చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -3
అయోధ్యా కాండ విశేషాలను తెలుసుకొంటు న్నాం.వెదురు పోద కుప సిన పుష్పం ఆ వెదురు పొదలను కాల్చి వేస్తుందిట .అన్న విషయం మనకు తెలియ జేశారు .గోమతీ తీరాన మను చక్ర వర్తి ఇస్ఖ్వాకునికి ఇచ్చిన భూ మండలం ను రాముడు సీతకు చూపించటం ,తన వంశ పరంపరను తెలియ జేయటం లా అని పిస్తుంది .”గంగా నది లోని నల్ల కలువలు గంగమ్మ తల్లి కల్లులాగా ఉన్నాయి .కమలాలు చేతుల్లా ఉన్నాయి తీరం లోని వృక్షాలు హారాల్లా ,ఇసుక తిన్నెలు జఘనాల్లా ఉన్నాయి ”అని మహర్షి వర్ణించిన తీరు మహా సౌరు గా ఉంది .కాళి దాస మహా కవికి మార్గ దర్శనం చేసి నట్లున్నది .గుహుడు తన బోయ జాతిని కన్నా బిడ్డల్లా పాలించటం వాళ్ళ అతన్ని ”స్తపతి ”అని గౌరవం గా పిలుస్తారని కొత్త గా తెలిసిన విషయం.నిషాద జాతి రత్నం గుహుడు .సంస్కారం జన్మను బట్టి కాదు ,సాధనను బట్టి లభిస్తుందని వాల్మీకి గొప్ప సందేశాన్నే ఇచ్చాడు .రాముడికి వాన ప్రస్తా మార్గాన్ని ఉపదేశించిన మహర్షి ”విఖనస్సు ”అని కొత్తగా తెలిసిన విషయం .సర్వజనుల శ్రేయస్సు కోసం శ్రీ రాముడు ‘దైవీ నావం ‘అనే మంత్రాన్ని జపించటం ‘బహుజన హితాయ బహుజన సుఖాయ”అన్న భారతీయ ధర్మానికి ప్రతీకయే .ఆచరించి చూపి ,ప్రతి సందర్భం లో ను శ్రీ రామ చంద్రుడు మార్గ దర్శి అని పించుకొన్నాడు .వనవాసం లో తమ్ముడు లక్ష్మణుడి తో కైక దౌష్ట్యాన్ని చెబుతూ ,తన తల్లి కౌసల్య వద్ద ఉన్న చిలుక ,గోరువంకలు రామ వన వాసం విషయం విన్నాయని ,అందులోని గోరు వంక చిలుకను వెళ్లి కైకేయి కాలు కొరికి పగతీర్చు కొని రమ్మని చెప్పిందని ,కౌసల్య మీద పక్షికి ఉన్న ఆదరణ తనకు లేక పోయిందని,కైకమాటను గుడ్డిగా అనుసరించి తన తల్లికి అపకారం చేశానని బాధ పడతాడు .ఇంత సూక్ష్మ విషయాన్ని నాకు తెలిసి నంత వరకు ఎవరు వ్యాప్తి లోకి ఇంతవరకు తీసుకు రాక పోవటం ఆశ్చర్యమే .వెంకటేశ్వర్లు గారు దీన్ని చక్కగా అందించి రామునికి తల్లి పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని తెలియ జేసి అభి నందన లందు కొన్నారు .నాకు మాత్రం ఈ చిలుక గోరు వంక వృత్తాంతం పరమాద్భుతం గా ఉంది .సహవేదన అనేది జాతికి అతీతం గా ప్రతి బిమ్బించింది అని పించింది .
