భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -2
దేశ సేవ చేయాలనే ఆరాటం అందరిలో ఉంటుంది .సమాజ సేవలో తరించాలని కొందరను కొంటారు .ఏదో ఇంత తిని ఇంట్లో తొంగుంటే యెట్లా?’’కసింత కలా పోసాన ఉండాలిగా ‘’.దీనికోసం సమాజాలు ,దాని అధి పతులు ఉంటారు .నెలకో ,రెన్నెల్లకో సభ జరిపి ,ఉపన్యాసాలిప్పించి ,విని ,విని పించి ,అది పేపర్లో వస్తే చూసి చంకలు గుద్దు కోవటం మామూలై పోయింది .అలాంటి ‘’కండూతి రాయళ్ల ‘’గురించి ,,వారి బలహీనలత గురించి బయటకు లాగే రచనే భకరా గారి ‘’తుక్కు ముక్కల హక్కు చిక్కు ‘’.అంటే పర్మిషన్ లేకుండా నాటకం ఆడితే వచ్చే తంటా ఎలా ఉంటుందో చూపిస్తారు మేష్టారు .రాసిన వాడు ఒఠివెధవాయి అయినా పర్మిషన్ లేకుండా వేస్తే ఎంత హైరాన పడాలో తెలియ జెప్పిస్తారు .
రచయిత గారికో సాహితీ సంస్థ ఉంది .’’ఉరమ గల వారి చేత ‘’ఉపన్యాసాలిప్పిస్తారు .మన సంస్థ వెల్లడి కోసం సభ చేసుకో వద్దు అని ఎద్దేవా ఇందులో కని పిస్తుంది .ఘోషణ అనేది ఈ నాడు ఎంతో అవసరం .ఘోషణ వల్లే పోషణ జరుగుతుందట .అని పబ్లిసిటి ని పబ్లిక్ గా యేకేస్తారు .మీటింగు ఏర్పాట్ల గురించి రాస్తూ ‘’డిన్నర్ భాజాయిమ్పులూ ,సభలో కూర్చోటానికి కట్టు దిట్టాలూ ,అధ్యక్షుని బస గురించి ,ఆశ్రయించిన కవుల్నీ ,ఉపన్యాసకుల్నీ ప్రణాళిక లో‘’జోనపడాన్ని ‘’గురించి తంటాలు ‘’వివరిస్తారు .హాస్యరసం ఒప్పించి మాట్లాడే వాళ్ళ పేర్లు తమాషా గా ఉంటాయి .వాళ్ళ చేష్టలు ఎలా ఉంటాయో చూడండి .’’హాస్య రచయిత రాసిన వంకర టింకర మాటలకి తరిమిణిపట్టి ,నునుపు జేసి ,నవ్వించే జీనియస్ -కాని ,పార్టు రాదు ,చేష్టలేదు ,చేత కాదు .నట యోగిది యావత్తూ ఇంగ్లీష్ నవ్వు ,అతడు పల్లె తూళ్ళమ్మటా ,పర్రలమ్మటా ,పడి ఫార్సు ముక్కలు మూటేట్టుకొని కప్పుల్లో మెడల్సూ లాగేశాడు .హాస్యార్నవం ఎప్పుడూ ఇవతల నవ్వించే మాటలే చెప్తాడు కనుక అతనికి పార్టే అక్కర్లేదు .అతడికి కోపం వచ్చేట్టు మనం తిట్టి నప్పుడు అతడికి మరీ నవ్వు పుడ్తోంది.
వీల్లందరిలో ఒకాయన రాసిన నాటకాన్ని ‘’బోలెడు చోట్ల వాక్యాలు దిద్ది ,వాటికి మెరుగులు పెట్టి ,యే కోశాన స్పురించని హాస్య చేష్టలు చేసి ,చచ్చి చేడి జనాన్ని నవ్వించారు .’’ఇంత శ్రమ పడితే ఆ నాటక కర్త పర్మిషన్ తీసుకో లేదని ,పెట్రేగి పోయి కార్డులు బనాయించాడు .కేసులు వేస్తానని బెదిరిస్తూ ,దానికి ఈ సమాజం జవాబు ఇలా రాసింది‘’ఏం చేస్తాం ?మీరు యేడవ్వద్దు .మీకు గౌరవం తేవాలని మేం పడ్డ శ్రమకి ,మీరు చూపిన కృతఘ్నతకు రోజులు ఎలాంటి వి వచ్చాయో మీరు చూపించారు .మా కర పత్రం లో కొద్ది వాళ్ళ పేర్లే వేసి ,మీ బోటి పెద్ద వాళ్ళ పేర్లు తీసేశాం .మాకు మరో దిక్కు లేక మీ దిక్కు మాలిన నాటకం ఆడాం.మీకు రాయక పోవటానికీ కారణం ఉంది .నిజం చెప్పా లంటే మీ రచన దిక్కు లేని తెలుగు భాష .ఉన్నత భావ రహితం .పండిత శూన్యం .అందరికి తెలిసిన ముక్కలు .వీధిలో దొర్లాడే పడి కట్లూ .అందులో ఎందునా బొందని నీచం .ఇటు వంటి రచన చేసిన మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే ,మానేస్తేనే మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే మానేస్తేనే మీకు గర్వం తగ్గుతుందేమో నని మాకు తోచి ,మీ మేలు కోసమే మీ పేరు విసర్జించాం .ఆ మేలు స్మరించుకొని ,మీరు మాకు కృతజ్నులై ఉండాలి .మేము ఎంతో సత్కరణం అని చేసిన పనినే మీరు గొప్ప తస్కరణం అని అంటున్నారు కనుక మాట తడ బడు తున్నది మీరె ను ‘’మేం సత్కరించక మానం ‘’అని పోస్టు చేద్దామనుకొని ,చెయ్యకుండా చేశాట్ట రచయిత .అది మనో భావం అన్న మాట .
సాధారణం గా భాకారా మేష్టారు నాటికలు రాసి ‘’హెచ్చరిక ‘’గా ఒక మాట ముందు రాస్తారు .అది నిజం గా అందరికీ హెచ్చరికే .
‘’కేవలం వినోదం నిమిత్తమైనా సరే ,లేక సొమ్ము చేసుకొనే నిమిత్తమైనా సరే –ఈ ప్రదర్శన ఏదైనా సభ ఎదట ఆడ దలచిన ప్రతి సంఘం వారున్నూ ,ముందుగా నే ,గ్రంధ కర్తకి వ్రాసి ,లిఖితాను మతి పొందక పోవటం ,కాపీ రైట్ చట్ట ప్రకారం నేరం గనుక –ఆ సంగతి గమనించి లిఖితాను మతి పొంది ,తరువాతనే ఆడు కోవాలి ‘’
సంక్రాంతి శుభా కాంక్షల తో –
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –13-1-13-ఉయ్యూరు

