సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12 మహా మూజిక్

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12

                           మహా మూజిక్

   సంగీతాన్ని   హృదయాల్లోకి చొచ్చుకొని పోయే సంగీతం అందించాడు బీథోవెన్ .హేడెన్ ను మించి సంగీత రహస్యాలను ఆవిష్కరించాడని పొగిడారు .భౌతికం గా ఆయన లేకున్నా ఆయన విని పించిన సంగీతం ఇంకా సంగీత ప్రియులను ప్రభావితం చేస్తోంది ..ఆయనలోని ప్రతిభనంతా చుక్క మిగల్చ కుండా భావి తరాలకు సంగీత పెన్నిధి గా అందించాడు ..ఆయన ‘’Dressed in a jacket of some shaggy dark grey with trousers of the same material .The pitch black hair stood upon the head .His beard unshaven for several days ,blackened the lower part of his already dark complexened face .I also noticed at a glance ,as children often do ,that his ears were stuffed with cotton wool which seemed to have been dipped in some kind of yellow liquid’’అని బోహీమియన్ కంపోజర్ Vaclav Tomsek ఆయన రూపాన్ని అభి వర్ణించి బీథోవెన్ అమర సంగీతాన్ని మెచ్చుకొన్నాడు ..హృదయపు లోతుల్లోంచి వచ్చిన సంగీతం కనుక అంత చిర యశస్సు నార్జిన్చిన్దన్నాడు .మహా కవి వై.బి.యేట్సు రాసిన ఒక కవిత ని బీథోవెన్ రెండవ సింఫనీ లో వాడుకోన్నాడు .దేన్నీ ఎన్ను కోవాలో ఏది ప్రభావితం చేస్తుందో ఆయనకే తెలుసు .అదే ఆయన మేధస్సు .ఒక అలౌకిక స్వర్గాన్ని కనుల ముందు నిలుపుతాడు .ఒక అవ్యక్త మాధుర్యాన్ని అనుభవింప జేస్తాడు .అది వింటున్న సేపూ మనం ఒక రకమైన ట్రాన్స్ లో ఉండి పోతాం ..

             మహా రచయిత గోథేకు రాసిన ఉత్తరం లో బీథోవెన్ తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఆయన ప్రతిభను అభి నందించాడు ‘’I could see that I had only a romantic audience not an aristic one .I but from you Gothe ,I would not stand for this .You yourself must know how pleasant is it to be applauded by hands which one respects .if you donot recognize me and consider me as your equal who will?To what sort of a pace of rag muffians shall I turn for understanding ?’’అని తన మనో వేదనను తెలుపుకొన్నాడు .

                                        బీథోవెన్ ఆరాధన

          1902 నుండి బీథోవెన్ ఆరాధన ప్రారంభ మైంది .అప్పుడే బీథోవెన్ ప్రదర్శనను వియన్నాలో ఏర్పాటు చేశారు .max klinger అనే శిల్పి నిర్మించిన బీతోవెన్ పాల రాతి విగ్రహం ,దంత విగ్రహం ,విలువైన రాతి విగ్రహాలు ,బంగారు, కంచు విగ్రహాలను నెలకొల్పారు .అర్ధ నగ్నం గా క్లాసికల్ పోజ్ లోఒక సింహాసనం లో  కూర్చున్న భంగిమ లో శిల్పించారు దీనికి దేవ మాతల శిరస్సులు ఉండటం అయన దివ్యత్వానికి ప్రతీకలు ..gustav klimt అనే కళా కారుడు బీథోవెన్ సాధీంచిన అద్భుత విజయాల సారాన్ని ఒక ‘’ఫ్రీజ్ ‘’(కంబళి ) పై అత్యద్భుతం గా చిత్రించాడు .గుస్తేవ్ మాహ్లార్ అనేసంగీత కారుడు దీని ప్రారంభోత్సవ సమయం లో బీథోవెన్ తొమ్మిదవ సింఫనీ ని కొత్త తరహాలో మార్చి ,కూర్చి అదనపు బ్రాస్ బాండు లతో ,మాస్ కోరస్ తో నింపి నిండుదనం తెచ్చి ప్రదర్శించి స్వర నీరాజనం అందించాడు .

            రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రతి దేశంవారు  బీథోవెన్ ‘’మా వాడు అంటే మా వాడు’’ అని పోటీ పడ్డారు .రష్యా యుద్ధం తర్వాత’’ విప్లవ సంగీత సృష్టి కర్త’’ అని కూడా అని పించుకొన్నాడు .నాజీ జర్మని బీథోవెన్ ను గొప్ప జాతీయ కళా కారుడు అని హారతులు పట్టింది .హిట్లర్ మాత్రం అతని పై మక్కువేమీ ఎక్కువ గా చూప లేదు .హిట్లర్ కు రిచార్డ్ వాగ్నర్ సంగీతం  అంటే మక్కువ . ఇద్దరి అభిప్రాయాలు ఒకటే నంటాడు .జర్మని ఫ్రాన్స్ పై దాడి చేసినప్పుడు అయిదవ సింఫనీ లోని ప్రారంభ విషయమైన’’ v’’ అనే మార్సు కోడ్ ఫ్రాన్స్ ను నిలువరించే విజయానికి సంకేతం గా మారి పోయింది .బీథోవెన్ రచన ల పై విశ్లేషణా పెరిగి పోయింది .helligenstadt testament తర్వాతి దశాబ్దాన్ని బీథోవెన్ సాహస గాధా కాలం గా పరిగణించారు ..మిగిలినవి జనానికి ఆనలేదు .

         ఇరవై వ శతాబ్దం దాకా చివరి  అయిదు కష్టమైన స్ట్రింగ్ క్వార్టర్స్ అభి నందనలకు నోచు కోలేదు 1881 జూన్ లో జాన్ రస్కిన్ అనే ఆంగ్ల విమర్శకుడు బీథోవెన్ సంగీతాన్ని డబ్బాలో రాళ్ళు, రప్పలు, మేకులు, వేసి మోగించి నట్లు,ఇనప సుత్తి ని కింద పడేసి నట్లు ఉందనివిమర్శించాడు .అయితే ఈ శతాబ్దపు స్టీరియో మోత హడావిడి లో, కూడా బీథోవెన్ సంగీతానికి ప్రాచుర్యం ఏమీ తగ్గనే లేదు .ఆ తర్వాతి కంపోజర్ల పై ప్రభావం ఆకాశానికే హద్దు అని పించింది .1797-1828 మధ్య ఉన్న Schubert అనే సంగీత కారుడికి బీథోవెన్ మరణం కొంత వి చారకరం గా ,కొంత స్వేచ్చగ్తా అని పించింది .బీథోవెన్ సి మేజర్ లో చేసిన స్ట్రింగ్ క్వార్టర్ చాలా కాలం ఆయన ,జీవితానికి చెప్పిన వీడ్కోలు గా గుర్తుండిపోయింది .ఎక్కడ ఆయన వదిలేశాడో అక్కడి నుండి మళ్ళీ ప్రారంభించారు సంగీత కారులు .క్విన్తేట్ సి లో భాగం బీథోవెన్ చావు సమయం లోనిది .దీనినే Schubert తన జీవిత చరమాంకం లో 1828 లో చూశాడు .

         హెక్టార్ బెరలి యోజ్ అనే ఫ్రెంచ్ సంగీత కారుడికి బీథోవెన్ ‘’దేవత కంటే కొంచెం చిన్న వాడువిప్లవ భావానికి సాకారం ‘’(little short of adiety ,the incarnation of the spirit of revolution )‘’’అని పించాడు .  అయితే ఈయన సహచరుడు ‘’ఫెలిక్స్ మెండేల్ సన్’’ కు మాత్రం ‘’deeply rooted in the past ,that he faced both forward and backwards ‘’అని పించింది .1833-97  వాడిన జోహాన్నెస్ బ్రామ్స్ ,1824-96 .కు చెందిన అంతాన్ బ్రక్నర్ మాత్రం బీథోవెన్ ప్రభావం లో మునిగి పోయారు .బ్రామాస్ నలభై ఏళ్ళు వచ్చే దాకా మొదటి సింఫనీ నే చేయ లేక పోయాడు .’’you have no idea how difficult it can be –when such giant masters behind you ‘’అని తన అసమర్ధత ను ఒప్పుకొన్నాడు .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-2-13-ఉ

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.