమదభ్యుదయం ,చిత్ర కర్నోదంతం ,వీర రస పుత్రీయం ,వైద్య రహష్య దీపిక ,తులసీ చరిత్ర అనే వైవిధ్య భరిత రాకానలను చేశారు .వీరు మిడిల్ స్కూల్ లో తెలుగు పండితులు .మూల ఘటిక కేతన రాసిన ”ఆంద్ర భాషా భూషణం ‘కు సూర్య గారు ”దివ్య ప్రభ ”పేరిట వివరణ రాశారు అది పండిత ప్రసంశ పొందింది .మెరకన పల్లి వాస్తవ్యులైన సూర్య గారు విద్వాత్కవులు ,పండిత సూర్యులు .
 గరిక పర్తి కోటయ్య దేవర 
ఆంద్ర గాయక పితామహులు గా కీర్తి పొందిన గరిక పర్తి కోటయ్య దేవర చల్ల పల్లి ఆస్థాన సంగీత విద్వాంశులు .ఈయన చిన్నతనం గురించి ఒక కధ వుంది .1864 లోబందరు ఉప్పెన లో పసి పిల్లాడు గా వున్న కొత్క్య్య ఉయ్యాల తో సహా నీటిలో కొట్టు కోని పోయి ఒక కుంకుడు చెట్టు కు చిక్కు కుంది.పిల్లాడు క్షేమం .తర్వాత చైనా తనం లోనే కొబ్బరి చిప్పకు గుర్రపు వెంట్రుక కట్టి కమానుతో సంగీతం వాయించే వాడట .గురువు లేకుండానే సంగీతం అబ్బింది .తండ్రి శిక్షణ లో విద్వామ్శుడై వాయులీనం లో ప్రతిభ సాధించారు .హైదరాబాద్ లో గానం తోనూ ,వాయులీనం తోనూ లీనమై సాధన చేస్తుంటే సాలార జంగ్ బహద్దర్ చూసి ముచ్చట పది చిన్నన్న అనే సంగీతా విద్వామ్శునికి అప్పగించి సంగీతం నేర్పమన్నాడు .చివరకు ఆస్థాన సంగీత విద్వామ్శుడైనాడు .తన ప్రతిభను గుర్తించిన రాజా గోపాలాచారి పై వర్ణం రాసి ,భక్తీ చాటాడు .మంచి కర్ణాటక విద్వాంశుడు గా కీర్తి పొందాడు .తంజావూర్ ఆస్థాన పదవి ఇస్తామంటే తిరస్కరించి బందరు చేరి సంగీతా విద్యాలయం ఏర్పరచి ఉచితం గా భోజనం పెట్టి విద్యార్ధులకు నేర్పించాడు .”జంగం కోటయ్య ”అని ఆయన్ను ఆప్యాయం గా పిలిచే వారు .గీతాలు ,వర్ణాలు స్వర జాతులు ,కీర్తనలు రాసిన వాగ్గేయ కారుడు కోటయ్య దేవర .
  శ్రీ మంతు రాజా శివరామ ప్రసాద్ బహద్దర్
1929 లో చల్ల పల్లి ప్రభువైనారు .పట్టాభి శేకానికి దేశం లోని కవులు ,పండితులు విద్వాంశులు హాజరైనారు అంతమంది కవులు ఏ రాజు పట్టాభిషేకానికి రాలేదని ఒక కవి చమత్క రించాడు .తిరుపతి కవులు ,కొప్పరపు కవులు సన్మానాలు అందుకొన్నారు .జమ్మల మడక మాధవ రామ శర్మ తాము రాసిన ”ఆంద్ర ప్రతాప రుద్రీయం ”అభినవ సహదేవ బిరుదాంకితులు ఎజేల్ల శ్రీ రాములు కవి ‘పశు వైద్య వస్తు దీపిక ”,పండిత గొర్రె పాటి వెంకట సుబ్బయ్య ”భట్టు మూర్తే రామ రాజా భూషణా ?”గ్రంధాలను రాజా వారికి అంకిత మిచ్చారు .వాజ్మి మహాధ్యక్షులైన వడ్ల ముడి గోపాల క్రిష్నయ్య గారికి రాజా వారు స్వయం గా స్వర్ణ గండ పెండేరం తొడిగారు .అమ్ముల విశ్వనాధ భాగవతార్ ,స్థానం నరసింహా రావు,గోవింద రాజుల సుబ్బా రావు వంటికలా కారులను సత్కరించారు .తెనుగు లెంక తుమ్మల సీతా రామ మూర్తి గారి ”రాష్ట్ర గానం ”కృతిని అందుకొన్నారు మద్రాస్ రాష్ట్ర శాసన సభ్యులయారు .ఆంద్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యులుగా ,ఆంద్ర మహాసభ అధ్యక్షులు గా వున్నారు .1949 లో తుమ్మల వారి కనకాభిషేక మహోత్సవం లో గండ పెండేరం తొడిగారు .పగటి వేష గాడు సున్నం వీరయ్య తో సహా అన్ని రకాల కళాకారులను సన్మానించారు .”మహతి”పత్రిక  కు మహా రాజ పోషకులయారు .కాజ ,పెడసన గళ్ళు మోపిదేవి శ్రీ కాకుళం గ్రామాలలో ఉన్నత పాత శాలలు నెల కోల్పారు .1966 లో రాజా వారి షష్టి పూర్తీ మహోత్సవం జరిగింది .బెజవాడ గోపాల రెడ్డి అధ్యక్షత వహించారు .కళా కారులందరికి బంగారు పతకాలు ,రవ్వల ఉంగ రాలు ,సువర్ణ కంకణాలు అండ జేశారు వీరి సాహిత్య పోషణ లలితా కళా సేవ ఎన్నదగినవి .”దివి పౌరుషానికి దిద్దిన మీసం శివరామ బహద్దర్”అని పేరు తెచ్చుకొన్నారు.
దివి సీమ దివ్య సీమ .భక్తీ రక్తి ముక్తికి నిలయం .జమీందారీ వారసుడైన నాగప్ప పేరు తో వెలసిన ఆగాయ లంక దగ్గరే కృష్ణ సాగర సంగమం వుంది .అగస్త్యేశ్వర ప్రతిష్టిత సుబ్రహ్మనఎశ్వరుడు కొలువైన నెల .జలదీశ్వర స్వామికి ,బౌద్ధ విహారానికి కేంద్రం ఘంట సాల .మొవ్వ వేణు గోపాలుడు క్షేత్రయ్య పదాలకు కృతి భర్త .శ్రీ కాకుళం ”చింతామణి ”నాటకానికి ఇతి వృత్త మైన కేంద్రం .పాలకులు అమృత హృదయులు .మొదటి ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించిన మండలి కృష్ణా రావు గారు చరిత్రలో స్థిర స్థానం సంపాదించుకొన్నారు విద్యా మంత్రి గా వన్నె కెక్కారు .వారి కుమారుడు బుద్ధ ప్రసాద్ తండ్రిన మించిన తనయుడు .తెలుగు భాషా సాహిత్యాలకు ,సంస్కృతికి అనుఖనం సేవ లందిస్తూ దేశం లోనే ఆదర్శ పురుషుని గా నిలిచారు
సమాప్తం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -03 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –2

 సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –2

                                    సాహిత్య పోషణ 
         నోటితో పొగుడుతూ నొసలు తో వెక్కి రించటం లోక సహజం .కవులు కూడా ఇందులో ఏమీ తీసి పోలేదు .వారి భాష లో ఇది వ్యాజ నిండా స్తుతి అన్నారు .అలాంటి మాతస్లతో పద్యాలు రాయటమే కాదు శతకాలు కూడా రాసి సాక్షాత్తు విష్ణు మూర్తి నే మెప్పించిన కాసుల పురుషోత్తమ కవి చల్ల పల్లి సంస్థాన కవి .ముక్తేవి పెరు మాలయ్య కవీ సుప్రసిద్ధుడే . సంస్థాన మూల పురుషులలో ఒక రైనా కంచి నీడు గారి వదాన్యత ,దాత్రుత్వాలపై చాలా చాటువులు వున్నాయని ”కమ్మ వారి చరిత్ర ”చెబుతోంది .శ్రీ కృష్ణ లీలా తరంగిణి రాసిన నారాయణ తీర్ధులు ,కూచిపూడి నాట్య కర్త సిద్దేంద్రుడు ఇక్కడి వారేనని అంటారు . .పెరు మాల్లయ్య
యార్ల గడ్డ కోదండ రామయ్య పాలనలో పెడ ముక్తేవి లోని లక్ష్మీ పతి స్వామి దేవాలయాన్ని పునరుద్ధ రించాడు .దీన్ని పంచ లక్ష్మీ నార సింహ క్షేత్రం గా భావిస్తారు .1765 -1785 ప్రాంతం లో నిజాం నుండి నిజాం ఆలీ అనే వాడి నాయకత్వం లో ఒక గుర్రపు దండు దేవర కోట సంస్థానాన్ని దోచుకోవ టానికి వచ్చిందట .ప్రభువు కోదండ రామన్న పెడ ముక్తేవి నివాసి అయిన పెరు మాల్లయ్య కవికి కబురు పెట్టి దండు రాకుండా చేసే ఉపాయం ఆలోచిన్చామన్నారట .కవి గారు వెంటనే శ్రీకాకుళం క్షేత్రానికి వచ్చి అక్కడ వెలసి వున్న ఆంజనేయ స్వామిని ఉపాషించాడు .అపటికే బేజ వాడ చేరిన నిజాఆలీ దండు గుర్రాలపై పిడుగులు అడ్డాయి .ప్రాణ భీతి తో దండు వెనక్కి వెళ్లి పోయేట్లు గా కవి పద్య శతకాన్ని చెప్పాడట .ఈ శతకమే ”హనుమంత శతకం”.కవులు రాజులను మెప్పించి నజరానాలు పొందటమే కాదు అవసర మైన పుదు రాజ్యాన్ని రక్షించే బాధ్యత కూడా తీసు కొంటారని దీన్ని బట్టి తెలుస్తోంది .ప్రభు భక్తీ పరాయణ తాకే కాక భగవద్భక్తి గరిష్టతకు ఇది గొప్ప ఉదాహరణ .”సింహాద్రి నార సింహ శతకం ”వంటి గొప్ప శతకాల సరసన వీరి శతకమూ చేరింది .”శత్రు హంత -శ్రీ హను మంతా ”అన్న మకుటం తో పొదిగిన కంద పద్య శతకమిది .
”ఇత్తరిని నిజామల్లీ -హత్తీలు గురాలు -పాటు తరాహ వ బలముల్ -మొత్తమయి వచ్చేవిచ్చిత్తు పడన్ -శత్రు హంత శ్రీ హను మంతా ”
  ”వడి గల దేవుడ వనుచును -నుడికారపు శతకమందు -నుతి చేసేదననే -కాదు వడి గుర్రపు దలముల -జేడ దోలుము -శత్రు హంత శ్రీ హను మంతా  ”
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే .ఈ కవి రామాయణ కధను 44 సీస పద్యాలలో ”భద్ర గిరి సౌద సంచార భవ విదూర ”మకుటం తో కావ్యం రాశాడట .ఈయన కుమారుడు సుందర దాస కవి సంస్కృతాంధ్రాలలో గొప్ప కవి .దౌహిత్రుడు కోవెల రాఘ వాచార్యులు శ్రీ కాకులాంధ్ర మహా విష్ణువు మీదా ,పెడ ముక్తేవి లక్ష్మీ పతి స్వామి మీదా గేయాలు ,ఏకాంత సేవా ప్రబంధాన్ని రాసి నట్లు ”దేవర కోట సర్వస్వం ”లో ఉందట .
కాశీ నాధుని మల్లనార్యునికి కోదండ రామన్న ప్రభవు ”మలేశ్వర పురాగ్రహారాన్ని ”దానం గా చ్చినట్లు ,దానికి ఆయన ”చల్ల పల్లి ధరణీ జాని యా కోదండ రాముడు మల్లేశ్వర పుర మిచ్చే —నత సమస్త భూమి పతి మల్లనా రాదయ పుణ్య రాశికి ”అని కృతజ్ఞత గా ”సత్యవత్సుపాఖ్యాన ”అవతారికలో చెప్పాడు .మొత్తం మీద కోదండ రామన్న రాజ్యాన్ని పెరుమాళ్ళ కవి హనుమద్భక్తి తో కాపాడి ప్రభువుకు ,ప్రజలకు మేలు చేశాడన్నది నిర్వి వాదాంశ విషయం .అంటే శ్రీ కుల ఆంజనేయ స్వామి అంతటి మహిమాన్వితుడు అని మనకు తెలిసిన విషయం .రాజా గారి ఈవి కూడా ప్రశంశ నీయమే .
  కాసుల పురుషోత్తమ కవి
శ్రీ కాకుళం అంటే ఆంద్ర శ్రీ మహా విష్ణువు తో పాటు కాసుల పురుషోత్తమ అవీ గుర్తుకు వస్తాడు .ఈ కవి శ్రీ మంటూ రాజా ఇమ్మిడి అంకినీడు బహద్దర్ 1798 -1819  గారి ఆస్థాన కవి .రాజును గురించి ఒక చాటువు ప్రచారం లో వుంది
”కలలో వెంబడి కృష్ణ రాయ విభుచే గబ్బంబు చెప్పించి బె -ర్వేలయన్ మున్నొక నాటి సేవ గొని ,యా శ్రీకాకులాన్ద్రేశ్వరుం -డలరంగా ,నిపు దంకినీన్న్రుపతి సేయం బూను విద్యోత్సవా –కలనన్ ,దానిక నేనని సన్నుత కృతుల్ గావింప గా జేయునో ”?
అంకి నీడు గారి పాలన లోనే శ్రీ కాలులాంధ్ర విష్ణువుకు పూజలు సక్రమంగా జరగటం లేదని కోపించిన స్వామి అంతర్ధానమై భూ గర్భం లో చేరాడని ఇది తెలిసి రాజు గొప్ప ఉపాసనా బలం వున్న కాసుల పురుషోత్తమ కవిని గొరవం గా ఆస్థానానికి రప్పించి ,స్వామి అనుగ్రహం కోసం ఏదైనా చెయ్య మని అర్ధించాడు అర్ధి జన బాన్ధవుడే స్వయం గా వెడితే కవి గారి మనసు కరిగి నీరైంది .వెంటనే శ్రీకాకుళం వెళ్లి కృష్ణా నది లో స్నానం చేసి పుఈతుడై స్వామి ఆలయం లో నిష్టగా నిలబడి ఆశ్తోత్తరస్హత పద్యాలను భక్తీ భావ బంధురం గా స్వామి హృదయం కరిగే టట్లు ఆశువుగా పద్య ధార కొన సాగించాడు .ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున స్వామి వారి విగ్రహం భూ గర్భం నుంచి పైకి వచ్చి నిలిచిందట .స్వామి భక్తీ ,ప్రభు భక్తీ తో చెప్పిన పద్యాలతో శ్రీకాకుల స్వామి సర్వాంగ సుందరం గా దర్శన మిచ్చాదట .స్థిరం గా కొలువై ఉన్నాడని ఐతిహ్యం .ఆ నాడు చెప్పిన శతకమీ ”ఆంద్ర నాయక శతకం ”గా జగత్ ప్రశిద్ధి పొందింది .అంకినీడు ప్రభువు పురుషోత్తమ కవిని ఆస్థాన కవీశ్వరుని గా చేసి ఋణం తీర్చుకొన్నాడు ”చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ -హత విమత జీవ శ్రీ కాకులాంధ్ర దేవ ”అన్న మకుటం తో శతకాలకే మకుటాయ మానమైంది .భక్త సులభుడు గా స్వామి నిరూపించుకొన్నాడు .తాను అలిగి అంతర్ధాన మైతే తన దాసుని ప్రార్ధన తో పునహా ప్రతిష్టిటు డయాడు స్వామి .సీస పద్యాలతో అమోఘ ధారా శుద్ధి తో మాధుర్య విలసితం గా వ్యాజ స్తుతి తో అలరారిన అద్భుత శతకమిది .ఈ శతక పద్యాలన్నీ ఆంద్ర దేశం లో ఆనాడు అందరి నోళ్ళలోనూ నానినవే .”మొదటి నుండి నీవు దామోదరుడవే ”అనే పద్యం అందరికి చిర పరిచితమే నిండా స్తుతికి మచ్చు తునక ..
పురుషోత్తమ కవి పెడ ప్రోలు నివాసి .తండ్రి అప్పల రాజు తల్లి రమణమ్మ .కాశ్యప గోత్రుడు .కవి గారి గురువు అడ్డంకి తిరుమలా చార్యులు .భట్రాజ కవి గా పురుషోత్తమ కవిని అందరు భావిస్తారు .భట్రాజుల్లో ఆసుల వారు ఇపటికి పెడ ప్రోలు గ్రామం లో వున్నారు .ఈ కవి కృష్ణా సాగర సంగమం అయిన హంసల దీవి వద్ద వెలసిన శ్రీ వేణు గోపాల స్వామి మీద ”వేణు గోపాల శతకాన్ని ””భక్త కల్పద్రుమ శతకాన్ని ”చెప్పాడు .”బమ్మెర పోతన హాగావాతం రాసి ఉండక పొతే కాసుల పురుషోత్తమ కవి రాసి వుండే వాడు ”అని విశ్వ నాద సత్య నారాయణ గారు మెచ్చిన మాధుర్య కవి పురుషోత్తమ కవి .ఒక రకం గా ”కవి పురుషోత్తముడు ”.
ఆంద్ర నాయక శతకం లో ఒక మచ్చు తునక
”ఆలు నిర్వాహకు రాలు భూదేవి యై అఖిల భారకుదన్న ఖ్యాతి దెచ్చె

