అమెరికా ఊసులు –21
హ్యూమర్ కు ఫీల్డు -w.c. ఫీల్డు
అమెరికా లో హాలీ వుడ్ సినిమా ల లో హాస్య నటుడి గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న నటుడు w.c.ఫీల్డు .బాగా డ్రింకింగ్ అల వాటున్న వాడు గా కూడా ప్రఖ్యాతుడు .తాను ఎంత తాగాడో లెక్కలు కూడా చెప్పాడు .1938నాటికి ఆయన తాను 1,85 ,000డాలర్ల ఖరీదు చేసే విస్కీ తాగానని లెక్క చెప్పాడు .అదీ నలభై రెండేళ్ళ కాలం లో .తన మీడే తాను జోకులేసుకొనే చమత్కారి ఫీల్డు .తన మూత్ర పిండాల కండ రాల మీద ripples ఏర్పడినా తాను 125ఏళ్లపది హేను రోజులు గ్యారంటీ గా బతుకు తానని జోకేశాడు .ఆయన 1880 లో పుట్టి అరవై ఆరేళ్ళు మాత్రమె జీవించి 1946 లో అంటే ఆయన వేసుకున్న లెక్క లో సగం కాలమే జీవించి చని పోయాడు .తాను అప్పటికే సరైన మార్గం లో నుంచి దూరమై పోయానన్నాడు .ఆయన్ను” ఆల్కహాలిక్ జీనియస్ ”అనే వారట .
తాను తాను ఇష్ట పడనీ మనిషి నేవర్నీ అంత వరకు కలుసు కో లేదన్నాడు .తాను అసహ్యించుకోని,కుక్కను కానీ బేబీ ని కానీ కలుసు కో లేదని వ్యంగ్యం గా అంటాడు .అతను ఆడ వాళ్ళ గురించి ”women are like elephants .i like to look at them .but i do not want to own one.”అని తన అభిప్రాయాన్ని తెలియ జేస్తాడు .నేత్రా నందమే కాని కాపురం చేసే ఆలోచన లేదంటాడు .అతని దృష్టిలో ”sleep is the most beautiful experience in life except drink ”అని తన నిశ్చితాభి ప్రాయాన్ని విప్పి చెప్పాడు .ఆయన్ను మాస్టర్ ఆఫ్ కామెడీ అని మాస్టర్ ఆఫ్ స్పీచ్ అని తెలిసిన వాళ్ళు అంటారు .ఆయన భాషను చక్క గా మార్చుకొని హాస్యం పుట్టించేట్లు చేయ గల నేర్పున్న వాడంటారు .అతని కొన్ని మాటలు ఆయన మాటల్లోనే వింటే ,అందులోని స్వారస్యం తెలుస్తుంది ”No suggestive move ments in scenes with Indian .No exposure in the bath tub ”అనేది అందులో ఒకటి .
ఫీల్డు కు కార్లు అంటే పిచ్చ పిచ్చి .ఆయన కారు లో ప్రత్యేకం గా తాగ టానికి ఒక ”బార్ ”ఉండేదట .అలా ఉండటం ఒక రక మైన నాగర కత న్నాడు ”it is one sign of civilization is worth having ”అని గర్వం గా చెప్పు కొనే వాడు .ఒక సారి ఆయన ”బారున్న కారు లో వెళ్తూ ఫుల్ గా డోసులాగిస్తూ ఉన్నాడు .ట్రాఫిక్ లో కారు ఆగింది .పోలీస్ వచ్చాడు .’you are double parked ”’ అన్నాడు .అప్పుడు ఫీల్డు తొణక్కుండా బెనక్కుండా ”No ,we are sitting at the cross roads between Art and nature trying to figure out where Delirium Tremens leaves off and Holly wood begins ”అని మాటలతో బురిడీ కొట్టించాడు .పోలీసు ”ఓ.కే.ఫీల్డ్స్ ”అని నమ్మి పంపించాడట.
