కన్యా శుల్కం లో కరటక శాస్త్రి -3
కరటక శాస్త్రి ఒక శిష్యుడిని పాఠాలు చెప్పటానికి తన ఇంట్లోనే వుంచుకున్నాడు .వీలైతే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనా వుంది .అయితె తాను చెప్పే చదువు వానా కాలమ్ చదువే .”నాతొ వేషం కట్టించి ,పెద్ద చాన్తాల్లాటి హిందూ స్థానీ ముక్కలు ,సంస్కృతం ముక్కలు ,అర్ధం తెలీకుండా భట్టీయం వేయించ టానికి మీకు ఓపిక వుంది కాని ,నాల్రోజులకో శ్లోకంచేప్పటానికి శ్రద్ధ లేదు కదా ?అంటాడు శిష్యుడు గురువు తో .స్వగతం లో యేమని అనుకున్తున్నాడో చెప్ప మంటే ”పట్నం వదిలి ఆర్నెల్ల కోమారు అగ్రహారాలంట వచ్చినపుడు మాత్రమే ”పుస్తకం తియ్యి ”అని మాట వరుసకు అనే ఘటం గురువు గారు ”కొత్త శ్లోకం చదవ మంటే ”అస్త్యుత్తరశ్యా”చదువు తాడు ”.ఇది పాత శ్లోకమే కదా “‘అంటాడు .”మొదలు ,కొసా ఒకలాగే కనపడుతున్నాయి .”అంటూ గురువు శిక్షణ పై అసంతృప్తి ప్రకటిస్తాడు .అందుకే శిష్యుడికి గిరీశం దగ్గర నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుంటే బాగుండు ననే స్థితి కి తెచ్చింది ..
— చదువుకునేది పొట్ట పోషించుకోవ టానికే -ఈ రోజుల్లో సంస్కృతం యెవడికి కావాలి అని తనే అంటాడు శిష్యుడితో .ఇంగ్లీషు చదువు తనే చెప్పిస్తానని ఆశ పెడతాడు .”పది ”రోజులు ఆడ వేషం వేస్తె ఇంగ్లీష్ నేర్పిస్తానని శరతూ పెడతాడు .తగిన వ్యూహం పన్ని ,ఆ వివరాలన్నీ శిష్యుడికి చక్కగా అవగతం చేస్తాడు .”అదెంత పని ?”అంటాడు శిష్యుడు .-అంటే నాటకాల్లో వాడితో బాగానే వేశం కట్టే నేర్పు కల్గించాడు అన్న మాట .అది ఇప్పుడు అక్కరకు వచ్చింది .శిష్యుణ్ణి ఇలా వాడుకొని ,లుబ్ధావ దాన్లకు వీడి తో ముందే పెళ్లి చేసి వేశం విప్పి పారి పోయి రావటం -ఇదీ ఎత్తు .దీన్ని చక్కగా నిర్వర్తిస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ”ఇల్లరికం ”వుంచుకున్తానని ఆశ కూడా పెట్టాడు .పుస్తకం మీద ప్రమాణం చేస్తానంటాడు శాస్త్రి .”సంస్కృతం పుస్తకం మీద నమ్మకం పోయింది ఇంకో పుస్తకం మీద ప్రమాణం చెయ్య” మంటాడు శిష్యుడు .”తప్పితే ,భూమి తోడ్రా ”అంటాడు గురువు .గురువు స్వభావం తెలిసిన శిష్యుడు నమ్మలేడు ,నమ్మకుండా ఉండను లేడు .”మీరు ఎగేస్తే భూవేమ్చేస్తుంది ?-మీ మాటే చాలు ”అంటాడు .ఇదీ గురువు పై శిష్యుడికి వున్న నమ్మకం
తన వ్యూహం పార టానికి ”మధుర వాణి ”,”రామప్ప పంతుల ”సహాయం కావాలి .అందుకే శిష్యుడికి ఆడ వేశం వేసి రామచంద్ర పురం చేరతాడు .మధుర వాణి ఇంటి తలుపు తడతాడు .మాంచి మాట కారి శాస్త్రి .ఎదుటి వారికి ముందే బంధం వెయ గల నేర్పున్న వాడు .”బంధువులా ”/అని ఆమె అడిగితె ”ఆపదకడ్డం బడ్డ వారే బంధువులు -మీరు మాకు బంధువులు కాగలరు ”అని చమత్కారం తో అంటాడు .బంధుత్వం కలుపు తాడు మాటలతోనే .మధుర వాణికంఠాన్ని పోల్చుకొన్నాడు .ఆమెతో కొంత” గ్రంధం ”సాగించిన వాడే పూర్వం .వేషాన్ని చూసి విస్తు పోతుంది .”ఉదర నిమిత్తం బహుకృత వేషం -ఇది దేవుడిచ్చిన వేషం ”అంటే పూర్వం అతను” గుంటూరు శాస్త్రి” గా పరిచయం వున్న వాడే ఇప్పుడీ వేషం ఏమిటని విస్తు పోయింది .కొత్త గా వుంది .
