సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -9
1812 లో బీథోవెన్ కు మరిన్ని సంస్యలోచ్చి మీద పడ్డాయి .నెపోలియన్ రష్యా మీద దండ యాత్రకు వెళ్ళి దారుణం గా ఒడి పోయాడు అదే వాటర్ లూ యుద్ధం .తెప్లిజ్ ను వదిలి బీథోవెన్ లేన్జ్ కు చేరాడు .అక్కడ తమ్ముడు జోహాన్ అన్న చెప్పినా విన కుండా ఒకమ్మాయిని పెళ్ళాడాడు .ఆమె ఒక కొడుకును కని చని పోయింది .ఆమె తల్లి దగ్గర పిల్లాడిని ఉంచటం బీథోవెన్ కు ఇష్టం లేదు ..దీని పై న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది .డిప్రెషన్ కు లోనై హత్యా ప్రయత్నమూ చేశాడు .అప్పటికే వియన్నా జీవితం దుర్భరమైనది .డబ్బు విలువ పడి పోయింది .రాబడీ పెద్దగా లేదు .ప్రిన్స్ కిన్స్లీ ప్రమాదం లో మరణించాడు .ఒక్క రుడాల్ఫ్ మాత్రమె నమ్మక మైన సపోర్టర్ గా మిగిలాడు .కాస్పర్ కారల్ అనే తమ్ముడూ అన్న అభిమతానికి వ్యతి రేకం గా ఒకమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడు ..అతను అకస్మాత్తుగా చని పోయాడు .కొదుకును ,ఆస్తినీ బీథోవెన్ కు అప్పగించాడువాడు చెప్పిన మాట .వినే ఘటం కాదు .పెదనాన్న బీథోవెన్ ను చాలా ఇబ్బందులు పెట్టాడు .అయినా బీథోవెన్ అతన్ని అధిక ప్రేమతో చూసుకోన్నాడు.
1813 జూన్ ఇరవై ఒకటిన ‘’బాటిల్ ఆఫ్ విట్తోరియా ‘’లో స్పెయిన్ దేశానికి చెందినవెల్లింగ్టన్ నేపోలియన్ను ఓడించాడు .ఆ ఉత్సాహ సంరంభం కోసం బీథోవెన్ ‘’బాటిల్ ‘’అనే సింఫనీ ని కూర్చాడు .దీన్ని డిసెంబర్ లో వియన్నా యూని వేర్సిటి లో ‘’న్యూ సెవెంత్ సింఫనీ ‘’గా ప్రదర్శించాడు .జనం పరవశించి ఆనంద తాండవమేచేశారు . నాలుగు వేల ఫ్రాంకులు వచ్చాయి .ఉత్సాహ పడ్డాడు .ఆ డబ్బును యుద్ధం లో గాయ పడ్డ ఆస్ట్రియ సైన్యానికి విరాళం గా ఇచ్చి తన దేశ భక్తిని చాటుడు .
దీని తర్వాత ఎనిమిదవ సింఫనీ ఫిబ్రవరిలో చేశాడు .ఏడవ దానికి అంతగా పేరు రాలేదు 1814 ఏప్రిల్ లో మళ్ళీ పియానిస్ట్ గా స్టేజి ఎక్కాడు .ఆర్చ్ డ్యూక్ కోసరం .అది దారుణం గా విఫల మైంది .’’piano was badly out of tune ‘’అని పించింది .చెవుడు విపరీతమవ్వటం వల్ల బీథోవెన్ తాను వాయిన్చిన్దేమితో తానే వినలేక పోయాడు .అది తీగలు తెగెట్లు ఉంది.జనం జేజేలు పలికారు .
తన ఫిడేలియో ను సంస్కరించ మని .కోరారు .అలానే చేస్తే విజయ దుందుభిని మోగించింది’’it is now considered one of the finest operas ever written ‘’ అని పేరొంది అజరామరమైన కీర్తి సాధించి పెట్టింది .
1814 లో వియన్నా లో గ్రేట్ కాంగ్రెస్ జరిగింది .దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు .అంతా హంగామా గా ఉంది వాతా వరణం .లక్ష మంది సందర్శకులు వస్తారని అంచనా .అనేక మంది కవులు ,కళా కారులు ,రచయితలు రాజ కీయ ప్రముఖులు పాల్గొనే సమ్మేళనం అది .రష్యా సామ్రాజ్నికి బీథోవెన్ polanaisse ను అంకిత మివ్వటం తో కార్య క్రమాలు రంగ రంగ వైభవం గా ముగుస్తాయి .తమ వియన్నా కు చెందిన మహోత్కృష్ట సంగీత స్రష్ట బీథోవెన్ ను వారందరికి పరిచయం చేసి ధన్యమవాలని వియన్నా ఆకాంక్షించింది .
సశేషం
మీ–బ్బిట దుర్గా ప్రసాద్ –30-1-13-ఉయ్యూరు

