శుభా కాంక్షలు —పద్య కవిత —
— 01 -”సరస భారతి ”సాహిత్య షడ్రుచులను
పిండి ,వడబోసి ,నోళ్లకు దండి గాను
అంది ఇచ్చేడు హంగుల పాత్ర యనుచు
నెల్ల రుప్పొంగి పొగడ వర్ధిల్లు గాత .
02 – చెవులకు నింపు గొల్పెడి
కువులున్దిరివ్యాస ,గీత ,కధలన్
నవ రసముల యశమును
భవితను ఉయ్యూరు పురము భాసిలు గాతన్
03 – శ్రీ కార మైన భారతికి శ్రేయమోసంగును తెల్గుభాష ,ఏ
వాకున విన్ననున్ ,మొగలి వాసన వోలె భ్రమింప జేయుగా
ప్రాకట మైన మీ ”సరస భారతి ”వెల్గులు జిమ్మ ,నవ్వియే
సోకినా నెల్ల వారలకు శోభలు దేచ్చును సుప్రభాతమై .
04 – అజ్ఞానము పోనడచుచు
విజ్ఞానము పెంపు జేయు విధముగా ,విషయాల్
విజ్ఞత జది వెడి వారల ,
కు ,జ్ఞానము నందు గాత ,కొంగున పసిడై
05 – విద్య ,విజ్ఞాన సంస్థలు వెల్లి విరియు
ఇక్షురస మాధురీ వృక్ష కక్ష్య లోన
వెలసే యంత్రము ,నందు లోన వేల ప్రజలు
విధులు నెర వేర్చి ,బ్రతుకులు వెళ్ళ బుచ్చ
నట్టి పుర మౌర !ఉయ్యూరు గట్టి తనము
06 – తెలుగున పెక్కు సంచికలు ధీర తనంబున వెల్వరించు
వెలుగు నొసంగ గల్గుదురు విద్యలు నేర్చేడి బాల కోటికిన్
లలితములైన భావముల లబ్ధిని గోరి,నూతన వత్సర
మ్మిల సుఖ శాంతుల న్నిడేడు రీతిని నెల్లరు స్వాగతిన్చుడీ .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