ఫీల్డు ఎప్పుడూ స్వంత ఇంటిని కొనుక్కో లేదు .అద్దె ఇంటి లోనే కాపురం ఉండే వాడు .ఇంటి యజమాను లంటే ద్వేషం .వాళ్ళను ఎలెక్ట్రిక్ చైర్స్ లో పెట్టాలనే వాడు .ఆయన హాలీ వుడ్లో గ్రిఫిల్ పార్కు దగ్గర ఒక ఇల్లు అద్దె కు తీసుకొని ఉండే వాడు .ఆది అయిదు బెడ్ రూముల ఇల్లు .భార్య దగ్గర లేదు .పడ కొండు బాత్ రూములున్దేవట .ఒక లైబ్రరీ రూం ,రికార్డింగ్ స్టుడియో ,గ్లాస్ ఎలి వెటర్ ,ఫుల్ ఫ్లోర్ బార్ ,టెన్నిస్ కోర్టు ,అబ్జేర్వేషన్ డేక్ ,ఉండేవి పని వాళ్ళ అపార్ట్ మెంట్ వేరే .నేలకు అద్దె ఆరోజుల్లో రెండు వందల యాభై డాలర్లు .అద్దె పెంచమని వొనర్ గోల చేసినా పెంచే వాడు కాదట .ఆది కూలి పోతున్నా అందులోనే ఉన్నాడు .పైగా వ్యాయామానికి ఇంకో గడి ,ర్యింగ్ మెషీన్ కూడా పెట్టు కున్నాడట . ,
ఫీల్డు గారికి చక్రాల మీద నడిచే అతి పెద్ద ఫ్రిజ్ ఉండేదట .దానికి ఆంజనేయుడి తోకంత అతి పెద్ద అంతు లేని ఎలెక్ట్రిక్ వైర ఉండే డేటా .యే రూములో తాగ తాని కైనా ఫ్రిజ్ ను వాడుకోవటానికి ఆయన చేసుకొన్నా ఏర్పాటిది .మామూలు కుర్చీల తో పాటు ”బార్బర్ చైర్ ”ప్రత్యేకం గా ఉండేది .ఇది వెన్ను నొప్పి పోగొట్టు కోవా టానికి వాడే వాదట .అన్ని గడులకూ తాళాలు జాగ్రత్తలు చేసుకొనే వాడు .నౌకర్ల తో ఎప్పుడూ గోడవలె తగా దాలేట .దాన్ని సరదా గా” a capital versus labour ” అని చూసిన వాళ్ళు నవ్వు కొనే వారట .ఎప్పుడూ విస్కీ ఫుల్ గా తాగినా ఎప్పుడు దానికి లొంగి పోలేదు . (never got drunk ‘).ఒక నైట్ వాచ్ మాన్ ను రాత్రి తెల్లార్లు తన తోపాటు తాగటానికి డబ్బు ఇచ్చి పెట్టు కొనే వాడు. కంపానియన్ అన్న మాట .
ఆయనను ”do you like children “‘ ? అని ఒక విలేకరి ప్రశ్నిస్తే ” i do, if they are properly cooked ” ”అని చిలిపి సమాధానం చెప్పాడు .అతని చివరి సినిమా1945 వచ్చింది .అతనికి ” ఆర్డర్ ”గా ఉండటం అంటే ఇష్టం .అతను U.S marshal గానూ ,a Los angel’s county Sheriff గా కూడా పని చేశా డంటే ఎంత ఆర్డర్లీ గా ఉండే వాడో చూడండి .అయితే ఈ ఆర్డర్ అంతా అతను చని పోయితర్వాత అంత్య క్రియల రోజు 2-1-1947నాడు తారు మారై అస్తవ్యస్తం (కేయాస్ )గా మారిందట .ఆయన చని పోయే టప్పటికి ఆయన దగ్గర నిలువ ఉన్న కాష్ 7,71,428డాలర్లట .ఒక drinker ఇంత డబ్బు దాచుకో వటం చరిత్రే .ఇవి గాక బాంకి డిపాజిట్లు, ఆస్తులు వేరుగా ఉన్నాయి .కొందరు స్త్రీలు వచ్చి ఫీల్డు తమను పెళ్లి చేసుకొన్నాడని నమ్మ బలికి, కొందరు అబ్బాయిలు ఫీల్డు తమ కన్న తండ్రి అని చెప్పీ, డబ్బు నోక్కేశారట .అసలు భార్యHattie fields న్యాయ పోరాటం ఏడేళ్ళు చేసి మిగిలిన దాన్ని ఆమె 75వ ఏట దక్కించు కొందట .ఆయన గురించి చాలా గొప్ప గా ”Field did not belong to this world .but he arrived from some other easier planet ”అని పొగడటం అత్యంత సముచితం గా ఉంది .ఆయనకు చాలా ఇష్టమైన వాక్యం ఒకటి ఉంది .దాన్ని ఆయన ఎప్పుడూ ఉపయోగిస్తాడు అదే ”Never give a succer an even break .”దీన్నే అతను బ్రేకింగ్ పాయింట్ గా జీవితాంతం పాటించాడు అని విమర్శకుల భావన .
వినాయక చవితి శుభా కాంక్షలతో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,467 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

