బీథోవెన్ నాటికి యూరప్ పరిస్థితులు
జెర్మని, ఆస్ట్రియా దేశాలు సంగీతానికి ప్రసిద్ధి చెందితే ,ఫ్రాన్సు ఇటలీలు చిత్ర లేఖనానికి ,శిల్ప కళకు ప్రాచుర్యం పొందాయి .ఇంగ్లాండు దేశం సాహిత్యం లో అద్వితీయం గా ఉంది .haydn ,mozart ,beethoven లు ప్రపంచ ప్రసిద్ధి సాధించిన కంపోసర్లు .వీరి లో వరుసగా ,ఒకరి తర్వాత ఇంకొకరరు ,50 ఏళ్ళ కాల దూరం లో జన్మించారు .అందరు ఆస్త్రియా లోని వియన్నా నగరం చుట్త్తు ప్రక్కల ఉండే జీవించారు ,సాధించారు ,పేరెన్నిక గన్నారు .అయితే వారి జీవితాలు ,విధానాలు విభిన్నాలే .ఆ కాలం లో జరుగు తున్న సామాజిక మార్పు లకు వారు ముగ్గురు ప్రతి నిధులై వ్యవహరించారు .ఈ ముగ్గురు సంగీత విద్వాంసు లు ,18 వ శతాబ్దం గడిచి 19 వ శతాబ్దం ప్రవేశించిన తరుణం లో ఉండటం విశేషం .
ఈ ముగ్గురు విద్వాంసులలో ”హేడన్ ”ఎక్కువ కాలం జీవించాడు .వీరిలో పెద్ద వాడు ,ముందు కాలం వాడు .హాయిగా జీవించాడు .పాత రాజ్యా లకు చెందిన పోషకులు ఉన్న కాలం లో ఉన్నాడు కనుక జీవనానికి ఇబ్బంది పడ లేదు .prince Ester hazy కాలం లో ఆస్థాన సంగీత విద్వాంసుడి హోదా లో ఉన్నాడు .గౌరవ సేవకుడు- ఒక రకం గా చెప్పా లంటే .రాజు గారికి ఇష్ట మైన వే పాడాలి ,రాయాలి ,వాయించాలి .ఆది యే రాజు కొలువు లో నైనా సాధారణమే .అయితే ప్రిన్స్ ఈయనకు ఎక్కువ స్వేచ్చ నే ఇచ్చాడు .అంతే గాక యువ రాజు మంచి అభి రుచి ఉన్న పోషకుడు .అలాంటి వాడి కొలువు లో ఉండటం హేడన్ అదృష్టం ..రాజ వంశీకుల అభి నందనాలు పుష్కలం గా అందుకొన్నాడు .స్తిర మైన ఉద్యోగం తో సంతృప్తి కర జీవితాన్ని గడిపిన అదృష్ట వంతుడు హేడన్ .
మొజార్ట్ అనే విద్వాంసుడు హేడన్ కన్నా24 ఏళ్ళ చిన్న వాడు .హేడెన్ లా నే జీవించాడు దాదాపు .arch bishap of salz burg కొలువు లో ఉన్నాడు .ఆయన పెట్టె నిబంధనలు వ్యతి రికి .స్వేచ్చ కావాలని కోరాడు .సర్వ స్వతంత్రం గా స్వేచ్చగా జీవించాడు .”ఫ్రీలాన్స్ సంగీత కారుడు ”అని పించుకొన్నాడు .బాల మేధావి గా విపరీత మైన క్రేజ్ పొందాడు ఆరేల్లకే సంగీత దిగ్గజాలను వణి కించాడు .స్వర కల్పనా చేశాడు .వియన్నా కు మకుటం లేని మహా విద్వామ్సుడైనాడు .బీథోవెన్ ఈయన దగ్గర రెండు వారాలు శిష్యరికం చేశాడు కూడా .చిన్న తనం లో ఉన్న కీర్తి, డబ్బు క్రమంగా వయసు వచ్చే సరికి తగ్గి పోయాయి .ఒక రకం గా గర్విష్టి అని
పించుకొన్నాడు విశిష్ట లక్షణాలున్న వారికి మన వాళ్ళందరూ తగిలించే తోక అదే .1780 కాలం లో ఆస్ట్రియా సమాజం లో డబ్బు అంతా అరిస్తోక్రాట్ ల చేతుల్లోనే ఉండేది .వాళ్ళ దయా ధర్మమే కళా కారులకు శ్రీ రామ రక్ష.సామాన్య ప్రజా డబ్బుల్లేక విల విల లాడి పోయే వారు .మేధావి అని గొప్ప పేరు తెచ్చుకొన్నా, మొజార్ట్ ఆర్హిక ఇబ్బందులకు గురి అయాడు .మిగిలిన సంగీత కారుల అసూయ కు బలి కూడా అయాడు” by his own refusal to play the part of the humble cringing courtier ” అని ఆయన్ను గురించి చరిత్ర కారులు రాశారు .ఎంతటి సంపన్నుడి నైనా, ఎదిరించే తత్త్వం ఆయనది .
