డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’

డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’

            తెలుగు లో అతి వ్యాప్త మవు తున్నపరభాషా సీరియల్స్ పై ఇప్పుడు అన్ని వైపులా నుండి డాడి ఎక్కువైంది .వ్యతిరేకత లో  కొంత నిజం ఉంది .కొంతఅతిశయోక్తి  ఉంది .రెండిటిని బేరీజు వేసుకొని నిర్ణయానికి రావాల్సి ఉంది .తొందర పడటం ఉభయ భ్రస్టుత్వమేమో ఆలోచించాలి .  చానెళ్ళ ప్రారంభం రోజుల్లో డబ్బింగ్ సీరియల్ల్లే అందరికి గతి ..క్రమం గా స్వంత భాషలో సీరియల్లు తీయటం ప్రారంభించి కొద్దికాలం లోనే  అద్భుతాలు తీసి మెప్పు పొందారు ఇప్పుడు డబ్బింగ్ అవసరం లేనే లేదు అన్ని చానల్లు బలిసి ఉన్నాయి స్వంత కధకులు స్వంత డైలాగు రచయితలు టెక్నీషియన్ల తో విజ్రుమ్భించే స్తితి లో ఉన్నాయి .కనుక డబ్బింగ్ జోలికి పోవాల్సిన పనే లేదు .మా టి.వి.లాంటివి మొదట్లో డబ్బింగ్ జానకిల్లా ప్రారంభించినా క్రమం గా ‘’రాధ –మధు ‘’లాంటి మహత్తర సేరియాల్ తీసి మళ్ళీ మళ్ళీ చూసేట్లు చేశారు .అదొక మధుర అను భూతి గా ఉండి పోయింది దూర దర్శన్ తీరే వేరు .మొదట్లో తడ బడినా హాస్యం తో సీరియల్లు నిర్మించి తెలుగుదనానికి పరిమళాలు అద్దింది .తెలుగు సాహిత్యాన్ని అద్భుతం గా పోషించింది .సంస్కృతికి నిలయమైంది.కధలకు ప్రాణం పోసింది .సంగీతానికి నాట్యానికి చేరువైంది .కాలాలకు అంకిత మైంది .ప్రతిభను వెలికి తెచ్చింది . అసలు సిసలు తెలుగు వారి చానెల్ గా సెహభాష్ అని పించుకోంది.ఈ టీవి కూడా తనదైన ముద్ర తో వెలుగు లీనుతోంది .జెమిని లాంటివి పరభాషా యజామాన్యం లో ఉండటం వల్ల వాళ్ళ సీరియల్లు దిగుమతి రేటు విపరీతమైనది ఇది ఆరోగ్యకర మైన్దేమీ కాదు అయినా అదే మూసలో పోతున్నారు అందుకే వెగటు వాసన ఎక్కువైంది .

          ఇప్పుడు అన్నీ కుదుటపడ్డ మా టి.వి.వాళ్ళు అసలు సిసలు తెలుగు సీరియల్లు తీయటం మానేసి డబ్బింగ్ మోజులో పడి పోయారు .లయ వంటి మానవీయ కోణపు సీరియల్ తీసిన వాళ్ళు ఇప్పుడు సాయంత్రాల్లో వచ్చే వన్నీ డబ్బింగ్ సీరియళ్ళ మయం చేసి భయం పుట్టిస్తున్నారు .అందుకే వీళ్ళను చూసే ఆర్టిస్తులందరూ గోల చేస్తున్నారేమో నని పిస్తోంది .ఇది ముమ్మాటికి పచ్చి నిజం .చంద్ర శేఖర ఆజాద్ లాంటి గొప్ప కధకుడు డైలాగ్ రైటరు ఉన్న చానల్ ఇప్పుడు డబ్బింగ్ వాసన్ ల తో ముక్కు మూసుకోనేలా చేయటం దారుణం దీనికి కారణం నిబద్ధత లేని యాజమాన్యమే ..భాగ స్వాములేక్కువై ఒకరి మటకొకరు విలువ నివ్వటం లేక పోవటం వల్లపట్టిన పీడ అని పిస్తోంది .

            అయితే డబ్బింగ్ సీరియల్లు అనగానే భయ పడాల్సినది లేదు .’మా టి.వి.లో వచ్చే ‘’చిన్నారి పెళ్లి కూతురు ‘’ఒక క్లాసిక్ .ఎందరు మహా నటులో అందులో తమ పాత్రలకు జీవం పోస్తున్నారు డబ్బింగ్ అని పించదు డైరెక్ట్ టేకింగ్ సీరియల్ అనే అని పిస్తుంది నీతి, సామాజిక బాధ్యత ,కుటుంబ గౌరవం ఆచారాలు విలువల పట్ల మమకారం పెద్దల యెడ గౌరవం ఒక వేళ ఏ పాత్ర చిన్న తప్పు చేసినా మళ్ళీ దారిలో పడటం ,సామాజిక బాధ్యత ,పండుగలు పబ్బాలు సాంప్రదాయాలు ,వీటి పోషణా గొప్ప గా ఉన్నాయి అందర్నీ గ్రిప్ లో పెట్టుకోవాలన్న పెద్దవిడకల్యాణి ఆ పాత్రకు జీవం పోస్తున్న నటీ మణిహావ భావాలు మరిచి పోదా మన్నా మరువ లేము .అలాగే ఆనందీ చిన్నతనాన్ని తీర్చి దిద్దిన వైనం మనసుకు హత్తుకుంటుంది .అందరూ అందరే .ఎవరూ వేరొకరికి తీసిపోరు .ఈ సీరియల్ ను ఎవరూ ఎత్తేయ మని చెప్పరు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను దీనికి ముందు రోజు వచ్చే సీరియల్లు మాత్రం నిజం గా ద్వేషించ తగినవే అనుమానం లేదు .అలాగే ఎన్ని సార్లు వేస్తారు శివుడి మీద డబ్బింగు సీరియల్లు ?ఎన్ని సార్లు బాలహనుమాన్ వేస్తారు ?దేనికైనా హద్దు ఉండాలి .

