జన వేమన –8
వేమన సార్వ కాలీనత
దేశ ,కాలాలకు అతీతం గా చెప్పేది సార్వ కాలీనం అంటారు ..సత్యం ఒక్కటే నని నమ్మి ,దాని సర్వ వ్యాప్తిత్వాన్ని ఆవిష్క రించారు వేదాంతులు ,దాన్తులు ,దార్శనికులు .”బహుజన హితాయ ,బహుజన సుఖాయ ”అన్నదే వారి ధ్యేయం .”తత్వమసి ”అన్నది చాన్దోగ్యోప నిషత్ సారాంశం .”తత్ అంటే ఆది అని ,త్వం అంటే నీవు అని అసి అంటే అయి ఉన్నావు .అని దాని అర్ధం .అంటే ,అంతా ఒక్కటే ,పరబ్రహ్మ స్వరూపమే .అందులో ఆత్మ జ్ఞానం ,ప్రపంచ జ్ఞానం ,బ్రహ్మ జ్ఞానం కలిసి ఉన్నాయని శ్రీ అరవిందులు వివరించారు .బ్రహ్మం , ,ప్రపంచం ,నువ్వు ఒక్కటే అని భావం ..”సో కామయత ఎకోహం ,బహుస్యాం ప్రజాఎతి ”న్న ఉపనిషత్ వాక్యం కూడా విశిష్టతను సంత రించు కొన్నది .భగవంతుడు తాను అనేకం గా మారి ,ఆనందిస్తాను అన్నాడని అర్ధం .మన లోని పర బ్రహ్మ పదార్ధం ,,బయటకు వచ్చి ప్రకటించ బడి నప్పుడే ,భగ వంతుడు తాను ,అనేకం గా మారి ,అందించాలి అనే సంకల్పం నేర వేరుతుంది .అంటే ,బ్రహ్మ గా మారే ప్రయాణం లో ,ఉన్న మాన వుడివి .మానవుడిగా కనీ పించే బ్రహ్మ వే నువ్వు .కనుక భగ వంతుడిని జీవితం లో అభి వ్యక్తం కానివ్వటమే ,మానవ జీవిత పర మార్ధం అని శ్రీ అరవిందుల అభి భాషణం .ఈ భావన ఏర్పడితే ద్వంద్వం అనేది లేదు .అంతా భగవదంశ లానే కనీ పిస్తుంది .మనం బ్రతి కేది అందరి వికాసానికి అన్న స్పృహ చాలా అవసరం .మనం పడే వేదన ,బాధ ,కష్టం ,కన్నీళ్లు అన్నీ ,రాబోయే మహా మాన వుడిని ప్రాస విన్చె దిశ గా పుడమి తల్లి పడుతున్న ప్రసవ వేదనలే అని తెలిస్తే ,బ్రతుకు ,ఆనందం గా ,హాయిగా సాగి పోతుంది అని శ్రీ అరవిందుల తత్వ రహస్యం .
”విశ్వాన్ని గురించో ,దాని ఆధారం గురించో ,తనను గురించో ,ప్రత్యక్ష ,అనుమానా లపై కాకుండా ,చింతన చేస్తే ,ఆది ఫలించి ,మంచి భావన తో ఆవిష్కరింప బడిన దానినే ”దర్శనం ”అంటారు .చింతన చేసిన వారు దార్శనికులు .అనుభూతి ,నిరంతర మననం ,విశ్లేషణ ,ద్వారా శ్రద్ధ ను నిర్మిస్తే ,ఆ దర్శనం పరి పూర్ణం .”దృశ్యతే అనేన ఇతి దర్శనం ”అంటే -దేని వల్ల చూడ బడుతుందో ,ఆది దర్శనం .దేన్నీ చూడాలి ?సత్యాన్ని.అడ్డంకులను ,పరిమితులను అదిగ మించి ,వివిధ అనుభవాల ,శాస్త్రాల సంస్కృతుల ,సిద్ధాంతాల మధ్య సంబంధాలను స్థాపించి ,విశ్వ దృష్టి ని కల్పించటం దర్శనం కోరే మహాదాశయం .ఈ విశ్వ దృష్టి తో చెప్పిన ప్రతి మాటా ,మాన వాళి కి శిరో దార్యమే .వివిధ వాదాలు ,శాస్త్రాలు ఆధారంగా సత్యాన్వేషణ జరుగు తుంది .అతీంద్రియ దృష్టి ,రుశిత్వం తపస్స్వాధ్యాయణం ఉన్న మహాను భావులకు ఇవన్నీ ,మనో ఫలకం పై ఆవిష్క్ర్రం జరుగు తాయి .వాటిని మాన వాళి అభ్యుదయానికి తేలిక మాట లతో హృదయానికి గాదం గా హత్తు కోనేట్లు చేస్తారు యోగులు ,మనీషులు .అలాంటి దార్శనిక దృష్టి ఉన్న వేమన్న చెప్పిన మహా వాక్యా లను ఇప్పుడు మననం చేద్దాం .వాటి సార్వ కాలీనత్వానికి ముచ్చట పడుదాం . ఆయన సాధించిన ఆత్మా పరి నతి కి నివాళులర్పిద్దాం ..నిజం తెలుసు కొందాం .ఆ ”ఎరుక ”తెలిస్తే ,అంతా ఆనందో బ్రహ్మ ”మే .
