ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.48 వ భాగం.5.8.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.48 వ భాగం.5.8.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.48 వ భాగం.5.8.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.48 వ భాగం.5.8.25.
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.4 వ భాగం.5.8.25.
సూత మహర్షి ని బలారాముడు చంపాడా ?
అవును అనే భాగవత పురాణం చెబుతోంది .ఎలా ఎప్పుడు ?
బలరాముడు కౌరవ పాండవులకు యుద్ధం తప్పకుండా వస్తుందని ముందే గ్రహించి తనకు యేపక్షం లోనూ చేరి యుద్ధం చేయాలని లేదు అనిపించి తీర్ధ యాత్రలు చేయటానికి బయల్దేరాడు .అనేక తీర్ధాలు సందర్శించి స్నానాలు చేసి తర్పణాలు వదిలాడు . ,మొదట ప్రభాస తీర్ధం ,అక్కడి నుంచి సరస్వతి ,బిందు సరం వజ్రతీర్ధం ,విశాల ,సరయు ,గంగా యమునా నదులలో స్నానాదికాలు పూర్తి చేసుకొని ,,నైమిశారణ్యం చేరి అక్కడ మహర్షులు చేస్తున్న సత్రయాగం చూసి తానూ వారిని పూజించి వారి పూజలు అందుకొన్నాడు .ఇంతవరకు బాగానే ఉంది .
నైమిశారణ్యం లో అఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడైన సూతమహర్షి బలరాముని చూసి లేవటం కానీ ఎదురు వెళ్లి మర్యాద చేయటం కానీ చేయలేదు .బలరాముని అహానికి దెబ్బ తగిలింది అనిపించి ,తీవ్రంగా కోపం వచ్చి అక్కడి ముని జనంతో ‘’మహర్షులారా !సూతుడు ప్రతిలోమ జాతుడు .మహాత్ములైన మునిజనం మధ్య తానూ ఒక ముఖ్య వ్యక్తిని ఆని విర్ర వీగుతున్నాడు .ఏదో వ్యాసుల వారి అనుగ్రహం వలన కొన్ని కధలు నేర్చుకొని చిలక పలుకులు లాగా మీకు చెబుతున్నాడు .తనను తానూ సర్వజ్ఞుడి గా భావించుకొని గర్వం తలకకెక్కగా కళ్ళు మూసుకు పోయి విర్ర వీగుతున్నాడు పెద్దలనే గౌరవించటం లేదు చూశారు కదా .వీడెంత వీడి విద్య లు ఎంత ? ఆ విద్యలు వీడి ఒళ్ళు పోగరెక్కి౦చటానికే పనికొచ్చాయి .కానీ సత్వగుణం పెంపొందించేవి కావు .ధర్మ రక్షణ కోసం అవతరించిన మమ్మల్నే లెక్క చేయని వీడిని శిక్షించటం మాకు తప్పనిసరి కర్తవ్యమ్ .’’ఆని చెప్పి అందరూ చూస్తుండగా చేతిలో ఉన్న దర్భ కొనతో ఒక్క పోటు పొడిచాడు .ఆ చిన్న దెబ్బకే సూతుడు ప్రాణాలు వదిలేశాడు .అనుకొని ఈ సంఘటనకు మునిజనం తట్టుకోలేక హాహాకారాలు చేశారు .
కొంచెం తేరుకొని బలరాముడితో ‘’మహానుభావా !మేమే గౌరవంతో సూతమహర్షికి బ్రహ్మాసనం గౌరవంగా సమర్పించుకొన్నాం .అందుకని పీఠ గౌరవంతో సూతమహర్షి ఆసనం నుంచి మీరు వచ్చినప్పుడు లేవలేదు అన్నీ తెలిసిన మీరూ ఈ చిన్న విషయానికే కోపం తెచ్చుకొని ఇలా చేయటం న్యాయం ధర్మం కాదు .మీరు బ్రహ్మ హత్యా మహా పాపానికి ఒడి గట్టారు కనుక తక్షణం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి .మీలాంటి ధర్మాత్ములే ధర్మ౦ తప్పితే మిగిలిన వారి సంగతేమిటి ?ఇంకా లోకం లో ధర్మ౦ నిలుస్తుందా ?కనుక వెంటనే దీనికి పరిష్కారం మీరే చేయాలి .’’అన్నారు .
బలరాముడు జరిగిన తప్పు గ్రహించి మునులతో ‘’అయ్యలారా !తమో గుణం పొంగుకొచ్చి నా చేత ఈ పాపపు పని చేయించింది. దీనికి ప్రతి విధానం ఏమిటో మీరే సెలవివ్వండి .సూతమహర్షికి మళ్లీ ఆయుస్సు ,గొప్ప శక్తీ ఇవ్వాలను కొంటున్నాను మీకు సమ్మతమే కదా ?నా యోగాశక్తితో ఈ పని చేస్తాను .’’అన్నాడు మునులు ‘’మీరు దర్భను అస్త్రంగా చేసిన దానికీ ,ఆయన మరణించటానికి మా మనసు యే విధంగా వైక్లబ్యం పొందదొ అలా చేయమని ప్రార్ధన ‘’అన్నారు .
బలరాముడు ‘’మునులారా !వేదం ఆత్మా వై పుత్రనామాసి ‘’అన్నది అంటే తానె పుత్రరూపుడై వస్తాడు అనే తాత్పర్యం గల వేద వాక్యం అనుసరించి సూతమహర్శిని మళ్లీ బ్రతికించి గొప్ప సంపద ,ఆయుస్సు ,యేరోగం లేని తనం ,విద్యలో గొప్ప ప్రాభవం గల వాడిని గ చేసి నాకు ‘’పుత్ర సమానుడు ‘’గా సంభావిస్తాను .’’ఆని చెప్పి సూతుని బ్రతికించి ‘’కోపా వేషం తొ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మీరే సెలవీయండి ‘’ఆని ప్రాధేయ పడగా వారు ‘’మహాత్మా !ఇల్వలుడు అనే రాక్షసుడి కొడుకు పల్వలుడు అమావాస్య ,పౌర్ణమి పర్వ దినాలలో మునులు లోక కళ్యాణం కోసం చేసే యాగ శాలల్లో ప్రవేశించి అగ్ని కుండాలలో మలమూత్రాలు నెత్తురు కుమ్మరిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు వాడి పని పట్టండి ‘’అన్నారు .సరే అన్నాడు ముందుకు సాగాడు .
ఇంతలో పర్వ దినం వచ్చింది .యజ్ఞశాలల చుట్టూ తిరుగుతూ పల్వలుడు బలరాముడికి కనిపించాడు తన ఆయుదాలైన గద,రోకలిని స్మరించి నాగలిని వాడి మెడకు తగిలించి రోకలితో మాడు పగలగొట్టగా నెత్తురు కక్కుకొని చచ్చాడు బలరాముని దుష్ట శిక్షణకు మునులు సంతోషించి ఆనందంతో పూజలు చేసి సత్కరించి సాగనంపారు .’’ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది ‘’అంటే ఇదే .
సూత జనననాదులు
ప్రతి పురాణం ‘’సూతముని శౌనకాది మహర్షుల కిట్లనియె ‘’అనే వాక్యం తో ప్రారంభమౌతుంది .ఇందులో మనకు సూతుడు అనే ముని పురాణాలు శౌనకుడు అనే మహర్షితో సహా మిగిలిన వారికి పురాణ ప్రవచనం చేశాడు అని మాత్రమె మనకు తెలుస్తుంది .అసలు వాళ్ళు ఎవరో మనం ఆలోచించం .ఒక వేల ఆలోచ్చించి ప్రయత్నించినా మనకు లభించే విషయం చాలా స్వల్పమే .ఇదొక నిరుత్సాహం .నాకూ న్తవరకు ఆ ఆలోచన రాలేదు ఇవాళ బల్బ్ వెలిగి తెలుసుకొనే ప్రయత్నం చేశాను .నాకుదోరికిన సమాచారం మీకూ అందిస్తున్నాను .ఇంతకంటే అదనపు సమాచారం ఎవరి దగ్గర ఉన్నా పంపించి దీన్ని నిరభ్యంతరంగా పరిపూర్ణం చేయవచ్చు .
