మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29
బరూక్ స్పినోజా
1632 వంబర్ 24 న బరూక్ స్పినోజా హాలండ్ లో ఆమ్స్టర్ డాం లో జన్మించాడు .ఇరవై ఏళ్ళకే సాహిత్యం లోను దర్శన శాస్త్రం లోను పండితు డైపోయాడు .వయస్సు పరిణత చెందిన తర్వాత తన శక్తి యుక్తులన్నీ దర్శన శాస్త్రానికే అంకితం చేశాడు .చాలా ప్రాశాంతం గా ఆలోచనల తో మునిగి ఉండే వాడు .బతక టానికి సరి పడ మాత్రమె సంపాదించు కోవాలని సిద్ధాంతం ఉన్న వాడు కళ్ళ జోళ్ళ షాపు నడిపే వాడు .చివరి దశలో వేలాది మంది శిష్యులు స్నేహితులు ఏర్పడ్డారు దేశ విదేశాల నుండి యాత్రికులు ఆయన్ను సందర్శించే వారు .1677 లో ఫిబ్రవరి ఇరవై ఒకటి న నలభై అయిదవ ఏట క్షయ వ్యాధి తో స్పినోజా మరణించాడు .పది హేడవ శతాబ్దపు గొప్ప రేషనలిస్ట్ ఫిలాసఫర్ అని పించుకొన్నాడు
స్పినోజా దర్శనం లో సమాలోచన రీతి భారతీయ దార్శన పద్ధతిలో ఉంటుంది .ఆయన ఆసక్తి కి నైతికత ,ఆధ్యాత్మికత పునాదులు .దేనిని పొందితే శాశ్వత ఆనందం లభిస్తుందో అలాంటి నిజమైన శ్రేయస్సు ను పొందాలి అని ధర్మ శాస్త్రాన్ని సహాయం చేసుకొన్నాడు .
స్పినోజా రాసిన ముఖ్య గ్రంధం ‘’నీతి శాస్త్రం ‘’తన ఆలోచనా విధానాన్ని ఇందులో పొందు పరాచాడు .ఇది కాక ‘’దేకార్ట్ దర్శన తత్త్వం ,సూక్ష్మ గ్రంధం మన రాజకీయం అనే గ్రంధాలు రాశాడు .నీతి శాస్త్రాన్ని జీవితమంతా ధార పోసి రాశాడు .దీనిని సమీక్షించి సరి చేసుకోవటానికి బతికినా నలభై అయిదేళ్ళలో పది హీను ఏళ్ళు శ్రమించాడు .ఇందులో అయిదు భాగాలున్నాయి .ఈశ్వరుని గురించి, ,మనస్సు స్వభావం పుట్టుక గురించి ,మానసిక ఉద్వేగాల ప్రాదుర్భావం గురించి, బంధాన్ని గురించి, బుద్ధి శక్తి లేక మానవ స్వేచ్చ గురించి, అయిదు భాగాలలో చర్చించాడు స్పినోజా ను యూదు సమాజంబహిష్కరించింది స్పినోజా భావనలో ఒకదాని ఆధారం గా సోమర్సెట్ మాం ”ఆఫ్ హ్యూమన్ బాన్దేజ్ ”నవల రాశాడు ఽయిన్స్తీన్ స్పినోజా ను గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అన్నాడు
![]()
![]()
స్పినోజా ప్రతి పాదించిన నీతి శాస్త్రం రేఖా గణిత పద్ధతిలో నడిచింది .ప్రతి భాగం లో ఉపోద్ఘాతం నిర్వచనం స్వంత ప్రమాణాలైన వాక్యాలు ప్రమేయాలు ఉంటాయి .వాక్య పరంపర లో యుక్తి ని గూర్చి చెప్పాడు ప్రతి యుక్తి నిరూపణ సాధ్యమై నదే .పరంపరగా వచ్చిన సెమెటిక్దృక్పధాన్నివ్యతిరేకించాడు .సేమిటి క్ పద్ధతిలో దేవుని విశ్వాతీత స్వభావాన్ని ,విశ్వ ప్రయోజనాన్ని ,ప్రయోజాత్మక లక్షణాలను చెబుతారు దేవుడు విశ్వానికి బయట ఉన్నాడని విశ్వ సృస్తి కర్త అని ,ఒక ప్రయోజనం కోసమే సృష్టి చేశారాని సెమెటిక్ లభావన
![]()
స్పి నోజా దృష్టిలో దేవుడు అంటే వస్తువుల్లోకి ప్రవేశించి వాటి పై బయటి నుంచి ప్రభావం కలిగించే వాడు కాదు .ఆయన అంతర్యామి .అంతరంగం లో ఉండే ,పని చేస్తాడు .అన్ని వస్తువులలో ప్రవేశించి ,వాటికి సార్ధకత కల్గిస్తాడు .వస్తు సత్యం దైవ సత్యానికి అధీనం లో ఉంటుంది .దేవుని సత్యాన్ని మించిన సత్యము లేదు స్పినోజా భావం లో దేవుడు విశ్వానికి వెలుపల ఉన్నదన్న భావానికి ,సర్వాంతర్యామి అన్న భావానికి వ్యతి రేకం గా కనీ పిస్తుంది మానవ భావారోపణను-ఖండించాడు .అరిస్టాటిల్ చెప్పిన అంతిమ కారణాల సిద్ధాంతం లో ఇది కనీ పిస్తుంది .విశ్వానికి ఒక ప్రయోజనం ఉంది అన్న దాన్ని స్పినోజా ఖండించాడు .
అంత మాత్రం చేత స్పినోజా విశ్వం ఒక యాదృచ్చిక సంఘటన అని కూడా చెప్ప లేదు .ఒక రకమైన నియతి వా(ది దడిటెర్మినిస్ట్ )స్పినోజా.ఆవశ్యకతా నియమం పై నమ్మకం ఉన్న వాడు .ప్రతి వస్తువు ఉనికి అవసరమే అని భావించాడు .ఏది జరిగినా అవసరాన్ని బట్టే జరుగుతున్దంటాడు .చివరి కారణాలని చెప్పే వన్నీ మానవ బుద్ధి లోంచి వచ్చినవే .అన్ని వస్తువులు ,ప్రక్రుతి ఒక నిత్య ఆవశ్యకతా నియమాన్ని అనుసరించే పరి పూర్ణం గా ఉద్భవించాయని చెప్పాడు .
స్పినోజా చెప్పిన అతి భౌతిక ఏక సత్తా వాదం ను ‘’మూల సిద్ధాంత వాదం ‘’అంటారు .అతని దృష్టిలో మూల ద్రవ్యం ఒక్కటే .ఆయనే ఈశ్వరుడు .మనసు ,భౌతిక ధర్మాలు ఆ మూల ద్రవ్యం యొక్క విశేషణాలు .వీటినే ఆలోచనా ,విస్తృతి అన్నాడు .ఈ రెండిటి వల్లనే ప్రాపంచం లో వివిధ మనస్సులు భౌతిక వస్తువులు ఏర్పడ్డాయి .ఈ రెండు లక్షణాలు అఖండ మూల ద్రవ్య స్వరూపాలు .
ద్రవ్యం స్వతంత్ర ఉనికి గలదిగా ,స్వయం బోధక మైనదిగా ఉంటుంది .మూల ద్రవ్యం తనకు తానే కారణం. అన్నిటిని తనలో ఇముడ్చు కొంటుంది అందువల్ల మూల ద్రవ్యం నిరవధికం, అనంతం ,ఏకం అన్నాడు స్పినోజా .దేవుడికి ప్రక్రుతి తో తాదాత్మ్యం ఉంది ప్రకృతికి దేవుడికి వ్యత్యాసం కల్పించటం అర్ధ రహితం .దివ్య శక్తి ,ప్రక్రుతి శక్తి ఒక్కటే .ప్రక్రుతి నియమాలన్నీ దైవ నియమాలే .ప్రకృతికి వ్యతి రేకం గా దైవ ప్రార్ధన చేయటం తప్పు .
ప్రక్రుతి భావం అంటే ప్రక్రుతి సత్తా సర్వస్వం .ప్రతి విశేషం లో ఏది అసమగ్రం గా ఉందొ ప్రతి పరిమిత విశేషం దేని అసమగ్ర నియత ప్రకారమో అలాంటి సత్తా సర్వస్వమే ..స్పినోజా నైతిక నియతి లో మానవ బంధ భావం స్వేచ్చా భావం అని ఉన్నాయి స్వేచ్చ అంటే అర్ధం లేనిది అన్నాడు .మనం చేసే పనులన్నిటిని మన మనస్సు ప్రేరేపిస్తుంది వాటిని నియంత్రిన్చేదే మనస్సు .స్వతంత్ర కార్యానికి ,ప్రేరేపిత కార్యా నికి ఉన్న భేదం ఏమిటి అని ప్రశ్నించి సమాధానం చెప్పాడు .సంకల్ప కార్యాలలలో మన ప్రేరణ మనకు తెలుస్తుంది .ప్రేరిత కార్యాలలలో ప్రేరణ ఉనికి కాని, వ్యవహారం కాని మనకు తెలియదు అన్నాడు
బాహ్య ప్రేరణల ప్రాబల్యాన్నే స్పినోజా బంధం అన్నాడు .అంతః ప్రేరణ ప్రాబల్యమే స్వతంత్రత .వీటీ నే అయన బౌద్ధిక ప్రేరణలన్నాడు .దేవుని పై బౌద్ధిక ప్రేమ అత్యంత ఉన్నత మైంది అని స్పినోజా అభిప్రాయం .విశ్వం యొక్క ఐక్యత ను స్పష్టం గా గ్రహించటం వల్ల జరిగినప్పుడు పుట్టిన దైవ భావనే బౌద్ధిక ప్రేమ అన్నాడు .ఇదే ఆనందం అంటాడు .. విశ్వ ఐక్య భా వన ,సంపూర్ణత కలిస్తే ఒక అంతరానుభవం అవిచ్చిన్నం గా ఏర్పడుతుంది .ఈ అనుభవాన్ని గ్రహించిన వాడు సత్యాన్ని అనుభవిస్తాడు .ఈశ్వర భావం బాహ్య హేతు వల్ల తెలుసుకొన్నా అనుభవానికి అందదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -. 1-10-13- ఉయ్యూరు ..

