సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు

సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం  చెవిలో కాబేజీ పువ్వు

  ఇంటాయన ప్రకాష్ రాజు కేమీ పని ఉండదు అంతా మంచి జరగాలని బోల్డు కోరుకొంటూ ఉంటాడు .పెద్దోడువెంకటేష్ బహు బద్ధకిష్టు ,చొక్కా కాలరు వెనక్కి అయిదు నిమిషాల కోసారి లాక్కుంటూ.సినిమా లొ చాలా సార్లు గోడమీదో పిట్ట గోదామీదో చెట్ల చాటునో  కూర్చుని విచారిస్తూ ఉంటాడు .చిన్నోడు చిలిపోడు మహేష్ బాబు చొక్కా కింది భాగాన్ని అయిదు నిమిషాలకో సారి మడతలు సరి చేసుకొంటూ ,కిందికి లాక్కుంటూ ,లక్షణం గా లక్ష రూపాయల ఉద్యోగం ఇస్తామన్నా ‘’నా నవ్వు నేను నవ్వుకోలేని  తొక్కలో ఉద్యోగం ‘’అని దులిపేసి హీపీగా ఇంటర్వ్యు నుంచి దులుపుకొని బయటికొచ్చేస్తాడు . .వాళ్ళ బామ్మ బుగ్గలు కొరుకుతూ చెవులు పిండుతూ ,భుజాలు రక్కుతూ ,తిండి మాత్రం టైముకు తింటూ ,డైరెక్టర్ చెప్పినప్పుడో సాంగేసుకొంటూమ్ టాడు .అన్నకు తిండి యావేలేదు అలిగి చీకట్లో కూర్చోటమే సరి పోతుంది .తండ్రీ ఇద్దరికోడుకులు కానీ సంపాదన లేక పోయినా ,ముసలమ్మ రోహిణీ హత్తాంగల్ చేతి బంగారు గాజులు ,ఒంటి మీది నగలూ అమ్మి హాయిగా బతికేస్తారు .పాపం జయ సుధ వీరందర్నీ ఎలా మేపిందో తెలీదు .అంతా రికామీ సంసారం .దీనికి తోడు ఎవరికి తోచిన యాస వాళ్ళు మాట్లాడు కుంటూ రీళ్లు నవిలేస్తారు ..ఇక హీరోఇన్లు అంజలి ,సమంతాలు పాపం వీలైనప్పుడల్లా కని పిస్తూ ,ఏదో మాట్లాడుతూ ,పాటేసుకొంటు కాలం గడిపేస్తారు .పెద్దోడు ,చిన్నోడు లకొక చెల్లి ఉందని మనకి తెలీదు .కాని హడా విడి పెళ్ళి జరిగి పోతుంది . చిన్నోడు ఊరి కెళ్ళి నప్పుడల్లా పెద్దోడు ‘’డబ్బుందా“’అని అడుగుతూ తానేదో పేద్ద సంపాదన పరుడయినట్లు చిన్నోడి చొక్కా జేబులో  నోట్లు కుక్కుతూంటాడు .’’ఉన్నాయి’’ అంటూనే వద్దన కుండా నోక్కేస్తాడు చిన్నోడు .వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు ,పోట్లాడుకోరు . పెద్దోడు అలిగి నప్పుడల్లా చిన్నోడు పక్కన చేరి ఏమీ మాట్లాడకుండా ,కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తూ కాలం గడుపుతారు .ఇదో వింత అను బంధం .సినిమాటైటిల్ కీ కధకీ సంబంధమేమిటి అని ఆలోచిస్తే ”తొక్క మీద కాలేసి జారి నట్లే ”.నని గుర్తుంచు కొండి.

              సరే బాగుంది అనుకొంటే –భద్రాచలం లొ శ్రీరామ కళ్యాణం కు ముఠా అంతాఅక్కడికి చేరుతుంది . ఒక లారీ కరెంటు స్తంభానికి గుద్దుకొని నిప్పుల వర్షం కురుస్తుంది జనం మీద ..కాని ఎవ్వరి కి ప్రమాదం జరగదు .చిన్నోడు ,పెద్దోడు కాలర్లేగేసుకొని అందర్నీ రక్షిస్తారు .’’హమ్మయ్య ‘’అను కొంటాడు ప్రకాష్ రాజ్ .సీతమ్మ వారు కాపాడిందో ,రామయ్య రక్షించాడో ,డైరెక్టర్ హామీ పడ్డాడో కధ సుఖాంతమయింది .ఇలాంటి సినిమా తీయ టానికి వెంకటేష్ అన్నట్లు ‘’గట్స్‘’ఉండాలి ,దానితో బాటు దమ్మూ ,సొమ్మూ ,ఉండాలి ,ప్రేక్షకుల మీద వమ్ము పోనీ నమ్మకమున్డాలి అన్నిటికీ మించి  గొప్ప ‘’దిల్లు ‘,’దాంతో పాటు త్రిల్ ఇచ్చే ,కిక్ ఇచ్చే ఆలోచన ఉండాలి .ఇవన్నీపుష్కలం గా ఉన్న ‘’ధియేటర్ మొఘల్ ‘’అయిన ’’ దిల్ రాజు ‘’తీసిన సినిమా ఇది .’’అడ్డాల నాడే కాని గడ్డాల నాడు కాదు ‘’అని తెలియ జెప్పటానికా అన్నట్లు శ్రీ కాంత్ అడ్డాల కధంతా చింపి చింపి ముక్కలు ముక్కలు చేసి ఇష్టమొచ్చి నట్లు అతికి కతికి పారేశాడు .దిల్ రాజు కు తగ్గగట్స్ ఉన్న మొన గా డని పించాడు .ఇద్దరు మహా నటులను ఎవరు ఎక్కువ చేస్తే రెండో వాడి యాక్షన్ కు ఇబ్బందో నని ఇద్దర్నీ హాయిగా సైలెంట్ గా ,వయోలెన్స్ లేకుండా బాలన్స్ చేయటమే అడ్డాల చేసిన గొప్ప ఫీటు .అదే ఏమైనా సిరి ని కురిపించాలి .దీనికి ఇంకోటి కూడా తోడయిందని పించింది .అది –ఈ సినిమా తో పాటు రిలీజైన మరో హీరో సినిమా పై ‘’నెగటివ్ టాక్ ‘’బాగా ప్రచార మైంది .అది ఈ సినిమాకు బోలెడంత పాసిటివ్ సపోర్టు నిస్తుందేమో ?మా మనవళ్ళు మాత్రంఆ సినిమా కంటే ఇది వెయ్యి రెట్లు నయం అని హేపీ ఫీల్ అయారు మా ఇద్దరికీ మాత్రం ఎటూ చెప్పే సాహసం కని పించలేదు .అందుకని ఉన్నదున్నట్లు రాస్తున్నాను .

            ఈ సినిమా కు ప్రాణం ‘’సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ‘’పాట దీనికి రేడియో లొ స్వరం కట్టి పాడించిన వారు లలిత సంగీత స్వర చక్ర వర్తి స్వర్గీయ పాల గుమ్మి విశ్వనాధం గారు అని తెలిసి ఎంతో సంతోషించాను “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పాలగుమ్మి విశ్వనాధం గారు ఆకాశవాణి కోసం స్వర పరచిన ఒరిజినల్ పాట.ఆ ఆడియో ను మిత్రులెవరో మెయిల్ పంపారు దాన్ని సాహితీ బంధువు లందరికి ఫార్వార్డ్ చేసి వారికీ ఆనందం కలిగించాను .అందులో పాలగుమ్మి వారి అరుదైన ఫోటోలున్డటం విశేషం .పాలగుమ్మి వారి గీతాన్ని ఈ సినిమా  సంగీత దర్శకుడు వాడుకోన్నారేమో ?అదేమీ ఆక్షేప ణీయం కాదు.మిక్కిలి గౌరవం .అయితే ఆమాట టైటిల్స్ లొ వేసి చూపించితే మర్యాద గా ఉండేది . .మిక్కీ మేయర్ సంగీత దర్శకత్వానికి హాట్స్ ఆఫ్ .ప్రతి అంగుళం లొ ను సుస్వర సంగీతాన్ని పొదిగి పూలల్లో దారం లా సువాసన లందించి మేయర్ –మేజర్ పార్టు ను నిర్వహించాడు మణి శర్మ బాగ్రౌండ్ మ్యూజిక్కూ ,లాజిక్కు తో నడిచి మహదానందాన్ని చ్చింది .ఆ ఇద్దరికీ అభి నందన పరంపర .దిల్ రాజు కు మేయర్ అందించిన సంక్రాంతి కానుక అని పిస్తుంది ఈ సినిమా .

ఈ సినిమా

This slideshow requires JavaScript.

మా కుటుంబానికి ఒక మధురాను భూతినిచ్చింది .దాదాపు యే ముప్ఫై  ఏళ్ళో దాటి ఉంటుంది మా కుటుంబ సభ్యులందరం కలిసి సినిమాకు వెళ్ళి .అందునా రాత్రి రెండో ఆటకు .భోగి నాడు రాత్రి రెండో ఆటకు మేమందరం కలిసి సినిమా చూశాం .ఇందులో మూడు తరాల వారుండటం విశేషం ,నేను నా శ్రీమతి ,మా అన్నయ్య గారి అబ్బాయి రామనాద్ ,కోడలు ,మనవడు ,,హైదరా బాద్ నుంచి సంక్రాంతి పండుగ కోసం చాలా సంవత్స రాలకు వచ్చినమా పెద్దబ్బాయి శాస్త్రి ,కోడలు ఇద్దరు మనవళ్ళు ,వాళ్ళ కారు డ్రైవరు ,మా మూడో వాడు మూర్తి కొడుకు కూతురు అంటే మా మనవడు మనవ రాలు ,మా నాలుగో అబ్బాయి రమణ ,కోడలు వెరసి పధ్నాలు గు మంది ఈ సినిమా చూసి రికార్డులు పగల గొట్టాం. గేటు దగ్గరి వాడు పద్నాలుగు టికెట్లు చింపి లోపలి పంపిస్తాడు అనుకొంటే ,శుభ్రం గా వాటిని మడిచి జేబులో పెట్టుకొని ‘’రొటేషన్ ‘’లొ పెట్టటం ఔరా !అని పించింది .ప్రభుత్వానికి బొక్క .హాలు యజమానికి కిక్కు .అద్భుతః ,ఆదరహా .

                   ముక్కనుము శుభా కాంక్షల తో

                     మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –16-1-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు, సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

20 Responses to సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు

  1. baagaa cheppaaru

    4 లేదా 5 నేలలనుండీ ఒక్క తెలుగు చిత్రాన్ని చూడలేకపోవటం తో మా ఊరు వాళ్ళు వస్తే వాళ్ళతో కలసి రిలీజ్ అయిన రెండవ రోజు oka భారి మాల్ లో ఇద్దానిని చూడటం జరిగింది, మూవీ గురించి అంతా +Ve టాక్ తోనే ఉన్నారు. నేను వెళ్ళాను మూవీ చూస్తూ ఉన్నాను నాకు ఫీల్ కలగదే? ఈలోపు ఈ కథకు కృష్ణ వంశీ డైరెక్టర్ అయితే ఎలా ఉండేదా అని ఆలోచనలు…..