సూత ముని
పృధు చక్రవర్తి పితామహ సంబంధమైన యజ్ఞాలు చేస్తుండగా శ్రీమహా విష్ణువు వచ్చి పౌరాణికుడై సూతుడు అనే పేరుతొ పిలువబడ్డాడు .ఆతర్వాత అతని సంతతి వారందరికీ ఈపేరేవచ్చింది అని బ్రహ్మాండ పురాణ౦లో ఉన్నది .
పృధు చక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలను చేద్దామను కొని బ్రహ్మావర్త దేశం లో సరస్వతీ నదీ తీరాన 99పూర్తి చేసి ,నూరవది మొదలు పెట్టగా, ఈర్షతో ఇంద్రుడు యాగాశ్వం అపహిరించి తీసుకు వెళ్ళగా ,అతడి కొడుకు ఇంద్రుని జయించి గుర్రాన్ని తెచ్చాడు .ఇంద్రుడు మళ్ళీ ఎత్తుకు పోయాడు పృధువుకు కోపం వచ్చి విల్లు బాణాలతో యుద్ధానికి బయల్దేరాడు .యాగం మధ్యలో వెళ్లరాదని మునులు చెప్పగా విరమించాడు .బ్రహ్మ వచ్చి ‘’మీరు ఏ దేవుని కోసం యాగం చేస్తున్నారో ఆయన అంశ ఉన్నవాడు ఇంద్రుడు కనుక వధార్హుడు కాడు.పృదువుకు 101యాగాల ఫలితం నేను అందిస్తున్నాను .ఇతడు నారాయణ అంశ సంభూతుడు .ధర్మాన్ని కాపాడటానికి పుట్టాడు ‘’అని చెప్పగా సంతృప్తి చెంది ,ఇంద్రునితో స్నేహం పాటించాడు .పరమేశ్వరుడు ఇంద్రునితో ప్రత్యక్షమై ‘’సత్పురుషులు దేహాభిమానంతో ఉండకూడదు .మత్సర వికారం పొంద రాదు ‘’అని ధర్మం బోధించి ఆశీర్వ దించారు .అలాగే పృధు చక్రవర్తి ధర్మ బద్ధంగా పాలించి రాజ్యం కొడుకులకు అప్పగించి తపస్సుకు వెళ్ళాడు
భాగవతం లో రోమ హర్షుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అనీ ఈయనే శౌనకాదులకు పురాణాలు చెప్పాడనీ ఉన్నది .
భారతం ప్రకారం కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసి ,తాను వక్తగా ఉండకుండా నైమిశారణ్యం లో శౌనకుడు మొదలైన మహర్షులు దీర్ఘ సత్ర యాగం చేస్తుంటే ,వ్యాస శిష్యుడు రోమ హర్షణుడు కుమారుడైన సూత మహర్షిద్వారా సత్కాలక్షేపంగా పురాణాలు చెప్పించాడు .
మార్కండేయ పురాణం లో ఇలా పురాణ ప్రవచనం చేస్తుండగా శ్రీకృష్ణుని అన్న బలరాముడు వచ్చాడు .ఆయనను చూసి సూతుడు గౌరవంగా లేచి నిలబడ లేదు .బలరాముడికి కోపం నషాళానికి అంటి క్షణం ఆలోచించకుండా సూతుడిని సంహరించాడు .శౌనకాది మహర్షులు ప్రార్దిస్తే మళ్ళీ సూతుడిని బ్రతికించి పురాణ ప్రవచనం యధేచ్చగా జరిగేట్లు చేశాడు .
ఆధారం -ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారి -భాగవత నవనీతం -దశమ స్కంధం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-25-ఉయ్యూరు .
24 వ భాగం.4.8.25.
డా సి హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన
24 వ భాగం.4.8.25.
డా సి హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన 24 వ భాగం.4.8.25.
ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి _ నా సాహిత్య జీవితం.5 వ భాగం 4.8.25.
ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి _ నా సాహిత్య జీవితం.5 వ భాగం 4.8.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.47 వ భాగం.4.8.25.
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం,3 వ భాగం.4.8.25.
ప్రముఖ నాటకరంగ స్త్రీ పాత్ర ధారి, హిందీ పండిట్ -శ్రీ అవధాన్ల పురుషోత్తం
భద్రాచలం దగ్గర పర్ణశాలలో శ్రీ అవధాన్ల పురుషోత్తం లక్ష్మీ నరసయ్య చల్లాయమ్మ దంపతులకు 1900లో జన్మించారు .71 ఏళ్ల వయసులో1971లో చనిపోయారు .ఆయన నాటకాలలో వేసినవన్నీ స్త్రీపాత్రలే అవటం ప్రత్యేకం విశేషం.నటన సంగీతం గాన మాధుర్యాలు లేకపోయినా ,ప్రేక్షకులను ఆకర్షించే విధంగా పాడటం వల్ల ప్రేక్షక హృదయాలలో స్థిరంగా నిలిచిపోయారు .’’వన్స్ మోర్ ‘’ల వర్షం కురిపించుకున్నారు .
పెద్ద ఎత్తుగడలో పాటకాని పద్యాన్ని కాని మొదలుపెట్టి , క్రమంగా దాన్నే వచనం గా మార్చుకొని ,ఎప్పుడు మార్చారో తెలియకుండా మార్చేసి ,కొత్తతరహాగా ప్రేక్షకులను మెస్మరిజం చేసిన నట ఘనా పాఠి ఆయన .ఆ రోజుల్లో రాజమండ్రిలో గున్నేశ్వర రావు నాటక కంపెనిలో ఈయనే ప్రత్యెక ఆకర్షణ .ఆయనకు అత్యంత ప్రేమాస్పదుడైన నటుడు పురుషోత్తం గారు .
పురుషోత్తంగారు ధరించిన స్త్రీపాత్రలలో శకుంతల ,కైక ,రుక్మిణి ,మంధర పాత్రలు ఆయనకు చిరయశస్సు సంపాదించి పెట్టాయి .15వ ఏటనే ఆ సమాజం లో చింతామణి నాటకం తొ అరంగేట్రం చేశారు గున్నేశ్వరరావు గారి సమాజం ఉన్నంతవరకు అందులో నటించి నాటకరంగ నిష్క్రమణ చేశారు .
హిందీ భాషా ప్రవీణ చేసి హిందీ భాషా వ్యాప్తి చేశారు .భద్రాచలం బోర్డ్ హైస్కూల్ లో 1948నుంచి 1960 వరకు పన్నెండు సంవత్సరాలు హిందీ పండిట్ గా పని చేశారు ,అదే ఆయనకు జీవనో పాధి అయి కాపాడింది .1956నుంచి కళామతల్లి సేవలో తమ కళా కౌశలం మూడేళ్ళు ప్రదర్శించారు.ఆస్కూలు ఉపాధ్యాయుల అభ్యర్ధన మేరకు ఆ స్కూల్ పిల్లలకు నాటక శిక్షణ ఇచ్చారు .దాని వలన ఆస్కూల్ విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భద్రాచలానికి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టారు .