లుడ్విగ్ వాన్ బీథోవెన్ యువకుడు అయిన తర్వాత1790 లో పరిస్తితులు విపరీతం గా,వేగం గా మారి పోయాయి .1770లో ఆయన పుట్టి నప్పుడు ,ఫ్రాన్సు దేశ రాజు వారసుడు ,15ఏళ్ళ dauphin louis అయాడు .ఆస్స్త్రియా సామ్రాజ్ఞి కుమార్తె 13ఏళ్ళ ”మేరీ ఆన్తనేట్ ”తో అతని వివాహం జరిగింది .యూరప్ లోని రెండు బలీయ మైన రాదేశాలరాజ వంశాల మధ్య వివాహం .అందరికి గొప్ప ఆనందం కల్గించింది .వివాహ వేడుకలు ,విందులు ,వినోదాలుసంబరాలతో అంబరాన్ని అంటింది సంతోషం .సామాన్యులు కూడా తమ ఇంట్లోనే ఆ పెళ్లి జరిగి నంత సంబర పడ్డారు .23ఏళ్ళ తర్వాతయూరప్ లో ఈ పరిస్తితి అంతా మారి పోయింది విప్లవ యుగం ప్రారంభ మైంది .మధ్య తరగతి ప్రజలు, కూలీ జనం రాజు ను ఏది రించారు .మొదట రాజు ,ఆ తర్వాతారాణి ఫ్రాన్సు విప్లవం లోguillotine కు బలిఅయి చని పోయారు .ఆ తర్వాతా విప్లవం కూడా అదుపు తప్పింది .టెర్రర్ కొంత కాలం రాజ్య మేలింది .వేలాది సామాన్యుల,అరిస్తోక్రాట్ ల తలలు గుల్లషీన్ మెషీన్ కు బలి అయాయి .ఇది సహించని ఆస్ట్రియా దేశం ఫ్రాన్సు పై యుద్ధం ప్రకటించింది . 
ఈగందర గోళం లో ఫ్రెంచి సేనాని నెపోలియన్ బోన పార్టే ఒక కొత్త సమాజ నిర్మాణానికి పూ ను కొన్నాడు .సమాన అవకాశాలను ప్రజ లందరికి కల్పించాడు .తర్వాతఅతని అత్యాశ కొంప ముంచింది .ఆ తర్వాతా ఇరవై ఏళ్ళ కు యూరప్ అంతా యుద్ధాల్లో మునిగి తేలింది .నెపోలియన్ కు ప్రపంచ విజేత కావాలనే దురాశ పెరిగింది .1815లో వాటర్లూ లో wellington అనే సేనాని ఓడించి మళ్ళీ స్వేచ్చా వాయువులు పీల్చే టట్లు చేశాడు .liberty ,equality ,freternity అనేది దివ్య మంత్రం అయింది .ప్రపంచం అంతా ఈ భావాలు వ్యాపించాయి .కొత్త శతాబ్దం లో సమూల మైన మార్పులు రావాలని ప్రజలందరూ ఆశించారు .tom paine రాసిన declaration -the right of man ( manifesto of the french revolution )పుస్తకం గొప్ప ప్రభావాన్ని కలిగించింది .johann wolfong von gothe అనే జర్మన్ దార్శనికుడు రచయిత,కవి ”the sorrows of the young werther ”నవల గొప్ప ప్రభావం చూపించింది .ఇందులో ఒక యువకుడు సున్నిత మనస్కుడు ,ఒక వివాహిత యువతీ పై వ్యామోహం పెంచుకొన్నాడు .ఆ తర్వాత ఆది భావ్యం కాదు అని భావించి ,ఆత్మ హత్య చేసు కొంటాడు .