సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ –2
బీథోవెన్ స్కూల్ లో చదువు కొనే టప్పుడు కోర్ట్ ఆర్గాన్సిష్టులు ,స్థానిక సంగీత కారుల దగ్గర పా ఠాలు చెప్పుకోనేవాడు .1781లో కంపోసిషన్ ,కీ బోర్డ్ లను Christian Gottlob Neefle వద్ద అధ్యయనం చేశాడు .నీఫెల్ అప్పుడే కొత్తగా ఎలేక్తార్ కొలువు లో చేరాడు .బీథోవెన్ ను చూసి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశీర్వ దించాడు .1782లో అంటే పన్నెండేళ్ళ వయసులోనే బీథోవెన్ కు కోర్టు వాయిద్య కారునిగా తన బదులు అవకాశం కూడా ఇచ్చాడు .అది చాలా గొప్ప బాధ్యతే .మరుసటి ఏడాది Manheim అనే పబ్లిషర్ కు చెప్పి ,బీథోవెన్ చేసిన కీ బోర్డు లోని ‘’వేరియేషన్స్’’అచ్చు వేయించాడు .తనతో బాటుకోర్ట్ ఆర్కెస్ట్రా లో కీ బోర్డు ప్లేయర్ గా చేసి ప్రోత్సహించాడు .మరో కొన్ని రోజుల్లోనే మూడు ‘’పియానో సొనాటా’’ లను ముద్రింప జేయించాడు .వీటిని బీథోవెన్ ఎలేక్త్రార్ కు అంకిత మిచ్చి ఋణం తీర్చుకొన్నాడు .
1784లో ఎలేక్త్రార్ చని పోయాడు .ఆయన కు వారసునిగాMaximillion Franz వచ్చాడు .ఈయనకు సంగీతంపై చాలా అభిమానం . వెంటనే బీథోవెన్ కు రెండవ ఆర్గానిస్ట్ గా పదోన్నతి కల్పించాడు .మంచి జీతం కూడా ఇచ్చాడు .అక్కడ స్థానికం గా ఉన్న Beuning అనే ఆమె family తో మనవాడు పరిచయం పెంచుకొన్నాడు .ఆమె కూతురు ‘’ఎలినార్‘’కు పియానో నేర్పించే పని అప్పగించింది .వాళ్ళ ఇంట్లో ఉండటానికి ,లైబ్రరీ ని వాడు కోవటానికి అవకాశ మిచ్చింది .దాన్ని సద్విని యోగ పరచుకొని ,అప్పటి వరకు ఉన్న జర్మన్ సాహిత్యాన్నంతా దీక్షగా చదివేశాడు బీథోవెన్ .ఈ ఇల్లు ,ఫామిలీ స్వర్గం గా ,స్వంత ఇల్లు జబ్బుతో ఉన్న తల్లి ,విపరీతమైన తాగు బోతు అయిన తండ్రీ నరకం గా అని పించాయి .
తండ్రి సంపాదన తో ఇల్లు గడవటం కష్టమై పోయింది .అందుకే 14వ ఏట నే సంగీత పా ఠాలు చెప్పి డబ్బు సంపాదించి ఇంటి ఖర్చు లకు ఆదుకొనే వాడు .అయినా పట్టు వదలకుండా వయోలిన్ పా ఠాలు నేర్చు కొంటూనే ఉన్నాడు .సంగీతాన్ని కంపోజ్ చేస్తూనే ఉన్నాడు ..1787 లో పది హేడేల్ల వయసులో తండ్రి ప్రోద్బలం తో మొజార్ట్ అనే సంగీత విద్వాం సు ని వద్ద నేర్చుకోవటానికి బీథోవెన్,వియన్నా వెళ్లాడు .ఆయన వద్ద రెండు వారాలే ఉన్నాడు .బీథోవెన్ ధోరణిని చూసి మొజార్ట్ ‘’మీ ద్రుష్టి ఈ కుర్రాడి మీద ఉంచండి .కొద్ది రోజుల్లో ఇతను ప్రపంచానికి గర్వించదగిన దాన్ని అందిస్తాడు ‘’అని స్నేహితులతోబీథోవెన్ సామర్ధ్యాన్ని మెచ్చుకొంటు చెప్పాడు .అతనిలోని ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తీ మొజార్ట్ .తల్లి టి.బి.తో మరణిం చ టం తో మొజార్ట్ వద్ద సంగీతాన్ని అభ్యసించలేక ఇంటికి తిరిగి వచ్చేశాడు బీథోవెన్ .తల్లి అతనికి ఆరాధనా దేవత .అతను ‘’తల్లి పిల్లడు‘’.అంత అను బంధం వారిద్దరిది .ఆమె మరణాన్ని జీర్ణించుకో లేక పోయాడు .ఆమె జబ్బు తనకు సంక్రమిస్తుందేమో నని భయ పడే వాడు .తండ్రి ఇష్టమొచ్చి నట్లు అప్పులు చేస్తూ తాగి తన్దనాలాడుతూ జైల్లో పడి చిప్ప కూడు తింటూ బీథోవెన్ కు మనశ్శాంతి లేకుండా చేశాడు .పాపం పద్దేనిమిదేల్లకే బీథోవెన్ కు కుటుంబ బాధ్యత మీద పడింది .తండ్రి జీతం లో సగం తన కుటుంబ పోషణ కోసం ఇప్పించమని ఎలేక్తార్ ను వేడుకొన్నాడు .ఇతని కోరిక మన్నించి ఆయన అలాగే ఏర్పాటు చేశాడు .కొంత బరువు తగ్గింది .
