అమెరికా ఊసులు –6
జోసెఫ్ ప్రీస్త్లీ ఇంగ్లండు నుంచి పారి పోవాల్సి వచ్చిందని చెప్పాను .ఆ వివరాలిప్పుడు తెలుసు కొందాం .1782 లో the history of the corruption of christianity అనే పుస్తకం రాశాడు .దానికి అనుబంధం గా తర్వాతా institution of natural and revealed religion రాశాడు .ఆనాటి చర్చి లో జరిగే భాగవతం అంతా ఎండ కట్టాడు .జీసస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చాడు .మంత్రాలు ,మహిమలను కాదన్నాడు .క్రీస్తు మనిషే నని మతం లోని లొసుగులను గురించి చాలా తక్కువ స్థాయి భాషలో రాసి క్రిస్టియన్లకు బాధ కల్గించాడు .భగవంతుడు జీసస్ ను తన ప్రతిన్డిది గా మాత్రమే భూమికి పంపాడ న్నాడు .క్రిస్టియన్ గాడ్ లేదన్నాడు .తన భావాలను ఆనాటి అమెరికా ప్రముఖుడైన జెఫర్సన్ కూడా పంపాడు .ఆయన బాగా అభిమానించాడు .తనను విమర్శించే వారికి సమాధానం గా ఒక కరపత్రం ప్రింట్ చేసి వదిలాడు .దీనితో యూని టేరియన్ క్రిస్టియన్ భావాలకు వ్యాప్తి కల్గించాడు .ఫ్రెంచ్ విప్ల వాన్ని సమర్ధించాడు .ఇతని తో బాటు హానెస్ట్ విగ్స్ బృందం సమర్ధించింది .అతనికి చాలా బెదిరింపు ఉత్త రాలోచ్చాయి .ఇంగ్లాండ్ చర్చి రాజు ఇతని అంతు తేలాల్సిందే నని పట్టు బట్టారు .
అప్పటికే తన ప్రయోగాల లాబ్ ను తగల బెట్టారు .ఫెయిర్ హిల్స్ అనే చోట ఇల్లు, లాబ్ లను ఏర్పరచుకొన్నాడు .వంద మంది అల్లరి మూక లాబ్ ను తగల బెట్టారు .లైబ్రరి ధ్వంసం చేశారు .ఎంతో విలువైన పరికరాలు పాడై పోయాయి .ఇన్నాళ్ళ శ్రమ బూడిద లో పోసిన పన్నీరు అయింది .స్నేహితులంతా తామే డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ అన్నీ సమకూర్చి పెడతామని హామీ ఇచ్చారు .కాని భార్య మేరీ తో సహా ఫ్రాన్క్లిన్ సహాయం తో అమెరికా చేరాడు ‘
అమెరికా లో అతను ఆ దేశ నిర్మాణ బాధ్యులలో ఒకడు అని పించుకొన్నాడు .పెన్సిల్వేనియా లోని ఫిలడెల్ఫియా కు చేరుకొన్నాడు .అమెరికా వైస్ ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్ తో మంచి దోస్తీ కుదిరింది ..1792 లో ఇంగ్లాండ్ వెళ్లాడు .ఫ్రెంచ్ ప్రభుత్వం గౌరవ పౌరస త్వం ఇస్తా నంది .మరుసటి ఏడాది మళ్ళీ అమెరికా చేరాడు .కవి కాల్రిద్జ్ ప్రీస్త్లీ కి జరిగిన అన్యాయాన్ని గొప్ప కవిత గా రాశాడు .ఫిలడెల్ఫియా లోని అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ లో చాలా కాలం గా సభ్యుడి గా ఉన్నాడు .గత్యంతరం లేని పరిస్థితుల్లో అమెరికా కు శరణార్ది గా వచ్చాడు .ఇక్కడి వాతా వరణం భార్యకు సరి పోలేదు .అందుకని నార్త్ అంబర్ లాండ్ అనే చోట స్తిర పడ్డారు .అప్పటికి రవాణా సోకర్యాలు లేవు .రోజు పోస్ట్ రాదు .న్యూస్ పేపర్లు లేవు .అందుకని ఆడమ్స్ ను రోజు ఒక కోచ్ లో టపా వచ్చే ఏర్పాటు చేయమని ఉత్తరం రాశాడు .
రాడికల్ బోధనలు చేసే వాడు .ఇవి ఇక్కడ ఇబ్బంది కలిగిస్తాఎమో నని ఆడమ్స్ బాధ పడ్డాడు .అమెరికా లోని రాజ కీయాల పై ఘాటు విమర్శలే చేశాడు .భార్య మరణించింది .ఆమె ను గురించి చెబుతూ ‘’నేను ఎప్పుడు ఇంట్లో ఆమెకు ఒక అతిధి గానే ఉన్నానని ,అన్నీ ఆమె చూసుకొనేది ‘’అని బాధ పడ్డాడు .
జెఫర్సన్ 1794 లోరాజకీయాలను వదిలి తిరిగి వచ్చి అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకొన్నాడు .అయితే రెండు రోజుల్లోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ ఆడమ్స్ కు పని చేశాడు .ప్రీస్త్లీ ఆడమ్స్ ,జెఫర్సన్ ళ మద్య ఇరవై ఏళ్లు ఉత్తర ప్రత్యుత్త రాలు జరిగాయి అందులో ఎక్కువ సార్లు ప్రీస్త్లీ ప్రస్తావన ఆడమ్స్ ,జఫర్సన్ మద్య జరిగిన ఉత్తరరాలలో వచ్చింది .ఇదులో అపార్ధాలు చోటు చేసుకొన్నాయి ఆడమ్స్ ప్రీస్త్లీ ని ‘’ఆధునిక సోక్రటీస్ ‘’అన్నాడు .తరువాత జెఫర్సన్ ప్రెసిడెంట్ అయాడు .అతనికి ఆడమ్స్ కు పడ లేదు .పదవి లో ఉండగానే ప్రెసిడెంట్ ఆడమ్స్ విధానాలను ఎండ గట్టె వాడు .
ప్రెసిడెంట్ జఫర్సన్ కు ప్రీస్త్లీ జాబు రాస్తూ ‘’ఐ థింక్ మై సెల్ఫ్ హాపీ టు హావ్ లివేడ్ సో లాంగ్ ఉండర యువర్ ఎక్సేలేంట్ అడ్మినిని స్త్రేషన్ అండ్ ప్రపోస్ టు డై ఇన్ ఇట్ ‘’ అన్నాడు .తమాషా ఏమిటంటే జఫర్సన్ ఆడమ్స్ లు ఇద్దరు ఒకే రోజు july 4-1846లో చని పోయారు .అది అమెరికా కు స్వాతంత్రం వచ్చిన 50 వ స్వాతంత్ర్య వార్షికోత్సవం అంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండి పెందేన్స్ కు యాభై ఏళ్ళు అన్న మాట .ప్రీస్త్లీ బోధించిన నేచురల్ ఫిలాసఫీ అమెరికా కు దశా ,దిశా నిర్దేశం చేసింది అని విశ్లేషకుల భావన .
ప్రీస్త్లీ తనను చాలా కాలానికి కని పించే తోక చుక్క గా పోల్చుకొన్నాడు .ఒక కామెట్ లాగా చాలా వేగం గా కడులుతానని ,అదే వేగం తో వేడి ,వెలుతురూ ప్రసరించి మాడి మసి అయి పోతానని అన్నాడు .దీనికి స్పందించిన ఆడమ్స్ ‘’గ్రహ స్తితి లో కామెట్ ఒకటి అని వాల్టర్ లాగా అమెరికా కు ప్రీస్త్లీ భావజాలాన్ని అందించాడని మెచ్చాడు .అమెరికా నిర్మాణం లో ప్రీస్త్లీ భావజాలం స్వాతంత్రానికి ,స్వేచ్చా ప్రకటనకు ప్రజాస్వామ్య విలువలకు భూమికలైనాయి . తాను క్రిస్స్టియానిటి ని వదలకుండా ప్రీస్త్లీ సహాయ పడ్డాడని జెఫర్సన్ ప్రశంషించాడు .17 75 లో దేబ్భై అయిదేళ్ళ వయసు లో ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను, గాలి నిర్మాణాన్ని లోకానికి అందించిన ప్రీస్త్లీ ప్రాణ వాయువు అనంతా కాశాలకు చేరింది .
జెఫర్సన్ ఆడమ్స్ లు పన్నెండు ఏళ్ళు ముఖాలు చూసు కోలేదు .మళ్ళీ పన్నేన్దేల్ల తర్వాతా ప్రీస్త్లీ ని జ్ఞాపకం చేసుకొని ఉత్తర ప్రత్యుత్త రాలు జరుపు కొన్నారు ..ఈ విదం గా ప్రీస్త్లీ చని పోయి కూడా వారిద్దరిని కలిపాడు .
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –22-6-12.—కాంప్—అమెరికా

