మేధావి శాస్త్ర వేత్త-ఆల్డస్ హక్స్లీ
హక్స్లీ సోదరులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారు .ఇద్ద్దరూ సాహితీ మేరువులే .ఆల్డస్ హక్స్లీ జీవితాంతం ఆలోచించిన సమస్య ‘’అధిక జనాభా .’’దాన్ని నియంత్రించటం పై ఎంతో రాసి జనాన్ని ప్రభావితం చేశాడు .దీనిపై ఎన్నో ప్రసంగాలు చేశాడు సినిమాలకు స్క్రిప్ట్ లు రాశాడు .ఆ సమస్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి చెప్పాడు .ఆయన దృష్టిలో అధిక జనాభా సమస్య జనాభా పెరుగుదల మాత్రమె కాదని అల్ప జ్ఞానుల సంఖ్యా పెరిగి పోతోందని బాధ .ఆయనకు ‘’యూజేనిక్స్ ‘’చాలా ఇష్టమైన విషయం .ఆరోగ్యకరమైన ఉత్తమ జాతిని మనకు కావాల్సిన రీతి లో తయారు చేసుకోవటం చాలా అవసరం అని చెప్పాడు .ఇది మేధావి తనం పెంచుకోవటానికీ తోడ్పడుతుందని వివరించాడు .అందుకే ఆయనకు బ్రిటిష్ యూజేనిక్ సొసైటీ లో సభ్యత్వం లభించింది .
ఈయన తండ్రి హెన్రి హక్స్లీ .తల్లి జూలియా .తండ్రి డార్విన్ సిద్ధాంతాన్ని బాగా నమ్మిన కుటుంబం వాడు .తల్లి తాత డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ అనే ఆంగ్ల విద్యా వేత్త ,చరిత్ర వేత్త .ఈయనే ఇంగ్లాండ్ లోని రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ .చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన ‘’తల వంచని వీరుడు ‘’ అని పించుకొన్నాడు రగ్బీ స్కూల్అనే బ్రిటిష్ పబ్లిక్ స్కూల్ ఈ సంస్థ ఇంగ్లాండ్ లోని విద్య పై ఎంతో గొప్ప ప్రభావం కలిగించి చారిత్రాత్మకం గా నిలిచింది .మనదేశం లో ఎవరైనా గొప్ప హెడ్ మాస్టర్ ఉంటె ‘’ఈయన రగ్బీ ఆర్నోల్డ్’’అనే వారు . దాన్ని ఆదర్శ పాఠ శాల గా తీర్చి దిద్దిన ఘన చరిత్ర ఆర్నోల్డ్ ది .ఆర్నోల్డ్ గారి అబ్బాయి మాధ్యూ ఆర్నోల్డ్ గొప్ప కవి విమర్శకుడు .
ఆల్డస్ హక్స్లీ 1894 జూలై 26 న జన్మించాడు .16 ఏళ్ళ వయసులో ‘’keratitis punctara ‘’అనే కంటి జబ్బు వచ్చి కళ్ళు కనిపించకుండా పోయాయి .’’బ్రెయిలీ లిపి ‘’ని అలవాటు చేసుకొని ఎక్సేలేన్సి సాధించాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో ఉండేవాడు .డి.హెచ్.లారెన్స్ ,టి.ఎస్.ఇలియట్ ,వర్జీనియా ఉల్ఫ్ వంటి రచయితలతో పరిచయమేర్పడింది .వేగం పైన వ్యాసం రాస్తూ ‘’ది ఓన్లీ న్యూ సెన్సేషన్ దిస్ రేచెద్ సెంచరి హస్ ప్రోద్యూసేడ్ ‘’అంటాడు .1931 లో ‘’the world of light ‘’నాటిక రాశాడు .1938 లో గ్రేటా గార్బ్ ,జిడ్డు కృష్ణ మూర్తి మొదలైన తత్వ వేత్తలు పరిచయమయ్యారు .1942 లో ‘’art of seeing ‘’రాశాడు
అనితా లూస్ అనే సినీ ప్రొడ్యూసర్ తన సినిమాలకు స్క్రిప్ట్ రాయమని కోరితే తిరస్కరించాడు .కారణం ఏమిటి అని ఆమె అడిగితే ‘’because it pays 25,000 dolars a week –I simply can not accept all that money to work in a pleasant studio ,while my family and friends are starving and being bombed in England ‘’అని ఖచ్చితం గా చెప్పిన వాడు హక్స్లీ .చివరికి భార్య ఒప్పిస్తే అప్పుడు సినిమాకు స్క్రిప్ట్ రాశాడు .భార్యకు కేన్సర్ వచ్చింది ఆ విషయం భర్తకు చెప్ప వద్దని ఆయనకు తెలిస్తే రాస్తున్న స్క్రిప్ట్ పని మధ్యలో ఆపెస్తాడని డాక్టర్లను వేడుకొంది .ఆయన రాసిన సినిమాలు -Alice in wonderland ,pride and prejudice ,brave new world ,jane Eyre ,prelude to fame .