ఆంధ్ర విశ్వ విద్యాలయం ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ కళాశాల లనాటక పోటీలలో 1961లో బహుమతి పొందినయువకుడు ఎన్ ఆర్ కె పరమహంస పురుషోత్తం గారి శిక్షణ పొందిన వాడే .పురుషోత్తం గారు ఆజన్మ బ్రహ్మ చారి .శుద్ద శ్రోత్రియులు .నిత్య గోదావరీ స్నానం భగవద్గీతా పఠనం ఆయనకు నిత్యకృత్యాలు .ప్రతి సాయంత్రం భద్రాచల రాముని సన్నిధిలో ఆధ్యాత్మిక గ్రంథ పఠనం తొపునీతులయ్యే వారు .అధ్యాపక వృత్తీ నుంచి ఆధ్యాత్మికతకు పరి వర్తనం చెంది జీవితాన్ని ధన్యం చేసు కొని 9-9-1971 న నాటక అవధాని ,ఉత్తమ పురుషులు శ్రీ అవధాన్ల పురుషోత్తం గారు శ్రీరామ సన్నిధికి చేరారు .
ఆధారం -శ్రీ మిరియాల రామ కృష్ణ గారి వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-25-ఉయ్యూరు
డా. సీహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.23 వ భాగం.3.8.25.
ప్రముఖ చారిత్రక పరిశోధ కు లు, న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి _ నా సాహిత్య జీవితం.4 వ భాగం.3.8.25.
ప్రముఖ చారిత్రక పరిశోధ కు లు, న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి _ నా సాహిత్య జీవితం.4 వ భాగం.3.8.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.46 వ భాగం.3.8.25.
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం. 2 వ భాగం.3.8.25.
సుప్రసిద్ధ ప్రకృతి వైద్యులు ,రచయిత -శ్రీ పుచ్చా వెంకట రామయ్య
1898లో జన్మించి 1984లో 86వ ఏట మరణించిన శ్రీ పుచ్చా వెంకట రామయ్య
గారి పుట్టుక బాల్యం విద్యాభ్యాసం తెలియలేదు .హైస్కూల్ విద్య పూర్తి చేశాక రామయ్య గారి దృష్టి ప్రకృతి వైద్యం వైపు మళ్ళింది .వీరిది గుంటూరు జిల్లా దంతలూరు గ్రామం కావచ్చు .అక్కడే హైస్కూల్ విద్య పూర్తికాగానే ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభించారు .
ప్రకృతి గ్రంథ మాల స్థాపించి ,1921లో సూర్య కిరణ చికిత్స ,ప్రతిష్టాన నియమాలు ,మల బద్ధకం ,ఆరోగ్య ధర్మం అనే నాలుగు పుస్తకాలు రాసి ప్రచురించారు .విజయవాడలో’’ ప్రకృతి కార్యాలయం ట్రస్ట్ ‘’స్థాపించి ,అధ్యక్షులుగా ఉంటూ మరికొన్ని’’మసూచికము’’మొదలైన గ్రంథాలు రచించి ప్రచురించారు .ప్రకృతి అనే మాస పత్రిక ను 1834 నుంచి 1984వరకు యాభై ఏళ్ళుఅవిచ్చిన్నంగా నడిపి రికార్డ్ సృష్టించారు .
ప్రకృతి కార్యాలయం ట్రస్ట్ ద్వారా ‘’ఇండియన్ నాచురోపత్ ‘’ఇంగ్లీష్ పత్రికను 1934 నుంచి 1948వరకు సంపాదకులు గా ఉంటూ 14 ఏళ్ళు నడిపారు . జీవిత౦ అంతా ప్రకృతి వైద్యానికే ధారపోశారు .ప్రకృతి వైద్యం అంటే జీవిత విధానం అంటారు ఆయన .ప్రకృతి వైద్యం లోఅనితర సాధ్య కృషి చేసి వందలాది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చిన ఆదర్శ మూర్తి శ్రీ పుచ్చా వెంకట రామయ్య గారు
ఆధారం – తెనాలికి చెందిన శ్రీ అయినాల మల్లేశ్వర రావు గారి వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-25-ఉయ్యూరు
డా. సీహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.22 వ భాగం.2.8.25.
ప్రముఖ చారిత్రక పరిశోధ కు లు, న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.3 వ భాగం.2.8.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.45 వ భాగం.2.8.25.
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి_ శ్రీ దేవీభాగవతం.1 వ భాగం.,2.8.25.
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి_ శ్రీ దేవీభాగవతం.1 వ భాగం.,2.8.25.
డా సి హెచ్ సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన 22 వ భాగం.1.8.25
ప్రముఖ చారిత్రక పరిశోధ కు లు, న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి. నాసాహిత్య జీవితం.2 వ భాగం.1.8.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.44 వ భాగం.1.8.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.60 వ చివరి భాగం.1.8.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.60 వ చివరి భాగం.1.8.25.
రేపటి నుంచి శ్రీ దేవీ భాగవతం
సాహితీ బంధువులకు శుభ కామనలు -శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి ఇవాళ ఉదయం 60 వ ఎపిసోడ్ తొ పూర్తయింది
రేపు 2-8-25 శ్రావణ శుక్ల నవమి ఉదయం నుంచి ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి ”శ్రీ దేవీ భాగవతం ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-25
మనం మరచిపోయిన మిల్టన్ లాంటి కవి,విక్రమాదిత్య ,కన్యకా పరమేశ్వరి ఆంగ్ల పద్యకావ్యాలు ,హరిశ్చంద్ర ,సావిత్రి నాటక కర్త, లెక్చరర్ ,ప్రిన్సిపాల్ ,రాజా రవి వర్మ వద్ద మెలకువలు నేర్చిన చిత్రకారులు -శ్రీ కాశీయాజుల సుందర రామ మూర్తి
1868లో శ్రీ కాశీయాజుల సుందర రామ మూర్తి విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి నారప్ప పంతులు గారు జిల్లా మునసబ్ కోర్ట్ లో ఉద్యోగి .మూర్తిగారు కలకత్తా విశాఖ లలో చదివారు .చదువు నేర్పిన విద్యా గురువులపై అపార భక్తీ విశ్వాసాలు కల వీరు అనకాపల్లి లోహిందూ విద్యార్ధులకోసం మొట్టమొదటి ‘’చంద్ర శేఖర శాస్త్రి మెమోరియల్ స్కూల్ ‘’తమ గురువు జ్ఞాపకార్ధం స్థాపించారు.తర్వాత కాకినాడ ,పిఠాపురం లలో మహారాజా కాలేజిలో ఉద్యోగించారు .కోట రామ చంద్రపురం నేషనల్ హైస్కూల్ కు మొదటి హెడ్ మాస్టర్ వీరే .తునిరాజాగారి హైస్కూల్ ప్రిన్సిపాల్ గా ,విశాఖ ఎ వి ఎన్ కాలేజి ఆంగ్ల ఆచార్యులుగా పని చేశారు .వీరి ఆంగ్ల కవిత్వ ,వచన రచన ‘’మిల్టన్ స్టైల్ లో ‘’ఉంటుందని ప్రసిద్ధి పొందారు.ఉపన్యాసం ఉత్సాహం ఉప్పెనె .
రామ మూర్తి గారు విక్రమాదిత్య జననం గురించి ఇంగ్లీష్ లో ద్విపదలు రాశారు .మద్రాస్ మెయిల్ పత్రిక దీన్ని సమీక్షిస్తూ ‘’ఈ కావ్యం వాజ్మయ వైభవ చిహ్నం ‘’ఆని ప్రశంసించింది .కన్యకాపరమేశ్వరి గురించి ఇంగ్లీష్ పద్య కావ్యం కూడా రాశారు భారతి పత్రికలో హరిశ్చంద్ర ,సావిత్రి నాటకాలు రాశారు .బరంపురం వేగుచుక్క గ్రంథ మాల వారు వీరి ‘’ఉత్తమ పంచకుడు ‘’నాటకం ముద్రించారు .
1931 లో ‘’లవంగీ -పండితరాయలు ‘’వ్యావహారిక వచన నాటకం రసజ్ఞ మనో రంజకం గా రాశారు .నాటక రచనతో పాటు అభినయం లో కూడా మూర్తి గారు నిష్ణాతులు .చదరంగం లో చతురులు .తైలవర్ణ చిత్ర రచనలో నేర్పరి .కేరళలో ప్రఖ్యాత చిత్రకారులు రాజా రవి వర్మవద్ద చిత్ర లేఖనానికి వన్నెలు దిద్దుకొన్నారు .ఆంధ్ర ఆంగ్ల ,ఒరియా ,తమిళ హిందు స్థానీ భాషలలో కావ్యాలు రాయగల ప్రజ్ఞా దురీణులు .మహారాజా వారి కాలేజి ప్రముఖ ఇంగ్లీష్ లెక్చరర్ త్రయం’’ లో మూర్తి గారు ముందున్నారు .రాజావారి అనుగ్రహ పాత్రులలో కూడా అగ్రేసరులే .రాజాగారి వ్యక్తిగత పరివారం లోనూ ముఖ్యులే .రాజావారితో వ్యక్తిగత పర్యటనలలోనూ ముఖ్య సహాచరులే .
ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందుతూ ,ఎలాంటి ఒడి దుడుకులు లేకుండా జీవించి ,1939లో ‘’సప్తతి వర్ష ప్రాయాన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కాశీయాజుల సుందరరామ మూర్తి గారు పరమపదించారు .
వీరి ఫోటో దొరకలేదు
ఆధారం -బ్రహ్మశ్రీ రాంభొట్ల నృసింహ శర్మ గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-25-ఉయ్యూరు
ప్రముఖ చారిత్రికపరిశోధకులు శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి _ నా సాహిత్య జీవితం.1 వ భాగం.31.7.25.
ప్రముఖ చారిత్రికపరిశోధకులు శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి _ నా సాహిత్య జీవితం.1 వ భాగం.31.7.25.
డా. సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.20 వ భాగం.31.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.43 వ భాగం.31.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.43 వ భాగం.31.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.59 వ భాగం.31.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.59 వ భాగం.31.7.25.
కందుకూరి వారి రెండు పుస్తకాలు
విజయవాడ శ్రీ కామాక్షీ దేవీ పీఠ౦ కు చెందినఆగమ విద్వాన్ ,శిల్ప శాస్త్ర ప్రవీణ శ్రీ కందుకూరి సత్యబ్రహ్మాచార్య గారు ఈ నెల 27ఆదివారం బెజవాడ రామ్మోహన లైబ్రరీలో శ్రీ తుమ్మోజు వారి ‘’సృష్టికర్త ‘’శతకం ఆవిష్కరణ నాడు నాకు ‘’ఆది విజ్ఞానులు’’ ,’’బాలప్రభ ‘’అనే తమ రెండు రచనలు ఇచ్చారు .వాటి గురించి క్లుప్త పరిచయం .
1-ఆది విజ్ఞానులు -ముందుమాటలో తాము శిల్ప కళాభారతి తరఫున ఇప్పటికి 25 గ్రంథాలు వెలువరించామని ,అవి బహుళ జనాదరణ పొందాయని ,త్వరలోనే విశ్వ కర్మీయం ,మౌన సారం ,అయాది లక్షణం ,ఆత్రేయ తిలకం ,ప్రసాద మండపం ,అగస్త్య సకళాదికార శిల్పశాస్త్రం ,బ్రాహ్మీయ చిత్రకళ శాస్త్రం ,సారస్వతీయ చిత్ర కర్మ శాస్త్రం వంటి అపూర్వ గ్రంథాలను వెలువరింప బోతున్నామని చెప్పారు .వేదం లోని 25మండి శిల్పాచార్యుల గురించి సంక్షిప్త చరిత్ర గల పుస్తకం ఇదీ .స్వయంభూ విశ్వ కర్మతో ప్రారంభించి ,భౌవన విశ్వకర్మ ,అంగీరస బృహస్పతి వగైరా మహానుభావుల గురించి రాసి చివరగా ‘’సుపర్ణ రుషి ‘’తొ పూర్తి చేశారు .రచయిత గారి తీవ్ర అధ్యయనం ప్రతి పదం లో కనిపిస్తుంది .మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు ఆధార సహితంగా ఉటంకించి ,మనసుకు హత్తుకోనేట్లు రాశారు .అభినందనీయులు .శిల్పా చార్యుల చిత్రపటాలున్నాయి .ముచ్చటైన ముద్రణ .
2-బాలప్రభ -18 ఆధ్యాత్మిక బాలకథల సంపుటి .బాల గణపతి తొ ప్రారంభించి బాల స్కంద ,బాల సంబంధ మొదలియార్ ,మాండవ్య మొదలైన వారి చరిత్ర బాలలకు అందుబాటైన భాషలో బాలానందంగా రాశారు .అన్నం మహిమ వివరించారు .మేఘ సందేశం లో ‘’దదద ‘’శబ్ద వివరణ ఇచ్చారు .ద అంటే దమనం అంటే దుర్గుణాలకు దూరం గా ఉండటం ,ద అంటే దత్త అంటే దానం చేయటం ,మూడవ ద అంటే దయ కలిగి ఉండటం .ప్రతికథకు అర్ధవంతమైన చిత్రాలున్నాయి .ముద్రణ ఆకర్షణీయంగా ఉంది . ఈ శబ్దాన్నే ప్ర ముఖ ఆంగ్లకవి నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత టి.ఎస్ ,ఇలియట్ తన అజరామర కావ్యం ‘’వేస్ట్ లాండ్ ‘’లో ఉదాహరించాడు .
చక్కటి రంగుల ముఖ చిత్రాలు అరుదైన లోపలి చిత్రాలు ఉన్న ఈ రెండు పుస్తకాలు ఒక్కొక్కటి వంద రూపాయలు .ఆసక్తి ఉన్నవారు -కందుకూరి వేంకట సత్య బ్రహ్మా చార్య -9491411090కు సంప్రదించవచ్చు
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-25-ఉయ్యూరు
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరి మింగిన వెలగ పండు.8 వ చివరి భాగం.30.7.25.
డా.సి హెచ్. సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు. సమగ్ర పరిశీలన. 19 వ భాగం.30.7.25.
డా.సి హెచ్. సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు. సమగ్ర పరిశీలన. 19 వ భాగం.30.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.42 వ భాగం.30.7.25.
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరి మింగిన వెలగ పండు.7 వ భాగం.29.7.25.
డా. సీహెచ్ సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.18 వ భాగం.29.7.25.
డా. సీహెచ్ సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.18 వ భాగం.29.7.25. youtu.be/dD0_v_oISrc
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.41 వ భాగం.29.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.57 వ భాగం.29.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.57 వ భాగం.29.7.25.
త్రేతాయుగం లో ఋష్యశృంగుడు -ద్వాపరం లో అక్రూరుడు
ఏమిటి ఈ లింకు ?
ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండములో వివరించబడింది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. దశరథమహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు.
ఋష్యశృంగుడి జననము – విద్యాబుద్ధులు
కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభాండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
అంగరాజ్యములో క్షామము
ఇలా ఉండగా, అంగ రాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.
వేశ్యల ఉపాయము
రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా విభాండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు.
మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభాండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని, స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.
వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.
ఋష్యశృంగుడు – శాంత ల వివాహము
ఋష్యశృంగుడిని ఆహ్యానించుటకు అంగ దేశము వెళుతున్న ధశరథుడు- పర్షియన్ రామాయణం నుండి ఒక దృశ్యం
కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడుశృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో రుష్య శృంగ ఆశ్రమం ఉన్నది ఉంది.. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.
అక్రూరుడు
అక్రూరుడు (సంస్కృతం:, అక్షరాలా ‘క్రూరుడు కాదు’) హిందూ మతంలో యాదవ యువరాజు, కృష్ణుడికి మామగా ప్రసిద్ధి చెందాడు. కాశీ రాజు కుమార్తె అయిన శ్వఫల్క మరియు గాండినిల కుమారుడు, కంసుడు తన మేనల్లుళ్ళు కృష్ణుడు మరియు బలరాముడిని మధురలోని ధనుర్యాగ (ఆయుధాల ఉత్సవం) కు తీసుకెళ్లమని ఆదేశించాడు, అక్కడ వారు వధించబడతారు. ఈ ప్రయాణంలో అతను కృష్ణుడి విశ్వరూప (దివ్యదర్శనం) కి సాక్ష్యమిస్తాడు. దాని మునుపటి యజమాని సత్రాజిత్తు మరణం తరువాత అక్రూరుడు స్యమంతక రత్నానికి యజమాని అవుతాడు. ప్రభాస వద్ద జరిగిన అంతర్గత యదువుల వధ సమయంలో అతను చంపబడతాడు.
కృష్ణుడు మరియు బలరాముడి రథసారథి
అక్రూరుడి బంధువు కంసుడు, తన రాజధాని మధురలో నివసించి, యాదుల రాజుగా పరిపాలించాడు. తన మేనల్లుడు కృష్ణుడు చంపబడతాడని ప్రవచించబడిన విష్ణు పురాణంలో, కృష్ణుడిని మరియు బలరాముడిని తన రథంపై మధురకు పిలిపించమని అక్రూరుడిని ఆదేశించాడు. చాంద్రమాన మాసం పద్నాలుగో రోజున జరిగే ధనుర్యాగ ఉత్సవానికి వారిని ఆహ్వానించే నెపంతో ఆహ్వానం జారీ చేయవలసి ఉంది, అక్కడ వారిని హత్య చేయాలని అతను కుట్ర పన్నాడు. తన మేనల్లుళ్ల మరణం తరువాత, గోపాలకుల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, తనతో కలిసి పరిపాలించాలని కోరుకుంటున్నానని కంసుడు అక్రూరుడికి తెలియజేశాడు. విష్ణు భక్తుడిగా, అక్రూరుడు కృష్ణుడిని కలిసే అవకాశం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. గోకులానికి వచ్చిన తర్వాత, అతను కృష్ణుడిని మరియు అతని సోదరుడిని పశువుల మధ్య చూశాడు, కంసుడితో తనకున్న అనుబంధాన్ని వారు తృణీకరిస్తారా అని ఆశ్చర్యపోయాడు. అయితే, సోదరులు తమ మామను ఆతిథ్యంతో చూసుకున్నారు, మరియు అతను కంసుడి నిరంకుశత్వంలో వాసుదేవుడు, దేవకి మరియు ఉగ్రసేనుడి పట్ల జరిగిన దుర్వినియోగం గురించి మరియు అతను పంపబడటానికి గల కారణాన్ని వారికి చెప్పడం ప్రారంభించాడు. మరుసటి రోజు అక్రూరుడితో పాటు మధురకు వెళ్లడానికి సోదరులు అంగీకరించారు. కృష్ణుడు వ్రజ నుండి బయలుదేరినందుకు పాలపిట్టలు విలపించాయి, అక్రూరుడిని తమ నుండి తీసుకెళ్లినందుకు క్రూరంగా వ్యవహరించాయి. వారి ప్రయాణంలో, అక్రూరుడు యమునా నది నీటిలో స్నానం చేశాడు, అక్కడ బలరాముడు శేషుడిగా, కృష్ణుడు విష్ణువుగా కనిపించి, వారిని స్తుతించాడు. మధురకు చేరుకున్న అతను, ఆ సమయం నుండి వారు రాజ మార్గంలో నడవవలసి ఉంటుందని వారికి తెలియజేసి, తన రథంలో ఒంటరిగా ముందుకు సాగాడు.
స్యమంతక స్వాధీనత
శతధన్వుడు స్యమంతక అనే పురాణ రత్నాన్ని తనకు భద్రంగా ఇచ్చిన తర్వాత అక్రూరుడు పొందాడని హరివంశం పేర్కొంది. శతధన్వుడు ఆ రత్నం యొక్క మునుపటి యజమాని అయిన సత్రాజిత్తును చంపి, గతంలో దానిని పొందాలనే కోరికను వ్యక్తం చేసినందున, దానిని అక్రూరుడికి ఇచ్చాడు. అక్రూరుడు ఆ రత్నాన్ని తాను విడిచిపెట్టనని శతధన్వుడికి వాగ్దానం చేశాడు. కృష్ణుడు తనపై దాడి చేస్తే తన రక్షణ గురించి శతధన్వుడు అక్రూరుడికి హామీ ఇచ్చాడు. శతధన్వుడు కృష్ణుడి చేతిలో హతమైనప్పటికీ, అక్రూరుడు అక్రూర యజ్ఞం అనే గొప్ప యాగం ప్రారంభించాడు, అక్కడ అతను ఆ రత్నం నుండి అరవై వేల సంవత్సరాలు కొనసాగేంత ఆభరణాలు మరియు సంపదను అర్పించాడు. ఈ సంఘటనల గాలిని కృష్ణుడు గ్రహించి, ద్వారకలో అక్రూరుడు స్యమంతకను తనకు తిరిగి ఇవ్వాలని కోరుకున్నాడు. అక్రూరుడు స్యమంతకను, అలాగే తన సోదరి సుశీలను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సంతోషించిన కృష్ణుడు అక్రూరుడు ఆ రత్నాన్ని ఉంచుకోవడానికి అనుమతించాడు.
ధృతరాష్ట్రుడిని కలవడం
భాగవత పురాణంలో, కృష్ణుడు కురుల రాజు ధృతరాష్ట్రుడిని కలవడానికి, రాజు తన కుమారుడు దుర్యోధనుడిచే ప్రభావితమయ్యాడో లేదో తెలుసుకోవడానికి అక్రూరుడిని హస్తినాపురానికి పంపాడు. హస్తినాపురానికి చేరుకున్న అక్రూరుడు తన బంధువు కుంతిని కలిశాడు, ఆమె కృష్ణుడు ఇంకా ఆమెను గుర్తుంచుకున్నాడా అని కన్నీళ్లతో విచారించింది మరియు ఆమె దేవతలో మోక్షాన్ని కోరుకుందని అతనికి చెప్పింది. అక్రూరుడు కురు రాజును కలిసి, కౌరవుల పట్ల అతని పక్షపాతం గురించి, యుధిష్ఠిరుడిని సరైన రాజుగా ప్రతిష్టించడం కంటే సింహాసనాన్ని ఆక్రమించడంలో అతని ప్రవర్తన గురించి మాట్లాడాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని దేవుడిగా భావించినప్పటికీ, తన కుమారుల పట్ల పక్షపాతంతో ఉన్నానని అంగీకరించాడు. రాజు ఆలోచనలను సేకరించిన తరువాత, అక్రూరుడు కృష్ణుడికి తన సందర్శన గురించి తెలియజేయడానికి హస్తినాపురానికి బయలుదేరాడు.
ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే లేక విన్నవీ చదివినవీ .ఎందుకు రుష్యశృంగుడిని క్రూరునితో లింకు చేశానో ఇప్పుడు చెబుతా .ఈ రహస్యం భాగవతం దశమ స్కంధం లో ఉంది
శ్యమంతక మణి ని సాధించి తెచ్చి శ్రీ కృష్ణుడు ద్వారక చేరాడు .సత్రాజిత్తు కు మణి అప్పగించాడు .అన్నగారితో తమ్ముడి అంత్యక్రియలు జరిపించాడు కృష్ణుడు .ఈలోపే అక్రూరుడు ,కృతవర్మా ,ఇద్దరు శతధన్వుడి మరణ వార్త విని ,సత్రాజిత్తు తమల్ని చంపుతాడనే భయంతో ఎన్నో యోజనాల దూరం పారిపోయారు .అక్రూర మహాత్ముడు ద్వారకలో లేక పోవటం వలన ద్వారకలో వానలు కురవక విపరీతమైన క్షామం ఏర్పడి అనేక అనర్ధాలు కలిగాయి .ద్వారక ప్రజలు కరువు కాటకాలతో నానా అవస్థలు పడుతున్నారు .అప్పుడు ద్వారక వృద్ధులందరూ కలిసి తమలో తాము సంప్రదించుకొని శ్రీ కృష్ణుని దగ్గరకు వెళ్లి ‘’పరమాత్మా !ఒకప్పుడు కాశీ రాజు పాలించే కాశీ రాజ్యం లో వానలుకురవక క్షామం ఏర్పడింది.అప్పుడు కాశీ రాజు అక్రూరుని తండ్రి ‘’శ్వఫల్కుడు ‘’ను తీసుకొని వెళ్లి తనకూతురు ‘’ గాందిని’’ని ఇచ్చి పెళ్ళి చేసి తన దగ్గరే ఉంచుకొన్నాడు .శ్వఫల్కుని మహిమ వలన కాశీలో బాగా వర్షాలు .పంటలు పుష్కలంగా పండి క్షామం మటుమాయమైంది అతని కొడుకు అక్రూరుడు కూడా అంతటి మహిమ కలవాడే .ఆమహా తపస్వి మళ్లీ ద్వారకలో అడుగు పెడితేనే వానలు కురిసి సస్యశ్యామల౦ అవుతుంది .అతడిని వెంటనే రప్పించు .ప్రజల కష్టాలు తొలగించు ‘’ఆని ప్రాధేయ పడ్డారు .కృష్ణుడు తగిన పెద్దలను పంపించి అక్రూర మహాశయుని పిలిపించి గౌరవించాడు .వెంటనే విపరీత వర్షాలు కురిసి పాడి పంటలతో ద్వారక కళకళ లాడింది .కృష్ణుడు చేయలేక పోయిన పనిని అక్రూరుడు చేశాడు .
పెద్దలందరినీ పిలిపించి అక్రూరుడు జాగ్రత్త చేసిన ‘’శ్యమంతక మణి ‘’ని అందరికి చూపించి మళ్లీ అక్రూరునికే ఇచ్చేశాడు .ఈ కథ విన్నా చదివినా సకల సౌభాగ్యాలు కలుగుతాయని పరీక్షిన్మహారాజుకు శుక యోగీంద్రుడు చెప్పాడు .ఈ కధ ఎందుకో మనకు ప్రచారం లో లేదు.
మధుర జిల్లాలోని బృందావనంలో ఉన్న స్నాన ఘాట్‌లలో అక్రూర ఘాట్ ఒకటి. కృష్ణుడు మరియు బలరాముడు తమ విష్ణు మరియు శేష రూపాలను అక్రూరుడికి వెల్లడించారని నమ్ముతున్న ప్రదేశం ఇది. ఆది వరాహ పురాణం అక్రూర ఘాట్‌ను అన్ని పవిత్ర స్థలాలకు రాజుగా వివరిస్తుంది.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’భాగవత నవనీతం -దశమ స్కంధం ‘’ఆధారం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-25-ఉయ్యూరు
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరిమింగిన వెలగ పండు.6 వ భాగం.28.7.25.
డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.17 వ భాగం.28.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.50 వ భాగం.28.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.50 వ భాగం.28.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.56 వ భాగం.28.7.25.
‘’సృష్టికర్త ‘’శతక సృష్టికర్త మిత్రుడు శ్రీ తుమ్మోజు వారి శతకం ఆవిష్కరణ
నిన్న27-7-25-ఆదివారం సాయంత్రం విజయవాడ రామ్మోహన గ్రంధాలయం లో సృష్టికర్త శతకం ఆవిష్కరణ నా చేతులు మీదుగా జరిగింది . నేను చెప్పాలనుకొన్న మాటలు ,చెప్పినవి చెప్పాలనుకోన్నవి తెలియ జేస్తున్నాను .సభకు ముందు రామ్మోహన్ లైబ్రరీకి పుస్తకాలు చలపాక గారిద్వారా సరసభారతి పుస్తకాలు అంద జేశాము .అక్కడి లైబ్రేరియన్ గారిని శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు రాసిన ‘’త్యాగరాజు ఆత్మ విచారం ‘’పుస్తకం ఉంటే ప్రకాష్ గారికిస్తే దాన్ని ఫోటో స్టాట్ తీయించి నాకు పంపిస్తారని చెప్పాను .చూసి చెబుతామన్నారు .
‘’సభాధ్యక్షులు, అనేకానేక పురస్కార ‘’పూర్ణ సింధు’’ డాశ్రీ పూర్ణచందు గారు ,పుస్తకపరిచయకర్త తన చేతులమీదుగా ఎంతోమందికి డాక్టరేట్ ప్రదానం చేయించిన ‘’డాక్టరేట్ చక్రవర్తి’’ డా.గుమ్మా సాంబశివరావు గారు ,రామ్మోహన్ లైబ్రరీకి ఎన్నో వసతులు కల్పించి ఆధునిక సొబగులు సంతరిస్తున్న శ్రీ పొట్లూరి నరసింహారావుగారు ,సృష్టికర్త శతక సృష్టికర్త ఆప్తులు శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులుగారు,రమ్యభారతి సాహితీ వేదిక ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ,పుస్తక ప్రచురణ కూడా చేసిన ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి రమ్యభారతి సంపాదకులు ‘’సాహితీ చలమ,సాహిత్య ప్రకాశకులు’’ శ్రీ చలపాక ప్రకాష్ గారు ఈ సభా ప్రాంగణం లో ఉన్న అశేష సరస్వతీ మూర్తులకు వందనం .
సుమారు 35 సంవత్సరాల క్రితం ఈ సరస్వతీ నిలయం లో ఒక సాయం వేళ కరీం నగర్ కు చెందిన సాహితీ మూర్తి ,అచ్చంగా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి లా పద్యాలు గానం చేసే వారు, ఆయన్ను కరీం నగర్ కాలేజి ప్రిన్సిపాల్ గా ఆహ్వానించి తీసుకు వెళ్ళిన వారు శ్రీ జువ్వాడి గౌతమరావు గారు రామాయణ కల్ప వృక్షం లోని ముఖ్యఘట్టాలలోని పద్యాలను అత్యంత శ్రావ్యంగా ,రెండు గంటలు.పాటు గానం చేసి తన్మయం చెందించారు .ఆ సభలో విశాలాంధ్ర పత్రిక సంపాదకులు శ్రీ రాఘవాచారి గారుఆచార్య శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు మొదలైన వాళ్ళం ఉన్నాం .నేను హాయిని అనుభవిస్తూనే రాఘవాచారి తన్మయత్వాన్ని గమనిస్తున్నా..సభఅయ్యాక ఆయన్ను ‘సార్ ! మీరేమో కమ్యూనిస్ట్ పత్రిక సంపాదకులు ,కానీ విశ్వనాథ వారి పద్యాలకు అంతలా పరవశం చెందు తున్నారేమిటి ‘’?ఆని అడిగితె ఆయన నవ్వుతూ’’అది వృత్తీ ,ఇదీ ప్రవృత్తి ‘’ అన్నారు .అప్పటినుంచి నాకు ఆయన ఆప్తులైపోయారు బెజవాడలో ఎక్కడ సభల్లో కలిసినా పలకరించి మాట్లాడేవారు .గౌతమ రావు గారితో ‘’అయ్యా !మీరు కరీం నగర్లో మీ ఇంట్లో తరచుగా విశ్వనాథ వారి పద్యాలు గానం చేస్తారని తెలిసింది .ఈ సారి అలాంటి కార్యక్రమం ఉంటే తెలియజేస్తే వచ్చి ఆస్వాదిస్తా’’అన్నాను ఆయన చాలా సంతోషించి ఒక కార్యక్రమానికిఆహ్వానం పంపారు నేను వెళ్ళలేక పోయాను .
శతకకర్త శ్రీ రామ లక్ష్మణాచార్యులు గారితో నాకు సుమారు 35 ఏళ్లనుంచి పరిచయం ఉంది .ఉయ్యూరులో మా గురువు గారు శ్రీ లంకా బసవాచార్యులు గారు నేనూ ,వీరు పీసపాటి కోటేశ్వరరావు ,మునసబు కోటేశ్వర రావు మొదలైన వాళ్ళం కలిసి గురువు గారి ఆధ్వర్యం లో ‘’ఉయ్యూరుసాహితీ మండలి ‘’స్థాపించి ప్రతి నెలా మూడవ ఆదివారం సాహిత్య కార్యక్రమాలు సుమారు ముప్ఫై ఏళ్ళు నిర్వహించాం ..అందులో తుమ్మోజు వారి సాహిత్య ప్రసంగాలు అత్య౦త ఆహ్లాదంగా ఉండేవి .లోతులు ఎరిగిన పండితోత్తముడు ఆయన .ఉపాధ్యక్షులుగా కూడా పని చేశారు .ఆముక్తమాల్యదకలాపూర్ణోదయం ,మనుచరిత్ర ప్రస౦గాలు ఇప్పటికీ చెవుల్లో రంగు మంటూనే ఉంటాయి నేను కన్వీనర్ గాఉన్నాను .మూడో నాలుగో వ్రాతప్రతులు సంతరించాం .ప్రతి సంక్రాంతికి ఉగాదికి కవి సమ్మేళనాలు నిర్వహించేవాళ్ళం .కార్యక్రమాలు కొంతకాలం విష్ణ్వాలయం లో కొంతకాలం మా ఆంజనేయ దేవాలయం లో కొంతకాలం కాలేజి పచ్చికమీద మరికొంతకాలం హైస్కూల్ లోఆతర్వాత శాఖా గ్రంథాలయం లో జరిపెవాళ్ళం .తర్వాత నేను సరసభారతి ఏర్పాటు చేసి 16 సంవత్సరాలనుంచి నిర్వహిస్తున్నాను .మా ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి తుమ్మోజు వారు రావటం ,పద్యాలతో మత్తేక్కించటం జరిగేది .
మా శ్రీ సువర్చలా ఆంజనేయస్వామిపై మూడు శతకాలు ముగ్గురు కవులతో రాయి౦చాలను కొని మా ఆస్థాన కవులైన తుమ్మోజు వారు ఒకటి ,రెండోది శ్రీమతి ముదిగొండ సీతా రామమ్మ గారు , ,మూడోది డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారి సలహాపై అమలాపురంకవి మధురకవి శ్రీ మంకు శ్రీను గారి చేత రాయి౦చా౦ . .’’రాస్తే నాకేంటి ?”’ఆని కోట శ్రీనివాసరావు లాగా ఈ ముగ్గురు అనకపోవటం ఆశ్చర్యం .పుస్తకాలు మూడూ సరసభారతి తరఫున ముద్రించి శతకకర్తకు ఒక్కొరికి పది వేల రూపాయలు కానుక ,నూత్నపట్టు వస్త్రాలు దంపతులకు సమర్పించి ఒక మాఘ ఆదివారం మా గుడిలో జరిగే సామూహిక ఉచిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నాడు పొన్నూరు సంస్కృతకాలేజి రిటైర్ద్ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి చేత ఆవిష్కరి౦ప జేసి విందు కూడా ఇచ్చాం తుమ్మోజుదంపతులు వ్రతం లో పాల్గొన్న జ్ఞాపకం .మంకువారు భార్యాసమేతంగా వస్తే సీతారామమ్మగారు వారబ్బాయి అమ్మాయి అల్లుడు తొ వచ్చారు .తుమ్మోజు వారు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారు మెచ్చిన కవి శ్రేష్టులు .
ఇక ఈశతకం లో తుమ్మోజువారి అద్వితీయ ప్రతిభ ప్రతి పద్యంలో ద్యోతకమౌతుంది .వేద వేదాంగాల పురాణాల లో ని సారమంతా పద్యాలలో గుప్పించారు .సృష్టించేవాడు, వాడి శతకం కనుక సృష్టికి మగాడితోపాటు ఆడదీ అంటే వెలది అవసరం కనుక ఆటవెలదులతో ఆడుకొన్నారు తుమ్మోజీ .ఇదీ నాకు బాగా నచ్చింది’’’’విశ్వ సృష్టి కర్త విశ్వ కర్మ ‘’ మకుటం మకుటాయ మానంగా ఉన్నది . ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతాలన్నిటికి ఆధారం వేదాలు స్మృతులు పురాణాలే .ఈ విశ్వ కర్మ అంటే సృష్టికర్త కు కూడా అవే ఆధారాలు .యద్భావం తద్భవతి .విశ్వ కర్మ కు త్వష్ట అనే పేరున్నది . నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః.ప్రజాపతి విశ్వకర్మ మనసు .ఈశ్వరుడికి లాగా అయిడుముఖాలు .సృష్టికి పూర్వమే విశ్వకర్మ భగవాన్ తన సంకల్ప ప్రభావంతో అవతరించాడు .విశ్వకర్మాయే ప్రజాపతి బ్రహ్మ అన్నది కృష్ణ యజుర్వేదం .తూర్పు ముఖం సానగ మహర్షి ,దక్షిణముఖం సనాతన మహర్షి ,పశ్చిమాన ఆహభూన రుషి ,ఉత్తరాన బ్రత్నరుషి ,ఊర్ధ్వంలో సుపర్ణ ఋషులు ఉద్భవించారు విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మనుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన బ్రహ్మర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ బ్రహ్మర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్నస బ్రహ్మర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ బ్రహ్మర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినదివిశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం ఆని గురు పరంపర శ్లోకం ఉంది
ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 న భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు .విశ్వకర్మ సత్యయుగం లో దేవతలకు స్వర్గలోకం ,త్రేతాయుగం లో శివుడికోసం సువర్నలంక ,ద్వాపరం లో ద్వారకా నగరం కలియుగం లో హస్తినా పురం ఇంద్రప్రస్థం ,మయసభ నిర్మించాడు .
విశ్వకర్మ దేవాలయం బెజవాడలో లేడు కాని బందరులో శ్రీ పాండురంగస్వామి దేవాలయం లో ఉంది .అందులో పాలరాతి విగ్రహం ,ఆలయ నిర్మాత శ్రీ నరసింహదాసు విగ్రహం ఉన్నాయి .ఉగాండా దేశం లో ‘’జింజు ‘’అనే చోట విశ్వకర్మ ఆలయం ఉంది
సృష్టి సౌందర్యం అనిర్వాచ్యం .అన్నాడు జర్మనీ వేదా౦తి కవి దార్శనికుడు గోదే ..హెగెల్ ‘’The beauty of art is higher than the beauty of nature ‘’ఆని కళకు అత్యధిక ప్రాధాన్యమిచ్చాడు. కళా భారతి క్రీడా భారతి వంటిదే .భౌతిక ప్రయోజనం లేకపోయినా ,మానసిక ఉల్లాసం కలిగిస్తుంది .విన తగిన క్రీడ మాకు కావాలని దేవతలు బ్రహ్మను కోరితే ఆయన సమాహార కళ అయిన నాట్యన్ని వాళ్లకు ఇచ్చాడని భరత మహర్షి చెప్పాడు .Play is the art of child .Art is the play of man ‘’ఇంతటి ఉత్కృష్టమైన స్తుష్టి కళ ను సంకుచిత్వం స్వార్ధం దెబ్బతీస్తున్నాయి వీటన్నిటి నుంచి ముక్తినిచ్చేదే కళ .మనీషి అయిన మానవుడు మనస్వి కావాలంటే ‘’Beauty is the hand writing of God ఆని భావించి భద్రపరచుకోవాలి .సౌందర్య దేవతకు గుండెలో గుడికట్టుకోవాలి అన్నాడు ప్రఖ్యాత అమెరికన్ రచయిత తత్వవేత్త ఎమర్సన్ ..ఇంకో అడుగు ముందుకు వేసి సోక్రటీస్ ‘’What ever is beautiful is for the same reason GOD ‘’అన్నాడు .’’The course of nature is the art of GOD ‘’అన్నాడు యంగ్ .కనుక సృష్టి యే రూపంలో ఉన్నా దాన్ని ఆస్వాదించాలి అనుసరించాలి కాపాడాలి కాని ధ్వంసం చేయరాదు .ఆని సృష్టికర్త శతకం మనకు ఇచ్చే సందేశం .అందుకే ఆచార్య ఎస్వి జోగారావు గారు ‘’సౌందర్య,మాధుర్య సౌకుమార్యాల సాహిత్యమే లాలిత్యం ‘’అన్నారు ఈమటలన్నీ ఈ శతక సృష్టికర్త తుమ్మోజు వారికి సరిగ్గా సరిపోతాయి .నిన్నసభలో ఎవరో రామ లక్ష్మణాచార్యులు అంటే రాముడికి లక్ష్మణుడికి ఆచార్యుడైన విశ్వా మిత్రుడు అన్నారు ,విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడు .త్రిశంకుడికి భూమి ఆకాశాల మధ్య ఒక స్వర్గం నిర్మించాడు .గాయత్రి మంత్ర ద్రష్ట .కాని నేను రామ అంటే విగ్రహవాన్ ధర్మః .లక్ష్మణ అంటే ఆదిశేషుని అవతారం సకల విద్యలకు నిలయమైన వాడు .కనుక ధార్మిక ,విద్యా దులకుఆచార్యుడు అంటాను .
సరిగమలు
డా పూర్ణ చందు ‘’ఇక్కడే ఈ లైబ్రరి లోనే కృష్ణాజిల్లా రచయితల సంఘం మొదటి సమావేశం జరిగిందన ,ఇదే ఆసంఘానికి పురుడు పోసిన పుట్టినిల్లు అన్నారు .
సుమారు పది హేను రోజుల ముందరే తుమ్మోజు వారు బెజవాడ నుంచి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి ఆవిష్కరణ చేయాలని కోరి శతకం నాకు అంద జేసిన సౌజన్యశీలి .ఫోన్ లో చెబితే సరిపోయేదిగా అన్నా వినకుండా ఉయ్యూరు వచ్చారు .ఆ రోజే చదివేశాను .
మర్నాడే చెన్నై నుంచి నన్ను ‘’బాబాయి గారు ‘’ఆని గౌరవంగా పిలిచే శ్రీమతి శ్రీదేవి దంపతులు మా ఇంటికి వస్తే ఆశతకాన్ని నేనే ఆవిష్కరిస్తున్నాను ఆని చెప్పి దాన్ని వారికిచ్చేశాను. అంటే శతకం అప్పుడే మరో రాష్ట్రానికి పరచయం అయిందన్న మాట .
ఉయ్యూరు నుంచి నాతోపాటు సరసభారతి కార్యవర్గ సభ్యులు గబ్బిట రామనాధ బాబు ,శ్రీ గంగాధర రావు గార్లు వచ్చారు .మేము ముగ్గురం రామలక్ష్మణాచార్యులకు నూతన వస్త్రాలు ,నగదు కానుక అందించి ఆదంపతులకుశాలువా కప్పి సరసభారతి తరఫున సత్కరించాము .
ఆచార్య దంపతులు కూడా అతిధులకు అందరికి శాలువా ,విశ్వకర్మ ఫోటో అందించి సన్మానించారు .
మధ్యలో కమ్మని టీ,చివర అందరికి ఇడ్లీ గారే ఉప్మా స్వీట్ మూడు చట్నీలతో ఉపాహారం ఇచ్చి తృప్తి చెందించారు .అందులో కారం పొడి కర్నటక రుచి ,మా అమ్మగారు చేసే కారప్పొడి రుచి తలపిస్తూ మహా బాగా ఉంటే ఆయన్ను ఎక్కడనుంచి టిఫిన్లు ఆని అడిగితె ‘’అరటాకులో భోజనం ‘’అనే దగ్గరే ఉన్న హోటల్ నుంచి ఆని చెప్పారు .
అంతేకాక ‘’డబ్బు ఎందుకు ఇచ్చారండీ ‘’ఆని అడిగారు .మీరు మా ఆస్థానకవి కవికి సత్కారం అన్ని రకాలుగా జరగాలి అన్నాను నవ్వారు .
బెజ వాడ లో ఈ మధ్య ఇంత మందితో సాహిత్య సభ జరగలేదు .రికార్డ్ సంఖ్యలో సాహితీ మూర్తులు బందరు గుడివాడ బెజవాడ లనుంచి వచ్చి శాలువాలతో ముంచి ,మాటలతో అభినందించి తమ అభిమానం వర్షించి దిగ్విజయం చేశారు .హాట్స్ ఆఫ్ టు ఆడియెన్స్ .
పదనిసలు
సభ రాత్రి తొమ్మిదింటి దాకా సా—-గింది .
శతకం ముఖచిత్రం సృష్టి కర్త విశ్వ కర్మ ను తలపించేదిగా’’ డివైన్’’ గాలేదు హిరణ్యాక్షుడు గా ‘’డేమోనిష్ ‘’గా ఉంది .ఈ మాట సభా ముఖంగా చెబుదామనుకొన్నా కాని సభ్యత కాదని ఆగిపోయాను .కొంచెం జాగ్రత్త తీసుకొంటే మరింత సుందరంగా రమ్యంగా వచ్చి ఉండేది .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-25-ఉయ్యూరు .
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల.కరిమింగిన వెలగ పండు.5 వ భాగం.27.7.25.
డా.సీహెచ్.సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు _సమగ్ర పరిశీలన.16 వ భాగం.27.7.25. https://youtu.be/uWA2ET2VIaw