అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్—3(చివరి భాగం )
డాడ్జి సిటీ లో ఫ్రీ లంచ్ ఇచ్చే సెలూన్లు చాలా ఉండేవి .రోజంతా స్నాక్స్ ఇస్తూనే ఉండే వారు .చచ్చిన పశువు లను తొలగించటం ,ఊర కుక్కల్ని పట్టు కోవటం ,నడక కోసం చెక్క రోడ్ల మరమ్మతు ,లను విట్ చేబట్టాడు .వింటర్ లో ఇక్కడ పని లేక పోతే ,’’డెడ్ వుడ్’’టౌన్ కు వెళ్ళే వాడు .అప్పడు అది డకోటా సరి హద్దు లో ఉండేది .గోల్డ్ రష్ బాగా ఎక్కువ .టెక్సాస్ కు వెళ్లి జూదం ఆడే వాడు .ఇలా అప్పుడప్పుడు ‘’జంప్ జిలానీ ‘’గా ఉన్నా అతనంటే డాడ్జి వాసులకు దేవుడే .మల్లీఉద్యోగం ఇచ్చారు .అక్కడే ‘’డాక్ హాలి డే’’ అనే పేకాట రాయుడి తో పరిచయమేర్పడింది .ఒక కౌ బాయ్ తుపాకీ తో ఎర్ప్ వీపు మీద పేల్చ బోతే డాక్ కాపాడాడు .
అక్కడి నుంచి న్యు మెక్సికో సరి హద్దు చేరాడు .అక్కడి సిల్వర్ గనులు తవ్వకం చే బట్టాడు సోదరుడు వర్జిల్ తో కలిసి మైనింగ్ కోసం పది హేను గుర్రాలను కొన్నాడు .ఇద్దరూ ‘’లాస్ వెగాస్ ‘’చేరారు .అక్కడి నుంచి అరిజోనా ,చేరి సిల్వర్ మైన్ల ను గుర్తించారు .దీన్నే ‘’టూమ్బ్ స్టోన్’’అంటారు .సిల్వర్ ఉండటం వల్ల ఆపెరోచ్చింది .సోదరుడు వర్జిల్ డిప్యూటి మార్షల్ అయాడు .ఇది బాగా ఉందని పించింది .ఈ పట్టణం 4,500అడుగుల ఎత్తున ఉన్న పట్టణం .బాగా కష్టపడాలి జీవితం కూడా చాలా కష్టం గా ఉండేది .ఇది గన్ ఫైట్ల కు ప్రసిద్ధి .ఇక్కడి ‘’సిమేటరి ‘’అమెరికా నైరుతి భాగం లోనే చాలా పెద్దది .ఇల్లు అన్నీ బుల్లెట్ల బొక్క లతో కనీ పిస్తాయి .గాంబ్లింగ్ విపరీతం .ఇక్కడి ‘’అపెచీ ఇండియన్లు ‘’దాడి చేస్తూంటారు తరచుగా .పశువుల సంత ఉండి .దొంగలు ,బంది పోట్లు ఎక్కువ .అయినా వేగం గా వృద్ధి చెందింది .వెండి గనుల్లో లాభ పడ టానికి చాలా మంది వస్తూంటారు .ఎర్ప్ ఇక్కడికి చేరే సరికి జనం అంతా టేన్తుల్లోకాపురం .బిల్డింగు లనేవి లేనే లేవు .
