మహా మేధావి అయిన్ స్టీన్ గురించి కొన్ని జ్ఞాపకాలు .
చిన్న తనం లో కొడుకు చదువు ఎలా సాగుతోందో తెలుసు కోవటానికి ఐయిన్ స్టీన్ తండ్రి స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయుడి ని ‘’మా వాడు దేనిలో రాణిస్తాడు ?’’అని అడిగితే దేనికీ పనికి రడ నీ నిర్మోహ మాటం గా చెప్పాడట ఆ మేష్టారు.ఆ నాడు బట్టీ పట్ట మే చదువు అంటే .మన వాడి కి అది నచ్చడదు .అందుకే ఆ తర్వాత ఎప్పుడో ‘’ఎలిమెంటరి స్కూల్ టీచర్లు అంటే నాకు మిలిటరి సార్జేంట్లు లా గా అని పిస్తారు ,కని పిస్తారు .డ్రిల్లు మేస్తారంటే లెఫ్టి నేంట్ లు అని పిస్తారు ‘’అని రాసు కొన్నాడా మేధావి .అందుకని ఇంటి వద్దే ఉండి చదువు కొన్నాడు .అదే ఆయన కు బాగా పయోగ పడింది .
తన జీవితం లో రెండు సంఘటనలు సైన్స్ చదవ టానికి ఆకర్షణ కలిగించాయని అన్నాదాయన.నాలుగు లేక అయిదు ఏళ్ళ వయసు లో తండ్రి ఆయనకు ఒక ‘’మాగ్నెటిక్ కంపాస్ ‘’కొనిచ్చాడు .అది ఎప్పుడూ ఉత్తర ధృవాన్ని మాత్రమే చూపిస్తుందని తెలుసు కొన్నాడు .దీనికి మించిన దేదో రహస్యం ఉంది, ఉండాలని పించింది .పన్నెండేళ్ళ వయసు లో యూక్లిడ్ జామెట్రీ ని చదివాడు .ఒక త్రిభుజం లోని మధ్యగత రేఖలు ఒక బిందువు వద్ద కలుస్తాయి అని తెలుసు .కాని అంత సులువుగా ప్రతి సైన్స్ విషయం అంత ఖచ్చితం గా రుజువు చేయ లేము అని భావించాడు .కనుక ప్రపంచం లోని వింతలు అతడి దృష్టిని అప్పుడే ఆకర్షించాయి .ఒక ఖచ్చిత మైన నిర్ధారణకు అనేక మార్గాలు ఉండ వచ్చు అనే ఆలోచనా కలిగింది .
అయిన స్టీన్ తండ్రి ధన వంతుడే మీ కాదు .రియల్ ఎస్టేట్ బిసినెస్ లో చేతులు కాల్చు కొన్నాడు .అందుకని స్కూల్ మానేయాల్సి వచ్చి ,స్వతంత్రం గా లెక్కల మీద దృష్టి సారించాడు .పదహారేళ్ళ వయసు లో స్విస్స్ స్కూల్ లో pure mathematics వదిలేసి భౌతిక శాస్త్రం వైపు మళ్ళాడు .ఇక్కడ కూడా స్వతంత్రం గానే చదువు కొన్నాడు .కాలేజి క్లాసులకు హాజరు కాకుండా పరిశోధన శాలలో ప్రయోగాలు చేస్తూ ,తన స్వీయ భావాలను రాసుకొంటూ గడిపాడు .గ్రాడ్యు ఎషన్ సాధించాడు .అయితే ఫిజిక్స్ లో శిక్షణ పొంద టానికి ‘’ అసిస్టంట్ షిప్ ‘’నిరాకరించారు బెర్న్ లోని .పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం లో చేరాడు .అందులో తన మనో భావాలన్నీ పరి పక్వం అయాయి అని రాసుకొన్నాడు ‘’that secular cloister where i hatched my most beautiful ideas ‘’అని కవితాత్మకం గా చెప్పుకొన్నాడు .తనతో పాటు చదువుకొంటున్న’’ మిలేవా మారిక్ ‘’అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .ఇద్దరి ఆర్ధిక పరిస్థితీ ఒక్కటే .పేదరికమే .