అమెరికన్ల పై స్పానిష్ ప్రభావం
ఇవాళ ప్రపంచాధీ పత్యాన్ని వహిస్తున్న అమెరికా ,దశాబ్దాలుగా ప్రతి దేశం ,అక్కడి ప్రజల భాష సాహిత్యాలు ,సంస్కృతు లపై విశేష ప్రభావం చూపించిన అమెరి కా కూడా స్పెయిన్ ,ఇంగ్లాండ్ ,ఫ్రెంచ్ దేశాల ప్రభావానికి లోనయింది అన్న విషయం మర్చి పోయాం .ఇప్పుడు కని పిస్తున్నదే మనకు తెలుస్తోంది .కాని కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా ను మౌల్డ్ చేసిన వారి గురించి తెలుసు కొంటె ఆశ్చర్యమే వేస్తుంది .అన్ని దేశాల గురిచి కాక ప్రస్తుతం స్పానిష్ ప్రభావం గురించి ఇప్పుడు మనం తెలుసు కొందాం .స్పానిష్ ప్రభావం అంటే ‘’హిస్పియానిక్ ‘’అంటారు .అంటే స్పానియార్డులు ,స్పానిక్ అమెరికన్లు ,ఇతర దేశాల నుండి వచ్చిన వ్యక్తులు ,అంటే స్పానిక్ మూలాలను ప్రత్యక్షం గానో ,పరోక్షం గానో వున్నా వ్యక్తులు అందర్నీ హిస్పానియన్లు అంటారు .
స్పానిక్ భాషా ,సంస్కృతి ఆమెరికా దేశ ఆవిర్భావానికి ముందే కన్పిస్తాయి ..ఇవి ఐబీరియన్ ద్వీప కల్పం ,మెక్సికోగుండా ,కరేబియన్ బేసిన్ ,,మద్య దక్షిణ అమెరికా ల నుండి వచ్చి అమెరికా చేరాయి .స్పానిష్ సంస్కృతీ ప్రభాయం ఈ దేశీయులపై చాలా ఎక్కువే ..ప్రస్తుతం అవన్నీ ఇక్కడి వాటి తో కలిసి పోవటం వల్ల అవి ప్రత్యెక మైనవి గా కని పించావు .ఈ హిస్పానిక్ ప్రభావం గనామ్కాలలో చూస్తారు కాని ,వ్యక్తీ గతం గా వారి ప్రభావం ఏమిటో తెలుసు కొ లేక పోతున్నారు ..ఇప్పుడే స్పానిష్ పుట్టుక ,స్వభావం ,తమతో సమైక్య మైన విధానం గురించి ఆలో చించి అమెరికన్లు తెలుసు కొంటున్నారు .
యు.ఎస్.యే.అని పిలువబడే ఈ దేశానికి స్పానిష్ సముద్ర నావికులు ముందుగా చేరారు .అ.అందుకే హిస్పానిక్ పేర్లు అన్ని చోట్లా కన్పిస్తాయి . Juan de fora అనేది ఫసిఫిక్ సముద్ర వాయువ్య ప్రాంతాన్ని పరిశీలించిన మొదటి నావికుని పేరే ఆ పేరు అని ఇప్పుడు చాలా మందికి తెలీదు .అలాగే అరిజోనా ,మాన్తోనా ,ఫ్లోరిడా రాష్ట్రాల పేర్లు ‘’అరిద్ జానే ‘’,మౌంటైన్ ,ఈస్తర్ రోజున స్పెయిన్ వారు ఇచ్చే విందులకు సంబంధించినవి .అలాగే కాలిఫోర్నియా పేరు కూడా amaadis of gaul అనే నవల లోని పేరు .ఎన్నో పర్వతాలు ,నదులు ,కాన్యాన్న్లు ,పట్నాలు ,నగరాల పేర్లన్నీ స్పానిష్ పదాలే ..అంతగా మమైకం చెందాయి .