చిన్న ఇంట్లో అద్దె కున్నాడు .స్టేజి కోచ్ డ్రైవర్ గా పని చేశాడు .కొంత కాలం తర్వాతా ‘’వేల్స్ ఫార్గో ‘’లో పని చేశాడు .‘’ఇప్పుడు బాంకింగ్ చేస్తోంది . ఫార్గో ‘’లో సెక్యూరిటీ మాన్ గా పని చేశాడు .ఇది డబ్బు ,విలు వైన వస్తువుల్ని చేర వేసే సంస్థ .షాట్ గన్ పెట్టు కొని కోచ్ డ్రైవర్ ప్రక్కన కూర్చోవటమే అతని పని .అతని బంధు గణంఅంతా చేరారు .తాను‘’లామాన్ గా ,వర్జిల్ డిప్యూటీ మార్షల్ గా పని చేశారు .యాభై కిలో మీటర్ల దూరం లో ఫెడరల్ మార్షల్ ఉండే వాడు .త్వరలోనే అన్నదమ్ము లిద్దరూ మంచి పేరు తెచ్చు కొన్నారు .విట్ విధి సక్రమం గా నిర్వ హిస్తాడని ,సాహసి అని గుర్తింపు పొందాడు .పైన కోటు లేకుండా ,చేతి లో ఆయుధం లేకుండా తిరిగే వాడు .ప్రశాంతం గా ,ఉద్రేక పడకుండా ఉండటం అతని లక్షణం .ఒక సారి ‘’మైక్ ఓ రూర్కీ ‘’అనే గామ్బ్లార్ ప్రాణాలను కాపాడాడు .అతను ఒక మైనర్ ను హత్య చేస్తే ,జనం ఇతని పై దాడి చేస్తే ,ఉపాయం గా పట్టు కొన్నాడు .లేక పోతే మాబ్ చేతిలో మరణం పొంది ఉండే వాడు ఆ గామ్బ్లార్ .ప్రజాగ్రహాన్ని శాంత పరచి వీడి ప్రాణాన్ని కాపాడి కేసు పెట్టాడు .ఇతని ధైర్యం చూసి జనం పొంగి పోయారు .’’వీర తాళ్ళు ‘’వేశారు .ఎవరూ ఎర్ప్ ను గాయ పరచక పోవటం ఆశ్చర్యం గా ఉంది .
1880 లో డిప్యూటీ మార్షల్ ను వదిలేశాడు .మైనింగ్ లో వచ్చిన లాభాలను వ్యాపారం లో పెట్టాడు .’’ఓరియంటల్ సెలూన్ ‘’అనే గాంబ్లింగ్ సెంటర్ లో భాగ స్వామి అయాడు .’’ఫారో ‘’అనే కార్డ్ గేమ్ ను పర్య వేక్షించే బాధ్యత తీసుకొన్నాడు .ఒక సారి వెళ్ళకు వ్యతి రికి ఒకడు జాన్ అనే రౌడీ ని ఉసి గొల్పి ,పంపాడు .వాణ్ణి మెడ బట్టు కొని బయటకు తోసి ,ఆట కు ఇబ్బంది లేకుండా చేశాడు .ఆ రోజుల్లో ‘అసాంఘిక కార్య క్రమాలను చేసే వారిని కౌ బాయ్స్ అనే వారు .ఎర్ప్ సోదరులకు ,ఈ ముథాకు తగాదాలు పెరిగాయి .ఒక దొంగతనం కేసు లో చాలా రహస్యం గా ,పకడ్బందీ గా దర్యాప్తు జరిపి అసలు దోషుల్ని పట్టు కొన్నాడు విట్ .
వేరొక సారి ఈ గ్రూపుల మధ్య గన్ ఫైట్ ‘’తీవ్రం గా జరిగింది .ఎర్ప్ సోదరులు కౌ బాయ్స్ ను వెల్లి పోమని ,గొడవలు వద్దని నచ్చ చెప్పినా విన లేదు .చివరికి బాల వంతం గా గెంటేశారు .కేసు నడి చింది .జనం అందరు ఎర్ప్ నే సమర్ధించారు .ఆత్మ రక్షణ కోసమే కాల్చవలసి వచ్చిందని చెప్పాడు .కేసును కొట్టే శారు .
1882 లో అరిజోనా వదిలి కోలా రాడో ,అక్కడి నుంచి కాలిఫోర్నియా ,అలాస్కా లకు చేరాడు .మళ్ళీ సౌత్ వచ్చాడు .ఎర్ప్ జీవితం మీద చాలా పుస్తకాలు వచ్చాయి .అతిని జీవితాన్ని సాహస గాధలను సినిమా గా తీశారు .అతను ‘’నేషనల్ ఫిగర్ ‘’అయాడు .సెలిబ్రిటీ అని పించుకొన్నాడు .’’Wytt Earp –frontier Marshal ‘’,అనే పుస్తకం వచ్చింది .’’horse rustling ‘’,boxing లలో రిఫరీ గా పని చేశాడు .ఎనభై ఏళ్ళు జీవించాడు 1920 .లో కాలి ఫోర్నియా లోని హాలీ వుడ్ లో నివాసం ఉన్నాడు .తన జీవిత చరిత్ర ను రాసుకొన్నాడు .1929 జనవరి 31న ‘’పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఎర్ప్ ‘’మరణించాడు ..అతడు సాహసమే ఊపిరి గా జీవించి అందరి మన్ననలు అందుకొన్నాడు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-10-12—ఉయ్యూరు
