Monthly Archives: May 2012

చరిత్ర—సాహిత్యం –3

చరిత్ర—సాహిత్యం –3           అలాగే మహాభారత కాలం లో కురు పాండవుల మద్య దాయాది పోరు శిశుపాలుడు మొదలైన వారి దాష్టీకం ..సంఘం లో తగ్గి పోతున్న నైతిక విలువలు .జరిగిన ,జరుగుతున్నా ,జరుగ బోయే విషయాలను గ్రంధస్తం చేయాల్సిన అవసరం కల్గింది .వేదం లోని ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసు కొ లేని సామాన్యులకు కధలుగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ విహార యాత్రా వారం -2

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

చరిత్ర-సాహిత్యం –2

 చరిత్ర-సాహిత్యం –2      ప్రకృతి మన ముందున్న సజీవ చరిత్ర .’’కళలన్ని ప్రక్రుతి కి అనుకరణలే ‘’అన్నాడు అరిస్టాటిల్ (art imitates nature ).ఏది చేస్తుందో అదే ప్రక్రుతి అన్నారు ..ఈ ప్రపంచం యేర్పడ టానికి మూల కారణం ప్రక్రుతి .అంటే నదులు ,పర్వతాలు ,సూర్యుడు సముద్రాలు ,చెట్లు ,అరణ్యాలు ,చంద్రుడు ,ఆకాశం ,పశువులు ,పక్షులు అనీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ విహార యాత్రా వారం

 అమెరికా డైరీ                                                                         విహార యాత్రా వారం     కిందటి వారం మొదట్లో  అంతా కొంచెం నీరసం గా గడిచినా ,చివర్లో ఊపు అందుకోంది  .లైబ్రరి లోతెచ్చిన వాటి లో  పదకొండు పుస్తకాలు చదివాను .దాదాపు అన్నీ బాగున్నాయి .వాటిలో కొన్ని టి పై ఆర్టికల్స్ రాశాను కూడా .అ మేరికా లోని రీజియన్ మూడు లో ఉన్న సాయి … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

చరిత్ర –సాహిత్యం –1

          చరిత్ర   –సాహిత్యం –1           భావి భారత పద నిర్దేశకులు ,శక్తి కణాలు ,ఉత్సాహ వంతులు ,ధైర్య సాహసో పెతులు ,విచక్షణా చతురులూ ,ఆవేశ అగ్ని కణాలు ,అయిన యువ విద్యార్ధినీ విద్యార్ధులకు –అభి నందనాలు .కాలేజికి వచ్చి లేజీ గా ఏదో వింటూ ,పరీక్షల ముందే చదివి పాస్ అవుదాం … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు

  నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు     ఇటలి  నియంత ముసోలిని రాజకీయం గా కర్కశం గా ఉన్నా ప్రజలకు ఎంతో మేలు చేశాడు .ఈ విషయాలు ఎవరి దృష్టీ నీ ఆకర్షించి నట్లు లేదు ..అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లో ముప్ఫై రెండు కేబినేట్ సమా వేశాలు నిర్వహించాడు ..రైలు  రోడ్ల నిర్మాణానికి గొప్ప అనువజ్నులను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మేము ఉంటున్న నార్త్ కెరొలిన

మేము ఉంటున్న నార్త్ కెరొలిన      క్రీ.శ..200 లో ఇక్కడ ఇటుకలు మట్టి బొమ్మలు  తయారు చేసేవారు .వాటి ని ఉత్సవాలకు వాడే వారు .క్రీ.శ. 1000 లో పు రాతన మిసిసిపి సంస్కృతీ ఇక్కడికి వచ్చింది .పెద్ద నగరాల నిర్మాణం జరిగింది .వ్యాపారవాణిజ్యాలు బాగా ఉండేవి .ఇక్కడి ఆదిమ జాతులు carolino .angloquian , భాషలు మాట్లాడే … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 2 Comments

ఆడదై పుట్టటమే నేరమైంది

 ఆడదై పుట్టటమే నేరమైంది     ఆమె గొప్ప గణిత శాత్ర వేత్త కుమార్తె .గణిత శాస్త్రం లో ప్రోఫెస్సర్ ,విజ్ఞాన శాస్త్ర వేత్త .ఆమె స్వయం వ్యక్తిత్వం మగవాళ్ళకు అసూయ పుట్టించింది .ఆమెను ఏమీ చేయ లేక నడి  బజార్లో కిరాతం గా చంపే శారు .ఆమెయే హిపాటి యా అనే గ్రీకు మేధావి .శాస్త్ర్రేయ పరిశోధనలు చేసినందుకు హత్య … Continue reading

Posted in రచనలు | Tagged | 4 Comments

సంస్కృతి అంటే ?

        సంస్కృతి అంటే ?         సంస్కృతి అనేది మానవ జీవితాలకు మాత్రమే సంబంధించింది .అది ఉండబట్టే మనల్ని మానవులు అంటున్నారు .లేకుంటే జంతువులతో సమానమే .సంస్కృటతి అంటే సభ్యతా ,సంస్కారం అని అనుకొంటాం ..ఇతరుల పట్ల మర్యాదా ,మన్ననా ,గౌరవం చూపటమే ఈ రెండు పదాలకు అర్ధం .అవి లేక పోయినా ,చూపక పోయినా … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

ట్రాయ్ పై కొత్త కోణం

    ట్రాయ్ పై కొత్త కోణం             ట్రాయ్ ,ట్రోజన్ వార లను గురించి హోమేర్ మహాకవి ఇలియడ్ ,ఒడిస్సి గ్రీక్  పురాణ గాధలలో విపు లంగా వివరించాడని అందరికి తెలిసిన విషయమే .అందాల రాసి హెలెన్ వల్లనే గ్రీకులకు ,ట్రోజన్లకు పదేళ్లు యుద్ధాలు జరిగాయి .అప్పుడు హెలెన్ ధరించిన బంగారు ఆభరణాలు ,రాజు ధరించిన వజ్రాలు పొదిగిన … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )                                                                   కదిరీ పతి –ఆయ్యల రాజు  నారాయణా మాత్యుడు         కధా కావ్యాల పరంపర లో ‘’శుక సప్తతి ‘’,’’హంస విం శతి ‘’వచ్చాయి .మొదటి దాన్ని పాల నేరి కదిరీ పతి ,రెండో దాన్ని అయ్యల రాజు నారాయణా మాత్యుడు రాశారు ‘’.రంకును’’ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –వేడుకల వారం -2

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నల్ల వజ్రం –నిక్కి గివాని

  నల్ల వజ్రం –నిక్కి గివాని             అమెరికా లో పౌర హక్కుల కాలం లో ( అరవయ్యవ దశకం) లో వచ్చిన నల్ల జాతి అంటే ఆఫ్రో అమెరికన్ రచయితల్లో నిక్కి గివాని అందర్ని ఆకర్షించి న  మంచి మహిళా రచయిత .ఉన్నదున్నట్లుగా మాట్లాడటం ,స్వీయ వ్యక్తిత్వం  తో ఆఫ్రికన్ అమెరికన్ యువ తరాన్ని ప్రభావితం చేసి ఉత్తేజ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5

  నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5                                                                            పోతనా మాత్యుడు        తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పోతన భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి కారణం భక్తీ కధ వస్తే పోతన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కొత్త లోకం కొత్త భాషల సృష్టి కర్త టోల్కీన్

   కొత్త లోకం కొత్త భాషల సృష్టి కర్త టోల్కీన్         ది హాబిట్ ,ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే రెండు రచనల తో ప్రపంచం లో లక్షలాది మందిని  ని ఆకర్షించిన బ్రిటీష రచయిత ,ఇంగ్లీష ప్రోఫెస్సర్ ,భాషా ధ్యన వేత్త , కవి  జే.ఆర్.ఆర్.టో ల్కిన్ .జర్మన్ భాష లో ఆయన పేరు కు అర్ధం –తెలివి తక్కువ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్

     మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్           ఆయనరెండవ ప్రపంచ యుద్ధం లో నాజీ ల యుద్ధ రహస్యాలను చేధించి ప్రపంచాన్ని కాపాడాడు .ఈ  నాటి కంప్యూటర్ కు బీజాలు వేశాడు ,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ద్వారాలు తెరిచాడు  మహా మేధావిగా గొప్ప గణిత శాస్త్రవేత్త గా  గుర్తింపబడ్డాడు కాని చరిత్ర ఆయన్ను మర్చి పోయింది. ఆ మహాను భావుడే … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తెలుగు విద్యార్ధి మాస పత్రిక లో మే నెలలో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4                                                                     గోన బుద్దా రెడ్డి            తెలుగు లో  ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ”రంగ”పదం తో ”రంగ నాద రామాయణం ”గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే .అలాగే రావణుడి పాతాళ హోమం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణువు గా నే భావించి రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్తం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తుంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ ప్రాధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పోయిన మాటల మూట లన్నీ వది లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .ప్రసన్న దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ”రంగనాధం ”.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది .                                                                                   … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –వేడుకల వారం

అమెరికా డైరీ –వేడుకల వారం       అమెరికా వచ్చి మండలం రోజులు అంటే నలభై రోజు లయింది .కిందటి వారం కన్నా ఈ వారం సందడి గా గడిచింది .వేడుకలతో నిండింది .పదమూడవ తేదీ ఆది  వారం ఉయ్యూరు లో శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి (హనుమజ్జయంతి 13,14,15 జరిగిన విశేషాలు)ఆలయం … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3

  నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3                                                                                           నన్నే  చోడుడు                                                   నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధుడు .జాను తెలుగు కు ప్రాచుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార సంభవం ‘’వరసతీ’ .   కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పోల్చిన మొదటి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2                                                                        దేశి కవిత్వం            నన్నే చోడ   మహా రాజు వాల్మీకి ,వ్యాసులను పురాణ కవి సంఘం గా ,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా పేర్కొన్నాడు .ఆయా ప్రాంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా … Continue reading

Posted in అనువాదాలు, మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1         ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే  మనకు ఆది  కవి అంటున్నాం .గాసట బీసట  గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గం లో నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గాన్ని చూపించిన మొట్ట మొదటి వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

ఆది వాసుల వాణి –జూడిత్ రైట్

   ఆది వాసుల వాణి –జూడిత్ రైట్ —  ”ఆమె కవి గా గొప్ప సేవ చేసింది .నీతికి నిబద్ధు రాలైన  నాయకు రాలు .విలువలను చెప్పింది ,విలువైన   జీవితాన్ని గడి పింది.భూ బకాసురుల నుండి భూమిని నమ్ముకున్న వారిని కాపాడింది .ప్రజల కష్టాలను ,నష్టాలను ,కన్నీటి గాధలను కళ్ళకు కట్టించింది . ”అన్నాడు ఆస్ట్రేలియా కవి రాబర్ గ్రీ– జూడిత్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వత్సవాయి ఉన్నత పాటశాల ‘ఆత్మీయ కలయక ‘ శుభా కాంక్షలు

            శుభా  కాంక్షలు ప్రియ మైన చిరంజీవులకు శుభాశీ స్సులు .మీరందరూ కలిసి ఒక చారిత్రాత్మక మైన పూర్వ విద్యార్ధుల సమా వేశాన్ని నిర్వహించటం చాలా ఆనందం గా ఉంది .సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం వత్సవాయి ఉన్నత   పాటశాలను వదిలిన మీరు మళ్ళీ ఆత్మీయత … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)

 కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)                                                          సీతా సాధ్వి –       యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని పోయినట్లు రావణుడు ప్రచారం చేయిస్తాడు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు .కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

కల్ప వృక్షపు స్త్రీలు –3

                        కల్ప వృక్షపు స్త్రీలు –3                                                                  సీతా సాధ్వి                                   రామాయణం అంటే రామ ఆయనమే కాదు   ‘’రామా ‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని గురించిన పద్యాలలో రెండే రెండు చాలా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –2

 కల్ప వృక్షపు స్త్రీలు –2           దశరధుని ముగ్గురు రాణుల గురించి చెప్తు  ,విశ్వనాధ- వారి రూప వర్ణన చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తాడు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తారనే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –1

                               కల్ప వృక్షపు స్త్రీలు –1              అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ పాత్ర చిత్రణ .   ‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రుశుం –డలఘు స్వాదు రసావ తార దిషణా హంకార ,దో    హల బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

అమెరికా లో బౌద్ధం

     అమెరికా లో బౌద్ధం           క్రీ.శ.1500 లో చాలా మంది పాశ్చాత్యులు ఆసియా లోని చాలా బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు .అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ,రాజ కీయం గా స్థిర పడ్డారు .1800 లో బౌద్ధం అమెరికా లో ప్రవేశించింది .స్ట్రేంజర్ అనే మాటకు విదేశీ అనే అర్ధం లాటిన్ భాష లో ఉంది … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం

                             ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం   హిమాలయాల తర్వాతఎత్తైన పర్వతా లు ఆండీస్ పర్వ తాలు .అగ్ని పర్వతాలు అక్కడ ఉన్నాయి .అవి ‘’పె రు దేశం ‘’నుంచి వ్యాపించాయి .పెరు లో ని పురాతన  ‘ఇంకా ‘’ప్రజలన జీవన విధానం ,దాన్ని పరి పాలించిన చక్రవర్తుల పరి పాలన గురించి తెలుసు కొందాం .అక్కడ సూర్య దేవుణ్ణి విరకోచ … Continue reading

Posted in అనువాదాలు | Tagged | 1 Comment

కల్లోల కెరటం డొరోతి పార్కర్

  కల్లోల కెరటం డొరోతి   పార్కర్  ఉరక లెత్తే కవితా ప్రవాహం ,ఆవేశం ,దానికి తగ్గ ఆలోచన ,కొత్త పదాల సృష్టి ,విశృంఖలత ,వీర విహారం ,సెక్సు ,కలహాల కాపురం ,వ్యసన పంకిలం ,విపరీత మైన తాగుడు ,ఆందోళన ,డిప్రెషన్ ,అలజడి ,అస్తిత్వ నిరూపణ ల తో ఒక కల్లోల కెరటం గా , జాతి వజ్రం … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ —వీక్ గా” గడిచిన” వీక్

అమెరికా డైరీ —వీక్ గా” గడిచిన” వీక్               అమెరికా వచ్చి అప్పుడే నెల దాటింది . వచ్చిన ఇరవై ఐదు రోజులకు కాని లైబ్రరీకి వెళ్ళ లేక పోయాను .అయిదవ తేదీ charlotte mecklen burg లైబ్రరి కి వెళ్ళాం .అక్కడ ఇరవై పుస్తకాలు తీసుకొన్నాను .ఇక్కడి పధ్ధతి వేరుగా ఉంది .మనమే పుస్తకాలను చేకౌట్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

స్వాతి మాస పత్రికలో వచ్చిన సరసభారతి ఉగాది పురస్కారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి ఆధ్వర్యంలో జరిగిన ఆదిత్య హృదయం పుస్తక ఆవిష్కరణ గురించి వివిధ దిన పత్రికలలో వచ్చిన వార్తలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సత్య కధా సుధ—10 (చివరి భాగం)

సత్య కధా సుధ—10 (చివరి భాగం)            ఏ జన్మ  లో మానవుడు న్నా ,దాని పై మొహాన్ని వదులు కోలేడు  –దీన్ని వివ రించే ఒక కధ –ఒక గురువు గారికి చావు సమయం దగ్గర పడింది .శిష్యుడు   చుట్టూ విచారిస్తు న్నాడు   .ఆయన్ను ‘’మీరు సరాసరి మొక్షానికే పోతారా “?’’అని అడిగారు .దానికి ఆయన మోక్షానికి ఇంకో జన్మ అడ్డంగా ఉందని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

”ఆదిత్య హృదయం ”పుస్తక ఆవిష్కరణ దృశ్య మాలిక

సాహితీ బంధువులకు -శుభా కాంక్షలు –మీరు అందరు ”ఆదిత్య హృదయం ”పుస్తక ఆవిష్కరణకు విచ్చేసి జయప్రదం చేసి నందుకు కృతజ్ఞతలు ..ఆహ్వానించిన అతిధులు అందరు రావటం మహా దానందాంగా ఉంది ..శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సాంస్కృతిక సేవలకు ఇది ఉడతా భక్తీ గా ,చంద్రునికో నూలు పోగు గా చేసిన కార్య క్రమం .పుస్తకాన్ని … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీ మిత్రులు – మచిలీ పట్నం – “ఆకాశవాణి పద్య పుష్పకం” గ్రందా ఆవిష్కరణ – ఆహ్వానం

Sahithimitrulu

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సత్య కధా సుధ—9

  సత్య కధా సుధ—9           పుట్టిన బిడ్డ ఏడుపు కు ,తల్లి పాడే జోల పాటకు ఒక పండితుడు అర్ధం చెప్పాడు –చంటి వాడు ‘’క్వా ,క్వా ,క్వా’’అని ఎడుస్తాడని మనకు తెలిసిన విషయమే .సంస్కృతం లో ‘’క్వా’’అంటే ఎక్కడ?అని అర్ధం .అంటే ఈ లోకం లో ఆనందం ఎక్కడా?అని ప్రశ్నిస్తున్నాడ ట వాడు .తల్లి వాణ్ణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్

      మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్ కవి ,రచయిత సమాజ సేవకురాలు ,సాంస్కృతిక చరిత్ర కారిణి ,పత్రికా సంపాదకురాలు ,బాల సాహిత్య సృష్టి కర్త,అన్నిటికి మించి మంచి అధ్యాపకు రాలు మార్గరేట్ అట్ వుడ్ .సృజనాత్మక సాహిత్య రచన లో నలభై ఏళ్ళు ప్రజలను ప్రభావితం చేసి సమకాలీన రచయితల్లో అన్నిటా అగ్రగామి గా నిలి … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ – 8

  సత్య కధా సుధ – 8             ఆశ కు అంతు  లేదు అని చెప్పటానికి ఒక చిన్న కధ .ఒకడు రాజు ను ఆశ్రయించి ,అనుగ్రహం పొంది భూమిని అంతటిని దానం గా పొందాడు .రాజ లాంచనాలతో ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ఇంటికి వచ్చాడు .అందరు ఎంతో సంతోషించారు .అమాంతం గా గది  లోకి వెళ్లి ఎక్కి ఎక్కి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ –7

  సత్య కధా సుధ –7              ఒక గృహస్తు ఇంటికి భోజన సమయానికి ఒక అతిధి వచ్చాడు .తనతో పాటు ఆయనకు వడ్డించమని భార్యకు చెప్పాడు .అలానే చేసింది .తినటానికి ముందు అతిధిని ‘’బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణా హృతం ‘’అని గీతా శ్లోకాన్ని తనతో పాటు అనమన్నాడు .నేను అననన్నాడు అతిధి .అనమని మళ్ళీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ -6

    భక్తుడు’’ రక్షించు మహా ప్రభో’’ అని ఆర్తిగా ప్రార్ధిస్తూ ఉంటె వీడు ఏమైనా  పుణ్య కర్మ చేశాడా అని భగవంతుడు ఆలోచిస్తాడట .దీనికి సంబంధించిన కధ తెలుసు కొందాం .             ఒక సారి పాండవులందరూ ద్రౌపది తో సహా సముద్ర స్నానానికి వెళ్లారట .దాదాపు అంతా గంటకు పైగా స్నానాలు చేసి పైకి వచ్చి కూర్చున్నారు … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

చినుకు మాస పత్రిక లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిల్డా డూ లిటిల్

            హిల్డా డూ లిటిల్ H.D.గా అని అందరికి  సుపరిచిత మైన రచయిత్రి ,కవి హిల్డా డూ లిటిల్ .ప్రముఖ ఇమేజిస్ట్ కవులు ఎజ్రా పౌండ్ ,మూర్ ల చేత ఇమేజిస్ట్  ముద్ర పడినకవి, అమెరికా కవయిత్రి .ఆమె రచనలు సూటిగా ,గ్రీకు వారి మాటల్లా ఉంటాయని ప్రశంస పొందింది .ప్రయోజనాత్మక కవిత్వం రాసి మెప్పు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment