జనక మహోత్సవం
అందరికి జనక మహోత్సవ శుభా కాంక్షలు
మనకు గొప్ప తండ్రులున్నారు .వారిని గుర్తుంచుకొనే రోజూ .మన వాళ్ళను మాత్రమే కాదు .జాతికి మార్గ దర్శనం చేసే వారినీ స్మరించాలి. పురాణ పురుషులలో దశరధుడు కుమారులైన రామాదులను ఎంతో ప్రేమగా పెంచి ,వాళ్ల చదువు సంధ్యలన్నీ స్వయం గా పర్యవేక్షించి ,వారికేమి కావాలో అన్నీ సమకూర్చాడు .ముఖ్యంగా రాముడంటే బహిప్రాణం గా జీవించాడు .వదిలి ఒక్క క్షణం కూడా వుండే వాడు .కాని తనకుమారునికి సకల విద్యలు విశ్వామిత్ర మహర్షి నేర్పించటానికి తనతో యాగ సంరక్షణకు పంపమంటే ముందు సందేహించినా కులగురువు ఆజ్న తీసుకొని పంపాడు .కొడుకు అభివృద్దే ధ్యేయం .అందుకే రామునికి తండ్రి ఆంటే అంత అభిమానం పితృవాక్య పాలన కోసం అరణ్యాలకు వెళ్ళాడు .అదే ఆదర్శం అని లోకానికి చాటాడు . తర్వాత శ్రీ కృష్ణుని తండ్రి వసుదేవుడు తాత్కాలికం గా కొడుక్కి దూరమైనా కంస సంహారం తర్వాత వాళ్ళని వదిలి పెట్టి ఉండలేదు .అలాగే పెంచిన నందుడు కూడా అంతే కృష్ణ బలరాముల్ని కంటికి రెప్పలాగా కాపాడాడు .పెంపుడు తల్లి యశోద ,కన్న తల్లి దేవకీ అంతే .రాక్షసుల వల్ల కొడుకులకు ప్రమాదం అని పిల్లా జల్ల తో మొత్తం రేపల్లెజనాన్ని వేరొక సురక్షితప్రాంతానికి తరలించాడు .అదీ పుత్ర ప్రేమ అంటే .పరశురాముని తండ్రి జమదగ్ని కూడా కుమారుని తన అంత వాణ్ని చేశాడు .ద్రోణుడు తన పుత్రుడు ఆశ్వర్ధామ కు సకల విద్యలు నేర్పి తండ్రిన మించిన కొడుకు ను చేశాడు .శివుడు తన కుమారుడు వినాయకునికి విఘ్నాదిపత్యం ఇచ్చాడు .బ్రహ్మ కుమారుడు నారదుడు సకల విద్యా వేత్త. తండ్రినుంచి సంక్రమించిన విద్య . ఇలాగ ఎందరో పురాణ పురుషులు తమ కుమారులను వున్నతోన్నతం గా తీర్చి దిద్దారు .వాళ్ళ కలలను వారిలో సాఫల్యం పొందేటట్లు చూసుకొన్నారు . .
