శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
‘’మాండమహర్షి ‘’తపో బలం చేత నిర్మించ బడిన ‘’పంచాప్సరస సరస్సు ‘’నుండి సంగీతం అన్నికాలాల్లోను ఒకే రకం గా విని పించటం చాలా వింతగా ఉంది .చిలుకూరు వారికి ఆ సంగీతం ఎలా విన్పించిందో ,ఎవ్వరూ చెప్పని విషయమే నని నాకు అని పించింది .మూజికల్ ఫౌంటేన్స్ ఇప్పుడున్నాయి .అప్పుడు వీటిలో మహర్షి పేరు మీదుగా‘’మాండ లీన్ వాయిద్యం విని పించేదేమో ?14వేల మంది రాక్షసుల్ని ముహూర్త కాలం లో చంపేసిన శ్రీ రాముని కోదండ పాండిత్యానికి ,ఆనందం ,ఆశ్చర్యం,సంభ్రమం ముప్పిరి గోనగా రాముడిని ఆప్యాయం గా సీతా సాధ్వి కౌగిలించుకోవటం ,ఆమెకు రామ చంద్రుని పై ఉన్న ఆరాధనా భావానికి పరాకాష్ట..ఆ సుఖం భర్తకు దేని వల్లా లభించదు .,తృప్తి నివ్వదు .ఔచిత్యపు హద్దులో జరిగిన మాధుర్య సంఘటనం ఇది .
సీతా పహరణం తర్వాత విరహం తో వేదన చెందే రాముడు సకల జీవ రాశిని భస్మం చేస్తానని అనటం శోకానికి పరాకాష్ట ,ఉన్మత్త ప్రేలాపనే .ఇక్కడ ఉచితానుచితాలు కన్పించవు .’’నారాచం ‘’అంటేనే బాణం .ఇక్కడ చిలుకూరు వారు‘’నారాచ బాణాలు ‘’అనె మాట ను ప్రయోగించారు .అవి ఇంకో రకమైన బాణాలా ?పోరాబడ్డారని పించింది ..లక్ష్మణుడు అన్నను అనునయిస్తూ ,హితం చెబుతూ ఆయనలో దుఖం చేత అణగి ఉన్నజ్ఞానాన్ని మాత్రమె మేల్కొల్పుతున్నానని ,తాను చెప్పేవన్నీ పూర్వం అన్నగారు తనకు చెప్పినవే నని ,అవి హిత వచనాలే అని అనటం లో సుమిత్రా నందనుడిలో హుందా తనం ,ఆరిందా తనం ,కర్తవ్య బోధ ప్రస్పుటం గా కన్పిస్తాయి .సీతాదేవిని రావణుడు ఆహరించిన ముహూర్తం ‘’వింద’అనె పేరు కలిగిందని ,ఆ సమయం లో పోగొట్టుకొన్నది ,తిరిగి యజమానికి తప్పక లభిస్తుందని జ్యోతిశ్శాస్త్ర రహస్యాన్ని తెలియ జేశాడు మహర్షి వాల్మీకి .’’వంచులక పక్షి ‘’ఆపు లేకుండా కూయటం శుభ సూచకమే నని ,’’జయమ్ము నిశ్చయమ్మురా ‘’అని పించటం పక్షుల కూతల్లో శుభాశుభాలు తెలియ జెప్పే పరి భాష ఆనాడు వాడుక లో ఉన్నట్లు తెలుస్తోంది . కదల లేని వారిని చంపటం ,యజ్న పశువును చంపటంఅంత నింద్యం అని కబంధుని విషయం లో రాముడు అనటం యజ్ఞాలలో అప్పుడు పశు హింస లేదనే అని పిస్తుంది . ,
కిష్కింధ కాండ –రుష్య మూక పర్వతం పై నిద్రిస్తూ కల గన్న వాడికి ఆ కల యదార్ధం అవుతుందని ,పాపాత్ముడు ,దురాచారుడు దాన్ని ఎక్క లేరు అనటం స్థల మహాత్మ్యమే .వాలి నాలుగు సముద్రాల్లలో వాలి ,సంధ్యోపాసన చేసే వాడు అన్న దానికి వివరణ గా సూర్యోదయానికి పూర్వమే పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రానికి ,దక్షిణ సముద్రం నుండి ఉత్తర సముద్రానికి వెళ్ళి సంధ్యా వందనం చేస్తాడని వెంకటేశ్వర్లు గారు చెప్పిన వివరణ చక్క గా సమన్వయము తో కుదిరింది .వాలి అడిగిన ధర్మ సందేహాలకు రాముడు దొంగను శిక్షించిన వెంటనే వాడి దోషాలన్నీ నశిస్తాయని ,శిక్షించక పోతే ఆ పాపం దొంగల కంటే రాజునే ఎక్కువ గా బాదిస్తుందని ,అందుకే పూర్వం మాంధాత చక్ర వర్తి ‘’శ్రమణకుడు ‘’అనే వాడు చేసిన మహా పాపానికి ఘోరమైన శిక్ష అనుభ విన్చాల్సి వచ్చిందని యుక్తి యుక్తం గా ధర్మ బోధ చేశాడు .’’దేవ సఖ పర్వతం ‘’దాటితే వచ్చే 100యోజనాల ఎడారి రాజస్థాన్ ఎడారా ?అని సందేహం వస్తుంది .’’వైఖానస సరస్సు ‘’అవతల ఉన్న చీకటి ప్రదేశం లో స్వయం ప్రకాశులైన దేవతలు ,సిద్ధులు ,తమ దేహం నుండి ప్రసరించే కాంతి తో తపస్సమాది లో ఉండటం ఆశ్చర్యకరం గా ఉన్నా ,అసాధ్యం కాదు ,సంభవనీయమే నని పిస్తుంది .ఎనిమిది బుద్ధి గుణాలు ,నాలుగు బలాలు ,పద్నాలుగు సద్గుణాలను సూక్ష్మం గా వివరించిన తీరు ముచ్చటగా ఉండి .అందరు చదివి తెలుసుకో తగ్గవి .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు

