శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి. బారిష్టర్ పార్వతీశం.4 వ భాగం.17.1.25.

శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి. బారిష్టర్ పార్వతీశం.4 వ భాగం.17.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దం పూరు నరసయ్య..10 వ భాగం.17.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దం పూరు నరసయ్య..10 వ భాగం.17.1.25.

Posted in రచనలు | Leave a comment

బడుగుజీవుల జీవిత కథలు రాసిన, ‘’బడి ‘’కధ ఫేం  -శ్రీ అరిగే రామారావు

బడుగుజీవుల జీవిత కథలు రాసిన, ‘’బడి ‘’కధ ఫేం  -శ్రీ అరిగే రామారావు

బుచ్చిబాబు కథా స్మారక కదంబం లో మొదటి భాగాన్ని శ్రీ అరిగే రామారావు ‘’శ్రీ అరిగే రామారావు కథలు ‘’తెచ్చాడు  వేద గిరి రాం బాబు .అందులో’’ మనసులో మాట’’ చెప్పాడు రామారావు .తాన 1958ఉత్తరార్ధం లో కథా రచనకు శ్రీ కారం చుట్టానన్నాడు .అప్పటికి తనవయసు 22-23మధ్య .అప్పుడే బెజవాడ ఎస్. ఆర్. ఆర్. కాలేజీనుంచి బి .కాం .పట్టా చేతిలో పుచ్చుకొని బయట ప్రపంచం లోకి అడుగు పెట్టాడు .1959లో ఆర్ .టి .సి. ఉద్యోగం వచ్చేలోపల నూజివీడు చెరువు గట్లమీద ,తోటలు దొడ్లు గుడులు గోపురాలలో రాజాగారి పాడు బడిన దివాణాలలో,లైబ్రరీలో నిరుద్యోగి పోజులో చొక్కా గుండీలు పెట్టుకోకుండా ,కళ్ళ నిండా బోల్డు శూన్యాన్ని నింపుకొని ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ,వంటరిగా తిరిగేవాడు . చూసిన ప్రతిదృశ్యం ,కనిపించిన ప్రతి మొగం ,వినిపించిన ప్రతిమాట ,చాల బలంగా వివరంగా లోతుగా మనసులో ముద్ర పడి పోయేది.

రోజూ మునిమాపు వేళలలో వాళ్ళ వూరు శివాలయం లో నిశ్శబ్దంగా  దీపాలు వేల్గించే గుడి పూజారి గార్ని చూసి ,’’ఇన్స్పైరై ‘’,మొదటి సారిగా ‘’పూజారి పున్నయ్య ‘’కథ రాశాడు .అది ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదటిసారి అచ్చయింది .పొలాల్లో గడ్డి మోపులు కట్టుకు వచ్చి చీకటి పడగానే గంగానమ్మ రావి చెట్టు కింద గడ్డి మోపులు ఆమ్మె అమ్మీల నల్ల  అందాలను రోజూ చూసి చూసి ‘’నచ్చి నోడు ‘’కథ రాశాడు .ఈరెండోకథ కూడా ఆంధ్రపత్రికలో అచ్చయి,రచయితగా నిలబెట్టింది .1958 బాపుగారు మంచి కథలను ఏరి సంచలీకరించిన మొదటి కథల సంపుటి లో పైన చెప్పిన మొదటి కథ చోటు చేసుకొన్నది .మల్లాది రామ కృష్ణ శాస్త్రి, రావి శాస్త్రి వంటి లబ్ధ ప్రతిష్టుల కథలతో పాటు రామారావు కథకు స్థానం పొందటం ‘’కథా చక్రవర్తుల ‘’సరసన ‘’బుల్లి పీట ‘’ వేసి కూర్చోబెట్టినట్లనిపించింది .

  ఆతర్వాత తర్వాత తారసపడ్డ కుంటోళ్ళు,గుడ్డోళ్ళు,క్వారీ కూలీలు ,పట్నం లో రోడ్డు పక్కన కూర్చుని రోళ్ళు చెక్కే కష్ట జీవులు ,రోడ్లపై బొమ్మలు వేసే అనామక చిత్రకారులు ,కాట్లో శవాలు కాల్చే వెట్టోళ్ళు,సానికొంపల్లో వ్యభిచారం చేసే అభాగినులు ,,సిన్మాల్లో ‘’డూప్ ‘’వేషం వేసే వాళ్ళు ,పాచిపనులు చేసే పని పిల్లలు ,రిక్షా వాళ్లకు  కిరసనాయిలు ఆమ్మే ఆడవాళ్ళూ , లారీల వాళ్లకు పాత గుడ్డ పేలికలు అమ్మే పడుచు పిల్లలు ,విజయవాడ కాలువ గట్లమీద గుడిసెల్లో తలదాచుకొనే నిర్భాగ్య లేబరు జీవులు,చరిత్రహీనులు   ,ఇలా ఎంతోమంది దీనులు హీనులుచరిత్ర హీనులు తన కంట బడ్డప్పు డల్లా ,తన కంటిలో నీటి ఊటలు ఊరి నప్పుడల్లా , ,గుండెల్లో నిట్టూర్పు నెగళ్లు వెలిగేటప్పు డల్లా,వాళ్ళను పాత్రలుగా చేసి ఎన్నో కథలు అల్లాడు .ఇలా రాసినవి 150 దాకా కథలున్నాయి  .కొన్నిటికి బహుమతులొచ్చాయి కొన్ని ఇతర భాషలలోకి అనువాదం చెందాయి .

