ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర

  ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర

త్యాగయ్య- బాల(మురళి)య్య దర్సనం

 నవంబర్ నెలలో మా మేనకోడలు కళ ,భర్త చంద్ర శేఖర్ ఫోన్ చేసి ఫిబ్రవరి పద్నాలుగు న చెన్నై లో తమ కుమారుడు బాలాజీ ఉపనయనం చేస్తున్నామని మమ్మల్ని వచ్చి ఆశీర్వదించమని కోరారు .తప్పకుండా వస్తామని చెప్పాం .అప్పుడు ఒక ఆలోచన వచ్చింది .అక్కడి దాకా వెళ్తున్నాం కదా ఇదివరకు దాకా చూడని తంజావూరు , శ్రీ రంగ క్షేత్రాలను దర్శించాలనే కోరిక పెరిగింది .కనుక మూడు లేక నాలుగు రోజులు ముందుగా బయల్దేరి చెన్నై చేరి అక్కడి నుండి వీటిని చూసి ఉపనయనం సమయానికి మద్రాస్ వస్తే సరి పోతుందని భావించాం .మా రెండో అబ్బాయి శర్మ కు ఫోన్ చేసి ఫిబ్రవరి ఎనిమిది రాత్రికి విజయ వాడ నుండి మద్రాస్ కు పది హీను రాత్రి చెన్నై నుండి విజయ వాడకు రైల్ టికెట్స్ బుక్ చెయ్యమని చెప్పాం .వెంటనే వాడు ఆన్ లైన్ లో వెళ్ళేటప్పుడు హౌరా మెయిల్ కు వచ్చేటప్పుడు భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ కు బుక్ చేశాడు .

           ఈ విషయం మా మేనల్లుడు శ్రీనివాస్ కు చెప్పి మద్రాస్ నుండి తంజావూర్ వగైరా ట్రిప్ కు ఏర్పాట్లు చేయమని చెప్పాను  .వాడూ చంద్ర శేఖర్ మాట్లాడి ఫిబ్రవరి తొమ్మిది రాత్రికి చెన్నై నుండి త్రిచికి తమిళనాడుఆర్ టి.సి.బస్ కు టికెట్లు బుక్ చేహాడు తిరుగు ప్రయాణం తిరిచి నుంచి పన్నెండు రాత్రి బస్ కు మద్రాస్ కు బుక్ చేశాడు శ్రీనివాస్ .అన్నిటికి తిరిచి కేంద్రం అని అక్కడి నుండి చేరి ఒక వైపు తంజావూర్ పళని ఉన్నాయని కనుక హోటల్ రూమ్ బుక్ చేస్తున్నామని చెప్పి చంద్ర శేఖర్ రమ్యాస్స్ హోటల్స్ లో రూమ్ బుక్ చేశాడు మూడు రోజులకు ..మరి తిరిచి నుండి వెళ్ళీ ఏర్పాట్ల గురించి ఫోన్ లో  మాట్లాడితే బస్సుల్లో తిరగలేమని కార్ బుక్ చేసుకోవటం శ్రేయస్కరమని చెప్పాడు చంద్ర .సరే నన్నాం .హోటల్ వాళ్ళతో మాట్లాడి మైలేజి విషయాలు తెలుసుకొని ఆ మూడు రోజులకు కార్ కూడా బుక్ చేశాడు .