Court Walderstein అనే ఆయనతో బీథోవెన్ కు పరిచయం కలిగింది .ఇతని లోని ప్రతిభకు మెచ్చి ‘’బాన్ యూని వేర్సిటి ‘’లో ‘’క్లాసిక్స్ ‘’చదువుకొనే వీలు ,ఫిలాసఫీ పా ఠాలు నేర్చుకొనే వీలు కలగాజేశాడు 1790 లో Hayden అనే ప్రఖ్యాత సంగీత విద్వాంషుడు లండన్ వెడుతూ బాన్ కు వచ్చాడు .బీథోవెన్ ఆయన్ను కలిసి పరిచయమేర్పరచుకొన్నాడు .ఎలేక్తార్ ను ఒప్పించి బీథోవెన్ ను వియన్నా వెళ్ళి హేడెన్ వద్ద విద్య నేర్చుకోవటానికి పంపాడు వాల్దేర్ స్టీన్ .1792 లో ఆస్ట్రియా–ఫ్రాన్సు దేశాల మధ్య యుద్ధం జరిగింది .తండ్రిని తమ్ముళ్ళను వదిలి బీథోవెన్ వియన్నా చేరాడు హేడెన్ దగ్గర సంగీత విద్యాభ్యాసానికి .కౌంట్ వాల్దేర్స్తీన్ రాసిచ్చిన పరిచయ పత్రాన్ని వెంట తీసుకొని వెళ్లాడు .ఆయన రాసిన వాక్యాలు ‘’through your unfailing efforts receive –Mojaarts spirit from Hayden’ s hands –yours true friend wlader stein ‘’
వియన్నాలో విద్యాభ్యాసం
18 వ శతాబ్దానికి యూరప్ లో వియన్నా చాలా ప్రాధాన్యత చెందిన శక్తి వంత మైన నగరం .ఇక్కడి St.Stephen’s cathedral సుమారు ఒక చదరపు మైలులు విస్తీర్ణం లో ఉండేది .డాన్యూబ్ నది నగరం మధ్యలో ప్రవహిస్తుంది .రాజకీయ ,ఆర్ధిక ప్రాతినిధ్యమున్న నగరం .పడమర నగర గోడలకు అవతలSchonbrunn palace లో వేసవి లోHaps Burgh Imperial family వచ్చి నివాసం ఉండి పరిపాల చేస్తుంది .సిటీ లోపల ధనిక ,పేద కుటుమ్బాలులుంటాయి .విలాస వంత మైన అపార్ట్ మెంతుల్లో ధనికులు ఉండేవారు .యే సౌకర్యం లేని బెస్ మెంట్స్ లో నిరు పేదలు జీవితాలు వెళ్ళ బుచ్చుకొనే వారు .ఉన్నత తరగతి వారు డాన్సులు ,కచేరీలు ,డిన్నర్లు ఒపేరా లతో డబ్బుని మంచి నీళ్ళ ప్రాయం గా ఖర్చు చేసే వారు .కారేజ్ రన్ ,వేట ,గాంబ్లింగ్ ,పార్టీలు అనుక్షణంచూస్తూ బీదలు ఇదంతా ధనికులకు సహజమే అని ఊరట చెందే వారు .వారు పెట్టి పుట్టారు కనుక ఆ భోగ విలాసాలను భవిస్తున్నారని అనుకొనే వారు .ఫ్రాన్సు దేశ విలాస జీవిత మంతా వియాన్నాను పూర్తిగా ఆక్రమించేసింది .ఇదంతా కృత్రిమ నాగరకత .అప్పటికే ‘’out dated ‘’.ఇలాంటి వియన్నా నగరానికి విద్య నేర్వటం కోసం బీథోవెన్ వచ్చాడు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-1-13-ఉయ్యూరు

