‘’ వైష్ణవ జనతో ‘’భజనకు తెలుగు అనువాదం
నమస్తే గోపాల కృష్ణ గారు -ఉభయ కుశ లోపరి
వైష్ణవ జనతో ‘’అనే గాంధీ గారికిష్ట మైన భక్తీ గీతాన్ని ఎవరైనా తెలుగు లోకి అనువదిన్చారా ?ఆ స్క్రిప్ట్ లభిస్తుందా ,దాన్ని అసలెవరు రాశారు ?’’అని మీరు నాకు మెయిల్ పంపారు. ‘’నా దృష్టికి రాలేదని, తెలిస్తే తెలియ జేస్తానని‘’మీకు వెంటనే మెయిల్రాశాను .అప్పటి నుంచి ఆ అన్వేషణ లోనే ఉన్నాను .నలుగురైదుగురు నిష్ణాతులను సంప్రదించాను .వారి దృష్టికీ రాలేదని చెప్పారు ..ఈ విషయం మా ఆవిడా కు తెలిసి ‘’దాన్ని మీరే ఎందుకు తెలుగు చేయ రాదు ?’’అని ప్రశ్నించింది .వెంటనే అర గంట క్రితం నెట్లో దాని ఇంగ్లీష్ అను వాదం చూసి, నేనే తెలుగు చేసి పంపుతున్నాను ..ఇది ఆ కవి కి పూర్తీ న్యాయం చేశానో లేదో తెలీదు కాని, ప్రయత్నం మాత్రం చేశాను . .
ఈ భజన గీతాన్ని పది హేన వ శతాబ్దపు గుజ రాతీ కవి ‘’నరసింహ మెహతా’’గుజరాతీ భాష లో రచించారు .
తెలుగు సేత
పరుల బాధలను అర్ధం చేసుకొన్నా వాడే పరమేశ్వరు డైన విష్ణువుకు పరమ ఆప్తుడు
ఇతరుల అవసరాలకు సాయ పడే స్త్రీ లేక పురుషుడు ఆ సాయాన్ని గర్వం గా చెప్పుకో రాదు .
ఇలాంటి విష్ణు జనులు విశ్వం లో అందర్నీ గౌరవిస్తారుపర దూషణ చేయరు ,విమర్శించరు .
.అందర్ని సమదృష్టి తో చూస్తారు ..
అతడు కోరికలను విసర్జిస్తాడు .పర స్త్రీలు అతనికి మాత్రు సమానం .వైష్ణవ జనులు అసత్యమాడరు
.పర ధనా పేక్ష లేకుండా జీవిస్తారు ..వారు సంగత్వం ,నిస్సంగత్వాలకు అతీతులు .
నిస్సంగత్వం లోను స్తిర చిత్తం తో వ్యవ హరిస్తారు .అలాంటి వారు నిరంతర భగవధ్యానం లో మునిగి ఉంటారు
.సకల తీర్దాలలో వారు తన్మయులౌతారు . వారికి ఆశా, ,మోసం, వంచన తెలియవు .భోగాన్ని ,కోపాన్ని విసర్జిస్తారు ..
.అలాంటి వ్యక్తియే భగ వంతుని అర్చించ టానికి అర్హుడు .అతడే సకల మానవ జాతి ని ఉద్ద రించగలడు
అని ‘’నరసి’’(నరసింహ మెహతా )అంటాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-11-12—ఉయ్యూరు


నాకు చాలా ఆశ్చర్యంగాను అద్భుతం గాను ఉన్నదండీ!
ఎంచేతనంటే ఈ వైష్ణవ జనతో … గీతాన్ని కొద్ది నెలల క్రితం నెట్ లో చూసి డౌన్లోడ్ చేసి వింటూ భావాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాను
నేను తెలుగు లోకి మార్చితే ఎలా ఉంటు0దా అని అలోచించాను వీడియో చేసి నా ఛానల్ లో అప్లోడ్ చేద్దామని ఊహించాను మొత్తని అమ్మ దయ వాళ్ళ మీరే అనువదించారు చాలా సంతోషం
dhanyavaadamulu
LikeLike