                కార్ లో ప్రయాణం చేసినా చెయ్యక పోయినా రోజుకు  275కిలో మీటర్లకు డబ్బు కట్టాల్సి వస్తుందని ఏ.సి.కార్ అయితే కిలో మీటర్ కు ఏడున్నర రూపాయలని డ్రైవర్ బీటా రోజుకు రెండు వందలని ఫోన్ లో తెలుసుకొని చెప్పాడు సరే నన్నాం .అయిదేళ్ళ క్రితం మేము మద్రాస్ నుంచి కన్యాకుమారి మదురై ,రామేశ్వరం కోడై కెనాల్ వగైరాలకు టూరిస్ట్ బస్ లో అయిదు రోజుల ప్రయాణానికి శ్రీనివాస్ ఏర్పాటు చేశాడు .అప్పుడు మదురైలో రోజూ నైట్ హాల్ట్ .బాగా చూశాం అన్నీ .అందుకనే వాళ్ళ సాయం తీసుకొన్నాం .ఇప్పుడు నైట్ హాల్ట్ తిరుచి .శనివారం రాత్రికి చెన్నై లో బస్ లో బయల్దేరి తరిచి చేరాం .తరిచి నుంచి తంజావూర్ వెళ్లి వస్తే నూట యాభై కిలో మీటర్ల కంటే మైలేజి రాదనీ తెలిసి చంద్ర శేఖర్ తన స్నేహితునికి ఫోన్ చేసి మైలేజి కవర్ అయ్యే ప్రదేశాలను తెలుసు కొని చేర్చాడు దాని వాళ్ళ అనుకో కుండా కుంభకోణం ,తిరువయ్యార్ లు మొదటి రోజు యాత్త్ర లో చేరాయి మొత్తం మైలేజి కవర్ చేసే ట్రిప్ జరిగింది నష్టం లేకుండా .ఎప్పటి కప్పుడు చంద్ర శేఖర్ ,శ్రీనివాస్ లు మా ప్రయాణం ఎంత వరకు జరిగింది అని తెలుసు కొంటు డ్రైవర్ తో మాట్లాడుతూ మానిటరింగ్ చేశారు ..

               రెండవ రోజు ట్రిప్ పళని.దీనికి రాను పోను మూడు వందల ఇరవై కిలో మీటర్లు వచ్చింది కనుక ఇబ్బంది లేదు .మూడో రోజు తిరిచి లోకల్ ,శ్రీ రంగం ట్రిప్ ..దీనికి మక్తాగా కారు కు పదహారు వందల యాభై .శ్రీరంగం చూడ టానికి ఎక్కువ సమయం పడుతుంది ..రాక ఫోర్ట్ ఎక్కలేము .కనుక సరి పెట్టుకొని ఉదయం నుండి నాన్ స్టాప్ గా ఎనిమిది గంటలు ప్రయాణం చేశాం ..ఇలా ఈ ప్రయాణాన్ని విజయ వంతం చేయటానికి బావా బావ మరదులైన చంద్ర శేఖర్ ,శ్రీనివాస్ లు అభి నందనీయులు .ఎక్కడా ఏ అసౌకర్యం కలగా కుండా అన్ని ఏర్పాట్లు చేయటం మానిటరింగ్ చేయటం గొప్ప విషయం ..

