వీక్షకులు
- 1,107,559 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సుందర కాండ
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-24
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-24 రాక్షసరాజు వెళ్ళిపోగానే అక్కడి కావలి రాక్షసాంగనలు సీత దగ్గరకొచ్చి కోపంతోకూడిన కఠినమైన మాటలతో ‘’రావణుడు పులస్యబ్రహ్మ వంశం వాడు .నువ్వు అతనిభార్యవైతే నీకు గౌరవం ఎక్కువౌతుంది .ఏకజట’’మరీచి అత్రి ,అంగిరసుడు ,పులస్యుడు ,పులహుడు ,క్రతువు అనే నలుగురు ప్రజాపతులలో పులస్యుడు బ్రహ్మమానస పుత్రుడు .అతడి మనో సంకల్పంతో … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-23
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-23 సీత మాట్లాడినమాటలకు ఎక్కడోకాలి రావణుడు ఆమెతో ‘’మగాడు అనునయి౦చిన కొద్దీ స్త్రీ వశపడుతుంది .గుర్రం పెడత్రోవ పడితే సమర్ధుడైన సారధి దాన్ని దారిలోపెడతాడు .నీపై ఉన్నకామాన్ని నా కోపం అడ్డగిస్తోంది .కామం ఏర్పడితే దయ ప్రేమకూడా కలగటం సహజం .నిన్ను అవమానించవచ్చు చంపచ్చు,వానప్రస్త వేషం లో ఉన్న … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-22
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-22 రావణుడి మాటలకు తల్లడిల్లి తనకు అతడికి మధ్య ఒక గడ్డిపోచనుంచి సీతాదేవి ‘’నాపై మనసు నీభార్యలపై మరల్చు పాపం చేస్తే మోక్షం రానట్లే నువ్వు నన్ను కోరటానికి అర్హుడవు కాదు .ఇక్ష్వాకు వంశ పతివ్రతను నేను .నీ నిన్ద్యమైనకొరిక అంగీకరించను .నేను పరభార్యను .సజ్జన ధర్మాన్ని పాటించు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-21
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-21 రావణుడు సీతతో మాట్లాడాటం మొదలుపెట్టాడు ‘’భయంతో నీశరీరాన్ని దాస్తున్నావు సకలజన మనోభిరామ౦ గా ఉన్న నిన్ను నేను మోహిస్తున్నాను .నాపై వలపు చూపకపోతే నిన్ను తాకనే తాకను .నాశరీరంలో కామం వరదలై ప్రవహించినా సరే . ఇక్కడ నాకు తెలియకుండా ఎవరికీ ప్రవేశం లేదు. భయం వదిలి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-20
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-20 ఇంత జరిగే సరికి రాత్రి మూడుజాములసమయం దాటి,చివరిజాము మాత్రమే మిగిలింది .అప్పుడు సాంగ వేదపండితులు , ,శ్రేస్ట యాగాలు చేయించగల సమర్ధులు ఐన బ్రహ్మరక్షస్సుల వేద ఘోష వినబడింది .మంగళవాద్యాలు మ్రోగాయి .రావణుడు వెంటనే నిద్ర లేచి జారినమాలలు ,వస్త్రాలతో సీతను తలచుకొన్నాడు .మదంతోమదించిన వాడు ,మదన … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19 తెల్లకలువల సమూహం గా ప్రకాశించే నిర్మల చంద్రుడు ,నల్లని జలాలలోకి హంస వెళ్లినట్లు నిర్మలాకాశం పైభాగాన కనబడి ,తనకా౦తితో సహాయ పడేట్లు హనుమను సేవిచటానికి వచ్చాడు .ఆచల్లని వెన్నెలలో హనుమ సీతాదేవిని చూశాడు .ఆమె చుట్టూ ఒంటికన్ను ఒకే చెవి కలవారు చేటచెవులతో తలను దాచు కొన్నది … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18 ముందుకు దూకుదామను కొన్న సమయం లో హనుమకు మళ్ళీ దుఖం ఆవరించింది .దీని నివారణకు సీతారామనామ స్మరణమే సాధనం అని భావించి ‘’అమేయ పరాక్రమశాలురైన సోదరద్వయం ,అమిత సాధుశీల సీతాదేవి లకే ఇలాంటి దుఖం సంభవిస్తే’’ కాలాన్ని ఎవరూ అధిగమించటం సాధ్యం కాదు ‘’-అనిపిస్తోంది అనుకొన్నాడు . … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17 అశోక వనం అంతా’’సంతానకం ‘’అనే తీగెలతో పూలు కాయలు పండ్లు ఉండే చెట్లతో కళకళలాడుతోంది .ప్రతిక్షణం రెక్కలల్లార్చే పక్షులతో ఆకులు ,రెమ్మలు లేని అశోకవనం లా ఉంది .ఎర్రని అశోక పుష్పాలు భూమిపైరాలి నిప్పు కణికలేమో అనిపిస్తున్నాయి .అప్పుడు శింశుపా వృక్షం కింద మలిన దేహంతో ,నిట్టూర్పు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-16
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-16 అశోక వనం చేరిన హనుమ అక్కడ వస౦తోదయం తో పులకించిన వృక్షజాలాన్ని చూశాడు .మృగగాపక్షి సంతతి మహాదానంద౦ తో కనిపించాయి .పక్షులకిలకిలారవాలు వీనుల వి౦దు చేశాయి వనాలు ఉపవనాలతో అది ఉదయించే సూర్యునిలా కనిపించింది .అతని సంచారంతో నిద్రిస్తున్నపక్షులు మేల్కొన్నాయి .రకరకాల పుష్పాలు పుష్ప వర్షం కురిపిస్తూ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-15
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-15 విమానం నుంచి ప్రాకారం పై దూకి ,మేఘాలమధ్య మెరుపులా వేగంగా వెళ్ళాడు హనుమ .అన్ని చోట్లా వెదికినా సీత కనపడనందుకు విచారించి ,సంపాతి చెప్పిన దానిప్రకారం సీత లంక లోనే ఉండాలి .అయోనిజ సీతామాత రావణుని వశం కాదు .రావణుడు ఆమెను ఎత్తుకొని వచ్చేటప్పుడు జారి కిందపడి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14 వెతకటంలో అలసత్వం చూపానేమో అనే అనుమానం తో లతా గృహాలు ఉద్యానవనాలు ,నైట్ హాల్టింగ్ ప్రదేశాలు కూడా వెతికినా సీతా దేవి కనిపించలేదు .ఒకరకమైన వైరాగ్యభావం సహజం గా వచ్చేసి ‘’సీత చనిపోయే ఉంటుంది లేకపోతె కనిపించేదే గా .రావణుడు ఎన్ని క్రూర ప్రయత్నాలు చేసినా ,తనశీల … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13
సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13 బుసకొట్టే సర్పం లాగా నిశ్వసిస్తున్న రావణుడి దగ్గరకు చేరి హనుమ భయపడినట్లు కనిపించి ,తర్వాత వెనక్కి తగ్గాడు .పాన్పుపై ఉన్న రావణ భుజాలు బంగారు బాహుపురులతో ఇంద్ర ధ్వజాల్లా కనిపించాయి పూర్వం ఐరావతం తో పోరాడినప్పుడు ఏర్పడిన గాయాలమచ్చలు ,,దేవేంద్రునితో తలపడినపుడు తిన్న వజ్రాయుధ గాట్లు ప్రకాశంగా కనిపించాయి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12 మూడవసారి హనుమ రావణ భవన ౦ లో వెదికాడు .ఆమడ పొడవు అరామడ వెడల్పు ఎన్నో మేడలతో అలరారింది పుష్పకం మధ్యలో నివాసం ఉన్న రావణ ప్రధాన గృహం చేరాడు .అక్కడి ఏనుగులు నాలుగు ,మూడు దంతాలతో విచిత్రంగా ఉన్నాయి .అతని రాక్షసభార్యలు, చెరబట్టి తెచ్చిన రాజకన్యలు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11 మళ్ళీ రావణ సౌధానికి వచ్చిన హనుమ అక్కడి భోగ ఐశ్వర్యాలను శిల్పకళను చూసి సాక్షాత్తు ’మయుడే వచ్చి నిర్మించాదేమో ‘’అనుకొన్నాడు .ఇంతలో పుష్పక విమానం కనిపించింది .దాని శోభా వర్ణనానాతీతం .అది అనేక దాతువులచేత ,పుష్పాల పుప్పొడితో ఉన్న కొండ లాగా కనిపించింది .దాని రత్నకాంతులు కళ్ళు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10 సీతాదేవి కనిపించలేదని బాధపడి దుఖించిన హనుమ మరింత వేగంగా వెదకటానికి బయల్దేరి రావణ గృహం చేరాడు .అది బంగారు వెండి ద్వారాలతో ,మేలిమిగుర్రాలు రథాలతో ,సింహాల ,పులుల చర్మాలతో కప్పబడిన దంతం వెండి బంగారం కదిలితే వినసొంపైన శబ్దాలు చేసే సుందర రథలతో ,రాత్నాసనాలు నానామృగ పక్షి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9 నెన్నెల మెండుగా ఆకాశం లో కురిపిస్తున్న చందమామను హనుమ చూసి పరవశించాడు జనుల దుఖాల్ని పోగొట్టి సముద్రానికి వృద్ధి కలిగింఛి ప్రాణికోటికి ప్రకాశం కలిగించే చంద్రుని దర్శించాడు .మందర పర్వత కాంతి ,సాయం సముద్రానికి ఉన్న ప్రకాశం జలకమలలకున్న వెలుగువంటి కాంతితో చంద్రుడు శోభాయమానంగా ఉన్నాడు .వెండి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-8