‘’ బడి’’  కథ సినిమాగా తీశారు ఇందులో పాత్రధారిని ‘’బడి తాతాజీ ‘’అంటారు .స్వాతి అనుబందాలుగా నవలికలు వచ్చాయి .స్వాతిలో ‘’అర్ధనారి ‘’ సీరియల్ గా వచ్చింది .కానీ ప్రత్యెక కథా సంపుటి గా ఏదీ రాలేదు .వేదగిరి రాంబాబు ఈవిషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు .ముక్కున వేలేసుకొన్నాడు .’’తమను గురించి పట్టించుకోని ,ఇతరులు వారిని గురించి పట్టించు కోని రచయితల జాబితాలో అరిగే రామారావు వస్తారు ‘’ఆని విశ్లేషించాడు .మిత్రుడు ఆదివిష్ణు ‘’మీ ‘’షెల్’’ లో నుంచి మీరు బయటికి రావాలి నలుగురిలో కలవాలి .సెల్ఫ్ ప్రొజెక్షన్ చేసుకోవాలి ‘’ఆని హితవు పలికాడు .ఇలా ముప్ఫై  ఏళ్ళు గడిచిపోగా ,ఇక గడవదా అనుకొంటున్న సమయంలో వేదగిరి కలిసి అభిమానం చూపి ,,ఆయన ప్రారంభించిన ‘’కథా యజ్ఞం ‘’లో రామారావు ను భాగస్వామిని చేశాడు .స్పాట్ చేశాడు .’’మీ లాంటి పాతతరం రచయితల కథలు కాలంతో పాటు కనుమరుగై పోకూడదు మీ పాత ఫైళ్లలలో చివికి పోకూడదు ..చీకటిని చీల్చుకొని వెలుగులోకి రావాలి ‘’ఆని గట్టిగా పట్టుబట్టి ఈ కథా సంకలనాన్ని రూపొందించాడు .పైగా సుప్రసిద్ధ కథకుడు బుచ్చిబాబు స్మారక కథా కదంబం లో ‘’మొదటి కథా గుచ్చం ‘’గా వెలువరించి,పది వేల రూపాయల నగదు కానుకగా ఇచ్చి  దీనికొక పట్టం కట్టాడు ఆని మురిసిపోయాడు రామారావు .ఆలస్యమైనా అందలం ఎక్కించారు ఆని ధన్యవాదాలు చెప్పుకొన్నాడు .ఇంతకంటే ఏం కావాలి ?అంటూ ‘’రూక కొకటి చొప్పున పదివేలకృతజ్ఞతా కుసుమాంజలి ‘’సమర్పించారు ‘’కథా వేదగిరి ‘’రాంబాబుకు అరిగే రామారావు .ఈ కథలకు మామూలుగా అయితే సాహితీ సుగంధం ఉందొ లేదో తెలీదుకాని –ఆమహారచయిత బుచ్చిబాబు ‘’స్మారక కథా కదంబం ‘’గా వెలువరించటం వల్ల ,’’పువ్వులకు కట్టిన దారానికి ‘’కూడా  సుగంధం అబ్బినట్లు  అయిందని ,ఆయన పేరుతోపాటు తన పేరు,కథలు కూడా పరిమళిస్తాయని  ఎంతో సంతృప్తి పొందాడు .

  ఈ విషయాలన్నీ 29-5-1955 న వెలువడిన’’ అరిగే రామారావు మొదటి కథా సంకలనం లో ఆయన మనస్సులోని మాటగా చెప్పాడు .రామారావు ఇద్దరు అమ్మలకు ఈ సంకలనాన్ని అంకితం చేశాడు .ఒకమ్మ తన్నుకన్న తన అమ్మ మహాలక్షమ్మకు .తన కథలలో మధ్యతరగతి గృహిణుల వాడుక భాషలోని సొగసులు ,స్వగతాల సొంపులు,ఒకి౦చుక న ఏమైనా ఉన్నాయంటే ,అవన్నీ తన మనసులో పడ్డ ‘’తన అమ్మ మాటల ముద్ర’’ మాత్రమె అంటాడు అరిగే .మరో అమ్మ –తనను అన్ని విధాలా చల్లగా చూస్తోన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మ వారికి అంకితం చేశాడు.

  ఈసంకలనం లొ ఆడమనసు ,డూప్ ,దొంగలరాజ్యం ,వెంటాడే నీడ, నచ్చినోడు ,ప్రతిఫలం ,దీపం , విరిగిన వెన్నెముక ,ఆఖరిపువ్వు ,శీలం ,ఎవర్ని నమ్ముకోవాలి ,అద్దం ,కొత్తనీరు ,ఇదొక వెర్రి తల ,తెరమీద బొమ్మలు ,పాములపుట్ట ,న్యాయానికి సంకెళ్ళు ,రాళ్ళు ,మరి మీరేమంటారు ,నోరులేని వారు చెట్టునీడ ,బొమ్మ, జై దేవరా ,మాకు ప్రేమలున్నాయ్ ,వయస్సు ,రూట్ కాజ్ కథలున్నాయి .

అరిగే రామారావు 1936లో నూజివీడులో జన్మించాడు. నూజివీడు, బెజవాడల్లో విద్యాభ్యాసం సాగింది. 1959లో ఆర్టీసీ లో అకౌంట్స్ గుమాస్తాగా చేరి 1994లో జిల్లా ముఖ్య అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేశాడు.[1

మనవి –నిన్న రాత్రి శ్రీ యామిజాల ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ,అరిగే రామారావు గురించి మీకు తెలుసా ?’’ఆని అడిగితె ‘’పేరు విన్నా  కానీ  వివరాలు తెలీదు .’ మీరుఅడిగారు కనుక తెలుసుకొని రాస్తాను’’ఆని చెప్పాను .నెట్ లొ రెండు మూడు మాటలే ఉన్నాయి . తెలుగు వెలుగులు లేదు.మా అబ్బాయి శర్మకు ఈ విషయం చెప్పి వెతకమంటే కష్టపడి పై కథా సంకలనంనెట్ లొ పంపాడు .దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వ్యాసం రాశాను .నాతో ఈ వ్యాసం  రాయించిన ఆనంద్ గారికి ధన్యవాదాలు .మాశర్మకు అభినందనలు .  

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-1-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.61 వ భాగం.16.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.61 వ భాగం.16.1.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రస వాహిని.2 వ భాగం.16.1.24.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రస వాహిని.2 వ భాగం.16.1.24.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రస వాహిని.2 వ భాగం.16.1.24.

Posted in రచనలు | Leave a comment

శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి – బారిష్టర్ పార్వతీశం.3 వ భాగం.25.1.25.

శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి – బారిష్టర్ పార్వతీశం.3 వ భాగం.25.1.25.

శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి – బారిష్టర్ పార్వతీశం.3 వ భాగం.25.1.25.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0. 60 వ భాగం.15.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0. 60 వ భాగం.15.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0. 60 వ భాగం.15.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.9 వ భాగం.15.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.9 వ భాగం.15.1.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి – పంచామృత రసవాహిని.1 వ భాగం.15.1.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి – పంచామృత రసవాహిని.1 వ భాగం.15.1.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి – పంచామృత రసవాహిని.1 వ భాగం.15.1.25.

Posted in రచనలు | Leave a comment

చలం గారిసన్నిహితుడు ,రఘుపతి వారి శిష్యుడు ,హితకారిణి ఉపాధ్యాయుడు ,సర్వోదయ నాయకుడు,స్వాతంత్ర్యసమర యోధుడు,’’ఆనంద నికేతనఆశ్రమ ‘’ స్థాపకులు,ధర్మజ్యోతి పత్రికసంపాదకులు  గ్రామసేవక విద్యాలయ  ప్రిన్సిపాల్  -శ్రీ తల్లాప్రగడ ప్రకాశ రాయుడు

చలం గారి సన్నిహితుడు ,రఘుపతి వారి శిష్యుడు ,హితకారిణి ఉపాధ్యాయుడు ,సర్వోదయ నాయకుడు ,స్వాతంత్ర్యసమర యోధుడు,’’ఆనంద నికేతనఆశ్రమ ‘’ స్థాపకులు,ధర్మజ్యోతి పత్రిక సంపాదకులు  గ్రామసేవక విద్యాలయ  ప్రిన్సిపాల్  -శ్రీ తల్లాప్రగడ ప్రకాశ రాయుడు .