           చంద్ర శేఖర్ వాళ్ళది తెలుగు కుటుంబమే.తర తరాలుగా వారు తమిళ నాడు లో ఉన్నారు .కనుక తెలుగు కొంత యాస తో మాట్లాడుతారు .ఇళ్ళల్లో తెలుగు తమిళం మాట్లాడు కొంటారు .మనం మాట్లాడితే అర్ధమవుతుంది .తెలుగు మాత్రం చదవ లేరు .వాళ్ళు మాట్లాడినా విషయం తెలుస్తుంది .తెలుగును మర్చి పోకుండా కాపాడు కొంటున్నారు .సంప్రదాయాన్ని జాగ్రత్త గా కాపాడుకొంతున్నారు .చంద్ర శేఖర్ తండ్రి గొప్ప నిష్టా పరులు .కళ పెళ్లి అయిన కొత్తలో చూశాం ..ఆయన చని పోయి చాలా ఏళ్ళయింది ‘’శేఖర్ ‘’అని ఇతన్ని వాళ్ళ బంధు గణం ఆప్యాయం గా పిలుస్తారు .తల్లి కి ఒక అ క్క ముగ్గురు చెల్లెళ్ళు ,నలుగురు సోదరులు వారి సంతానం అంతా మద్రాస్ చుట్టూ ప్రక్కలే ఉంటున్నారు .వీళ్ళ ఇంట్లో ఇదే మొదటి శుభ కార్యం .అందుకని అందరు ఆత్మీయం గా వచ్చి పాల్గొని ఈ దంపతులకు వటువుకు నూత్న వస్త్రాలు తెచ్చిఅభిమానం చాటుకొన్నారు ..వీళ్ళు అంతే గౌరవం గా వాళ్ళను చూసుకొన్నారు .చంద్ర శేఖర్ అక్కయ్య మద్రాస్ లోనే ఉంటుంది .ఆమె నడుం కట్టి అందర్నీ కలుపు కొంటు కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నిర్వ హించింది ఆవిడ మమ్మల్నిద్దర్నీ ‘’మామా ,అత్తా ‘’అని ఆప్యాయం గా పలకరిస్తూ ,పెద్దరికం ఇస్తూ చూసింది .ముసలి, ముతకా అందరు చేత నయి నంత పని చేసి కళదంపతులకు సహకరించారు .ఉపనయనం రోజు న బాలాజీ మేన మామ శ్రీనివాస్ అనేక రకాలైన స్వీట్లు పెద్ద సైజు చక్కిలాలు సెనగ పప్పు బెల్లంతో చేసిన గోపురాలు ,ఇంకా చాలా రకాలు చేయించి అగ్ని హోత్రం ముందు పెట్టటం వాళ్ళ సంప్రదాయం .అలానే చేస్శాడు శీను .వాళ్ళ సంప్రదాయం ప్రకారం వటువు కు వేసే భిక్ష పురోహ్హితుడికే చెందు తుందని కనుక భిక్ష తగ్గించి వేయ మని ,ఇవ్వాలను కొన్నది కానుక గా బాలాజీకి ఇవ్వమని కళ అత్తా గారు ఆడ పడుచు మా బోటి వారికి ముందే తెలిపారు అలానే చేశాం .కళ చిన్న తాత గారైన శంకరం గారి కుమారుని ఫామిలి కూడా వొడుగు కు వచ్చి మా బావ తరుఫు వారు కూడా వచ్చి నట్లని పించారు .నిన్న రాత్రి చెన్నై లో బయల్దేరి ఈ ఉదయం ఉయ్యూరు చేరుకొన్నాం .”అష్ట దిన యాత్ర సర్వం సంపూర్ణం” .

 

ఈ రకం గా మాకు ఆ కుటుంబం వారితో మంచి పరిచయమూ కలిగింది .ఉపనయనం లో అందర్నీ చూసే అవకాశం కలిగింది .ఎనిమిది రోజుల మా మినీ యాత్ర సఫలమయింది .చివరగా మేమెంతో కాలం నుండి ఎదురు చూసిన పద్మ విభూషణ్ ,వాగ్గేయ కారులు శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి దర్శనం తో మా యాత్ర మరీ నిండుదనాన్ని సంత రించు కొంది ..

మా వివాహం అయినప్పుడు ‘’హనీ మూన్అంటే మధు చంద్ర యాత్ర’’ ‘ అనే మాట మా కుటుంబాలలో విన్నది తక్కువ .ఇప్పుడు ఆ లోటు పూర్తీ అవటానికి ఈ ‘’అనుభవ పూర్వక చిన్న దేవాలయ యాత్ర ‘’(దీనినే నేను టెంపుల్ హనీమూన్ అన్నాను సరదాగా )చేసి నట్లు అని పించింది .

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-2-13-ఉయ్యూరు –.

 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు, ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర and tagged . Bookmark the permalink.

1 Response to ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర

  1. Raamudu's avatar Raamudu says:

    Guruvu gaaru, upanayana utsavam kanulapanduvugaa undi. Mee vrata gurinchi nenu vere cheppakkaraledu. Adhbutham.

    Like

Leave a reply to Raamudu Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.