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-8 లంకా దేవతను చంపి హనుమ ద్వారం కాని ప్రదేశంద్వారా ప్రాకారం దాటి ,శత్రు శిరసుపై కాలు పెట్టినట్లు ఎడమ పాదం పెట్టాడు .శుభానికి కుడికాలు పెట్టాలి అశుభానికి ఎడమపాదం అన్నది మన సంప్రదాయం .అది తెలిసిన ప్రజ్ఞా శీలి .రాత్రి వేళ యధేచ్చగా లంకలో తిరిగి చూశాడు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7 కాలోచిత ఆలోచన హనుమ ప్రత్యేకత .బలమైన సైనికులు అకుక్షణం పహారా కాస్తున్న ,వైభవం లోకుబేరుని అలకానగరం లా ,దేవేంద్రని అమరావతిలా ,స్వర్ణద్వారాలు వైడూర్యవేదికలు నేలంతా రత్నఖచితంగా వైడూర్యాలమెట్లతో సుందర వైభవ లంకను హనుమ చూశాడు .దానిగురించి మనసులో ‘’ఈ లంక గొప్పతనం కుముడుడికి ,అ౦గ దుడికి సుషేణుడికి,మైంద … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6 సముద్రం లంఘించి త్రికూట పర్వత శిఖరం పై ఉన్న లంకా నగరం చూశాడు హనుమ .హరి దర్శనానికి పులకి౦చా యేమో చెట్లు అన్నట్లు సువాసన వెదజల్లే పూల వర్షం కురిపిస్తే ,పూలతో చేయబడిన కోతిలా ఉన్నాడు .అలసట నిట్టూర్పులు లేకుండా ఉన్న అతడు ‘’వందేమిటి సహస్ర యోజనాలున్న … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5 ఇంకో విషమ పరీక్షను ఎదుర్కున్నాడు హనుమ .కామరూపి సింహిక చాలాకాలం తర్వాత తనకు మంచి ఆహారం గా అతి పెద్ద ప్రాణి లభిస్తోందని ఎంచి ,హనుమ నీడను పట్టి గుంజింది .ఈఅకస్మాత్తు ఘటనకు ఆశ్చర్యపోయి ,ప్రచండమైన ఎదురుగాలి చే వెనక్కి నడుస్తున్న పడవలాగా తనపని అయిందని ,అన్ని … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-4
హనుమ చేసినపనికి దేవేంద్రునితో సహా సకల దేవతలు మెచ్చి ఆశీర్వదించారు .మైనాకునితో ఇంద్రుడు ‘’నీ పనికి ప్రీతి చెందాను .ఇకపై నావలన నీకు అపకారం జరగదని హామీ ఇస్తున్నాను .జంకు గొంకులు లేకుండా సుఖంగా వర్ధిల్లు .మహా సాహసకార్యానికి వొడిగట్టినహనుమకు వందయోజనాలు దాటగానే అతనికి ఏ అపాయం వస్తుందో అని భయపడ్డాం .ఏమాత్రం భయపడని హనుమ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3 ఆకాశం లో చేతులు సాఛి హనుమ ఎగురుతుంటే ,ఆ చేతులు పర్వత శిఖరాలనుంచి వస్తున్న అయిదు తలల సర్పాలులాగా ఉన్నాయి .ఒక్కోసారి మరీ కిందకు దిగి ఎగురుతుంటే సముద్రజలాలను తాగుతున్నాడేమో అనిపించింది .రెండుకళ్ళుమెరుపులతో ఉన్న అగ్నిగోళాలుగా,ఉదయించే సూర్య చంద్రుల్లా దర్శనమిచ్చాయి .ఎర్రని ముక్కు కాంతి వలన ముఖం … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2 సుగ్రీవుని పనుపున శ్రీ రామాజ్ఞ గా దక్షిణ వైపు సీతా దేవిని వెతకటానికి అంగదుని నాయకత్వం లో జాంబవంత ఆన్జనేయాదులు బయల్దేరి దక్షిణ సముద్రం చేరి అలసి కాసేపు విశ్రమించి సముద్ర లంఘనం విషయమై చర్చి౦చు కొంటున్నారు .ఇదేమీ తనపనికానట్లు నిర్లిప్తంగా ఒక ఎత్తైన బండమీద హనుమ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం సుందరకాండ మనోభీస్టాలను ఫలప్రదం చేసే ,మధుర కాండ .నాకు ఇందులో ఆంజనేయుడు బహు పార్శ్వాలతో ,విభిన్న భావాలతో కనిపిస్తాడు .వీటిలో జాతి లక్షణమైన వానర లక్షణం తో పాటు ,అమాయక ,,తొందరపాటు ,ఆలోచనారహిత ,నిశ్చేష్ట ,నిర్లిప్త లక్షణాలూ ,ధీర వీర ,పరాక్రమ శౌర్య పార్శ్వాలూ ,ధీశక్తి … Continue reading

