డిప్రెషన్ కాలమ్ లో అమెరికా లని మాసా చూసేత్స్ లో ఉన్న జమైకా కాప్లేయిన్ నైబర్ హుడ్ లో 1932 అక్టోబర్ 27 న జన్మించింది సిల్వియా పాత్ .తల్లి ఆస్ట్రియన్ అమెరికా మొదటి తరానికి చెందిన స్త్రీ .తండ్రి జర్మన్ .ఆయన బోస్టన్ universiti లో జూవాలజి ప్రొఫెసర్ గా పని చేస్తూ బంబుల్ బీస్ మీద పుస్తకం రాశాడు .మూడేళ్ళ వయసు లో ఈమె కుటుంబం విన్త్రాప్ కు మారింది .ఆమె రాసిన మొదటి కవిత బోస్టన్ హెరాల్డ్ లో పడింది .పైంటింగ్ లో అవార్డ్ గెల్చుకొంది .unitreriyan క్రిస్టియన్ గా ఉండేది ..ఎనిమిదవ ఏట తండ్రి మరణించాడు .కాలేజి లో చేరింది .”పుచ్చకాయ పండి విచ్చు కొన్నట్లుగా ప్రపంచం కని పిస్తోంది ”అని రాసుకొంది .ది స్మిత్ రివ్యూ కుఎడిటర్ అయింది .న్యూయార్క్ సిటిఉండి విశ్లేషనాత్మక వ్యాసం రాసిఅనుభవాలను ”బెల్ జార్ ”అనే నవల లో పొందు పరిచింది .హార్వర్డ్ రైటింగ్ స్కూల్ లో ప్రవేశానికి ప్రయత్నిస్తే తిరస్కరించారు .
ఇక సైకియాట్రిక్ కేర్ లో ఉంచాల్సిన స్థితి ఏర్పడింది .ఇన్సులిన్ షాట్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది .కొంత నయం అయింది .మళ్ళీ కాలేజి లో చేరింది .1955 లో దాస్తో విస్కీ నవల మీద ”మాజిక్ మిర్రర్ ”అ పేర తిసీస్ సమర్పించింది .అంత అనారోగ్యం గా ఉన్నా ఆమె లో సాహిత్య సృజన ఆగలేదు .గ్రాడ్యుయేట్ అయింది .ఫుల్ బ్రైట్ స్కాలరశిప్ తో కేంబ్రిడ్జి కాలేజి లో చేరి రచన కొన సాగించింది ”.వర్సిటి ”అనే కాలేజి మాగా జైన కు విపరీతం గా రాసేది .
1962 లో ఆమె కవితా ప్రవాహం ఉధృతం గా ఉంది .ఒంటరి గా పిల్లలతో లండన్ తిరిగి వచ్చింది .అద్దె ఇంట్లో కాపురం .ఆ ఇంట్లో నే ఒకప్పుడు w బి..యేట్స్ కవికవి ఉన్నాడు అని సంబర పడింది .ఆ సంవత్సరం శీతాకాలం లో వందేళ్ళ లో ఎప్పుడు లేనంత చలి విపరీత మై,నీతి గొత్తకల్లొ నీరు గడ్డ కట్టేసింది .పిల్లలకు జబ్బులు .టెలిఫోన్ సౌకర్యం లేదు .ఇవన్నీ మళ్ళీ డిప్రెషన్ కు దారి తీశాయి ఆ అభాగ్యురాలికి .మరుసటి ఏడాది బెల్జార్ నవల విడుదల అయింది .ఈ నవలను ”విక్టోరియా లూకాన్ ” అన్న మారు పేరు తో రాసింది డాక్టర్ జాన్ హోర్దర్ ఆమె దయనీయ స్థితి ని గమనించి హాస్పిటల్ లో చేర్పించా టానికి తీవ్ర ప్రయత్నం చేశాడు .అఆమే ఒప్పు కోలేదు .తప్పని సరి పరిస్థితులలో ఒక నర్సు ను తానే ఏర్పాటు చేశాడు .డాక్టర్ల లోను మాన వత్వం ఉంటుందని రుజువు చేశాడు .ఆమెకు” ఆంటీ డిప్రెషన్ ”మందుల్ని వాడాడు .అంతకు పూర్వం ఆమెకు జరిగిన చికిత్స లో డాక్టర్లు ఇంక ఏ పరిస్తితుల్లోను ఆ మందులు వాడకూడదని సలహా ఇచ్చారు .కానీ ఈ డాక్టరు ఆ విషయం తెలిసో తెలీకో వాడే శాడు .1963 ఫిబ్రవరి పద కొండున ,సిల్వియా పాత్ తన పిల్లల్ని రాకుండా తలుపులు బంధించుకొని గాస్ స్టవ్ఓవెన్ లో తలను -ఉంచుకొని కార్బన్ మొనాక్సిడ్ వాయువు పీల్చి చని పోయింది .పాపం తానెం చేస్తోందో ఆ అభాగినికి తెలీదేమో ?
”Now they want to make a film -for any one lacking the ability –to imagine the body head in oven –orphaning children
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -06 -12 -కాంప్–అమెరికా


సిల్వియా పాత్ still born అనే కవితాఖండికకు నేను నా ‘రమణీయం’కవితా సంపుటిలో ‘మృత శిశువులు ‘అనే పేర అనువాదం చేసి ప్రచురించాను.దానిని దిగువ ఇస్తున్నాను.
” ఈ పాటలు జీవించవు- ఇది విషాద నిదానము
వాటికి కరచరణాదులు -వర్ధిల్లు నఖిలాంగములు
చిన్నారి ఫాలభాగములు – చిక్కగ పెరిగియుండు
కాని
మనవలె నడవలేవు – వాని తప్పు లేకున్నను
తల్లిప్రేమయు నేమి -తక్కువెంతయుగాదు
వానికేమి జరిగినదొ -వాకొన దోషమేమొ
చూడ పూర్తిగ పెరిగి-చూడ చక్కని దేహములె
ఉమ్మనీటిలోన -ఒద్దికగా కూర్చుండు
నవ్వుచుండు నమాయకముగనవ్వుచుండు
జలచరములుగావు -జంతువులునుగావు
బ్రతికియుండిన చాల -బాగుండెదే కాని
విగతజీవులవి -జనని కూడ మృతప్రాయ
శూన్య దృక్కుల జూచు -రోదనము చేయక .”
LikeLike