           వీటి అన్నిటి కంటే మహా దారుణ మైన విషయం ఒకటి ఉంది .దాన్ని గురించి ఎవరూ మాట్లాడటం లేదు .అదే –చానల్ నడిపే వారి కొడుకుల ,మనవళ్ళ ,తమ్ముళ్ళ సిని మాలు పదే పదే చూపించి పరమ బోర్ కొట్టించటం .దీనికి చెక్ పెట్టె నాధుడే కనీ పించటం లేదు ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి .వాటి జోలికి వెళ్లరు .’’పాడిందే పట పాచి పళ్ళ దాసరి’’ అనే తత్త్వం పోవాలి .లేక పోతే కంపు, అసహ్యమూను . ఈ దౌర్భాగ్యం ఎంతకాలం ?దీని నుండి ముందు బయట పడాలి అప్పుడే నిజమైన తెలుగు వెలుగు .జీ టి.వి.కూడా హిందీ జనం చేతుల్లో ఉంది కాని కొన్ని మంచి హాస్యపు సీరియల్స్ తీసి జనానికి గొప్ప రిలీఫ్ కల్గించారు జెమిని వారి ‘’అమృతం ‘’ఒక రకం గా ‘’మాయా బజార్ ‘’అంతటి మహత్తర మైనది .ఎన్ని సార్లు ఏ అర్ధరాత్రి వేసినా చూసి కడుపుబ్బా నవ్వుతారు .తెలుగుదనం నిండి ఉన్న సీరియల్ ఇది .దూరదర్శన్ లో ‘’పూత  రేకులు ‘’అంతే కాని ఈ మధ్య కొత్తవి తీయకుండా పాతవాటినే బాదేస్తున్నారు .ఇది న్యాయం కాదు ..ఖుషీ ఖుషీ గా నవ్వుతు ను రాజ బాబు తమ్ముడు బానే నిర్వహిస్తున్నాడు . ఆనందో బ్రహ్మ లాంటివి ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూసి ఆనందిన్చేవే ..జెమిని కామెడి కేవ్వుకేక పెట్టిస్తోంది .మిగిలిన చానెళ్ళలో ఎక్కువ వార్తలకే పరిమితం .

        కనుక తెలుగు లో ప్రతిభకు కొదవలేదు సోమ్ములకు కొదువలేదు టేక్నీషియన్లందరూ అసమాన ప్రతిభా వంతులే మన ఆర్టిస్టులు ఏ పాత్రనైనా అవలీల గా చేసి మెప్పించే వారే .సంగీత కర్తలకు, చాయా గ్రహణానికి పెట్టింది పేరు మనం .దర్శక ప్రతిభ అద్వితీయం .గాయకుల నిలయం ఆంద్ర దేశం జానపదాన్ని నెత్తిన పెట్టు కొంటోంది మా టి.వి.. పాడుతా తీయగా ,స్వర సమరం ,సూపర్ సింగర్స్ విపరీతమైన క్రేజ్ ను పెంచాయి సమర్ధులైన గాయకులకే పారితోషకాలు లభించాయి న్యాయ నిర్నేతలేమీ తక్కువ తిన లేదు .వారి సమర్ధత పై అనుమానాలు లేవు .డాన్సు పోటీలు చాలా భాగం ఆరోగ్య వంతం గానే నడుస్తున్నాయి . ఇన్ని ఉన్నా మనం డబ్బింగ్ మీద ఆధార పడటం వాంచనీయం కాదు .స్వంత కాళ్ళ పైన నిల బడాల్సిందే .స్వంత ఆర్టిస్టులకు న్యాయం కలిగించాల్సిందే .ఇదే సమయం లో ‘’చిన్నారి పెళ్లి కూతురు ‘’లాంటి వాటిని ఆదరించాల్సిందే .ఆర్టిస్టుల న్యాయమైన కోరికలను అందరుకూర్చుని అందరికి అనుకూల మైన పరిష్కారం సాధించుకోవాలి .ద్వేషం కంటే సాను భూతి ,సమర్ధత కు పెద్ద పట వేస్తె ఎవరికి ఇబ్బంది ఉండరాదు .కొద్ది రోజుల్లో మంచి పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం .

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-5-13- ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.