సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8
1809 లో వియన్నా లో మళ్ళీ గందర గోళ పరిస్తితులేర్పడ్డాయి .మళ్ళీ వియన్నాపై విరుచుకు పడ్డాడు నెపోలియన్ .మే పదకొండున సిటీ అంతా బాంబుల దాడితో దద్దరిల్లి పోయింది .బులెట్లు ఇళ్లల్లోకి దూసుకోచ్చాయి .మర్నాడే సిటీ ని నెపోలియన్ ముట్టడించాడు .అప్పుడొక ఫ్రెంచ్ జెంటిల్మన్ బీథోవెన్ ను ఒక లాడ్జి లో చూశాడు .అతని ఆకారాన్ని ‘’A very ugly man ,visibly in bad temper ‘’అని వర్ణించాడు దిండ్ల ను తల మీద పెట్టుకొని ధ్వని చెవుల్లో ప్రవేశించ కుండా కూర్చున్నాడట .ఎలాంటి హీన స్తితిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంగీత సృష్టి కర్త ఉంటున్నాడో ఆయన చూసి కలత చెందాడు .చిన్న గది ,వెలుతురు లేదు .మురికి కూపం .దుమ్ము పేరుకు పోయింది గది అంతా .ఎక్కడ పడితే అక్కడ నాచు ,పుట్టగొడుగులు పెరిగి పోయి ఉన్నాయి .మంచం కింద నీళ్ళు నింపని కుండ ,రాత్రిళ్ళు తినేసి వదిలేసినఎంగిలిపల్లాలు కుర్చీ చుట్టూ ఉన్నాయి .ఇదంతా చూసి ఆ జెంటిల్మన్ విచలితుదయ్యాడు .
సంగీత వ్రుత్తి అంటే విసుగెత్తుకోచ్చింది బీథోవెన్ కి .పల్లెటూరికీ వెళ్ళలేక పోయాడు .ఫ్రెంచ్ ప్రభుత్వానికి ప్రజలంతా‘’క్రిప్ప్లింగ్ టాక్సులు’’ కట్టాల్సి వచ్చింది .ఒక ఏడాది గది చేసరికి పరిస్తితులు కొంత చక్క బడ్డాయి .చక్ర వర్తి కి ఉన్న 18 ఏళ్ళ కూతురు మేరీ లూసీ తొందర పడి ,అప్పటికే భార్య జోసేఫీన్ కు విడాకు లిచ్చేసిన నెపోలియన్ ను పెళ్ళాడింది .దానితో ఆస్ట్రియా ఫ్రెంచి దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది .
బీథోవెన్ తన అయిదవ పియానో కన్సేర్టో పూర్తి చేసి ,ఆర్చ్ డ్యూక్ రుడాల్ఫ్ కు అంకిత మిచ్చాడు .The harp string quartet మొదలైన అనేక పియానో సొనాటా లను ‘’ఫేర్ వెల్ ‘’ను చేశాడు .ఆర్చ్ డ్యూక్ దేశం వదిలి ప్రవాస జీవితం గడిపి మళ్ళీ 1810 జనవరిలో తిరిగి వచ్చాడు .అప్పుడే పైన చెప్పిన సంగీత కూర్పు అంతా చేశాడు బీథోవెన్ .
తాను రాసిన చాలా వాటిని ముద్రించాడు .ఇందులో కొత్త సిమ్ఫనీలు చాలా ఉన్నాయి .ఇంకో సెల్లో సొనాటా ,పియానో త్రయో సెట్లు కూడా చేశాడు .ఆయనకు నమ్మకమైన ముగ్గురు పాట్రాన్ లు బీథోవెన్ నుండి ఇంకా విలువైన వాటిని ఆశిస్తున్నారు .
అమర ప్రేయసి –ప్రేమికుడు
బీథోవెన్ కచేరీలపై పెట్రాన్ లకు నిరాశ గానే ఉంది .ఇంకా ఏదో చేయాలి అతను అని ఆదుర్దా గా ఉన్నారు .అప్పటికే బీథోవెన్ అలసి పోయాడు .డబ్బు పై చింత ఎక్కువైంది .ఇప్పటి నుండి దృష్టిని సంగీతం మీద కాక మిగిలిన విషయాల పై కేంద్రీకరించాల్సి వచ్చింది ఆయనకు .
1809 లో జెర్మనీ ప్రముఖ కవి రచయిత నాటక కర్త ‘’గోథే’’రాసిన Egmont ‘’కు సంగీతం చేయమని ఆహ్వానం వచ్చింది బీథోవెన్ కు .ఇదొక ఫ్లేమిష్ జెనరల్ కధ .దేశాన్ని రక్షిస్తూ యుద్ధం లో మరణించిన వీర జవాన్ గాధ. .కధ చాలా ఉదాత్త మైంది .తను చేయ తగినది కూడా .ఆ కధ తన జీవితానికీ వర్తిస్తుందని తలచాడు .అందుకే ఆనందం గా ‘’I wrote purely out of love for the poet Gothe ‘’అను కొన్నాడు .దీనికి మూజిక్ చెయ్యటానికి తనకేమీ డబ్బు ఇవ్వక్కర్లేదనీ చెప్పాడు .మొదటి ప్రదర్శన 15-6-1810 తర్వాత బీథోవెన్ కి ఇంకో సమస్య వచ్చిమీద పడింది . .తాను పియానో పీస్ రాసిన డాక్టర్ గారి మేన కోడలితో ప్రేమ లో పడ్డాడు .పాపం ఆమె తిరస్కరించింది .అప్పటికే ఈ సంగీత సామ్రాట్ కు 40 ఏళ్ళు వచ్చాయి .తాను వలచిన పెళ్ళి కూతురు దొరక లేదీ ముసలి పెళ్ళి కొడుక్కి .
1811 లో బీథోవెన్ డాక్టర్ Bohemian spa of tepliz లోని నీటిని త్రాగమని సలహా నిచ్చాడు .అలా చేస్తూ అక్కడే king Stefen ,The ruins of Aethens అనే రెండు నాటకాలకు సంగీతం చేశాడు .వియన్నా తిరిగి వచ్చి మరో రెండు సిమ్ఫనీలు no.7 –A -minor ,లో no.8 F.లో చేశాడు .ఈ రెండు ఒకదానికొకటి విభిన్నమైనవి .మొదటిది సంబరాల పండగ –Joyous celebration –in dance rhythms , -రెండోదిచిన్నది క్లాసికల్ మోల్డ్ లో చేసింది .ఎనిమిదో సింఫనీ పై పని చేస్తుండగా ,మళ్ళీ టేప్లేజ్ వెళ్ళి వచ్చాడు .అక్కడే గోథే ను కలిసి సంబర పడ్డాడు .బీథోవెన్ పరిస్తితికి ఆ మహా కవీ,రచయితా జాలి పడ్డాడు .’’I have never seen a more energetic or intense artist ‘’అని మెచ్చుకొన్నాడు .I understand very well how strange he must seem to the world ‘’అన్నాడు గోథే .6-7-1812 – బీథోవెన్ఒక అజ్ఞాత ప్రేయసికి అపూర్వ మైన ఒక ఉత్తరం రాశాడు .కాని దాన్ని పోస్ట్ చేయలేదు .దీన్ని’’ unfinished ,passionate declaration of love to an unknown woman whom Beethoven caalls ‘’the immortal beloved ‘’అన్నారు విశ్లేషకులు .ఇందులో ఆమెను చాలా కాలం నుండి ప్రేమించి ఆరాదిస్తున్నట్లు ,ఇద్దరు హాయిగా కలిసి కాపురం చేదామనే ఆలోచనా తెలియ జేశాడు .ఇంతకీ ఆ ఊహా ప్రేయసి ఎవరో ఎవరికీ ఇంత వరకు తెలియ లేదు .అయితేAtonie Brentasno అనే వియన్నాకు చెందినా అరిష్తో క్రాటిక్ లేడి అయి ఉండవచ్చు అని బీథోవెన్ జీవిత చరిత్ర కారులు ఊహించారు .ఆమె 1809-12మధ్య’’ ఫ్ఫ్రాంక్ ఫర్ట్ ‘’లోని ఒక బిజినెస్ మాన్ ని వివాహం చేసుకొన్న ఆవిడ గా భావించారు .ఆమెను బీథోవెన్ మళ్ళీ చూడనేలేక పోయాడు .తన ప్రసిద్ధ పియానో కాన్సేర్ట్ లలో ఒక దాన్ని Diabelli Variations పేరఆమెకు అంకిత మిచ్చి తన అమర ప్రేమను చాటుకొన్నాడు .అందుకే వీరిద్దరూ అమర ప్రేయసి ప్రేమికులు లేక అజ్ఞాన ప్రేయసి ,సంగీత విజ్ఞాన సింధువు అని పించుకొన్నారు .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-1-13-ఉయ్యూరు

