” సాహసం” శాయ (కు )రా

”  సాహసం” శాయ (కు )రా 
             చెవుల్లో సీసం పోసుకొని చెవులపై కాబేజీ పూలేట్టుకొని ,కళ్ళకు గంత లు కట్టుకొని ,వివేకానికి ,విచక్షణకు ఇనప తెర వేసుకొని  గుండె,ఊపిరి  బిగ పట్టుకొని ,డబ్బు పొతే పోయిందని ”సాహసం” చేసి చూడాల్సిన సినిమా సాహసం . తాప్సీఆరబోసిన ”టాప్”  అందాలు ,లడక్  ప్రాంతపు  ఎత్తుపల్లాలు శక్తి కపూర్ సమర్ధ  వంతమైన నటనా” ,శ్రీ ”ఇచ్చిన అవసరమైన నేపద్ధ్యస్సంగీతం ,పెర్సనాలిటి  పెద్దగా లేకున్నా పావు గంటకొక పాతిక మందిని చావ గొట్టే గోపీ సాహస చాతుర్య  నటనా ,రాసుకొన్న స్క్రీన్ ప్లే ని అత్యంత సమర్ధ వంతం గా ఆసాంతం నడిపిన దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి ప్రతిభ కు ,తీసిన సాహసానికి హాట్స్ ఆఫ్ .  
               పాపం చాలా రోజులకుమంచి నటుడు  ”నారాయణ రావు ”ను చిన్న పాత్రలో నైనా చూపించి నందుకు నాకు మహదానందం గా ఉంది .సుమన్ కనీ పించీ కనీ పించకుండానే కధను నడిపిస్తాడు .గోపీ చాంద్ ”పోకిరి ”మహేష్ బాబు లా మంచి ఈజ్ తో ,పోజ్ తో పరి గేత్తాడు  .పురాతన పరిశోధకప్రొఫెసర్  పాత్ర వేసిన ఆయన నిజం గానే పాత్రలో జీవించాడు . ఆలీ హాస్యం పండకుండా ,మధ్యలోనేపాకిస్తాన్ ఎడారి లో  ఎండి, కను మరుగైంది పాపం . సినిమాలో గోపీ చంద్  ఒక నీతి ని పదే   పదే  వల్లిస్తాడు అది ”నాది కానిది కోటి రూపాయలైనా నాకు అక్కర్లేదు .  నాది అయింది  అర్ధ రూపాయైనా నేను వదిలి పెట్టను ”ఇది ముఖ్య సూత్రం గా కద నడుస్తుంది  .ఇది గొప్ప ఆదర్శమే .దొరికిన నిధి పాకిస్తాన్ కు అప్పగించి తన తాత వజ్రాలను మాత్రమె తీసుకొని ఇండియా కు  చేరుకొంటాడు పెషావర్ నుండి హీరో,హీరోయిన్ తో .  . గుర్రాల చేసింగ్ ,కార్ల రాలీయింగ్ ,క్షణ క్షణం భీభత్సం  గా నే ఉంటుంది.  మొదట్లో కొంచెం స్లో గా నడిచినా తర్వాత ఊపు అందుకుంది సినిమా . అయితే చివరి అరగంటా ”ప్రేక్షకుల సహనానికి ”పెద్ద పరీక్షే పెట్టాడు దర్శకుడు . 
                     పూర్వం చందమామ కద కు ఆధునికత జోడించి తీసిన చిత్రం ఇది . రెండే రెండు పాటలతో సినిమా ను లాగించటం కూడా వెరైటీ గా ఉంది . సినిమా మొత్తం మీద పాత్రలు కూడా తక్కువే అవటం ఒక గొప్ప విషయం కూడా . చిన్నపిల్లలకు సర్ప్రైసింగ్ అని పించ వచ్చు . పెద్దోల్లకు బోర్ గా ఉండచ్చు .యువత కు ఇన్స్పైరింగ్ గా ఉండే సన్నీ వేశాలేవీ కనీ పించవు . కాని సినిమా అతి వేగం గా గోపీచంద్ లా పరిగెడుతూ ఉంటుంది .గోపీ విలన్ చెప్పి నట్టు అల్లా చేయటం వాడిని దాదాపు బూతుల్లాంటి వి తిట్టటం ,కొంచెం ఇబ్బందిగానే ఉంది .  బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క సీ ను గుర్తుండదు .కారణం  మనసుకు పట్టే విషయాలేవీ లేకపోవటం  .కర్రల వంతెనలు వాటి మీద నడవటా లు ,నూతిలో మెట్లు ఎక్కి దిగటా లు ,మాయా తాళం చెవులు అవి తిప్పితే ద్వారాలు  తెరుచుకోవటా లు అన్నీ కత్తి వీరుడు  కాంతా రావు సిని మా ఫక్కీ . 
                 హైదరాబాద్ లో విడుదల అయిన రెండో రోజునే అంటే నిన్ననే  నాచారం లో ఉన్న వైజయంతి సినిమా హాల్ లో మొదటి ఆటకు వెళ్లాం ఏడు శాల్తీలం . దియేటర్ ఫుల్ అయింది . ఇంటికి వచ్చిన తర్వాత ఈ సినిమా చూడ టానికి ఇంతటి ”సాహసం ”చేయాలా ?”అని పించింది అంతే.  గొపీ చంద్  సూక్తిని ”నీ డబ్బు కాక పొతే ఈ సినిమా చూడు .నీ డబ్బు అయితే  ”సాహసం  శాయ (కు ) రా డింగరీ ”అని మారిస్తే యెట్లా ఉంటుంది?  అని పించింది . 
                            మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ – 14-7-13-ఉయ్యూరు 
 