దాన్ని గురించి ఆయన ‘’in my theories i put a clock at every point in space ,but in reality I can hardly afford one for my house ‘’అంటాడు .చాలా మందికి తెలిసే ఉంటుంది –ఐయిం స్టీన్ క్లాక్స్ గురించి .అంత రిక్షం లో ఊహల్లో చాలామూలల్లో గడియారాలను ఏర్పాటు చేశాను కాని ఇంట్లో ఒక్క గడియారం కొంటా నికైనా డబ్బు లేదు అని ఆయన భావం .అయితే ఆఊహా గడియారాలు బానే డబ్బును వర్షించాయి .1905లో ఆయన the electro dynamics of moving bodies మీద ఒక పేపర్ ప్రకటించాడు .ఇదే ఆయన సాపేక్ష సిద్ధాంతం మీద విడుదల చేసిన మొదటి పేపరు .అందులో కాంతి వేగం అన్నిటి కంటే చాలా ఎక్కువ అని చెప్పాడు .అంతే కాదు ఆ వేగం లేక వేలాసిటి అందరికి ,ఎక్కడ ఉన్నా సమానం గా నే ఉంటుంది అనే గొప్ప ఆలోచన బయట పెట్టాడు .అంటే ఏకాలం లో నైనా కాంతి సెకనుకు 3,00,000 కి.మీ .వేగం తో ప్రయాణం చేస్తుంది .ఇంకా యే వస్తువు వేగమైనా ప్రాంతం, కాలం బట్టి మారవచ్చు కాని కాంతి వేగం చచ్చినా మారదు .అని ఘంటా పధం గా రుజువు చేశాడు .మిగిలిన వన్నీ సాపెక్షాలే కాని కాంతికి సాపేక్షత లేదు .కాలం, ద్రవ్య రాసి ,స్పేస్ మారి పోతాయి .ఈ సిద్ధాంతం తో పాత సిద్ధాంతాలన్నీ మారి పోయాయి .దీని తర్వాతా ఆయన సామాన్య సాపేక్ష సిద్ధాంతాన్ని వివరించాడు .అందులో వస్తువుల త్వరణ వేగాన్ని దృష్టిలో పెట్టు కోవాలని సూచన చేశాడు .దీనితో అయిన స్టీన్ ఒక కొత్త భావానికి తెర లేపాడు .అదేమిటి అంటే సైన్స్ సరి అయిన రుజువు ను ఇవ్వలేదు అందుకే సరైన నిర్ణయాలకు రాలేము అంతే కాక మన నిర్ణయాలు conjectures మాత్రమే అన్నాడు .దీనికి కారణం విశ్వం లో లెక్కకు మించిన విషయాలను గమనించాల్సి వస్తుందని ,అవి ఎప్పటికప్పుడు మారి పోతు ఉంటాయని అన్నాడు .అందుకే సైన్స్ ఖచ్చిత మైన నిర్ణయాలకు రాలేము( nothing can be proved decisively ‘’) అని తేల్చి వేశాడు మహా మేధావి అయిన స్టీన్ .
ఆయన ప్రసిద్ధ సిద్ధాంతం సూత్రం అందరికి తెలిసిందే—E==mc2..ఈ రెండిటి వల్ల అనేక యురోపియన్ యుని వేర్సిటి ల లో లెక్చరర్ పోస్ట్ కు ఆహ్వానాలు అందాయి .1913 లో kaiser whilhem instititute of physics లో బెర్లిన్ వర్సిటి లో ఉద్యోగం లో చేరాడు .అయన భావాల పై తరచూ చర్చలు జరుగు తూనే ఉన్నాయి .1919 లో బ్రిటీష వ్యోమ గాములు దక్షిణ అమెరికా కు ప్రయాణించి నపుడు అయిన్ స్టీన్ ప్రతి పాదించిన ‘’నక్షత్ర కాంతి వంగుతుందని ,సూర్యుడు చాలా విపరీత ద్రవ్య రాసి ఉన్న వాడు అవటం వల్ల నక్షత్ర కాంతిని లెక్కించ దగ్గ పరిమాణం లో వాంఛ గలుగు తున్నాడు ‘’అని చెప్పింది నిజం అని తేల్చి చెప్పారు . 1919 నవంబర్ లో అయిన స్టీన్ ఊహించిన విషయాలు ఖచ్చితమైన వే నని చెప్పారు .దీనితో ఐన్స్టీన్ ప్రతిభ విశ్వ వ్యాప్త మైంది .
అయిన స్టీన్ అంటే అమెరికా వారికి తగని గౌరవం ..ఆయన సామాన్య సాపేక్ష సిద్ధాంతం గొప్పదే కాని దాన్ని సామాన్యులకు వివరించటం కష్టమైన పనే .ఇప్పడు ఈ రుజువు తో ఆయన సిద్ధాంతానికి వ్యాప్తి బాగా కలిగింది .అంతటి మేధావి అయిన సైంటిస్ట్టిస్ట లేడు అన్నారు .అంతే కాదు ‘’ఇరవయ్యవ శతాబ్దపు న్యూటన్ ‘’అన్నారు .ఇన్ని ఆలోచనలు బుర్ర నిండా ఉన్నా నిబ్బరం గా ,తాపీగా పైప్ కాలుస్తూ వయోలిన్ వాయిస్తూ కలల్లో తేలిపోయే వ్యక్తీగా మనకు కన్పిస్తాడు . 1921 లో ఫిసిక్స్ లో’’క్వాంటం థీరి’’ కి నోబెల్ బహుమానం అందుకొన్నాడు .దీనితో’’ లెజెండ్’’ అయాడు .అయితే తనకు వచ్చిన పురస్కారం గురించి ‘’some thing of the beauty of this mysterious universe should not be personally celebrated ‘’ అని అతి వినయం గా చెప్పాడు .దట్ ఈస్ ఐన్స్టీన్
.1932 లో జర్మని లో జాతి దురహంకారం పెచ్చు పెరగటం తో ,అమెరికా వారు అంతకు ముందే ఆహ్వానించిన ఆహ్వానాని మన్నించి అమెరికా చేరాడు .అక్కడ జర్మనీ లో యూదు అవటం వల్ల ఆయన సాపేక్ష సిద్ధాంత కాగితాలన్నీ తగల బెట్టి ,వాళ్ల అహంకారాన్ని రుజువు చేసుకొన్నారు .ఇక్కడ ఒక మేధావికి ఘన స్వాగతం లభించింది .ప్రిన్ స్టన్ లో అడ్వాన్సెడ్ స్టడి బోధించా టానికి చేరాడు .1955 లో మరణించే వరకు అక్కడే పని చేశాడు .
వేసవి కాలాన్ని లాంగ్ ఐలాండ్ లో ‘’ నాసువా పాయింట్’’ వద్ద గడిపే వాడు .నౌకా విహారం సంగీతం లతో చుట్టూ ప్రక్కల వారితో కాల క్షేపం . .ఒక ఉత్తరం లో మానవ క్రూరత్వం ,పైశాచిక చేష్టలు ఇంత దారుణం గా జర్మనీ లో జరుగుతుండటం మానవత్వానికే సిగ్గు చేటు అని వాపోయాడు .మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఏవగించుకొని యువకుడు గా ఉండగానే జర్మన్ పౌరసత్వాన్ని వదులు కున్నాడు .హిట్లర్ కు ఆయుధాలతోనే బుద్ధి చెప్పాలని గాదంగా భావించాడు .అణు విచ్చేదాన్ని అమెరికన్ శాస్త్ర వేత్తలు, మిలిటరి చేస్తున్నారని తెలుసు కొని, ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ ను సమరర్ధించమని ఉత్తరం రాశాడు .యుద్ధానంతరం హిట్లర్ పతనం తర్వాథ ‘’హీరో శీమా’’ పై ఆటం బాంబ్ ప్రయోగం జరిగిన తర్వాత అణు విచ్చదం వల్ల ఏర్పడిన ఆటం బాంబు ను ఇంక యే దేశం మీదా ప్రయోగించ వద్దని గట్టిగా చెప్పాడు .
చిన్నప్పటి నుంచి ఒంటరిగా గడపటం అయిన స్టీన్ కు ఇష్టం అని తెలియ జేసుకొన్నాడు .తాను ఇంత ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తీ అయి ఉండి కూడా ఒంటరిగా ఉండటం ఇష్టమంటే వింతగా ఉంటుంది అంటాడు .ఆయన 1879 లో జన్మించి76 ఏళ్లు జీవించి1955లో మరణించాడు . 1921 లో ఆయన న్యూయార్క్ మొదటి సారిగా వీజ్మన్ తో కలిసి .జెరుసలెం లో హిబ్రు యుని వేర్సిటి కి నిధుల సేకరణకు వచ్చాడు .అమెరికా లో అందరు ముఖ్యం గా యూదులు ఆయన ను చూడ టానికి ఎగ బడ్డారు .వై హౌస్ లో ఘన స్వాగతం లభించింది .ఎక్కడ చూసినా జన సముద్రం ఆయన్ను ఆప్యాయం గా పలకరించి .ఆయన ఉపన్యాసాలను శ్రద్ధ తో విన్నారు .ఆయన తన సాపేక్ష సిద్ధాంతాన్ని జెర్మని భాష లోనే వివ రించటం కొస మెరుపు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-6-12.—కాంప్—అమె


Good Article–
LikeLike