సిద్ధ యోగి పుంగవులు — 29 న్యూక్లియర్ ఫిజిక్స్ యోగి- స్వామి జ్ఞానంద

 సిద్ధ యోగి పుంగవులు — 29        

                                                               న్యూక్లియర్ ఫిజిక్స్ యోగి- స్వామి జ్ఞానంద

  సైన్స్ కు మతానికి పోత్తుకుదరదని చాలా మంది భావన. కాని ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ,జగదీశ్ చంద్ర బోస్ ,స్వామి జ్ఞానానంద వంటి వారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒక దానికొకటి అవసరమని ,అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టం గా చెప్పి ,ఆచరించి మార్గ దర్శనం చేశారు .ఇందులో ముగ్గురు మన వాళ్ళే .అందులో స్వామి మన ఆంధ్రులు ..న్యూక్లియర్ ఫిజిక్స్ లో స్పెక్త్రోస్కోపి మీద విశేష పరిశోధన చేసి దేశ విదేశాలలో దాన్ని బోధించి హిమాలయాలలో తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేద ప్రాశస్త్యాన్ని నేల నాలుగు చేరగులా ఉపన్యాసాలతో వ్యాప్తి చేసిన మహానుభావుడే మన స్వామీ జ్ఞానానంద .

             స్వామి జ్ఞానానంద పశ్చిమ గోదావరి జిల్లా భీమ వరం దగ్గర  గొరగనమూడి (‘’గోరగన పూడి )‘’అగ్రహారం లో 1896 డిసెంబర్ అయిదు న జన్మించారు .వీరి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు .తండ్రి గారు రామ రాజు మహా వేద విజ్ఞానఖని .వేదాలకు ఉపనిషత్తులకు శాస్త్రాలకు సంబంధించిన వందలాది అపూర్వ గ్రంధాలు ,ను ఆయన చదివి గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించుకొన్నారు .మాంచి సంపన్నమైన భూస్వామ్య కుటుంబం వీరిది .ఆ వేద భాండా గారాన్ని కుమారుడు లక్ష్మీ నరసింహ రాజు అద్భుతం గా సద్విని యోగ పరచుకొని వేద వేదాంగాలలో ఉత్తమా భి నివేశాన్ని సంపాదించుకొన్నారు .ఆగ్రంధాలకు సార్ధకత చేకూర్చారు .

             నర్సాపురం లోని టేలర్ హై స్కూల్ లో విద్యాభ్యా సంచేశారు .ఇరవై వ ఏట వివాహం జరిగింది . బుద్ధుని ప్రభావం వారి పైన ఉన్నది అందుకని నేపాల్ లోని లుంబిని కి వెళ్లి కొంతకాలం గడి పారు .తర్వాత పదేళ్లు దేశ సంచారం లో ,పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువు కున్నారు .హిమాలయా పర్వతాలకు చేరి అక్కడ యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్ధక జీవనం సాగించారు .వేదాధ్యయనం వారిని విడువ లేదు .దాని పై ఉన్న మక్కువ తో అన్ని వేదోపనిషత్తుల సారాన్ని జీర్నిన్చుకొన్నారు .మానసిక వికాసం కలిగింది .ఒక అపూర్వ తెజస్సేదో వారిలో విరాజిల్లింది .

                   క్రమం గా వీరి దృష్టి భౌతిక శాస్త్రం వైపుకు మళ్ళింది .దేని మీద దృష్టి పడినా దాన్ని ఆసాంతం కరతలా మలకం చేసుకో కుండా ఉండలేదు .అందుకని జర్మని చేరుకొన్నారు .అక్కడి డ్రెస్ డ్రెయిన్లో గణితం, ఫిజిక్సు చదివారు .ఫిజిక్స్ అంటే వీరాభిమానం కలిగింది .అంతే అప్పుడే విస్తరిస్తున్న ‘’హై టెన్షన్ ఎక్స్ రే  ఫిజిక్స్ ‘’లో రిసెర్చి ప్రారంభించారు .ప్రేగ్ లోని చార్లెస్ యూని వర్సిటి లో వీరు రిసెర్చ్ కొన సాగించారు .వీరి ఆధ్యాత్మిక గురువు వీరిలోని వేద విజ్ఞానికి అబ్బుర పడి ,శిష్యుని  వల్ల వేద విజ్ఞానం ప్రపంచమంతా విస్తరిల్లాలని ఆ కాంక్షించి రాజు గారికి ‘’స్వామి జ్ఞానానంద‘’అనే ఆశ్రమ నామాన్ని ఒసంగి ఆశీర్వ దించారు .అప్పటి నుండి స్వామి కాషాయామ్బర దారిగా జీవించారు .1927 లో మళ్ళీ జర్మనీ దేశం వెళ్లారు స్వామి జ్ఞానానంద .అక్కడ హిందూ మతం మీద వేద విజ్ఞానం మీద పుంఖాను పుం ఖం గా ఉపన్యాసాలిచ్చి చైతన్య వంతుల్ని చేశారు .ఆ ఉపన్యాసం ఒక గంగా ప్రవాహమే .ఎన్నో తెలియ రాని  విషయాలను విజ్ఞానం తో ముడి వేసి అలవోకగా అందిస్తూ శ్రోతల మనసులను రంజింప జేసే వారు .అదొక తపస్సు గా ,యోగం గా వారు భావించి ఉత్తేజితులను చేశారు .ఆ ఉపన్యాస పరంపర ఒక అత్యద్భుత మైన గ్రంధం గా వెలువడింది .డ్రిస్దేయిన్ వర్సిటి ప్రొఫెసర్ స్వామి ఉపన్యాసాలకు పులకించి పోయాడు .అవి మానవాళికి కర దీపికలన్నాడాయన .

