అన్నే ఫ్రాంక్

 అన్నే ఫ్రాంక్

 16 సంవత్సరాల వయసున్న జర్మనీ బాలిక అన్నే ఫ్రాంక్ తన జీవిత చరిత్రనుడైరీ గా  రాసుకొని దానికి ‘’దిడైరీ ఆఫ్ ఏ యంగ్  లేడి ‘’ని పేరు పెట్టుకోంది.నాజీల దౌష్ట్యానికి గురైన తనకుటుంబ చరిత్ర అంతా రాసింది అందులో .’’I want to live on after my death   ‘’అనే స్పూర్తి తో  రాసిన డైరీ ఇది  అదె ఆమెను చిరంజీవి ని చేసింది . 

        1929 జూన్ పన్నెండు న జర్మని లో ‘’Frankfurt am main ‘’లో ఆటో ,ఎడిత్ లకు జన్మించింది అన్నే ఫ్రాంక్ .వారిది జ్యూ కుటుంబం . తండ్రి బిజినెస్ మాన్ .అప్పటికే నియంత హిట్లర్ అధికారం లోకి వచ్చాడు .యూదు లంటే అతనికి విపరీత మైన ద్వేషం . వారిని అన్ని రకాల హింసలకు గురి చేశాడు .వారి వ్యాపారాలన్నీప్రభుత్వ పరం చేశాడు .1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది . నా జీలు  హాలండ్ ను ఆక్రమించుకొన్నారు .పాపం వీళ్ళ కుటుంబానికి అక్కడా నీడ దొరక లేదు . తీవ్ర నరకం అనుభవిన్చేట్లు చేశాడు దుస్టహిట్లర్ ..యూదులంతా ఇంగ్లాండ్ కో అమెరికా కో పారి పోయారు .

                                                                                                             ఆమె నివశించిన అపార్ట్ మెంట్ 

     జ్యూలుఎక్కడున్నా వేటాడి చంపించాడు హిట్లర్ .1942 లో అన్నే కుటుంబం రహస్య స్తావరాలలో దాక్కో వాల్సిన గతి పట్టింది . తండ్రిని పట్టుకొని నాజీ సైనికులు ఎక్కడికో తీసుకొని పోయారు .తల్లి అన్నే , సోదరి లకు కొందరు ఆశ్రయం ఇచ్చి దాచారు .ఈ విషయాన్ని అన్నే ‘’secret annex ‘’అన్నది .1942 జూన్ పన్నెండు న ఆమె పుట్టిన రోజు పండుగ . ఎవరో ఒక డైరీ ని కానుక గా ఇచ్చారామెకు .దానినే తన స్నేహితుని గా భావించి ‘’కిట్టి’’అని దాన్ని ముద్దు  పేరు పెట్టుకొని దిన చర్య రాయటం ప్రారంభించింది ..25 నెలలు అంటే రెండేళ్ళు అజ్ఞాత వాస జీవితం గడిపింది .

    యుద్ధ సమయం లో ఎవరైనా డైరీలు రాసుకొని ఉంటె యుద్ధం పూర్తీ అయిన తర్వాతా వాటిని ప్రచురిస్తామని 1944లో రేడియో లో ప్రకటన వచ్చింది . అయితే ఎవరో కుట్ర చేసి వీరిని పట్టించారు . 1944 లో సెప్టెంబర్ మూడు న వీళ్ళందరినీ పోలాండ్ కు గొడ్లను తోలుకు వెళ్లి నట్లు తోలుకు వెళ్ళారు . ఆడవాళ్ళను ,పిల్లల్ని బట్టలు ఊడ దీయించి వర్షం లో నిల బెట్టారు .గాస్ చేంబర్ లలో పెట్టి లక్షలాది మందిని చంపేశారు నాజీ నియంతలు . ‘Anne  wept when most of us had not tears left ‘’అని ఒక అమ్మాయి ఈ సంఘటన గురించి రాసింది .

        బట్టలు లేకుండా నే వీళ్ళను ఫ్లాష్ లైట్ వెలుతురుఎన్నో గంటల సేపు  లో కూర్చో బెట్టేవారు .విపరీత మైన ఆకలి ఊపిరి ఆడక పోవటం తో  చాలా మంది చని పోయారు . 1945 లో బ్రిటిష్ వాళ్ళు అందర్నీ వదిలేశారు . అంతకు ముందే కాంప్ లో తల్లి చని పోయింది .వీళ్ళిద్దరూ అంటే అన్నే ఫ్రాంక్ ,సోదరి , టైఫాయిడ్ తో పోషకాహారం లేక పోవటం వల్ల చని పోయారు 16 వ ఏడు రాకుండానే అన్నే ఫ్రాంక్1945 march  లో మరణించింది .తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతఅన్నే రాసిన డైరీ దొరికింది .దానిని ఆయన 1947 లో కొద్దిగా మార్చి ప్రింట్ చేస్తే 25 మిలియన్ల  అమ్ముడయాయి ఎందరో నాజీ నిర్బంధాన్నిగురించి వారు చేసిన దారుణాలను గురించి డైరీలు రాసినా అన్నే ఫ్రాంక్ దైరీకున్న ప్రాధాన్యత దేనికీ రాలేదు . దాదాపు అరవై భాషల్లోకి అనువాదం పొందింది . బైబిల్ తర్వాతా అన్నే డైరీకి అంతగిరాకీ  వచ్చింది .దక్షిణాఫ్రికా స్వాతంత్ర ఉద్యమ నేత ,అధ్యక్షుడు నెల్సన్ మండేలాజైలు లో ఉండగా  అన్నే ఫ్రాంక్ డైరీని తానూ చదివానని ఏంతో  ప్రభావితం చేసిందని తోటి ఖైదీలకు కూడా చదివి విని పించానని రాశాడు 

        ఈ డైరీ కి ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ భార్య ముందు మాట రాసింది .ఫ్రాంక్ తండ్రి  81 వ ఏట 1980 లో చని పోయాడు .అన్నే పేరఒక ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారా ఎన్నో ప్రజోపకార మైన పనులు చేస్తున్నారు .ఆమె ఇంటిని స్మ్రుతి చిహ్నం గా మార్చారు . ప్రతి ఏటా కనీసం ఆరు లక్షల మంది దాన్ని సందర్శిస్తారు .అన్నే డైరీ ని నాటకం గా కూడా మలచి ఆడుతున్నారు దీనికి పులిట్జర్ బహుమతి వచ్చింది

      1944 ఏప్రిల్ లో చివరి ఎంట్రి గా అన్నే ‘’I want to live on after my death ‘’అని రాసుకోంది.ఈ మాటలే అందరికి మంత్రాలైనాయి గొప్ప స్పూర్తి కలిగించాయి . స్కూళ్ళల్లో పాఠంగా పెట్టిబోధిస్తున్నారు ..అందుకే అన్నే ‘’has become a martyr rather than a victim ‘’అయింది ఆమె ఇంకా యవ్వనం లోకి ప్రవేశించక ముందే జీవితం నుండి నిష్క్రమించాల్సి వచ్చింది .ఆమె డైరీని ‘’comforting document ‘’భావిస్తారు బాదోప శమన కారిణి అన్న మాట .ఆమె డైరీ చదివితే ‘’even in the midst of history’s worst depredations ,the human spirit is not quilled ,goodness and beauty endure ‘’అని నిరూపించింది పిస్తుందని విశ్లేష కాభి కాభిప్రాయం . అది ఆమె స్వంతమే అయినా దాని ప్రభావం అంతటిది .అందుకే అన్నే ఫ్రాంక్ డైరీ ని ‘’A record of triumphant defeats. Anne found her strength in her love of the very world which was denied her ‘అని పిస్తుంది మనకు

     తానూ లక్షలాది మంది చావును విన్నదీ కన్నదీ . తానూ స్వర్గానికి వెడితే ఈ క్రూరత్వం కూడా ఆగిపోతుంది అన్నది ఇంతకస్టం లో ను ప్రజలు నిజం గా మంచి మనసున్నా వారేనని అంటుంది .చివర గా ‘’ I can not build up my hopes on a foundation of confusion misery and death ‘’అని ఏంటో ధైర్యం గా నవ్వ్వుతూ నాజీలకు బలి అయి పోయిందా అమాయకపు పిల్ల అన్నే ఒక తేజో రూపం ఒక ఆరాధ్య దేవత అయింది

26-9-2002 గురువారం నాటి నా అమెరికా డైరీ నుండి

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-13- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to అన్నే ఫ్రాంక్

  1. సంతోష్'s avatar సంతోష్ says:

    తెలుగు అనువాదం ఉందా అండి ?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.