సిద్ధ యోగి పుంగవులు –8
హథ యోగి బ్రహ్మానంద సరస్వతి స్వామి
కృష్ణా జిల్లా విజయ వాడ దగ్గర పటమట లో 27-9-1863న గోవింద రాజు రాఘవయ్య ,తిరుమలాబకు జన్మించారు .పానకాలు అని పేరు పెట్టారు .యనమల కుదురు వాస్తవ్యులు గోవింద రాజు సీతమ్మ ,నరసింహా రావు దంపతులు దత్త పుత్రుని గా స్వీకరించారు .రామప్ప అని పిలిచే వారు .బందరు లో చదివారు .గాయత్రి ,శివ పంచాక్షరి ,రామ శాడ క్షరి వగైరా లను దీక్ష గా జపించారు .పెంపుడు తలి దండ్రులు చని పోయారు .దేశ యాత్రలు చేస్తూ శ్రీ శైలం చేరి ఒక బాబాజీ సత్సంగం పొంది ,లోక జ్ఞానం పొందాడు .సాదు ,సత్పురుషులను సేవిస్తూ కాలం గడిపాడు .గౌడ యతీశ్వరుడు ఒకాయన కని పించి దత్తాత్రేయ ఉపాసన చేయమని బోధించాడు .మళ్ళీ క్షేత్ర సందర్శన చేస్తూ ,ప్రముఖ దత్తో పాసకు లైన ‘’వాసుదేవానంద స్వర్స్వతి ‘’వారిని దర్శించి ,ప్రబోధం పొందారు .తీర్ధ యాత్రలు కొన సాగిస్తూ మానసిక ప్రశాంత స్థితి ని పొంది ,సన్యాసాశ్రమం పై తీవ్ర కోరిక పెరిగింది .శ్రీ సచ్చిదానంద సరస్వతి యతీంద్రులు సన్యాస దీక్ష నిచ్చి ,’’బ్రహ్మా నంద సరస్వతి ‘’అనే యోగా నామం పెట్టారు .
బ్రహ్మా నందులు నేపాల్ చేరి ;;ముక్తి నాద క్షేత్రం ‘’ లో ఘోర తపస్సు చేసి చిత్తాన్ని ఏకాగ్రం చేస్తేనే మనస్సు స్వాధీన పడుతుందని భావించాడు .హథ యోగమే శరణ్యం అని నిశ్చయించు కొన్నారు .కొన్ని నెలలు ‘’పంచ గవ్య ప్రాసన ‘’చేశారు .మహారాష్ట్ర చేరి నారాయణ దాస బావాజీ ఉపదేశం తో శరీర శోధన చేశారు .ధోతి ,బస్తీ ,నేతి ,నోలి ,వజ్రోలి ,త్రాటకం అనే ఆరు క్రియలతో ప్రాణాయామ పూర్వక యోగం ‘’చేశారు .నైమిశారణ్యం చేరి పరమ విరాగి అయారు .కురుక్షేత్రం వెళ్లి భగవద ధ్యానమే వాసనా క్షయానికి దారి అని తెలుసు కొన్నారు ..శృంగేరి చేరి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ జగద్గురు వరేణ్యు లను దర్శించారు .వారి సన్నిధి లో భాష్య శ్రవణం చేశారు .శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని కలిసి ,వారు ఆంద్ర దేశం లో పర్య టించి నపుడు రాజ మాండ్రి లో శంకర మతం లో దత్తాత్రేయ స్వామిని ,పాదుకలను ప్రతిష్టింప జేశారు .రుతంబర ప్రజ్ఞా తో పాటు అనేక సిద్ధులు సాధించారు .
ఇప్పటి దాకా బ్రహ్మా నందులు చేసినది అంతా ఆత్మా ఉద్ధరణ కోసం .ఇప్పుడు లోకోద్ధారణం గురించి ఆలోచించారు .సనాతన ధర్మ ప్రచారం చేస్తూ ,దేశ సంచారం చేస్తూ ,మంత్ర దీక్ష ను చాలా మందికి ఇచ్చారు .అందరికి అర్ధమయే తెలుగు లో ‘’శ్రీ దత్తం శరణం మామ ‘’అనే అక్షర్రాలను అమర్చి చిత్రపటం ముద్రించి ,పూజా పుస్తకాన్ని కూడా అచ్చు వేయించి అందరికి పంచారు .శ్రీ శంకరా చార్య సహస్ర నామావళి రచించారు .’’శ్రీ దత్తం శరణం మామ ‘’అనే శీర్షిక తో 108 శ్లోకాలను సంస్కృతం లో రాశారు .అనేక పుస్తకాలను రాసి ప్రచురించారు .అందులో ‘’యోగాభ్యాస దర్పణం ‘’,సజ్జన సేవ ,తీర్దాతనం వగైరాలున్నాయి .కాశీ లో ఉండగా గురుదేవులు మరణించిన వార్త తెలిసి అక్కడి నుండి గరడే శ్వార్ చేరి అంత్య క్రియలను గురుదేవునికి నిర్వ హించారు .మహా రాజు బంగారు నవర్సులున్న18 కిరసనాయిల్ డబ్బాలు ,వెండి రూపాయలున్న18కిరసనాయిలు డబ్బాలు గురువు అందించామన్నారని చెప్పి వీరికి అంద జేశారు .అందరి తో సంప్రదించి ఆ డబ్బు ను హరిద్వారం బదరి ,గరుదేశ్వార్ మొదలైన చోట్ల మథాలు నిర్మించటానికి సద్విని యోగం చేశారు .
ఒక సారి బ్రహ్మానందులు నిజం రాజ్యం లో రైల లో ప్రయాణిస్తుంటే ఒక చోట బండి ఆగి పోయింది .డ్రైవర్ ఆంగ్లేయుడు .ఎంత ప్రయత్నించినా అది కదల లేదు .ద్రివర్ దగ్గరకు వెళ్లి ఎందుకు కదలటం లేదని అడిగితే వాడు జాతి అహంకారం తో ‘’YOU GO FOOL UNSUCCES FUL DIRTY MAN ,A MONK ASKS ME ?’’ అని తిట్టాడు .వెం నటనే బ్రహ్మా నందులు ‘’yes ,yes you are correct .iam a lesser fool .dont you see you alone are unsuccesful now.yes i am a monk .but not a monkey like you ..you come down ,first ,with your fire man ‘’ అని సమాధానం చెప్పే సరికి వాడు డంగై దిగాడు .స్వామి ఇంజెన్ లో కి వెళ్లి అక్కడ తమ దండం తో ఒక చోట తాకారు .అది వెంటనే పని చేయటం ప్రారంభించింది .డ్రైవరు ప్రయాణీకులను బండి దిగమని చెప్పి గార్డ్ ను రమ్మన్నాడు .గార్డు ను తీసుకొని రావా టానికి ఫెయిర్ మాన ను పంపాడు .అతడు వెళ్లి చూస్తె గార్డ్ స్థానం లో బ్రహ్మా నందులు మహా నిష్ఠలో తపస్సు లో ఉన్నారు .డ్రైవర్ వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ jesus in India .I am fortunate .I have seen with my eyes ..you all pepple say three cheers to the monk christ ‘’అని చెప్పి అందరి చేతా నమస్కరింప జేశాడా ఆంగ్ల డ్రైవర్ .
ఒక సారి స్వామి అహ్మదా బాద్ లో సంచరిస్తుండగా కర్ఫ్యూ విధించారు .ఆ సమయం లో వారు అర్ధ రాత్రి రైల దిగి ఒంటరిగా ఆశ్రమానికి పోతుంటే ,పోలీసులు పట్టుకొని జైలు లో పెట్టారు .స్టేషన్ సబ ఇన్స్పెక్టర్ భార్యకు కలలో స్వామి కని పించాడు .కంగారుగా ,ఆమె భర్తను లేపి స్టేషన్ కు వెళ్ళ మంది .ఆయన వెళ్లి చూసి ,ఆశ్చర్య పోయి వెంటనే విడుదల చేసి ఇంటికి తీసుకొని వెళ్లి పూజించి శిష్యుడై దత్త మంత్రం ఉపదేశం పొందాడు .ఆ తర్వాతా జన్మించిన కొడుకు కు ‘’దాత్త బ్రహ్మానంద మూలే ‘’పేరు పెట్టు కొన్నారా దంపతులు .
మరో సారి బళ్ళారి లో ఒక జడ్జి ఇంటి ముందు భిక్షాటన చేస్తుంటే ,ఆయన కు కోపం వచ్చి ‘’వేడిని మేడ బెట్టి మెయిలు దూరం తొయ్యి ‘’అని జవాను తో అన్నాడు జడ్జి .’స్వామి ప్రశాంతం చిత్తం తో ‘’జవానుకు వీలు కాదు .మీరే రండి ‘’అని వెళ్లి పోయాడు .జడ్జి భార్యకు విపరీతం గా కడుపు నొప్పి వచ్చింది .డాక్టరు వచ్చినా తగ్గలేదు .ఈ కంగారు లో జడ్జి కోర్ట్ మాట మరిచాడు .విధి నిర్వహణ లో అలసత్వం అని అతన్ని తప్పించి రికార్డు స్వాధీనం చేసుకొన్నది ప్రభుత్వం .అప్పుడు ఎదురింటి వర్తకుడు ఇదంతా స్వామికి చేసిన అపచార ఫలితం అని జడ్జి కి చెప్పాడు ..జడ్జి ఊరంతా తిరిగి ఒక చెట్టు కింద జపం చేసుకొంటున్న స్వామిని చూసి ,కాళ్ళ మీద పది క్షమించ మన్నాడు . ‘’అయిదు రోజుల్లో నీ కుర్చీలో నిన్ను కూర్చోబె డ తాను ‘’అని స్వామి అభయం ఇచ్చారు కనికరించి .జనం విపరితంగా అక్కడికి చేరారు .స్వామి ఉన్నట్లుంది అంతర్ధానమై పోయారు .మర్నాడు జడ్జి కోర్టు కు వెళ్లాడు స్వామి కోసం వెదికితే రైల ప్లాట్ ఫాం మీద కన్పించారు .జడ్జి ని మద్రాస రమ్మని ఆదేశం వచ్చింది .భార్య నెప్పి పోయింది .హైకోర్టు ఆయన్ను మళ్ళీ ఉద్యోగం లో చేర్చుకొనే ఆర్డర్ ఇచ్చింది .నాలుగు నెలల తర్వాతా జడ్జి అభ్యర్ధన మీద స్వామి ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించారు అప్పుడు స్వామి ‘’స్వబోధ దర్పణం ‘’అనే టీం టేబుల్ రాసిచ్చి జడ్జికిచ్చారు .రాత్రి పాడుకొనే ముందు ఒక సారి చదువు కొమన్నారు .జడ్జి ఆ తర్వాతా సన్యాసం స్వీకరించి ,ఆశ్రామ ధర్మాలను పాటించారు .
బ్రహ్మానంద స్వామి వారు షష్టి పూర్తీ ని అందరు తమ ఇళ్ళల్లో జరుపు తామనితొమ్మిది మంది పోటీ పడ్డారు .ఆయన ఒకరింటికి వెళ్లి ,మిగతా ఎనిమిది ఇళ్ళల్లో ను ప్రత్యక్షమై భిక్ష ,పాద పూజ అందుకొని అనడర్ని సంతృప్తి పరచారు .2-12-1938 బహుధాన్య మార్గ శిర శుద్ధ దశమి శుక్రవారం నాడు ప్రతి రోజు లాగానే అర్చన కోసం స్వామి వారి పాదుకలను శిష్యుడు దత్తు గారు తీసి చూస్తె అవి చెదలు పట్టి కన్పించాయి .ఏదో కీడు జరిగింది అని భక్తులు శంకించారు .రెండు రోజుల తర్వాత దత్తు గారికి కాశీ లో స్వామి దశమి నాడు అంటే పాదుకలు చెదలు పట్టినట్లు గమనించిన రోజునేసిద్ధి పొంది నట్లు టెలిగ్రాం వచ్చింది .ఇది దత్తు గారికి స్వామి వారు చూపిన నిదర్శనం .
మరో మహాత్ముని గురించి ఇంకో సారి –