    ఈ చిత్రం చూసే కొన్ని రోజుల ముందు youtube లో సంతానం ఓల్ద్ మూవీ చూసాను ఒక కుటుంబం లో అర్థాంతర కష్టాలు ఇద్దరు పిల్లకు తమ్ముడు తోడైన మరుక్షణమే తల్లిని కోల్పోతారు ఆ బాధలో ఉన్న తండ్రి పొరపాటున చూపు కోల్పోతాడు, పిల్లలకు తానూ భారం అవుతానేమో అని ఆతడు వాళ్లకు దూరంగా వెళ్ళిపోతాడు, ఆపిల్లలు అద్ది ఇంటిని విడచి రోడ్డుపై పడతారు, అలా రైల్లో పెద్ద తమ్ముడి ని మిస్ అవుతుంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న అక్క ఆతరువాత చిన్న తమ్ముడిని కొన్నాళ్ళకు అతని మేడలో ఉన్న locket కోసం ఎత్తుకు పోతాడు దొంగ, ఈ తరుణం లో కుటుంబం లోని వారంతా ఒక్కోచోట !! మరొకరి ఉనికి కూడా తెలియకుండా 10, 12 ఏండ్లు గడుస్తాయి
    వారిని దైవం ఎలా ఒక్కటి చేసాడు అనేది కథ ఎలా సుఖాంతం అవుతుంది అనేది ఆ సంతానం అనే కుటుంబ కథా చిత్రం యొక్క కథనం.

    ఈ మూవీ చూసాక కుటుంబ కథా చిత్రం అంటే ఇది అనిపించింది. ఆ మోటో తో SVSC చూస్తే ఆ స్పర్శ లేదు. నేటి కాలం వారికోసం ఇలా అనుకుంటే…

    పూర్ణత కనిపించలేదు. అంటే మురారి మూవీ చూసిన ఫీలింగ్ రాలేదు. ఏదో ప్రస్తుత కాలానికి తగినట్టుగా గుడ్డి బదులు మెల్ల మేలు అన్న చందాన ఉన్నది.

    అయితే ఎవరడిగిన నాదెం పోయింది, సిన్మా బాగుందా అంటే ఓ ఎస్ బాగుంది మీరు చుడండి అని చెప్తున్నా !!

    ఆ మధ్య కృష్ణ వంశి చిత్రం మొగుడు అని ఒకటి రిలీజ్ అయితే తెలుగు బ్లాగర్లంత ముక్త కంటం తో వేస్ట్ మూవీ అన్నారని అప్పట్లో చూడలేదు.

    ఎందుకైనా మంచిది చూద్దామని svsc చూసిన రాత్రి youtube లో ఈ ”మొగుడు” మూవీ చూసాను, చక్కగా ఉంది.

    నాకో విషయం అర్థం అయ్యింది

    ఒక కాగితం పై 100అని రాసి గాంధీ బొమ్మేసి 10 మంది దానిని వంద రూపాయలు అంటుంటే…దాని విలువ 100 రూపాయలు అయ్యింది.

    అలాంటే ఒక చక్కని చిత్రాన్ని చెత్త అంటే ఫెయిల్ అయ్యింది.

    ఒక అసంపూర్ణ చిత్రాన్ని అబ్బో కేక అంటుంటే అది సూపర్ హిట్.

    యత్ భావం తత్ భవతి ఒకప్పటి మాట !

    ఏది ఎక్కువ మంది చెప్తే అదే నిజం అనేది నేటి మాట!

    Like

  2. subhadra says:

    చాలా బాగా రాసారు సార్.. సినిమా చూస్తున్నంతసేపు నా మనసులో కదిలిన భావాలనే మీరు రాసినట్టు అనిపించింది.. చాలా బాగా తియ్యవలసిన సినిమా.. ఎంతో మంచి తారాగణం ఉండి, నేపధ్యం ఉండి, సాకేతిక నైపుణ్యం ఉండి కధ అనె ఉప్పు లేక మిగిలిన చప్పిడి వంటగా తయారయిన సినిమా ఇది.. బాగా లేదని చెప్పలేము..బావుంది అనడానికి మనసు రాదు.. అన్నట్టు గబ్బిట కృష్ణమోహన్ గారు మీకు ఏమవుతారు?

    Like

  3. subhadra says:

    ఓ.. అవునా.. నేను ప్రస్తుతం వారు రాసిన ‘సరదాగా కాసేపు ‘ పుస్తకం చదువుతున్నాను… వుడ్ హౌసియన్ హాస్యం చాలా బాగా రాసారు.. దయచేసి నా అభినందనలు వారికి తెలియచేయగలరు..

    Like

  4. భలే రాశారు సార్!!