” నాటక ‘ మెల్లా చెడి పగటి వేషాల్లో దిగిందా ?పెట్టి పుట్టారుగా ?ఏల ఈ అవస్థ “”అంటుంది .”ఇన్నాళ్ళకు దయ కలిగిందా” ?అని కవ్విమ్పుగాను అంది .శాస్త్రి నిజం చెప్పాడు .డిప్టీ కలెక్టర్ కొడుకు ఆమెను ఉంచుకున్న దగ్గర్నించీ తాను ఆమె ఇంటికి వచ్చాడని తెలిస్తే ”పీక ఉత్తరిస్తాడేమో ””అనే భయం చేత రాలేదని సంజాయిషీ ఇచ్చుకున్నాడు .ఆయనకు ఎప్పుడు బదిలీ అవుతుందా ,మధుర వాణి ని ఎప్పుడు చూస్తానా అని దేవుణ్ణి ప్రార్దిస్తున్నాదట .దేవుడి మీద నెట్టాడు కనుక నమ్ముతుంది అనే భావం .ఆమె మాటల్లో ”గిరీశం ”తనను ఉంచుకున్నాడని చెబుతుంది .”వాడికి పెంద్రాలే ఉద్వాసన చెప్పాలి ”అంటాడు మధుర వాణి నెమ్మదిగా ,నషాళానికి అన్తెట్లు వాయిస్తుంది ”నా దగ్గర కొచ్చినందుకు మీ భార్య గారు ,ముందు మిమ్మల్నిమెడ బెట్టు కోని ఇంట్లోంచి తరవ్వలసింది .తనకి రోట్టా ?ఒహడికి ముక్కానా “”?అని అతని నైత్యాన్ని కడి గేస్తుంది .గిరీశం సంగతి సరే నీ బుద్ధి బుగ్గిలం కాలేదా అనిఎద్దేవా .”నా ఇంటికి వచ్చిన వాడల్లా చెడిన వాడేనా “?అనే ధ్వని .ఇంటి దగ్గర తన బతుకేమీ గొప్ప గా లేదని ,తన భార్య ఆ మర్యాదను మాటల్లో చేస్తూనే వుందని క్రియ లోకి ఇంకా దిగ లేదని చెబ్తాడు .అంటే అతని బతుకు ఇంటి దగ్గర” బస్తాండే” అయిందని చెప్పకనే చెప్పాడు .అంతే కదా ?చెడ తిరిగే నైష్టిక బ్రాహ్మలకు అంత కంటే గౌరవం భార్యలు ఎందుకు ,ఎలా ఇస్తారు ?ఎక్కడి వేషం అక్కడ .ఏ ఎండాకా గొడుగు పట్టటం కరటక శాస్త్రి అంటే గుంటూరు శాస్త్రికి వెన్నతో బెట్టిన విద్యే .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -11 -11 .
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D