చిత్ర కూట పర్వతం పై ఉండే వారంతా ధర్మ కార్యాలు చేసి ధన్యులవుతారట .యమునా నదిని దాటేటప్పుడు సీత ‘మద్యపు కుం.డ”లను సమర్పిస్తానని మొక్కు కోవటం ,ఆ నాటి వారి ఆన వాయితీ .నదిని తల్లిగా పూజించే సంస్కారం .రాముడు వాస్తు పూజ చేసి పర్ణ శాలలో ప్రవేశించటం ,మంత్రాలను తానే పఠిం చటంవల్ల రాజు అన్నిటా సమర్ధుడై ఉండాలి అన్న బోధ ఉంది .అంతః పురమైన ,అడవి అయినా ఆచారాన్ని పాటించాలనే ధర్మ సూక్ష్మం కనీ పిస్తుంది .రాముడికి వచ్చిన కలలో తండ్రి దశరధుడు నల్లని వస్త్రాలు ధరించి ,ఇనుపీట లపై కూర్చున్నట్లు ,ఒళ్లంతా నల్ల రంగు పూసుకోన్నట్లు కని పించాడు ..ఒక రాక్షస స్త్రీ వికృతం గా నవ్వుతోంది .గాడిద రధం మీద నుంచి దశరధుడిని కిందికి నెట్టేసింది .ఈ కల రాముడికి ఏదో మరణ సూచికం గా అని పించి ,తమ్ముడికి చెప్పాడు .తండ్రి మరణం తధ్యం అని అని పించింది .స్వప్న వృత్తాంతాలు రామాయణం లో చాలా ఉన్నాయి .అన్ని దేశాల ఇతిహాసాలలోను ఇలానే ఉన్నాయి .వాటి ఫలితాలు వారు అనుభ వించారు .స్వప్నాలు దేశ కాలాతీతం అని పిస్తుంది .రాముడి ఈ కళను ఎవరు ఇంతగా ప్రచారం లోకి తేలేదు .ఒక్క వెంకటేశ్వర్లు గారే దీన్ని వెలుగు లోకి తెచ్చారని పించింది
భరతునికి అతని సైన్యానికి భరద్వాజ మహర్షి ఇచ్చిన ”విందు ”న భూతో న భవిష్యతి గా ఉంటుంది .ఈ నాటి ఫైవ్ స్టార్ హోటళ్ళుదీనిముందు బలాదూర్.ఎన్ని వసతులు ఎన్నెన్ని పిండి వంటలు ,ఎంత ఆనందం ,ఎంత ఆహ్లాదం ?మై మరపించి ,అక్కడే ఉండి పోవాలని పించే వ్యామోహం .దీని మాయలో భరతుడు పడతాడా ?లేదా ?అని మహర్షి పెట్టిన పరీక్ష అని పిస్తుంది .జితేంద్రియుడు వీటిని తరుణ ప్రాయం గా భావించి రామ దర్శనానికి బయల్దేరి వెళ్ళటం ఆహా అని పిస్తుంది భరతుని కర్తవ్య దీక్షకు జేజేలు చెప్పాలని పిస్తుంది .సన్నివేశ కల్పనా ,నిర్వహణ పరమాద్భుతం గా చేశాడు మహర్షి వాల్మీకి .అంత గొప్ప గాను ఆతిధ్యమిచ్చాడు భరద్వాజ మహర్షి అందుకే అ నాటి నుండి ఎక్కడ మహా గొప్ప విందు జరిగినా ”భరద్వాజ విందు ”అనటం లోక సహజం అయింది .అదొక ”coinage word’అయి పోయింది .ఇంత గొప్ప విందును రాముడికి ఇచ్చే సాహసం చెయ్య లేదు భరద్వాజుడు .ఇదే డ్రమాటిక్ ఎలిమెంట్ .భరతుడు ఆశ్రమ జీవితం దెబ్బ తిన కుండా తన సైన్యాన్ని దూరం గానే ఉంచి ,తన లోని సంస్కారాన్ని తెలియ జేశాడు .అందుకే రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అందించే మహా గ్రంధం గా పేర్కొనటం .కైక ను దూషించే భరతుడితో రామ వన వాసం దైవ ప్రేరితమని ,అతని తల్లి కైక నిమిత్త మాత్రురాలే నని ,రామ వన వాసం లోక కల్యాణా నికే నని బోధించటం ,మనసు కుదు ట పడె ట్లు చేయటం భరద్వాజ మహర్షి చేసిన మహా గొప్ప కార్యం .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –5-1-13-ఉయ్యూరు