ప.గో.జి. ఉంగుటూరులో 15-4-1893న శ్రీ తల్లాప్రగడ ప్రకాశ రాయుడు జన్మించారు .తణుకులో పాఠశాల విద్య పూర్తి ,చేసి ,రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో చదివి ,బి.ఏ .డిగ్రీ పొందారు .అప్పుడే శ్రీ రఘుపతి వెంకట రత్నం నాయుడు శ్రీ కందుకూరి వీరేశలింగం గార్ల ప్రభావానికి లోనయ్యారు .రాజమండ్రి హితకారిణి పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయులుగా పని చేశారు .విద్యార్ధి దశలో శ్రీ గుడిపాటి వెంకట చలం వీరి సన్నిహిత మిత్రుడు .

 రాయుడుగారు బ్రహ్మ సమాజం పట్ల ఆకర్షితులై ,కలకత్తా వెళ్ళి ,అక్కడ ఇంగ్లిష్ లిటరేచర్ లో ఎం.ఎ. పాసయ్యారు .రాజకీయ అరంగేట్రం అప్పుడే చేసిన గాంధీ గారి ప్రబోధంతో 26వ ఏటస్వాతంత్ర్య సమరం లో ప్రవేశించారు .రాజమండ్రి బళ్ళారి, రాయవెల్లూరు ,కోయంబత్తూరు జైళ్ళలో చాలాసార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు .పగోజి భీమవరం లో సత్యాగ్రహం చేసి తీవ్ర లాఠీ దెబ్బలకు గురై స్పృహ కోల్పోయారు .విద్యాదికులని వీరికి జైలులో రెండవ తరగతి కేటాయించినా ,నిరాకరించి ,తోటి వారితో కలిసి మూడవ తరగతి ఖైదీగానే ఉన్నారు .

 పదవి ,అధికారాలకు దూరంగా ఉంటూ,నిరాడంబరంగా  మహాత్ముని నిర్మాణ కార్యక్రమాలు  అమలు చేయటానికి అహరహం కృషి చేశారు .సహాయ నిరాకరణ ఉద్యమం లో చదువులు మానేసిన వారికి వీరు రాజమండ్రిలో ఒక జాతీయ పాఠశాల నిర్మించి ఉత్తమ ప్రమాణాలతో నిర్వహించారు .1924లో తన వూరి వారైన శ్రీ తల్లాప్రగడ నరసింహ వర్మతో కలిసి చాగల్లు సమీపం లో మహాత్ముని ప్రబోధాలు అమలు చేయటానికి ‘’’’ఆనంద నికేతన ఆశ్రమం ‘’స్థాపించారు .గాంధీజీతో పాటు ఎంతోమంది ప్రముఖులు సందర్శించి దీన్ని ప్రశంసించారు .ఆశ్రమంలోని చాలామంది హరి జన  బాలురను  తీర్చి దిద్దారు .

  1939లో ‘’ఆంధ్ర బ్రహ్మ సాధనాశ్రయం ‘’పక్షాన ‘’ధర్మజ్యోతి ‘’మాసపత్రికను 1939 నుంచి ,జీవితాంతం నడిపారు .పదవులు  ఆశించక పోయినా, ప్రకాశం పంతులుగారి కోరిక మన్నించి 1947లో కొంతకాలం అనంతపురం జిల్లా జౌళి కమీషనర్ గా పని చేసి ,తర్వాత గోపన్న పాలెం లో ‘’గ్రామ సేవక విద్యాలయ ‘’ప్రిన్సిపాల్ గా ,సేవాప్రదాన పదవులు మాత్రం నిర్వహించారు .ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు తమ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించటానికి ముందు తల్లాప్రగడ రాయుడుగారి ప్రత్యెక దీవెనలు పొందారు .1952-55 మధ్య రాయుడు గారు తెనాలిలో ఒక గురుకుల పాఠశాలకు అదిపతి గా ఉన్నారు .ఖాదీ  గ్రామోద్యోగా ఉత్పత్తుల అభివృద్ధి వీరికి అత్యంత ప్రియమైనది .గాంధీ స్మారక నిధి సంపాదక వర్గ అధ్యక్షత ,ఆనిది తరఫున జరిగిన అనేక కార్యక్రమాల నిర్వహణ ,,కొవ్వూరులో ‘’ఆంధ్ర గీర్వాణ విద్యా పరిషత్తు ‘’సంపాదకమండలి సభ్యత్వం మొదలైనవి ఎన్నో  సర్వ  సమర్ధంగా నిర్వహించారు తల్లాప్రగడ వారు .మాహాత్మా గాంధీకి, బ్రహ్మ సమాజ మతానికి సంబంధించిన 15పుస్తకాలు ఇంగ్లిష్ తెలుగు భాషలలో  రాయుడు గారు రచించారు .తమ జీవిత చరిత్రను ‘’’’నా రాట్న చక్రం (అనుభవాలు –జ్ఞాపకాలు )గా రచించారు .నిస్వార్ధ నిరాడంబర జీవులైన శ్రీ తల్లాప్రగడ ప్రకాశ  రాయుడు గారు 28-2-1988 న హైదరాబాద్ లో 95 వ ఏట పరమపదించారు .

ఆధారం –శ్రీ గండూరి కృష్ణ గారి వ్యాసం

కనుమ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి – బారిష్టర్ పార్వతీశం.2 వ భాగం.14.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.8 వ భాగం.14.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.8 వ భాగం.14.1.25.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0. 59 వ భాగం.14.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0. 59 వ భాగం.14.1.25.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షసం.25 వ చివరి భాగం.14.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షసం.25 వ చివరి భాగం.14.1.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి – బారిష్టర్ పార్వతీశం.1 వ భాగం.13.1.25.

శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి – బారిష్టర్ పార్వతీశం.1 వ భాగం.13.1.25.

శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి – బారిష్టర్ పార్వతీశం.1 వ భాగం.13.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.7 వ భాగం.13.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.7 వ భాగం.13.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.7 వ భాగం.13.1.25.

Posted in రచనలు | Leave a comment

నవ యుగ కవి చక్రవర్తి, పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.10 వ భాగం.12.1.25.

నవ యుగ కవి చక్రవర్తి, పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.10 వ భాగం.12.1.25.