— ఇష్ట సంపన్ను రాలిందిర భార్యయై కామితార్దుదన్న ఘనత దెచ్చె
కమల గర్భుడు సృష్టి కర్త తనూజుడై బహు కుతుమ్బకుదన్న బలిమి దెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమారియై పతిత పావను దన్న ప్రతిభ దెచ్చె
అందరు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతి గాని -మొదటి నుండియు నీవు దామోదరుడవే
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య బావ -హత విమత జీవ శ్రీ కాకులాంధ్ర దేవ ”
అలాగే వేణుగోపాల శతకం లో ఒక పద్యం రుచి చూద్దాం
శ్రీ రుక్మిణీ మనస్సార సేన్దిందిరా -సత్య భామా ముఖాబ్జ సామిత్ర
జాంబవతీ పాటు స్థాన శైల జీమూత -ఘన సుదంతా వయో వానమ దేభ
లక్షణా పరి రంభ లలిత పంజర కీర -భాద్రావాలీ తరంగ వన మరాళా
మిత్రవిన్దాధర మృదు పల్లవ పికా -రవి జాడ్రు గుత్పల రాజా బింబ
షోడశ సహస్ర కామినీ స్తోమ కామ -భావజా విలాస హంసల దీవి వాస
లలిత కృష్ణా సంగమ విహార -పరమ కరుణా స్వభావ గోపాల దేవ ”
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -03 -12

