మున్నీటి పై నారాయణుడు –1 వైకుంఠ ఏకాదశి

  మున్నీటి పై నారాయణుడు –1

                                      వైకుంఠ ఏకాదశి కి ప్రత్యేకం 
         శ్రీ రంగం దేవాలయం లో శ్రీ మన్నారాయణ మూర్తి ,అనంత జల రాశి పై ,ఆది శేషున్ని తల్పం గా చేసుకొని ,శేషుని పడగలు స్వామి శిరస్సు పై ఉన్నట్లుగా దర్శిస్తాం .నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి నట్లుగా కన్పిస్తుంది .దీని లో వున్న పరమార్ధం తెలుసు కొందాం 
         ఆది శేషుని పై పవళించిన పర మాత్మ ,ప్రళయం తర్వాత ,”నేను ఎప్పటి వాడిని “‘అని ప్రశ్నించుకొని ,బ్రహ్మను తన నాభి కమలం నుండి సృజించి నట్లు పురాణ కధనం .అయితే ”పదార్ధం సృస్తిన్చబడదు ,నశించదు ”అనే సిద్ధాంతం వుందని మనకు తెలుసు .పదార్ధం రూపాంతరం చెందు తుంది .అందుకే ”సృష్టి అనాది ”అయింది .దాని రూపం ,స్థితీ మాత్రమే మారు తాయి .విశ్వం అంతా రాత్రి పూట నిస్చేతనమై వుంటుంది,ఉన్నత స్థితి లో వుంటుంది .ఉదయం చేతన పొంది ,క్రియా రూపం గా ప్రవర్తిస్తూ వుంటుంది .దీన్నే ”కల్పం ”అనీ ”ప్రళయం ”అనీ అంటాం .
         రాత్రి పూట విశ్వ చైతన్యం నిద్రిస్తుంది .దీనికి కారణం -పదార్దానుంచి శక్తి ని వేరు చేయ లేక పోవటమే .రాత్రి అయిపోయి ,వేకువ రాగానే ,నారాయణుడు నిద్ర మేల్కొని ,సృష్టి కర్త అయిన బ్రహ్మను సృష్టిస్తాడు .నారాయణ శబ్దం అర్ధం తెలుసు కొందాం .నారం అంటే నీరు .యానం అంటే నిద్రించటం లేక శయనిచటం అనే అర్ధాలు గల రెండు శబ్దాలతో ఏర్పడింది .అంటే అంతరిక్షం అనే జలం పై ,నివశించే వాడు అని నారాయణ శబ్దానికి అర్ధం .మహా భారతం శాంతి పర్వం లో భీష్ముడు నీరు అంటే అంత రిక్షం అని అర్ధం చెప్పాడు .పృథ్వి మొదటి లోకం గా ,ఆపస్ (నీరు )రెండో లోకం గా భావిస్తారు అని తెలుసు కోవాలి .ప్రళయ కాలమ్ లో మొదటిది ,రెండో దానిలో లయం అవుతుంది .దానితో పాటు అంత రిక్షం లోకి వ్యాపిస్తుంది .అదే ద్రవ స్థితి ..అంటే ఘన స్థితి అయిన భూమి ద్రవ స్థితి లోకి మారిందన్న మాట.
           ప్రళయం సంపూర్ణం కాగానే అంటే వెలుతురూ రాగానే ,నారాయణుడు మేల్కొని సృష్టిస్తాడు అన్నాం కదా .అయితే శూన్యం లోనుంచి సృష్టిస్తాడా ?కాదు -తన లో వున్న వస్తు జాలం లో నుంచే సృష్టిని పునః ప్రారంభిస్తాడు అని భావం .అందుకే విష్ణు స్వరూపుడైన నారాయణ మూర్తి కి శంఖం ,చక్రం ,కుడి ,ఎడమ భుజాల పై కన్పిస్తాయి .దీన్నే ప్రసిద్ధ జర్మన్ తత్వ వేత్త ఇమాన్యుయాల్ కాంట్ మహాశయుడు కాలమ్ ,అంతరిక్షం చైతన్యం (conscious )గా భావించాడు .ప్రళయం వచ్చి అంతా నశించినా ,ఈ మూడూ ,నిలిచే వుంటాయి .అందుకే ఆది శేషుడు కాలానికీ ,చైతన్యం లేక సంకల్పం  చక్రానికీ ,అంతరిక్షం లేక పదార్ధం శంఖానికీ ప్రతీకలు గా భావిస్తారు .
          ఇంతకీ కాలమ్ అంటే ఏమిటి ?పగలు ,రాత్రి విభజనే కాలమా ?కాలమ్ అంతా ఒకే విధం గా ఉంటుందా ?”సంఘటనల పరంపరే కాలమ్ ”అన్నాడు హెర్బర్ట్ స్పెన్సర్ పండితుడు .మరి ప్రళయ కాలమ్ లో సంఘటనలు ఏమీ వుండవు కనుక కాలమ్ ఉండదా ?కాదు అది తప్పుడు ఆలోచన .అందుకే కాలమ్ అనాది,అనంతం ,అజరామరం  అంటారు .
 కాలాన్ని ”ఆది లో శేషించినది ”అంటే మొదటిగా మిగిలినదీ అన్నారు .విశ్వం అంతా ప్రళయం లో మునిగి పోతే ,కాలమ్ మాత్రం మిగిలే వుంటుంది .లయం కాదన్న మాట .అయితే కాలమే లయానికి ప్రేరణ కూడా .భగవంతుని శక్తి నుంచి ,మళ్ళీ విశ్వం ఊపిరి పోసుకుంటుంది .అదే ఆయన నిస్శ్వాసం అని భవం .అంటే ఉచ్చ్వాసం తో లయం ,నిస్శ్వాసం తో సృష్టి జరుగు తాయి అన్న మాట .అద్వితీయ పరబ్రహ్మ -సృష్టి ,స్థితి ,లయాలకు అతీతుడు .ఇదే శ్రీ రంగం లో చుట్టు చుట్టు కొన్న సర్పం .అదే ఆది శేషుడు -కాలానికి ప్రతీక అయిన వాడు .ఆ సర్పం తోక నోటి లో వుండటం కూడా ఒక ప్రత్యేకతే .ప్రళయ మూర్తి శివుడు ,సృష్టి సంహారం చేసి నపుడు ,ఆయన ధరించే నాగు పాము అర్ధ నారీశ్వరి అయిన పార్వతి ముంజేతికి కడియం లాగా వుంటుంది .ఆయన కంఠం ,భుజాలకు ,హారాలుగా సర్పాలుంటాయి .ఎప్పుడైతే సృష్టి పునః ప్రారంభ మయిందో ,అంత రిక్షం లో తరంగ వ్యాప్తి జరుగు తుంది .అప్పుడు సంఘటనల పరంపర ప్రారంభ్హ మవుతుంది .దానితో కాల గణన ఏర్పడుతుంది .దీన్నే conditioned time అన్నారు .ఈ స్థితి లోనే (conditioned state )లో నే నారాయణుడు ఆది శేషుని పై నిద్రిస్తాడు .
                మిగిలిన విషయాలు మరో సారి అందిస్తాను 
 సశేషం —                              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -01 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