1958 లో ‘’brave new world ‘’నవల రాశాడు .1959 లో ‘’the human situation ‘’అనే అంశం మీద చాలా చోట్ల ఉపన్యాసాలిచ్చాడు .విధి వక్రించింది 1961 లో ఇల్లు అంతా తగల బడి పుస్తకాలు ,స్క్రిప్టు అన్నీ ధ్వంసమై పోయాయి .దీని పై స్పందిస్తూ తాత్వికం గా ‘’I am evidently intended to learn ,a little advance of the final denundation that you cannot take it with you ‘’అన్నాడునవ్వుతూ .1963 నవంబర్ 23 న కేన్సర్ వ్యాధి తో ప్రెసిడెంట్ కేన్నేడి అమెరికా లో హత్య జరిగిన సాయంత్రమే ఆల్డస్ హక్స్లీ మరణించాడు
ఆయన దృష్టిలో బాహ్య ఇంద్రియాలకు అన్నీ తెలియవని అవి తెలుసుకో లేవని ,ఆధ్యాత్మిక జీవితం అవసరమని ,ఈ విశ్వం అనంతమని దాని రహస్య శోధనకు అంతరంగమే సాక్షీ భూతమని నమ్మాడు .గుడ్డి తనం తో జీవితాంతం బాధ పడుతూ ఎంతో సాహితీ సేవ చేశాడు .తన మరణం ఆసన్న మవుతోందనే విషయం ఆయనకు ముందే తెలుసు .దీనికి కంగారు పడలేదు .తన పని తాను చేసుకొని పోతూనే ఉన్నాడు .ఆయన్ను ‘’distinguished artist ,the bold thinker and un obtrusive hero (అనుకోని నాయకుడు )‘’అంటారు .
హక్స్లీ సూక్తులు కొన్న సార్వ కాలీనాలు –విజ్ఞానం మంచిది .అమాయకత్వం చెద్డది .శాస్త్రీయ అభివృద్ధి మానవ జీవితాలను సుఖమయం చేస్తుంది .దేవుడిని సైన్సు దృష్టితో యంతాలతో ,మేధస్సు తో చూడ లేవు హృదయం ద్వారా నే తెలియ బడతాడు .భగవంతుడు నీకు సుఖాన్ని కలిగిస్తాడని అనుకోకు .నీ చాయిస్ నువ్వు తీసుకో .సైన్సు పెరిగి నంత మాత్రం వల్లవ్యక్తీ లోనిమంచి గుణాలు పెరుగుతాయనేమీ లేదు .మన నాగరకత యాన్త్రికతను ,మందులను సుఖాల్ని ఎంచు కొంది అందుకే నా పుస్తకాల నన్నిటిని గదిలో పెట్టి తాళం వేశాను సైన్సుఆధిక్యత వల్ల వ్యక్తీ గా మానవుని పై చెడు ప్రభావమే చూపుతోంది .డ్రగ్స్ కు విపరీతమైన మందుల వాడకానికి చెక్ పెట్టాలని ఆనాడే నెత్తీ నోరు మొత్తుకొన్నాడు .
ఆల్డస్ హక్స్లీ గొప్ప ఆలోచనా పరుడు ,తత్వ వేత్త ,శాస్త్రజ్ఞుడు భగవదన్వేషకుడు
11-8-2002 డైరీ లోని విషయాలు మీకోసం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -3-5-13 ఉయ్యూరు