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master

Posted in రచనలు | Tagged | Leave a comment

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం -1

 సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం -1

          చల్ల పల్లి ”దేవర కోట సంస్థానానికి ”రాజా దాని .కోట ౧౬ ఎకరాల విస్తీర్ణం లో నిర్మించ బడి ,శత్రు దుర్భేద్యం గా వుంటుంది .వందల సంవత్సరాల జమీందారి దర్జా ,దర్పాలకు చల్ల పాలి కోట సాక్షీ భూతం గా నీలి చింది .దివి తాలూకా లోని అతి పురాతన సంస్థానం ఇది .తూర్పున బందరు తాలూకా ,దక్షిణ పశ్చిమాల్లో కృష్ణా నది ,ఉత్తరాన గన్న వరం గుడివాడ తాలుకాలు హద్దులు గా వున్న ప్రాంతం .వైశాల్యం 190 చ.మైళ్ళు .66 గ్రామాలు ,32 శివార్లు ,20 అగ్రహారాలతో కూడిన సంస్థానం .ఈ జమీందార్లు ఏటా ౮౦ వేలకు పైగా ప్రభుత్వానికి కప్పం చెల్లించే వారు .సాలు సరి ఆదాయం మూడు లక్షల రూపాయలు .పెదా వేగి ,కృష్ణా పురం సంస్థానాలు తారు వాత వచ్చి చేరాయి .ప్రభువులు కమ్మ వారు .
 సంస్థాన ఆవిర్భావం
ఈ ప్రాంతపు తోలి ప్రభువు ,మూల పురుషుడు శ్రీమంతు రాజా యార్ల గడ్డ సర్వ నీడు .1576 లో గోల్కొండ నవాబు అబ్దుల్ కుతుబ్ షా కాలం లో సర్వనీడు దేవర కొండ కోటకు సామంత రాజు .ఆయన తర్వాత పెద్ద కుమారుడు తిరుమల నీడు 1607 లో రాజు అయాడు .సర్వనీడు ను గుర్వినీడు అని పిలిచే వారు .తిరుమల నీడు కాలం లో మొగల చక్ర వర్తి కులీ కుతుబ్ షాహి నుంచి ”దేశ్ ముఖ్ ”హక్కులను 1640 లో సంపాదించుకొన్నాడు .ఈయన తరువాత సోదరుడు గంగినీడు రాజి 1695 వరకు రాజ్యం చేశాడు .ఆయన మరణానంతరం కొడుకులు పాపినీడు ,నాగినీడు ,రామినీడు లు 1698 వరకు పాలించారు .1708 లో గంగినీడు ,1710 వరకు నాగన్న ,1723 వరకు అంకన్న ప్రభువు లు గా పాలన చేశారు .1734 వరకు వెంకట రామన్న రాజు గా వున్నాడు .
౧౭౩౪ నుంచి ౧౨ ఏళ్ళు సంస్థానం చిక్కుల్లో పడింది .ఈ కాలం లోనే ”ఫౌజు దారి” సర్వాధికారాలు చేలా ఇంచాడు .రామన్న తరువాత అధికారం హనుమన్నా కు వచ్చింది ఈయనకు మతి భ్రమించటం తో 1745 వరకు రామన్న పాలన సాగింది .౧౭౪౬ లో కోదండ రామన్న ప్రభువై ప్రజా హిత కార్య క్రమాలు చేసి ప్రజలకు దగ్గరయ్యాడు .ఫ్రెంచి వారి నుంచి గూడూరు ,ఆకుల మన్నాడు .దివి సీమ లోని ఆరు లంకలకు ఫర్మానా సంపాదించి ,విస్తరించాడు .అనేక ఆలయాలు ,తటాకాలు నిర్మించి ప్రజా హితం గా పాలించాడు .తరువాత అధికారానికి వచ్చిన కొడుకు వెంకట రామన్న దేశాహి 1791 లో అధికారానికి వచ్చి 1792 లోనే చని పోయాడు .ఈయన దత్త పుత్రుడే శ్రీ మంటూ రాజా ఇమ్మడి అంకినీడు బహద్దర్ మైనరు అయి నందు వాళ్ళ తండ్రి నాగేశ్వర నాయుడు 1792 నంచి 1798   వరకు పాలన చేశాడు .మేజరు అయిన అంకినీడు 1798 నుంచి 1819 వరకు పాలించాడు .అంకినీడు కు సంతానం లేదు .సోదర కుమారుడైన దుర్గా ప్రసాద్ ను దత్తత తెసుకొన్నాడు .౧౮౦౨ లో కుంఫిని వారు ఇమ్మడి అంకినీడు పేరనే ”సన్నద్ -యి -మిల్కియత్ -ఇస్తి మీరార్ ”అండ జేశారు .అంకినీడు పూనా వెళ్లి పీశ్వాను దర్శించి శ్రీ మంటూ బిరుదును ,నిజాం నుంచి ”రాజ బహద్దర్ -జబ్దతుల్ అక్రాన్ ”బిరుదు పొందాడు .తరువాతి పాలకులకు ఇవి సంకర మించాయి .చల్ల పల్లి కోట లోని రాచ నగరు అంకినీడు      ప్రభువు కట్ట్టిన్చినదే .కాశీ రాజ సౌధం నమూనా లో రెండు లక్షలు వ్యయం చేసి కట్టించారు .చల్ల పల్లి రాజులు ”రేచర్ల గోత్రం” వారు .
అంకినీడు ప్రభువు మచిలీ పట్నం దగ్గర ”శివ గంగ ”లో ఈశ్వరాలయం నిర్మించాడు .1819 లో అంకినీడు చని పోయాడు .దత్త పుత్రుడు దుర్గా ప్రసాద్ మైనరు అవటం తో సంస్థానం ”కోర్ట్ ఆఫ్ వార్స్ ”పాలన లో కొంత కాలం నడిచింది .మేజర్ అయిన కొద్ది కాలానికి దుర్గా ప్రసాద్ 1895 లో అతి పిన్న వయసు లోనే అసువులు బాశాడు .అంకినీడు కు మరో దత్త పుత్రుడు యార్ల గడ్డ రామ అంకినీడు ౧౮౪౬ లో రాజ్యానికి వచ్చాడు .దాన ,ఉదార గునా లున్న ఈయన ౧౮౬౪ లో వచ్చిన పెను తుఫానుకు దివి సీమ అతలా కుతల మైతే అపార సేవ లందించి ఆడు కొన్నాడు .దిక్కు ,మొక్కు లేని వారందరికీ తన కోట లోనే రోజుకు లక్ష మందికి పైగా రెండు నెలల పాటు భోజనం పెట్టి తానా యోగ్యతను చాటుకున్న కరుణా మయుడు అంకినీడు ప్రభువు .తుఫాను ప్రభావం తగ్గి ప్రజలు ఇంటికి బయల్దేరి నపుడు అందరికి డబ్బు ,ధాన్యం అందించి తానా దాతృత్వాన్ని చాటు కొన్నాడు .ఇప్పటికీ ఈ విషయాలను అక్కడి ప్రజలు కధలు గాధలు గా చెప్పు కొంటారు .తుఫానుకు దెబ్బ తిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పునర్నిర్మించాడు .కాలువలను మరమ్మత్తు చేయించాడు .
ఆస్థానం లోనే కాదు ప్రజల హ్రుదయాస్థానం లోను స్థానం సంపాదించుకొన్న పుణ్య మూర్తి అంకినీడు బహద్దర్ .కోట చుట్టూ 20 అడుగుల ఎత్తున ప్రహరి గోడ నిర్మించాడు .బురుజులను దక్షిణాన 30 అడుగుల ఎత్తైన ద్వారాన్ని ఆయనే ఏర్పరిచాడు .

దర్బార్

దర్బార్

అంకినీడు మరణాంతరం 1876 వరకు మల్లికార్జున ప్రసాద్,1921 నుంచి అంకినీడు ప్రసాద్ 1926 డిసెంబర్ 26 -నుంచి  శ్రీమంతు రాజా యార్ల గడ్డ శివరామ ప్రసాద్ బహద్దర్ చల్ల పల్లి సంస్థానాన్ని పాలించారు .శివరామ ప్రసాద్ గారినే అందరు ”చల్ల పల్లి రాజా ”అని ఆప్యాయంగా పిలిచే వారు . ఈ సంస్థానానికి ఆఖరి వారసుడు శివ రామ ప్రసాద్ బహాద్దరే.
ఇమ్మడి వంశం యార్ల గడ్డ వంశం గా మారిన తారు వాత ఇమ్మడి దుర్గా ప్రసాద్ మరణానంతరం ఆయన సూచన మేరకు భార్య దుర్గా భావాన్ని దేవి మెరకన పల్లి లంక వాస్తవ్యులు యార్ల గడ్డ వెంకట రామన్న గారి మూడవ కుమారుడు అంకినీడు ను దత్తత తీసుకోవటం వాళ్ళ మళ్ళీ మారింది .ఈయన 1846 నుంచి 1875 వరకు పాలించాడు . చల్ల పల్లి లో సంస్కృత కళా శాలను స్థాపించిన విద్యాభి మాని .వీరి కుమారుడే మల్లికార్జున ప్రసాద్ ముక్త్యాల రాజాకుమార్తె విశాలాక్షమ్మను వివాహం చేసుకొని 1876 లో పట్టాభి షిక్టు లయారు .   అన్న దమ్ములు ఆస్తి కోసం ప్రీవి కౌన్సిల్ దాకా వెళ్ళారు .1890 లో జ్క్యమీ అవిభక్తం అని తీర్పు వచ్చింది .  వీరి కుమారుడు రాజా యార్ల గడ్డ అంకినీడు ప్రసాద్ ముక్త్యాల రాజా సోదరి భవానీ దేవి ని వివాహ మాడి 1921 లో రాజ్యాభిషిక్తు లయారు .వీరి కుమారుడే మనం చెప్పు కొన్న చల్ల పల్లి రాజా శివ రామ ప్రసాద్ గారు .  వీరు 1919 లో జ్కన్మిన్చారు . వీరి కోసం తండ్రి గారు ముంజులూరు ,పెనమ కూరు ఎస్టేట్లను కోని ఇచ్చారు .ఈయన హైదరాబాద్ లో సారధి స్టూడియో నిర్మించారు .  కృష్ణా జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గాను ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖా మాత్యులు గాను పని చేశారు
చల్ల పల్లి రాజా గారి కుమారులు  మల్లి కార్జున ప్రసాద్ ,అంకినీడు ప్రసాద్ శివ రామ ప్రసాద్ లు .అంకినీడు పార్లమెంట్ మెంబర్ అయారు .ఎస్టేట్ కు  25 వేల ఎకరాల భూమి వుండేది .భూగరిష్ట చట్టం వల్ల చాలా భూమి ప్రభుత్వ పరం అయింది .కొంత అన్యా క్రాంత మైంది .కోటలో పులలు ఏనుగులు ఉండేవి .కోట గోడ పై ఏమల్లు నాట్య మాడటం ఇప్పటికీ జనం గొప్ప గా చెప్పు కొంటారు .రాజా వారు శివ గంగ ఉత్సవాలకు ఏనుగు అంబారి పై వూరేగటం చూడ ముచ్చట గా వుండేది .కోటలోని గంట మైళ్ళ దూరం విన పది కాలాన్ని తెలియ జేసేది .ఇప్పుడు కోట శిధిలా వస్తా లో వుంది .ఆనాడే స్వంత జేనేరతోర్ తోవిద్యుత్ట్ ను తయారు చేసి కోటలో ఉపయోగించే వారు .చల్ల పల్లి కోటకు 500 ఏళ్ళ పైన చరిత్ర వుంది .
కృష్ణ దేవ రాయలుశ్రీ కాకులాంధ్ర మహా విష్ణువు ను దర్శించి అక్కడి మండపం లో స్వామి కలలో ఇచ్చిన ఆజ్ఞా ప్రకారం ఆముక్త మాల్యద ప్రబంధాన్ని మొదలు పెట్టడు .దివి సీమ లో కోట నిర్మించి దాన్ని ”దేవర కోట ”గా తన పేరు వచ్చేట్లు చేయాలను కొన్నాడని అదే నేటి చల్ల పల్లి దేవర కోట అని డాక్టర్ జి వి.పూర్ణ చంద్ రాశారు .రాయల భువన విజయం లో ఒక సారి రాయల వారే శ్రీ రాముని సోదరులకన్నా ,ధర్మ రాజు సోదరులే గొప్ప వారు అని సమన్వయము చేశారని ,వింజామర వీచే వాడు ధైర్యం గా ”రాయలు ఆనాడు ,ఈనాడు కూడా ఆండవ పక్ష పాతే ”అన్నాడని రాయలు విని సంతోషించి తాను విశ్న్వంశ సంభోతుడిని అని అతను చెప్పిన మాటలకు ముచ్చటపడి ఏమి కావాలో కోరుకో మంటే ”దేవరా !కోట ఎలాలని వుంది ”అని అతడు అన్నాడని యుక్తిగా తిమ్మరుసు మంత్రి ”దేవర కోట ”కు పాలకుడిగా అతన్ని పంపారని ఒక కధ ప్రచారం లో వుంది .ఇంతకీ దేవర కోట అనే గ్రామం ఘంట సాల కు దగ్గరలో వున్నది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -03 -12