2 Responses to మున్నీటి పై నారాయణుడు –1 వైకుంఠ ఏకాదశి

  1. sanjay's avatar sanjay says:

    From chinnajeeyar’s pravachanams.
    నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు.

    సకల చరాచర వస్తువులకు లోపల బయట వ్యాపించి వాటికి ఆధారమైన వాడిని మనం నారాయణ అంటాం. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోశాలనను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోశాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోశాలను తొలగించే శక్తి కూదా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.

    ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.

    ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీల్లకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్తానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య్ ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్తానాన్నే వ్యూహం అంటారు.

    అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్తితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్తానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

    ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వ్యూహ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు వ్యూహ అనిరుద్ద అని పేరు.
    సృష్టి పూర్వ దశ నుండి సృష్టి తరువాత దశ వరకు స్వామిని ఎట్లా ఉంటాడో చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజాయేయేతి” నెనే నానుండి అనేకమందిని తీద్దును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.

    త్రివుత్కరణం: ఒక అండం

    మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు, జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఈక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్నీ భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాల్లు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం” ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం.

    ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు.

    చతుర్ముఖుడైన బ్రహ్మకు నాలుగు వేదాలను ఉపదేశం చేసి, తిరిగి ఆయన వేదాలను పోగొట్టుకుంటే మల్లీ తెచ్చి ఇస్తుంటాడు.

    బ్రహ్మకు వేద ఉపడేశం చేసాక, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి.

    మంచి జీవిని తయారు చేయాలని అనుకున్నాడు, ఆ మంచి జీవిని తయారు చేయాలనే ప్రయత్నంలోనే ఈవాల మనం ఈ విశ్వంలో చూసే ఇన్ని జీవరాసులు. ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రకాలు అంటుంటారు. బ్రహ్మ గారి లక్ష్యం మనిషిని తయారు చేయటం, ఆయన ప్రయోగాలలో తయారైనవి ఇన్ని జీవ రాశులు.
    ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.
    ఇక ఇన్నింటిని రక్షించటానికి వ్యూహ వాసుదేవ అనే రూపంలోంచి మరొక రూపం తీస్తాడు అది వ్యూహ ప్రత్యుమ్న అని పేరు. సృష్టించిన వాటిని రక్షించటానికి ఇంద్రుడిలో తానుండి చేస్తాడు. ఏదైన సరియైనదిగా రాకుంటే, అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి వ్యూహ సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు.

    ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై వ్యూహ వాసుదేవ అనే రూపంలోంచి అవతారాలను పంపిస్తుంటాడు. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు. ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.

    ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.