 
 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

1 Response to ” సాహసం” శాయ (కు )రా

  1. screentalent says:

    http://www.screentalent.wordpress.com

    ఏలేటి చంద్రశేఖర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగానే సినిమాలు తీస్తారు. “ఐతే” సినిమా ఆకట్టుకుంటే “అనుకోకుండా ఒక రోజు” సస్పెన్స్ ఎలిమెంట్ తో ఫరవాలేదనిపించింది. “సాహసం” గురించి నా అభిప్రాయాలు.

    1. పది మందికి మంచి జరుగుతుందంటే వందమందినైనా నరికేస్తా అనే మాస్ హీరో ఇమేజ్ లో కొట్టుకుపోయే మనకు మా తాత డబ్బు నాకు కావాల్సిందే అనే హీరో స్వార్థపరుడులా కనిపిస్తాడే తప్ప హీరోలా కనిపించడు. తెలుగు హీరో ఎప్పుడూ జనం కోసం లేదా అన్యాయానికి వ్యతిరేకంగా హీరోయిజం చేయాలి. అంత సామాన్యంగా తన డబ్బు తెచ్చుకోవడానికి తంటాలు పడే వాడు మనలాగే కనిపిస్తాడు తప్ప హీరోలా కనిపించడు. Of course మనమైతే మొత్తం తెచ్చుకుంటాం గాని, మిగతాదంతా పాకిస్థాన్ కిచ్చేసి అసలే రాం. హిందువులను, సిక్కులను తరిమేసిన పాకిస్థానీయులు కనిష్కుడి సంపదంతా తమదేశానికే చెందాలి అనడం కూడా నాకు నచ్చలేదు.

    2. కనీసం వెయ్యి మందినైనా పాకిస్థాన్ తీసుకెళ్తానన్న హీరోయిన్ హీరో ఒక్కడితోనే వెళ్ళడం కొంత అసంబద్ధంగా తోచింది. రొటీన్ కమర్షియల్ డైరెక్టర్ కి ఈ నియమం వర్తించదు. వాళ్ళు హీరో వేలి తోనే వందమందిని చంపించగలరు.

    3. నేనీ సినిమా మియాపూర్ సాయిరంగ థియేటర్ లో చూశాను. ఇళయరాజా సంగీతం కూడా అక్కడ తీన్ మార్ లాగానే వినపడుతుంది కనుక శ్రీ సంగీతం గురించి నేను కామెంట్ చేయలేను.

    4. నిధిని ఛేదించడం నాకు బాగానే నచ్చింది. బహుశా నాలో ఇంకా చిన్నపిల్లాడి మనస్తత్వం పోలేదేమో? ఆంత తీన్ మార్ మ్యూజిక్ లోనూ నాకు ఇంటరెస్టింగ్ గా అనిపించింది.

    5. కామెడీ, రొమాన్స్ గురించి అసలు ఏలేటి గారు ఆలోచించలేదనుకుంటా.

    6. మ్యాప్ ని అర్థం చేసుకోవడానికే కొన్ని నెలలు పడుతుందన్న హీరో ఆ మ్యాప్ లేకుండానే నిధిని సాధించడం కొంత గందరగోళంగా ఉంది.

    7. యాక్షన్ సినిమా అనే గోపీచంద్ ఒప్పుకొని ఉంటాడు కనక పాపం అతన్ని తప్పు పట్టలేం.

    8. మామూలు తెలుగు సినిమాతో పోలిస్తే “అతి” తక్కువగా ఉండటంతో నాకు ఈ సినిమా ఫరవాలేదనిపించింది.
    http://www.screentalent.wordpress.com

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.