Posted in రచనలు | Tagged | Leave a comment

సాహిత్య సరస్వతి లీల -ముక్త్యాల సంస్థానం –2

 సాహిత్య సరస్వతి లీల -ముక్త్యాల సంస్థానం –2

                                           సాహిత్య పోషణ
   రాజా వాసిరెడ్డి చైనా వెంకటాద్రి ప్రభువు మంచి సాహిత్య పోషకులు .అప్పుడు తాతం భట్టు గురు మూర్తి శాస్త్రి ”కృష్ణా నదీ మహాత్మ్యం ”అనే కావ్యాన్ని రాసి భవానీ ముక్తేశ్వర స్వామికి అంకితమిచ్చాడు .మూడు ఆశ్వాసాల పద్య కావ్యం ఇది .రాజు మెచ్చి చింతల పాడు లోని ”కుచ్చెల ”భూమి ని ఈనాం గా రాసి ఇచ్చాడు .కవి నందిగామ తాలూకా ఏటూరి నివాసి .ఈ పుస్తకాన్ని ”మాహిష్మతీ ముద్రాలయం ”లో ,రాజా గారి ప్ర పౌత్రులు చంద్ర మౌళి ప్రసాద్ అచ్చు వేయించారు .ఇది వీరు ఏర్పరచిన స్వంత ప్రెస్.కోప్ప రాజు సుబ్బా రాయ కవి రాసిన ”కాంచీ మహాత్య్మం ”ను భవానీ ముక్తేశ్వర ప్రసాద్ గారికి అంకితమిచ్చాడు .ప్రసాద్ గారు వీరేశ్వర శాస్త్రి గారి వద్ద పంచాక్షరీ మంత్రోప దేశం పొందారు .”సాహితీ గీతాది సత్కళా భూషణా వళికి మంజూష ,ఈ ప్రభు మనీష ”అని కవుల మన్ననలు అందుకొన్నారు .
కోప్ప రాజు సుబ్బ కవి -ఆత్రేయస గోత్రజుడైన ఈ కవి 1850 -90  కాలమ్ వాడు .ఇతని వంశపు పూర్వ కవుల్లో అనంతా మాత్యుడున్నాడు .త్రికూతా చాల ఆహాత్మ్యం ను కూడా ఈ కవి రాశారు .
అమర వాది రామ కవి –హరితష గోత్రుడు .వీరి పూర్వీకుల్లో గంగాధరాధ్వరి కాశీ పండితులచే ప్రశంస పొందాడు .తాత గనేశ్వర దీక్షితులు ”వర కళా నిధి ”అనే పేరు పొందాడు .తాత వాసి రెడ్డి వారి ఆస్థాన కవి .ఎనిమిది ఆశ్వాసాల ‘ద్రౌపదీ పరిణయం ”ప్రబంధం రాశాడు .
ఆతుకూరి పాప కవి -”లలితాంబో పాఖ్యానం ”రాశి అమరావతి లోని అమరేశ్వర స్వామికి అంకిత మిచ్చాడు .ములుగు పాపయా రాధ్యుడు ఈయన శిష్యుడే .దక్ష యాగం నుంచి తారకాసుర వధ వరకు కధ ఇందులో వుంది .వేదాద్రి దగ్గర కాట్రేని పల్లి అగ్రహారాన్ని కవికి ఈనాం గా ఇచ్చారు .
శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి –కవి సార్వ భౌమ శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధమ ఆస్థాన కవి .భారత ,భాగవత రామాయణాలను ఒంటి చేత్తో రాసిన కవి పండితులు .ముక్త్యాల సంస్థానాన్ని దర్శించి ,క్రుతలను ఇచ్చి సత్కారాలు పొందారు .”వేదాద్రి మహాత్మ్యం ”రాసి ,చంద్ర మౌలీశ్వర ప్రసాద్ గారికి అంకిత మిచ్చారు .”శ్రీ కృష్ణ భారతం ”అనే 60 వేల గద్య పద్యాల భారతాన్ద్రీకరణం  ఇది .వ్యాసునికి యధా మూల అనువాదం గా పేరు పొందింది .శ్రీ పాద వారికి నెలకు 116 రూపాయల పారి తోషికాన్ని 12 సంవత్సరాలు రాజా వారు అంద జేశారు . శ్రీ పాద వారి కుమార్తెల వివాహాల ఖర్చు లన్ని రాజా వారే భరించారు .శాస్త్రి గారు అంటే రాజా వారికి అంత అభిమానం .”తన ఆస్థాన కవీంద్ర మాత్రునిగా .చిత్తంబందు ఇస్టునిగా మిత్రునిగా ,గురూత్తముని గా చుట్టంబు గా నెంచుట ”ను రాజా వారి ఔన్నత్యాన్ని మనసార వర్ణించారు శ్రీ పాద వారు .ఆనాటి రాజా రాజా నరెంద్రుడే ఈ నాటి రాజా బహాదోర్ అనీ ,ఆనాటి నన్నయ భారతమే నేటి శ్రీ కృష్ణ భారతం అనీ ,ప్రశంసించారు శ్రీ పాద రాసిన ”విజయ విలాస కృతి -విమర్శన ”ను కూడా చంద్ర మౌలీశ్వర ప్రసాద్ కే అంకితమిచ్చారు .చేమ కూర వెంకట కవి రాసిన విజయ విలాసాన్ని ,కూచిమంచి జగ్గ కవి రాసిన ‘సుభద్రా పరిణయం ”ను తుల నాత్మకం గా పరిశీలించి వ్రాసిన పుస్తకం ఇది
పిషు పాటి చిదంబర శాస్త్రి –౧౯౨౨ లో ముక్త్యాల జమీ లో ఆశు కవితా ప్రదర్శన చేసి ”కపోత కిరాత కధ ”ను శత పద్య మంజీరం గా రాసి సన్మానం పొందారు .
చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి –శాతావదానులైన తిరుపతి కవుల్లో ఆశు కవిత కు వన్నె తెచ్చిన వారు వీరు .అర్ధి జన కల్ప భూజుదని ,అభినవ భోజుడని ,ముక్త్యాల రాజా ను ప్రశంశించారు .నానా రాజా సదర్శనం లో చంద్ర మౌలీశ్వర ప్రసాద్ ను కీర్తించారు .తన తోబుట్టువు భారత కృతికి రాజా గారు రుతి భార్ర్త అవటం తో రాజుతో చుట్టరిం కలిసింది అన్నారు .ఆయన దాతృత్వానికి భయపడి కుటుంబం లో జరిగే వివాహ శుభ లేఖ కూడా పంపక పోయినా రాజా వారు ధనం పంపిస్తూనే వున్నారని పొంగి పోయారు .గురువు కృష్ణ మూర్తి శాస్త్రి గారికి యెంత గౌరవం ఇచ్చారో శిష్యుడు వెంకట శాస్త్రి గారికీ అంటే ఔరవం చూపించటం రాజా గారి గొప్ప దనం .శ్రీ పాద వారి భారతాన్ని ప్రశాం శిస్తు ”భారత మన్న వేదపుం గందము ”అంటే భారతం వేదానికి దుంప అని మెచ్చారు .భారత యుద్ధాన్ని స్వయం గా శ్రీ కృష్ణుడు చూశాడు .తన గురువు కృష్ణ మూర్తి శాస్త్రి గారు కూడా స్వయం గా చూసి నట్లు రాశారు అని చమత్కారాన్ని వ్యంగ్యాన్ని మేళ వించి రాశారు .
 విశ్వనాధ సత్య నారాయణ –కళా ప్రపూర్ణ ,కవి సామ్రాట్ మ్జ్ఞాన పీత పురస్కార గ్రహీత శ్రీ విశ్వ నాద సత్య నారాయణ గారు ”రామాయణ కల్ప వృక్ష ”కావ్యానికి ప్రత్యక్ష శ్రోత శ్రీ రాజా వాసి రెడ్డి చంద్ర మౌలీశ్వర ప్రసాద్ .”ముక్తి నెల యవని పాలుడు చంద్ర మౌళి నృపుడు వినిన లీల గాను ”అని విశ్వ నాద అన్నారు .వారిద్దరి ఆత్మీయ స్నేహం .