         జ్ఞానానంద కు అయిన్ స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం పైన ద్రుష్టిపడింది .పడింది అంటే దాన్ని ఆపోసన పట్టినట్లే1929 లో దానిమీద రెండేళ్లు అధ్యయనం చేస్తూ అండర్ గ్రాడ్యు యేషన్ పూర్తీ  చేశారు .ఆయన సాధించిన యోగా విధానం మీద 150 కి పైగా ప్రసంగాలు చేసి యువతను యోగా మార్గం వైపుకు ఆకర్షితు లయేట్లు చేశారు .యోగ, విజ్ఞాన శాస్త్రాలు సన్నిహిత సంబంధం కలవని ఆయన చెప్పే వారు .యోగా లో బేసిక్స్ నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూర్తీ స్వాధీనం కలుగు తుందని సోదాహరణం గా ఉపన్య సహించే వారు ..స్వామీజీ ఉపన్యాస సారాన్నంతా‘’పూర్ణ సూత్రాలు ‘అనే ఉద్గ్రంధం గా వెలువడి యోగా మార్గానికి కర దీపిక గా నిలిచింది .ఇది వారి మహోత్రుష్టరచన గా ప్రశంశలు అందుకొన్నది .తర్వాత ఆయన ప్రొఫెసర్ డోల్షేక్   గారితో కలిసి జర్మని ,ఫ్రాన్స్ ,జెకోస్లోవేకియా లలో పర్య టించారు .

                 స్వామి జ్ఞానానంద అభిమాన విషయమైన  x ray spectography లో రిసెర్చ్ చేసి 1936 లో D,Scసాధించారు .ఇంగ్లాండ్ ,లివర్ పూల్ వర్సిటీ లలో జాన్ చాడ్విక్ అనే మహా శాస్త్ర వేత్త వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో పని చేశారు .న్యూక్లియర్ ఫిజిక్స్ లో ‘’spectography of beeta rays radiation ‘’లో అద్భుత పరిశోధన చేసిPh.D పొందారు .అమెరికా వెళ్లి అక్కడి మిచిగాన్ యూని వర్సిటి లో ‘’రేడియో యాక్టివ్ ఐసోటోపులు ‘’మీద రిసెర్చ్ చేశారు .ఆయన రాసిన ‘’హై వాక్యూం ‘’అనే శాస్త్ర గ్రంధం మేధావులైన ఎంతో మంది శాస్త్ర వేత్తలను ఆకర్షించింది .

