కన్యాశుల్కం లో కరటక శాస్త్రి —2
కరటక శాస్త్రి పాత్ర ప్రవేశం పై వివరించాను .ఆమె పుట్టింటి సొమ్మును కూడా ”అగ్ని ”లో వ్రేల్చేసి ,చెయ్యి దులుపు కుంటున్నాడు బావ నిజాన్ని ,నైత్యాన్ని ,తూర్పార బట్ట గల గలిగిన ధైర్యం ఉన్న వాడు కరటకం .అతన్ని ఏమీ అనలేక పోయాడు ”అగ్ని ”.కారణం తన నిజరూపాన్ని అతడు కాచి వడ పోశాడని తెలియబట్టే .ఇంతలో గురు శిష్య ప్రవేశం జరిగింది .”మాన్”అన్నందుకు అగ్ని హోత్రం పేలి పోతే ,”ఇంగిలీషు మాటలంటే -పుచ్చ కాయల దొంగ అంటే బుజాలు తడువు న్నట్లు నీ మీద పెట్టు కుంటావెం ?అని బావ ను మళ్ళీ దెబ్బ కొట్టాడు .మానులా పెరిగావు కాని బుద్ధి ఏదీ ,మర్యాద ఎదీఅని ఎద్దేవా చేసి నట్లుంది శాస్త్రిమాటలు .గిరీశం భాషలో అతడొక విదూషకుడు .చప్పన్న భాషలు తెలిసిన మనిషి .సంస్కృతం మంచి నీళ్ళ ప్రవాహం లా మాట్లాడే వాడు. .
వెంకటేశం చదువుకు డబ్బు ఖర్చు బాగా అవుతుందని ,బావ బాధ పడుతుంటే ”బుచ్చమ్మ ను అమ్మిన పదిహేను వందల రూపాయలు ఎంచేశావ్ ?”అని నిల దీస్తాడు శాస్త్రి .ఆ డబ్బుతో వెంకటేశం కు చదువు చెప్పించ కూడదా అని సూచన చేస్తూ ,ఆడ పిల్లను అమ్మటం పాపం అని కూడా అభిప్రాయ పడ్డట్లుంది .అతనికి పిల్లల్ని అమ్మటం ఇష్టం లేని విషయమే .”మంచం మీంచి దించెయ్య టానకి సిద్ధం గా ఉన్న వాడికి కట్ట బెడ్తే చావడా వాడు ?ఇదేనా నీ చదువు ,సంస్కారం ?”అని ఎదిరిస్తాడు .ఈ మాట తో ఈయనే నులక అగ్ని హోత్రావధానులు అని రూధి చేసుకొని గిరీశం ”జటలో ”అంతటి వాడు లేదని ,కొమ్మ ఎక్కిస్తాడు .అగ్ని చల్లారి శాంత పడి ,దర్వాజా అయి తన ప్రధమ కోపానికి క్షమాపణ చెబుతాడు .ఈ ఇద్దరి భాగోతం అర్ధమయింది కరకటానికి .ఇన్నాళ్ళ కు మా అగ్ని హోత్రుడికి తగిన వాడు దొరికాడు ”అని తనలో అనుకొంటాడు .అగ్నిని నీరు కార్చే పొగడ్తల జల్లు ఉన్న వాడు గిరీశం అని తెలుసు కొన్నాడు .బావ పని పట్టీ టందుకు ఒకడు దొరికి నందుకు సంతోషం వేసింది .తను చేయ లేని పని గిరీశం చేస్తున్నాడని ఆనందము కొంత వుంది అతని లో .
వెంకటేశం చదువు ఎలా సాగుతోందో ననితెలుసు కోవా టానికి ఉబలాట పడుతాడు .వాళ్లిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడ మంటే ”ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ”అని పాడుకుంటూ ,ఇంగ్లీష్ వొలక బోస్తు పెద్ద బిల్డప్ ఇస్తారు .తెలుగు పద్యం చదవ మంటాడు మామ .”పొగ చుట్టకు సతి మోవికి ;;అని ఎత్తుకుంటాడు ముద్దుల మేనల్లుడు .ఇక అర్ధమై పోయింది వీడి వానా కాలం చదువు .గురువు తన లాగానే చదువు చెప్పే ఘటం కాదు .వీడికి ఒచ్చిన్దేమీ లేదనే నిర్ణయానికి వచ్చే శాడు .పరీక్ష గా ”మనః ప్రభవానలం ”అంటే అర్ధమేమిటి ?అని అడిగాడు అల్లుణ్ణి .ఇంతలో తన పరువు పోతోందని గిరీశం అడ్డ పడి అలాంటి కఠిన పద్యాలకు అర్ధాలు పసి పిల్లలకు ఎలా తెలుస్తాయని దబాయిస్తాడు .ఈ పద్య స్వారశ్యం శాస్త్రికి తెలుసు ,అది కఠిన మైనదీ కాదని తెలుసు .గురువు శిష్యుణ్ణి మోసం చేస్తున్నాడని తెలిసి పోయింది .మరి ,తనకు ఒక శిష్యుడున్నాడుగా .
”తర్ఫీదు మా చక్క గా వుంది .వీణ్ణి పెందరాలే తోవ పెట్టక పొతే మోసం వస్తుంది ”అని అనుకుంటాడు .గిరీశాన్ని ఆ కొద్ది సేపట్లోనే అంచనావేసిన నేర్పు శాస్త్రిది .”ఆషాఢ భూతి ”తత్త్వం అర్ధమై పోయింది .కొంప ముంచుతాడు అనిపించింది .
ఇంతలో వెంకటేశం పెళ్లి విషయం వచ్చింది .”డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తా నంటాడు బావ.లుబ్ధావ దాన్లు కు కూతురు సుబ్బిని అమ్మి ,ఆ డబ్బుతో వెంకడి పెళ్లి చేస్తానని పధకం చెబ్తాడు .ఇప్పటికే ఒకతే నెత్తి మీద గుడ్దేసుకొని గుండె మీద కుంపటి లా వుంది .మళ్ళీ ఈ లంపటం ఏమిటో అని ఆలోచించి ”బావా !ఈ సంబంధం చేస్తే నీ కొమ్పకగ్గేట్టేస్తాను”అంటాడు పాపం అక్క మీద జాలి ,మేన కోడలి జీవితంబుగ్గి అవుతుందనే ఆరాటం తో బావ మీద ఉన్న కసితో . ఈ సంబంధం చేసుకొంటేనుయ్యో , గొయ్యో చూసుకుంటానని అక్క ప్రతిజ్న చేసింది . ” బావ .వట్టి మూర్ఖపు గాడిద కొడుకు .చెబితే వినే ఘటం కాదు” .మరి అక్కయ్య కు ఎలా భరోసా ఇవ్వాలో తెలీని వింత స్థితిలో పడ్డాడు .ఏమీ పాలు పోవటం లేదు .ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది .అక్కకి చెప్పాడు .తన ప్రయత్నం తానూ చేయటానికి సిద్ధమయినాడు .ఇలా ఎదుటి వారిని చదివే నేర్పు ,అవసరానికి తగిన ఓర్పు ,దెబ్బ కొట్ట టానికి తగ్గ పటిమ ఉన్న వాడు కరటక శాస్త్రి .అక్క సంసారానికి అవసర సమయం లో ఆదుకున్న తమ్ముడు శాస్త్రి
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –14-11 -11 ..
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

