విజయ విలాసం 30వ భాగం.17.2.23.

విజయ విలాసం 30వ భాగం.17.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్ధం.22వ భాగం.17.2.23.

అరుణ మంత్రార్ధం.22వ భాగం.17.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ఇస్లాం -4

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ఇస్లాం -4

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -4

దౌలత్ పూర్ భంగపాటు తో నజ్రుల్ లో కవిత్వం వెల్లువై ప్రవహించింది .కొమిల్లాలో సేన్ గుప్త ఇంట్లో ఉన్న మూడు వారాలలో కవిత్వం పరవళ్ళు తొక్కింది .చిత్తరంజన్ దాస్ నాయకత్వం లో సహాయ నిరాకరణ ఉద్యమం బెంగాల్ అంతటా ముఖ్యం గా కొమిల్లాలో ఉద్ద్రుతమైంది .అప్పుడే ఆ ప్రేరణతో ‘’మరణ వరణ్’’-మృత్యువుకు ఆహ్వానం రాసి గొప్ప స్పూర్తి కల్గించాడు –అందులో మొదటి వాక్యం ’’మరణమా ఓ మరణమా రా రా ‘’జనాలను కుదిపేసింది .తర్వాత రాసిన ‘’పూర్వేర్ హవా ‘’-తూరుపుగాలి కవితా సంపుటి వెలువరించాడు .నాజూకుతో ఉన్న తియ్యని భావాలతో నిండిన కవిత్వం ఇది .సేన్ గుప్త కుటుంబం పిల్లల గురించి అద్భుత కవిత్వం రాశాడు –‘’ఎక్కడ నుంచి వచ్చారు మీరంతా –వజ్రహారం లా నా మెడను అల్లుకుపోయారు ‘’అంటాడు .’’స్నేహాతుర’’గేయ౦  కూడా ఆయన  హృదయం ఎంత విచారం తో కుమిలిపోతోందో ,తనకు స్నేహం ఎలా కావాలో ఆ ఇంటిని నడిపే మాత్రు మూర్తి ని గురించి చక్కగా  వర్ణించాడు .ఆమె తల్లిప్రేమ వాత్సల్యం తో శూన్యం అంతా తొలగిపోయి శక్తి వంతుడయ్యాడు .చనిపోయిన ఆమెచిన్న కూతురుపై హృదయం ద్రవించే కవిత రాశాడు .ఇవన్నీ బెంగాలీ పత్రికలో అచ్చు అయ్యాయి .

 1921 జులై లో తన జీవితం మళ్ళీ ప్రారంభించటానికి ,సాహిత్యం లో తన లక్ష్యాన్ని సాధించటానికి మళ్ళీ కలకత్తా వెళ్లాడు .సాహిత్య సంగీత గోష్టులతో ,పాత కచేరీలతో నిరంతరం సాగే ‘’అడ్డా ‘’లతో తాదాత్మ్యం చెందాడు నజ్రుల్ ..సత్యేంద్ర నాధుని గురించి రెండు కవితలు రాశాడు .సత్యేంద్ర కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు ఆయన స్థితి, బాధ నజ్రుల్ ను కదిలించి ‘’దిల్ దర్దీ’’-ప్రేమించే హృదయం అనే గొప్ప కవిత రాశాడు.  నిజాయితీకి పేరున్న సత్యేంద్ర ఈ కవితను చదివి విని ,ఆయనకు కృతజ్ఞత చెప్పటానికి నజ్రుల్ ఇంటికి వెడితే, ఆయన పని మీద బయటికి వెళ్ళటం తో కలుసుకోవటం కుదరలేదు .వారిద్దరూ మళ్ళీఎప్పుడూ కలుసుకోలేక పోయారు .నలభై ఏళ్లకే సత్యేంద్ర  24-6-1922 న చనిపోయాడు .ఈఇద్దరిలో  అకుంఠిట దేశ భక్తి ,పురోభి వృద్ధికరమైన సాంఘిక భావాలు ఉన్నాయి .టాగూర్ కూడా సత్యేంద్ర మరణం పై మంచి కవిత రాశాడు –‘’చురుకైన వాడు ,దీటైన వాడు ,ఉల్లాస వంతుడు  ,కళాధి దేవత గారాబు పుత్రుడు,దారి తప్పి ఈ గంగాతీరానికి వచ్చాడర్రా ‘’  …సత్యేంద్రుడు కవిగా, వ్యక్తిగా మహోన్నతుడు .

 కరాచీ కుట్ర కేసులో జైలుకెళ్ళి కఠిన శిక్ష అనుభ వించి వచ్చినవారిలో మొదటి వారు ఆలీ సోదరులు .దీనిపై స్పందించి నజ్రుల్ కలం మహా గీతం రాశాడు ,ప్రజల్లో పెల్లుబికే క్రోధాన్ని వ్యక్తీకరించాడు .అది ‘’స్వరాజ్య సంవత్సరం ;;.ఒక్క ఏడాదిలో స్వతంత్రం తెస్తానని గాంధీ అభయమిచ్చాడు .కనుక ఉద్యమం మహా వెల్లువగా సాగిపోతోంది .బ్రతిష్ వారు తమ బలం క్షీణించి పోతున్నట్లు గ్రహించారు .దిగులు, కలత లతో ఎలాగైనా ఉద్యమాన్ని నీరు కార్చాలని విశ్వ ప్రయత్నం చేస్తూ అత్యంత దారుణంగా కఠినంగా వ్యవహరించారు .కాంగ్రెస్ స్వయం సేవక సంఘం పై నిషేధం విధించారు .దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరింత పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు శాంతియుతంగా చేశారు .వేలాది పురుషులు నిర్బంధానికి గురయ్యారు .మొదటి ముగ్గురు మహిళా సత్యాగ్రహ దళానికి చిత్తరంజన్ దాస్ భార్య శ్రీమతి పీఆర్ దాస్ నాయకత్వం వహించింది .అది ఆదర్శమై దేశం లో అనేక చోట్ల మహిళా కార్యకర్తలు రంగంలోకి దూకారు .సత్యాగ్రహులతో పోలీస్ వాహనాలు నిండి పోయాయి .ఎవరూ ఆత్మరక్షణకు విడుదలకు అస్సలు ప్రయత్నమే చెయ్యలేదు .స్వచ్చందంగా శిక్షలు అనుభవించారు. జైళ్ళు ఖాళీ లేవు  కొత్త జైళ్ళు కట్టినా నిండి పోయాయి .పట్టుదలతో నిర్బంధించి వదిలేసేవారు ప్రభుత్వాధికారులు .నెహ్రు ,బోస్ లకు బాధల గురించిజ్ఞానోదయం మొదటిసారిగా ఇప్పుడే కలిగింది .స్వాతంత్ర్యం వచ్చే వరకు వీరు కారాగారానికి అనేక సార్లు వెళ్ళాల్సి వచ్చింది .బ్రిటీష జైళ్ళు అంటే భయమే పోయింది సత్యాగ్రహులందరికి .జైలు శిక్ష దేశ సేవకు చిహ్నంగా గౌరవంగా ,గర్వంగా భావించారు .నాయకులు సాహితీ వేత్తలు కవులు సామాన్యులు అందరికీ ఒకే రకమైన నైతిక ప్రభావం కలిగించింది .

  1921 డిసెంబర్ లో అహమ్మదాబాద్ లో  చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశం జరిగింది .ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకుల౦దర్నీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .యుక్తితో గాంధీని మాత్రం అరెస్ట్ చేయలేదు .ఆసభ దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకొన్నారు .కానీ అక్కడే ఉద్విగ్న వాతావరణం లో ప్రతినిధులు  కలుసుకొని ఒకరిక్కరు వీడ్కోలు చెప్పుకొన్నారు 1922జాతీయ పోరాట సంవత్సరం ఉదయమౌతుందని భావించారు .పన్నుల నిరాకరణ ,శాంతియుతం పోరాటం కోసం గాంధీ పిలుపు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు .

  1922జనవరిలో ఉత్తరప్రదేశ్ లోని చౌరీ చోరా లో తీవ్రమైన దౌర్జన్య కాండ జరిగింది .జనం అహింసా పాఠం ఇంకా నేర్చుకోలేదని కనుక ఉద్యమం ఆపండి ‘’అని గాంధీ సూచించటానికి మార్గం సుగమమైంది .ఫిబ్రవరిలో గుజరాత్ లోని బార్డోలి లో కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై  ఉద్యమాన్ని ఆపేసి ,నూలు వదకటం ,నేయటం గ్రామోద్ధరణ ,అస్పృశ్యతా నివారణ ,హిందూ ముస్లిం సమైక్యత వంటి  నిర్మాణాత్మక కార్యక్రమాలు చేబట్టాలని తీర్మానించారు .ఇది గాంధీ గారి పోరాటం లో మొదటి దశ .1930లో ఉప్పు సత్యాగ్రహ౦,శాసన ధిక్కారం కు  పిలుపు నిచ్చారు   ,ఇది  రెండవ దశ .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

అక్షరం లోక రక్షకం

  సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

 సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

 సాహితీ బంధువులకు శుభ కామనలు –సరసభారతి 172 వ  కార్యక్రమ0 గా శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలను ఉగాదికి మూడు రోజులు ముందుగా 19-3-23  ఆదివారం సాయంత్రం 4 గం . లకు  ఉయ్యూరు సెంటర్ కు  సమీపం లోని శివాలయం దగ్గర ఉన్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (CPI-M) ఆఫీస్ ఎ . సి . ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తోంది .

 ముఖ్య అతిధి –మాన్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ –శాసన సభ మాజీ ఉప సభాపతి  

గౌరవ అతిధి -శ్రీ వై.వీ.బీ . రాజేంద్ర ప్రసాద్ -శాసనమండలి మాజీ సభ్యులు

ఆత్మీయ అతిధులు –1-శ్రీ గుత్తికొండ సుబ్బారావు –అధ్యక్షులు ,కృష్ణాజిల్లా రచయితల సంఘం

2-శ్రీ చలపాక ప్రకాష్ –-ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ,రమ్యభారతి సంపాదకులు

,ప్రముఖ కవులచే ‘’శుభ కృత్ అనుభవాలతో శోభకృత్ కు స్వాగతం ‘’అనే అంశం పై కవి సమ్మేళనం జరుగుతుంది .అనుభవమున్న కవులతోపాటు ఉత్సాహ వంతులైన యువకవులకూ అవకాశం ఉంటుంది .  

నిర్వహణ -శ్రీ  కంది కొండ  రవి కిరణ్ -విజయవాడ

పాల్గొనే కవిమిత్రుల పేర్లు తరువాత తెలియజేస్తాము .

.శ్రీ శోభ కృత్ ఉగాది పురస్కారాలను   ఈ క్రింది లబ్ధ ప్రతిష్టులకు అంద జేయబడును .

జీవిత సాఫల్య పురస్కార ప్రదానం  

1-పద్మ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ – హరికథా పితామహ శ్రీ మజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు,నాటక శైలిలో  గంధర్వ గానం తో ,నృత్యంతో ,1500పైగా కథా గానం చేసి, ,స్వయంగా హరికథకులను ప్రోత్సహించి సన్మానించి ప్రోత్సహించిన వితరణ శీలి ,హరికథ కు తొలి పద్మశ్రీ  పురస్కారం పొందిన విద్వద్వరేణ్యులు-  గుంటూరు .

2-శ్రీ ఎస్ .కె.మిశ్రో –కొడుకు పుట్టాల ,పావలా నాటక ఫేం ,నవ్యభారతి కళామందిరం ,రసమయి సంస్థల స్థాపకులు ,రంగస్థల నటులు, దర్శకులు ,టివి,సినీ నటులు ,కళాసాగర్,కళాజగపతి ,నంది పురస్కార గ్రహీత ,విభిన్న వాచకం తో సుప్రసిద్ధులు –విశాఖ పట్టణం .

కీ.శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ దంపతుల స్మారక శోభకృత్ ఉగాది పురస్కారప్రదానం  

1-శ్రీ భండారు శ్రీనివాస రావు –సీనియర్ జర్నలిస్ట్ – హైదరాబాద్ 

2- శ్రీమతి  కోగంటి వెంకట రంగ నాయకి – రిటైర్డ్ ప్రిన్సిపాల్ , తిరుప్పావై అమృత వర్షిణి ,భాగవత చిలుక ,రామాయణ సుధానిధి బిరుదాంకితులు  –గుంటూరు

   శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతుల శోభ కృత్ ఉగాది పురస్కారప్రదానం  

1-శ్రీ పూలబాల వెంకట ప్రసాద్ –  భాగ్యనగరం లో బహుళ జాతి సంస్థలలో ‘’ఫ్రెంచ్ దుబాసీ ‘’,నాగార్జున యూనివర్సిటి అంతర్జాతీయ విద్యార్ధి కేంద్రం లో ఆంగ్ల ,ఫ్రెంచ్ భాషా బోధకులు ,విజయవాడలో ‘’ఈజీ ఫారిన్ లాంగ్వేజెస్’’ సంస్థ స్థాపకులు , అతి తక్కువ కాలం లో 200 వృత్త పద్యాలతో ’భరత వర్ష ‘’ ప్రబంధం రచించి ప్రపంచ రికార్డ్  నెల కొల్పిన  కవి పండితులు   -వణుకూరు-కృష్ణా జిల్లా.

2-శ్రీ చౌడూరి  నరసింహారావు –-విశ్రాంత సంస్కృతాంధ్రఉపన్యాసకులు ,కవి, రచయిత ,ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,ప్రతిభాశ్రీ బిరుదాంకితులు  – హైదరాబాద్ 

3 -షేక్ అబ్దుల్ హకీం జాని  -బాల సాహిత్య రచయిత ,సంపూర్ణ యాత్రా దర్శిని ,మనకవుల చసరిత్ర ,అద్భుత శక్తి ,నవభూమి అంబేద్కర్ జీవిత చరిత్ర ,మరియా మాంటిసోరి పుస్తకం తో  జాతీయ గుర్తింపు పొందిన గ్రంథ కర్త ,   తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన బహు పురస్కార గ్రహీత  -తెనాలి

4 -శ్రీమతి కరెడ్ల సుశీల- మహిళా సంక్షేమ ,సాంఘిక సేవా కార్య కర్త  –మచిలీ పట్నం .

 ఈ కార్యక్రమానికి  అతిధులను ,సాహితీ మిత్రులను,కవులను ,సాహిత్యాభిలాషులను  ఉగాది శుభా కాంక్షలతో  సాదరంగా ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ మనవి .

  మార్పు చేర్పులు,కవి సమ్మేళనం లో పాల్గొనే  కవిమిత్రుల పేర్ల తో ,పూర్తి వివరాలతో ఫిబ్రవరి నెలాఖరుకు ఆహ్వాన పత్రిక అందిస్తాము .

జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి

  గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు

 మాదిరాజు శివ లక్ష్మి – సరస భారతి కార్యదర్శి .

గబ్బిట వెంకట రమణ –సరసభారతి కోశాధికారి

తెలుగులో మాట్లాడటం మన జన్మహక్కు

.15-2-23.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అరుణ మంత్రార్ధం.21వ భాగం.16.2.23

అరుణ మంత్రార్ధం.21వ భాగం.16.2.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

విజయ విలాసం.29వ.భాగం.16.2.23.

విజయ విలాసం.29వ.భాగం.16.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహిళల చొరవే గ్రామాలకు శ్రీరామరక్ష

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -౩

పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -౩

1920 సెప్టెంబర్ కలకత్తా కాంగ్రెస్ సభలలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడి ,నజ్రుల్ భావాలకు దగ్గరగా ఉండి,బరీంద్ర కుమార్ ఘోష్ ,అవినాష భట్టాచార్య వంటి అండమాన్ విప్లవ వీరులతో ,నలినీ కాంత సర్కార్ వంటి సంగీతజ్నులతో ,ఇతర అతివాద విప్లవ వాదులతో నజ్రుల్ కు గొప్ప పరిచయమేర్పడింది .అతని నిష్కలంక హృదయం వారిని బాగా ఆకర్షించింది .బిజిలీ కి చెందిన సాహిత్య వర్గాలు అతన్ని అభిమానించాయి .ఇన్నాళ్ళకు ముస్లిం బెంగాలీలకు ఒక ప్రతిభా వంతుడు ,జాతీయ సమైక్యతకు అగ్రగామి లభించాడు .పాఠకులందరికి అతడు ఆరాధ్యమయ్యాడు .భారతి ,ఉపాసన పత్రికలూ కూడా అతని రచనలు ప్రచురించాయి .బరీన్ద్రుని బిజిలీ పత్రిక విశేషంగా ఆదరణ పొందింది .అందులో రష్యా గురించి సోవియట్ విప్లవం గురించి చర్చలు ఉండేవి .అతని పద్యాలు గద్యాలు పుంఖానుపుమ్ఖం గా ఆపత్రిక ప్రచురించి మాంచి ఉత్సాహమిచ్చింది .తనపాటలు రవీంద్రుని గీతాలు బాగా పాడి మెప్పించేవాడు .ఆయన కలకత్తా హిందువుల అందరికీ ప్రేమపాత్రు డయ్యాడు .జన సామాన్యం లో కలిసిపోయి పాడుతూ వారిని కదిలించేవాడు .టాగూర్ వర్గీయులు కూడా అతడిని గొప్పగానే సమాదరించే వారు .టాగూర్ తర్వాత సత్యేంద్ర నాద దత్త ,,మణిలాల్ గంగూలీ ,ప్రేమ కుమార్ అతర్ది ,కవిగా గాయకుడుగా ప్రసిద్దు డైన మోహిత లాల్ మజుందార్  లు అందరూ అభిమానించేవారు నజ్రుల్ ను .అందులో మోహిత్ లాల్  మజుందార్ కు నజ్రుల్ గొప్ప వరం అయ్యాడు .నజ్రుల్ శాలి ,శక్తివంతమైన శబ్ద ప్రయోగం ,అన్త్యానుప్రాస పై ఉన్న అధికారం పారశీ భాషా జ్ఞానం ఆశబ్దాలను ధారాళంగా వాడే విధానం చూసి బెంగాలీ కవిత్వానికి నూతల జవసత్వాలు కలిగిస్తాడని లాల్ నమ్మేవాడు .తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన లాల్ అంటే నజ్రుల్ కు అమిత గౌరవం  .1922లో తన యుగ కర్త్రుత్వు గేయం ”బిద్రోహి ”వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు .

  ఆడు నజ్రుల్ కు కలకత్తా లో కావలసింది పొట్ట పోసుకోవటానికి తగిన ఆర్ధికం.ముస్లిం పత్రికలూ రచయితలకు పారితోషికం ఇచ్చేవికావు .రామానంద చటర్జీ స్థాపించిన ””ప్రవాసి ”మాత్రం రచన కవిత లకు పదేసి రూపాయలు ఇచ్చేది.గద్య రచనకు పేజీకి మూడురూపాయలు ఇచ్చేది.శరత్ మాత్రం తన కలం బలం తో జీవితం గడిపే వాడు .ఆయన పేరు ప్రఖ్యాతులకు  అది బంగారుకాలం.భరత్ వర్ష అత్రికలో ఆయన రచనలకు ఆదాయం తక్కువే అని చెప్పాలి .మిగిలిన రచయితలూ గుమాస్తాగానో ,ప్లీడర్ లేక మేష్టర్ గా,జర్నలిస్ట్ గా  జీవితం గడుపుతూ రచనలు చేసేవారు .

  అదృష్ట వశాత్తు నజ్రుల్ కి జర్నలిజం ఆఫర్ వచ్చింది .ఆయన మిత్రుడు ముజఫర్ అహ్మద్ స్థానిక హైకోర్ట్ వకీల్, జాతీయ నాయకుడు అయిన ఎకే.ఫజులుల్ హక్ ను ఒప్పించి  ఒక దిన పత్రిక స్థాపించటానికి ప్రయత్నం చేశాడు.ముస్లిం జాతీయ వాదాన్ని సంఘటిత పరచటం ఆపత్రిక ఉద్దేశ్ష్యం .నజ్రుల్ ముజఫర్ ఇద్దరూ అనుభవం లేనివారే అయినా సంపాదకులై ”నవ యుగ్”పత్రిక ను 12 – 7-1920 న మొదటి పత్రిక ప్రచురించారు .ఆనాటి సాంఘిక జీవనం పై ఈ పత్రిక ప్రభావం బాగా పడింది .హాక్ గారి అనుమానాలు హుష్ కాకి అయ్యాయి .స్పష్టమైన బెంగాలీ శైలికి ,ప్రభావ వంతమైన రాజకీయ భావాలకు పత్రిక వేదిక అయి మంచి ప్రాచుర్యం పొంది పూర్తీ జాతీయ దినపత్రిక గా ప్రసిద్ధమైంది .స్వాతంత్ర పోరాటం లో సామాన్య వర్గమే ,చదువుకొన్న వారికంటే ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఈ పత్రిక రుజువు చేసింది .జనం గుండె చప్పుడు ను ప్రతిధ్వనిమ్పజేసి జనవాణికి నీరాజనాలిచ్చింది పత్రిక .నజ్రుల్ ఈ పత్రిక కు కొండ లా గోప్ప అండ అయ్యాడు .సంపాదకత్వ ప్రతిభా వార్తలను పసిగట్టే నేర్పు అతనికి పుష్కలం ఉన్నాయి .సంపాదకీయాలు శక్తివంతంగా సమతూకంగా ఉత్సాహ భరితంగా రాసేవాడు .పత్రిక కార్యాలయానికి దగ్గరగా ఉండటానికి ఇద్దరూ టర్నర్ స్ట్రీట్  కు మారారు .వీరిద్దరి గదులు సాహిత్య రాజకీయ చర్చా కేంద్రాలుగా విలసిల్లాయి .హిందూ ,ముస్లిం లు సమానంగా పత్రికను ఆదరించారు .సర్వ జనామోదం పొందిన పత్రికగా పేరు పొందింది .ఇదే పత్రిక కు శాపం అయింది  .పత్రికలో వచ్చే విషయాలు ప్రభుత్వానికి వ్యతిరేకం అని పోలీస్ నిఘా పెట్టారు .ప్రాధమిక ధరావత్ డబ్బు వెయ్యి రూపాయలు ప్రభుత్వం జప్తు చేసింది .రెండు వేలు కట్టమని ఒత్తిడి తెచ్చింది .ఎలాగో అలా తెచ్చికడితే దాన్నీ జప్తు చేశారు .పెద్దాయన ఫజ్లుల్ హాక్ నిర్లిప్తంగా ఉండేవాడు .నిజాయితీ పరుడైన ఆయన జాతీయ రాజకీయాలలో కలిసి నడవ లేక పోయాడు .నవయుగం ప్రారంభమై సహాయ నిరాకరణ ఉద్యమం తీవ్రమై స్కూళ్ళు కాలేజీలు బహిష్కరించమని కలకత్తా కాంగ్రెస్ తీర్మానం చేసింది .డబ్బు సేకరణకోసం కొంతకాలం పత్రిక ను ఆపేశారు సంపాదక ద్వయం .వీరిద్దరిని హక్ తన ఇంటికి ఆహ్వానించి చర్చలు జరిపాడు కానీ రాజకీయంగా అభిప్రాయ భేదం ఉండటం తో పత్రికను మళ్ళీ ప్రారంభించారు కానీ డిసెంబర్ లో నజ్రుల్ హఠాత్తుగా పత్రికను వదిలేశాడు .కొంతకాలానికి ముజఫర్ కూడా కాడి పారేశాడు .

  విశ్రాంతికి సాహిత్యరచనలకు వీలుగా ఉంటుందని నజ్రుల్ కలకత్తా వదిలి దేవ ఘర్ చేరాడు .అక్కడ ముస్లిం భారత్ పత్రిక ఆయనకు నెలనెలా వంద రూపాయలు ఇచ్చేట్లు దానికి తగిన రచనలు పంపెట్లు అంగీకారం కుదిరినా అది ఫలించలేదు .ఆయన ఇక్కడ అపరిచితుడు కనుక ఎవ్వరూ అతనికి డబ్బు సాయం చేయలేదు .ఒకటి రెండు గేయాలు మాత్రమె రాయగలిగాడు .రెండు నెలల తర్వాత కలకత్తాకు పీచే మూడ్ అయి నవయుగ్ లో మళ్ళీ కొంతకాలం పనిచేశాడు .1920 -21వరకు ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం యేర్పడ లేదు. 

  నవయుగ్ లో మానేశాక నజ్రుల్ కి బాలసాహిత్యం ముద్రించే ఆలి అక్బర్ ఖాన్ మిత్రుడై అతనితో ”లీచూ దొంగ ”కవిత రాయించి తనతో తూర్పు బెంగాల్ తిప్పెరాజిల్లా దౌలత్ పూర్ కు తీసుకు వెళ్లాడు .దారిలో కొమిల్లాలో నాలుగురోజులు ఇంద్ర సేన గుప్తా ఇంట్లో ఆతిధ్యం పొందారు .నజ్రుల్ కు ఘనస్వాగతమే లభించింది .గుప్తా భార్య విరాజ్ సుందరీ దేవి మాత్రు వాత్సల్యం చూపి ఆదరించింది .ఆమెను నజ్రుల్ ”అమ్మా ”అని ఆప్యాయంగా పిలిచే వాడు .ఆమె చెల్లెలు గిరిజాబాలను ”పిన్నమ్మా ”అని పిలిచేవాడు .వీరిద్దరిమధ్య స్నేహ పూర్వక సంబంధం ఉండేది .విధవ రాలైన ఈవిడ కూతురు 13 ఏళ్ళ ప్రమీలను  పెళ్లి చేసుకొన్నాడు నజ్రుల్ .స్నేహితులిద్దరూ దౌలత్ పూర్ వెళ్లారు .రెండు నెలలతర్వాత నజ్రుల్ ఆలీ విధవ చెల్లెలి కూతురు నర్గీస్ బేగం ను పెళ్లి చేసుకొంటున్నట్లు శుభలేఖ చూసి అతని మిత్రవర్గం అవాక్కై౦ది .కవులు ఇలా త్వరగా ప్రేమలో పడటం వదిలేయటం మరోమనువాడటం సహజమే .బేగం చదువుకోలేదు .పెళ్లి కి ఆలీ పెట్టిన షరతులకు నజ్రుల్ కుంగి పోయి వాటిని అంగీకరించక సంతకం పెట్టలేదు .కనుక ఈ పెళ్లి జరగలేదు .కోపం తోకోమిలాకు వెళ్లాడు .సేన్ గుప్తా కుటుంబం విచారం హృదయభారంతో మర్నాడు కొమిలాకు వచ్చింది .ఈ సంఘటనల వివరాలకు దాఖలాలు లేవు అంటాడు రచయిత.బేగం మనసు గాయపడి ఆలీకి ఎదురు చెప్పలేక కుములుతూ నజ్రుల్ కు అనేకజాబులు రాసింది .దేనికీ జవాబు ఈయన రాయలేదు .అందులో జులై 1937లోనజ్రుల్  రాసిన ఉత్తరం ఒక్కటే దొరికింది .అందులో ఆయనకు ఆమెతో పెళ్ళికి అంగీకరించినట్లు ఉంది.అదే తేదీన హెచ్ ఎం వి కంపెనీకి రికార్డ్ కోసం ఒక పాట రాశాడు .దానిభావం -పూలమాలతో ఎవరి మెడ ను అలంకరిద్దామనుకొన్నావో వారిని నీ మనస్సులో దాచుకోవటం ఎందుకు ?మరచిపో వారిని పూర్తిగా మరచిపో ”. 

  సశేషం 

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయ విలాసం 28వ భాగం.15.2.23.

విజయ విలాసం 28వ భాగం.15.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్ధం.20వ భాగం.15.2.23.

అరుణ మంత్రార్ధం.20వ భాగం.15.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహిళల చొరవే గ్రామాలకు శ్రీ రామ రక్ష

మహిళల చొరవే గ్రామాలకు శ్రీ రామ రక్ష
–అని నినదించి రుజువులతో,అనుభవాలతో రాసిన డా నాగులపల్లి భాస్కర రావు ..కృష్ణా జిల్లా ముదునూరు వాసి ఉద్యోగరీత్యా ఢిల్లీ లో ఉంటూ తన పుట్టిన ఊరిని కంటికి రెప్పగా కాపాడుకొంటూ అక్కడే ప్రపంచం లో ఎక్కడా లేని ”జీవిత చరిత్రల గ్రంధాలయం ”స్థాపించి ,దాని వార్షికోత్సవానికి మమ్మల్ని పిలిచి అక్కడి మహిళలు బాలబాలికలచేత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిమ్పజేసి ,మనసులో మనిషి ఏదైనా అనుకొంటే సాధించి చూపుతాడు అని రుజువు చేసి తాను పై శేర్ర్శికతో రాసిన పుస్తకాన్ని నాకు అందజేయగా ఇవాళే చదివి స్పందిస్తున్నాను .

  ఇందులో రావుగారు తనఉద్దేశ్యం,కలసిమెలసి ఉంటేగదా ఏదైనా సాధ్యం ,పిల్లలే గదా ముఖ్యం ,ముగ్గుల ప్రాధాన్యత ,లేచింది మహిళాలోకం ,మహిళా మహాత్యం చూపించినప్పుడే గదా ,మహిళా సాధికారత అంటే ,ముగ్గుల ముచ్చట్లు ,శుభ శూచకాలు ,గ్రామాభి వృద్ధి మహిళా వికాసం తోనే -అనే శీర్షికలో విషయ వివేచనం చేసి రచించారు ..వీటిలోని ముఖ్య విషయాలు మీ ముందు ఉంచుతున్నాను .

  రాష్ట్రాల్లో గ్రామాల్లో చెదురుమదురుగా మాత్రమె మహిళా నాయకత్వం కనిపిస్తోంది .హిమాచల్ ప్రదేశ లో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు అనే సంగతి మన మాటలలో కనబడక వినబడక పోవటం ఆశ్చర్యం .ఎన్నికలలో ఓట్లు వేసేది కూదాఎక్కువగా స్త్రీలే .ఒకప్పుడు దేవాలయాలు పలు కార్యక్రమాలకు నిలయాలుగా ఉండేవి .రెండేళ్లక్రితం తాను రాసిన పుస్తకం -”దిగ్రీన్ పజిల్” లో మనగాలి నీరు వాతావరణం  చెడిపోవటానికి కారణం మన సంస్కృతీ ,ఆచార వ్యవహారాలను మనం మర్చిపోవటమే కారణం  అని రాశానని గుర్తు చేశారు  .ధనుర్మాస కార్తీక మాస ఉత్సవాలు బాగా జరగటానికి ఇప్పుడు మహిళలు మొబైల్ ఫోన్ గ్రూప్ లు బాగా తోడ్పడుతున్నాయి .భగినీ హస్తభోజనం కోటి దీపోత్సవాలు ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో బాగా జరుపుతూ కులమతాలకు అతీతంగా వ్యవహరించటం గొప్ప ముందడుగు  1940లొనె  తమ ఊరిలో  అన్నికులాల వారు సహపంక్తి భోజనాలు చేయటం చారిత్రాత్మక సంఘటన అంటారు 

  సుందర లాల్ బహుగుణ ప్రారంభించిన వాతావరణ పరిరక్షణ చెట్లను నరక కుండా వాటిని కౌగిలించుకొనే ”చిప్కో ఉద్యమం జయప్రదం చేసింది మహిళలే దీనితోనే హిమాలయ ప్రాంత అరణ్యాలు  కాంట్రాక్టర్ల  కబంధ హస్తాలనుంచి రక్షించ బడ్డాయి .

   సంఘం లో తేడాలే అన్నిటికి మూలకారణం .న్యాయ వ్యవస్థలో ఇంకా స్త్రీలకూ అధిక ప్రాధాన్యం దక్కటం లేదు వివక్ష ఇంకా ఉంది వివాహానికి విడాకులకు భరణానికి ఉన్న చట్టాలను గ్రామాలలోని మహిళలకు అవగాహన కల్పించాలి .మనం నాటిందే మనకు ఫలితమిస్తుంది అనే సూక్తి నిజం ..టెన్నిస్ లో సింధు ,ప్రపంచంలో పెద్ద ఉద్యోగం అమెరికాలో సాధించిన ఇందిరా సూయీ వంటివారు సామాన్య కుటుంబాలనుంచి వచ్చిన వారే .

  ముదునూరు ముందు పధాన పురోగామించాతానికి కారణం అక్కడి మహిళా చైతన్యమే .మహిళలకోసం ఏర్పాటైన డ్వాక్రా గ్రూపులు అన్నీ కలిసి పని చేయకపోవటం విచారకరం .అందుకే చరిత్ర లైబ్రరీ స్థాపించి జీవిత చరిత్రలు చదివిస్తూ స్పూర్తి కలిగిస్తునన్నామన్నారు .తనగమనికలో విద్యాలయాలలో బాలికలే చదువులోనూ ,వ్యక్తం చేయటంలోనూ ,ప్రశ్నించటం లోకజ్ఞానం లోనూ ముందే ఉంటున్నారు .మహిళా సాధికారత చట్టం వచ్చినా అందులోని విషయాలు వారికి బోధ పరచే వారు తక్కువ .వారికి చక్కని అవగాహన కలిగిస్తే దాని ఫలితం ,ప్రభావం గణనీయంగా ఉంటుంది 

  ఇప్పుడు  అంతా ముగ్గుల పోటీ పెడుతున్నారు పత్రికలు సైతం .స్సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు ఇవాళ వీధి వీధినా ప్రత్యక్షమైగ్రామీణ శోభ పెంచుతున్నాయి ఇందులో స్త్రీల బాలికల క్రమ శిక్షణ కనిపిస్తుంది .ఇదే స్పూర్తి క్రిస్మస్ వగైరా పండుగలలో పాటించక పోవటం విచారకరం ..ఇవి అన్నిటికి అతీతంగా జరగాలి అప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది .సుమారు 70ఏళ్ళక్రితం ముడునూరులో మహిళలు విశాల దృక్పధంతో తమ కుటుంబాలవారు కాక అందరూ బాగుండాలి అనే తపన ఉండేది .తన నాయనమ్మ బాపమ్మ భర్త చనిపోయినా కుటుంబ బాధ్యత అంతా మీద వేసుకొని వ్యవసాయం విద్య లో కూడా పర్య వేక్షణ చేసి 104 వ ఏటకూడా ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు తానూ చేసుకొంటూ ,ఇంట్లో అందరూ ఉన్ననా సహాయం చేయగలిగి వున్నా ,ఎవ్వరికీ భారం కాకూడదు అనే లక్ష్యంతో జీవించింది అని గర్వంగా చెప్పారు .

  పాల ఉత్పత్తి దారుల సంఘం లో కూడా స్త్రీల ప్రాతినిధ్యం నామ మాత్రమె ..స్కూల్ కమిటీలలోనూ వారి స్థానం తక్కువే .రాజకీయాలలో మహిళలు నష్టపోతున్నారు .ప్రభుత్వాలు ఎన్ని ప్రణాలికలు ప్రయోజనాలు కల్పించినా స్థానికుల ప్రమేయం లేకపోతె  ఆశించిన ఫలితం ఒనగూడదు .మహిళలు ఎవరిపరిధిలో వారు ఎవరికీ వారు ,అందరూకలిసి ఉన్నఅవకాశాలను ఉపయోగించుకోవటమే మహిళా సాధికారత ..గ్రామాలలోని అంగన్ వాడీ బాల వాడీ ల విషయలో కూడా వారికి అవగాహన ఉండాలి .,ప్రమేయమూ ఉండాలి .తమ గ్రామం లో ఈ సారి ముగ్గులతోపాటు పతంగులు ఎగరవేయటమూ ఉత్సాహంగా జరిపించాలనే ఆలోచనలో రావు గారున్నారు .ఆయనకు అన్నివిధాల ఆయన అర్ధాంగి సహకరిస్తూ భర్త ఆశయాల ఫలితాలు రాబట్టటం లో శక్తి వంచన లేకుండా సహకరిస్తున్నారు . సంధ్య అనే టీచర్  సహకారం అడుగడుగునా కనిప్న్చింది నాకు .మహిళా చైతన్యం లేని గ్రామాల భవిష్యత్ భయ౦కరమే అని తేలుస్తూ పుస్తకం ముగించారు 

  ఇంతకీ ఈ పుస్తకం రాసిన భాస్కర రావు ఎవరు ?ముదునూరులో పుట్టి 6దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలకు దేశ నాయకులకు ,మంత్రిత్వ శాఖలకు సలహాదారులుగా ఉంటూ,సమాచార రంగం లో ప్రజా నాడి -వాణి వినిపిస్తూ ,ఆరంగం లో వైతాలికులుగా ప్రసిద్ధి చెంది ,ఎన్నో ఉపయోగమైన సాంఘిక చైత్నాన్ని కలిగించే పుస్తకాలు రాసి .ముదునూరులోనే చదివి ఇండియాలో రెండు ,అమెరికాలో రెండు యూని వర్సిటీ లలో ఉన్నత విద్య నేర్చి ,ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ,33 ఏళ్ళక్రితం BREADసంస్థ స్థాపించి ఎందరికకో  విద్యనేర్పి ,1500పైగా ఠశాలలో ప్రత్యెక గ్రంధాలయాల స్థాపనకు కారకులు ,ప్రేరకులు అయి CMS అనే ప్రముఖ సంస్థను స్థాపించి .ప్రస్తుతం  తండ్రి సీతారామయ్య గారి ఆశయాలకు అనుగుణంగా పుట్టిన ఊరు ముదునూరులో సర్వజన చైతన్యం కోసం పరితపిస్తూ కృషి చేస్తున్న జ్ఞాని .అలాంటి వారు రాసిన ఈ పుస్తకం  అందరికి కరదీపిక .

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -14-౨2-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయ విలాసం.27 వ భాగం.14.2.23.

విజయ విలాసం.27 వ భాగం.14.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్ధం.19వ భాగం.14.2.23.

అరుణ మంత్రార్ధం.19వ భాగం.14.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

విజయ విలాసం.26 వ భాగం.13.2.23.

విజయ విలాసం.26 వ భాగం.13.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్ధం.18వ భాగం.13.2.22.

అరుణ మంత్రార్ధం.18వ భాగం.13.2.22.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా విశ్వ నా (ద0 )ధ -7

కళా విశ్వ నా (ద0 )ధ -7

కళాతపస్వి సినిమాలంటే ఒక అరడజన్ సినిమాలనే ఎక్కువగా పేర్కొంటారు వీటితోనే ఆయన కళాతపస్వి అయ్యాడు . తపస్సుకు ఎవరికైనా కొంత నేపధ్యం ఉంటుంది . దాన్ని గూర్చి తెలుసుకొందాం .

 తేనె మనసులు సినిమా డైరెక్టర్ ఆదుర్తి అయినా ,ముఖ్యనటులకు శిక్షణ ఇచ్చింది ఈయనే . చిత్రీకరణలో కూడా సింహభాగం ఆయనదే . టైటిల్స్ లో పేరు పడింది ఆత్మగౌరవం తోనే . అదే ఆయన ఆత్మ గౌరవానికి కళా గౌరవానికి నాంది అని చెప్పాలి . శిష్యుడు విశ్వానికి దర్శకత్వం అప్పగిస్తానని ఊరించి ఊరించి ఈ సినిమా అప్పగించాడు గురువు ఆదుర్తి . అన్నపూర్ణా సంస్థలో కొంతకాలం పని చేయమని చెప్పి అక్కినేని ఇందులో ఆ అవకాశం రావటానికి కారకుడయ్యాడు . డాక్టర్ చక్రవర్తి కె డైరెక్టర్ ఛాన్స్ వచ్చినా ,తన అనుభవం పూర్తిగా చాలదని అనుమానించి ఆదుర్తికి అసోసియేట్ గానే అందులో పని చేశాడు . కధ చర్చాలలో పాల్గొన్నాడు . ఆత్మ గౌరవాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నప్పుడు ,స్థానిక నటులకు ,సాంకేతిక నిపుణులకు అవకాశమిచ్చి ప్రోత్సహించాడు . అంటే ప్రతిభ ఎక్కడున్నదో  అక్కడ వెతికి పట్టి తెచ్చాడు . రామప్ప  చెరువు  పరిసరాల్లో ,రామప్ప గుడి దగ్గర ,దిండి  ప్రాజెక్ట్ వద్ద ఉన్న అద్భుత లొకేషన్స్ ను కనులపందువుగా చిత్రీకరించాడు చిత్ర విజయానికి మరింత సాయమందిం చాడు . సినిమా విడుదలై అందరికీ  సంతృప్తి నచ్చని  విజయం పొంది తనకీకచ్చిన బాధ్యతకు నూరు శాతం సంతృప్తి పొంది నిర్మాతలకు సంస్థ కు  ఆనందం చేకూర్చి వారి ఆత్మ  గౌరవాన్నీ  పెంచేశాడు .ఉత్తమాకధా చిత్రంగా ,తృతీయ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం పొందింది ఈ సినిమా . దాశరధి రాసిన -ఒకపూ ల బాణం తగిలింది మదిలో -తొలిప్రేమ దీపం వెలిగింది మదిలో ‘’పాట  ఘంటసా లతోనూ ,అందెను నేడే జాబిల్లి -పాటను సోలోగాను సుశీల కమకమ్మగా పాడింది . రాన ని రాలేనని ఊరికే అంటావు ,రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు ?,పరువము పొంగే వేళలో పరదాలు ఎందుకో -చెంగున లేచి చేతులు చాచి  చెలియ నన్న0దు కో ‘’ సినారె పాటను ను ఘంటసాల సుశీల పాడితే ,ఆయనే రాసిన ‘’మారాజులోచ్చారు మహారాజులోచ్చారు మా ఇంటికొచ్చారు మా మంచి వారంట’’ సుశీల, వసంత పిల్లల ఉత్సాహం ఆనందం ,పర వళ్ళు తొక్కేట్లు పాడారు . శ్రీశ్రీ రాసిన -వలపులు విరిసే పూవులే కురిపించే తెనియలే ‘’పాట మాష్టారు సుశీల పాడి  తేనేలే కురిపించారు . ఈ పాటల చిత్రీకరణ పరమ ఆహ్లాదసంగా ఉంది .అక్కినేనిని మాంచి గెటప్ తో డ్రీమ్ బాయ్ గా చూపాడు దర్శకుడు . గీత  రచయితల, గానం చేసినగాయకుల ఆత్మ గౌరవ స్థాయి  బాగా పెంచగలిగాడు దర్శకుడు . సినిమా కధకు మూలం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారం. దీన్ని గొల్లపూడి భమిడి పాటి చిత్రిక పట్టి ‘’డైలాగూ లతో చొక్కాలతో’’ మరింత అందం తెచ్చి ,వాటి ఆత్మగౌరవం పెంచేశారు . రసా లూరే  స్వరరాజేశ్వరుని   సంగీతం ఊయలలూపించి  ,ఆనందపు డో ల లూగించి   చెవులు ,కళ్ళు  మరో వైపుకు తిప్పకుండా తెరకు అంటుకు పోయేట్లు చేసి వీటి ఆత్మ  గౌరవాన్నీ  అందలం ఎక్కించింది. కాంచన వాసంతి రాజశ్రీ ల అందాల మిరుమిట్లు యువకుల మతి చలించేట్లు  చేసి  గుండెల్లో నిండి పోయేట్లు చేసి  ఆత్మ  గౌరవ0   పెంచింది . ఒకరకంగా విజువల్ ఫీస్ట్ ఈ సినిమా . అందరి గౌరవం తార స్థాయికి పెంచేతలు చేశాడు దర్శకుడు విశ్వం  ఫోటోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉండటంతో ఆసినిమా అంత ఎత్తుకు ఎదిగి సక్సెస్ కు మంత్రం  అయింది .

  తర్వాత సినిమా ‘’అల్లుడు పట్టిన భరతం ‘’ఈయన దర్శకత్వంలో కృష్ణం రాజు ,జయసుధ ,రమాప్రభ నాగభూషణం నూతన ప్రసాద్ నటులు . జంధ్యాల మాటలు చెక్కితే చక్రవర్తి సంగీతం వినిపించాడు . ఈ సినిమాలో హీరో తో ముంత కింద పప్పు అమ్మించాడు విశ్వం . అత్తగారి గర్వం అణచటానికి రాజు పన్నిన మాయలు చేసిన చేష్ట లు కడుపుబ్బ నవ్విస్తాయి . డీ. వి . ఎస్ . రాజు నిర్మాత . ఈ సినిమాతోనే డీవీస్ ,విశ్వం కలిసి కొన్ని సీమాలు తీసి చేసి  సక్సెస్ తోపాటు ఫెయిల్యూర్ లు కూడా ఇచ్చారు . తారాగణం ఆడా మగా చాలామందే  ఉన్నారు . దాస్యం గోపాలకృష్ణ సినారె వేటూరి పాటలు రాశారు . ఒకమాదిరి సక్సెస్ పొంది ఉండచ్చు . హాస్యం పండింది పాటలు హుషారుగా ఉన్నాయి . ఎప్పుడు మొదలైందో వివాహ వ్యవస్థ అప్పటి నుంచి కోట్లాది మందిని కలుపుతున్నాయి అనే విశ్వం మాటలతో సినిమా మొదలవుతుంది . అహంకారం తో కన్నూ మిన్నూ కానక వివాహ బంధాన్ని వికచ్చిన్నం చేసుకో బోయిన ఒక యువతి కధ . తులసి ఒక చిన్న కుర్రాడి గా వేసి చండిక మొదలైన పరమగయ్యాళి  కధలను  నాగభూషణం అడిగితే రామాప్రభకు చెప్పి  నీతులు బోధిస్తుంది  . భర్త  నాగభూషణం అల్లుడు కృష్ణం రాజు లను రమాప్రభ  రౌడీలతో కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తేతే  భార్య జయసుధను తన ఇంటికి తీసుకు వెళ్ళి బ్రెయిన్ వాష్ చేస్తూ దారికి తెస్తాడు హీరో .’’మనసు పండిన మనువు పండే నమ్మా ‘’అనే రాజు పాడిన  పాట  హీరోయిన్ కు కనువిప్పు అవుతుంది  . చివరికి రౌడీలను ఉతి కే పనితో కృష్ణం రాజు అత్తగారి భరతం పట్టి ,భార్యను దారికి తెచ్చుకొని ,అత్తగారు భర్తకు రెండు చేతులతో  దండం  పెట్టటం తో శుభం కార్డ్ పడుతుంది . తులసి పాత్ర ఇందులో చాలా బాగా ఉపయోగపడింది ముందుకు సాగటానికి  . మంచీ   ,చెడ్డ ల మధ్య  పెంపకపు తప్పులో వచ్చే అనర్ధాలు దాని ఫలితాలు విప్పి చెప్పి కనువిప్పు కలిగించే సినిమా . చివర్లో ఫైటింగ్ కూడా ఉంటుంది . ప్రయోజనాత్మక చిత్రంగా విశ్వం దీన్ని తీర్చి దిద్ది  ఫలితం పొందాడు ఆ బానర్ కు, తనకు నిర్మాత రాజుగారికి హీరో రాజుకు ఎలి వేషన్  ఇచ్చాడు .   సశేషం

మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -12 -2 -23 -ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

అక్షరం లోక రక్షకం

  సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

 సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

 సాహితీ బంధువులకు శుభ కామనలు –సరసభారతి 172 వ  కార్యక్రమ0 గా శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలను ఉగాదికి మూడు రోజులు ముందుగా 19-3-23  ఆదివారం సాయంత్రం 4 గం . లకు  ఉయ్యూరు సెంటర్ కు  సమీపం లోని శివాలయం దగ్గర ఉన్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ  ఆఫీస్ ఎ . సి . ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తోంది .