అమెరికన్ సంస్కృతీ ని పెంపొందించిన వారి లో స్పానిష్ వాళ్ళే ఎక్కువ ..స్పెయిన్రాజు afanso xగొప్ప విద్యా వంతుదని మనకిప్పుడు తెలీదు ..అమెరికన్ చట్టాల పై ఆ రాజు స్పెయిన్ దేశం లో చేసిన చాటాల ప్రభావం చాలా ఎక్కువ .ముఖ్యం గా అమెరికా వాయువ్య భాగం లో బాగా ఎక్కువ .washigton d.c.లో ఆ రాజు విగ్రహం ఉండటమే ప్రత్యక్ష సాక్షం .అలాగే diego rivera అనేది మెక్సికన్ చిత్రకారుదిది .అతని ప్రభావం ఈ దేశం లో బాగా ఉండి .1930 లో అతని చిత్రాలు అమెరికన్ ప్రభుత్వ భవనాలలో అలంకరింప బడ్డాయి .ప్యూర్తోరికాన్ ,మెక్సికన్లు ,మెక్సికన్ అమెరికన్లు ,(చినోనాస్ ),క్యూబన్ల ప్రభావం గణనీయం ..ఈ ప్రభావం బోస్టన్ ,చికాగో ,లాస్ ఏంజిల్స్ ,మయామి ,,మిన్నిపోలిస్ ,న్యూయార్క్ ,సాన్ ఆంటోనియా లలో విపరీతం .
స్పానిష్ భాషా ప్రభావం కూడా చెప్పు కోడగిందే .ఇక్కడ కాని ,ప్రపంచం లో కాని ఇంగ్లీష మాట్లాడే వారి తర్వాతా స్పానిష్ భాష ను మాట్లాడే వారు ఎక్కువ అని లెక్కలు తెల్చారట ..ఈ ప్రాచుర్యానికిక్కడ చరిత్రను అధ్యనం చేస్తే కాని తెలియదు ‘’.న్యు వరల్డ్ ‘’ అని పిలువా బడిన అమెరికా ఏర్పడిన తర్వాతా స్పానిష్ భాషా సంస్కృతులు విపరీతం గా చొచ్చుకు పోయాయి .ఇంగ్లిష్ ఇమ్మిగ్రంట్లు ఇక్కడి వచ్చే తప్పుడు తమతో ‘’గోల్డెన్ ఏజ్ ‘’కు చెందినా అనేక ప్రసిద్ధ రచనలను తమతో 1863లో తెచ్చుకొన్నారు .ఫిలడెల్ఫియా ,బోస్టన్ ,లలో అనేక మంది ప్రముఖుల ప్రైవేట్ లైబ్రరీలలో lazarillaa de tomes .los squenos వంటి రచనల అనువాదాలున్నాయి .ఎన్నో నవలలు కొలువు దీరాయి .సేర్వాన్తిస్ అనే స్పానిష్ రచయిత రాసిన don quixoteనవల ఆ కాలం లో చదవని వారు ప్రపంచం లోనే లేరంటే ఆశ్చర్యం లేదు .ఆ నవలా ఇక్కడికి చేరి,ప్రభావాన్ని చూపింది .cotton mather అనే ప్యురిటాన్దాన్ని అమెరికా లో స్పానిష్ భాష లోనే చదివాడని రికార్డులు తెలియ జేస్తున్నాయి ..ఈ నవల తో తన భాషా సాహిత్యాలను కాటన్ పరి పుష్టం చేసుకొన్నాడని విశ్లేషకుల భావం ..ఎన్నో స్పానిష్ పదాలు అందులో చేరి అమెరికన్ పదాలై పోయాయట .
స్పానిష్ రచయితలు అమెరికన్ రచయితలను ప్రభావితం చేశారు .వాషింగ్టన్ ఇర్విన్ నుండి ,కాళి ఫోర్నియా నవలా కారుడు జాన్ స్టీన్ బెక ,ఎర్నెస్ట్ హెమింగ్వే,లాంగ్ ఫెలో ,వరకు ఆ ప్రభావం లో ఆకర్షణ లో పాడనీ రచయిత లేదు .కూపర్ ఎడ్గార్ అలాన్ పొ ,నిజమైన ఆత్మను మేల్కొల్పిన వాడు అమెరికన్ జాతీయ కవి అయిన వాల్ట్ విట్మన్ ,అమెరికన్ భాషను నవలలలో బంధించి ఇదీ నీ భాషా ,నీ సాహిత్యం ఇది అని తట్టి లేపి ఇంగ్లాండ్ సాహిత్యంనుంచి అమెరికన్ సాహిత్యాన్ని వేరు చేసి ,అమెరికన్ ఆత్మను తట్టి లేపిన మార్క్ ట్వేన్ ,హీర్మాన్ మెక్ విల్లి అందరు స్పానిష్ సాహిత్య సంప్రదాయానికి రుణ పడే ఉన్నారు maaksvel ,aandersan ,మొదలైన వారంతా స్పానిష్ భావాలను వస్తు జాలాన్ని తమ రచనల్లో ప్రతి ఫలింప జేసినావారే .
స్పానిష్ సంస్కృతీ ప్రభావం పాడనీ ప్రదేశం ,వ్యక్తులు ,సాహిత్య ప్రక్రియలు ,సంస్థలు ,వ్యవస్థలు అమెరికా లో లేవు అంటే అతి శాయోక్తికాడు .పచ్చి నిజం .ఎక్కువ గా ప్రభావితం చేసిన వాడు abiel smith అనే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ .1764లో ఆయన –ఇక్కడ స్పానిష్ ,ఫ్రెంచ్ బోధించే ప్రొఫెసర్ల కు జీత భత్యాల కోసం 20,000 డాలర్లను మూల ధనం గా సమ కూర్చి ,వారికి అండగా నిలిచాడు .1819 యునివేర్సిటి కి స్వావలంబన లభించి ,ఆర్ధిక బాధల్లోంచి బయట పది ,వారికి పూర్తీ జీతాలు ఇవ్వ గలిగే స్తితి ని పొందింది .ఇది స్మిత్ చేసిన మేలే .abiel smith పేరా ఒక పీఠం –(చైర్ )నేల కోల్పారు .జార్జి తోక్నార్ దాన్ని అందుకొన్న మొదటి వ్యక్తీ .ఆ తర్వాతా లాంగ్ ఫెలో ,జేమ్స్ రాసిల్ కు ఆ గౌరవం దక్కింది .
విద్యా వేత్త ,ఉత్తమ అధ్యాపకుడు అయిన తిక్నార్ ఎన్నో స్పానిష్ పుస్తకాలను విశ్వ విద్యాలయం కోసం సేకరించి భద్ర పరచాడు ..దీనితో అమెరికన్లకు స్పానిష్ సాహిత్య అధ్యయనానికి గొప్ప అవకాశం లభించింది .ఆయన స్వంతం గా ఎన్నో స్పానిష్ పుస్తకాలను ,వ్రాత ప్రతులను స్వంత లైబ్రరికోసం సేకరించు కొన్నాడు .ఆ తర్వాతా వాటిని బోస్టన్ పబ్లిక్ లైబ్రరి కి దారా దత్తం చేశాడు .abiel smith చైర్ ఏర్పడిన తర్వాతా హార్వర్డ్ లో స్పానిష్ భాశాధ్యనం కర్రిక్యులం లో చేరింది .రోమాన్స్ లాగ్వేజేస్ లలో గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రవేశ పెట్టిన మొదటి విద్యాలయం హార్వర్డ్ .దీని తర్వాతా నే అమెరికా లో మిగిలిన విశ్వవిద్యాలయాలు ప్రవేశ పెట్టాయి .
కలల మీద స్పానిష్ ప్రభావం కూడా ఎక్కువే .జాన్ సింగర్ సార్జెంట్ ,జేమ్స్ విజిలర్ ,థామస్ ఈకిన్స్ ,.మేరికేస్సాట్ ,మొదలైన కళా కారులు స్పానిష్ సాంకేతికత లను అధ్యయనం చేసి తమ కళ ను ఉత్కృష్ట స్తితి కి తెచ్చుకొన్నారు .అన్ని రంగాలలో ఉన్న ఈ నాటి కళా కారులంతా స్పానిష్ స్రస్తల కళాభి రుచిని నిశితం గా పరిశీలించారు .అంతే కాదు ఇరవై వ శతాబ్దపు స్పానిష్ paintars సాల్వడార్ దాలి ,జోఆన్ మీరో పాబ్లో పికాస్సాల ప్రభావం అమెరికన్ కళా కారుల పై విపరీతం .
సంగీతం దగ్గర కు వస్తే lionardo bernstiens ల ప్రభావం ఎక్కువ .షేక్స్ పియర్ రాసిన రోమియో జూలియట్ కు స్పానిష్ అనువాదానికి న్యూయార్క్ లో పిచ్చ క్రేజ్ .అలాన్ రిధంస్ అంటే ఇక్కడి అమెరికన్లఉ ఊగి పోతారు .టాంగో నుంచి మామ్బో దాకా ,గువార్చా నుండి సల్సా దాకా అన్నిటి పై స్పానిష్ ప్రభావం చెప్పలేనంత ఎక్కువ .
, మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-6-12.—కాంప్—అమెరికా