”అజ్ఞానం శూద్రత్వం సుజ్ఞానం బ్రహ్మం ”అని శ్రుతి చెప్పిందన్నారు .దీనిని వేమన ”ఇంద్రియ జయుడే ఉత్తముడు .తన గుణాన్ని తెలుసు కో కుండా ,ఇతరుల గుణాలనుఎంచే వాడు భ్రష్టుడు .”జీవ భావ మెరుగ జేడ డేన్నటికి మది -దైవము నేరుగా ,దనరు బుద్ధి –తేజము దయ యందు దిమిరంబు నిలవదు ”జ్ఞానం కలిగితే అజ్ఞానమనే చీకటి నిలవదు .జ్ఞానం ,సత్యం తెలిస్తే ద్విజుడు అవుతాడు ”నిశ్చ లాత్మ యున్న నిర్వి కారంబున –ముక్తి యండ్రు దాని మొగిని వేమ ”అంటే -నిశ్చల మైన అంతఃకరణ ఉంటె అదే ముక్తి .”ఇంద్రియాలను రోసి ,ఈశ్వరుణ్ణి చూడు ”అన్నాడు .బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తే ఏమీ లాభం లేదు .”తనువు గుడి గ జేసి తనను నిలిపి –లోక బుద్ధి విడిచి ,లో జూపు జూడరా ”అని చింత అనే అనేది హృదయ గతం కావాలి అని చక్కగా చెప్పాడు .శాస్త్రాలతో సంశయం తీరదు .స్వా ను భూతి తోనే సాధించ గలం .కోపం ,రోషం ఆవేశ ,కావేశాలు సంతోషాన్నివ్వవు .ధర్మ రాజు విజయ రహస్యం శాంతం .సకల కార్యాలు శాంతం వల్లనే సాధ్యం .సంతోషం కలిగితే సత్యమేవ జయతే .అవుతుంది .అభిరుచులు వేరే అయినా ,సారం ఒకటే .సత్యాన్వేషణ మార్గాలు వేరే అయినా సత్యం ఒక్కటే .”పరమ పురుషులు వేరు బావ్యు డోక్కండురా ”అని సత్య దర్శనం చేయించాడు వేమన యోగి .ప్రకృతి ని తెలుసు కోవాలి .ఆది తెలియక పోతే భక్తీ కానే కాదు .భగ వంతుడిని చూడాలి అంటే ”చూచు కనులు వేరు ,చూపు వేరు –చూపు లోన మరచి చూడు ”అన్నాడు .అప్పుడే దర్శనం అనేది సాధ్యం అవుతుంది .ఎంత విద్య నేర్చినా ,తన తో పాటే మట్టి లో కలిసి పోతాయి .”దేవుడు ఆత్మ లోన నుండు ననగి ,పెనగి –”దాన్ని దర్శించాలి .సర్వానికి ధర్మమే మూలం .”ధర్మమే నృపులకు తారక యోగంబు ”అని సార్వ కాలీన సత్యాలను ఏకరువు పెట్టాడు .
మిగిలిన సార్వకాలీన సత్యాలను తర్వాత తెలిసి కొందాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,458 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