శ్రీ వై.వీ.బీ . రాజేంద్ర ప్రసాద్ -శాసనమండలి మాజీ సభ్యులు

శ్రీ ఎస్ . ఎం . సుభాని -గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ  మాజీ అధికారి ,ఆంధ్రప్రదేశ్ తెలుగు రచయితల సంఘం ఉపకార్యదర్శి

 మొదలైన గౌరవ ముఖ్య అతిధులు పాల్గొంటారు.  .

ప్రముఖ కవులచే ‘’శుభ కృత్ అనుభవాలతో శోభకృత్ కు స్వాగతం ‘’అనే అంశం పై కవి సమ్మేళనం జరుగుతుంది .అనుభవమున్న కవులతోపాటు ఉత్సాహ వంతులైన యువకవులకూ అవకాశం ఉంటుంది .  

నిర్వహణ -శ్రీ  కంది కొండ  రవి కిరణ్ -విజయవాడ

పాల్గొనే కవిమిత్రుల పేర్లు తరువాత తెలియజేస్తాము .

.శ్రీ శోభ కృత్ ఉగాది పురస్కారాలను   ఈ క్రింది లబ్ధ ప్రతిష్టులకు అంద జేయబడును .

1-పద్మ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ – హరికథా పితామహ శ్రీ మజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు,నాటక శైలిలో  గ0ధర్వ గానం తో ,నృత్యంతో ,1500పైగా కథా గానం చేసి, ,స్వయంగా హరికథకులను ప్రోత్సహించి సన్మానించిన వారు ,హరికథ కు తొలి పద్మశ్రీ  పురస్కారం పొందిన విద్వద్వరేణ్యులు-  గుంటూరు .

2-శ్రీ ఎస్ .కె.మిశ్రో –కొడుకు పుట్టాల ,పావలా నాటక ఫేం ,నవ్యభారతి కళామందిరం ,రసమయి సంస్థల స్థాపకులు ,రంగస్థల నటులు, దర్శకులు ,టివి,సినీ నటులు ,కళాసాగర్,కళాజగపతి ,నంది పురస్కార గ్రహీత ,విభిన్న వాచకం తో సుప్రసిద్ధులు –విశాఖ పట్టణం .

3-శ్రీ భండారు శ్రీనివాస రావు –సీనియర్ జర్నలిస్ట్ – హైదరాబాద్ 

4-శ్రీ పూలబాల వెంకట ప్రసాద్ –  భాగ్యనగరం లో బహుళ జాతి సంస్థలలో ‘’ఫ్రెంచ్ దుబాసీ ‘’,నాగార్జున యూనివర్సిటి అంతర్జాతీయ విద్యార్ధి కేంద్రం లో ఆంగ్ల ,ఫ్రెంచ్ భాషా బోధకులు ,విజయవాడలో ‘’ఈజీ ఫారిన్ లాంగ్వేజెస్’’ సంస్థ స్థాపకులు , అతి తక్కువ కాలం లో 200 వృత్త పద్యాలతో ’భరత వర్ష ‘’ ప్రబంధం రచించి ప్రపంచ రికార్డ్  నెల కొల్పిన  కవి పండితులు   -వణుకూరు-కృష్ణా జిల్లా.

5-శ్రీ చౌడూరు నరసింహారావు –-విశ్రాంత సంస్కృతాంధ్ర ఉపన్యాసకులు ,కవి, రచయిత ,ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు – హైదరాబాద్ 

6  -షేక్ అబ్దుల్ హకీం జాని  -బాల సాహిత్య రచయిత ,సంపూర్ణ యాత్రా దర్శిని ,మనకవుల చసరిత్ర మొదలైన బహు గ్రంధ కర్త ,జ్నాన జ్యోతి పురస్కార గ్రహీత -తెనాలి

7 -శ్రీమతి కరెడ్ల సుశీల- మహిళా సంక్షేమ ,సాంఘిక సేవా కార్య కర్త  –మచిలీ పట్నం .

 ఈ కార్యక్రమానికి సాహితీ మిత్రులను,కవులను ,సాహిత్యాభిలాషులను  ఉగాది శుభా కాంక్షలతో  సాదరంగా ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ మనవి .

  పూర్తి వివరాలతో ఫిబ్రవరి నెలాఖరుకు ఆహ్వాన పత్రిక అందిస్తాము .

  గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు –ఉయ్యూరు -12 -2-23.

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.34 వ .చివరి భాగం.12.2.23.

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.34 వ .చివరి భాగం.12.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్ధం. 17వ భాగం.12.2.23.

అరుణ మంత్రార్ధం. 17వ భాగం.12.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా విశ్వ నా(ద )ధ దర్శనం-5

కళా విశ్వ నా(ద )ధ  దర్శనం-5 

విశ్వనాధ బాలు తీసిన శుభ సంకల్పం లో తెలివి తేటలకు చదువు అక్కర్లేదని నిరూపించాడు .ఆపద్బాన్ధవులు  లో స్వయం కృషి లో చిరంజీవి గ్లామర్ను డీ  గ్లామర్ చేసి అతని లోని సహజ నటనను వెలికి తీసాడు జంధ్యాల తో నటింప జేసి అతడిని   చిరంజీవిని చేసాడు .శుభోదయం లో సోమరి తనం యెంత అనర్ధ దాయకమో నిరూపించాడు యే చిత్రం లో నైన విలువలకు పట్టం  గట్టటమే కాని విలువల వలువల  ఊడ దీయ లేదు .రోజా రమణి దేవదాస్ కనకాలతో తీసిన.మరోసీత కధ  లో  దంపత్యానికి వున్న విలువ ఏమిటో చూపి మనల్ని దేవదాసుని కంగు తినిపించాడు .రోజా రమణి లోనినటనను  చాల . హుందాగా అద్భుతంగా ప్రదర్శింప చేశాడు .ఇలా ఏ సిన్మా తీసినా తన ముద్రను వేసాడు భారతీయ ఆత్మను సంస్కారాన్ని సంస్కృతిని కాపాడే వే తీసాడు తీసి రాష్ట్ర ,దేశ పరువును కాపాడటం కాకుండా మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని  ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన మహనీయ దర్శకుడు విశ్వ నాథ్

            విశ్వనాధ్ .  కు ఇవన్నీ ఎలా సాధ్యం అయాయి? అతను రచయితల్ని ఎంచుకొని వారి పాటవాన్ని గ్రహించి పనిచేయిన్చుకుంటాడు .పాటలు రాయటానికి వేటూరి మాటలకు జంధ్యాల గొప్ప సహకారం అందించారు సంగీతానికి మహా దేవన్  ఇలయ రాజాలు లయ స్వర  రాగాలతో రాగ రంజితం చేసారు .అన్ని పాటలు ఆణిముత్యాలేచిర స్మరణీయ  బాణీలే .అదొక స్వర సాగర సంగమం .అన్నట్లు విశ్వ నాధుని సాగర సంగమం ,సిరి వెన్నెల ను మరిచి పొతే చరిత్ర క్షమించదు . ఇన్ని సినిమాల్లో నాకు బాగా నచ్చి పరవశింప జేసింది మాత్రం సిరివెన్నెలే   పాటలు ,మాటలు భావాలు హృదయ ఆవిష్కరణలు ,సంస్కారం నన్ను పరవశింప జేసాయి .వుయ్యూరు లో ఆ సినిమా మూడు రోజులే ఆడింది రెండు రోజులు వరుసగా చూసాను ..

                    విశ్వ నాద్ సినిమా లో హాస్యం వింత పోకడలు పోతుంది సున్నితమైన సుతిమెత్తని సందర్భోచిత హాస్య0 

 చిప్పిల జేస్తాడు మొరటు రెండర్దాలుండవు .అమాయకతవారితో శుచిగా శుభ్రం గా వుంటుంది .చంద్ర మోహన్ సాక్షి రంగా రావు  శుభ లేఖ సుధాకర్ తులసి ఆయన సినిమాలలో హాస్యంతో జీవించి తరించారు నటీ నటుల ఎన్నిక విశ్వనాద్ ప్రత్యెక ద్రుష్టి .తో చేయటం గొప్ప గా వుంటుంది .అరుపులు రాద్ధాంతాలు నరాలు తెగే ఉత్కంఠ  వుండవు ప్రేక్షకులను క్రమం గా elivate  చేయటం విశ్వ నాద్ ప్రత్యేకత .ఆ వున్నత స్థితి నుంచి కిందికి దిగ టానికి ఇష్టం వుండదింక .వీటి నన్నిటిని మించి విస్వనాద్ చిత్రాలలో ఆర్ద్రత నిండి వుంటుంది .ప్రతి సన్నివేశంఆ అనుభూతి బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది  రసాత్మకం గా వుంటుంది  ఆనందంతో పరవశం కల్గుతుంది  తాదాత్మ్య స్థితి లో వుంటాం.ఆ ఆనందం బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది ఇదొక్కటే విశ్వనా ద  ను మిగిలిన darsakulanunchi వేరు చేసే అతి గొప్ప అనన్య సాధ్య మైన గుణం .భారతీయ ఆత్మను అన్ని కోణాల్లోనూ దర్శింప జేసిన దర్శక విశ్వ నాధుడు .నటింప జేయటం కాదు స్వయం గా నటించీ పాత్రలకు సార్ధకత చేకుర్చటం మరీప్రసంసించ దగిన విషయం .

 విస్వనాద్ బృండంశంకరాభారణ విజయోత్చ  వాలు చుదతానికిప్రతి ధియేటర్ కు వచ్చారు వుయ్యూరు సాయి మహల్లో ప్రదర్సన చూడ తానికివచ్చినపుడు  సోమయాజులు విశ్వనాద్ లకు shake హ్యాండ్ ఇచ్చిసినిమా బాగుందని చెబితే ఇద్దరు సంతోషించారు ఇది రెండవ సారి చూడటం  ఇంకముడవ సారి కృష్ణ జిల్లా పెదకల్లె పాలి లో వేటూరి గారింటిలో ఆయన్ను బాలును సబితను  దేవదాస్ దంపతుల్ని చూసా .శంకరాభరణం మీద నేను రాసిన notes స్వనాద్  వున్న డైరీ ని చూపివ్స్తే చదివి సంతోషం తో vi స్వనాద్ సంతకం చేసారు

  విశ్వనాద్ ,బాలు మా కుటుంబ  స్నేహితులు సీతం రాజు వెంకట రావు మల్లి  .తరచు కలుస్తారు వాళ్ళంతా  మల్లికాంబ దగ్గర బంధువులు తరచూ కలుస్తారు వాళ్ళంతా బాలుని కలిసినపుడు మేముమల్లి కాంబ  గారి స్నేహితులం అని చెప్తాం ;.

 ఇదీ కలా స్రష్ట విశ్వ నాధుని కీర్తి హారం లో ఒక చిన్న పువ్వు .

                    అమెరికా లో కాలిఫోర్నియా లో ఉంటున్న  మా మేనల్లుడు jay  వేలూరి నన్ను విశ్వనాద్ గురించి రాయమని అడిగితె ఇంతరాయాల్సి వచ్చింది .

      మీ 

                               దుర్గాప్రసాద్

“శంకరాభరణం“

నేపధ్య సంగీతం  :శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది.  బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రస స్ఫోరక కలభిజ్నత ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .శంకర శాస్త్రి   ని పరిచయం చేస్తూ ఆయన పడాల సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలభిజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే  కంటన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో సంకరభారణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాత ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం సంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విస్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్త ఫలాంసోమయాజుల నటన:ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి తీ వి ,గంభీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం సంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయే టట్లు జీవిన్చేట్లు నటించాడు కలెక్టర్ సోమయాజులు అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం నేపధ్యం గా సాయ పడింది అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుండా డ తనం అనితర సాధ్య మనిపించాడు అదో తపస్సు గా యోగ సమాధి గా నిర్వహించాడుఅసలు ఆ పాత్ర ఏమి చెప్పాడు .అంత మనం వుహించు కోవలసిందే .వుహ సామ్రాజ్యమే అంత. వ్యంగ్య వైభవమే .”లోకేస్వరుడికి తప్ప లోకానికి భయపాద ను నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేస్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ  charector  ను విశ్లేషిస్తుంది తులసి రైల్ ఎక్కేటప్పుడు మైసూర్ లోపర  ప్రభావం జరిగినప్పుడు ఎక్కడ తొణకదు బెనకడు ఎవర్ని ఏమి ఆనాడు ,తులసి తాను హత్య చేసి వచ్చ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తోత్రుపడదు .తనాకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయిన విచారించాడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితె ఆ గంభీయం వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర వహిని గా ప్రవహిస్తుంటుంది .అది సంస్కర చేతనా అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు అన్దనిది అంటూ  న్తుబత్తనిది .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర అందించే సారంశం .సిష్టాచార  పరాయనుడైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత హాహిత్య మూర్తి .సంగీతానికి భాష భేదం లేదని ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic  గా ఒక కలెక్టర్ హుండా డ తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి కుఉతురువెన్న రాస్తుంటే ట్రుసజల  నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయినా హృదయం ,తేలిక పాడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన శిఖరారోహణ చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశం  .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవతా మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన అదే నటన అనిపించింది సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యుదయాడుచివరి సీన్ లో ”దొరకున ఇటువంటి సేవా ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత టకు ,నా నమోవాకాలు ఆ కలభిజ్ఞాతతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లా ప్లవితమై బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసు .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవద ధారించర,విని తరించార ”అని అనిపించినా పాత్ర అది .తెలూ చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విస్వనాద్ కళా విస్వనాద్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా  విస్వనాద్ సృష్టికర్తగా కళా నీరజనలన్డుకున్నారు ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందిందిమంజు భార్గవి :నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతునో తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి నా మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుండనిఎవారు ఊహించలేదు .ప్రెసిడెంట్ పెపేరమ్మ రంమలో కాసేపే నాట్యం చేసిన బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విస్వనాద్ చేతిలో మనోజ్ఞా మనోహర శి ల్పముర్తి గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .వున్న చాల పొడుపు .అంత సా సత్వికభినయమే .వుహలోక సంచారం .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion  dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చ్హత అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించిందిజమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకాలు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు శం కర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట త గట్టి నపుడు ,తిట్టినపుడు ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ వ వార్నిన్చుకోవటం చాల కష్టం .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .సంకర శాస్త్రి రాగానికి తాను భావించిన ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్ర్లుగా దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలుపరమ మనోహరాలు సంకర శాస్త్రికి సన్మానం జరిగే తప్పుడు ఆమె కాళ్ళు కృతజ్ఞత భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మావుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది”బ్రోచే వారెవరురా ”పాట  పా డేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆననం తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంతృప్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శం కర శాస్త్రిని చూపిస్తూ చిరిగినా పంచె లోంచి flashback  లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత ఒప్పదో ఆమె చూపిన చ్పుతో అర్ధమవుతుంది అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె అత్మనండానికి ప్రతీక .జమీ0 దారును   హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆరా ధనాకృతి  గా నిలబడాలన్న తపన అది .తనములం గా సంకరశాస్త్రికి  సశ్రికి మరింకే కళంకం రాకూడదనే ఆరాటం ఒక ముఉగగా ముగా వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose  చేసిన కళా తపస్వి విస్వనాద్ పరిశీలన దృష్టికిహట్స్ ఆఫ్అల్లు రామ లింగయ్య :శివుని హృదయం మాధవునికి మాధవుని మనసు శంకరుడికి తెలుసు సృష్టి లో తీయనిది స్నేహం అది యెంత విషమ పరిస్థితులలో అయిన పరిక్షలకు తట్టు కొని nilabadu తుంది .ఆ స్నేహ బంధం పవ్త్ర మయినపుడు వీడదు .వాడదు డు సంకర మాధవులు దేవత స్వరూపులుగా స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా సంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్ర దరికి కూడా గర్వ కారణం .అల్లు  రామలింగయ్య లోని కళా జీవి ధన్యుదయాడు ”వాడెంత ?నేనూ గట్టిగ కన్నీర్ర జేస్తే గడగడ లాడ్తాడు ”ఐ శాస్త్రి లేనప్పుడు డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కాళ్ళు నెలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్క పోతాడు .ఇలా యెంత చెప్పిన తరగనిగని  ఘని  శంకరాభరణం . చూసి  పులకిన్చాల్సిదే చెప్పి మెప్పించలేము.మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03 99  న స్వర్గీయ వేటూరి కృష్ణ జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకల్లె పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నా చూపించాను చదివి బాగుంది అని నా పుస్తకం లో కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం

  శంకరాభరణం సినిమాపై తెలుగు హెడ్ ఆఫ్ ది  డిపార్ట్ మెంట్ ఆచార్య పేరాల భారత శర్మగారు గొప్ప ధీసీస్ రాశారని పేపర్ లో చదివాను . కానీ నేను చదవలేదు . అలాగే శ్రీ చాగంటి కోటేశ్వరరావ్ గారు ఈ సినిమాపై మూడు రోజులు దృశ్య మాధ్యమం లో ప్రసంగం చేయటం చిరస్మరణీయం ఆ చిత్రానికి ,కళా తపస్వి కి  దక్కిన అరుదైన గౌరవం యావత్ ఆంధ్ర మే  కాక భారత దేశమే కాక ప్రపంచంలో ఏ మూలలో ఉన్న తెలుగు వాడైనా కాలర్ ఎగేసి గర్వంగా చెప్పుకోగల విషయం . ఈ అదృష్టం ఏ సినిమాకి  దర్శకుడికీ దక్కలేదు. తెలుగు జాతికి తప్ప ఏజాతికీ  దక్కలేదు  . 

  మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -11 -2 -23 -ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

అరుణ మంత్రార్ధం.16వ భాగం. 11.2.23.

అరుణ మంత్రార్ధం.16వ భాగం. 11.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.33 వ.భాగం.11.2.23.

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.33 వ.భాగం.11.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.32వా భాగం.10.2.23.

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.32వా భాగం.10.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా విశ్వ నాథ దర్శనం -4విహంగ వీక్షణం లో విశ్వనా( దం)థ్-2

కళా విశ్వ నాథ దర్శనం -4విహంగ వీక్షణం లో విశ్వనా( దం)థ్-2

విహంగ వీక్షణం లో విశ్వనా( దం)థ్-2

‘’ప్రతి ముగింపు సరి కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది .విశ్వ నాథుని పయనమూ అంతే .ఆయన ప్రతికథ మనల్ని మళ్ళీ తట్టి లేపుతుంది .ప్రతిపాటా ఆయన్ను మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తుంది .ఎన్ని సార్లు విన్నా మరో కొత్త అనుభూతి కలిగిస్తుంది .ప్రతిపాత్రా మనతోనే ఉండిపోతుంది .అందుకే కళ కే కాదు కళాకారుడికీ మరణం ఉండదు, రాదు .పదహారణాల తెలుగు దనాన్ని వెండి తెరకు పరిచయం చేసిన ఘనుడు .కళలను వర్షింప జేసిన ఘనుడు అంటే మేఘుడు కూడా .ఆయన శాశ్వత నిద్రలోకి 92ఏళ్ళ వయసులో ఫిబ్రవరి 3 న జారుకొన్నప్పటినుంచి మన హృదయాలు బరువెక్కాయి .కళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయి .మనసు ఆయన జ్ఞాపకాలలో ప్రయాణం చేసి కళా తృష్ణ ను మరోసారి గుర్తుచేసుకొని ,కొద్దిగా ఊరట పొందుతున్నాం ‘’

‘’విశ్వనాథ్ తో సినిమా చేయటానికి మద్రాస్ వెడతానంటే అంతటి క్రమ శిక్షణ గల దర్శకుని తో పని చేయటానికి వెడుతున్నందుకు తండ్రి ధర్మరాజు పంపారని కైమోడ్పు ఘటించాడు నిర్మాత చలసాని అశ్వినీ దత్ .’’మీ తెలుగు సినిమా గొప్పతనం ఏమిటి?’’అని ప్రపంచంలో ఎవరైనా నన్ను అడిగితె ‘’మాకు విశ్వనాథ్ ఉన్నారు’’ అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకొంటాం ‘’అన్నాడు రాజమౌళి .’’బాక్సాఫీస్ ,స్టార్స్ ,వ్యక్తులకన్నా సినీ పరిశ్రమ గొప్పది అని నేర్పిన మహానుభావుడు ‘’అన్నాడు నాని .’’ఆయన సినిమాల చివరలో కళ కొనసాగుతుంది ‘’అనే సందేశం ఉంటుంది .ఆయన మరణం కూడా అంతే ‘’అన్నాడు త్రివిక్రమ్ .’’ఆయన మరణ౦కూడా మహా  గొప్పది ‘’అంటాడు బ్రహ్మానందం .’’కళ అమరత్వాన్నిపూర్తిగా అర్ధం చేసుకొన్న మహానట ,దర్శకుడు ‘’అన్నాడు కమల్ .’’తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తికి పునాది వేసిన తొలి దర్శకుడు ‘’అన్నది రాధిక .’’ఆయనలో సంపూర్ణ నటుడు  ఉన్నాడు ‘’అంటాడు విక్రం .