ఇవాల్టి సమాజం లో ఆది విడ్డూరం గా నే అని పిస్తుంది .1700లో దాని ప్రభావం విప రీతం .ఆ కాలం లో యువకులు ”werther ” డ్రెస్ ను ధరించే వారు .ఆడ వాళ్ళు ఆ నాటకం చూసి ఎడ్చేసే వాళ్ళు .అప్పటి నుంచి ఆత్మా హత్య ఒక ఫాషన్ అయింది .ఆ కధ పై ఒపెరాలు ,నాటకాలు ,కవితలు విప రీతంగా వచ్చాయి .గోతె గారి ఈ రచన తోనే” romantic age ”ప్రారంభమైంది .అప్పటి నుంచే వ్యక్తీ భావాలు ,ఆలోచనలు ఫీలింగ్సూ ,అతని సాంఘిక స్తాయి కంటే ,విలువైనవి గా భావించటం జరిగింది .ఇవి బీథోవెన్జీవితం , లో ,అతని సంగీతం లో ప్రతిధ్వ నించాయి ”.werther” గోథేగారి మొదటి నవల .బీథోవెన్ కు గోథే ఆరాధనీయుడైనాడు .1823లో ఒక ఉత్తరం రాస్తూ ,గోథే పై ప్రేమ ,గౌరవం ఆరాధనలను వర్షించాడు, బీథోవెన్ సంగీత విద్వాంసుడు .
బీథోవెన్ పుట్టుక నాటికి ప్రపంచం ఏమీ పెద్ద గా మారలేదు .ఆ వందేళ్ళ లో జీవన స్తితులు అంతే అధ్వాన్నం గా ఉన్నాయి .అప్పటికీ గుర్రమే ప్రయాణ సాధనం .56ఏళ్ళ తర్వాతా రాజకీయ ,ఆర్ధిక ,సామాజిక ,పారిశ్రామిక మార్పులు అతి వేగం గా విప రీతం గా చోటు చేసుకొన్నాయి .ప్రజల జీవితాలలో వెలుగు చోటు చేసుకొన్నది .అసమర్ధ రాజుల అధికారాలకు మంగళం పాడారు .కొవ్వొత్తుల స్తానం లో గాస్ దీపాలు వచ్చాయి .కొత్త రిపబ్లిక్కులు ఏర్పడ్డాయి .విద్యుత్తు వచ్చింది .స్టీం బండ్లు వచ్చాయి .అట్లాంటిక్ సముద్రం లో మొదటి స్టీం షిప్ ప్రయాణించింది .హేడెన్ ,మోజార్టు ల కు రాజ కీయా లపై మోజు లేదు .కాని బీథోవెన్ కు రాజ కీయాలు ఇష్టం .వ్యక్తీ స్వాతంత్రం కోసం పోరాడాడు .ఉన్న వ్యవస్థ లోనే జీవించాడు .విప్లవ యుగం లో గడిపిన అనుభవం ఆయనది .అందుకే బీథోవెన్ సంగీతం లో ఆ నాటి passion,పోరాటం ,కస్టాలు ,ఎదురు సవాళ్లు కన్పిస్తాయి ..విన్పిస్తాయి .భౌతిక ఆధ్యాత్మిక ,దాహం ,తృప్తి ,అతని సంగీతం లో ప్రతిధ్వనిస్తుంది .బీథోవెన్ ది ”quest for personal and spiritual fulfilment ”.జర్మనిసంగీతానికి కి చెందిన ముగ్గురు ”బిగ్ బి ”లు ఉన్నారు .వారే–johan sebastian bach( 1665-1750 ),johannes brahms (1833-1897 ),ludwig van beethoven (1770 -1827 ) ఈ ముగ్గు రిని” జర్మని సంగీత త్రయం ”అని గౌర వంగా పిలుద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,615 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