    Like

  5. siri says:

    manalaanti vaallani adiginaa chepthaam kadaa konni points story ki.

    Like

  6. చెప్పడం అవసరమనిపించలేదు says:

    ఒక మంచి ప్రయత్నాన్ని మెచ్చుకోకపోయినా పరవాలేదు కానీ.. ఇలా ఏ రీలుకారీలు పీకి పాకాన పెట్టి మీరు మూటకట్టుకున్నదేమిటో, జనాలకి పంచిపెట్టినదేమిటో నాకర్థంకాలేదు మాస్టారు గారు… తప్పుగా అనుకోకండi

    పాటలు బాగానే ఉన్నాయి కదండి… స్క్రీన్‌ కూడా రంగులతో కలకలలాడిండి కదండీ…. మీకు తెలియదేమో కానీ ఈ హీరోలలాంటి వ్యక్తిత్వాలతో చాలా మంది నాకు తగిలారు… అతిశయోక్తిగా ఏమీ అనిపించలేదు…

    ఇక మీ అనాలసిస్ అంటారా…. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని సరిచేసి సినిమా తీస్తే ఆస్కారు కి పంపించాలి… అయినా ఎన్నో అర్థంపర్థంలేని చెత్త సినిమాలు వచ్చి వెలుతుంటే ఏమీ అనని జనాలు … ఒక మంచి ప్రయత్నాన్ని హర్షించే మనసు రాదేమీ….

    – ఒక సగటు తెలుగుసినిమా అభిమాని…

    Like

  7. అబ్బ, భలే రాశారండీ నా మనసులో మాటను తెచ్చి మీ బ్లాగ్ లో రాసినట్లు ఉంది. ఈ మాత్రం సినిమాకి మేము చికాలో మొహం వాచినట్లు ముందు రోజు వెళ్ళి, టికెట్లు దొరక్క వెనక్కు వచ్చి, మర్నాడు పట్టు విడవక వెళ్ళి చూసి, డబ్బు, సమయం, శక్తి వంచన లేకుండా వొదుల్చుకున్నాము!

    ఆ సిర్మల్లె చెట్టు సెట్ కి దర్శకుడు మూడు కోట్లు ఖర్చు పెట్టాడని చదివి, సినిమా మొత్తానికీ కూడా అంత అయ్యేలా లేదే అని తెల్ల బోయాను.

    ఇద్దరు స్టార్ హీరోలకు ఏమి చెప్పి ఒప్పించారో దర్శక నిర్మాతలు? ఒక ఔత్సాహిక సినీ రచయిత మిత్రుడు ఇలా అన్నాడు “మీరు చేయాల్సిందేమీ లేదు.. డాబా మీద నిలబడి..చెట్టుకీ హోర్డింగ్ కూ సరిగ్గా మధ్యలో చందమామ కేసి చూడాలి. ఒక రోజు మాత్రం పెళ్ళి లో గుండిగ మొయ్యాలి” అని చెప్పి ఉంటారా? అని..:-))

    రావు రమేష్ పాత్ర ప్రాక్టికల్ గా ఉంది. అనురాగం, బంధం అదీ ఇదీ అని కబుర్లు చెప్పక డబ్బు సంపాదిస్తూనే మరో పక్క చక్కగా కుటుంబ సభ్యులు అందరితోనూ గడుపుతాడు.

    భద్రాచలం గుళ్ళో ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఉపన్యాసం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ప్రేక్షకులకు. “మీరు ఈ జన్మకే అన్నాదమ్ములు. నేను ఈ జన్మకే మీకు తండ్రిని” అన్న రెండు ముక్కలు తప్ప

    Like

  8. నా వ్యాఖ్యలో అచ్చు తప్పు. చికాగో లో అని ఉండాలి. (చికాలో అని టైప్ చేశాను తప్పుగా)

    Like

  9. chaala chetta review. telugu routine cinemalu choosi aa formulae ki alavatu padda audience ki, super stars unnarani over expectations pettukunna variki- ee movie kachitanga ekkaledu. Inthaku mundu vachina movie ki defcects unna pattinchukunevaru kadu but ee mvie nachani vallu bhoothaddam lo choostunnaru. first scene ninchi inthala nachaka pothe, i wud just walk away after interval. Appreciate these which TFI can never witness in mvs
    1) super stars in character roles without any pre/post intro fyts,heavy mass fyts
    2) heroine/other character artiste getting powerful role who can walkaway with all praises – prakashraj,anjali
    3) no cinematic twists..no highs, no downs but plain storyline which is jus lyk a look into our neighbourhood
    4) no comedians to save/divulge d plot
    5)melifolous music with absolutely no english/hindi word
    6) unna oka fyt ovr the top kakunda, sagatu manishi fyt chesetattu undatam. Compromises and realizations aayetappudu over the top dialogues cheppamu manamu. movie lo kooda ade choopincharu
    7) super stars mvs ki pokiri, porambokku ano, body gaurd ano, peddodu-chinnodu ani titles lekunda – kathaki thagga title pettadam. I know ur next doubt, kathaki thagga title yenta ani kada. see next

    bamma tho mahesh babu aa panulu enti ani rasaru. manchi upbringing ivvaka povadam valla, ee kalam janalaki old people ante chiraaku (almost 90% of the poepl). I have many examples in my own relatives
    1) 1 of my relative does not want her widowed/alone mother in law 2 trvel to US and wants to get her admitted in old age
    2) my attayya (bamma in one rich fmily, who cnnot walk properly) was thrown out of the house and ws not even given food for her existence. She tells she wants to c d movie after seeing the equation of mahesh with his bamma in the promo

    inka title justification. cinema choosi point ardam kaledu ante inka review ilaane untundi. peddodu, chinnodu deshaini uddharinche panulu emi cheyyaru kaani janalaki problesm vaste, they will keep aside their egos. Sontha valla kadha ani alochinchakunda andarki cheyadagga help chestaru.
    manchi /happy kutumbam unte chaalu desham propser avtundi ani prakash raj antadu. In a sense, good upbringing makes good people. Tht is enoguh for the soceity development. Anduke ee title.
    Sitamma vakili lo (desham/society) sirimalle chettu (prosperity).

    Just read this review. This is writenn by a non-telugu (teulgu movies ni banda buthulu thitte tamils) who had no expectations of the movie.

    “After a point, I forgot about predictable story-lines, the whole father-mother-family scenario. o.O #SVSC. Impressed by the subtlety of the brothers’ relationship. No wah-wah speeches/eternal songs/loud oaths. Just simple, moving stuff. #SVSC has been watched, at last. Loved, absolutely *loved* it. Now this sibling relationship is the stuff of epics. ”

    “Dhananjayan Govind‏@Dhananjayang
    In a rare case, today’s Dinakaran Tamil newspaper carries a half a page good review for the Telugu film #SVSC … amazing recognition”

    nenu cheppindi thappu anipisthe, kshaminchi meeku thagga movies vastuntaayi. Avi choodandi. Ex: Naayak,mirchi,dookudu,dammu lanti commerical comedy movies. Ledha mithunam, shankara bharanam lanti art house movies with no loopholes unnayi.

    Pity TFI, Enni mirchilu, naayaklu, rachalu, dookudulu, badhsahlu choodalo ee audience valla. Over to Bolywood, kollywood fr gud/different movies with encouraging audience.

    Like

    • బోనగిరి says:

      మీరు వ్రాసింది చాలావరకు కరక్టే.
      నేను మాట్లాడిన వాళ్ళలో చాలామందికి ఈ సినిమా నచ్చలేదు.
      గత ఏడాది ఈ సినిమా కంటే మంచి సినిమాలు శ్రీరామరాజ్యం, రాజన్న వచ్చాయి. అవి కూడ జనాలకి ఎక్కలేదు. మిధునం లాంటి సినిమాలకి థియేటర్లు కూడ లేవు.

      చివరికి నాకు అర్థమయిందేమిటంటే, “ఫార్ములా చట్రంలో ఇరుక్కున్నది మన హీరోలు కాదు, ప్రేక్షకులు” అని.

      ఈ సినిమాలో హీరోలు కూడ మన పిల్లలలా ఏదో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి తీరాలి. అప్పుడే జనాలకి తృప్తి కలుగుతుంది. దర్శకుడు అయినా తండ్రిలా పెద్దోడు కూడ వ్యవసాయం చేస్తున్నట్టు చూపిస్తే సరిపోయేది.
      ఇదేమీ పెర్‌ఫెక్ట్ సినిమా అని నేను చెప్పను. కాని పగసాధింపు మసాలా సినిమాల కంటే ఖచ్చితంగా బెటర్ సినిమా.

      Like

  10. Aryan says:

    haha..perfect review of the review by Suraj

    ee thokkalo review malli support ga sontha ooru vadili chicago lo cherina vaari comments
    machukaki konni comments why this review is absurdly stuppid

    chinnodu time ki annam thintadu sampadana lekunda – Both brothers ar ein the phase of compeltoin of eduction and searching for right job to settle. aa scenes lo time ki thintunnadani grahinchina reviewer, he missed some subtle realistic scenes lyk mother bringing every food item to son`s bed, son using mothers saree as towel.

    rohini chethi gajulu ammina thandri ,kodukulu..baboi, iddekkada undi. rohini valla ayina unnapudu ala nagalu undevi , anni harinchukupoyayi annadi. Ante valla ayana time lo aasthulu poyayi ani ardham!!!!
    SVSC title song. Idi picchi peaks ki velipoyindi. deniki copyright acknoweldgement ivvali? movie song ki radio song ki ekkada ponthane ledu. Inka seethamma vakitlo sirimalle chettu anna word use chesinanduku copyright acknowledgement ivvala?baboi picchi peaks…

    support to Rao ramesh character – Vammo idi psychic nature ki udaharana.
    sontha annaya,vadina (or tammudu/tammudu bharya -dont remember) chanipoyi dikku mokku lekunda unna pasi kanduni penchukolenantha dabbu vyamohamlo padda athaniki support ante psychic nature kada

    final word – Ilaanti scenes/mv ki feel kani reviewer, i pity the kind of upbringing he had and the kind of upbringing he is imparting to his children (if he is elder)

    Like

  11. Tummeda says:

    Ayya baboy rakshincharu..Maa friends..rendu rojula weather sarika leka movie timings miss ayyaru..ivvala vellali I try Cheste ..Maa friends 5.30 show ki vellaru..madhyalo naaku phone..Meeru vellakandi..Memu meeku freega 10 dollars istamu..ticket 15 dollars..ani okate gola.

    Like

    • చెప్పడం అవసరమనిపించలేదు says:

      అంతే… మీరు అలాగే రక్షింపబడండి… మీకోసం అంతర్జాలంలో ఒక వారం తర్వాత ఈ సినిమాని పెడతారు… చాటుగా చూద్దురు గానీ…. వెళ్లకండి… ఏ సినిమాకీ వెళ్లకండి…. !!

      Like

  12. Mauli says:

    సంక్రాంతి సందడిలో వెళ్దామని ప్లాన్ చేసుకుని కూడా మిస్ అయ్యాము, గ్రోసరీస్ షాప్ లో డివిడి ఫ్రీగా ఇస్తారు ఎలాగు 🙂

    Like

  13. Mauli says:

    “ఫార్ములా చట్రంలో ఇరుక్కున్నది మన హీరోలు కాదు, ప్రేక్షకులు” అని.”

    ఫార్ములా చట్రం లో ప్రేక్షకులు ఉంటే మాత్రం కనీసం కధ కూడా లేకుండా సిన్మా బాగుందని అనాలా బోనగిరి గారు 🙂

    Like

    • బోనగిరి says:

      ఇదేమీ పెర్‌ఫెక్ట్ సినిమా అని నేను చెప్పను.
      కాని పగసాధింపు మసాలా సినిమాల కంటే ఖచ్చితంగా బెటర్ సినిమా.

      Like

Leave a reply to చెప్పడం అవసరమనిపించలేదు Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.