  ఒక దశలో విశ్వనాథ్ కు అవార్డ్ లు రొటీన్ అయిపోయాయి .వీటికంటే ఒక టాక్సీ డ్రైవర్ శంకరాభరణం ను ఎనిమిది సార్లు చూశానని చెప్పినప్పుడు ,ఎందుకు నచ్చింది అని అడిగితె తనకు ఆసంగతి తెలీదని’’ సినిమా చూస్తుంటే గుడిలో కూర్చున్నట్లు ఉంటుంది సార్’’అన్న మాట తాను  అందుకొన్న అవార్డ్ లలో కెల్లా గొప్పది ‘’ఆన్నాడు విశ్వం..సాగర సంగమం కమల్ తో తీయాలనుకొన్నప్పుడు వయసుమించిన ముసలి పాత్ర కనుక చెయ్యను అంటే నిర్మాత ఏడిద’’ తీస్తే నీతోనే తీస్తాం లేకపోతె లేదు’’ అంటే అయిదు నెలలు త్రిప్పి అప్పుడు సరేఅని చేశాడు .నిర్మాత ఏడిద సీతాకోక సినిమాకు మొదట పెట్టిన పేరు సాగర సంగమం .ఆ పేరుతొ ఒకపాట కూడా చేశారు .కానీ తర్వాత సాగర సంగమం తీశామని ఆయన అన్నాడు .విలన్ అంటే విలనీ చూపక్కరలేదు .ఒక చిన్న పిల్లాడు తనకంటే బాగా పాడుతాడు అని తెలిసి ఈర్ష్య పొందటం విలనీ .తన భార్యను వదిలి మరో అమ్మాయితో తిరిగితే ,తన్ను పెంచిన సంగీతాన్ని నిర్లక్ష్యం చేస్తే అదీ విలనీయే ఆయన సినిమాల్లో .ఎంతగొప్ప మహానుభావులైనా జీవితాలలో చిన్న చిన్న తప్పులు చేస్తారు ,కొద్ది ఈర్షా ద్వేషాలు చూపిస్తాడు .వారే విలన్లు ఆయన సినిమాలలో .’’విలన్ క్రూరంగా ఉండక్కరలేదు.మనం చూపించేసద్గుణాలకు ఒక మెట్టు కింద ఉంటె చాలు ‘’అంటాడు కళాతపస్వి మంచివాళ్ల విలువల్నీ ,చెడ్డ వాళ్ళ విలువల్నీ కూడా కిందకు కాకుండా కాస్త ఎత్తుకు తీసుకు వెళ్ళిన మహా దర్శకుడు ఆయన.సిరి వెన్నెల లో వేశ్య మున్మున్ సేన్ ,తాను  సర్వదమన్ ను పూర్తిగా ప్రేమించినా ఆయనా తనను గుడ్డిగా ఆరాధించినా,కల్మషం లేని అతను తనను  పెళ్లి చేసుకోవటం అతనికి ద్రోహం చేయటమే అని అనేక ఉత్తుత్తి కారణాలు చెబుతూ నిరాకరిస్తుంది .అప్పుడు సీతారామ శాస్త్రి రాసిన పాట’’నా కన్నులు చూడని రూపం –గుడిలో దేవత ప్రతిరూపం ‘’అంటూ బెనర్జీ పాడతాడు .అందులో తానూ గుడ్డికనుక ఆమెను చూడలేను నువ్వు దేవతవి అని అర్ధం .అంతే అయితే గీత రచయిత, దర్శకుడు ఊరుకొంటారా?నీ చీకటి కోణం నేను చూడలేను . గుడిలో దేవతలకు వస్త్రాలు ఉండవు అలంకరణ చేస్తే తప్ప .కానీఅవి గొప్ప పవిత్రమైనవే కనుక ఆరాధిస్తాం .అనే మరోభావంకూడా ఉంటూ, ఆమెను ‘’స్విం సూట్’’ లో చూపించటం  దీనికి బలాన్నిస్తుంది .మహోన్నత ‘’సాహిత్యప్పాట ‘’రావటానికి కవిపాత్ర ఎంత ఉంటుందో, దర్శకుని పాత్రా అంతే ఉంటుంది’’ .

  ‘’వేదం అణువణువున నాదం ,నా పంచ ప్రాణాల నాట్య వినోదం ‘’పాట సాగర సంగమం లో వేటూరి రాస్తే,లయరాజా  ఇళయరాజా రెండుమూడు స్వరాలు కూరిస్తే తపస్వి అందులో వైరాగ్యం ,కళ రెండూ మేళవించి ఉన్న  ‘’హంసానంది ‘’రాగాన్నే ఎంపిక చేసి స్వరపరచి పాడించి రావాల్సిన ఎఫెక్ట్ తెప్పించుకొన్నాడు .సూత్రధారులు లో విజిగ శాంతి పల్లెటూరిపిల్ల –‘’అట్టా సూడమాకయ్యా’’అనే ఊతపదం ఆమెకు సహజం .ఆసహజత్వానికి మరింత సహజత్వం ఉట్టిపడాలని గడ్డం కింద పుట్టు మచ్చ పెట్టించాడు విశ్వం .గడ్డం కింద పుట్టు మచ్చ ఉంటె ఆస్త్రీకి సంతానం కలగదు అని సాముద్రిక శాస్త్రం లో ఉందట .ఈవిషయం తెలుసుకొన్న దర్శకుడు అలా నల్లమచ్చ పెట్టించి శాస్త్రానికి న్యాయం చేశాడు. నిజానికి ఆ సినిమాలో ఆమెకు సంతానం లేదు .ఇండియన్ డాన్స్ అనే డాన్స్ ను సృష్టించాలి అనే తపన ఉన్న యువ కుడి సినిమా తీయాలనుకొని హీరో కావటానికి ముందు కమల్ డాన్స్ అసిస్టెంట్ గా పని చేశాడని తెలిసి అతన్ని ఒప్పించి ఆపాత్ర చేయించాడు సాగరసంగమం లో .అది స్వరసాహిత్య నాట్య ,నటనా సంగమమే అయింది  .ఆయన సినిమాలలో రచయితలూ సంగీత కర్తలు గీతకర్తలు అత్యుత్తమ ప్రతిభను చూపారు .అది ఆయనేకాక వారికీ గర్వకారణం .ఇలా జరగాలంటే దర్శకుడికి తనకు ఏమి కావాలో తెలియాలి ,అన్ని రంగాల్లో ప్రవేశం ఉండాలి .తనకు కావాల్సింది స్పష్టంగా హృద్యంగా చెప్పే నేర్పు౦డాలి .తనకు కావాల్సింది వచ్చేదాకా వదలి పెట్టనంత ఓర్పూ నేర్పూ కూడా ఉండాలి .ఇవన్నీ కళాతపస్విలో ఉన్నాయి. కనుకనే ఆయన సినిమాలు కళాకావ్యాలయ్యాయి.దృశ్య ప్రబంధాలయ్యాయి .చరిత్రలో నిలచిపోయాయి .రామాయణ భాగవతాలను పారాయణం చేసినట్లు నిత్యం చూడాలనిపిస్తాయి పవిత్రత కలిగిస్తాయి మానసిక ఆనందాన్ని నింపేస్తాయి .’’అజరామర మైన సంగీతాన్ని మనలాంటి తుచ్ఛులు  బ్రతికి౦చక్కర్లేదు ‘’అని రాజ శేఖర్ శ్రుతిలయలు లో జయలలితతో అంటాడు. రచయిత ఆకెళ్ళ రాశాడు .రాజ శేఖర్ మనసులో తాను ఎంతపతనం చెందాడో తెలియజేసే ,తన మనో వేదన చెప్పే మాట ‘’మన లాంటి తుచ్ఛులు ‘’దీనికి దర్శకుడు బ్రీఫింగ్ ఇవ్వబట్టే ఆడైలాగ్ ,పురుడుపోసుకొని ,పండింది .

  గుంటూరు జిల్లా పెదపులివర్రులో –అంటే వ్యాఘ్రపురం లో పుట్టిన కాశీనాథుని విశ్వనాథ్ తండ్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు అక్కడి శ్రీ రాజ రాజ నరేంద్రుని దేవాలయంలో అర్చకులు .1930ఫిబ్రవరి 3న పుట్టిన ఈ శివభక్తుడు శివారాధకుడు అక్కడే నాల్గవ తరగతి వరకు చదివాడు .ఎప్పుడుస్వగ్రామం వచ్చినా ఆస్వామిని దర్శించి స్వయంగా పూజ చేయటం అలవాటు .ఆగ్రామమన్నా గ్రామస్తులన్నా ఆయనకు అమితమైన ప్రేమ .గుంటూరు ఏసీ కాలేజిలో విశ్వనాథ్ నందమూరి కి సీనియర్ .సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగం చేస్తూ రోజూ బెజవాడనుంచి గుంటూరు వెళ్ళేవాడు ఎన్టిఆర్ .ఇద్దరూ ఒకే రైలు ఎక్కేవారు .ఈరైలు పరిచయం తర్వాత సినీ పరిచయం గా మారి  ఆయన నటుడు ఈయన వాహినీ స్టూడియో సౌండ్ ఇంజనీర్ అయ్యారు .పాతపరిచయాలు కొనసాగించారు .రావు నటించినసినిమాలకు  నాథ్ దర్శకత్వం చేశాడు  ‘’  ఈవిషయాలన్నీ ఆంధ్రజ్యోతి లోనివే ..నేను మీకోసం అందించాను తేనెటీగ పుష్పాలపై వ్రాలి మకరందం సేకరించి తేనె పట్టులో దాచినట్లు .

 సూత్ర దారులు చిత్రం లో నాగేశ్వర రావు ,సుజాతల నట నా చాతుర్యాన్ని సంగీత పరం గా ,పల్లె టూళ్ళ డోలు సన్నాయి  లకు పవిత్రతను కల్పించి ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన జనానికి కల్గించాడు .’’ఏలేలో ఏలేలో ‘’అంటూ లంగా ఓణీ తో రమ్యకృష్ణ ముక్కుకు బేసరి పెట్టుకొని చిలిపిగా చలాకీగా  బావ ను ఆరాధించే మరదలుగా అత్యద్భుత నటన కనపరచింది .ఆమె ఉన్న ప్రతి సన్ని వేశమూ.రక్తికట్టింది .సుజాత తన కొడుకు కలెక్టర్ అయ్యాడని తెలిసి భర్తను  చాటుగా పిలిచి ‘’ఎంత గొప్ప కొడుకునిచ్చావయ్యా ‘’అంటూ,బుజాలపైన వాలిపోవటం  ఆనందం ఆమేదీ అతనిదేకాడు మనకూకలిగి కనులు చమరిస్తాయి .తండ్రితో ,మేనమామ రంగదాసు  మురళీ మోహన్ తో కలిసి  భాను  చందర్ సన్నాయి అద్భుతంగా వాయిస్తుంటే ,ఆ మహత్తర సన్నీ వేశం లో పులకి౦చి పోతాం  హరికధకురాలుయశోదమ్మ  కే .ఆర్. విజయ కు ఆలయ ధర్మకర్త కైకాల చేసిన అన్యాయం ,ఆమె ఆ అవమానం భరించలేక ,మానం పోయిన తాను  పరమ భాగవతోత్తముడైన భర్త అశోక్ కుమార్  కు  దూరమై హనుమద్దాసు దేవమ్మ కొడుకు తిరుమలదాసు ను చదివించి కలెక్టర్ ను చేసి అతడు ఆ వూరికి వచ్చి నీలకంఠం బతుకు బట్టబయలు చేసి ,అతడు ఆక్రమించిన భూములు పేదలకు పంచేసి నీతి నిజాయితీ నిబద్ధత కల కలెక్టర్ గా పేరు పొందుతాడు .గ్రామస్తులు కోపం తో రగిలిపోయి కైకాలను చంపటానికి బయల్దేరితే హనుమద్దాసు అడ్డు పడి శాంతింపజేసి కైకాలలో మార్పు తెప్పించి ,మంచి వాడిని చేసి అహింసకు పట్టాభిషేకం చేయించాడు కళాతపస్వి .మామ సంగీతం లో ‘’జోలాజోలా జోలమ్మ జోల ,నీలాకన్నుల్లో నిత్యమల్లె పూజోలా ‘’వాణీ జయరాం ,కొలిచీ నందుకు నిన్ను కోదండరామా –బాలు పాటలు హైలైట్ .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-23-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.30వ భాగం.8.2.23

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.30వ భాగం.8.2.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్ధం.15వ భాగం.8.2.23.

అరుణ మంత్రార్ధం.15వ భాగం.8.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా విశ్వ నాథ దర్శనం -3

కళా విశ్వ నాథ దర్శనం -3

విహంగ వీక్షణం లో విశ్వనాద్( నాదం)-1

‘’తోటి దర్శకులు వాణిజ్య పరమైనసినిమాలు తీస్తుంటే ,సాంఘిక దురాచారాలను విమర్శిస్తూ ,కళాత్మక విలువలతో చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ .డ్రీం సాంగ్స్ ,ఫారిన్ లోకేషన్స్ లేకుండా అచ్చమైన నేటివిటి తో ,మనసును తాకే,ఆర్ద్రత కలిగించే సన్ని వేశాలు ,పరిపక్వ ఆలోచనలు ,అంతరంగాల అడుగున నీటి చలమలను సృష్టించే కరుణరసం ,కంటికి ఇంపుగా ,వినసొంపైన పాటలతో ఆయన సినిమాలు తీశాడు అదే ఆయన సిద్ధాంతం ..చిత్రాలను తపస్సుగా భావించి రూపొందించాడు .స౦దేశం అంటారా అంతర్ వాహినిగా ,కొండొకచో బహిరంగా  చెప్పాడు .పాటల మాధుర్యం తో సినిమా స్థాయి పెంచాడు .పూర్వ వాగ్గేయకారుల కృతి ,కీర్తనలను విస్తృతంగా ఉపయోగించి ,వాటిని మరింత జనరంజకంగా ప్రజా బాహుళ్యం లోకి తెచ్చిన సినీ కృషీవలుడు .రాసింది అభినందించి అర్ధం చేసుకొనే లక్షణం ఉండటంతోనే  ఆయన సినిమాలలో మాటా,పాటా పండాయి .ఫలాని భావం రావాలి ఈ నా పల్లవులు ఇవి .వీటితో పాట చెయ్యండి అని గీత రచయితలకు మార్గదర్శనం చేసి మంచి కాదు ఉత్తమోత్తమ సాహిత్యం పాటలో ఉండటానికి పాటుపడిన పాటలపల్లికి బోయీ .’స్వరాభిషేకం ‘’లో ‘’కుడి కన్ను అదిరెను ‘’పాట తానె రాసినా టైటిల్స్ లో తన పేరు వేసుకోని సంస్కారం ఆయనది .తనలోని నటుడు ను శుభ సంకల్పంతో బయట పడేసి ఆశ్చర్యపరచాడు .తీసే ప్రతి సన్నివేశాన్ని తాను నటించి చూపి ఇలా వచ్చేట్లు ఇంకా బాగా వచ్చేట్లు చెయ౦డి  అని హుషారు గొల్పే తత్త్వం .తాను నటిస్తున్నప్పుడు తాను దర్శకుడు అనే భావాన్ని తీసి గట్టున పెట్టి దర్శకుడు చెప్పినట్లు నటించి మెప్పించాడు .దర్శకుడిగా ఆయన తీసుకొన్న పారితోషికం కంటే నటుడిగా తీసుకొన్నది చాలా ఎక్కువ .ఇందులోనూ విజయం సాధించాడు కరుణ శోక ,హాస్యలను సంగీత ,నృత్యాలతోపాటు సమర్ధంగా తీసి మెప్పించాడు .తన సినిమాల్లో ఫైట్ సీన్లు ఉంటె తాను  బయట ఉండి, కే ఎస్ ఆర్ దాస్ లాంటి వారితో తీయి౦ చేవాడు .ప్రతి సినిమాలో ప్రతిఫ్రేం సుసంపన్నంగా ,పవిత్రంగా ఉండటం ఆయన ప్రత్యేకత .సంగీత ప్రధాన చిత్రాల్లోనూసాహిత్యం శిఖరాదిరోహణమే చేసే ప్రయత్నమే చేశాడు .ప్రతిపదం ఆచి తూచి పడేట్లు జాగ్రత్త పడేవాడు .ప్రతిపాత్ర అత్యంత సహజం గా స్వీయ వ్యక్తిత్వంతో విరాజమానంగా ఉంటుంది .వాటిని చూస్తూ ప్రేక్షకుడు దృశ్యంలో లీనమైపోతాడు .పాత్రలు సంప్రదాయ బద్ధంగా వేష ధారణలో ఉన్నా ,వాటిని తీర్చి దిద్దటంలో ఆధునికత కొట్టవచ్చినట్లు ఉంటుంది .కళాతపస్వి కనుమూయటంతో ఒక దర్శక దిగ్గజం మనకు దూరమైంది.నటరాజ పాదాన తలవాల్చాడు ‘’ ‘’అన్న జ్యోతి ఎడిటర్ రాసింది అక్షర సత్యం .

 ‘’ విషనాగు శంకరుడికి ఆభరణమైనట్లు ఒక దుర్మార్గుడి దుస్చేష్టకు బలై కన్నకుమారుడిని సంగీత సరస్వతి శంకర శాస్త్రి సన్నిధికి చేర్చి ,ఆశంకరునికి తన కొడుకును ఆభరణంగా సమర్పించేదే శంకరాభరణం . ‘’ఆత్మాభిమానం విలువలు వివరిస్తూ ,వరకట్న దురాచారం పై సంధించిన వ్యంగ్యాస్త్రం ‘శుభలేఖ .కులానికంటే గుణా నికే ప్రాధా న్యత ఉండాలని చాటి చెప్పింది –సప్తపది .గంగిరెద్దులు ఆడించే ఇంట పుట్టి ,కలెక్టర్ అయి ,ఊరి పెద్ద అవినీతిని తెలివిగా కట్టడి చేసింది –సూత్రధారులు .కష్టపడే తత్త్వం ,మంచి గుణం ముందు, ఏరకమైన సిరీ సంపదా సాటి రాదు అన్నది –స్వయంకృషి .మనో నేత్రంతో స్వచ్చమైన ప్రేమను గుర్తించిన అందుని ,అతని వేణు నాదంతో కురరిసింది సిరివెన్నెల .అహం చీకట్లనుంచి గురువు ను జ్ఞానం వెలుగులోకి తెచ్చిన బాల మేధావి ప్రాణత్యాగం  స్వాతి కిరణం .తండ్రి ఆకాంక్షలు తన ఆశలమధ్య నలుగుతూ ,కలళాసక్తికల ఒక యువకుడి ప్రోత్సాహంతో నాట్యమయూరి గా వికసించే –స్వర్ణకమలం ,పాత పాట ను మరిచి ,పక్కదారిపట్టినతండ్రి ని కొడుకు ,తల్లి  దారిలోకి మళ్ళించి పలికి౦చి నవే  శ్రుతిలయలు ‘’’భరతమైన నాట్యం  బ్రతుకు నిత్య సత్యం .కల గురించి కలళాకారు డిగురించి తీసిన ఎవర్గ్రీన్ సినిమా  –అదే సాగర సంగమం .ప్రేమకు పెళ్ళికి  అర్ధం తెలియదుకాని మనసుమాత్రం స్వాతిముత్యం అంత స్వచ్చం .కమల్ హసన్ సినీ కెరీర్ లో ఇంతటి అమాయక మనసున్న పాత్ర లేనేలేదు .కష్టమైనా బాగా ఇష్టపడి చేశాడు ’అందుకే ఆయన ‘’కళా తపస్వి ‘’అని నీరాజనం పట్టింది జ్యోతి .

‘’ఆయన ‘’ ఉచ్చ్వాసం కవనం ,ఆ నిశ్వాసం గానం ‘’ ఆయన శంకరాభరణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చిత్ర కళామతల్లి మెడలో నిత్య శంకరాభరణమే .మూస దొరణి,హీరోయిజ౦ మధ్య  నలిగిపోతున్నతెలుగు సినిమా తల్లి ఆక్రోశం తో   గొంతు చించుకొని ఏడుస్తుంటే బుజ్జగించి లాలిపాడటానికి వచ్చినవాడు కళతో లాలించిన వాడు ,పాలించినవాడు సినీకీర్తిని దశ దిశలా వ్యాపి౦ప  జేసినా వాడు  కళాతపస్వి .తెలుగు సినిమా అర్దాన్నిమార్చి ,కొత్త దారి రఅయినా కళాత్మక దారి పట్టించి సంగీత సాహిత్యాలకు అర్ధాలు అంతరార్ధాలు విలువల రుచి చూపించి కొడిగడుతున్న సంగీత నాట్యప్రభకు రెండు చేతులు అడ్డం పెట్టి దీపప్రభను పెంచి ఆకళలకు పునర్వైభవం కల్పించి కళల నాగలితో వెండితెరపై వినోదాల వ్యవసాయం చేసి పుష్కలమైన రాజనాల పంటలు పండించి  సన్మార్గంలో పయని౦చేట్లు చేసి అభివృద్ధి సాధించినవాడు .ఆయన సినిమాల్లో నవరస రసాయనం ఉంటుంది ఆయన హీరో దీరుడుకాడు కళాకారుడు అంతే.హీరోకు కండలు ఉండవు కళమాత్రమె అతడి కండా,అండా దండా .ఆయన హీరో ఫైట్లు చేయదడు.అమృత ధార కురిసినట్లు పాటలుపాడి మనోరంజనం చేస్తాడు .హీరో రోమాన్స్ సున్నితంగా గిలిగి౦తలుపెట్టేదిగా మాత్రమె ఉంటుంది .కళాతపస్వి సినిమా కల లాగా ఉంటూ కళ తో కళకళ లాడుతుంది .60ఏళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్,నాటకాలలో పండిన సోమయాజులు ను   వెండి తెరకు తెచ్చి ఉదాత్త పాత్ర శంకరశాస్త్రిగా మలిచి ,ఆపేరు ఇంటింటా మారు మొగెట్లు చేసి రెండేళ్లపాటు ఆ సినీ ఉత్సవాలు నభూతోగా జరిగాయంటే అదంతా న కళా ఇంద్రజాలకుడు విశ్వనాథ్ ప్రతిభా సర్వస్వమే  .మాస్ హీరో చిరును చెప్పులు కుట్టేవాడిగా చూపించి మెప్పించిన సాహసికుడు .ఆయన సినిమా చూడటం అంటే సంగీత కచేరీలో కూర్చున్న అనుభూతే ,కళ్ళు పక్కకు త్రిప్పనీయని పవిత్ర నాట్య అనుభూతే .గుడికి వెళ్లి పవిత్రంగా దేవుడి దర్శనం చేసుకొన్న దివ్యానుభవమే .అగరు ధూపాల ఘుమఘుమల నడుమ భగవద్గీతను  వీనుల విందుగా వినడమే ‘.

  విశ్వనాథ్ అంటే కళల మాటున మానవ సంబంధాల విలువలనుచాటే స్రష్ట .కళామతల్లి కాలిగజ్జెల సిరిసిరిమువ్వ ఆయన .వ్యాపార చీకట్ల లో ఉన్న సినిమాపై ‘’సిరి వెన్నెల ‘’చిందించిన  షోడశ కళా ప్రపూర్ణు డైన చందమామ .సాగర సంగమం లో పునీతుడైన స్వాతిముత్యం విశ్వం .ఆయన శిక్షణలో నటులైనవారు నంది పొందాల్సిందే .హీరోలను గోప్పనటులుగా మలిచిన కళా శిల్పి’’అంటూ జ్యోతి ఆయన గుణగణాలను కీర్తి శిఖరాలను మన ముందుంచింది .నేను మీ ముందుంచాను అంతే.ఆయన దృశ్యాలు అనంతాలు వేవేల రూపాలు .ఆ ‘’విశ్వ ‘’విద్యాలయంలో ఎందఱో విద్యార్ధులు స్నాతకోత్సవాలు జరుపుకొన్నారు .

 కమల్  సాగర సంగమం లో తనకు వచ్చిన ఢిల్లీ   ఇన్విటేషన్  చూసి ఆనందం తో ఏడుస్తుంటే   .’’ఏడుపులో ఆనందాన్ని కూడా రంగరించు ‘’అని సూచించి  నవ్వులో  ఏడుపు, ఏడుపు లో నవ్వు  మిళాయించి ఎవరూ ఊహించనంత గొప్పగా నటించి నటకమలం అనిపించాడు అవార్డ్ కూడా పొందాడు .తన నాట్యం లో కమల్ చూపిన భావాలు తప్పు అన్న కమల్ పై, కోపం తెచ్చుకొన్న జయప్రద కూతురు శైలజ చివరికి తల్లి మనోగతం అర్ధం చేసుకొని ,గురువుగా భావించి ‘’నటరాజు పాదాన తలవాల్చనా ,నయనాభి షేకాన తరియి౦చనా ‘’అంటూ అభినయించి అతడే నటరాజుగా భావించి నృత్యం చేస్తుంటే మెచ్చుకొని అకస్మాత్తుగా చనిపోయి నటరాజ పాదాల చెంతకు చేరతాడు .వీల్ చెయిర్ లో చనిపోయిన కమల్ ను స్నేహితుడు శరత్ బాబు విపరీతంగా వర్షం పడుతుంటే ,రెండుచేతులూ అడ్డం పెట్టగా జయప్రద వెనగ్గావచ్చి గొడుగుపడుతుంది .ఒక్క మాట కూడా లేని ఆసన్ని వేశం మనసులను రసార్డ్రీ భూతం చేస్తుంది .దీని వర్ణించటానికి మాటలు చాలవు అనుభవించి తరించాల్సిందే .

 శంకరాభరణం చివరి సన్నివేశం కూడా ఆర్ద్రతకు పరాకాష్ట ‘.దొరకునా ఇటువంటి సేవ ‘’పాటపాడుతూమధ్యలో దగ్గుపొరవచ్చి ఆగితే ,చిన్నారి తులసి అందుకొని పూర్తి చేస్తే ,ఆయన సేవాభాగ్యం దొరుకుతుందా అని అర్ధం వచ్చేట్లు పాడి పాదాలపై వాలిపోతే ,ప్రేమగా ఆలింగనం చేసుకొని  నుదుట బొట్టుపెట్టి కాలి గండ పెండేరం తీసి ఆబాలుడికి తొడిగితే ,వాడి రెండు చెంపల్నీ ఆర్ద్రంగా రెండు చేతులతో తడుముతూ ,తన సంగీతానికి వారసుడు దొరికాడని అజరామరమైంది సంగీతం అని తాను చెప్పిన మాట ఈ కుర్రాడు నిజం చేశాడని ఆన౦దాశ్రువులు రాలుస్తూ కన్నుమూస్తాడు శంకర శాస్త్రి .అప్పుడే దేఎని కంతటికీ కారణమై తెరపైన కనిపించకుండా వెనకనే నమస్కారాలు చేస్తూ పొంగిపోతున్న మంజు భార్గవి తనకొడుకు జీవితం ధన్యమైనదని భావించి తన గురువుపాదాలపై వాలి ప్రాణం విడుస్తుంది .సినిమా అయిపోయినా ,ఎవ్వరూ లేచి నిలబడక హృదయం నిండా ఆనందం ఆర్ద్రత పొంగి లేవలేక పోతాం.

 శ్రుతిలయలు లోకూడా చివరి సన్నివేశమూ ఆర్ద్రతకు శిఖరమే .చెడుమార్గం పట్టి తల్లికి దూరమైన తండ్రిని, తనమాట పాట తల్లి శిక్షణతో మంచి దారిపట్టించి తాను పాడే పాటలో చివర్లో ‘’మమతానురాగాల కల్ప తరువై,మంచి చెడ్డల నేర్పించు మొదటి గురువై –ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు –మాతృ పద్మములకిదే వందన౦ ‘’అన్నప్పుడు తండ్రి రాజ శేఖర్ భార్య సుమలతకు రెండు చేతులు జోడించి నమస్కరించటం ఊహించని విషయం .ఆషాక్ తో మనసు చమ్మగిలుతుంది కళ్ళనుండి ధారాపాతంగా ఆనంద బాష్పాల వర్షం కురుస్తుంది ఇలా ఈ మూడు సినిమాల చివరి సన్నివేశాలలో ఆర్ద్రత కు పట్టాభి షేకం చేశాడు కళాతపస్వి .’’  అన్న ఆంధ్రజ్యోతి కధనం ఆపత్రికకు కళలపట్ల ఉన్న నిబద్ధతకు,ఆరాధనకు  తార్కాణం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-7-2-23-ఉయ్యూరు  

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 29వ భాగం.7. 2.23.

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 29వ భాగం.7. 2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్ధం.14వ భాగం.7.2.23.

అరుణ మంత్రా ర్ధం.14వ భాగం.7.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా విశ్వ నాథ దర్శనం -2

కళా విశ్వ నాథ దర్శనం -2

ఇంతకీ స్వాతి కిరణం అని ఎందుకు పేరు పెట్టారు ?అని ఆలోచిస్తే సు+అతి-స్వాతి . అంటే మంచి ఎక్కువగా ఉండే లక్షణం స్వాతీ నక్షత్రం .ఈ నక్షత్రం లో పుట్టిన వారికి రాహు ప్రభావం తో కల్పనా శక్తి ,శుక్రప్రభావంతో కళా రంగం లో అద్వితీయ ప్రభావం ఉంటుంది .మేధా సంపన్నులుగా ఉండటం వీరి ప్రత్యేకత .అందుకని ఆనక్షత్ర కిరణప్రభావం వలన ఇందులోని గంగాధరం బాల మేధావి గా ఉండటం గురువుకు తట్టని స్వరాలను కూర్చటం జరిగింది . అందుకే ఆ పేరు పెట్టి ఉంటారని నా ఊహ . ఇంగ్లీష్ లో దీని సమానార్ధం -ఓడియస్ –odious-అంటే –ద్వేషం ,పగ ,డిస్గ్రేస్,స్ట్రాంగ్ డిస్లైక్,ఎవర్షన్,ఇంటెన్స్ డిస్ప్లెజర్ . ఇవీ మమ్మట్టి లక్షణాలు కనుక అవీ పేరులో ప్రతిబిమిస్తాయి .

ఈ సినిమాకు మాతృక ఇంగ్లీష్ సినిమా – Amadeus అని భావిస్తారు . Wolfgang Amadeus Mozart అనే ఆష్ట్రియా వియన్నా సంగీత దిగ్గజం కథ .మిలాస్ ఫార్మర్ దర్శకుడు .1984లో విడుదలయింది .మొజార్ట్ కు, ఇటాలియన్ సంగీతకారుడు ఆంటోనియో సల్లెరి కి మధ్య జరిగిన సంగీత స్పర్ధ ఆసినికా కథ.ఇందులోని కధాంశాన్ని మాత్రమె బేసిక్ గా తీసుకొని విశ్వనాథ్ తెలుగు వాతావరణానికి తగినట్లుగా కథనం చేశాడు అని పెద్దలంటారు .
కళాతపస్వి 30 ఏళ్ళ క్రితం తన తపస్సు ధారపోసి తీసిన ‘’సిరిమువ్వల సింహనాదం ‘’సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు అంటే అవాక్కై పోతాం .అయినా అది నిజంగా నిఝ౦.

ఇప్పుడు కళాతపస్వి మరో ఆణిముత్యం -శ్రుతి లయలు .చూద్దాం .మన వారసత్వాన్ని యెంత బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలో భవిష్యత్తరాలకు అందించాలో ఎరుకపరచిన విధానం ఒక జగద్గురువు బోధించినంత ఉత్తమం గా వుంది . సంగీత విద్వాంసు లైన అన్నదమ్ములు తండ్రికి మాటిచ్చి నిలుపుకోలేక ,వ్యసనాలకు ఒకడు పెళ్ళానికి ఒకడు .విదేశే వ్యామోహానికి ఒకడు బానిసలలైపోతే ,అందులో పెద్దవాడైన రాజ శేఖర్ భార్య సుమలత ఒక పిల్లాడిని కనీ ,తలిదండ్రులకు దూరమైనా ఆసోదరత్రయంలో ఆకుర్రాడి సంగీతం ఆధారంగా జ్ఞానోదయం కలిగించి ,కుటుంబాన్ని అంతటినీ మళ్ళీ కలిపి వారి చేత తండ్రికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోనేట్లు చేసి సంగీత ఆలయాన్ని నిర్మింప జేయటం ఇందులో విషయం, విశేషం .హరి ద్వారంలో షూటింగ్ అద్భుతం .సుమలత అచ్చమైన భారత మహిళగా ఇల్లాలుగా నెత్తిన చీరకప్పుకొని ఉత్తమా ఇల్లాలుగా దర్శన మిస్తుంది .ఆమెను చూస్తె ఆటోమాటిక్ గా రెండు చేతులు ఎత్తి నమస్కరించాలని పిస్తుంది ప్రతి సన్నీ వేశం లోనూ ఆమెను అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు విశ్వనాథ్ .ఆమె మాటలు హృదయపు లోతులను స్పర్శిస్తాయి ఆనంద బాష్పాలు కార్పిస్తాయి . సంగీతత్రయం తండ్రి వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు గా నవరస సార్వభౌమ కైకాల సత్యనారాయణ జీవించాడు .ఆపాత్ర ఉదాత్తత ను మాటలలో వర్ణించ లేం . నాయుడు గారి అర్ధాంగి గా అంజలీ దేవి,మెప్పిస్తే , మనవడుగా షణ్ముఖ శ్రీనివాస్ నటన ,నృత్యాలు గానం తో రాణించి ముచ్చెర్ల అరుణ హృదయాన్ని మాత్రమేకాక మన మనసుల్నీ దోచేశాడు .తండ్రి చెడు అలవాట్లను మాన్పించే అతని ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తూనే కథకు మలుపు లు అవటం వినోదంగా ఉంది . ఆటో డ్రైవర్ మిశ్రో ప్రసిద్ధ సంగీత విద్వా౦సు లందర్నీ తానె ప్రమోట్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ చివరికి దొరికిపోవటంలో మిశ్రో నటన ,వాచికం పండాయి .ఇందులోనే రిక్షా వాడిగా సాక్షి రంగారావు మంచితనం ,సుమలత తండ్రిగా వైజాగ్ ప్రసాద్ నటన ,అరుణ తండ్రిగా వంకాయల ,రాజ శేఖర్ ను వలలో వేసుకొన్న లేడీ గా జయలలిత అందరూ అందరే కళాతపస్వికి తగిన నటనా సహకారం చేసి చిత్రానికి నీరాజనం పట్టించారు .

పూర్ణ చందర్ ‘’శ్రీ గణ నాథం ‘’తో ప్రారంభమై ,శ్రీ శారదాంబ –కు జానకి ,ఆలోకయే శ్రీ బాల కృష్ణం కు మధుర వాణి జయరాం ,అన్నమయ్య గీతం ‘’ఇన్ని రాశుల యునికి ‘’కి బాలు- వాణీ గానం ,తెలవారలేదేమోస్వామి అంటూ జేసుదాస్ ఆతర్వాత సుశీల స్వామిని ఆర్తిగా లేపటం వీనులవిందు .ఈ సినిమాఉత్తమ చిత్రంగా నంది అవార్డ్ ను ,ఉత్తమ దర్శకుడుగానంది ,ఫిలిం ఫేర్ అవార్డ్ లు కళాతపస్విఅందుకొన్నారు . ,ఎ ఆర్ స్వామినాధన్ ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ,ఉత్తమ నృత్య దర్శకుడుగా కెవి సత్యనారాయణ అందుకోవటం చిత్రం స్థాయి ఎంత గొప్పగా ఉందొ తెలియ జేస్తుంది .ప్రాచీన కళలకు సాహిత్య సంగీతాలకు వాగ్గేయకారులకు మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని గుర్తు చేసి మన కర్తవ్యాన్ని బోధిస్తుంది .శ్రుతి,లయలు లయబద్ధంగా సాగటమే భారతీయ సంస్కృతికి ,జీవిత విధానానికి మూలం అని తెలియజెప్పే చిత్రం శ్రుతి లయలు .విశ్వనాథుని ఊపిరులు . మొదటించి హాస్యం అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది పాత్రల మనస్తత్వం మాటలు ద్వారా

సుభలేఖ సినిమా లో కట్నం సమస్యను అతి సున్నితంగా హాస్యం మేళవించి పరిష్కరించిన తీరు మెచ్చతగింది .డిగ్నిటి ఆఫ్ లేబర్ ను చూపించిన సినిమా .స్టార్ హోటల్ వెయిటర్ మూర్తి గా చిరు కు ,కైకాల స్వంతకాలేజిలో లెక్చరర్ సుమలత ల మధ్య ప్రేమాయణం ,ప్రేమకు అంతస్తులు అక్కర్లేదన్న దానికి ఉదాహరణ .కైకాల కొడుక్కు సుమలతను వధువుగా అడగటం కట్నం తోపాటు అనేకమైన కోరికలు ఆయన బయటపెట్టటం ,అది సుజాతకు ఇష్టంలేక తెగేసి చెప్పటం సంబంధం చెడిపోవటం ,ఆమె పెళ్లి తమ ఇంట్లో ఉంటె జరగదని ఆమెను తలిదండ్రులు ఇంటి ను౦చి పంపటం ,,ఆమె లెక్చరర్ ఉద్యోగాన్ని కూడా కైకాల పీకేయట౦తో చిరు అండతో ఆమె గడపటం ,కైకాల కు సన్మానం పేరుతొ అవమాని౦చి అతని అవినీతిని బట్టబయలు చేయటం తో ఆయన రౌడీలతో కొట్టించటం , వెయిటర్ ఉద్యోగం పీకేయించటం ,మూర్తి ఆమెకు ఆల్విన్ లో ఉద్యోగం ఇప్పించటం ,ఆమెకు ఆల్విన్ అధికారితో పెళ్లి ప్రయత్నం చిరు చేయటం ,కైకాల చిన్నకొడుకు శుభలేఖ సుధాకర్ ,సుమలత చెల్లెలు తులసి మధ్య అందమైన సరసమైన ప్రేమాయణం ,తులసీ సుధాకర్ ల ఎత్తుగడలు ఫలించి కైకాల కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించటం ,చివరికి అందరి పెళ్ళిళ్ళు జరిగి సుఖం కార్డు పడటం .సుధాకర్ ఈ సినిమాతో ‘’శుభలేఖ సుధాకర్ ‘’అయ్యాడు .రమణమూర్తి సుమలత తులసి తండ్రి .నిర్మలమ్మ సాక్షి రాళ్ళపల్లి వగైరా టీం .గొల్లపూడి మాటల రచయితకనుక ప్రతిమాటా పేలి నవ్వుల తారాజువ్వలు రాలాయి హాస్యపు మతాబాలు వెలిగాయి చిరునవ్వుల చిచ్చుబుడ్లు మెరిపించాయి .ఆటకాయి తాటాకు టపాకాయలు సుర్రుమన్నాయి .

మామ మహదేవన్ సంగీతం లో మరుగేలరా ఓ రాఘవా ,విన్నపాలు వినవలె వింతవింతలు ,ఓహో తదిం తకఝం ను జానకమ్మ కమ్మగా పాడితే ,నెయ్యములల్లో నేరేళ్ళో,నీ జడ కుచ్చులు నామెడ కుచ్చులు అంటూ సుధాకర్ కు చిలిపిగా నూ ,రాగాల పల్లకిలో పాటను ఊరేగించాడు బాలు .యువ జంట తులసి ,సుధాకర్ చిలిపి నటన గిలిగింతలు పెడుతుంది .అల్లు కూదాహాస్యంతో గిల్లుతాడు .చిరు కళాతపస్వి తో చేసిన మొదటి సినిమా .బెస్ట్ యాక్టర్గా ఫిలిం ఫేర్ అవార్డ్ ,బెస్ట్ డైరెక్టర్ గా కళాతపస్వి అందుకొన్నారు .కైకాల కు చిరు చేసే సన్మానం హాస్యానికి పరాకాష్ట .అదే ఉద్యోగం ఊడటానికీ కారణం .కట్నం సమస్యను తనకు సుధాకర్ కు పెళ్లి జరగటానికి శుభ లేఖ ను అడ్డంగా పెట్టుకొని కైకాల ఆట కట్టించి కాళ్ళ బేరానికి రప్పించటం లో తులసి నటన అద్వితీయం నవ్విస్తూనే చురకల౦టించటం ఈ పాత్ర ప్రత్యేకత.ఆమె ఆడించినట్లు ఆడటం సుధాకర్ ప్రేమలో మహిమ .సినిమా అంతా లైటర్ వీన్ లో సాగి గుణపాఠానికి కారణమౌతూ వరకట్న సమస్యను బుర్రలు బద్దలు కొట్టుకోకుండా సరదాగా పరిష్కరించటం ఇందులో విశ్వనాథ్ చూపిన ప్రతిభ .సుమలత చాలా డిగ్నిఫైడ్ గా కని పించటం మాత్రమె కాదు నటించింది .హోటల్ వెయిటర్ గా చిరు పలకరింపు ,డ్యూటీ ,ప్రేమలో నిగూఢత ,ఆరాధన ,అందని పళ్ళ కోసం కోసం అర్రులు చాచ కూడదనే జీవిత సత్యం ఆమె బాగే తన కర్తవ్యంగా భావించటం తో ఆమె ప్రేమను గెలుచుకొని పెళ్ళాడాడు .చలాకీ నటనతో మెప్పించాడు చిరుకాదు పెద్దమనసున్నవాడు అనిపించాడు .పోట్టిప్రసాద్ ,రాళ్ళపల్లి తమదైన నటనతో చిత్రవిజయంలో పాలు పంచుకొన్నారు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-23.-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.28 వ భాగం.6.2.23.

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.28 వ భాగం.6.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా విశ్వ నాథ దర్శనం -1

కళా విశ్వ నాథ దర్శనం -1

                        హిందీ లో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ,నవరంగ్ వంటి అద్భుత కళా ఖండాలు సృష్టించి సంగీతానికి ,సాహిత్యానికి భారతీయ కళా వైభవానికి వున్నత మైన స్థానం కల్పించిన వాడు శాంతా రాం .అవి అద్వితీయాలు అనిపించుకున్నాయి  అంత ఎత్తుకు ఎవరు చేరలేరని భావించిన రోజులవి. హిందీసినిమాలకుదేశమంతట  అభిమానులుంటారు .ఆదరిస్తారు .ఆ సిన్మాలకు మంచి మార్కెట్ వుంది .శత దినోత్స వాలు చేసుకొనేవి .అవి దర్శకుని సృజాత్మక శక్తికి నిదర్శ నాలు .అలాంటి సినిమాలు తెలుగు లో తీయ టానికి సాహసించటం కష్టమే .మరి కొత్త దనం కళాల పట్ల పూర్తి అవగాహనా ,ఆరాధనా వున్న దర్శకులు ఊరుకో లేరు .ప్రయత్నం చేస్తారు .చేసి ప్రతిభను నిరూపిస్తారు

అదిగో  ఆ కోవ లోని వాడే మన కాశీ నాథుని విశ్వ నాథ్.

                              దిగ్దర్సకుడు ఆదుర్తి సుబ్బా రావు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ,క్రమంగా తనపై పెట్టిన  విశ్వాసాన్ని   రుజువు చేసు కున్నాడు .’’ఉండమ్మా బొట్టు పెడతా’’సినిలోమన సంస్కృతీ ని ప్రతిబింబించే సన్నీ వేశాలు అతనే తీసాడు అసిస్టెంట్ గానే. .కృష్ణా జిల్లా మానికొండ లో ఆ సినిమా షూటింగ్ జరిగింది .కడియాల విష్ణు రావు గారు ఆ ఊరిలో ధన వంతులు సంస్కారి స్నేహ పాత్రుడు .సినిమా అంతా వాళ్ల పొలాల్లో నే జరిగింది .ఎంతో పంట నష్ట పోయారు .  వాళ్ళ  అబ్బాయి తొమ్మిదో తరగతి చడువుందే వాడు ఆ వూరి హై స్కూల్ లో. నేను అక్కడ సైన్సు మాస్టర్ గా పని చేస్తున్నాను .నా దగ్గర ప్రైవేటు కుడా చదివే వాడు .అతను మమ్మల్ని తీసుకొని వెళ్లి షూటింగ్ చూపించాడు  యాక్టర్లు  అందరికి వూరి లోని  ఇళ్ళల్లో లోనే బస .కొద్దిమంది బెజ వాడ హోటల్ లో వుండే వారు ..దాదాపు నలభై రోజుల పైనే షూటింగ్ జరిగింది .విశ్వ నాథ్ కాఖీ ప్యాంటు ,కాఖీ షర్టు  ఇన్ షర్ట్ అంటే’’టక్ ‘’చేసి బెల్ట్ తో వుండే వాడు అప్పటికి ,ఇప్పటికి అదే ఆయన దర్శ కత్వ పు డ్రెస్ ..ధూళిపాల  ”రావమ్మ మా  లక్ష్మి రావమ్మా ”అని  సంక్రాంతి దాసరి వేషం లో పాడుతూంటే ఇళ్ళ దగ్గర ముత్యాల్లాంటి ముగ్గులు .బంగారు తల్లుల్లాంటి గొబ్బెమ్మల మధ్య సన్నివేశాలు తీయటం నేను చూసాను .అప్పుడు ఆ వూళ్ళో ప్రతి ఇల్లు సంక్రాంతి శోభతో కళ కళ లాడేది ..పొలం లో ”బోర్ వేస్తె జలం భూమి నుంచి చిమ్ముకొని పైకి రావటం ,అప్పుడు పాడే ‘’పాతాల గంగమ్మా  రారా ఉబికుబికి ఉరికురికి  రా ‘’పాట జమున, కృష్ణ ల మీద చిత్రీక రించాడు విశ్వనాథ్ .కృష్ణ సరిగ్గా నటించ లేక పోయేవాడు .టేకుల  కేకులు తెగ తినేవాడు .ఆ రోజున జమున కోపం వచ్చి చెంప మీద కొట్టినంత పని చేసింది .వెంటనే మూడ్ వచ్చి గొప్పగా నటించి అందరి సహనానికి ఫుల్ స్టాప్ పెట్టాడు .విశ్వ నాథ్ చాలాప్రశంతం గా అరుపులు హడావిడి లేకుండా  చిత్రీకరణ చేసాడు .అదే మొదటి సారి అతన్ని చూడటం. అయితె ఎందుకో తెలీదు కాని అతని శక్తి యుక్తుల మీద నమ్మకం వుండేది నాకు .కాని ఇంత గొప్పగా ఎదిగి తెలుగు చిత్ర సీమను మలుపు తిప్పుతాడని అనుకోలేదు .మాణిక్యం మట్టి లో ఉన్నంత వరకే . బయటకు వస్తే దాని కాంతికి మనం అప్రతిభుల మవ్వాల్సిందే . .రెండోసారి విశ్వనాథ్ ను శంకరాభరణం విజయోత్సవాలకు ఆ బృందమంతా ఆంద్ర దేశ మంతా పర్యటిస్తూ ,ఉయ్యూరు వచ్చినప్పుడు  ఆసినిమా ప్రదర్శిస్తున్న సాయి మహల్  కు వచ్చినప్పుడు చూసి సోమయాజులు విశ్వనాథ్ లకు షేక్ హాండ్ ఇచ్చి అద్భుత కళాఖండం అనగా నవ్వుతూ చేతులు జోడించారు ఆఇద్దరు .మూడో సారి శ్రీ వేటూరి సుందర రామమూశ్ర్తి  పెదకల్లెపల్లిలో 1999ఫిబ్రవరి 24 ,25లలో తన స్వగృహంలో,శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం ఆడిటోరియం లో  ఏర్పాటు చేసిన  కార్యక్రమాలకు హాజరై వేటూరి వారింట్లో కాఫీలు టిఫన్ లు మధ్యాహ్నం నవకాయ పిండి వంటలతో ఆదంపతులు అత్యంత ఆత్మీయంగా అందించిన విందు భోజనం చేసి మహదానందం పొందాము అందులో కళాతపస్వి బాల సుబ్రహ్మణ్యం జంధ్యాల ,సప్తపది హీరోయిన్ శ్రీమతి సబిత ,దేవదాస్ కనకాల ,లక్ష్మి   దంపతులు ,శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు అదొక గొప్ప’’ ఎట్ హోం’’ కార్యక్రమం .అందర౦ మహా దానందం అనుభవించాం .అప్పుడే నేను నాపాత డైరీలో శంకరాభరణం సినిమా గురించి ‘’విశ్వనాధుని కీర్తికిరీటం లో మరో అమూల్యాభరణం శంకరాభరణం ‘’అనే శీర్షిఅక్తో రాసుకొన్న పెద్ద వ్యాసాన్ని విశ్వనాథ్ కు చూపిస్తే హెడ్డింగుల వారీగా చూసి నవ్వి సంతకం పెట్టి తేదీ కూడా రాశారు అది నాకు గొప్ప’’ ట్రెజరీ ‘’. సాయంత్రం ఇంటికి తిరిగివస్తూ ,మోపిదేవి లో శ్రీ సుబ్రహ్మ ణ్ఎశ్వర ఆలయానికి వెడితే అక్కడా వీళ్ళు కనిపించారు .ఇలా కళాతపస్వి విశ్వనాథ దర్శన భాగ్యం నాకు కలిగింది .

   విశ్వ నాథ్ అమూల్య చిత్రాలు

                                            జీవన జ్యోతి చిత్రం లో వాణిశ్రీ శోభన్ బాబుల చేత అద్భుత నటనను రాబట్టాడు. అందులోని ప్రతి మాట ,పాట గుండె తలుపుల్ని తడుతాయి. సన్ని వేశాలతో గుండెను పిండి చేసే మహా గొప్ప చాతుర్యం వుంది విశ్వనాథ్ కు .అలాగే ‘’అమ్మ మాట ‘’సినిమా లో (పేరు కర్రెక్టేనా? ))సత్యనారాయణ ,జయంతి ల నటన ల తో మనల్ని మరో లోకం లోకి తీసుకు వెద తాడు .మాతృత్వపు మహోన్నత భావాన్ని చాలా ప్రతిభావంతం గా ఆవిష్కరించాడు .ప్రపంచ ప్రసిద్ధ కథా’’డాస్టో విస్కీ’’ నవల –క్రైం అండ్ పనిష్ మెంట్  ‘’ఆధారంగా తీసిన నేరము -,శిక్ష లో ఎంతో బాలన్స్ గా  emotions ను

కంట్రోల్ చేస్తాడు .’’ఆత్మ గౌరవం ‘’ను సరదాగా జలసాగా తీసి నవ్వులు పూయించాడు .జగ్గయ్య రామా రావు ల స్నేహ ధర్మానికి గొప్ప నిర్వచనం చెప్పాడు దీనిలోదేవిక వుంది సినిమా పేరు ‘ ‘’చిన్న నాటి స్నేహితులు ‘’ .ఇలా వొక్కొక్క  సినిమాలో ఒక్కొక్క భావానికి తన దదైన న శైలి లో పట్టం కట్టాడు .

      సిరి సిరి మువ్వ ,సీతా మహా లక్ష్మి లతో  ఉత్తదర్శకుల జాబితాలో చేరాడు .ఇక శంకారాభరణం చిత్రంలో  విశ్వ నాథ్  కళా విశ్వ రూపం చూస్తాము .సోమయాజులు మంజు భార్గవి పాత్రలను ఆరాధ్య మైన వాటిగా చూపటం లో సంగేత సాహిత్యాలని ఈ    తరానికి కళాత్మకం గా పరిహాయం చేయటం లో ఈ నాటి యువతను మన సంస్కృతీ  సాంప్రదాయాల వైపు  మళ్లించటం లోసిని మాధ్యమం యెంత చేయాలో అంత కంటే ఎక్కువ గా చేసిదిగ్దర్శనం   చేశాడు . ఉత్తమోత్తమ దర్శకుడని పించు కున్నాడు .కళామ తల్లికి బంగారు గొడుగు పట్టిన వాడనిపించుకున్నాడు .’’సప్త పది’’ చిత్రం లో శంకరాచార్య గారి అద్వైత సిద్ధాంతాన్ని కాలానుగుణ భాష్యం చెప్పి సెహ బాష్ అని పించు కున్నాడు. ఈ ధోరణి నచ్చని బాపు- రమణలు’’ రాదా కల్యాణం’’ తీసి దీన్ని తిప్పి కొట్టారన్నది వేరే విషయం .’’స్వర్ణ కమలం’’ లో భానుప్రియ లోని నట, నాట్య ప్రతిభను కనుల విందుగా కమనీయం గా ఆవిష్కరించిన తీరుకు జోహార్లె .’’స్వాతి కిరణం’’ లో ముమ్ముట్టి సహజ నటనకు నీరాజనం పట్టించాడు. రాధికను  అమ్మ తనానికి ప్రతినిధి గా మలచిన తీరు అద్వితీయం .child progidy –బాల మేధావి ,బాల సంగీత విద్వాంసుడు ‘’మంజు నాథ్ పాత్రను  తీర్చిన తీరు అతని నటనను వెలికి తీసిన విధానం ఈర్ష్య ఎంతపని చేయిస్తుందో చెప్పిన పధ్ధతి చిరస్మరణీయం .శిష్యుడి ఉన్నతిని సహించలేక  ఈర్ష్య కు లోనై ముమ్మట్టి గురువు తీసుకున్న నిర్ణయం ఆబాల మేధావి గంగాధరం మరణానికి కారణమవుతుంది .ముమ్మట్టి ‘’అనంత రామ శర్మ ‘’అనే గొప్ప సంగీత విద్వాంసుడు .లోకమంతా నీరాజనాలు పట్టినాగంగాధారం లోని సృజనాత్మక సంగీత కళను గుర్తి౦చినా అహం అడ్డు వచ్చి  ఏమీ నేర్పకుండా ఉంటాడు .అనంతరామ శర్మకు కుదరని స్వరాలను గంగాధరం స్వర పరచటం గురువు ఈర్ష్యను తార స్థాయికి తీసుకు వెడుతుంది .సంగీతం నేర్వటానికి అబాలుడు పెట్టిన దరఖాస్తు కూడా తిరస్కరిస్తాడు .ఆమోదించకుండానే మనసులో అవి గొప్ప స్వర రచనలని భద్రం గా ఉంచుతాడు లోకానికి తెలియకుండా .అభద్రతా భావం అతడిని అణువణువునా  దహిస్తుంది  .బాలమేధావి గంగాధరం మరణానికి  అనంతరామ శర్మఅసూయ తో  కారకుడు అయ్యాడని  పోలీస్ ఇన్స్పెక్టర్ గ్రహిస్తాడు .ఇది తెలిసిన శర్మభార్య రాధిక మతి చలిస్తుంది .దేశాలు తిరుగుతూ ,మనో వ్యధతో కాలిపోతూ  భార్య  కొడుకు లాంటి బాలమేధావి గందాధారం పేర ఒక సంగీత ఎకాడమి స్థాపి౦చి సంగీతం నేర్పుతుంటే  ,శర్మ అందులో విద్యార్ధిగా  మిగిలిన శిష్యులతో పాటు కూర్చుంటాడు .పాఠం సాధన చేస్తున్న ఆమహా విద్వాంసుని శృతి సరి చేసుకోమని అందులోని ఒక బాలిక  చెప్పటం తో ,తన తప్పులను తానూ తెలుసుకోవటం తో చిత్రం ముగుస్తుంది .గుండెలను పిండేసే సన్ని వేశాలతో  భావం పుష్కలంగా ఉన్న గీతాలతో కమ్మని స్వరాలతో ప్రకృతి అందచందాలకు స్వర నీరాజనం పట్టే సంగీతంతో సినిమా స్థాయిని విశ్వ నాథ్ రమణీయంగా ,కమనీయంగా  ఎలివేట్ చేశాడు . .నిన్న నే మరణించిన పద్మభూషణ్ శ్రీమతి వాణీ జయరాం అత్యద్భుతంగా పాడిన ‘’ఆనతి నీయరా ప్రభూ ‘’కొండా కోనల్లో లోయల్లో ‘’,జాలిగా జాబిలమ్మ ,తెలిమంచు కురిసింది ‘,ప్రణతి ప్రణతి ప్రణతి ,వైష్ణవి భార్గవి ,శివానీ భవానీ, శృతి నీవు గతినీవు ఈనా ఆకృతి నీవు ‘’పాటలు మాదుర్యానికే మాధుర్యాలు .రసాల ఊటలు, భావాల తేనెలు ,అమృతపు జాలులు .సంగీతసాహిత్య నటనా త్రివేణీ సంగమం ఈ చిత్రం .మనో నేత్రంతో అలోచించి చూసి గుండెలు పిండేట్లు రసరంజనం చేశాడు కళా స్రష్ట ద్రష్ట తపస్వి విశ్వ నాథ్. పక్షితీర్ధం మామ్మగా జయంతి ,గంగాధరం తండ్రిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గొప్ప నటన ప్రదర్శించారు . సంగీత సామ్రాట్ గా పేరు పొందిన అనంత శర్మ ,తానూ చేసిన తప్పుకు కుమిలిపోతూ  దేశ ద్రిమ్మరిగా తిరుగుతూ ,చివరికి చేరాల్సిన చోటుకే చేరి పశ్చాత్తాపంతో పాప దగ్దు డౌతాడు .ఏ సినిమాలో అయినా విశ్వనాథ్ ఇలాంటి మార్పే కోరతాడు .

   సశేషం

మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-23-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.

అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.\\\

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు

Posted in సమయం - సందర్భం | Leave a comment

పద్మ భూషణ్  కాజి నజ్రుల్ ఇస్లాం -2

పద్మ భూషణ్  కాజి నజ్రుల్ ఇస్లాం -2

1917లో హైస్కూల్ ఆఖరి సంవత్సరం చదువుకు స్వస్తి చెప్పి నజ్రుల్ ‘’డబుల్ కంపెని ‘’లో పేరు నమోదు చేసుకోగా ,వాయవ్య సరిహద్దు ‘’నాసిరా’’ కు పంపారు .ఆ రెజిమెంట్ రద్దు అయ్యేవరకు అక్కడే  రెండేళ్ళు న్నాడు .భారత దేశపు కమీషన్ పొందిన హవల్దార్ రాంక్ పొందాడు .కరాచీ బారక్స్ లో అందరితో కలుపు గొలుగ ఉండేవాడు . సైనిక  దళానికి చెందినపంజాబీ మౌల్వి సాయంతో పార్శీ భాషా ,కావ్య జ్ఞానాన్ని సాధించాడు .గద్య రచనలు చేసేవాడు .కవిత్వం రాసేవాడు గీతాలు కూర్చే వాడు . హఫీజ్ రూబాయిలను అనువాదం  జేసేవాడు .అది 1930వరకు అది  అచ్చు  కాలేదు .

   ఆ రోజుల్లోనే ఒక దేశ ద్రిమ్మరి అనే మొదటి కథ రాశాడు .మౌల్వీ నజీరుద్దీన్ సంపాదకత్వం లో వస్తున్నప్రసిద్ధ సాహిత్య పత్రిక  ‘’సౌగాత్ ‘’లో 1919అచ్చయింది.తర్వాత కథా కావ్యం ‘’ముక్తి ‘’రాయగా అదీ, ముద్రణ పొందింది .’’వంగీయ ముసల్మాన్ సాహిత్య సమితి’’ వారి త్రైమాసిక పత్రికలో అదే ఏడాది అచ్చయింది .అచ్చు అయిన నజ్రుల్ మొదటి కవిత ఇదే .ఇందులోని ది నిజంగా జరిగిన కథ .రాణీ గంజ్ లోని ఒక భాగం సజీవంగా దర్శన మిస్తుంది .ఒక ఫకీరు చావుపుట్టుకలు ఆయన కృపతో ఒక ఎండిన చెట్టు చిగురించటం ఉన్నాయి .లయబద్ధకవిత్వంతో హృదయాన్ని ఆకర్షించాడు .మిస్టిక్ శక్తులపై ఆయనకున్న విశ్వాసమిందులో కనిపిస్తుంది .ఈ కవిత వల్లనే ముజఫర్ అహ్మద్ తో పరిచయమేర్పడింది .ఈయన ఆపత్రిక ఎడిటర్ కాకపోయినా చోదక శక్తి .నజ్రుల్ ను మరిన్ని కవితలు రాసి పంపమన్నాడు. బెంగాల్ కు కమ్యూనిస్ట్ ప్రేరణతో కవిత్వం రాసిన మొదటి కవిగా నజ్రుల్ గుర్తింపు పొందాడు .వంగీయ ముసల్మాన్ సాహిత్య సమితి ఆతనికి ఒక గొప్ప వేదిక అయింది .గొప్ప కథ ‘’వ్యదార్ దాన్’’ మరోటి హేన’’ లు ఇందులో వచ్చాయి .మంచి పేరు సాధించాడు .మౌల్వీ అబ్దుల్ బదూద్ ,అబ్దుల్ కలాం షంషుద్దీన్ ల స్నేహం పొందాడు .సాహిత్య రంగం లోని వారంతా నజ్రుల్ మిత్రులయ్యారు .హఫీజు రుబాయి బెంగాల్ సాహిత్య పత్రిక’’ ప్రవాసి ‘’లో 1919 డిసెంబర్ లో  అచ్చయింది .నజ్రుల్ –గంగూలీ ల మధ్య శాశ్వత మైత్రీ బంధ మేర్పడింది

  తన రెజిమెంట్ రద్దు అవటానికి ముందే నజ్రుల్ ఒక వారం సెలవు పెట్టి కలకత్తాకు , స్వగ్రామం చురులియా వచ్చాడు .మొదటిసారి ముజఫర్ అహమ్మద్ ను కలకత్తాలో కలిశాడు .సివిల్ జీవితం లో సాహిత్యం పై కృషి చేయమని ఆయన ఉద్బోధించాడు నజ్రుల్ కు .తల్లిని చూసి మళ్ళీ కలకత్తా వెళ్లి ,శైలజానంద నుకలిసి ,ముజఫర్ తో కలిసి 32కాలేజి స్ట్రీట్ లో ముసల్మాన్ సాహిత్య సమితి కార్యాలయం లోనే ఉండేవాడు .అప్పుడు ఈ మేడ సాహిత్యకారుల కేంద్రమైంది .అందరికి ఆంతరంగిక మిత్రు డయ్యాడు .మాజీ సైనికుడు కనుక ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .రెవెన్యు సబ్ రిష్ట్రార్ పోస్ట్ కు ఇంటర్వ్యు వచ్చింది .దేశభక్తి ఇతన్ని ముందుకు పోనివ్వలేని సందిగ్ధత ఏర్పడింది .రౌలట్ చట్టం అందరి ఆగ్రహ ఆవేశాలకు కారణమైంది .గాంధీ సత్యాగ్రహ బోధ సాగుతోంది .జలియన్ వాలా హత్యాకాండ జాతీయ విప్లవాన్ని వేగవంతం చేసింది .ఆ విప్లవాగ్ని నజ్రుల్ గుండెల్లోనూ తీవ్రంగా జ్వలించింది .బెంగాల్ లో ,మరీ కలకత్తా లో ఈప్రభావం విపరీతంగా ఉంది .చివరికి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అనే నిర్ణయానికి వచ్చాడు .ఉద్యోగ ఆహ్వానం తిరస్కరించి21 వ యేట ఉద్యమ బాట పట్టాడు .

 యోధుడు రచయిత

  యవ్వనం లో ఉన్న నజ్రుల్ స్వాతంత్ర్య యోదులపక్షాననిలవాలను కొన్నాడు ..ముస్లిం భారత్ పత్రిక వీటికి ముఖ్య వేదికగా ఉండేది .శాంతిపూర్ కు చెందిన ప్రసిద్ధ ముస్లిం కవి ముజమ్మల్ హక్ దాని సంపాదకుడైనా ,కొడుకు అఫ్జల్ హక్ కే దాని నిర్వహణ  బాద్యత ఉండేది .ఈపత్రిక మొదటి సంచిక నజ్రుల్ నవల బంధన హారా-బంధ విముక్తి తో ప్రారంభమైంది .ఇందులో లేఖా సాహిత్యం ఉంది . ఈపత్రిక లోనే శక్తివంతమైన కవితలు కూడా రాశాడు  .కుర్బానీ –ఆహుతి ,బాదల్ బరిషన్ –రోకళ్ల వానలు ,బాదల్ ప్రతేర్ సోహరాబ్ –వర్షాకాల ఉదయ ప్రార్ధన ,బోధన –ప్రారంభోత్సవం ,మొహర్రం,షత్-ఇల్-ఆరబ్-మెసపొటేమియా లోని యూఫ్రటిస్ కు అరబ్బీ పేరు ,పాటలు,గజల్స్ ,ఫతవా-ఇ-దో జదం-ప్రవక్త పుట్టిన రోజు ,బిరహ బీదుర –విరహ వేదన ,మరామీ –స్పందించే హృదయం ,స్నేహ –భీతు –స్నేహం లో భయ భీతుడు  వగైరాలన్నీ అచ్చు అయ్యాయి .ఇందులో అప్పటికి ఇప్పటికి చాలాఉత్క్రుష్ట  మైనవి ఉన్నాయి .నవలకూ మంచి పేరే వచ్చింది .కాని ఆయన శక్తి కవిత్వంలోనే బాగా గుబాలించింది .తన కరాచీ అనుభవాలతో కథ రాశాడు .ఇందులోకవిత్వం రోమాన్స్ భావావేశాలు పొంగి పొర్లి చిత్తరంజన్ దాస్ స్థాపించిన ,బరీంద్ర కుమార్ ఘోష్ సంపాదకుడుగా ఉన్న ‘’నారాయణ ‘’అనే ప్రముఖ సాహిత్య పత్రికలో  మంచి పొగడ్త లభించి గొప్ప గుర్తింపు వచ్చి౦ది.బెంగాలీ సైనికుడు ఇరాక్ దేశాన్ని సంబోధిస్తూ తన దేశమూ ,ఇరాక్ రెండూ బానిసత్వంలో మగ్గిపోతున్నాయని విచారిస్తూ రాసిన కవిత –‘’షత్-అల్-ఆరబ్’’నజ్రుల్ ఇస్లాం విలక్షణ మైన ముద్రవున్న ఉత్తమ కవిత .ఇందులో దేశభక్తి పొంగి ప్రవహించింది .అరబ్బీ  శ్రావ్యత  ,బెంగాలీ శబ్ద ఝరి  ముగ్ధుల్ని చేస్తుంది .ఇవన్నీ ఉత్తమోత్తమ కవితా కల్హారాలే .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-23-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398

 మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398

·         398-వాహినీ సంస్థ నిర్మాత ,గృహలక్ష్మి నిర్మాత ,వందేమాతరం స్వర్గ సీమ నిర్మాణ ఫేం –మూలా నారాయణ స్వామి

·         మూలా నారాయణస్వామి ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన వాహినీ స్టుడియో సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామం. వీరి తండ్రి గారి కల్లు వ్యాపారాన్ని చిన్నతనంలోనే ధనవంతులై తర్వాత కాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైనవి స్థాపించి వ్యాపారల్ని విస్తరించారు.

·         నారాయణస్వామి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అన్నయ్య) తో కలిసి ఉమ్మడి వ్యాపారం చేసి రంగూన్ కి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. తర్వాత ఇద్దరూ హెచ్.ఎం.రెడ్డి గారి రోహిణీ పిక్చర్స్లో భాగస్వాములుగా చేసి గృహలక్ష్మి వంటి కొన్ని సినిమాలు నిర్మించారు. విభేదాల మూలంగా విడిపోయి స్నేహితులిద్దరూ వారి స్వంత నిర్మాణ సంస్థ ‘వాహినీ పిక్చర్స్’ స్థాపించారు. దీనిలో ముఖ్యమైన వాటా నారాయణస్వామిదే. ఈ సంస్థ ద్వారా వందేమాతరంసుమంగళి, దేవత స్వర్గసీమ వంటి మంచి సినిమాలు నిర్మించారు. స్వర్గసీమ నిర్మాణం సమయంలో మద్రాసు న్యూటోన్ స్టుడియోలో వారు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చి స్వంతంగా స్టుడియో నిర్మాణం చేపట్టారు.

·         399-తాడి పత్రీ మాజీ చైర్మన్ ,వాహినీ సంస్థ నిర్వాహకుడు,రచయిత –మూలా వెంకట రంగయ్య

·         మూలా వెంకటరంగయ్య భారతీయ చలన చిత్ర నిర్మాత, రచయితవాహినీ స్టూడియో ద్వారా చిత్రాలను నిర్మించిన వెంకటరంగయ్య తెలుగు తమిళ సినిమాలకు రచనలు కూడా చేశాడు

జీవిత విషయాలు

వెంకటరంగయ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి నారాయణస్వామి కల్లు వ్యాపారంతో ధనవంతుడై తర్వాతికాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైన స్థాపించి వ్యాపారాల్ని విస్తరించాడు.[1][2]

సినిమారంగం

తండ్రి నారాయణస్వామి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి ‘వాహినీ పిక్చర్స్’ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా నిర్మించిన చిత్రాల నిర్మాణ బాధ్యతలను వెంకటరంగయ్య చూసుకునేవాడు. ఆ తరువాత వాహినీ స్టూడియో నిర్మించారు. ఇది దక్షిణ ఆసియాలో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది.[3][4]

1950లో నారాయణస్వామి మరణించాడు. దాంతో వెంకటరంగయ్య కొంతకాలం స్టూడియోను నడిపి, 1961లో బి.నాగిరెడ్డికి వాహినీ స్టూడియోను అమ్మేశాడు. నాగిరెడ్డి ఆ స్టూడియోను విజయ వాహిని స్టూడియోస్ గా మార్చుకున్నాడు.

ఇతర వివరాలు

వెంకటరంగయ్య తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్ గా కూడా పనిచేశాడు.[1

·         400-ప్రముఖ సినీ కళా దర్శకుడు ,గ్రిగ్మేమోరియాల్ గ్రహీత ,దర్శక నిర్మాత శ్రీ కృష్ణలీలలు కళా ఫేం ,శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం లో స్వామి విగ్రహ రూప శిల్పి –ఎయస్.వి.యస్. రామారావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు.స్.వి.ఎస్ .రామారావు

 విశేషాలు

ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు బందరు లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు[1]. ఇతడు మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో ‘లంబాడీ కన్య’ అనే వర్ణచిత్రం ఎన్నదగినది. ఇతడు ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో తన చిత్రాలను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్నాడు. 1934లో ఇతడు వేసిన ఒక పెయింటింగ్‌కు “గ్రిగ్ మెమోరియల్ మెడల్” లభించింది. ఈ బహుమతిని పుచ్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. ఇతడు ఫ్రీ స్టయిల్ పెయింటింగులో సిద్ధహస్తుడు. ఇతనికి ఆధునిక చిత్రకళ పట్ల కొంత అయిష్టం ఉండేది. బందరుకే చెందిన పి.వి.దాసు ఇతడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. పి.వి.దాసు తన వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో ఇతడిని కళా దర్శకత్వ శాఖలో చేర్చుకున్నాడు. ఇతడు కళాదర్శకత్వం వహించిన తొలి సినిమా శ్రీకృష్ణ లీలలు. ఇతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రానికి సెట్సు, కాస్ట్యూములు తయారు చేయడంలో ప్రతిభ చూపించాడు. స్టుడియోలో వెంకటేశ్వరుని విగ్రహానికి నిజమైన విగ్రహంలోని నగల్లాంటి నగలను తయారు చేయడానికి చాలా శ్రమించాడు. ఫలితంగా ఆ చిత్రం చూసినవాళ్లవ్వరూ అది స్టూడియో విగ్రహమని నమ్మలేదు. బాలరాజు సినిమాలో హీరో పాత్రకు ఇతడు సృష్టించిన ‘మీసం’ స్టయిలు ఎంతో మందికి నచ్చింది. ఆ రోజుల్లో చాలామంది ఈ మీసాన్ని అనుకరించారు. ఇతడు నిర్మాతగా కూడా మారి రెండు చిత్రాలను నిర్మించాడు. 1970లో ఇతడు మరణించాడు.