నవ యుగ కవి చక్రవర్తి, పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.10 వ భాగం.12.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.6 వ భాగం.12.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.6 వ భాగం.12.1.25.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .58 వ భాగం.12.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .58 వ భాగం.12.1.25\

.https://youtu.be/uwTw1jdMi6M

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం.ముద్రా రాక్ష సం.24 వ భాగం.12.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం.ముద్రా రాక్ష సం.24 వ భాగం.12.1.25.

Posted in రచనలు | Leave a comment

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.8 వ భాగం.11.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.8 వ భాగం.11.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.5 వభాగం.11.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.5 వభాగం.11.1.25

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.5 వభాగం.11.1.25. https://youtu.be/lNBCT335bkY

.

Posted in రచనలు | Leave a comment

మనం మర్చి పోయిన అలనాటి మద్రాస్ రెసిడెన్సి తెలుగు మహానుభావుల సాంఘిక,మత సంస్కరణ కృషి -2(చివరి భాగం )

మనం మర్చి పోయిన అలనాటి మద్రాస్ రెసిడెన్సి తెలుగు మహానుభావుల సాంఘిక,మత సంస్కరణ కృషి -2(చివరి భాగం )

2-శ్రీ చదలు వాడ అనంత రామ శాస్త్రి (1835-1872)

నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ చదలు వాడ అనంత రామ శాస్త్రి పుదూరు ద్రావిడ బ్రాహ్మణుడు .అన్న సీతారామ శాస్త్రి మద్రాస్ ప్రేసిడేన్సి కళాశాల తెలుగు పండితులు .వీరిద్దరూ వ్హిన్నాయన శాస్త్రి ,పెదనాయన శాస్త్రి గా పిలువబడే వారు అనంతరామ శాస్త్రి ‘’సకల కళా కోవిద ‘’అల్లాడి రామ బ్రహ్మ శాస్త్రి గారి వద్ద శాస్త్రాలు అభ్యసించాడు .పండిత గోష్టులలో ,చర్చలలో పాల్గొని కీర్తి ప్రతిష్టలుసాధించారు .వేంకటగిరి ఆస్థానం లో ఆస్థాన పండితుడు తర్కభూషణం వెంకటాచార్యులను ఓడించి ,సంస్థానాధిపతి సర్వజ్ఞ కుమారునికి అద్వైతం బోధించినట్లు ప్రచారం లో ఉంది.’’పరమ హంస ,చిదానంద యోగి ,గతాగత వేది ,,సాహిత్య చక్రవర్తి , సాంగో పాధ్యాయ ‘’అంటూ హిందూ బాంధవి పత్రిక ,శాస్త్రి గారు మరణించిన 80ఏళ్ల తర్వాత ప్రస్తుతించింది .శ్స్స్త్రి గారు చివరి దశలో సన్యాసం స్వీకరించారని ,శాస్త్రాలను లెక్క చేయకుండా అస్పృశ్యుల ఇళ్లలో భోజనం చేసే వారు ఆని అంటారు .అనంతరామ శాస్త్రి గారు 32వ ఏట 1872 ప్రాంతాలలో అనంతలోకాలకు చేరినట్లు ఒంగోలు వెంకట రంగయ్య గారు చెప్పారు .

వివాహ కన్యా స్వరూప  నిరూపణం  -1928 లో ‘’దేశీయ సంస్కరణ సభ ‘’వారి అభ్యర్ధనతో ఒంగోలు వెంకటరంగయ్య గారు ఈ పుస్తకాన్ని తెలుగులోకి సంగ్రహం గా అనువాదం చేశారు .1860,శిక్షాస్మృతి సెక్షన్ 375ప్రకారం పదేళ్ళ ఆడపిల్లలకు పెళ్ళి చేయవచ్చు .దీన్ని కేశవ చంద్ర సేన్ వ్యతిరేకించాడు .కేశవ చంద్ర సేన్ ప్రచారం మద్రాస ప్రేసిదేన్సిలో కూడా వ్యాపించి ఉండాలి .ఆని పుస్తక నేపధ్యాన్ని వెంకటరంగయ్య చెప్పాడు .సుందర లింగం కూడా ఇదే  అభిప్రాయాన్ని బలపరచాడు . వివాహ కన్యా స్వరూప  నిరూపణం  1866లో శ్రీ రామా దర్పణ ముద్రాక్షర శాలలో అచ్చయినట్లు రంగయ్య చెప్పాడు .కానీ 1865ఆగస్ట్ 3 నాటికే ఈపుస్తకం ప్రచారం లో ఉండి ఉండాలి .అనంతరామ శాస్త్రి మనుస్మ్రుతిని ప్రమాణం గా  చేసుకొని రజస్వలానంతర వివాహాలు సమర్ధించారు .మనుస్మ్రుతికి విరుద్ధంగా ఉన్న పరాశర స్మృతి ,వైద్యనాధ స్మృతులను,ఇతర శాస్త్ర గ్రంధాలను ప్రమాణంగా తీసుకోనక్కర లేదని శాస్త్రి తీర్మానించారు .నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమమైనది ,ఇందులో స్త్రీలకూ ఎంతో ప్రాధాన్యం ఉండి .కనుక వివాహానికి యోగ్యమైన స్త్రీ లక్షణాలు తెలుసుకోవాలి .స్త్రీ రూపం లో అప్పుడు అరుగుతున్న బాల్యవివాహాలకు మనుసృతి ఇతర శాస్త్రాల అనుమతి లేదు.కనుక బాలికాలు ‘’ఈడేరిన ‘’తర్వాతే వివాహం చేయాలని శాస్త్రి గారు గట్టిగా చెప్పారు .లౌకిక దృష్టిలో చూసినా ,బాల్యవివాహాలు అన్యాయం అన్నారు ఆయన .’’చంటి పాపాల వయసులో జరుగుతున్నా ఈ వివాహాలు ఈలోకం నుంచి తొలగిపోవాలి ‘’ఆని ఆకాక్షించారు శాస్త్రి .శాస్త్రిగారు ఈ పుస్తకాన్ని కంచి కామకోటి పీఠం అధిపతి శ్రీ శ్రీమన్మహాదేవేంద్ర శ్రీ సరస్వతీ పాదులకు ‘’అభి ప్రాయం రాయమని కోరుతూ పంపినట్లు శాస్త్రి గారు పీఠిక లో పేర్కొన్నారు .