చంద్ర మౌలీశ్వర వర ప్రసాద్ –విద్యాభి మానిగా ,లలిత కలాభి మానిగా మాన్యునిగా ,దేశ భక్తీ మూర్తీభవించిన వ్యక్తిగా వీరు ప్రశంసల నందుకొన్నారు .”మాహిష్మతీ ముద్రాలయం ”స్థాపించి అనేక అమూల్య గ్రంధాలను ముద్రించారు .తాల పాత్ర గ్రంధాలను సేకరించి పరిష్కరిమ జేసి అచ్చోట్టించారు .ఉద్భటా రాదయ చరిత్ర ,నాచి కేతూపాఖ్యానం ,వీరి ముఖ్య ప్రచురణలు .ఆయుర్వేద ఔశాదాలయం స్థాపించి శాస్త్రీయ పరిశోధనలు చేయించి ఔషధాలను తయారు చేయించారు .ఉచిత చికిత్స వీరి ప్రత్యేకత .ఆయుర్వేదాచార్యులైన శ్రీ ఆచంట లాక్ష్మీ పతి గారు రాసిన ”ఆయుర్వేద దర్శనం ”ప్రచురించారు .వేటూరి వారి ‘నీతి నిధి ”చర్ల వెంకట శాస్త్రి గారి ”గుణ రత్నా వళి ”అనే అలంకార శాస్త్రం ఆత్కూరి పాపయా మాత్యుని ”లలితాంబో పాఖ్యానం ”మల్ల పల్లి బుచ్చి కవి ”హాలాష్య ఆహాత్మ్యం ”మొదలైన సంస్కృత ,ఆంద్ర రచనలను ముద్రించి ఆంద్ర పాథక లోకానికి అందించిన సరస్వతీ సమార్చకులు .విశ్వ నాద రామాయణాన్ని శ్రీ పాద వారి విజయ విలాస కృతి విమర్శనాన్ని వీరే ముద్రించారని మనకు ముందే తెలుసు .వీరి ఆస్తాసంగీతా విద్వాంశుడు సగీత రత్న బిరుదాంకితుడు పిరాట్ల శంకర శాస్త్రి .అనేక కీర్తనలు ,వర్ణనలు రాశారు .”శంకర శతకం ”రాశారు .ఆంద్ర రవి వర్మ అనే బిరుదు పొందిన ప్రముఖ చిత్ర కారుడు ఆత్కూరి రామ మోహన రావు ను పోషించి కళా సేవ చేశారు .భారతం లోని ముఖ్య ఘట్టాలకు చిత్రాలు వేయించి శ్రీ పాద వారి శ్రీ కృష్ణ భారతాన్ని ముచ్చటగా సచిత్రం గా ముద్రిమ్పించారు రాజా వారు
రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ -వి.ఆర్.జి.కే.ఏం ప్రసాద్ గా సుప్రశిద్ధులు .చివరి జమీందారు .శంకరాచార్యుల వారు రాసిన ”గంగా లహరి ”ని ,వాసుదేవానంద సరస్వతి రాసిన ”కృష్ణా లహరి ”ని ముద్రిమ్పించారు .కుమార రాజా గా ప్రశిద్ధులు .1950 లో  నావ్య సాహిత్య పరిషత్ పదకొండవ వార్షి కోత్స వాన్ని గణం గా ముక్త్యాల కోటలో నిర్వ హించారు .ఈ పరిషద్ ఆధ్వర్యం లోనే ‘ప్రతిభ ”త్రి మాస పత్రిక నడిచింది .వేటూరి ప్రభాకర శాస్త్రి ,కాటూరి వెంకటేశ్వర రావు ,విశ్వ నాద ,రాయప్రోలు ,దేవుల పల్లి పిలకా ,గడియారం నోరి వంటి సాహితీ ప్రియంభావుకులు ఎందరో అలరించిన సమా వేశం ఇది .యువక్లను సాహిత్యం వైపు కు మళ్లించిన సభలుగా పేరు వచ్చింది .బుద్ధ జయంతి ని జర పటం సంస్థానం లో ఆనవాయితీ గా వస్తోంది .వీరి ఆధ్వర్యం లోనే చారిత్రిక ప్రాశస్త్యం వున్న ”ధనంబోడు ”(జగ్గయ్య పేట )లో బుద్ధ జయంతి ని అద్భుతం గా నిర్వ హించారు .
          నాగార్జున సాగర్ న్ర్మానానికి రాజా వారి సేవలు విలువ కట్ట లేనివి .ప్రాజెక్ట్ కు జీవ దాత అనే పేరు పొందారు .ఆయన నిస్వార్ధ బుద్ధికి మేధా సంపత్తికి ,నిరూప మాన కృషి కి నిదర్శనమే ఈ ప్రాజెక్ట్ .ప్రఖ్యాత ఇంజినీర్ కే;ఎల్.రావు గారి పర్య వేక్షణలో పులి చింతల వద్ద తల పెట్టిన ప్రాజెక్ట్ మారి పోయి నాగార్జున సాగర్ వద్ద నిర్మింప బడి ఆహులార్ధ సాధక ప్రాజెక్ట్ గా ఆధునిక దేవాలయం గా రూపొంది సాగుకు ,తాగు నీటికి సుజలాం సుఫలాం గా నీటిని  అందిస్తోంది .
56 ఏళ్ళు నిస్వార్ధం గా ప్రజా సేవ చేసి ,ముక్త్యాల రాజా గా కీర్తి సాధించి ,ప్రజల మనస్సుల్లో నిలిచి పోయారు .వేటూరి వారి ప్రోత్సాహంతో ముక్త్యాల పరిసరాల్లో ప్రాచీన శిధిల శిల్ప ఖండాలను,పురా వస్తువులను సేకరించి మ్యూజియం లో పెట్టాలి అన్న రాజా వారి కల ఫలించక పోవటం మన దురదృష్టం .ఇక్ష్వాకుల నుంచి ,కాకతీయుల వరకు గల శిలా శిల్పాలు శాసనాలు మాత్రం సేకరించ గలిగారు .”ప్రభాకరాస్తామయం ”తో  ఆ ప్రయత్నం అంతటి తో ముగిసి పోయింది .కవి పండితులను ఆదరించటం తో పాటు ప్రజా హిత కార్య క్రమాల్లోను రాజా వారిది ఆదర్శ జీవితమే .”భోగాల పాటి దిబ్బ”ను తవ్వించి శిధలాలను సేకరించారు .ఆ తర్వాత అడుగు ముందుకు సాగ లేదు .
,దుర్గా సదాశివ ప్రసాదు బహద్దర్ —     వీరు జయంతి పురం రాజా వారు సాహిత్యాభి రుచి వున్న వారు .విజ్ఞాన చంద్రికా గ్రంధ మండలి సభ్యులు .”దమ్మ పదం ”ను తెలుగు లోకి అనువదించారు .పాళీ ,హిందీ ,తెలుగు ,ఇంగ్లీష్ ,సంస్కృతాలలో మంచి పండితులు .”బుద్ధ గీత ”గా దమ్మ పదాన్ని అనువదించారు .ఇది బౌద్ధుల ప్రామాణీక గ్రంధం .”సరస్వతి ”సాహిత్య పత్రిక కు \\సంపాదకులు .సాహిత్య ,ఆయుర్వేదాలపై మంచి రచనలు చేశారు .”ఆనాటి విద్యా వినోదాలు ””ఏది ప్రాచీనం-రామాయణమా ?భారతమా ?”సంస్కృతం మృత భాష అనడం మృష ”మొదలైన వ్యాసాలు రాశారు .ప్రయోగ మాల ,ప్రసాదాన యోగాలు ,అందానికి ,ఆనందానికి వగైరా ఆయుర్వేద రచనలు మంచి పేరు తెచ్చు కొన్నాయి .ముక్త్యాల నుంచి చీలిన జయంతి పురం జమీ కూడా సాహిత్య సంప్రదాయాన్ని కొన సాగించటం ముదా వాహం .”నిత్య జయంతి -జయంతి సంస్థానం ”.
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -03 -12




