పార్ధ సారధీయం
అందరికి శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలు .పార్ధుడు అంటే అర్జునుడు .అతనికి సారధి శ్రీ కృష్ణుడు కనుక కృష్ణుడు పార్ధ సారధి అని పిలువ బడుతున్నాడు .కృష్ణుడు చెప్పింది” పార్ధ సారధీయం .” అదే భగవద్గీత .దాని సందేశాన్ని మా అమ్మాయి ఇంటి ప్రక్కన ఉంటున్న మారెళ్ళ గాయత్రి గారి తండ్రి గారు స్వర్గీయ మారెళ్ళ పార్ధ సారధి రావు గారు ”గీతా సందేశం ”పేర పుస్తకం రాసి ప్రచురించారు .ఆవిడ ఆపుస్తకాన్ని ఈ మధ్యనే ఇచ్చింది .అందులోని విషయాలను సంక్షిప్తం గా ‘పార్ధ సారధీయం ” అని ఆయన పేరు కూడా వచ్చేటట్లు ”కృష్ణాష్టమి” సందర్భం గా అందిస్తున్నాను .
న్యూటన్ శాస్త్రజ్ఞుడు పదార్ధము ను సృస్తిన్చలేమని ,నశింప జేయ లేమని అన్నాడు .అది ఒక రూపం నుండి వేరొక రూపం లోకి మారుతుంది . అలాగే ఈ జన్మ పోయి ఇంకో జన్మ కూడా వస్తుంది అయిస్తీన్ సిద్ధాంతం ప్రకారం కూడా ,విశ్వ పదార్ధ మూల మైన పరమాణువులు విచ్చేదంచెంది ,నిరాకారమైన శక్తి తరంగాలుగా మారుతాయి .వీటిని ఊహించటం ,వర్ణించటం చేయ లేమని అన్నాడు దీనినే ఆయన undefinable unified theory అన్నాడు .బౌద్ధ గురువు లాబ్ సాంగ్ రామ్పా –గ్రుడ్డు రూపం లోనుంచి గొంగళి పురుగు గా మారి సీతా కొక చిలుక ఏర్పడుతుంది .దానికి తాను గొంగళి పురుగు నుండి వచ్చి నట్లు తెలియదు .అది ఒక దశ నుండి మరణం లాంటి స్తితినే పొంది ,మరొక దశను పొందింది .మనం అది పొందే రూప విక్రియలన్ని చూడ గాలుగుతున్నాం .దీన్ని బట్టి ఆలోచిస్తే మన పునర్జన్మ సిద్ధాతం కూడా అలాంటిదే నని పిస్తుంది అన్నారు ..అందుకే భగవద్గీతలో భగవానుడు ”శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయ గలవు .ఆత్మను మాత్రం ఏమీ చేయలేవు .శస్త్రాలు నిప్పు ,గాలి శరీరాన్ని నాశనం చేయ గలవు .కాని ఆత్మను నాశనం చేయలేవు .ఆత్మ నిత్యం .అంతటా వ్యాపించి ఉంటుంది .అది స్తిరం ,అచలం ,సనాతనం .బాహ్య భూత వికారాలేవీ దాన్నేమీ చేయలేవు .
ధర్మ పోరాటం లో జయాప జయాలు లాభ నష్టాలు బేరీజు వెయ రాదు .ధర్మమే లక్ష్యం గా కర్తవ్యాన్ని కోన సాగించాలి .క్షత్రియుడికి యుద్ధం చేయటం స్వధర్మం .కనుక మనకు నిర్దేశింప బడిన కార్యాలను తప్పక చేయాలి .కర్తవ్య దీక్షతో ,అంకిత భావం తో చేయాలి .శక్తి యుక్తులన్నీ ధార పోసి చేయాలి అని కృష్ణుని బోధ .కర్మలు చేసే టప్పుడు ఫలితం ఆశించ కుండా చేయాలి .భగవంతుని అర్పించే భావం తో చేయాలి అప్పుడు ఆ కర్మలు మనల్ని బంధించవు .అలాగని చెడ్డ పనులు చేసి వాటినీ భగవంతునికి అర్పణం అంటే బెడిసి కొడతాయి .దీనినే” కానందుడు ”అంటే వివేకా నంద స్వామి ”Results will follow in course of time .one can not get results just as one pleases .one can not cancel them .,escape from them ,or mitigate them .Anxious expectations of results will only lead to restlessness and worry ”అని స్పష్ట పరచాడు .
