మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు
సాహితీ బంధువులకు -ఈ నాడుపత్రిక సినిమా విభాగం లో మిధునం పై మంచి సమీక్ష చేశారు .అందులోని ముఖ్య విషయాలు వారి మాటలు ,నా మాటల మేళ వింపు తో మీకోసం –
”మిధునం మన మూలాల్ని గుర్తు చేసింది .ఇప్పటి దాకా మనం చూసింది తెలుగు సినిమాలేనా అని పిస్తుంది .పేర్ల నుండి పతాక సన్నీ వేశాల వరకు పచ్చదనాన్ని నింపారు .ప్రేక్షకుల్ని కన్నీరు ఒలికించారు అవీ పచ్చగా ఉండటం విశేషం .తెలుగు కాయ గూరలు కాపు ను పువ్వు దశ నుంచి ,పిందే,కాయ దశ వరకు ఉన్న క్రమస్తితిని తెరకెక్కించి తెలుగు తోట తీయదనాన్ని ,వికసనాన్ని ప్రత్యక్షీకరించారు .నేటివిటి కి అద్దం పట్టారు .జీవిత చరమాంకం లో ఒంటరిగా దాంపత్య జీవితం అను భావించటం లో ఉన్న జీవిత మాధుర్యాన్ని కళ్ళకు కట్టించారు .గొప్ప అను భూతిని కల్గించారు .మనమూ ఈ ఆనందాన్ని అనుభవించి తరిద్దాం అనే భావన అందరికి కలిగించటం ఈ సినిమా సాధించిన గొప్ప విజయం .ముసలి దంపతుల చిలిపి తగూలు ,ప్రేమాను రాగాలు ,చిరు అనుమానాలు మనకు ఎంతో అనురక్తిని కలిగిస్తాయి .తన కంటే భర్తనే తన దగ్గరకు తీసుకు వెళ్ళమని భార్య భగ వంతుని కోరుకోవటం లో ఆమెకు భర్త పై ఉన్న పూర్తీ ప్రేమ గౌరవం ,ఆరాధనా ప్రస్పుటం గా కని పిస్తుంది .
మనిషిగా పుట్టటం గొప్ప కాదు .మనిషి గా బతకటం గొప్ప అనే గొప్ప సందేశం ఇచ్చే చిత్రం .రిటైర్మెంట్ అంటే ఏ పనీ చేయకుండా కూర్చోవటం కాదని రొటీన్ పనులకు స్వస్తి చెప్పటమని మంచి భావనా వ్యాప్తిని తెచ్చిన సినిమా ఇది .శ్రీ రమణ రాసిన కధలో మూడు పాత్రలు ఉంటె దర్శకుడు భరణి రెండే పాత్రలతో ఆ సాంతం రక్తి కట్టించాడు .ఆ రెండు పాత్రల్లో బాలు ,లక్ష్మీ బాగా ఒదిగి పోయారు.పతాక సన్నీ వేశం లో లక్ష్మి నటన మనల్ని కట్టి పడేస్తే ,చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న అసలు సిసలు తెలుగు ముసలాయనగా ,మల్లాది వారి ”అన్నప్ప శాస్త్రి”లాగా ఇందులో ”అప్ప దాసు ”గా బాలు పక్వ నటన ప్రదర్శించాడు .వీణా పాణి సంగీతం ,జేసుదాసు పాటలు ,సినిమావిజయానికి చాలా బాగా సహకరించాయి .భరణి అన్నీ తానే అయి తన” సకల కళావిశ్వ రూపాన్ని” ప్రదర్శించాడు .ఈ సినిమా తీయటం సాహసమే .ఆ సాహసాన్ని చేసి సాహస వీరుడని పించుకొన్నాడు నిర్మాత ఆనంద రావు .అచ్చమైన తెలుగు వారి సినిమా అంటే ఇలాగ ఉండాలి ,ఇలాగే ఉండాలి అని దర్శకుడు భరణి సాహస వంతం గా మిదునాన్ని తెర కెక్కించాడు . అచ్చ మైన తెలుగు చిత్రమైన ఈ ”మిధునం ”హృద్య మైన చిత్రం ”అని ఈనాడు సినిమా రివ్యు ప్రకటించింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-1-13-ఉయ్యూరు


nijanga chala bagundi. maa age (35) variki kooda nachindi. laxmi gari natana chala bagundi.
LikeLike
నా పేరు మహేష్.
నా వయసు 18 అయిన ఈ సినిమా నాకు చాల బాగా నచ్చింది.
ముఖ్యంగా తనికెళ్ళ భరణి కేవలం రెండే పాత్రలతో తీసిన విధానం నాకు చాల బాగా నచ్చింది.
ఈ సినిమా లో నాకు బాలసుబ్రహ్మణ్యం మరియు లక్ష్మి గార్ల పాత్రలు బాగా నచ్చాయి.
ఈ సినిమాను అందరూ చూడమని నేను సలహా ఇస్తున్నాను…………………………………
ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళి రాదు.
LikeLike