—
గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

అదిగో కీసర యాగశాలాలివి గొ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలాం .. మీకు సలాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంద ప్రదర్సనలు – కోటి ఆదాయం – లక్షన్నర ప్రేక్షకులు – పడమటి గాలి

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ధార్మిక విప్లవ కారుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య సరస్వతి లీల- ముక్త్యాల సంస్థానం -1

 సాహిత్య సరస్వతి లీల- ముక్త్యాల సంస్థానం -1

         పశ్చిమ కృష్ణా లో కృష్ణా నదీ తీరం లో వెలసిన సంస్థానం ముక్త్యాల .వాసి రెడ్డి వారిది .కమ్మ ప్రభువుల పాలన లోనిది .ఇక్కడి కోట శోభాయ మానం గా వుంటుంది .కృష్ణమ్మా నడుముకు అలంకరించిన మేఖల లోని మేలిమి బానారు పథకం లా వుంటుంది అని కవులు వర్ణించారు .బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రం ,ప్రముఖ వాణిజ్య కేంద్రం అయిన జగ్గయ్య పేట కు పది కిలోమీటర్ల దూరం లో వుంది .బహుముఖ సేవలతో ప్రజలను ఆకట్టు కొన్న సంస్థానం ముక్త్యాల .ఈ సంస్థానానికి ”చింతల పాటి పంటు ”అనే పేరు వుంది .1802 లో వాసి రెడ్డి వెంకటాద్రి నాయుని పేర ”చింతల పాటి పంటు ”గా నమోదు అయింది .౧౮౪౮ లో నాయుడు చని పోగానే దీనితో పాటు అమరా వాటి సంస్థానం కూడా జప్తు చేయ బడింది .1864 లో ఈస్ట్ ఇండియా కంపెని స్వాధీనం అయింది .1863 లో వాసి రెడ్డి భవానీ ముక్త్యేశ్వర ప్రసాద్ బహద్దర్ కు ముక్త్యాల సంస్థానం దాఖలు పరచ బడింది .ఇందులో 23 గ్రామాలున్దేవి .వాసి రెడ్డి వారు వల్లుట్ల గోత్రోద్భావులు .