3-శ్రీ గుర్రం వెంకన్న శాస్త్రి (1825-1880)-

కంచి పీఠాధిపతి అనంతరామ శాస్త్రి పుస్తకాన్ని తిరస్కరిస్తూ ,బాల్యవివాహాలను సమర్ధిస్తూ ఖండన గ్రంధాలు రాయమని పండితులను కవులను ప్రోత్సహించినట్లు తెలుస్తోంది .విరించి నగర వాస్తవ్యులు అనారట ధర్మశాస్త్ర పాఠకులు , సముత్తెజితప్రజ్ఞులు శ్రీరామ శాస్త్రి అనంతరామ శాస్త్రి పుస్తకాన్ని ఖండిస్తూ ఒక పుస్తకం రాసి పీఠాదిపతులకు పంపారు .శ్రీ గుర్రం వెంకన్న శాస్త్రి ‘’సిద్ధాంత సిద్దా౦జనమ్ ‘’పుస్తకం రాసి దానికే ‘’వాద ప్రహసనం ‘’అనే పేరు తగిలించి వెలువరించారు .వెంకన్నశాస్త్రి నెల్లూరు వాసి .రామ శాస్త్రి కుమారుడు .వెంకన్న అన్న మద్రాస్ హై కోర్ట్ లో ‘’హిందూ లా ‘’పండితుడు .హిందూ ధర్మశాస్త్రంలో అధారిటి గా పేరు పొందాడు .వెంకన్న తన ప్రతిభా,పాండిత్య  సామర్ధ్యాన్ని వాదప్రహసనం లో విపులంగా రాసుకొన్నాడు .ఈయన మంచి హాస్యప్రియుడని ,హాస్యం ఉట్టిపడే శ్లోకాలు అలవోకగా చెప్పేవాడని ‘’వికటకవి ‘’గా ప్రఖ్యాతుడని ఆయన వంశం వారు చెప్పారు .’’చతుషష్టి కళాత్మక ‘’ఆలంకారిక సార్వ భౌమ ‘’అనే బిరుదులున్నాయి .మన నరసయ్య వెంకన్న శాస్త్రిని ‘’మై డియర్ బ్రదర్ ఇన్ లా ‘’ఆని చెప్పేవాడు .అయితే ఆ బంధుత్వం ఏమిటో తెలియదు .అన౦తరామ శాస్త్రి ,వెంకన్న శాస్త్రిల పుస్తకాలపై కంచి పీఠంలో పీఠాధిపతి సమక్షంలో వాద ప్రతివాదాలు కొంతకాలం జరిగి ఎటూ తేలకుండా ముగిశాయి .

4-దంపూరు నరసయ్య

17ఏళ్ల వయసున్న మన దంపూరు నరసయ్య మద్రాస్ పచ్చయప్ప కాలేజిలో అసిస్టెంట్ టీచర్ ఉద్యోగం చేస్తూ ‘’లెటర్స్ ఆన్ హిందూ మారేజేస్ ‘’అనే పుస్తకం రాసి ప్రచురించాడు .దీన్ని తెలుగులో బాగా ప్రచారం లోకి తెచ్చినవాడు బంగోరె అనే బండిగోపాలరెడ్డి .నరసయ్య ఆరు లేఖలు ఆనాటి ప్రభుత్వానికి రాశాడు అందులో బాల్యవివాహాలు శాస్త్ర సమ్మతం కాదు ఆని తన అభిప్రాయాన్ని నిర్మోహ మాటంగా తెలిపాడు .రంగనాధ శాస్త్రి వెంకన్న శాస్త్రిల వాడ ప్రతివాదాలపై సమీక్ష రాశాడు .అర్హుడైన వరుడిని ఎంచుకోవతమేకాడు వివాహ యోగ్యమైన వయసునూ ఎంచుకోవాలనిస్త్రీలకు విజ్ఞప్తి చేశాడు .వితంతు పునర్వివాహాన్ని రద్దు చేయటం వలన  వ్యభిచారం పెరిగింది అన్నాడు .

 అలా  ‘’ఆ నలుగురు ‘’హిందూ మత సాంఘిక సంస్కరణలకోసం మద్రాస్ రెసిడెన్సి లో తీవ్ర కృషి చేశారు .నరసయ్య రాయకపోతే మనకుఈవిషయాలు తెలిసేవికావు .శ్రీ కాళిదాసు పురుషోత్తం దంపూరు నరసయ్యపై పుస్తకం రాయక పోయి ఉంటే అసలు ఇవి బయట పడేవే కావు .

ఆధారం –డా .కాళిదాసు పురుషోత్తం గారి’’ఇంగ్లిష్ జర్నలిజం లో తొలి వెలుగు దంపూరు నరసయ్య ‘’పుస్తకం.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

సరసభారతి 186వ కార్యక్రమ౦గా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 178 వ ఆరాధనోత్సవం

అక్షరం లోక రక్షకం

సరసభారతి 186వ కార్యక్రమ౦గా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 178 వ ఆరాధనోత్సవం

సరసభారతి 186వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీత్యాగరాజ స్వామి వారి 178 వ ఆరాధనోత్సవం

 పుష్య బహుళ పంచమి 18-1-2025 శని వారం సాయంత్రం శ్రీ సువర్చలాంజనేయస్వామి వారి దేవాలయం లో జరుగుతుంది .సంగీత ,సాహిత్యాభి మానులు పాల్గొని జయప్రదం చేయ మనవి .

     కార్యక్రమ వివరం

సాయంత్రం -6-30 లకు –శ్రీ త్యాగరాజ స్వామికి అష్టోత్తర పూజ

                7-00గం లకు సంగీతం టీచర్ –శ్రీమతి జి .మాధవి బృందం చె శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనల గానం

సంగీతం లో ప్రవేశమున్న ఉత్సాహ వంతులైన వారందరు పాల్గొని గానంతో అలరించమని కోరిక .

  జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి  గబ్బిట  వెంకట రమణ         గబ్బిట  దుర్గా ప్రసాద్

 గౌరవాధ్యక్షులు             కార్యదర్శి               కోశాధికారి                    సరసభారతి అధ్యక్షులు

11-1-25-ఉయ్యూరు . 

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.57 వ భాగం.11.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.57 వ భాగం.11.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.57 వ భాగం.11.1.25.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్ష సం.23 వ భాగం.11.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్ష సం.23 వ భాగం.11.1.25.

Posted in రచనలు | Leave a comment

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.8 వ భాగం.10.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.8 వ భాగం.10.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.8 వ భాగం.10.1.25.

Posted in రచనలు | Leave a comment

తొలి తెలుగు ఇంగ్లీషు జర్నలిజం వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.4 వ భాగం.10.1.25.

తొలి తెలుగు ఇంగ్లీషు జర్నలిజం వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.4 వ భాగం.10.1.25.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .22 వ భాగం.9.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.3 వ భాగం.8.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.3 వ భాగం.8.1.25.