          దాదాపు పాతికేళ్ళు విదేశాలలోనే చదువు ,వేదాంత ప్రవచనాలు ,యోగా ఉపన్యాసాలలు ,తీవ్ర పరిశోధన ల తో గడిపిన స్వామి జ్ఞానానంద 1947 మాతృదేశామైన భారత దేశం వచ్చేశారు .ధిల్లీ లోని నేషనల్ ఫిజిక్స్ లాబరేటరీ లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా తమ అమూల్య మైన సేవలందించారు .ఏడేళ్ళ తర్వాతా స్వామీజీకి భీమ వరం వద్ద ఒక ఆక్సిడెంట్ జరిగింది .విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ లో చేరారు .ప్రమాదం తప్పి ,ఆరోగ్యం కుదురు కొన్నది .ఆంద్ర విశ్వ విద్యా లయం లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో సౌకర్యాలు ,పరిశోధనా విభాగం ఆ శాఖా ను తీర్చి దిద్దే బాధ్యతను ఆ  నాటి వైస్ చాన్సలర్ స్వామి జ్ఞానానంద కు పూర్తీ బాధ్యలతో అప్పగించారు .వారు తమ శక్తి యుక్తులను ధార పోసి 1954 లో చేరి తీర్చి దిద్దారు .న్యూక్లియర్ ఫిజిక్స్ కు గొప్ప భవిష్యత్తు స్వామీజీ వల్లనే మన రాష్ట్రం లో కలిగింది .1-7-1956 లో విశ్వ విద్యాలయం లో ‘న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖ ‘’ను స్వామి ఆధ్వర్యం లో ఏర్పడింది .ఎంతో మందిని ప్రోత్సహించి ,ప్రేరణ కల్గించి న్యూక్లియర్ ఫిజిక్స్ భవిష్యత్తును చాటి చెప్పి ,అందులో విద్య నేర్వటానికి విద్యార్ధులను సంసిద్ధులను చేశారు .ఆంద్ర దేశం లో న్యూక్లియర్ ఫిజిక్స్ కు పునాదులు వేసి, వ్యాప్తి చేసింది స్వామి జ్ఞానానంద .ప్రొఫెసర్ గా , న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో  చేరి, హెడ్ ప్రొఫెసర్ గా1965 న  పదవీ విరమణ చేశారు .రాష్ట్ర మంతటా పర్య టించి, వారు వేద వేదాంగ ,యోగా శాస్త్ర రహస్యాలను శ్రోతలకు అందించి యోగశాస్త్ర వేద విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని విశదీక రించే వారు .ఇవి ఒక దానికొకటి వైరుధ్యం ఉన్నవి కావని ,పరస్పర సంబంధం కలవని రుజువు చేశారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో వారి సేవలను గుర్తించి ‘’స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రిసెర్చ్‘’ను ఏర్పాటు చేసి ఘనం గా నివాళులర్పించారు .

            స్వామి జ్ఞానంద మతాన్ని సైన్స్ ను ‘’సింతెసిస్ ‘’చేయాలని భావించారు .ఆయన మహా మానవతా వాదిగా నిరూపించుకొన్నారు .

              సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –22-11-12-ఉయ్యూరు 

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

5 Responses to సిద్ధ యోగి పుంగవులు — 29 న్యూక్లియర్ ఫిజిక్స్ యోగి- స్వామి జ్ఞానంద

  1. ఈ తరానికి అంతగా తెలియని విజ్ఞానఖనిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

  2. దయచేసి ఊరి పేరు సరిదిద్దండి. గొరగనమూడి సరియైన పేరు. గర్గపురం అనే పేరు కాలక్రమేణా గొరగనమూడిగా రూపాంతరం చెందిందని అంటుంటారు.అన్నట్టు అది మా ఊరే. మా ఊరి ప్రఖ్యాత వ్యక్తి గురించి అందరికీ తెలియచెసినందుకు ధన్యవాదాలు.

  3. న్యూట్రాన్ కనిపెట్టిన ఛాడ్విక్ పరిశోధనా బృందంలో సభ్యుడుగా పని చేసారు. అలాగే ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక శాస్త్ర విభాగ సారధ్య భాద్యతలు అప్పచెప్పిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (అప్పటి విశ్వవిద్యాలయ ఉప కులపతి), డాక్టర్ హోమీ బాభా, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ మొదలగు ప్రఖ్యాత వ్యక్తులు.

  4. Premchand says:

    Dear Mastaru, Thanks. The learned Professor was in the university at the same time when I was there as a lecturer in Economics. He used to live in a house next to the Erskin college. One day at the request of P>V>G>Rau, who had a house just outside the university and whom I used to know well,requested me to take him to the Swamiji. We spent a whole afternoon with him during which he explained how he came into Physics. At the time he was engaged in meditation at Haridwar he had no initiation into the subject at all. All those formulas came into his mind like a stream of consciousness and he wrote them down. Later they came to the notice of a visiting German Professor who knew their worth and Prompyly sugeested that the swamiji should go to zermany and get formal education. The rest is as you described. He lost the use of one leg because of years of standing in cold Ganges for hours. He did not wear safforn robes at all. On the other hand , he wore good silk kurtas and lungis. The Vice chancellor who had the good judgement of bringing him to the A.u. was V.S.Krishna. One of my contemporaries, K.V.Reddy Naidu, son of K>V> Gopalaswamy ,then Registrar of the university later joined the department and gave leadership to it for several years. Premchand

  5. గోపి says:

    మా జిల్లాకే చెందిన మాకు తెలియని ఒక మహా మనిషి గురించి తెలుసుకున్నాను

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.