ముక్తికి నిలయ మైన క్షేత్రం గా .ముక్తి నేల గా ముక్త్యాలను భావిస్తారు .సాహితీ సరస్వతి గజ్జే కట్టి ఆడిన పవిత్ర నిలయం .ముక్త్యాల సమీ పం లో కృష్ణా నది ఒంపులు తిరిగి ,వయ్యారం గా కను విందు చేస్తుంది .ఉత్తర వాహిని గా కృష్ణ ప్రవహిస్తున్దిక్కడ .అందుకే ఈ క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యం .పులి చింతల వైపు తిరిగి 200 మైళ్ళు ప్రవహించింది కృష్ణ .ముక్త్యాల లేక పొతే కృష్ణా నది కృష్ణా జిల్లా కు దక్కేది కాదేమో నని అభి ప్రాయం.ఇక్కడి నుంచి తూర్పుగా ప్రవహించి బంగాళా ఖాతం లో కలుస్తుంది .
   సంస్థానం ఏర్పడిన విధం 
అమరావతి నేలిన రాజా వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు గారి తాతలు ముగ్గురు .పెద్దాయన రాఘవయ్య ,రెండవ ఆయన రామన్న గారికి సంబంధించిన వెంకటాద్రి నాయుడు ,మూడో తమ్ముడు చంద్ర మౌళి అని చరిత్ర చెబుతోంది .ఈ చంద్ర మౌళి గారి కుతుమ్బీకులే ముక్త్యాల సంస్థానాధీశులు .ఈ ముగ్గు రన్న దమ్ములని నందిగామ పరగానాకు అది పతులు  చేశాడు ధిల్లీ పాదుషా షాజహాన్ .చక్రవర్తి ని మెప్పించి వీరు జమీందారు ,మిరాసి మన్నే ,చౌదరి ,రాజా బహద్దర్ ,దేశాయ్ ,సర్దేశ్ ముఖి బిరుదుల్ని పొందారు .ఆస్తుల పంపకం లో చింతల పాడు జమీ ,చంద్ర మౌలికి దక్కింది .దానిలోనే ముక్త్యాల వుంది .అందుకే ”చింతల పాడు వంతు జమీందారీ ”అయింది .1760 లో రాజా వాసి రెడ్డి రామ లింగాన్న ముక్త్యాల కోట ను నిర్మించాడు .అదే రాజా దాని అయింది .1792 లోమేజర్ బీత్సన్ రాజా వారి అభి వృద్ధి కార్య క్రమాలను చూసి మెచ్చి మిగిలిన చోట్ల కూడా ఇలాంటి వే జరిగేట్లు చూడమని ఆదేశించాడు .రాజా గారి ముందు చూపు తో కరువు తప్పింది .
1863 లో అధికారం చే బట్టిన భవానీ  ఈయన కుమారుడు ఉమా మహేశ్వర ప్రసాద్ మంచి ఏలిక గా గుర్తింపు పొందాడు . ,వెంకటాద్రి .తండ్రి తర్వాత ఉమా మహేశ్వర ప్రసాద్ రాజయ్యాడు .పుత్రులు లేక పోవటం తో తమ్ముడు వేంకటాద్రి కుమారుడు చంద్ర మౌలీశ్వర ప్రసాద్ ను దత్తత చేసుకొన్నాడు .చంద్ర మౌళి గారి భార్య వల్ల చల్ల పల్లి జమీందార్   మళ్లి కార్జున ప్రసాద్ కుమార్తె .వీరికి సంతానం లేదు .రెండవ భార్య గా శాక మూరి వారి అమ్మాయి కనక వల్లీ దేవి ని వివాహ మాడాడు .1918 లో వీరికి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ పుత్రుని గా జన్మించారు .ఈ యన చల్ల పల్లి జమీందార్ అంకినీడు బహద్దర్ గారి కుమార్తె ను పెళ్లి చేసుకొన్నాడు .వీరి పుత్ర రత్నమే చూడా నంద రామ గోపాల కృష్ణ చంద్ర కుమార్ ప్రసాద్ .చంద్ర మౌళి గారి తమ్ముడు దుర్గా సదా శివేస్వర ప్రసాద్ జయంతి పురం రాజా అయారు .చల్ల పల్లి రాజా శివ రామ ప్రసాద్ గారు ఉమా మహేశ్వర ప్రసాద్ గారి కుమార్తె భవానీ దేవి గారి పుత్రుడు .అంటే దౌహిత్రుడు .రామ గోపాల కృష్ణ వర ప్రసాద్ గారికి చల్ల పల్లి రాజా అంకినీడు కుమార్తె రాజ్య లక్ష్మి నిచ్చి వివాహం చేశారు .ఈవిడ శాసన సభ్యురాలు గా వుండేది .నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రామ గోపాల కృష్ణ ప్రసాద్ రాజ్య లక్ష్మి దంపతులే ముఖ్య కారణం .రాజ్య లక్ష్మి గారి కుమార్తె ఇందిరా గారు ఉయ్యూరు కే.సి.పీ లిమిటెడ్ యజమాని వెలగ పూడి దత్తు గారి భార్య .
స్వాతంత్ర ఉద్య మానికి జమీందారి బాగా సహకరించింది .పంచములకు ఆలయ ప్రవేశం కల్గించారు .హరిజనోద్ధరణ కు పూర్తిగా సహక రించారు .స్వాతంత్ర సమర యోధులకు అజ్ఞాత యోధులకు రక్షణ కల్పించారు .ఇక్కడి ముక్తేశ్వర స్వామి ఆలయం ,దైవం పవిత్ర మైనవిఅని 11 వ శతాబ్ది శాసనం వల్ల తెలుస్తోంది .కోట చాలా ముచ్చట గా వుంటుంది .ఎత్తైన సింహ ద్వారాలు ,ఇనుప గుబ్బల తో మొన దేలి వుంటాయి .లోపల విశాల మైన ఆవరణ .ఆయుర్వేద రసాయన శాల వుంది .ఆసవాలు ,అరిష్టాలు ,నిల్వ చేసే గది వుంది .ఉచిత ఆయుర్వేద చికిత్స ఇక్కడి ప్రత్యే కథ .ఘోషా పధ్ధతి లో రాణీ వాసం .కోటలో జరిగే సాంస్కృతిక కార్య క్రమాలు చూడ టానికి అంతపుర స్త్రీలకూ జలతారు పరదా వెంక కూర్చునే వారు .పెద్ద ఘంట వుంది .సంస్థానం మూడు అంతస్తుల భవనం .విశాల మైన గదులు .కళాత్మకం గా దర్బారు హాలు నిర్మించారు .సంస్థానాధీశులు కొలువుండే ది ఇక్కడే .ప్రజల కష్ట సుఖాలు విని తగిన పరిష్కారాలు చేసే వారు .ఈ సభాస్థలి లోనే ఎందరో కవులు ,కళా కారులు తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి ,రాజుల మెప్పు పొందే వారు .భువన విజయాన్ని గుర్తుకు తెచ్చే మందిరం ఇది .యజ్న  యాగాలకు  ప్రత్యెక ఏర్పాట్లున్నాయి .రాజుల ఇలా వేలుపు బాలా త్రిపుర సుందరీ దేవి విగ్రహం అత్యంత ఆకర్షణీయం గా వుంటుంది .కోటకు నాలుగు వైపులా బురుజులున్నాయి .కోటకు ప్రక్క నుంచే కృష్ణ ఉత్తర వాహిని గా ప్రవహిస్తుంది .నదీ గర్భం లో బలి చక్ర వర్తి నిర్మించిన స్వర్ణ ఆలయం వుందని చెప్పు కొంటారు .కృష్ణ అవతలిది గుంటూరు జిల్లా .పశ్చిమాన తెలంగాణా .ఉతారం తూర్పు లలో కృష్ణా నది .ఉమా మహేశ్వర స్వామి కరుణా కటాక్షం పొందిన దివ్య క్షేత్రం ముక్త్యాల .ఉమా మహేశ్వర ప్రసాద్ బహద్దర్ శాసన సభ్యులు గా రాణింపు పొందారు .ప్రపంచ తెలుగు సభల అద్యక్షు రాలు ఇందిరా దత్తు గారు 2004 లో ముక్త్యాల కోటలో సాహిత్య సభలు జరిపి పూర్వుల బాట లో నడి చారు .తరువాత సాహిత్య పోషణ గురించి తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -03 -12
Posted in రచనలు | Tagged | 1 Comment

తల్లి లేని పిల్ల కదః

Posted in రచనలు | Tagged | Leave a comment

వృత్తి ప్రణాళికా కళ – career planning

Posted in రచనలు | Tagged | Leave a comment

మా తోట లో … సరదాగా కాసేపు

మా అన్న గారి మనవాడి (కళ్యాణ్) ఉపనయనం

వేలూరి రామ కృష్ణ, పెద్ద అబ్బాయి శాస్త్రి , తమ్ముడు గబ్బిత కృష్ణ మోహన్
జామ కాయలు కోస్తూ రామ కృష్ణ , వేద వల్లి

జామ కాయలు కోస్తూ రామ కృష్ణ , వేద వల్లి

మా పెరటి జాం చెట్టు … రామ కృష్ణ .. వేద వల్లి

అబ్బాయి రవి తో రామకృష్ణ

కర్ర ఎందుకు నాన్న ఇలా అన్డుతుంటే …. రవి

మా అరటి తోట

ఉసిరి చెట్టు

తమ్ముడు కృష్ణ మోహన్ ఫామిలీ, అమ్మాయి వేదవల్లి ఫామిలీ మాతో … సరదాగా కాసేపు … మా తోటలో

This slideshow requires JavaScript.