ఆ ఆధునిక కాల౦ లో the great son of a great father అని జవహర్ లాల్ కు ,ఆయన తండ్రి మోతీలాల్ కు పేరు .the great daughter of a great father అని ఇందిరకు ,జవహర్ లాల్ కు పేరు . రవీంద్ర కవి తండ్రి దేవేంద్రుడు కూడా అమితపుత్ర వాత్సల్యం తో పెంచి ,అన్నీ ఇంటిదగ్గరే నేర్చుకొనే సౌకర్యం కల్పించాడు .గాంధీ గారి తండ్రీ కొడుకు కోరింది చేశాడు .భయ భక్తులు ,నిబద్ధత సంక్రమిమ్పజేశాడు .సరోజినీ నాయుడి తండ్రి కూతురు ఆశలు నెరవేర్చాడు .కవి సామ్రాట్ విశ్వ నాద సత్యనారాయణ గారికి తండ్రే ఆదర్శం .ఆయన కోరిక మీదనే రామాయణ కల్ప వృక్షం రాశాడు . వేయి పడగలు నవల లో పాత్ర తండ్రిదే .ఎందరో హరికధ పితామహులు తండ్రి ప్రేరణ తో ఆ విద్యకు సార్ధకత తెచ్చారు . ప్రముఖ వాగ్గేయ కారుడు త్యాగబ్రహ్మకు తండ్రి గురువు . ఆయన అడుగు జాడల్లో సంగీతా సాధన చేసారు బాలమురళీ కృష్ణ తండ్రి స్ఫూర్తితో ఎదిగాడు . బాల సుబ్రహ్మణ్యం కు సంగీతం నేర్పి ఇంత వాడుగా ఎదగ టానికి తండ్రి ప్రోత్సాహమే . సంగీత విద్వా౦ సులందరికీ దాదాపు తండ్రులే అన్నీ,ద్వారం ,మల్లాది సోదరులు ,హిందుస్తానీ సంగీత మూర్తులందరికి సాంప్రదాయంగా త౦డ్రుల నుంచే విద్య సంక్రమించింది . చిత్రలేఖనం ,నాట్యం, బుర్రకధ ,చిందు ,పిచ్చిక గుంటలు అన్ని కలలు తలి దండ్రుల దగ్గర నేర్చేవే .నాటక రంగ ప్రముఖులు ఇలాగే విద్య న్నేర్చారు .ఇవాళ సిని రంగాన్ని ఏలుతున్న యువ హీరోలు ,హీరోయిన్లు వారసత్వ సంపద గా నిలబడ్డ వారే .నిర్మాతలు తండ్రి వారసత్వాన్ని కోన సాగిస్తున్న వారే .ఇలా తండ్రి ప్రభావం అన్ని రంగాల్లో అందరి మీయా గాదం గా వుండటం చూస్తూనే వున్నాం .ఈ కాలమ్ లో తండ్రి అమెరికా వెళ్తే కొడుకూ వెళ్ళటమే. తండ్రి సాఫ్ట్ వారే అయితె కొడుకూ అంటే అంతె తండ్రి డాక్టర్ -కొడుకు అదే బాట తండ్రి ఇంజనీర్ పుత్రుడూ అదే దారి .లాయర్ కవి ,రచయిత ,విమర్శకుడు ఆంద్ర దేశం లో లేరు అంతే అతిశయోక్తి కాదు .
కాదంబరి అనే వచన కావ్యాన్ని సంస్కృతం లోరాసిన పట్ట బాణుడు త్సండ్రినుంచి సకలం నేర్చాడు .ఎదురుగా కొడుకును మెచ్చే వాడు కాదు . కాని భార్యతో కొడుకు పాండిత్యాన్ని పరవశంగా ప్రశంసించే వాడట . కవయిత్రి మొల్లకు తండ్రియే ప్రత్యక్ష గురువు . శ్రీ కృష్ణ దేవరాయల కుమార్తె గొప్ప కవయిత్రి అయిందంటే తండ్రి స్ఫూర్తే .అమెరికా ప్రెసిడెంట్లు తండ్రి కుర్చీలో కూర్చున్న వారే. మన దేశం లో లోకసభ ,రాజ్యసభ అసెంబ్లీ స్థానాలు తండ్రి వదిలేసినవే .మంత్రులు అంతే . అప్పుడు సామర్ధ్యం ,ప్రతిభ చూసి ఎంపిక చేసే వారు . ఇప్పుడు సామాజిక న్యాయం ,సానుభూతి తో సీట్లిచ్చి బలవంతం గా కూర్చో బెట్టటం అలవాటైంది .అలా ఇవ్వనందుకు ఒకకుర్రాయన వీధిన పడి ఎలా ఆగం చేస్తున్నాడో చూస్తున్నాం .చాలా మంది ప్రతిభ సామర్ధ్యం చూపి నిలబడ్డారు .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్– 19 -06 -11 . .


Father’s Day = జనక మహోత్సవం
బాగున్నది తెలుగు పదం
LikeLike