రచయితల రచయిత –కేథరీన్ మాన్స్ ఫీల్డ్
ఒక సారి బెంగాలి నవలా రచయిత శరత్ ను కొందరు అభిమానులు ‘’మీ రచనలు మాకు బాగా అర్ధమవుతున్నాయి .కాని రవీంద్రుని రచనలు అర్ధం చేసుకోవటం కష్టం గా ఉంది ‘’అన్నారట .దానికి ఆ మహా నవలా రచయిత ‘’నేను మీ కోసం రాస్తున్నాను .టాగూర్ నా వంటి వాళ్ల కోసం రాస్తున్నారు ‘’అని సమాధానం చెప్పాడట .అంటే రచయితలకే రచయిత గురు దేవుడు అని అర్ధం .అలానే ఆంగ్ల సాహిత్యం లో 19 వ శతాబ్దపు ఉత్త రార్ధం లో stream of consciousness –అంటే చైతన్య స్రవంతి అనే ప్రక్రియ కు బీజం వేసి ,అసలు రచనలు ఎలా ఉండాలో రాసి చూపించి న రచయితలకే రచయిత అని పించుకొన్న మహిళా రచయిత కేతలీన్ మాన్స్ ఫీల్డ్ .
న్యూజిలాండ్ లోని సంపన్న కుటుంబం లో 1888 అక్టోబర్ నాలుగున కేథరీన్ పుట్టింది .చిన్నప్పటి నుండి రచయిత కావాలనే తపన ఉండేది ..లండన్ లో చదువు కొన్నది .సంగీతం కూడా బానే నేర్చింది .స్కూల్ న్యూస్ పేపర్లలో చాలా రాసింది .ఆస్కార్ వైల్డ్ లాంటి ప్రముఖ రచయితల నందర్నీ చదివి జీర్ణించు కొంది .మూడేళ్ళ తర్వాతా మళ్ళీ న్యుజి లాండ్ చేరింది .మంచి కుర్రాణ్ణి చూసి పెళ్లి చేయాలని తలిదండ్రులు భావించారు .కాని ఆమె లో తిరుగు బాటు తనం ఎక్కువ .artistic adventurous society తో అనుబంధం పెంచు కొన్నది .ఆస్ట్రేలియా మాగజైన్స్ కు రాస్తూ ఉండేది .మళ్ళీ లండన్ చేరింది .విశృంఖలత ఆమె లక్షణం అయింది .కడుపు వచ్చిందని తెలిసి మూడు వారాల పరిచయం మాత్రమే ఉన్న జార్జి బౌడెన్ ను పెళ్లి చేసుకోంది .ఆమె కడుపులోని బిడ్డకు అతడు తండ్రి కాదు .పెళ్లి రోజున నల్ల డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకొన్నది .ఆ రాత్రే అతన్ని ఓది లేసింది తల్లి ఈమె ను భరించలేక ఆర్టిస్ట్ లకు దూరం గా ఉంచాలనే కోరికతో లండను కు తీసుకొని వచ్చింది ..జర్మని లో’’’ స్పా’’లో బోహీమియన్ ఆర్టిస్ట్ లకు దూరం గా చేర్పించింది ..అయినా ఆమె తిరుగుళ్ళు మాన లేదు .మళ్ళీ కడుపు వచ్చి పోయింది .లండన్ తిరిగి వచ్చి రచన లో నిమగ్న మయింది .
In a German pension నే కధా సంకలనాన్ని 1911లో విడుదల చేసింది ..జాన్ ముర్రే అనే అతని తో పరిచయం పెంచు కొంది .అతను లిటరరీ మాగజైన్ ఎడిటర్ .పెళ్లి అయినా ఆమె అఫైర్ లకు అడ్డూ ,ఆపు లేదు .ఇద్దరు కలిసి’’ బ్లూ రివ్యు ‘’పత్రిక నడిపారు .మూడేళ్ళ తర్వాత పత్రిక పడకేసింది .డి.హెచ్.లారెన్స్ లాంటి ప్రముఖులతో బాగా పరిచయమేర్పడింది .పాత భర్త బాడెన్ తో విడాకులు పొంది ముర్రే ను పెళ్లి చేసుకోంది .1917లో క్షయ వ్యాధి సోకింది .అయినా రచన చేస్తూనే ఉంది .Bliss and other stories ప్రచురించింది .మంచి పేరొచ్చింది .garden party and other stories రాసి ప్రచురించి మంచి ఆదరణ పొందింది .ఆరోగ్యం మీద ఇప్పుడు శ్రద్ధ కలిగింది .ఫ్రాన్స్ చేరింది .భర్త ముర్రే కు దూరం గా ఉన్నా ,ఆమె ఉత్తరాలు ,కధలను ప్రచురిస్తూనే ఉన్నాడు .1923 లో 34ఏళ్లకే కేథరీన్ టి.బి.తో అల్పాయుర్దాయం తో మరణించి సాహితీ లోకానికి తీరని లోటు కల్గించింది .
కేథరీన్ ప్రత్యేకతలు
garden party లో అత్యాధునిక శైలి తో రచన చేసింది .అదే ఆ తర్వాత‘’impressionanistic style of stream of conscious ness —చైతన్య స్రవంతి గా పేరు వచ్చింది .ఈ విధానం లో జార్జి ఇలియట్ ,వర్జీనియా ఉల్ఫ్ లాంటి వారు రాశారు .తెలుగు లో నవీన్ ఈ ధోరణి లోనే ‘’అంపశయ్య ‘’నవల రాసి ‘’అంప శయ్య నవీన్ ‘’అయి పోయాడు .అంతకు ముందు గోపీచంద్ లాంటి వాళ్ళు ప్రయత్నించారు .ఆంగ్ల రచయితలు ఉల్ఫ్ ,రిచార్డ్ సం లు కూడా ఇలానే రాశారు .1920 కేథరీన్ లాంటి రచయితలు ,కళా కారులు పాశ్చాత్య సంస్కృతి నుండి దూరమై పోయారు ..జాతీయ స్రవంతికి దూర మైన వారందరికి ‘’Generation x’’అనే పేరు 1990 లో వచ్చింది .
మాన్స్ ఫీల్డ్ ముఖం చూస్తె ధైర్యం ,వ్యతిరేక భావం ,స్వీయ వ్యక్తిత్వం ,ఆత్మా స్థైర్యం ,ఒకే భావానికి కట్టుబడటం ,వాదనా సామర్ధ్యం ఎల్యుసివ్నేస్స్ కని పిస్తాయి .ఇవన్నీ ఆమె రచనల లోను ప్రతి ఫలిస్తాయి .బెర్ట్రాండ్ రసెల్ ఆమె మేధస్సును మెచ్చి వశ పరచు కోవాలని ప్రయత్నిస్తే ఆమె వలలో పడ లేదు .వర్జీనియా ఉల్ఫ్ తనకు సాహిత్యం లో ఎవరు పోటీ కాని ,సాటి కాని లేరని అన్నది .కాని కేథరిన్ విషయం లో’’ stank like a ciret cat that has taken to street walking ‘’అంటూ ‘’I suppose her in my own way ‘’అని మెచ్చింది .కేథరిన్ రచనల పై మాత్రమే అసూయ అని ఆమె పై కాదని చెప్పింది ఉల్ఫ్ .ఆల్దస్ హక్స్లీ ,క్రిస్టఫర్ కొలంబస్ లు కేథరీన్ వాడిన అనేక మాటలనే తమ రచన లలో వాడారు .లారెన్స్ తన ‘’women in love ‘’నవల లో gudrem అనే పాత్ర ను కేథరీన్ ను దృష్టి లో పెట్టు కొనే రాశాడని అంటారు .అందులోని గుద్రేన్ ఎవరో కాదు -మాన్స్ ఫీల్డ్ .వీ ఇద్దరు రచయితలకు సయోధ్య బానే ఉన్నా ఒక సారి ఆమెను ‘’you are a loathe so me reptile ,i hope you will die ‘’అని శపించాదట . కాతేరీన్ కు తన అస్తిత్వం మీద నమ్మకం లేదు .తళుక్కు మని మేర వాలనే ఆరాటమే ఎక్కువ .జపాన్ బొమ్మ లాగా హెయిర్ ట్ తో ఉండేది .కాని ఆమె కాలం లో స్త్రీలు అందరు ఎద్వర్దియాన్ ఫాషన్ లో ఉండే వారు .వారికి ఈమె పూర్తి విరుద్ధం ..ఆకర్షణ గా ఉండే ప్రత్యెక దుస్తులను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించు కొనేది .ఆమె రచన ల న్నిటి లో సంస్కృతి విహీనత కన్పిస్తుంది .’’life and work are one thing ,indivisible ‘’అనేది ఆమె సిద్ధాంతం .ఎలా ఉండేదో అలానే రాసేది .రెంటికి తేడా ఉండకూడదని భావించేది .విశృంఖలత తో వీర విహారం చేసింది .ఆడ ,మగా అనే తేడా లేకుండా తిరిగింది .దాని ఫలితమూ అనుభ వించింది .ఎంత బాధ లో ఉన్నా ,చాలా ధైర్యం గా’’ డేర్ డెవిల్’’ లా రచనలు చేసింది .ఆమె విమర్శకుల దృష్టిని ఆకర్షించిన రచయిత అవటం గొప్ప విషయం .అందుకే ఆమెను’’ రైటర్స్ రైటర్ ‘’ అని విమర్శక లోకం గౌరవించింది .ఆమె రాసింది అంతా ‘’post modernism ‘’భావజాలంతో రాసింది .అప్పటికి ఆమె దానికి బీజాలు వేసిన రచయిత్రి .ఆమె చని పోయి నప్పుడు ఆమె సమకాలీన రచయిత లందరూ ‘’our missing cotemporary ‘’అని కితాబు ఇచ్చారు .
వర్జీనియా ఉల్ఫ్ కు కేథరీన్ తో పరిచయం లేక పోతే;; Mrs Dollway ‘’నవల రాసి ఉండేది కాదు అని విమర్శకుల అభి ప్రాయం ‘’.process of writing ‘’మీద అద్భుత రచనలు చేసి మార్గ దర్శకత్వం చేసింది .ఆమె రాసిన ఉత్తరాలు ,నోట్ బుక్స్ అన్నీ సాహిత్య స్థాయిని పొందాయి .అంత వరకు యే రచయితకు ఇది దక్క లేదు .తన స్వీయ అపజయాలతో విశ్వ శోధన చేసిన మహా రచయిత్రి కేథరీన్ .పోస్ట్ ఇంప్రెషన్ భావాలు ,ఆ పెయింటింగ్స్ ఆమె కు అధిక ప్రేరణ కల్గించాయి .

