విశ్వం చాలని కవి సమ్రాట్ విశ్వ నాద
విజయ వాడ లో శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారి సాహిత్య సమాలోచనం ఘంటసాల సంగీతా కళా శాల లో నిన్నటి నుంచి మూడు రోజులు జరుగుతున్న సందర్భం గా చంద్రునికో నూలు పోగు గా ఆయన విశిష్ట రచన కల్పవృక్షం నుండి కొన్ని పద్యాలు మీ కోసం .నాక్కు తెలిసింత వరకు భారతీయ్ సాహిత్యం లో ప్రకృతిని ఒక యజ్ఞం గా భావించి రాసిన కవి విశ్వ నాద ఒక్కడే .ఇది వేదం లోని భావం .దాన్ని తన రచనలో వీలున్నప్పుడల్లా యజ్నభావాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు .అందుకే అందరికంటే ఊహల్లో ,ఆలోచనల్లో ఆయన అందనంత ఎత్తున ఉంటాడు .వన శోభలో ఆ యన దర్శించిన యజ్న విభూతి చూడండి .బాల కాండం లోని పద్యమిది
”ఎర్రనౌ నేత్రంములిష్టి వేలానల-ధూమ సంతానంబు తూరినట్లు —ఆకులు తినుట దీక్షా కాల భోజన -నియమ తీవ్రత చేత నెగడి నట్లు
చిగురాకు ముక్కున జిమ్ముతి జుహుపుచే -బాత్రాదికంములు పట్టి నట్లు –పంచమ స్వరము స్తోభాలు చక్కగా జాచి –సామ గానంములు సదివి నట్లు
రేకలీకల నలుపు ధరించినట్టి ,-నియమ వస్త్ర మాలిన్యంబు నెరయు నట్లు –సప్త తంతు మహాకార్య సమయమందు –గర్త వోలిక కోకిల గాను పించే .
రెండో పద్యం
ప్రతి రసాల కుంజంబు బచ్చి పిందెల తోడ -నెల మసలిన కాంత వలె దోచే –ప్రతి నిష్వన ద్బంభరము యజ్న దక్షిణ -కై ఎగు బ్రాహ్మను నట్లు తోచే
ప్రతి మల్లె పూవు సవా ప్రేష్ఠ హవిరార్ధ -సుగ్రుహీత లాజల చొప్పు దోచే -ప్రతి చిన్న పూదోట పాలిత దోహద ధూప -మూల యజ్న వాటిక వలెను తోచే
మాధవుడు సవా ప్రీతుదంమాట కలిమి -నెల్ల రీతుల సాగింప నేమో యనగా –దాను దద్ధిత రూప మాధవుడు వచ్చే -దీప్త మఖ యోగ్య నిర్వర్షి దిష్ట మొర్తి .
మూడవ పద్యం సుందరకాండ లో హనుమ దర్శించిన సీతా సాధ్వి స్వరూపం .సీతా రాములు ఎక్కడ వున్నా అభిన్నులే అనే గొప్ప భావాన్ని పోదిగిన్ పద్యం .ఈ వూహ కూడా ఏ కవికీ రాక పోవటం విశ్వ నాద ప్రజ్న కు పట్టాబ్భి షేకమే .
”ఆక్ర్రుతి రామ చంద్రు విరహాక్రుతి ,కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి -కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు( శిరోజాలు)రామ దేహాక్రుతి
సర్వ దేహమున యందున ,రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి -కూరుచున్న విధమంతయు స్వామి ప్రజ్ఞా మూర్తియై .”
అంతటి మహాను భావుని గురించి స్వర్గీయ కేతవరపు రామ కోటి శాస్త్రి గారి కైమోడ్పు –ఇందులో భావం –విశ్వ నాద సాహిత్య స్నానమే ముక్తి కంటే ముందు తాను కోరుకుంటాను అని చెప్పటమే .మోక్షం కన్నా విశ్వ నాద రచనలే శ్రేష్టం అనే గొప్ప భావన శాస్త్రి గారిది .
”పోరపాటై జనియిన్చితిన్ ప్రభూ -సరే పోనీ -మరీ జన్మకున్
పరమోపజ్న నిధాన ,దివ్య దిషనా భ్రాజిష్ణువౌ ,విశ్వ నా
ద ,రసోదంచిత ,సాహితీ విమల తీర్ది ,స్నాన పూతాత్మా గా
కరునిమ్పం దగు ,ముక్తిమాట అటుపై కాశ్మీర నేత్రచ్చవీ .
11 .11 .11 శుభాకాంక్షలతో —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ .
