సంగీత పాణి నీయం
సంగీతం పాడటం ఒక ఎత్తు .అందులోని మెళకువలు గ్రహించటం మరో ఎత్తు .ఆ సంగీత రసజ్ఞత ను శ్రోతలకే కాక, కాక కాకలు దీరిని సంగీత విద్వాంసులకు కర దీపిక గా మార్చి వెలుగు దారి చూపించటం మరో ఎత్తు .దీనినే ఆయన సాధించి గురువులకు గురువు గుగ్గురువు అని పించు కొన్నారు .శాస్త్ర బద్ధత కు కొల మానం గా నిలిచారు
.వ్రుత్తి వైద్యమే అయినా ప్రవ్రుత్తి సంగీతమై దాని వ్యాధులకు చికిత్చ చేసి ఆరోగ్యాన్నిచ్చారు .ఆ నాటి వ్యాకరణానికి పాణిని ఎంతటి లబ్ధ ప్రతిష్టుడో ఈ నాటి కర్ణాటక సంగీతానికి పినాక పాణి అంతటి తేజో విరాన్మూర్తి .సంగీతానికి ఆధునిక పాణిని పినాక పాణి .ఆయన పదవీ విరమణ తరువాత జీవితాన్ని అనుక్షణం సంగీతానికే ధార పోసిన మహాను భావుడు .ఎనిమిదేళ్ళు గా మంచం లోనే ఉంటున్నా వారి సంగీత విశ్లేషణా గమనం ఆగి
పోలేదు .నోటిలోనే మననం చేసుకొంటూ శిష్యుల చేత వ్రాయిస్తూ గ్రంధస్తం చేస్తున్న కారణ జన్ములు .దిగ్దంతు లైన సంగీత విద్వాంసులకు ఆచార్యత్వం వహించిన ఘనత వారిది .సంగీత రస గుళికలను ఆంద్ర సంగీత ఆభిమానులకు కరతలా మలకం చేసిన సంగీత శంకర భగవత్పాదులు .ఖగోళ రహస్యాలను కుర్చీలోనే కూర్చుని శరీరం సహకరించక పోయినా విశ్వ నిర్మాణ రాహస్యాలను అవగాహన చేసి కోని ,అందరికి అర్ధ మయ్యే భాష లో అతి గహన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించిన స్టీఫెన్ హాక్ శాస్త్రజ్ఞుడు ఆయన లో కని పిస్తాడు .”సంగీతం ధ్వని నాట్యం .దాన్ని పరిగెత్తుతూ నువ్వు ఎలా నృత్యం చేస్తావు ”?అని ప్రశ్నించిన సంగీత శ్రీ పాదులు పినాక పాణి గారు .వారి విద్వత్తును పద్మ భూషణ తో సరి పెట్టిన మన అల్పజ్నత కు తల వంచు కోవాలి .ఏ.వి.కే.రంగారావు గారు అన్నట్లు ఆయన మనకు ”సంగీత స్వర నిఘంటువు ”.సంగీతానికి సరికొత్త పాత దారిని వెలుగుల తో నింపి చూపిన మార్గ దర్శి .
బహుశా ముప్ఫై ఏళ్ళు పైగా అయి ఉంటుంది -శ్రీ పాద వారిని విజయవాడ లబ్బీ పేట లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో కంచి జగద్గురువుల సన్నిధి లో కచేరి చేస్తుండగా చూశాను .పట్టు పంచె కట్ట్టు కోని పట్టు పై పంచె వేసుకొని నుదుట వీభూతి రేఖల తో ” అపర సంగీత ‘పినాక పాణి ”(శివుడు )గా దర్శన మిచ్చారు ..అద్భుత మైన గానం తో శ్రోతలను అలరించారు .జగద్గురు ల కు పరమ ప్రీతిని కల్గించి వారి చేత సత్కారం అందుకొన్నారు .నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారు కంచి పీఠం లో ఆస్థాన విద్వాంశులు అను కొంటాను .అరుదైన గౌరవం పొందారు .ఆ సంగీత సరస్వతికి శత వసంతాల ఈ శుభ సమయం లో వారికి ద్వి శతాధికా యుర్దాయం, ఆరోగ్యం కలిగించాలని భగ వంతుని ప్రార్ధిస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -08 -12 .–కాంప్ –అమెరికా
—
వీక్షకులు
- 1,107,624 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు



