మ్యూజిక్ మజీషియన్ మొజార్ట్ –1
జెర్మనీ దేశపు సంగీతానికి చిర యశస్సు ను సాధించి పెట్ట్టిన ఎందరో సంగీత కారులున్నారు .వారిని చిరస్మరణీయులు గా భావిస్తారు .క్లాసికల్ విదానాన్నుంచి రొమాంటిక్ సంగీతానికి బాటలు వేసి ప్రపంచ దేశాలన్నిటి లోను అభిమానాన్ని సంపాదించి ”త్రీ బి’అని పించుకొన్నారు ముగ్గురు మహనీయులు .వారే బాచ్ ,బ్రాహ్మస్,బీథోవెన్ లు .వీరిని సంగీత త్రయం అన వచ్చు . వీరిలో బీథోవెన్ అందరి కంటే సింఫనీ సంగీతానికి ఎన్నో మెరుగులు దిద్ది ,సంగీతం లో ఎన్నో అద్భుతాలను సాధించి ”మూన్ లైట్ సొనాటా ”తో హృదయాలను
పులకరింప జేసినా వాడు బీథోవెన్ .అలాంటి బీథోవెన్ కే గురువు-జోహాన్నెస్ క్రిస్తోమోస్ వోల్ఫాం,గ్గొట్టిలీబ్ మొజార్ట్ .బాల మేధావి గా ఆయన సాధించిన కీర్తి అజరామర మై నిలి చింది .సంగీతాన్ని ఒక మాజిక్ లా,శ్రోతలను మంత్ర ముగ్ధుల్నిచేసిన మొ జార్ట్ర్ట్ గురించి మనం తెలుసుకో బోతున్నాం .ఆయన్ను వోల్ఫాంగ్ అనీ ,మొజార్ట్ అనీ పిలుస్తారు .
బాల్య జీవితం
వోల్ఫాంగ్ మొజార్ట్ అమేయ మేధా సంపన్నుడు .తండ్రిలీ పోల్ద్ గౌరవం గా సంగీత పాథాలు చెప్పి జీవితం గడుపే వాడు .ఆయన వయోలిన్ టెక్నిక్కు ల మీద పుస్తకాన్ని కూడా రాశాడు .వీరి కుటుంబం ఈ నాటి ఆస్ట్రియా లో ని సాల్జ్ బర్గ్ లో ఉండేది .తండ్రికి పుట్ట్టిన ఏడుగురు సంతానం లో మోజార్టే చివరి వాడు .ఇతని జననం1756. ఇతని అక్క” మారియా అన్నా ”కు తండ్రి సంగీతాన్ని నేర్పాడు .ఆయన సాల్జ్ బుర్గ్ లోని ఆర్చి బిషప్ దగ్గర వయోలనిస్ట్ .తర్వాతా సహాయ సంగీత దర్శకు దైనాడు .మంచి పేరున్న వాడు .అక్క హార్ప్ కార్డ్ ప్లేయర్ .అదొక తమాషా వాయిద్యం .అందులో పియానో ,హార్ప్ ల కూర్పు ఉంటుంది .ఇతనికి ఎవరు సంగీతం నేర్ప లేదు .విని
కిడి తో వచ్చింది . అక్క నేర్చు కొంటుంటే సంగీతం ఇతనికి వచ్చింది .అంతే ,ఆమె లాగా నె వాయించేవాడు .అందరికి ఆశ్చర్యమేసింది .దైవ దత్తుడు బాల మేధావి అని అందరు భావించారు .మూడేళ్ళ వయస్సు నాదే విన్నది అంతా వాయించి చూపే వాడు .అయిదేల్లకే పేపర్ మీద ఏదేదో రాసే వాడు .ఏమి రాస్తున్నా వాణి తండ్రి అడిగితే ”కీ బోర్ద్ కన్సార్తో ”అని తక్కున సమాధానం చెప్పాడు .తండ్రికి నమ్మకం కలుగక వచ్చి చూస్తె నిజం గానే ఆ పని చేస్తున్నాడని తెలిసింది .”అయి పోవచ్చింది చివర్లో ఉన్నానని ఆ బాల మేధావి సమాధానం ”విని తన కొడుకు అఘటన ఘటనా సమర్ధుడు అనుకొన్నారు తల్లీ దండ్రీ .నిజం గా చెప్పా లంటే అప్పటికి ఇంకా అతని పేరు కూడా రాసుకోవటం రాని వయసు .
సంచార జీవితం
కొడుకు తెలివి తేటలకు మురిసిన తండ్రి అతని తో సంగీత కచేరీలు చేయించి డబ్బు సంపాదించ వచ్చు నని భావించాడు .ఆర్చి బిషప్ అను మతి తీసుకొని మ్యూనిచ్ ,వియన్నా లకు1703 లో కుటుంబం తో వెళ్లాడు .ఈ చిన్నారు లతో ఫ్రెంచి రాజు ,రాణి ల సమక్షం లో దర్బారు లో కచేరి చేయించాడు ట.తర్వాతా ఇంగ్లీష్ చానెల్ దాటి ,లండన్ చేరారు .ఫ్రాన్సులోని పారిస్ చేరి అన్ని చోట్లా ప్రదర్శన లిప్పించాడు కూతురు ,కొడుకు ల తో .దాదాపు మూడున్నర ఏళ్ళు ఇలా వివిధ దేశాలు సంచారం చేసి మళ్ళీ1766 కు స్వగ్రామం చేరింది కుటుంబం .వెళ్ళిన ప్రతి చోటా ఏదో ఒక బహుమతి పొందారు అక్కా ,తమ్ముడూ .బంగారు నాణాలు గడియారాలు ,వెండి పొడుం డబ్బాలు అనేకం కానుకలుగా వచ్చాయి .మంచి విలువైన దుస్తులను బాల మేధావి ఒళ్ఫాంగ్ కు
లభించాయి చిన్న ఖడ్గం కూడా కానుక గా లభించింది .కోతులను ఆడించి నట్లు ఈ పిల్లల్లిద్దర్నీ ఆడించి తండ్రి సొమ్ము చేసుకొన్నాడు .లండన్ లో ఉండగా మొజార్ట్ కు” జోహాన్ క్రిస్టియన్ బాచ్” అనే గొప్ప సంగీత కారుని తో పరిచయం కలిగింది .ఆయన అప్పటికే లండన్ లో గొప్ప పొందిన సంగీత వేత్త .
యువ కిశోరం
తొమ్మిది నెలలు ఇంటి వద్ద గడిపి తండ్రి మళ్ళీ యాత్ర చేబట్టాడు .వియన్నా కు ఒక పెళ్ళికి వెళ్లగా అక్కడ మసూచికం బాగా ప్రబలి ఉండటం గమనించి ఇంటికి తిరిగి వచ్చారు .యువకుడైనప్పటి నుండి ఒంటరి తనం తో బాధ పడే వాడు .కొమ్ములు తిరిగిన సంగీత కారుల తో సమానం గా వాయిద్యాలు వాయించే వాడు .ఇప్పుడు దృష్టి అంతా కపోసింగ్ మీద కు మరలింది .ఆ నాటి ప్రసిద్దు లైన సంగీత కారుల పోకడలను అనుకరించి సంగీతం కూర్చే వాడు .తరువాత తన స్వంత బాణీ ని ఏర్పరచుకొని ,విభిన్న కళా కారుడైనాడు .పన్నెండేళ్ళ వయసు లో ద్రుష్టి ”ఒపేరా ”మీదకు వెళ్ళింది .ఒపేరా అంటే అందులోని పాత్రలన్నీ లేక కొన్ని తమ మాటలను పాటల రూపం లో సంగీతం గా విని పించే ఒక ప్రక్రియ .ఇదే నేటి మోడరన్ మ్యూజికల్స్ .అందులో భావావేశాలు
నాటకీయత సమ్మిలిత మై అందర్నీ ఆకర్షిస్తాయి మోజార్టు కాలం లో అది ఉత్కృష్ట స్తితి లో ఉండేది .అతను చాలా ఒపేరా లను చూసి అందులోని లోతు పాతుల్ని అధ్యయనం చేశాడు .అతనికి ప్లస్ పాయింటు అతని స్వరం .మంచి స్థాయి లో పాడే నైపుణ్యం ఆయనది .నోట్ ను వినాల్సిన అవసరం లేకుండా నె పాడగలిగే వాడు .
” the pretend simple ton” అనే ఒపేరా ను 1768 లో వియన్నా లో ఉండగానే రాశాడు .అందరు విని ఆశ్చర్య పోయారు .అసూయ తో కొందరు దాని ప్రదర్శన ను ఒక ఏడాది వాయిదా వేయించారు .ఫ్రాంజ్ అంతాన్ అనే అతను తన కోసం ఒక ఒపేరా రాయించు కొన్నాడు .దాన్ని1768 అక్టోబర్ ఒకటి న మేస్మేర్ ధియేటర్ లో ప్రదర్శించారు .అప్పటికే ఒక హీరో స్తాయి అందుకొన్నాడు మొజార్ట్ .అతని ప్రతిభ కు Amadeus అనే బిరుదు వచ్చింది అంటే ”భగవంతునికిష్టమైన వాడు ”అని అర్ధం .నాల్గవ పోపు క్లిమేంట్ – knight of the golden spur ”అనే అరుదైన పురస్కారాన్ని ప్రదానం చేసి గౌర వించాడు .అంత చిన్న వయసు లో అంతటి గౌరవాన్ని పొందిన వారెవరూ లేరు .bologna అనే ఇటాలియన్ టౌన్ లో అతన్ని పరీక్ష కు పెట్టారు .ఒక గదిలో ఒంటరి గా ఉంచి అతి కష్ట మైన స్వర సమ్మేళనాన్ని చేయమని సవాలు విసిరారు .ఈ పరీక్ష ఇరవై ఏళ్ళు నిండిన వారికే పెట్టటం ఆచారం .కాని ఈ బాల మేధావి 14 ఏళ్లకే పరీక్షలో పాల్గొన్నాడు .ఒక గంట లో తనకిచ్చిన దాన్ని పూర్తీ చేసి ,సరదా గా
బయటికి వచ్చేశాడు .అతను పరీక్ష పాస్ అయాడు .తండ్రి ,కొడుకుల ఉద్యోగాలు పోవటం తో మళ్ళీ స్వంత ఊరు చేరారు .ఏమైనా వియన్నా లో గౌరవం సాధించాలి అని మొజార్ట్ మనసు లో స్తిరం గా భావించాడు .
సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,548 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

