మా కాశీ -మజిలీ- కధ

సాహితీ బంధువులకు శుభ కామనలు    .మేమిద్దరం ,మా బావ మరిది కుటుంబం తో ఈ నెల 21 నుంచి కాశి ప్రయాగ యాత్రలు చేసి 25 కు హైదరాబాద్ కు తిరిగి వచ్చాము .ముందు ప్రయాగ చేరి త్రివేణి సంగమ పవిత్ర పుష్కర స్నానం చేసి అక్కడి బడే హనుమాన్ వేణి మాధవ్ స్వామి వార్ల దర్శన౦ చేసి ,నెహ్రు గారి ఆనంద మహల్ చూసి భరద్వాజ మహర్షి ఆశ్రమం చూసి ఆనందం పొందాము. తిధుల ప్రకారం 22 జ్యేష్ట బహుళ సప్తమి    నాపుట్టిన రోజూ .ఆ వేడుకను సంగమ స్నానం తర్వాత సంగమ స్థానం లో పడవ  మీద జరుపుకున్నాము .ఉయ్యూరునుంచి చేసి తెచ్చిన నాకు ఇష్టమైన మైసూరు పాకు ను అందరికి పెట్టి సరదా గా గడిపాము .మా బృందం అంతా శుభాకా౦క్షలు చెప్పారు .ఇలా త్రివేణి సంగమంలో పుట్టిన రోజూ జరుపుకోవటం వింత అనుభవం .
— 23  తేది కాశీ చేరి హరిశ్చంద్ర ఘాట్ లో పావన   గంగా స్నానం చేసి ,అక్కడే దగ్గరలో వున్న చల్లా లక్ష్మణ శాస్త్రి అనే కాశీ పురోహితుల ఇంటిలో మా బావ మరిది వాళ్ల అమ్మ గారి ఏడవ మాసికం జరిపాడు  ఆంటే మా అత్త గారిది అన్న మాట .సాయంత్రం కాలభైరవ విశాలాక్షి ,విశ్వనాధ,  గణపతి దర్సన౦చేసి తరించాము .బెనారస్ హిందూవిశ్వ   విద్యాలయాన్ని కూడా చూశాము ..
              24 ఉదయం మణికర్ణికా ఘాట్ లో స్నానం చేసి అవతలి తీరం లోని మంచి ప్రవాహగంగలో కూడా పుణ్య స్నానం చేశాము అక్కడ నుంచి మళ్ళీ కాశీ విశ్వేశ్వర అన్న పూర్ణదర్శనం   చేశాము . మాతో వచ్చిన మా ఒదిన గారు ఆంటే మా ఆవిడ అక్క గారు లక్ష్మణ శాస్రి గారింట్లోనే గోదానం చేసి 20 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసింది .  రాత్రి బయల్దేరి 25 రాత్రికి హైదరాబాద్ చేరాం .రాను ,పోను ప్రయాణం అంతా పాట్నా ఎక్స్ ప్రెస్ లోనే.  26 తేది న అమెరికా లో కాలిఫోర్నియా లో ఉంటున్న మా రెండో మేనల్లుడు కుటుంబం తో సహా వచ్చి వాళ్లఅబ్బాయి  ఉపనయనం హైదరాబాద్ లో వాళ్ల స్వగృహంలో జరిపితే వెళ్లి చూసి ఆశీర్వది౦చాము  .27  హైదరాబాద్ లోమా   పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో నా పుట్టిన రోజూ జరిగింది  dates   ప్రకారం    .మీరు పంపిన శుభాకా౦క్షలకు  కృతజ్ఞతలు .
                   30  వ తేది గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి బీద రధం (గరీబ్ రధ్ )రైల్ లో బెంగళూరు మా రెండో అబ్బాయి శర్మ దగ్గరకు మేమిద్దరం వెళ్తున్నాం .ఇప్పటికింతే ..మళ్ళీ కలుద్దాం     మీ    దుర్గా ప్రసాద్  .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.