చిత్ర సమాహారం

కళాదర్శకుడిగా

1.    1935 : శ్రీకృష్ణ లీలలు

2.    1936 : ద్రౌపదీ వస్త్రాపహరణం

3.    1938 : గృహలక్ష్మి

4.    1938 : మాలపిల్ల

5.    1939 : రైతుబిడ్డ

6.    1939 : వందేమాతరం

7.    1942 : సీతారామ జననం

8.    1946 : బాలరాజు

9.    1946 : ముగ్గురు మరాటీలు

10.  1947 : మాయలోకం

11.  1947 : యోగివేమన

12.  1948 : బాలరాజు

13.  1950 : స్వప్న సుందరి

14.  1952 : చిన్న కోడలు

15.  1952 : ధర్మదేవత

16.  1957 : వినాయకచవితి

17.  1957 : సారంగధర

18.  1960 : దీపావళి

19.  1960 : శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం

దర్శకుడిగా, నిర్మాతగా

1.    1942 : బాలనాగమ్మ

2.    1952 : చిన్నమ్మ కథ

·           సశేషం

Posted in సినిమా | Tagged | Leave a comment

గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి


6-3-1899 న శ్రీ మల్లవరపు శ్రీరాములు ,శ్రీమతి సీతమ్మ దంపతులకు విశ్వ సుందరమ్మ మొదటి సంతానంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉండి గ్రామం లో జన్మించింది .తొమ్మిదవ ఏట ఆమెకు వివాహం ఉంగుటూరు గ్రామానికి చెందిన తల్లాప్రగడ నరసింహ శర్మతో జరిగింది .బాల్య వివాహం కనుక ఆమె దాదాపు స్కూలు చదువుకు నోచుకోలేదు. కానీ మహా పండితుడైన తండ్రి సహాయ సహకారాలతో ఆమె అంతులేని పాండిత్యం సాధించింది. ఆ రోజుల్లో ప్రచురింపబడుతున్న విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథాలయం వారి గ్రంథాలను చదివి జీర్ణం చేసుకొన్నది. చిలకమర్తి, కందుకూరి రచనలు, భారత భాగవత రామాయణాలు పూర్తిగా చదివింది. ఇక విజ్ఞానానికేం తక్కువ ఆనంత విజ్ఞాన సంపన్ను రాలై౦ది, విజ్ఞాన చంద్రికా మండలి, ప్రోగ్రెసివ్ యూనియన్ వారు నరసాపురంలో నిర్వహించే ఉభయ భాషా ప్రవీణ , సాహిత్య శిరోమణి పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది .

16వ ఏట విశ్వ సుందరమ్మ కాకినాడకు కాపురానికి వెళ్ళింది. ఆమె భర్త శర్మ అప్పుడు పిఠాపురం రాజా గారి అనాథ శరణాలయానికి సహాయ సూపరిం టెండెంట్ గా ఉండేవాడు. భర్త సాహచర్యంతో ఆమెకు సంస్కార భావాలు దయ సానుభూతి, వాత్సల్యం వంటి ఉత్తమగుణాలు ఆ లేత వయసులోనే కలిగి వట వృక్షంలాగా విస్తరించాయి .అయిదేళ్ళు కాకినాడలో ఉన్నది .

1920లో గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావాన్ని విని, తల్లాప్రగడ దంపతులు ,భారత రాజకీయాలవైపుఆకర్శితులై 1921లో బెజవాడ లో జరిగిన చారిత్రాత్మక కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు .తర్వాత కాకినాడలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా రాజకీయ సభలో విశ్వ సుందరమ్మ ‘’శాసనోల్లంఘన తీర్మానాన్ని’’ ప్రవేశ పెట్టింది .మొదటి దశ శాసనోల్లంఘన జరిపే వారిలో తన పేరు రాయి౦చుకొని ,మార్గ దర్శి అయింది .అప్పటినుంచి విదేశీ వస్త్ర దహనం, బహిరంగ సభలలో ప్రసంగించటం, కాంగ్రెస్ సమావేశాలకు హాజరవటం నిత్య కృత్యమైంది .1921లో అహమ్మదాబాద్ లో కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడు హాజరై ,సబర్మతీ ఆశ్రమం లో మహాత్మాగాంధీని దర్శించింది .ఆయనతో కొన్ని విషయాలు చర్చించి కొన్ని సలహాలు స్వీకరించింది .

రాజమండ్రిలో కొంతకాలం ఉండి విశ్వ సుందరమ్మ వీరేశ లింగం గారి వితంతు శరణాలయం నిర్వహణలో తోడ్పడింది .1923లో బెంగాల్ లో పర్యటించింది .కలకత్తాలోని బ్రహ్మ సాధనాశ్రమం ,చంద్ర నాగోర్ లోని ప్రవర్తకాశ్రమం ,బోల్పూర్ లోని విశ్వకవి రవీంద్రుని శాంతినికేతన్ మొదలైనవి చూసింది .నెల్లూరు దగ్గర పల్లెపాడు లోని పినాకిని ఆశ్రమం లో కొంతకాలం గడిపింది .

విశ్వ సుందరమ్మ, శర్మ దంపతులు ఇక రాజమండ్రి లో స్థిర పడి,తమదైన విధానం లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి గట్టున ఆర్యాపురం లో 1923లో ‘’ఆనంద నికేతనాశ్రమం ‘’స్థాపించారు. అస్పృశ్యతా నివారణ, స్త్రీ సంక్షేమం, నూలు వడకటం, ఖాదీ వస్త్రాలు నేయటం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆసక్తిగా నిర్వహించారు. కుల మత విచక్షణ లేకుండా అందరూ ఒక్కటై మెలిగారు. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు చాగల్లులో ఈ ఆశ్రమ భవనానికి తోడ్పడ్డారు. అప్పటి నుంచి శర్మ దంపతులు చాగల్లు వచ్చి ఆశ్రమ౦లోనే ఉన్నారు .

1929లో గాంధీజీ ఆంద్ర దేశ పర్యటన జరుపుతూ వీలు చూసుకొని చాగల్లు వచ్చి విశ్వసు౦దరమ్మ దంపతులు నిర్వహిస్తున్న ‘’ఆనంద నికేతన ఆశ్రమ౦ ‘’సందర్శించి, అక్కడి అస్పృశ్యతా నివారణ, జాతికులమతాలకు అతీతంగా, హరిజన బాలబాలికలకు ఆశ్రయం కల్పించి విద్య నేర్పటం చూసి మహాత్ముడు మురిసిపోయాడు. అప్పటికి ఆయన అస్పృశ్యతా ఉద్యమం చేబట్టలేదు. ఒక రకంగా విశ్వ సుందరమ్మ దంపతులు ఈ విషయంలో ఆయనకు మార్గ దర్శులయ్యారు .చాగల్లు జాతీయోద్యమం లో పాల్గొనే ఉద్రేక ఉత్సాహ పూరిత యువతకు కేంద్ర స్థానంగా ఉండేది .ఇవన్నీ గాంధీని బాగా ఆకర్షించాయి .మహా సంతోషం తో మహాత్ముడు ఆరాత్రి ఆ ఆశ్రమంలో విశ్రమించాడు. పిల్లల ఆటపాటలకు మురిసిపోయి దీవించాడు .శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ,శ్రీ కంభం పాటి సత్యనారాయణ ,శ్రీ మల్లవరపు వెంకట కృష్ణారావు వంటి యువకులు మహాత్మునితో సంభాషించి ప్రేరణ పొందారు .వారు గాంధీని ‘’శాంతి సమరం అంటున్నారు మీరు బాపూ .కాని సాయుధ పోరాటం వెంటనే విజయం చేకూరుస్తు౦ది కదా ?’’అని ప్రశ్నిస్తే బోసి నవ్వులబాపు ‘’ఒక ఖైదీని వార్డర్ గా నియమిస్తే ,కాలక్రమం లో తాను ఖైదీనని మర్చిపోయి తోటి ఖైదీలను హింసిస్తాడు. మీరు విద్యావంతులు, వివేకమున్నవారు మీరే ఆలోచించండి ‘’అని జవాబు చెప్పాడు గాంధీజీ. విశ్వ సుందరమ్మ తీర్చిదిద్దిన ఆమె సోదరుడు మల్లవరపు వెంకట కృష్ణారావు పూర్తిగా గాంధీజీ శాంతి ప్రియత్వాన్నే అనుసరించారు ..

1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం దేశం నలుమూలలా ప్రాకింది .ప్రజలు ఉత్సాహ ఉద్రేక,ఆవేశాలతో ఆనందంగా పాల్గొని దిగ్విజయం చేకూర్చారు .1930ఏప్రిల్ 13న తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ, శర్మ పతులు, తమ్ముడు చెల్లెలు ,శ్రీతల్లాప్రగడ ప్రకాశ రాయలు వంటి బంధువులు, మిత్రులు అభిమానులు పెద్ద దళంగా ఏర్పడి చాగల్లు ‘’ఆనంద నికేతన ఆశ్రమం ‘’నుంచి సత్యాగ్రహం చేయటానికి, శాసన ధిక్కారం చేయటానికి బయల్దేరారు. ఆమె నిర్వహించని పికెటింగ్ లేదు. పాల్గొని ప్రసంగించని సభ లేదు . పశ్చిమ గోదావరి జిల్లాకు ఆమె నాయకత్వం వహించి నిర్వహించింది. ఆశ్రమం లోని పిల్లలు బాలభటులై ఉద్యమలో ఉత్సాహంగా పాల్గొనటం గొప్ప విశేషం.

1930 మే నెలలో ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆరు నెలలురాయవెల్లూరు జైలు లో బి క్లాస్ జైలు శిక్ష విధించారు .విచారణ సమయంలో ఆమె కోర్టులో ఇచ్చిన వాగ్మూలం ఒక విశిష్టతను పొందింది .అందులో ఆమె షేక్స్పియర్ నాటకం జూలియస్ సీజర్ లోని మార్క్ ఆంటోని స్పీచ్ ను గుర్తు చేస్తుంది .అందులో సజ్జన స్తుతి, కుజన నింద.మిత్రులకు అభినందనలు, ప్రభుత్వ దమన నీతి వర్ణనలు మొదలైన కావ్య సామగ్రితో తన సాహితీ వైదుష్యాన్ని జోడించి, కవితామృతాన్ని చిందించి దేశీయుల ప్రశంసలు పొందింది ఇది చిరస్మరణీయ ఘట్టం అని ఆనాటి వారంతా కథలు గాథలుగా చెప్పుకొనేవారు . చివరికి ఫినిషింగ్ టచ్ గా ‘’వందేమాతరం ‘’అంటూ చిరునవ్వుతో జైలులోకి ప్రవేశించింది విశ్వసు౦దరమ్మ.1930 నవంబర్ 7న జైలునుంచి విడుదలైంది .

ఆ తర్వాత ఏలూరులో శ్రీమతి శృంగారకవి లక్ష్మీ నరసమ్మ ఇంట్లో ‘’మీరాబాయి చరఖా పాఠశాల నిర్వహణకు తోడ్పడింది .శ్రీమతి కంభం పాటి మాణిక్యాంబ వంటి యువతులకు మార్గ దర్శనం చేసింది .1932 శాసనోల్లంఘన ఉద్యమం లో ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 6-7-1932న గుంటూరు జిల్లా తెనాలిలోమండల కాంగ్రెస్ సభను తన అధ్యక్షతన జరిపిన ధీరురాలు సుందరమ్మ.సభ తర్వాత విజయోత్సాహంగా ఊరేగింపు జరుపుతుంటే, పోలీసులు వచ్చి, లాఠీ చార్జి చేసి, ఆమెతోపాటు 26మందిని అరెస్ట్ చేశారు. పోలీసు దెబ్బలకు ఒళ్ళంతా రక్తం కారుతుండగా ‘’శ్రీ గాంధీ నామం మరువాం మరువాం, సిద్ధాము జైలుకు వెరువాం వెరువాం ‘’అని పాడుతూ జైలు శిక్ష అనుభవించటానికి రెండవసారి రాయవెల్లూర్ జైలుకు వెళ్ళింది ఆ స్వాతంత్రోద్యమ నాయకురాలు .

1942 క్విట్ ఇండియా ఉద్యమం లో ఆన౦ద నికేతన ఆశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది .అయినా చలించని ఆ ధీర వీర దంపతులు నిడదవోలు లో కాలువ గట్టుపై పర్ణకుటీరం వేసుకొని ఉన్నారు. ఇంతటి కల్లోల జీవితం అనుభవిస్తూ అసంఖ్యాక కవితలురాసి 1920-49మధ్య విశ్వ సుందరమ్మ 125గీతాలను ‘’కవితా కదంబం ‘’పేరుతొ 235పేజీల పుస్తకంగా ప్రచురించింది. ఆధునిక ఆంద్ర కవయిత్రులలో విశ్వ సుందరమ్మ ప్రధమురాలు .ఆమె కవన శక్తినికూడా సంఘం కోసం దేశం కోసమే వెచ్చించింది. మద్యపానాన్ని వివిధ కోణాలనుంచి పరిశీలించి తాగుడును నిరశిస్తూ అనేక కవితలు రాసింది. ’’కల్లు స్వదేశీయే, కనుక త్రాగవచ్చు అనెడి దుర్వాదమును వినకుమయ్య ‘’అని హెచ్చరించింది. ఈ పాయింట్ అంతకు ముందు ఎవరికీ తోచినట్లు లేదు. బాలవితంతువుల గోడు వినమని, స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేయమని గేయాలలో కోరింది. సంస్కరణల సేవతో సమాజ సేవ చేసిన గాంధీ , వీరేశలింగం గార్లను కీర్తించింది.

సి క్లాస్ ఖైదీల బాధలకు కలత చెందేది .జైలు పారుశుధ్యం అవసరం గురించి ‘’గృహ లక్ష్మి ‘’పత్రికలో ఇంజనీర్ లాగా ప్లాన్ తో సహా సుదీర్ఘ వ్యాసం రాసింది .ఆమె కవితలన్నీ అప్రయత్నంగా హృదయపు లోతుల్లోంచి తమకు తామే పెల్లుబికి వచ్చినవి కనుక అత్యంత సహజంగా, ఆమె కీర్తి, త్యాగం అంత స్వచ్చంగా బహు సుందరంగా ఉంటాయి. భారత దేశ స్వాతంత్ర్యాన్ని కనులారా చూసి ,30-8-1949 న 51 ఏట ఆత్యాగమయి నిస్వార్ధ సేవకురాలు, వీర ధీర వనిత ,అధోజగత్ సహోదరులకు అండగా నిలిచి ,మహాత్మునికే అస్పృశ్యత నివారణకు మార్గదర్శనం చేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు, విదుషీమణి కవితా కల్పవల్లి శ్రీమతి తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ తనువు చాలించి, శాశ్వత యశస్సును పొందింది .శ్రీ ఆచంట జానకి రాం ఈమెపై అత్యద్భుతమైన జ్ఞాపకాలు రాశాడు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in సమీక్ష | Leave a comment

 సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

అక్షరం లోక రక్షకం

  సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

 సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

 సాహితీ బంధువులకు శుభ కామనలు –సరసభారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలను ఉగాదికి మూడు రోజులు ముందుగా 19-3-23 నిర్వహిస్తోంది .ప్రముఖ కవులచే కవి సమ్మేళనం ఉంటుంది .శ్రీ శోభ కృత్ ఉగాది పురస్కారాలను   ఈ క్రింది లబ్ధ ప్రతిష్టులకు అంద జేయబడును .

1-పద్మ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ –గుంటూరు

2-శ్రీ ఎస్ .కె.మిశ్రో –కొడుకు పుట్టాల ,పావలా నాటక ఫేం ,నవ్యభారతి కళామందిరం ,రసమయి సంస్థల స్థాపకులు ,రంగస్థల నటులు, దర్శకులు ,టివి,సినీ నటులు ,కళాసాగర్,కళాజగపతి ,నంది పురస్కార గ్రహీత ,విభిన్న వాచకం తో సుప్రసిద్ధులు –విశాఖ పట్టణం .

3-శ్రీ భండారు శ్రీనివాస రావు –సీనియర్ జర్నలిస్ట్ – హైదరాబాద్  

4-శ్రీ పూల బాల వెంకట ప్రసాద్ – అతి తక్కువ కాలం లో 200 వృత్త పద్యాలతో ’భరత వర్ష ‘’ ప్రబంధ౦  రచించి ప్రపంచ రికార్డ్  నెల కొల్పిన  కవి పండితులు   -వణుకూరు-కృష్ణా జిల్లా.

5-శ్రీ చౌడూరు నరసింహారావు –బహుముఖ ప్రజ్ఞాశాలి  కవి, రచయిత-నెల్లూరు

6-శ్రీమతి కరెడ్ల సుశీల- మహిళా సంక్షేమ ,సాంఘిక సేవా కార్య కర్త  –మచిలీ పట్నం .

 గౌరవనీయ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహితీ మిత్రులను,కవులను ,సాహిత్యాభిలాషులను  ఉగాది శుభా కాంక్షలతో  సాదరంగా ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ మనవి .

 వేదిక (వెన్యు ), సమయం తో పాటు కవి సమ్మెళన అంశం,  పాల్గొనే కవిమిత్రులు ,ఆహ్వానింప బడే అతిధుల వివరాలను  ఒక పది రోజులలో తెలియ జేస్తాం .

  గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు –ఉయ్యూరు -3-2-23.–

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

 పద్మ భూషణ్  కాజి నజ్రుల్ ఇస్లాం

 పద్మ భూషణ్  కాజి నజ్రుల్ ఇస్లాం

 గోపాల్ హాల్దార్ రాసిన దానికి శ్రీమతి చాగంటి తులసి  అనువాదం చేసి రాసిన ‘’కాజీ నజ్రుల్ ఇస్లాం ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి -1991లో ప్రచురించింది వెల.లేదు

 కాలానికి ప్రజలకు మధ్యసజీవ వారధి పద్మభూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం .బెంగాలీల ఉమ్మడి వారసత్వానికి ,వారి సాంస్కృతిక ఆధ్యాత్మిక అన్వేషణలకు నజ్రుల్ మూలం .

  పుట్టుక –బాల్యం

 బెంగాల్ విభజనకు పూర్వం బర్ద్వాన్ జిల్లా అసన్ సోల్ తహసీల్ లో చురిలియా లో 20-5-1897 న కాజినజ్రుల్ ఇస్లాం పేద ముస్లిం కుటుంబం లో పుట్టాడు .ఆయన పూర్వీకులు  పాట్నానుంచి కాజీలుగా ఈ గ్రామానికి వచ్చారు .బిరుదు తప్ప జాగీర్లు హోదాలు అన్నీ పోయాయి .తండ్రి ఫకీర్ అహ్మద్ కటిక పేద .ఆయన కు ముగ్గురు కుమారులు ఒక కూతురు .నజ్రుల్ రెండవ వాడు .కొడుక్కి తండ్రి ముద్దుగా ‘’దుఃఖా ‘’ అంటే’’ ఏడుపు గొట్టు’’అని పేరు పెట్టుకొన్నాడు .అందరూ ఈ పేరుతోనే ఇంట్లో పిలిచేవారు .8వ ఏట తండ్రి చనిపోయాడు .పుట్టినప్పుడు ‘’తారా ఖ్యాపా ‘’అనే పేరు పెట్టారని అంటారు .తనకు తాంత్రిక సాధనకల కొడుకును ఇవ్వమని తల్లి అల్లా ను కోరిందట .ఉన్న ఒకే వీధి బడిలో పార్శీ ఆరబీ నేర్చి మౌల్వీ ఫజుల్ ఆదరణ పొందాడు .పదవ ఏట లోయర్ మిడిల్ పరీక్ష పాసై ,అక్కడే ఒక ఏడాది టీచర్ లాపని చేసి ,మతతత్పరత ఉన్న మంచి ముసల్మాన్ గా ఎదిగాడు .బెంగాలీ లోని రామాయణ మహాభారతాలు చదివి ఆనందించాడు .ఫకీర్లు దావూద్ పాటగాళ్ళు ,సూఫీ లతో మంచి పరిచయం పొందాడు .ప్రపంచ విషయాలపై నిర్లక్ష్యం ఉండేది .స్వతంత్ర వ్యక్తిత్వాన్ని రూపొందించు కొన్నాడు .విద్య ఆర్జించే సాధన సంపత్తి సమకూడని కారణంగా ఆ వయసులో ‘’లేతో దళాలు ‘’అంటే నాటక సమాజాలు బాండు మేళాలు ,పాటలు పాడే వారు తో ఎక్కువ సన్నిహితంగా మెలిగాడు .సమయస్పూర్తి అప్పటి కప్పుడు  రాసే కవిత్వ శక్తీ అబ్బాయి .ఇలాంటి వారిని ‘’గోడా కవి ‘’అనేవారు .పోటీలలో సమయస్పూర్తిగా కవిత్వం చెప్పి గెలవటం ఆకవుల ప్రత్యేకత .ఆయన పినతండ్రి ఈ బృందంలో ఉండి,అన్నకొడుకు నజ్రుల్ ను వాటికి తీసుకు వెళ్లగా కొద్దికాలం లో బ్యాండ్ దళ నాయకుడయ్యాడు .జానపద సాహిత్యం లో మకుటం లేని మహారాజయ్యాడని వంగ సాహిత్య చరిత్రలో ఉంది .బెంగాలీ రాగ తాళాలపై గొప్ప ఆధిపత్యం సాధించాడు .

  బొగ్గు గనుల కేంద్రం,పెద్ద రైల్వే జంక్షన్  అయిన అసన్ సోల్  కు నజ్రుల్ వెళ్ళాడు .రైల్వే గార్డ్ క్వార్టర్ లో  ఇంటి పనులు చేశాడు .తర్వాత ఒక రొట్టెల యజమాని దగ్గర చేరి రొట్టెలు కాల్చటంలో ఎక్స్ పర్ట్ అయ్యాడు .ఖాళీ సమయంలో మురళి వాయించే వాడు .పోలీస్ ఇన్స్పెక్టర్ రఫీ జుల్లా ఇతని ప్రజ్ఞకు మురిసి ,తనతో మైమనసిమ్హ జిల్లా లోని ఆయన స్వగ్రామానికి తీసుకు వెళ్ళాడు .దగ్గరలో ఉన్న దరియా రామ పుర హై స్కూల్ లో జీతం కట్టకుండా -1912లో చదువుకొనే ఏర్పాటు చేశాడు .కానీ అక్కడ పొలం లో పని సేసే వారితో ఎక్కువ గడిపేవాడు .వాళ్ళతోకలిసి దమ్ము కొట్టటం అప్పటికప్పుడుపాటలు రాసి పాడి వారికి సంతోషం కలిగించటం చేసేవాడు .కానీ పరీక్షలో బెంగాలీ వ్యాసాన్ని కవిత్వం తో నింపేశాడు .పరీక్ష హుష్ కాకి కాగా మళ్ళీ అసన్ సోల్ చేరాడు .

   కాసిం బజార్ జమీందార్ ,మహా రాజా మునీంద్ర చంద్ర నంది స్థాపించి నిర్వహిస్తున్న మాధరన్ స్కూల్ లో చేరి ,కవి హెడ్ మాస్టర్ అయిన కుముద రంజన్ మల్లిక్ గారు జీతం కట్టకుండా చదివే సౌకర్యం కలిగిస్తాడని ఆశపడగా ,నిరాశ చెంది రాణీ గంజ్ హై స్కూల్ లో చేరాడు .అక్కడ వసతి భోజన౦ ఫీజు ఫ్రీ .స్కాలర్ షిప్ కూడా ఇచ్చేవారు .ఎనిమిదవ తరగతిలో చేరి  ,తెలివి తేటలతో  ఫస్ట్ న పాసై ,డబుల్ ప్రమోషన్ తో పదవ క్లాస్ లో చేరాడు .గొప్ప కథారచయిత శైలజానంద ఉపాధ్యాయ ఈయన  సమకాలికుడు .జీవితాంతం సాహితీ మిత్రులుగా ఉన్నారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-23-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.

ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అరుణ మంత్రార్థం. 10వ భాగం.3.2.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా తపస్వికి శ్రద్ధాంజలి

కళా తపస్వికి శ్రద్ధాంజలి

 92ఏళ్ళ వయసులో నిన్న రాత్రి మరణించిన మహా యశస్వి కళాతపస్వి శ్రీ కే.విశ్వ నాథ్ గారికి సరస భారతి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని రేపు 4-2-౨౩ శనివారం సాయంత్రం 6గం లకు విశ్వ నాథ్ గారి సమీప బంధువు ,సరసభారతి కార్య వర్గ సభ్యురాలు ఉయ్యూరు రావి చెట్టు బజారులోని లావణ్య జ్యూయలర్స్ ఓనర్స్ ఇంటి ప్రక్క న ఉన్న  శ్రీమతి సీతంరాజు మల్లిక గారింట్లో జరుగుతుంది .సాహిత్య ,సంగీత కళాభిమానులందరూ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించ వలసినదిగా కోరుతున్నాము -గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -3-2-23 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సుప్రకాశ శతకం

సుప్రకాశ శతకం

అనంతపురం పినాకిని ప్రెస్ లో 1925లో  బళ్ళారి హైకోర్ట్ వకీల్ శ్రీ ఎస్.ఆంజనేయులు గారి ద్రవ్య సాయంతో శ్రీ రాప్తాటి సుబ్బదాసు రచించిన ‘’సుప్రకాశ శతకం ముద్రితం  వెల-పావలా .విజ్ఞప్తిలో కవి తాను  12,13ఏళ్ళ వయసులోనే  నాటక సమాజాలకు నాటకాలు రాసి అందించానని ,వాటిని ప్రదర్శించిన సమాజాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పటం చేత ,తన ఇరవై వ ఏట కడప మండలం లో శ్రీ సురభి శ్రీ శారదా మనోవినోదినీ నాటక సమాజాన్ని శ్రీ సురభి చెన్నా రెడ్డి గారి ప్రోత్సాహంతో స్థాపించి ,అభినవ చిత్రాంగి ,విలాసం ,సత్య హరిశ్చంద్ర ,పా౦డువాజ్ఞాత వాసం ,శాకుంతలం ,స్త్రీ సాహసం ఏకాదశీ మహాత్మ్యం ,ధ్రువ చరిత్ర ,జయ దేవ చరిత్ర  నాటకాలు ధరించి ముఖ్య పాత్రలు ధరించి ,ఆసమాజానికి అధ్యక్షుడు గా ఉంటూ ,వాటిని ముద్రిస్తే తమ రాబడి తగ్గి పోతుందని పై సమాజం వారు వేడుకోగా ముద్రించలేదని చెప్పారు .క్రమంగా నాటకాభి రుచి తగ్గి ఇహ పర సాధకమైన హరికథనేర్చి కథాగానాలు చేస్తూ కవిత్వాన్ని కొంతకాలం ప్రక్కన పెట్టి ,రెండవ భార్య  రోగం తో బాధ పడుతూ ఒక శతకం రాయమని కోరితే , ‘’పరమేశ్వర ,శతకం’’ పూర్తి చేశానని ,అప్పటి నుంచి కవిత్వం పై పట్టుపెరిగి ‘’సుప్రకాశశతకం ‘’రాశానని ,వెంట వెంటనేతన కుటుంబం లో మరణాలు సంభ వించటం కొత్త రోగాలు పెరగటం వలన ,ప్రకృతి చికిత్స అమూల్యం అని గ్రహించి ‘’హఠ యోగాశ్రమం ‘’స్థాపించి ప్రకృతి చికిత్సా విధానం ప్రారంభించా ననీ , శతకొంతకాలం వ్యాపారమూ చేసినప్పుడు తనపై ఒకాయన బళ్ళారి కోర్టులో వ్యాజ్యం వేయగా  తాను  హాజరై తనతో ఆ శతకం తీసుకు వెళ్ళాననీ ,అక్కడ తనకు ఆప్తుడు ఆస్తిక సేవా సక్తుడు శ్రీ శృంగిమల ఆంజనేయులు అనే ప్లీడర్ గారింట బస చేశాననీ ,,ప్రసంగ వశాత్తు పై శతక ప్రస్తావన రాగా ఆయన ధర్మ పత్ని శ్రీమతి రంగనాయకమ్మ గారు కొన్ని పద్యాలు చదివి ,సంతోషించి శతకముద్రణకు తామే ధన సాయం చేస్తామని చెప్పి ,ముద్రించటమేకాక తనపై వచ్చిన వ్యాజ్యాన్ని కొట్టి పారేసేట్లు లాయర్ గారు చేశారని కృతజ్ఞత తెలుపుకొన్నారు .కళ్యాణ దుర్గం బోర్డ్ మాధ్యమిక పాఠశాల ఆంద్ర పండితుడు బ్రహ్మశ్రీ నాగసముద్రం టి.రంగా చార్యులుగారు ,,తన స్నేహితుడు ,రైల్వే కోడూరు క్రైస్తవ పాఠశాల  ఆంధ్ర పండితుడు బ్రహ్మశ్రీ కృష్ణ శర్మ ,శతకంలోని తప్పొప్పులు సవరించగ ,మతాలకు అతీతంగా ఉండటానికి ‘’సుప్రకాశ ‘’శతకం అని పేరు పెట్టి ముద్రించి ,పండితులకంటే పామరులకు అందు బాటులో ఉండేట్లు సరళంగా రాశానని చెప్పారు ‘’రాప్తాది సుబ్బదాసు –దేశ దాసు సుకవి .

  పండితాభిప్రాయాలు -1-ఆంద్ర వాల్మీకి వాసు దాసు –‘’శతకం గజేంద్ర మోక్షం లాగా నిరాకార పరబ్రహ్మను గూర్చి చెప్పబడింది ‘’అనగా 2-పుల్లం పేట సబ్ రిజిష్ట్రార్ శ్రీ ఎం .వెంకటస్వామి నాయుడు –‘’అసమానమైన నీతులను అతి సులభంగా రాశారు .దైవ ,మానవులకు అందని చూపు ను మహా నేర్పుగాఅం దించారు ‘’అన్నారు 3-బడకాయ పల్లి వాస్తవ్యులు అభినవ భారత శిఖా మణి శ్రీ మాడ భూషణం వేంకట నృసింహా చార్య పద్యాలతో ఆశీరభి నందన తెలియజేస్తూ-‘’వర కవితా వితాన,వాగ్విభవ ప్రతిభా ప్రభావం తో సత్కవీన్ద్రులకు తోడ్పడే శుభ వాణి వాణి మనోహరంగా సుబ్బదాస కవికి తోడ్పదిందనీ ,చక్కని శైలితో పదహారు వన్నెల దీప్తితో కవిత్వం ఉందని ‘’నిర్మల జ్ఞాన వైరాగ్య నిష్ఠ భక్తి ‘’ఇందులో పొంగి ప్రవహించాయని ,మరిన్ని రచనలు చేయమని ఆశీర్వదించారు .4- రైల్వే కోడూరుకు చెందిన శ్రీ వేదం వెంకట కృష్ణ శర్మ  గారు కూడా పద్యాలలో –‘’నీ వంటి అఖండ భక్తుడు ,భారత పుత్రుడు లేడు.దేశ దురాచార నాశనం సదుపదేశం,వేదాన్తభావం ,సువిచారం,పరమేశు సద్భక్తి ,ప్రజలకు భద్రతా కలిగించావు ‘’అన్నారు .5-శ్రీ సోమ పాళ్యం గారు కూడా పద్యాలలో –‘’తత్వసారం అంతా  దట్టించావు,భక్తీ ముక్తి దారి చూపావు ,  ఆయుర్వేదం ,ప్రకృతి స్నానం నాటకాలు రాసి ,దీనిలో వేదం వేదాన్తార్ధాలు సుప్రకాశం చేశావు .పద లాలిత్యం వాక్చతురత ,హేలాగతిగా తత్వ శాస్త్రం  చొప్పించావు ‘’అన్నారు 6-నిజాం లోని వనపర్తి సంస్థానం రాజానగరం వాసి శ్రీ కెవి నరసింహా చార్య –‘’పరమైన వస్తువు ఇందులో వర్ణి తమైంది .కవిత్వం సార్ధకత చెందింది ‘’అన్నారు పద్యాలలో .

  ఇది సీస పద్య శతకం .’’సుగుణ సంభావ్య సర్వేశ సుప్రకాశ ‘’అనేది శతక మకుటం .

మొదటి పద్యం లో –‘’శ్రీ కరుణా రస సింధు వాత్సల్యైక-పూర్ణు౦డ వై న నీ పూజ్యయశము – అణువణు వాదిగా , నా బ్రహ్మ పర్యంతమావరించిన నీదు నమిత మహిమ –నిఖిల జగజ్జాల నిర్మాణమున గడు-ప్రకటితం బైన నీ ప్రాభవంబు –నిఖిల లోకముల నిర్నిద్ర శక్తిని –గను సన్న నడుపు నీ కౌశలంబు –తే.గీ –గాంచి యుప్పొంగి నీ తత్వ మెంచి పొగడి –భక్తితొలుకాడ మృదుల భావములు పొంగ –శతకమర్పింతు గ్రహియింపు హితమనీష – ’’సుగుణ సంభావ్య సర్వేశ సుప్రకాశ’’అంటూ  సీసం లో భక్తి బంగారాన్ని కరిగించి పోతపోశారు దాసుకవి .తర్వాత గురువులను ఆదికవులు మొదలైన వారిని స్తుతించి ,శతక రచన ఎలా ఉండాలో ఇలా –‘’మాటిమాటికి భక్తీ ఉప్పొంగాలి వినేవారికి వీనుల విందు చేయాలి అర్ధం వాక్కులలో దూరిఉండాలి .భావం ఇంగితాన్ని బయట పెట్టాలి .రసం స్రవించి మానసిక జాడ్యం పోగొట్టాలి .ఒక్కోసారి హరికథలా ఉండాలి ‘’అని గొప్ప పద్యమే చెప్పారు .

  ఘోరాటవిలో దమయంతి తన్ను కామించిన బోయకు ఏ నీతి బోధించిందో ,రక్కసిమూకల మధ్య బాధ పడే సీతమ్మ రావణుడికి  ఏ నీతి విశదం చేసిందో ,కీచకుని మొహాగ్ని చల్లార్చటానికి ద్రౌపది ఏమి బోధించిందో ,పేరాశతో తన్నుకోరిన నహుషుడికి శచీ దేవి ఎలా బుద్ధి చెప్పిందో అలాంటి నీతుల విహారం భారత దేశం అన్నారు కవి .సురభినాటక కళా గురుడని  దేశ సంచారం చేయటం ,హరికథలతో మెప్పించటం ,భైషదవృత్తితో పరమ పేదలకు సేవ చేయటం ,అఖిల తత్వాలు తెలుసుకోవటానికి గురు సేవ చేయటం –‘’నీ ఆజ్ఞ..ఈ జన్మలోనే కాక  ,పూర్వ జన్మలలో  కూడా ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉంటాను .కృపామయా నీ చెంత చేర్చుకో ‘’అని శరణాగతి కోరారు

క్షమకంటే వేరే సౌఖ్యం లేదు .ఓర్పున్నవాడు ఆత్మా విదుడు ఔతాడు .నీ ధ్యాన నిర్మలదృష్టి ఉన్నవాడే ధన్యుడు కానీ శాస్త్ర పార౦గతుడు ముక్తి పొందలేడు .షడ్వి  కారాలతో ఉన్నది స్థూలం ‘’పదియు నేడు ఇంద్రియ ప్రాపకమై లింగ దేహంబు సూక్షం దేహం .అజ్ఞానం  ఈ రెండిటికి ఆధారం .మూడు అవస్తల చేత మూడు దేహాలు ముడి వేసుకొని ఉంటాయి .శుద్ధం ఏకం అద్వితీయం చిన్మాత్రమైన ఈశుని తెలియటం మోక్షం .ఆరు చక్రాలను చర్చించి పంచ ముద్రల భావం తెలిసి తారక శుద్ధితో ఆలోచన పరిశుద్ధం చేసుకొని శాస్త్రార్దా సారం తెలిసి, పతంజలి సూత్రాలు ,దండకాన్వయం ఎరిగి ,అజప గాయత్రి రహస్యం అవగాహనం చేసుకొని ,లంబికా యోగ లక్ష్యం గ్రహించి దివ్య మనస్కత ఉంటె సిద్ధికలిగి మోక్షం లభిస్తుంది .రాజయోగం అనే నదడి వీధిలో రధాన్ని వదిలేసి ,సంసారం అగడ్తలో పడకుండా నిన్ను పొందటమే యోగి లక్ష్యం.

  దేహాన్ని నాటక శాల చేసి ,హృదయాన్ని రంగస్థలం చేసి వృత్తి,బుద్ధి లను పెద్ద నటులుగా జేసి ,సంకల్పం ను తెరగా మార్చి ,కూటస్తుని దీపం చేసి ,కామాదులను మేళ తాల భాజంత్రీలుగా చేసి ,ఇంద్రియాలను’’ వారి ‘’గ చేసి , కదథ ను దేవి మహిమగా చేసి ,స్వప్నం లో ఆట చూపిస్తావు సూత్రదారిగాసాక్షిగా ఉంటూ .నువ్వు ఆడించినట్లు నేను  ఆడుతూ ఉంటాను .’’పగటిని , రేయిని కుంచె బట్టక చిత్రాలు గీసేవాడు బహురంగుల పుష్పాల తోటమాలి అయిన సృజనుడు ఎవరు ,నిర్జర అడవులలో నీటి ధారలను కూర్చి దాహార్తి తీర్చే దాత ఎవరు ,కొండ చిలువకు పుష్కల ఆహారాన్ని నోటికి అందించే వాడెవడు ,నా హృదయంలో మృదు నాదంతో సుస్థితుడు ఎవడు .అలాంటి ప్రభువుచిత్ప్రకాశాన్ని ఆశ్రయిస్తాను అనే మరో అసాధారణ పద్యరాజం రచించారు .’’బుద్ధి దీపం వెలిగించి మొనసి నాను –చిత్తమను పాన్పు నీకు సిద్ధమయ్యే –‘’వచ్చి విశ్రమించు అని నిండు మనసుతో కోరారు .కరుణశ్రీ గారి పద్యాలు కూడా ఈ ప్రేరణతో రాసినవే అనిపిస్తాయి .అందం ఆనందకరం ,వంద్యం మోక్షకారకం దివ్యం జ్ఞానప్రకాశకం మునిజన సేవ్యం,సజ్జన స్తవ్యం ,సారం ,బుధులకు ఆధారం ,,చిద చిదాకారం నిత్యం ,సంసారదూరం బ్రహ్మాండ కృత్యం ,యోగీంద్ర నృత్యం ,ఆధార సత్యం ,పలుకులకు ఊహలకు అందని నిష్కళంక నిర్వికారం అయిన నీ రూపు మాకు ప్రాపు .నిగమాలే నిన్ను పొగడ లేక ఆగమాగమైతే  నేనేమి పొగడగలను. ఏవో కొన్ని మాటలు కూర్చి శతక మాల తయారు చేసి నీకు అర్పిస్తున్నా .స్వీకరించి నన్ను నీ వాడిని చేసుకో అంటూ 106 వ సీసం తో శతకం పూర్తి చేశారు . .

  ప్రతిపద శుద్ధి, కమ్మని జాతీయాలు దివ్య ప్రవచనాలు ,గహన వేదాంత విషయాలు కరతలామలకం చేసిన వైనం ,భక్తిజ్ఞాన వైరాగ్య త్రివేణీ సంగమం తో సుబ్బదాసు కవి సుప్రకాశమానంగా ఈ సుప్రకాశ శతకం కూర్చి ఆస్తికజన వంద్యులయ్యారు .నాకు వారిని ,శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం కల్పించారు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-23-ఉయ్యూరు —

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’

అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’

‘’నా అక్షరాలు  శ్రమజీవుల చెమట బిందువులు ‘’,’’నా అక్షరాలు శ్రమజీవుల పాదరక్షలు ‘’ అని చెప్పుకొన్న కవి అక్షరం ప్రభాకర్ కొత్తగా ‘’అక్షర స్వరం ‘’కూర్చాడు . ఆస్వరం లో సప్త స్వరాలేకాదు అనంత భావాలకు ఊపిరిపోశాడు .ముందుగా ఘంటసాల మాస్టారు గారిపై ‘’పాటల పాఠశాల ఘంటసాల ‘’శీర్షికలో ఆయనను ‘’ఆదికవి వాల్మీకి అనంత శోకానికి –అచ్చ తెలుగు స్వరార్చన,నువ్వే ‘’అంటూ ‘’అనాది అక్షర యజ్ఞానికి –స్వచ్ఛమైన స్వరాన్ని –ఆయువుగా పోసిన –గాన నేత్రం నీదే నయ్యా ,అక్షర వాచస్పతి –వేద వ్యాస మహర్ష శోకానికి –గాన గాంధర్వ స్వరామృతం నీదేనయ్యా ,వనమాలి గీతోపదేశానికి –స్వేచ్ఛారాధన స్వర సంగీత సామ్రాట్ నీవే నయ్యా –మోక్షానికి రక్షాబంధనం కట్టిందీ,నీ మేని వేణునాదాలే –మేళకర్త రాగాలనీ ,అన్నమయ్య ఆర్తి, క్షేత్రయ్య కీర్తి నీదే నని ,త్యాగయ్య భక్తి దాహం ,రామదాసుస్పూర్తినీ పలికి౦చావని ,మానవ వికాస మార్గదర్శివి ,కులాస ,విలాస కైతలకు ఉయ్యాలలూపి ,ప్రణయ పంటల మధుశాలవైన నీకు ‘’ఈ అక్షర స్వరం ‘’అ౦కితమిస్తున్నానని వినమ్రంగా  అక్షరాంజలి సమర్పించాడు.

 మొదటి కవిత శీర్షిక ‘’ఓ!మనసా ‘’లో ‘’అజ్ఞానం పురుగు అలుముకొంటే –అహం పీఠం ఎక్కుతుంది .చిత్రసీమే శయ్యననెక్కే –శాస్త్రమేమో అంపశయ్య నెక్కే ‘’అని చింతించాడు .నిజం తెలిసి మాట్లాడకుండా ఉండద్దని ,ఐకమత్యమే అసలు కరువై ,నిత్యసత్యమేపలుకు బరువై పోయిందని వ్యధ చెందాడు .ఆదిలోనే వేసే తప్పటడుగుల ‘’తాట’’ తీసేయ్యమన్నాడు .అవినీతి నీడలో మేడలు కట్టద్దు ,అమ్మకడుపు గురించి ఆలోచించని పిల్లలు జీవ చ్ఛవాలు .క్రమశిక్షణ రక్షణ ఎక్కడున్నా చేతులెత్తి నమస్కరించు ‘’అంటూ మనసుకు ప్రబోధ స్వరాలు వినిపించాడు .

  జీవితం ప్రమాదం అంచున జీతం కోసం జాగారం చేస్తోందని కొత్తగా చెప్పాడు .మనసులోని లోపాలు తొలగిస్తేనే దీపావళి అంటాడు .పతనం ప్రారంభమైనప్పుడే ‘’పథక రచన ఉండాలి .సాగుబడి దిగుబడి రాబడి పుట్టుబడి పెట్టు బడి ,కాడి, మేడి అన్నీ చంకనాకిపోయి, బతుకు జట్కాబండి అయింది.’’సంశయమే అ౦కు శమై ,అజ్ఞానమే ఆయుధమై –మిడిసిపడకు’’అని ప్రబోధిస్తాడు ప్రభాకర్  .కష్టించే ప్రతివాడికి ఫలితం ఉంటుంది ‘’అని అక్షర సత్యం చెప్పాడు ప్రభాకరన్న .అక్షరాలను మ్యూజియం లోపెట్టి ప్రత్యక్ష ప్రదర్శనకు రమ్మని వేడుతున్నాం . అక్షరాలకు చెదలు పట్టిస్తున్నాం అజ్ఞానంతో  అంటాడు అక్షర సాధకుడు ,రక్షకుడు ప్రభాకర్ .  

ప్లాస్టిక్ తెల్లదయ్యం నివురు గప్పిన నిప్పులా సర్వం దహిస్తోంది .అక్షర యోధులకు లాల్ సలాం చేస్తూ ,సర్కారు బడులు బాగుపడాలని చేసే వారి పాదయాత్రలు  ,విద్యా పరిశ్రమ చేస్తున్న అక్షర యోధులైన ఖమ్మం కన్న బిడ్డలకు  లాల్ సలాం చేస్తూ అక్షరాంజలి ఘటించాడు.

తన తండ్రి జబ్బుతో ఉన్న తన’’ తల్లి మంచం చుట్టూ –కంటి చూపును కంచె గావేసి పహరా కాశాడని ‘’కన్నీటి అక్షర తర్పణమిచ్చాడు ,నాన్న నడిచిన నేల విడిచిన జ్ఞాపకాలు మధురాతిమధురం అని పొంగిపోయి ఆనందాక్షర బాష్పాలు రాల్చాడు .మొక్కల విరించి వెంకటయ్యకు అక్షరమొక్కులు తీర్చాడు .పసిపాప లేత పలుకులు –ఆనందపు మొలకలు అంటాడు .గరీబోల్ల తిండి గి౦జల గాసం పై  -మెత్తని బెత్తంతో మొత్తింది జీ.ఎస్. టి .అన్నాడు చీదరిస్తూ .’’ఉత్తరాలు –రేపటికి పునాది రాళ్ళు –భావి తరాలకు ఆనవాళ్ళు ‘’అని ఉత్తరాలు రాయటం తగ్గి అక్షర సేవ కనుమరుగై పోతుందని బాధపడ్డాడు అక్షర ప్రేమికుడు కవి .కొన్నిమాటలు పెనిసిలిన్ కన్నా పవర్ ఫుల్ గా పని చేస్తే ,కొన్ని ఆటం బాంబుల్లా పేలి ఛిద్రం చేస్తాయి .ప్రభాకర్ కు ఇవాళ మాట’’ మోడు బారిన వృక్షం లా ,బీడుబారిన ఊసర క్షేత్రంగా ,క్షతగాత్రుల రోదనగా ,సగం ఫిలమెంట్ రాలిన కరెంట్ బల్బ్ లా ,అదును ,పదును తగ్గి ఆత్మ న్యూనతలో ‘’కనిపించింది.కానీ ఆ మాట ‘’ఆది అనాదులకు ఆధునికతకు వారధి సారధి అవుతుందని ఆశతో అక్షర పుష్పమాల అల్లి అలంకరించాడు .

  ఈ కవితాక్షరాలలో ప్రభాకర్ చిలికించిన ప్రతి అక్షరం సార్ధకమైంది .సాక్షరస్వరాలు ఊది, ఆనందపు హరివిల్లు పూయించాడు .అతడు నిత్యాక్షర సేవకుడు అక్షర కృషీవలుడు అక్షరజ్ఞాని ,అక్షర హృదయవేది ,అక్షర శిల్పి .ఎందుకో నామీద గురు భావం కలిగి ఈ స్వరాలకు ముందుమాట వేణువు నూదమని కోరాడు . రాగస్వరాలు తెలియకపోయినా అతనికోరిక తీర్చాను .వేణువు మోహన వంశీ అయిందో లేదో నాకు తెలీదు .మీరూ చదివి ఆనందించండి .

 గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment