అమెరికా ఊసులు -13
అమెరికా అధ్యక్షు లైన వారిలో చాలా మంది ప్రజాభి మానం పొంది ,ప్రజల కోసం ఎంతో చేసి మెప్పు పొందిన వారే .వాళ్లనే మళ్ళీ గెలి పించి ప్రజలు అభిమానాన్ని చాటు కొన్నారు ఆనాడు .ఆ తర్వాత ధన ప్రభావం తో అధ్యక్షులైన వారున్నారు .రెండో సారీ గద్దెనెక్కిన వారున్నారు .కాని తొలి తరం నాయకు లతో పోలిస్తే పాపం వీరి స్తాయి గ్రాఫు చాలా కిందకి వెళ్లి పోతుంది .అలా అని పాత తరం లో అందరు ప్రజాభి మానాన్ని పొందారని చెప్పలేము .కొందరు బెస్ట్ ప్రెసిడెంట్ అని ,కొందరు పీపుల్స్ ప్రెసిడెంట్ పేరు పొందారు .వారికి ప్రజబ్రహ్మ రధం పట్టింది .కాని ఒకే ఒకాయన అమెరికా ప్రెసిడెంటు లలో”one of The worst president s”అని పించుకొన్నాడు .ఆయనే పదిహేనవ అమెరికా అధ్యక్షుడు జేమ్స్ బుచనాన్ .
బుచనాన్ పెన్సిల్వేనియా నుండి ఎన్ని కైన ఒకే ఒక ప్రెసిడెంట్ .ఆయన తండ్రి ఐర్లాండ్ నుంచి వలస వచ్చి ఇక్కడ కొత్తగా స్తిర పడ్డాడు .అందుకే బుచనాన్ ను”ఇమ్మిగ్రెంట్ ప్రెసిడెంట్ ”అన్నారు .ఆయనకు పెళ్లి కాలేదు .లాయర్ .అధ్యక్ష భవనం లో దేశ ప్రధమ మహిళా గా ఎవరో ఒకరున్డాలి .ఆయన సోదరి కుమార్తె ”హారియట్ ”ప్రధమ మహిళా బాధ్యతలన్నీ నిర్వ హించింది .ఇదొక విద్డూరం .”పెళ్లి కాని ప్రసాద్” లాగా పెళ్లి కాని ప్రెసిడెంట్ అన్న మాట బుచనాన్ .ఆయన దేనిలోనూ రాణించక పోయాడు పాపం. ఆయనే చెప్పుకొన్నాడు” I acknowledge no master but in law ”అని చెప్పుకొన్నాడు .అంతే కాదు ఈయన గారికి ఒక గొప్ప క్రెడిట్ కూడా ఉంది .18శతాబ్దం లో పుట్టిన చివరి ప్రెసిడెంట్ బుచనాన్ .
1856 లో know nothing అని పిలువ బడ్డ millard Fimore అనే ఆయన అధ్యక్ష పదవికి ఈయనతో పాటు పోటీ చేశాడు .బుచనాన్ డెమొక్రాటిక్ పార్టి అభ్యర్ధి .. .జాన్ సి.ఫ్రీ మాంట్ అనే రిపబ్లికన్ అభ్యర్ధి ప్రధాన ప్రత్యర్ధి .ఈ ”త్రికోణపు ”పోటీలో అదృష్టం బుచనాన్ ను వరించి ప్రెసిడెంట్ గా ఎన్ని కైనాడు .బుచనాన్ అధ్యక్షా స్తానం లో కూర్చున్నాడు కాని ఏమీ చేయ లేక పోయాడు .సరైన మెజార్టి లేదు .రిపబ్లికన్లు ఏమీ సహక రించటం లేదు .యే నిర్ణయమూ తీసుకోలేక పోయాడు .దక్షిణ రాష్ట్రాలు విడి పోతామని బెది రిస్తున్నాయి .ఉత్తర రాష్ట్రాలు కలిసి ఉండాలని ఒత్తిడి చేస్తున్నాయి .పాపం ఆయన పని కుడితిలో పడ్డ ఎలుక గా ఉంది .నిర్వికారం గా ,అచేతనం గా నాలుగేళ్ళు గడిపాడు .అందుకని అసమర్ధ ప్రెసిడెంట్ గా ముద్ర వేయించు కోవాల్సి వచ్చింది .బుచనాన్ తర్వాతా అమెరికా అధ్యక్షుడు గా అబ్రహాం లింకన్ పదహారవ దేశాధ్యక్షుడిగా ఎన్ని కైనాడు .ఈయనకూ అప్పటికి ప్రజా బలం తక్కువే .అయితేనేం సమయానికి తగిన నిర్ణయం చేసి మొనగాడు ప్రెసిడెంట్ అని పించాడు .అమెరికా ప్రజల హృదయాలలోనే కాదు యావత్ ప్రపంచ ప్రజల హృదయాలలో స్థానం పొందాడు .లింకన్ పేరు చెబితే ఉప్పొంగని హృదయం ఉండదు .తన పదివి నుండి తప్పుకొంటు ,లింకన్ కు బాధ్యతలను అప్ప గీస్తూ బుచనాన్ you are as happy in entering the white house ,as i shall feel on returning to wheat land .you are a happy man ” అన్నాడు .ఇదొక అసమర్ధుని జీవిత యాత్ర అనుకొందాం .
మహా మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ శాస్త్ర వేత్త గురించి కొన్ని సరదా కబుర్లు చెప్పు కొందాం -ఒక సారి న్యూయార్కు లోని జ్యూయిష్ టైలర్ ఇంకొక జ్యూయిష్ టైలర్ కు ఐయిం స్టీన్ గురించి చెప్పాడట .ఆ రెండో ఆయనకు అయిస్తీన్ ఎవరో తెలీదు .అప్పుడు మొదటి ఆయన ‘అయిన స్టీన్ అంటే ”రిలేటి విటి ” నికనీ పెట్టిన ఆయన ‘అన్నాడు .అదంటే ఏమిటి అని తెల్ల మొహం వేసి అడిగాడు రెండో టైలర్ .దానికి మొదటి టైలర్ సమాధానం గా ”ఒక ముసలి ఆవిడ సరదా గా ఒక నిమిషం సేపు నీ తోడ మీద కూచుంది అనుకో,అప్పుడు ఆ నిమిషం నీకు ఒక యుగం అని పిస్తుంది .కాని ఒక అంద మైన అమ్మాయి నీ తోడ మీద కొన్ని గంటలు కూచుంది అనుకో అప్పుడు నీకు ఒక్క నిమిషమే నని పిస్తుంది .అదే సాపేక్ష సిద్ధాంతం- రిలేటి విటి ” అని వివరించాడట .”అబ్బో ఇంత గొప్ప సిద్దాన్తమా–దీన్ని కనీ పెట్టా అయిన్ స్టీన్ జీవితం గడుపు తున్నాడు !”అని ఆశ్చర్య పోయాడట రెండో టైలర్ . ఈ జోకు ను 1946 లో ఆంత్రో పాల జిస్ట్ అయిన ”ఆష్లీ మాంటేగు ” మేధావి అయిన స్టీన్ కు స్వయం గా చెబితే ,ఆయన పగల బడి నవ్వాడట .అయితే ఈ జోక్ తన సాపేక్ష సిద్ధాంతాన్ని అతి సామాన్యుడికి చేరేట్లు చేసింది అని అయిన్ స్టీన్ ఒప్పు కొన్నాడట .
ఆ తర్వాత కొన్నేళ్ళకు బే స్ బాల్ ప్లేయర్లు అయిన మొ బెర్గ్ ,జాన్ కీర్నాన్ లను అయిన స్టీన్ తనకు బే స్ బాల్ ఆడే విధా నాన్ని తెలియ జేయ మన్నాడట .ఒక కాగితం ,కలం తెచ్చి దాని మీద ఆడే విధానాన్ని బెర్గ్ బొమ్మలతో రాసి చూపించాడట .అదేమీ ,ఈ మేధావికి ఎక్కక బుర్ర గోక్కున్తున్నాడు .కాసేపటి తర్వాతా వారిద్దరికి టీ ఇచ్చి ఐన్స్టీన్ తనకు అత్యంత ప్రియ మైన ”వయోలిన్ ”మధురం గా .వాయించి ఆనందం కల్గించాడు .బెర్గు తో ఒక ఒప్పందానికి వచ్చాడు మన శాస్త్ర వేత్త .తాను వాళ్లకు సాపేక్ష సిద్ధాంతాన్ని అర్ధమయ్యే టట్లు చెప్తానని వాళ్ళిద్దరూ తనకు బెస్ బాల్ ఆట నేర్పాలని ఒప్పందం .కొంచెం సేపయిన తర్వాత అయిస్ స్టీన్ ”మీరు సాపేక్ష సిద్ధాంతాన్ని నేను బెస్ బాల్ నేర్చుకొనే లోపే నేర్చుకో గలరు .నాకు అది రావటం గగనం ”అని ఒప్పందాన్ని సరదా గా రద్దు చే సుకోన్నాడట .
మహాత్మా గాంధీ గారికి మార్టిన్ లూధర్ కింగ్ కు ప్రేరణనిచ్చిన వారు అమెరికా లోని అమెరికా లోని సామాజిక కార్య కర్త ,స్వయం అభి వృద్ధికి మార్గాలను చూపిన తత్వ వేత్త ,రచయిత మాసా చూ సెట్స్ రాష్ట్రం లోని కాన్కార్డ్ నివాసి హెన్రీ డేవిడ్ తోరో గారు .ఆయన జీవితం లోని కొన్ని విషయాలు అందరికిఅసహచర్యం కలిగిస్తాయి .ఆయన తండ్రి పెన్సిల్లు తయారు చేసి అమ్మే వ్యాపారి .ఈయన కూడా నాన్య మైన పెన్సిల్లు తయారు చేసే వాడు .ఈయన మంచి కార్పెంటర్ కూడా .సర్వేయర్ గా గొప్ప పేరు ఉంది .ఇంట్లోకి కావలసిన కుర్చీలు బెంచీలు డ్రాయర్లు అన్నీ ఆయనే తయారుసుసుకొనే వాడు .నదిలో నడిపే బోట్లను ఆయనే తయారు చేసుకొన్నాడు .ఆయన గురువు సహచరుడు ప్రఖ్యాత రచయిత ,తత్వ వేత్త ఎమర్సన్ గారు .ఎమర్సన్ అంటే ప్రపంచ దేశాల ప్రజలందరికి భారత దేశం తో సహా ఆరాధనా భావం ఉంది .ఆయన్ను కోట్ చేయకుండా యే దీ రాయనంతటి ప్రభావం ఎమర్సన్ గారిది .తోరో గారికి లాంగ్ ఫెలో కవి గొప్ప స్నేహితుడు .అయితే తోరో కు ఉబ్బస వ్యాధి ఉండేది .దానితో చాలా బాధ పడే వాడు .అయినా రచనా వ్యాసంగం మాన లేదు .ఇళ్లకు ఫెన్సింగ్ ను చాలా బాగా చేసే వాడు .కొన్ని దశాబ్దాలు అవి చెక్కు చెదర కుండా ఉండేవట .ఒక స్కూల్ పెట్టి కొద్ది కాలం నడిపాడు .విద్యార్ధులను కొట్టటం అంటే ఇష్టం ఉండేది కాదు .గ్రాఫైటు కార్బన్ ను ఉపయోగించి నాన్య మైన పెన్సిల్లు తయారు చేశాడు .అమెరికా లో మొదటి నాన్య మైన పెన్సిల్ ను చేసింది తోరో గారే .ఆయన ప్రేమ లు పెటాకు లైనాయి .అందుకని పెళ్లి చేసుకో లేదు .కొయ్య ముక్క లో గుండ్రని రంధ్రాన్ని చేసే సాధనాన్ని కనీ పెట్టాడు .
” the laws of nature and human nature were the same ”అని మానవునికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలియ జెప్పాడు .ఎమర్సన్ గారు తోరో గారికి దైవ దత్త మైన తండ్రి .”there is no remedy for love ,but to love ‘more ”అని చక్క గా చెప్పాడు .ఆయన చిన్న తనం లో న్యూయార్కు నగరాన్ని చూశాడు .దాన్ని అధ్వాన్న నగరం అన్నాడు .it is worse .it is a thousand times meaner than i could have imagined .the pigs in the street are the most respectable part of the population .అని రాసుకొన్నాడు తన అనుభవాన్ని .అప్పుడే రైలు సర్వీసు ప్రారంభ మైంది .ఒక గంట ప్రయాణానికి యాభై సెంట్లు చార్జి వసూలు చేసే వారు .ఆయన కు వారం లో ఒక రోజు పని చేసి ,ఆరు రోజులు విశ్రాంతిగా ఉండటం ఇష్టం .వాల్డెన్ పాండ్అనే ప్రదేశం లో అనే ప్రకృతి అందాల మధ్య కుటీరాన్ని స్వయం గా నిర్మించుకొని కొంత కాలం జీవించాడు .గాంధీ గారు ఇక్కడికే వచ్చి చూసి ప్రభావితుడైనాడు .పన్ను ను నాలుగేళ్ళుగా కట్ట లేదని ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో ఒక రోజు ఉంచారు ఆయన మేనత్త ఆయనకు తెలీకుండా కట్టేసింది .జైలు ఖాళీ చేసి వెల్ల మంటే వెల్ల లేదు .కావాలనే పన్ను కట్ట లేదు .ప్రజా సోకర్యాలను పట్టించు కొని ప్రభుత్వానికి పన్నులు కట్టక్కర లేదని ఆయన వాదం ..దానితో civil disobedience ను ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్క రించాటానికి సాయం పడ్డాడు .ఇదే గాంధీజీ కి ప్రేరణ . సహాయ నిరాకరణం అంటే ఇదే .అసమర్ధత తో మొదలు పెట్టి,ప్రజా సమర్ధత అంటే ఏమిటో తెలుసు కొన్నాం .ఇక చాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,120,051 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,721)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
