ఆమెరికా ఆత్మ వాల్ట్ విట్మన్ కవి
అతి తక్కువ స్తాయిలో జీవితం ప్రారంభించి , గొప్ప జర్న లిస్టు గా మారి ,అమెరికా ఆత్మా ను ”లీవ్స్ ఆఫ్ గ్రాస్ ”కవితా సంపుటిలో ప్రదర్శించిన గొప్ప కవి వాల్ట్ విట్మన్ . అతని జీవితం లో ప్రతి ఘట్టం అతన్ని గొప్ప కవి గా చేయటానికి తోడ్పడింది . చివరి జీవితం అత్యంత దుర్భరం గా గడపాల్సి వచ్చింది . ఎమర్సన్ , మెల్ విల్లీ మహా రచయితలూ మెచ్చిన కవి విట్మన్ . మానవత్వం మూర్తీభవించిన మహా కవి .యెన్నొ దేశాలకు ఆదర్స్ద ప్రాయమైన కవి . ఒక వడ్రంగి కొడుకు అమెరికన్ కవిత్వానికి ఆత్యంత వైభవోపేతమైన మెరుగులు పెట్టి తీర్చి దిద్దటం ఆశ్చర్యమేస్తుంది ఽప్పతిదాకా అమెరికా కవిత్వం అంటే ఇంగ్లాడ్ కవిత్వానికి నకలు గా ఉండేది అమెరికా మనుసుల ,మనుషుల మనో భావాలకు స్తానం ఉండేది కాదు .ఇక్కది తాడిత ,పీడిత జనం గురించి ,ప్రక్రుతి గురించి వస్తువు గా తీసుకొని రాసి అమెరికా యొక్క గ్రేటెస్ట్ పోయేట్ అని పించుకొన్నాడు శ్రీ శ్రీ లాంటి వారికి ప్రేరణ నిచ్చాడు . అమెరికా లోని న్యు యార్క్ లో31-5-1819 లో జన్మించాడు . 73ఏళ్ళు జీవించి 26-3-1892 లో న్యుజెర్సి లోని కాండెన్ లో మరణించాడు .
అమెరికా సివిల్ వార్ లో నర్స్ గా పని చేశాడు . తన లీస్ ఆఫ్ గ్రస్స్ కవితా సంకలాన్ని స్వంత ఖర్చులతో ముద్రించాడు . ఇది అమెరికన్ ఎపిక్ అని సామాన్య మానవుడి చిత్రణ ఉందని మెచ్చుకొన్నారు అతని ఆల్బం ఉంది ,పాటల సంకలనానికి సాంగ్ ఆఫ్ అమెరికా ఫ్రమ్ గాడ్ అని పేరు పెట్టాడు అతని సోదరులందరికి అమెరికా ప్రేసిదేన్ట్లైన వాషింగ్టన్ విట్మన్ ,జఫర్సన్ విట్మన్ పేర్లను గౌరవం గా
తండ్రిఆరుగురు సంతానం లో రెండవ వాడు విట్మన్ . తండ్రి ఇల్లు కట్టి అమ్మేస్తూ చాలా నష్టపోయాడు . చిన్న తమ్ముడు మెంటల్ .పెద్దన్న తీవ్ర స్వభావం కల వాడు మెంటల్ హాస్పిటల్ లో చేర్పిస్తే అక్కడే చని పోయాడు . మూడవ వాడు గొంతులో క్షయ తో మరణించాడు . భార్య ”ప్రాస్టిట్యూట్ ”గా మారింది . సోదరి ”హైపో కాన్ద్రియా ”తో బాధ పడింది . చిన్న తమ్ముడికి డిప్రెషన్ . ఇంట దుర్భర పరిస్తితుల నేపధ్యం లో విట్మన్ పెరిగాడు జీవించాడు .వీతినన్నితిని తట్టుకొని మహోన్నత మానవతా వాడి గా మారి మహోన్నత కవిత్వాన్ని రాశాడు అమెరికా ఆత్మను నిజం గా ఆవిష్కరించిన కవి విట్మన్ .
విట్మ ”సెల్ఫ్ క్రిటికల్ ఆర్టిస్ట్ ”అంటారు . ఆయన జీవితం కవిత్వం ఒక దానితో ఒకటి పెనవేసుకు పోయాయి . అమెరికా లో అమలు జరుగుతున్నా నీగ్రో బానిసత్వాన్ని పూర్తిగా వ్యతి రేకించాడు . ప్రజా స్వామ్యం పై అమిత విశ్వాసం . అమెరికా రాజకీయాలను తన కవితా దృక్పధం ద్వారా ప్రభావితం చేసిన ఆదర్శ కవి మార్గ దర్శి విట్మన్ . ”prudence (cautious )is the right arm of independence ”అని భావించాడు . అమెరికా అంటా తిరిగి ప్రజల విభిన్న జీవన పరిస్తితులను అధ్యయనం చేశాడు .వారి దుర్భర జీవితాలను కళ్ళతో చూసి స్పందించాడు వారి ఉన్నతికి కృషి చేయమని కవితల్లో ఉద్బోధించాడు ప్రభుత్వాలకు .వాల్లె దేశాన్ని మోసే బోయీలన్నాడు . ఎన్నో పత్రికలకు ఎడిటర్ గా పని చేశాడు . బ్రూక్లిన్ ,న్యు యార్క్ లలో పత్రికలకు పని చేశాడు . అతన్ని ”common man incarnate ,collossal human figure ”గా కీర్తిస్తారు మానవత్వానికి ఎత్తిన పతాక విట్మన్ .
వాల్ట్ విట్మన్ తన కవిత్వం లో ఎవరి కొటేషన్లు ఉండ రాదనీ ,అత్యద్భుత మైన పద్యాలను రాయాలని నేటివ్ కవిత్వానికి స్తానం ఇవ్వాలని తీర్మానించుకొని అలానే చేసి చూపించాడు . ”a mighty pain to love it is -and yet a pain that love to miss -but of all pain ,the greatest pain -it is to love but love in vain ”అనే కవితా పంక్తుల్ని ఎప్పుడూ మననం చేస్తూండే వాడు . తన కవిత్వానికి ”song of my self ”అని పేరు పెట్టు కొన్నాడు .
”my voice goes after what my eyes cannot reach -with the twirl of my tongue i encompass worlds and volumes of words -”అని ఎవరూ చూడనివి ఎవరూ రాయనివి తనకవిత్వం లో చూపించాడు .
6-9-2002 శుక్రవారం అమెరికా డైరీ నుండి
–మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-13- కాంప్–హైదరాబాద్