పరమాత్మ అంటే సచ్చిదా నంద స్వరూపుడు .సత్ అంటే -భూత ,భవిష్యత్ ,వార్త మానాలలో ఎప్పుడు నిలకడ గా నిలిచి ఉండేది .చిత్ అనగా -విజ్ఞాన సర్వస్వం( knoweldge ).ఆనందం అంటే -అపరి మిత మైన సంతోషం(bliss ) .వీటి సమ్మేళనమే భగవంతుడు .ఆయన సర్వ వ్యాపి ,సర్వజ్ఞుడు ,సర్వ శక్తి మంతుడు ,ఆనంద మయుడు అని వీటి భావం .ఆయన ఒక శక్తి స్వరూపం .జీవుడు ఆ పరమాత్మ తత్వానికిప్రతి బింబం .ఆత్మ అనేది పరమాత్మ యొక్క వెలుగు .ఆత్మ తత్త్వం ,మళ్ళీ ఆ పరమాత్మ తత్వాన్ని పొందటమే .ప్రతి జీవి తన అంతరాంతరాల్లోతాను కోరుకొనేది -ఎల్లప్పుడు ఉండాలని (సత్ ),తాను అన్నీ తెలుసు కోవాలని (చిత్ ),తాను ఎప్పుడూ సంతోషం గా ఉండాలని (ఆనందం )కోరుకొంటు నే ఉంటాడు .ఈ సచ్చిదానంద స్వరూపం కావాలని ,తిరిగి పరమాత్మ లో ఐక్యం అవాలని చేసే ప్రయత్నమే జీవిత గమ్యం .ఈ జీవిత యానం లో చేసే మంచి ,చెడు కార్యాలు వాసనలు (tendencies )ఏర్పడి ,ఆ పాప పుణ్యాల ను అనుభ వించ టానికి మరో శరీరాన్ని ధరిస్తున్నాడు .ఈ బంధాలన్నీ విడి పోతే ,జన్మ రాహిత్యాన్ని పొంది ,మోక్షాన్ని పొందుతాడు .ఇక్కడే భారతీయ తత్వ వేత్తలు మూడు సిద్ధాంతాలను ప్రతి పాదించారు .ఆది శంకరులది -అద్వైత సిద్ధాంతం -పరమా త్మ యొక్క మాయయే ఈ జగత్తు .మానవులు అజ్ఞానం వల్ల పరమాత్మ తత్వాన్ని కోల్పోయి మానవుడు అని భ్రమ లో ఉంటాడు .ఆ అజ్ఞానం తొలగితే ,మానవుడే మాధవుడవు తాడని దీని భావం .రామానుజా చార్యుల వారిది విశిష్టాద్వైతం –పరమాత్మ తేజో మయుడు అయితే ,ఆయన వెలుగు మానవులు .ఆయన అగ్ని జ్వాల అయితే ,మానవులు అగ్ని కణాలు .వైరాగ్యం ద్వారా మానవుడు మళ్ళీ పరమాత్మను చేరుతున్నాడు .ఇదీ వీరి పద్ధతి .మూడోది మధ్వాచార్యుల వారి ద్వైత సిద్ధాంతం –భగవంతుడు వేరు ,ఆయనకు అత్యంత ప్రియ భక్తుడైన మానవుడు వేరు .మానవుడు భక్తీ ద్వారా ,భగ వంతుని సన్నిధానానికి చేరి ,పరమ శాంతిని పొందుతాడని ఈ సిద్ధాంతం ఈ మూడు వేరుగా కనీ పిస్తున్నా అది నిజం కాదు .ప్రాధమిక దశలో ద్వైతాన్ని అనుసరించి భక్తుడు అవుతాడు .తర్వాత విశిష్టాద్వైతం ద్వారా ధ్యాన పద్ధతి లోదగ్గరై, అద్వైత విధానం లో జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు .ఇలా భావిస్తే ఏమీ విరోధం లేదు .మహానుభావులు మనకోసం సోపాన పంక్తుల్ని నిర్మించారు .ఆ మెట్లు ఎక్కి మనం చేరాల్సిన చోటికి చేరాలి .
పరమాత్మ గంభీర సముద్రం వలె ప్రశాంతికి ప్రతీక .సముద్రం లో పుట్టే ,కెర టాల లాగా ఆత్మలు జీవితాన్ని ధరించి ,తిరిగి సముద్రం లో కలిసి పోతు ఉంటాయి.కెరటం పైకి లేస్తే జీవితం గా కనీ పిస్తుంది .అది సముద్రం లో కలిసి తన అస్తిత్వాన్ని కోల్పోయి లయం అవుతున్నప్పుడు మరణం గా భావించాలి .కెరటం అసలు స్వరూపం ప్రశాంత గంభీర సముద్రమే .అందుకే మహర్షులందరు తమ మేధస్సులో వేద వాక్యాలను విని రుక్కులు గా సాక్షాత్క రింప జేశారు .వారు చెప్పిందేమిటి ?”మీరు అమృత పుత్రులు .ఆనంద స్వరూపులు .అంధకారానికి అవతల ఉన్న భ్రాంతికి అతీతుడైన ,సనాతనుడైన ,భగవంతుని మేమందరం దర్శించాం . .ఆ భగ వంతుని తెలుసు కొంటేనే బాధలు, భ్రమలు అన్నీ తొలగి పోతాయి ” అని విస్పష్టం గా మార్గ దర్శనం చేశారు .
యోగ నిష్ఠ తో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి .కర్మలలో సంగాత్వాన్ని లేకుండా ఉండాలి (.నాన్ అటాచ్ మెంట్ ).ఫలితం లభించినా ,లభించక యినా సమ బుద్ధి కలిగి ఉండాలి (equanimity )కలిగి ఉండాలి .దీనినే మహేష్ యోగి ఇంకో రకం గా వివరించారు .సమస్యను పరిష్కరించ టానికి ఆ సమస్యకు దూరం గా ,అతీతం గా ఉండి ,ఆలోచించి తె పరిష్కారం తేలిగ్గా లభిస్తుంది .ఒక విల్లు తో బాణాన్ని సంధించి నప్పుడు ,వింటిని వెనక్కి లాగి బాణం వదులు తాము .అప్పుడది వేగం గా లక్శ్యం వైపుకు దూసుకు వెడుతుంది .ఈ వెనక్కు లాగటం అనేది సమస్యల వలయం నుండి దూరం గా వెళ్లటం లాంటిది (withdrawn from the field of activity .).యోగం అంటే కర్మలను ఆచరించే టప్పుడు చూపించే కౌశలం ,సంపూర్ణ జ్ఞానమే .అప్పుడే దక్షత (efficiency )వస్తుంది .జడస్తితి లో ఉన్న మనిషి కి ,యే ఆశయమూ లేని వ్యక్తికీ కోరికలు ఉండక పోవచ్చు .ఆత్మా నందం పొందిన వాడి లో కోరికలు ,దుఖాలు దగ్గరకు చేరవు .ఆ స్తితి లో తన విద్యుక్త ధర్మాన్ని అనాసక్తి తో నేర ర్చటమే స్తిత ప్రజ్నుని లక్షణం .అతడు ప్రపంచం లోని పాప కార్యాలను ప్రోత్స హించడు. వాటి వల్ల చలించడు .ఇదీ ”పార్ధ సారధీయం ”అనే గీతా సందేశం .
. శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షల తో –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -08 -12 .కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,434 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