Posted in రచనలు | Leave a comment

డేనిష్ మహాదాత ,స్త్రీ సంక్షేమ కారిణి రచయిత్రి – రెజిట్జ్ విల్హెల్మైన్ లూయిస్ అగస్టా బార్నర్(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జనవరి

రెజిట్జ్ విల్హెల్మైన్ లూయిస్ అగస్టా బార్నర్ (28 ఫిబ్రవరి 1834 – 2 డిసెంబర్ 1911) ఒక డానిష్ ఉన్నత మహిళ, పరోపకారి మరియు రచయిత. యువత మరియు వృద్ధులైన మహిళలకు పరిస్థితులు మరియు అవకాశాలను సులభతరం చేయడానికి ఆమె చేసిన కృషికి ఆమె జ్ఞాపకం ఉంది. వీటిలో డీకనెస్ ఫౌండేషన్ (డయాకోనిస్స్టిఫ్టెల్సెన్) మరియు ప్రిజన్ అసోసియేషన్ (ఫెంగ్సెల్సెల్స్కాబెట్)లో ఆమె ప్రమేయం ఉంది. 1879లో, యువతులు వ్యభిచారం వైపు మొగ్గు చూపకుండా నిరోధించేందుకు రూపొందించిన సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సింగిల్ ఉమెన్ (ఫోరెనింగెన్ టిల్ వార్న్ ఫర్ ఎన్‌లిగ్ట్ స్టిల్‌డే క్విండర్)ను ఆమె స్థాపించారు మరియు అధ్యక్షత వహించారు. డీకనెస్ ఫౌండేషన్ యొక్క చరిత్రతో పాటు, ఆమె మరణానికి కొంతకాలం ముందు ఆమె ఆత్మకథను వ్రాసింది, అది 1911లో రెండు సంపుటాలుగా ప్రచురించబడింది

జీవిత చరిత్ర:

28 ఫిబ్రవరి 1834న కోపెన్‌హాగన్‌లో జన్మించిన రెజిట్జ్ విల్హెల్మైన్ లూయిస్ అగస్టా బార్నర్ జిల్లా నిర్వాహకుడు కాన్రాడ్ విల్హెల్మ్ బార్నర్ (1799-1873) మరియు అతని భార్య జాకోబిన్ మేరీ నీ కాస్టెన్‌చైల్డ్ (1808-1862) కుమార్తె. ఆమె ఎనిమిదేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రుల విడాకుల తర్వాత, ఆమె తన తల్లితో పాక్షికంగా కోపెన్‌హాగన్‌లో మరియు కొంతవరకు ఆమె తండ్రి నివసించే కోగేలో నివసించింది.

కోపెన్‌హాగన్‌లోని గారిసన్ చర్చిలో నికోలై గాట్లీబ్ బ్లెడెల్ యొక్క ఉపన్యాసాల నుండి ప్రేరణ పొందిన ఆమె దాతృత్వం వైపు మళ్లింది. అనేక ఇతర మహిళలతో కలిసి, ఆమె కోగేలో పిల్లల ఆశ్రయాన్ని స్థాపించింది మరియు వారి ఇళ్లలో అనారోగ్యంతో మరియు పేదవారిని సందర్శించింది. ఆమె 25 సంవత్సరాల వయస్సులో, ఆమె ఇంటి నుండి దూరంగా వెళ్లి నర్సు మరియు పరోపకారి లూయిస్ కాన్రింగ్‌ను కలుసుకుంది. ఆమె మొదట బర్త్ ఫౌండేషన్ (Fødselsstiftelsen) వద్ద పిల్లలను చూసుకోవడంలో ఆమెకు సహాయం చేసింది మరియు 1863లో డానిష్ డీకనెస్ ఫౌండేషన్‌ను స్థాపించడంలో ఆమెతో కలిసి పనిచేసింది, 1884 వరకు బోర్డు మెంబర్‌గా మారిందిడీకనెస్ సంస్థలు జర్మనీలో థియోడర్ ఫ్లైడ్నర్ చేత స్థాపించబడిన అసలైన ఇంటిపై ఆధారపడి ఉన్నాయి మరియు మహిళలు వేదాంతశాస్త్రం మరియు నర్సింగ్ నైపుణ్యాలను నేర్చుకునేటప్పుడు రోగులను చూసుకునేలా రూపొందించబడ్డాయి.[4] డీకనెస్ సంస్థలకు సంబంధించి, 1862లో ఆమె అనామకంగా Nogle Meddelelser om Diakonissegjerningen i ældre og nyere Tid (పూర్వ మరియు ఇటీవలి కాలంలో డీకనెస్ సంస్థల వివరాలు.] కోపెన్‌హాగన్‌కు వెళ్లిన తర్వాత, ఆమె జైలుపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచింది. అసోసియేషన్ (Fængselsselskabet) లో స్థాపించబడింది 1843లో ఖైదీలను క్రైస్తవ విలువల వైపు మళ్లేలా ప్రోత్సహించేందుకు, యువతులు వ్యభిచారం చేయడాన్ని నిరోధించేందుకు రూపొందించిన సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సింగిల్ వుమెన్ (ఫోరెంజెన్ టిల్ వోర్న్ ఫర్ ఎన్‌లిగ్ట్ స్టిల్‌డే క్వీండర్)ను స్థాపించారు.

1911లో రెజిట్జ్ బార్నర్ తన కోపెన్‌హాగన్ కార్యకలాపాల నుండి విరమించుకుని వల్లో కాజిల్‌లో తన చివరి నెలలు గడిపింది, అక్కడ ఆమె తన జ్ఞాపకాలను వ్రాసింది, మైండర్ ఫ్రామిట్ లివ్ ఓగ్ మిన్ గ్జెర్నింగ్ (మెమోరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్స్), రెండు సంపుటాలుగా ప్రచురించబడింది. ఆమె 2 డిసెంబర్ 1911న కోటలో మరణించింది మరియు స్థానిక శ్మశానవాటికలో ఖననం చేయబడింది.

-గబ్బిట దుర్గా ప్రసాద్ .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.56 వ భాగం.8.1.25.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .21 వ భాగం.8.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .21 వ భాగం.8.1.25.

Posted in రచనలు | Leave a comment

మనం మర్చి పోయిన అలనాటి మద్రాస్ రెసిడెన్సి తెలుగు మహానుభావుల సాంఘిక,మత సంస్కరణ కృషి -1

1864ఫిబ్రవరి ,మార్చి నెలలలో కేశవ చంద్ర సేన్ మద్రాస్ పర్యటన చేసి అనేక ఉపన్యాసాలిచ్చి సంఘ సంస్కరణలపై ప్రసంగించి  ప్రజలను చైతన్యవంతుల్ని చేశాడు .స్త్రీ విద్య ప్రోత్సహించట ,కులనిర్మూలన చేయటం ,సంస్కరణ ఉద్యమాలకు సంఘాలు స్థాపించటం గురించి ప్రచారం చేశాడు .ఇవి హిందూ యువకులపైనా ,విద్యార్దులపైనా గొప్ప ప్రభావం చూపాయి .’’హిందూ మతానికి వేదకాలం నాటి ఔన్నత్యాన్ని మళ్లీ కలిగించాలి ‘’అనే బ్రహ్మ సమాజ భావన విద్యావంతుల్ని బాగా కదిలించింది .సేన్ మద్రాస్ లో ఉన్న మూడు నెలల లోపలే బెంగాల్ లోని బ్రహ్మ సమాజం నమూనాలో మద్రాస్ లో ‘’మద్రాస్ వేద సమాజం ‘’ప్రారంభమైంది .ఏకగ్రీవంగా నిబంధనలు తయారు చేశారు .ఆస్తికత ,ఏకేశ్వరోపాసన,విగ్రహారాధన మానటం ,కులభేదాలను విస్మరించటం ,మత ద్వేషాన్ని విడిచిపెట్టటం ,స్త్రీ విద్య ,వితంతు వివాహ ప్రోత్సాహం ,దేశ భాషలలో పుస్తక ప్రచురణ వీరి ఆశయాలు .వేదం మీద విశ్వాసం ఉండటంతో వేద సమాజం ఆని పేరు పెట్టుకొన్నారు .ఈ సంఘానికి వి.రాజగోపలాచార్యులు ,సి సుబ్బరాయలు శెట్టి ,అధ్యక్ష ,కార్యదర్శులు .ఇద్దరూ న్యాయవాదులే .సంఘానికి తంజావూర్ సేలం కోయంబత్తూరు బెంగుళూరు లలో అనుబంధ  సంస్థలేర్పడ్డాయి .సభ్యులు ఉపన్యాసాలకు ప్రార్ధన సమావేశాలకు మాత్రమె పరిమితమయ్యారు .సనాతన ఆచారాలమీద ,ఉపనిషత్కాల౦ తర్వాత వాడుకలోకి వచ్చిన సంప్రదాయాలమీద విమర్శలు చేయటంతో ఈసమాజం సంప్రదాయ వాదులకు సామాన్య ప్రజలకు దగ్గర కాలేక పోయింది .అధ్యక్ష కార్యదర్శుల మరణం తర్వాత సంస్థ కొంతకాలం నిర్వీర్యమైంది .అయితే మద్రాస్ రేసిడేన్సిలో మత, సాంఘిక సంస్కరణ లమీద ప్రజలలో జిజ్ఞాస  రేకిత్తించ టానికి  వేద సమాజం సఫలమైందని చెప్పచ్చు .

 శ్రీ సి .వి .రంగ నాధ శాస్త్రి (1819-1881 )

  వేద సమాజం స్పూర్తితో శ్రీ కలమూరు వెంకట రంగనాధ శాస్త్రి ,ఆయన మిత్రులు బాల్యవివాహాలకు వ్యతిరేకం గా ఉద్యమాలు చేశారు .శాస్త్రిగారు చిత్తూరు జిల్లాలో ఒక పండిత కుటుంబంలో జన్మించారు .పావెల్ పర్యవేక్షణలో 1842లో అత్యున్నత శ్రేణిలో ప్రోఫీషి ఎంట్’’ గా హైస్కూల్ విద్య పూర్తి చేసి ,మద్రాస్ హై కోర్ట్ లో ఉద్యోగం లో చేరి ,అనేక యూరోపియన్ భాషలు నేర్చారు 1859 మద్రాస్ స్మాల్ కాజ్ కోర్ట్ జడ్జి అయ్యారు .విద్యాభిమాని శాస్త్రి ని  పాశ్చాత్య విద్యావిధానం  ఆకర్షించి ప్రజలు విద్యావంతులైతే తప్ప దేశం అభి వృద్ధి చెందదని గట్టిగా నమ్మి ,స్త్రీ విద్యనూ కూడా ప్రోత్సహించాడు .తన కుమార్తెకు చదువు చెప్పించాడు ..హిందూ మత గ్రంథాలను క్షణ్ణంగా చదివి ,ఆమతం సర్వోత్క్రుష్టం ఆని గ్రహించాడు .వర్ణ భేదాలమీద విశ్వాసం పూర్తిగా తొలగిపోయింది .వేద సమాజం కలిగించిన స్పూర్తితో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలను అధ్యయనం చేశాడు .ఈ విషయాలలో శాస్త్ర గ్రంథాలు ఏమి చెప్పాయో పరిశీలించాడు .ఈ అనుశీలనతో బాల్యవివాహ వ్యవస్థ దారుణమైనదని గ్రహించాడు .

  బాల్య వివాహాలను నిరసిస్తూ దక్షిణ భారతం లో వచ్చిన మొదటి పుస్తకం ఎవరు రాశారో తెలియదు .కేశవ చంద్ర సేన్ వచ్చిన సంవత్సరమే బాల్యవివాహాలను నిరసిస్తూ తెలుగులో ఒక పుస్తకం వచ్చి౦దని తెలుస్తోంది .’’హిందూ వివాహ శాస్త్ర సంగ్రహం ‘’అనే అనువాద గ్రంథం మనుస్మ్రుతిని ఉల్లెఖిస్తో ,రజస్వలానంతర వివాహాలను ,వితంతు వివాహాలను శాస్త్రాలు అనుమతిచాయని వాటిపై నిషేధం లేదని తెలిసింది .కలియుగం లో ఆయుస్సు తక్కువ కనుక ఆడపిల్లకు 16యేండ్ల లోపల’’ పెళ్ళి చేయక పోవటం’’ వాంఛ నీయం .ఎట్టి పరిస్థితులలోనూ 12ఏళ్ల లోపు పిల్లకు పెళ్ళి చేయకూడదు ఆని ఆ రచయిత గట్టిగా వాదించి నట్లు తెలుస్తోంది .

   శ్రీ స్వామినేని ముద్దు నరసింహం 1862 ప్రాంతం లో  ‘’హిత వాది ‘’పత్రిక లో సాంఘిక విషయాలపై అనేక వ్యాసాలు రాశారు.’మద్రాస్ వేద సమాజ పత్రిక ,’తత్వబోధిని ‘’లో  సంస్కరణ బాలికా విద్య ,,వితంతు పునర్వివాహం మొదలైన విషయాలపై వ్యాసాలూ ప్రకటింప బడ్డాయి .రంగనాథ శాస్త్రి తన మిత్రుడు చదలువాడ అనంతరామ శాస్త్రి గారిని ‘’రజస్వలానంతర వివాహాలు శాస్త్ర సమ్మతమే’’ ఆని నిరూపిస్తూ ఒక పుస్తకం రాయమని కోరాడు .ఆయన కోరిక తీరుస్తూ అనంతరామ శాస్త్రిగారు సంస్కృతం లో శ్లోకాలలో ‘’వివాహ్య కన్యాస్వరూప నిర్ణయం ‘’అనే గ్రంథం రాశారు .తర్వాత ఏమి జరిగిందో తర్వాత చూద్దాం .

 సశేషం

ఆధారం –డా .కాళిదాసు పురుషోత్తం గారి’’ఇంగ్లిష్ జర్నలిజం లో తొలి వెలుగు దంపూరు నరసయ్య ‘’పుస్తకం.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి – సాహిత్య తత్వ వివేచన.7 వ భాగం.7.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి – సాహిత్య తత్వ వివేచన.7 వ భాగం.7.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి – సాహిత్య తత్వ వివేచన.7 వ భాగం.7.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు. , పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ -శ్రీ దంపూరు నరసయ్య.2 వ భాగం.7.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు. , పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ -శ్రీ దంపూరు నరసయ్య.2 వ భాగం.7.1.25.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.55 వ భాగం.7.1.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.55 వ భాగం.7.1.24.

Posted in రచనలు | Leave a comment

శాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్ష సం.20 వ భాగం.7.1.25.

Posted in రచనలు | Leave a comment

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.6 వ భాగం.6.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.6 వ భాగం.6.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.6 వ భాగం.6.1.25.

Posted in రచనలు | Leave a comment

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.1 వ భాగం.6.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.1 వ భాగం.6.1.25.

ఇంగ్లీష్ జర్నలిజం లో తొలి వెలుగు, పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య.1 వ భాగం.6.1.25.

Posted in రచనలు | Leave a comment

శాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .19 వ భాగం.6.1.24.

శాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .19 వ భాగం.6.1.24. https://youtu.be/TGmvwCra5o4

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.54 వ భాగం.6.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.54 వ భాగం.6.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.54 వ భాగం.6.12.24.

Posted in రచనలు | Leave a comment

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.5 వ భాగం.5.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.5 వ భాగం.5.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన.5 వ భాగం.5.1.25.

Posted in రచనలు | Leave a comment

డా. జీవి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.19 వ చివరి భాగం.5.1.24.

డా. జీవి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.19 వ చివరి భాగం.5.1.24.

డా. జీవి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.19 వ చివరి భాగం.5.1.24.

Posted in రచనలు | Leave a comment

రఘుపతి వెంకటరత్నం గారి గోల్డ్ మెడల్ విజేత ,ఆంధ్రనాటక విమర్శనం గ్రంథ రచయిత,మద్రాస్ యూని వర్సిటి తెలుగు శాఖాధ్యక్షుడు –శ్రీ శిష్ట్లా రామ కృష్ణ శాస్త్రి

రఘుపతి వెంకటరత్నం గారి గోల్డ్ మెడల్ విజేత ,ఆంధ్రనాటక విమర్శనం గ్రంథ రచయిత,మద్రాస్ యూని వర్సిటి తెలుగు శాఖాధ్యక్షుడు –శ్రీ శిష్ట్లా రామ కృష్ణ శాస్త్రి

పాత తరానికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ శిష్ట్లా రామ కృష్ణ శాస్త్రి .1941లో ఆయన మద్రాస్ విశ్వ విద్యాలయ పరిశోధన విద్యార్ధి .ఆప్పటికే ఆయన నద్రాస్ మహిళా కాలేజి ,బందరు నోబుల్ కాలేజే లలో తెలుగు అధ్యాపకులు గా పని చేసిన అనుభవం ఉంది.1940లో విమర్శ –వ్యాసములు అనే గ్రంథం రాసి ప్రచురించారు .1947 రఘుపతి వెంకట రత్నం రిసెర్చ్ మెడల్ కోసం జరిగిన పోటీకి ‘’వీరశైవాంధ్ర వాజ్మయం ‘’అనే గ్రంధం రాసి  ‘’స్వర్ణపతకం సాధించారు .తిరుపతి దేవస్థానం దీన్ని 1948లో ప్రచురించింది .

  తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం లో శాస్త్రి గారు సంపాదకుడు గా  పని చేశారు.ఆయన ఎం. ఎ .తొ పాటు బి.వో.ఎల్ .కూడా చదివి ఉత్తీర్ణులయ్యారు .బందరులో పని చేస్తున్నకాలం లో 1949లో ‘’ఆంధ్ర నాటక విమర్శనం ‘’గ్రంథం రాశారు .ప్రాచ్య ,పాశ్చాత్య నాటక విమర్శన పద్ధతులద్వారా ప్రధాన సంస్కృత నాటకాలపై ఈగ్రంథం లో చక్కని ప్రామాణిక విమర్శ చేశారు .ఇది బి. ఎ .విద్యార్ధులకు పాఠ్యాంశం  అయింది.భవభూతి నాటకాలు, షేక్స్ పియర్ నాటకాలు శ్రవ్య నాటకాలే కాని  దృశ్యనాటకాలు కావు ఆని తేల్చి చెప్పారు .నాటకం లోని నాయక లక్షణాలు ,రస పోషణ ,కథా సంవిధానం ,పాత్ర పోషణలను ఈ గ్రంథం లో సోదాహరణం గా చర్చించారు .

 రామ కృష్ణ శాస్త్రి గారు మద్రాస విశ్వ విద్యాలయం లో 1949నుంచి 1968 17 సంవత్సరాలు తెలుగు లెక్చరర్ గా పని చేశారు .అప్పుడు శ్రీ నిడదవోలు వెంకటరావు గారు తెలుగు శాఖ అధిపతి .ఈ ఇద్దరితోనే తెలుగు డిపార్ట్ మెంట్ నడిచింది .1960లో నిడదవోలు వారు రిటైర్ అయ్యాక ,శిష్ట్లా వారు శాఖాధ్యక్ష బాధ్యత స్వీకరించి 1968లో రిటైరయ్యారు .1968 లో అక్కడ ఒక మహాశకం అంతమైంది .1927లో శ్రీ కోరాడ రామ కృష్ణయ్య గారితో ప్రారంభమైన తెలుగు శాఖ 1968 వరకు 40 సంవత్సరాలు  ప్రాచీన సంప్రదాయం లో నిష్ణాతులైన  విద్వాంసుల ఆధ్వర్యం లో ఒక వెలుగు వెలిగి స్వర్ణాధ్యాయం అనిపించింది  .రెండేళ్లపాటు తెలుగు శాఖలో ఎవరూ లేరు .1970 శ్రీ గంధం అప్పారావు గారు చేరేవరకు  తెలుగు శాఖలో జవ జీవాలు లేవు.

 శాస్త్రిగారి  జనన మరణాలు తెలియలేదు .వారి గురించిశ్రీ పొట్టిశ్రీరాములు యూని వర్సిటి ప్రచురించిన ‘’ 20 వ శతాబ్దం తెలుగు వెలుగులు’’ఉద్గ్రంధం లో అసలు లేదు. వారి ఫోటో కూడా లేకపోవటం విచారకరం .

 ఆధారం –శ్రీ రేవూరు అనంత పద్మనాభరావు గారి వ్యాసం –ఆచార్యదేవో భావ -13.

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-24-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment